గతంలో మంచి వైద్య నిపుణుల సేవలు ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే లభిస్తూ ఉండెడివి. కానీ ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో అవి పడక వేస్తుండగా, కార్పొరేట్ ఆసుపత్రులు విజృంభించి, ప్రజలను రోగాల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నాయి.
అయితే కరోనా మహమ్మారి కట్టడిలో కేవలం ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే ఉపయోగించుకోవడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చందద్రశేఖరరావు వాటికి మహర్దశ కలిగిస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులు ఇంతటి ఉత్తమ వైద్య సేవలు అందించగలవా అంటూ ప్రజలు అచ్చెరువు పోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న పరీక్షలు, చికిత్సలు ప్రజల్లో వాటి పట్ల విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి.
కరోనా నుండి బైట పడినవారు ప్రభుత్వ ఆసుపత్రుల గురించి చెబుతున్న అనుభవాలు ప్రజలకు విస్మయం కలిగిస్తున్నాయి.
గతంలో సాధారణ ప్రజలు సహితం ప్రభుత్వ ఆసుపత్రులు అంటే భయపడేవారు. భారమైనా, అప్పు చేసైనా ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యానికి సిద్ధమయ్యేవారు.
కరోనా టెస్ట్ ల నుండి వైద్యం దాకా ఇప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులతోనే కరోనాను ఎదుర్కొనే విధంగా ధృడ సంకల్పం చూపుతున్నది. అందుకు అవసరమైన సదుపాయాలు, మందుల సరఫరా చేస్తున్నది.
ఎంత మందికి కరోనా పాజిటివ్ వచ్చినా చికిత్స సంపూర్ణంగా అందించడానికి వైద్య ఆరోగ్య యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్లు కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. అత్యవసరం ఎదురైతే సేవలు అందించే విధంగా 25,000 మంది వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశంలోనే ప్రసిద్ధి చెందిన ప్రైవేట్/కార్పొరేట్ ఆసుపత్రులు హైదరాబాద్ లో ఉన్నాయి. వారెంత ఒత్తిడి తెచ్చినా, కరోనా టెస్ట్ లు జరిపేందుకు ఐసిఎంఆర్ నుండి అనుమతులు తెచ్చుకున్నా కేసీఆర్ అనుమతించడం లేదు. దానితో కార్పొరేట్ ఆసుపత్రులు అన్ని రోగులు లేక ఈగలు తోలుకొని పరిస్థితుల్లో ఉన్నాయి.
ప్రభుత్వాసుపత్రులు కరోనాను ఎదుర్కోవడంలో చతికిలపడితే తప్ప తాను ప్రైవేటు ఆసుపత్రుల సేవలకు అంగీకరించే ప్రసక్తి లేడనై కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. పైగా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని ప్రోత్సహించడం కోసం వారికి ఈ నెల వారి మూలా వేతనంలో 15 శాతం అదనంగా చెల్లిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
రూ. 12 కోట్లతో కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులకు, సిబ్బందికి ఇవ్వడానికి లక్ష పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్‌ను, చికిత్సలో కీలకమైన 2200 వెంటిలేటర్లను కూడా సిద్ధం చేశారు. కరోనాలో ప్రధాన సమస్యగా మారిన వ్యాధిని నిర్ధారించే 500 టెస్టు కిట్లను తీసుకు రాబోతున్నారు. వీటితో 50,000 మందికిపైగా కొన్ని గంటల్లో చికిత్స ఉందా లేదా అని నిర్ధారించవచ్చు.
అలాగే ఈ వ్యాధి నిర్ధారణ అయిన వారికి కాస్తో కూస్తో ఉపశమనం కలిగిస్తుందని చెపుతున్న హైడ్రాక్సి క్లోరో క్వీన్ మాత్రలను 50 లక్షల దాకా అప్పుడే సమకూర్చుకున్నారు. ఇంకా 20 లక్షల ఐవి ఫ్లూయిడ్స్, 50 లక్షల శానిటైజర్లు, మాస్కు లు, శ్వాస సంబంధ పరికరాలను అందుబాటులో పెట్టారు. ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా తట్టుకోడానికి 8 దాకా ప్రభుత్వాసుపత్రులను నోటిఫై చేశారు.
గతంలో అంతగా సౌకర్యాలు లేని కింగ్ కోఠి ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన కరోనాకు అనుగుణంగా సదుపాయాలు సమకూర్చారు. గచ్చిబౌలి లాంటి ప్రాంతాల ప్రభుత్వ ప్రాంగణాలను సకల సౌకర్యాల కరోనా ఆసుపత్రులుగా మార్చారు. ముందే ఉపద్రవా న్ని దృష్టిలో పెట్టుకొని, కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని అభ్యర్ధించి, దేశీయంగా పేరు ప్రతిష్ఠలున్న సిసిఎంబిని తగిన సౌకర్యాలతో త్వరితగతిన కరోనా పరీక్షలకు సిద్ధం చేసింది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Kcr takes government hospitals to new heights
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com