Home Blog Page 8542

ప్రముఖ సీరియల్ నటి అనుమానాస్పద మృతి


ప్రముఖ టీవీ యాంకర్‌, సీరియల్‌ నటి శాంతి(విశ్వశాంతి) అనుమానాస్పదంగా మృతిచెందడం చిత్రసీమలో కలకలం రేపుతోంది. స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎల్లారెడ్డిగూడెం ఇంజనీర్స్‌ కాలనీలోని శాంతి మూడేళ్లుగా నివాసం ఉంటుంది. గడిచిన నాలుగు రోజుల నుంచి శాంతి తన గదిలోంచి బయటికి రాకపోవడం లేదు. అనుమానం వచ్చిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శాంతి ఇంట్లోకి వెళ్లిచూడక ఆమె శవమై కన్పించింది. దీంతో పోలీసులు ఆమె మృతిపై కేసు నమోదు చేశారు.

శాంతి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోవడానికి ముందు ఆమె చివరగా ఎవరితోనైనా మాట్లాడారా? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీలు చేసి ఆమె సెల్ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇంటి పరిసరాల్లోని సీసీ పుటేజీలను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక, సెల్ ఫోన్ కాల్ రికార్డింగ్స్, సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. త్వరలో యాంకర్ శాంతి మృతి మిస్టరీని చేధిస్తామని పోలీసులు చెబుతున్నారు.

ఆ సిబ్బందికి కేటీఆర్ వార్నింగ్!


నిత్యావసర వస్తువులు కొనుగోలు నిమిత్తం ఇద్దరు వ్యక్తులు మార్కెట్ కి వెళ్లారు. వారు విదేశీయులవలె వలే ఉన్నారంటూ.. అక్కడ సిబ్బంది వారిని లోపలి అనుమతించలేదు. ఈ ఘటన పై తెలంగాణ మంత్రి సీరియస్ అయ్యారు. ఆ సిబ్బందికి గట్టి వార్నింగ్ ఇచ్చారు.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని స్టార్ మార్కెట్ లో నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తన స్నేహితులు ఇద్దరిని లోపలికి రానీయకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్నారంటూ ఓ నెటిజన్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ చేసిన ట్వీట్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని, జాత్యహంకారాన్ని ఏ రూపంలో ప్రదర్శించినా సరే కఠినంగా వ్యవహరించాలని కేటీఆర్ అన్నారు. ఇలాంటి ఘటనలను తీవ్రంగా భావించాలని, ఈ మేరకు రిటైల్ అసోసియేషన్ కు ఆదేశాలు పంపేలా పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలను ఆదేశించాలని తెలంగాణ డీజీపీకి సూచించారు.

ఆ నెటిజన్ చేసిన వరుస ట్వీట్లలో ఉన్న విషయం.. వనస్థలిపురంలోని స్టార్ మార్కెట్ కు వెళ్లిన తన మిత్రులిద్దరూ విదేశీయులను తలపించేలా ఉంటారని, ఆ కారణంతో వారిని లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తన మిత్రులిద్దరు తమకు సంబంధించిన ఆధార్ కార్డులను చూపించినప్పటికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదని, ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వచ్చారని తెలిపారు.

కొడుకు విషయంలో పవన్ ఇలా చేసాడేంటి?


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా ప్రముఖలంతా విషెస్ తెలియజేశారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా కనీసం విష్ చేస్తూ ట్వీట్ కూడా చేయపోవడం హాట్ టాపిక్ గా మారింది. అకీరా బర్త్ డేను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో అకీరాకు బర్త్ డే విషెస్ చెప్పారు. మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, వరుణ్ తేజ్ బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ మాత్రం కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ యాక్టివ్ గానే ఉంటారు. ప్రజలపై ట్వీటర్లో స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాడు. అలాగే పలువురికి ట్వీటర్లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటవలే జనసేన నేత నాదెండ్ల మనోహర్ బర్తేడే సందర్భంగా ట్వీటర్లో విషెస్ చెప్పారు. బీజేపీ ఆవిర్భావం ఏప్రిల్ 6న బీజేపీ పెద్దలకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. మార్చి 27న రాంచరణ్ బర్త్ డేకు పవన్ ట్వీట్ చేశాడు. కానీ కన్నకొడుకు అకిరా బర్త్ డేకు విషెస్ చెప్పలేదు. ఇది కావాలని జరిగిందో లేక కాకతాళీయంగా జరిగిందో తెలియదుగానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ చేసిన పనికి నొచ్చకుంటున్నారు.

ఇదిలా పవన్ ఫ్యాన్స్‌కు చిరంజీవి ట్వీట్ మాత్రం కాస్త ఉత్సాహాన్నిచ్చింది. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం.. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ.. ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6’4). అన్ని విషయాల్లోనూ అందరిని ఇలానే మించిపోవాలి.. విష్ యూ ఏ `పవర్`ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్‌డే అకీరా’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ట్వీట్లో అభిమానుల్లో జోష్ నింపింది. చిరుతోపాటు రాంచరణ్, వరుణ్ తేజ్ పలువురు ప్రముఖులు అకీరాకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. అకీరాకు బన్నీ విషెస్ చెప్పలేదని సాకుతో పవన్ కల్యాణ్ ను ఏమనలేక అల్లు అర్జున్ పై తమ కొపాన్ని చూపిస్తు్న్నారు పవన్ ఫ్యాన్స్..

విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు


అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. ఎన్ 95 మాస్కులు, పి.పి.ఇ కిట్స్ ఇవ్వకుంటే వైద్యం చేయలేమని జూనియర్ స్పష్టం చేశారు.

ఈ సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు జూనియర్ డాక్టర్లతో చర్చలు జరిపారు. ఐసోలేషన్ వార్డు సిబ్బందికి మాత్రమే పీపీఈ కిట్స్ ఇస్తామంటున్న జిల్లా అధికారులు తెలిపారు. అధికారుల చర్చలు కొనసాగుతున్నాయి. ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో విధులకు హాజరయ్యేందుకు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో ప్రభుత్వ డాక్టర్లు విధులకు దూరంగా ఉంటున్న సంఘటన చోటు చేసుకుంది. డాక్టర్ల ఆందోళనకు ప్రతిపక్ష పార్టీ టీడీపీ, బీజేపీ, జనసేన తదితర పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. వైద్యులకు అవసరమైన రక్షణ పరికరాలు, మాస్క్ లు అందజేయాలని కోరుతున్నాయి.

ఆచార్య చిత్రంలో మరో అతిధి


రోజు రోజుకి ఆచార్య చిత్రం ఫై అంచనాలు పెరిగి పోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న`ఆచార్య` సినిమాలో పలు అంశాలు హైలెట్ కానున్నాయి. రామ్ చరణ్ ఓ ప్రత్యేక పాత్రలో నటించడం ఒక ఎత్తైతే ఇపుడు మరో వార్త వినవస్తోంది అదేమిటంటే మెగా ఫ్యామిలీ నుండి మరొకరు కూడా ఆచార్య సినిమా లో నటించబోతున్నారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం మెగా డాటర్ నీహారిక కొణిదెల కూడా ఓ ప్రత్యేక అతిధి పాత్రలో ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతుంది. తదుపరి జరగబోయే షెడ్యూల్ లో అంటే లాక్ డౌన్ ముగిసిన తరువాత మొదలయ్యే షూటింగ్ లో నీహారిక నటిస్తుందట …

కాగా మెగాస్టార్ ఈ ఆచార్య చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా స్లిమ్ గా తయారవ్వడం జరిగింది. . ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు రామ్ చరణ్ హీరోయిజమ్ కూడా ఒక హైలెట్ కానుంది అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తాడట …కాగా రామ్ చరణ్ పాత్ర సాక్రిఫైస్ తో ఎండ్ అవుతుందని ఆ పాత్రే చిరంజీవి పాత్రకు ప్రేరణగా నిలుస్తుందని కూడా తెలుస్తోంది. కాగా రామ్ చరణ్ రోల్ సినిమాలో దాదాపు ముప్పై నిముషాలు ఉంటుందని , అందులో పదిహేను నిముషాల పాటు మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. కాగా చెర్రీ పక్కన జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.

గ్రామ వాలంటీర్ల సేవలో నిజమెంత?

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ కార్యదర్శుల వ్యవస్థ దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ కల్పనగా పేరుగడించింది. అధికారంలోకి రాగానే సుమారు 4 లక్షల మంది గ్రామ కార్యదర్శులను సీఎం జగన్ నియమించారు. వారి నియామకం, పనితీరు పట్ల మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థే లోపభూయిష్టమని, వారికి సరైన శిక్షణ, వివిధ అంశాలపై సరైన అవగాహన లేదని, వారు సేకరించి పంపే సమాచారం విశ్వసనీయత లేదనే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు.అయితే కాల క్రమేణా ఆ వ్యవస్థ పని తీరు పై సానుకూల పవానాలు వీచాయి. రేషన్ పంపిణి, పెన్షన్ లు ఇవ్వడం, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు విషయాలలో సమస్యల పరిస్కారం ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో గ్రామ వాలంటీర్ల సేవలు అమోఘం.

ప్రస్తుతం యావత్ భారతావని కరోనా భయంతో అల్లాడిపోతుంది. దింతో ఈ కాలాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించారు. అంతేకాకుండా 21రోజుల సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. ప్రజలు ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కఠిన చర్యలు అమలుపరుస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుంది.

ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్, ప్రతి కుటుంబానికి రూ.1000 ల పంపిణి, మరియు పెన్షన్ వంటివి ప్రజలకు అందజేయడంలో గ్రామ వాలంటీర్లు చురుకుగా పనిచేస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్ళి గ్రామ వాలంటీరే తన వేలి ముద్ర వేసి వారికి రావాల్సిన రూ.1000 గ్రాంట్ లేదా పెన్షన్ ఇవ్వడం గమనార్హం మరి ముఖ్యంగా కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతర జిల్లాలు, రాష్టాలు లేదా దేశాల నుండి గ్రామానికి ఎవరైనా వచ్చినట్లైంతే.. వారిని గుర్తించి, వెంటనే “గ్రామ వాలంటీర్ యాప్” ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం మరియు ఆ గ్రామంలో ఉన్న ఏఎన్ఎం, ఆశా వర్కర్ల ద్వారా టెస్టులు చేయించడం, కరోనా లక్షణాలు ఏమైనా ఉంటె వెంటనే జిల్లా ఆసుపత్రులకు తరలించడం వంటి ముఖ్యమైన పనులు చక చక జరుగుతున్నాయి. చెక్ పోస్టు ఉన్న సరిహద్దు గ్రామాలలో గ్రామ వాలంటీర్లు సెక్యూరిటీ గార్డ్ ల వలే డ్యూటీలు చేయడం అమోఘం. ఈ విధంగా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో గ్రామ వాలంటీర్ల పని తీరు ప్రశంసనీయం. దీంతో ఆంధ్రప్రదేశ్ లో గ్రామ వాలంటీర్ల పనితీరును మెచ్చుకుంటూ.. జాతీయ మీడియా, జగన్ సర్కార్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించడం ఆంధ్రాకి మరింత గర్వకారణం.

ఒక్క రోగానికి మందేస్తే ఉన్న రోగాలన్నీ పోయాయి


కరోనా వచ్చాక ఆసుపత్రికి వెళ్లే రోగుల్లో మార్పు వచ్చింది. మొన్నటి వరకు ఇసుకేస్తేరాలని ఆసుపత్రులు కరోనా దెబ్బకు వెలవెల పోతున్నయి..ఇంతకు ముందు ఆసుపత్రులు ,రక్త పరిక్ష కేంద్రాలకు ప్రజలు అనవసరంగా , అనుమానంతో డబ్బులు ఖర్చు చేసారా..అన్న అనుమానం ఎవరికైనా రాక మానదు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ..

షుగర్ , బిపి ,కంటి జబ్బులు , కీళ్ల నొప్పులు , గుండె జబ్బులు , నరాల వ్యాధులు ఇలా రకరకాల జబ్బులకు చీటికీ మాటికీ చికిత్స చేసే ప్రత్యేక ఆసుపత్రులు ఇప్పుడు ఎందుకు నిర్మానుష్యంగా మారాయి ఆసుపత్రులలో OP మూసి వేసినప్పటికీ ప్రజలు ఏమీ ఇబ్బంది పడటం లేదు. వ్యాధులు అంతగా ఎలా తగ్గాయి? వీధుల్లో వాహనాలు లేవు కాబట్టి రోడ్డు ప్రమాదం అన్న ఊసే లేదు. కానీ గుండెపోటు, మెదడు రక్తస్రావం లేదా రక్తపోటు వంటి సమస్యలు ఏమయ్యాయి ?.

దేశం మొత్తం మీద స్మశాన ఘాట్ కు రోజూ వచ్చే మృతదేహాల సంఖ్య 25-30 శాతం తగ్గిందట. ఢిల్లీ లోని హరిశ్చంద్ర ఘాట్ కి సగటున 80 నుండి 100 మృతదేహాలు వచ్చేవట కానీ కరోనా వాతావరణంలో 20 లేదా 25 మృతదేహాలు వస్తున్నాయి..అంటున్నారు .అంతెందుకు ఇది వేసవి కాలం. ఈ సమయంలో ప్రతి సంవత్సరం మృతుల సంఖ్య బాగా ఉండేదట. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితి లో మృతుల సంఖ్య బాగా తగ్గిందంటున్నారు .కొత్త రోగుల సంఖ్య పెరగలేదు, కొత్తగా ఎవరికీ రోగాలు రావట్లేదు.

ఇప్పుడు మనకు అర్థం కాని విషయం ఏమిటంటే నిజంగానే కరోనా వైరస్ మిగతా అన్ని వ్యాధులను ప్రభావితం చేసిందా..? లేదా ఆ వ్యాధులన్నీ కరోనా వైరస్ ముందు చిన్నవిగా కనిపిస్తునాయా? ఇది వైద్య వృత్తి యొక్క ఉనికికే పెద్ద సవాలుగా మారింది. కార్పొరేట్ ఆసుపత్రుల ఆవిర్భావం తరువాత, స్వల్పంగా జలుబు చేసినా, మరియు దగ్గు వచ్చినా బిల్లులు తడిసి మోపెడయ్యేవి. ఇప్పుడు చాలా ప్రైవేట్ ఆసుపత్రులలో పడకలు ఖాళీగా ఉంటున్నాయట … అంటే ఇక్కడ వైద్యుల యొక్క ప్రాముఖ్యతను తగ్గించడానికి మనం ప్రయత్నించడం లేదు. కోవిడ్19 వచ్చిన రోగులకు వారు చేస్తున్న సేవలకు శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం.

ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే మనలోని భయమే మనకున్న చాలా పెద్దరోగం. దాని వల్లె ఇన్ని సమస్యలు వస్తున్నాయి అనుకోవాలి. అవన్నీ ఒకెత్తు అయితే గత కొన్ని రోజులుగా ప్రజలు ఇంటి పట్టునే ఉండి మంచి ఆహారం తింటున్నారు. రెస్టారెంట్లు లేకపోవడం కూడా ఒకందుకు మంచిదే ..అయింది. ఇంతకి తేలేదేమంటే ప్రజలకు స్వచ్ఛమైన నీరు మరియు స్వచ్ఛమైన ఆహారం లభిస్తే, సగం వ్యాధులు అలా వచ్చి ,ఇలా తొలగిపోతాయి.

చాలాకాలం క్రిందట ఒక దేశంలో వైద్యుల సమ్మె జరిగిందట, సరిగ్గా ఆ కాలంలో మరణాల సంఖ్య బాగా తగ్గినట్లు సర్వేలో తేలింది. ఆరోగ్యం మన జీవనశైలిలో ఒక భాగం, ఇది వైద్యులపై మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వైద్యులు ఎప్పటికీ కోరుకోరని మహాత్మా గాంధీ హింద్ స్వరాజ్ లో రాసింది నూటికి నూరు పాళ్ళు నిజమని తేలుతోంది .

అప్పులతోనే జగన్ ప్రభుత్వం మనుగడ


అప్పు లేనిదే కాలు కదపలేని దుస్థితిలో ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చిక్కుకొంది. ఆర్ధికంగా దారుణమైన పరిస్థితులు నెలకొనడంతో అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకు పోతున్నది. ఆదాయ వనరులు మెరుగు పడక పోవడం, వృద్ధి అంశాలు పడక వేయడం, ఆర్ధిక కార్యకలాపాలు పూనుకొనక పోవడంతో అప్పులు చేస్తే గానే జీత, భత్యాలు కూడా చెల్లించలేని పరిష్టితులు ఏర్పడుతున్నది.

ఈ దుస్థితికి కరోనా జత కావడంతో ప్రభుత్వానికి దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి. అందుకనే లాక్ డౌన్ ను తొలగించాలని దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నా జగన్ మాత్రం నోరు విప్పడం లేదు. అదే జరిగితే ఆర్ధికంగా మరింతగా దుర్భర పరిస్థితులు ఎదురు కాగలవని ఆందోళన చెందుతున్నారు.

గత ఆర్థిక సంవత్సరం చివరి మూడ నెలల్లో (జనవరి, ఫిబ్రవరి, మార్చి-2020) రూ 23 వేల కోట్ల వరకు లోటు నెలకొంది. ప్రస్తుత నెలలో కూడా ఈ పరిస్థితి మరింత తీవ్రం కొనసాగవచ్చని ఆర్థికశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ శాఖ రూపొందించిన తాజా నివేదిక ప్రకారం జనవరి నుండి మార్చి వరకు రూ 27,641 కోట్ల ఆదాయం రాగా, రూ 50,515 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది.

ఇది సాధారణ లోటు కాదని, ఆర్ధిక వ్యవస్థను పూర్తిగా దిగజారుతోందనడానికి సంకేతమని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనవరి వరకు రూ 34,600 కోట్ల ఆదాయ లోటు ఉండగా, మార్చి 31 నాటికి రూ 48 వేల కోట్లు దాటిపోయింది. దీని ప్రభావం నూతనంగా ప్రారంభమైన 2020-21 ఆర్ధిక సంవత్సరంపై పడుతుందని అంటున్నారు.

ప్రధానంగా కరోనా కారణంగా ఏప్రిల్‌, మే, జూన్‌, జూలై నెలల్లో ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉంది. అయితే ఖర్చులు మాత్రం గత నెల కన్నా ఎక్కువగా ఉంటాయని అంచనా. ఖజానా తీవ్ర సంక్షోభంలో పడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే రకమైన పరిస్థితులు నెలకొనడంతో కేంద్రం నుండి విడుదలయ్యే నిధులు కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

గత మూడు నెలల్లో వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే కేంద్రం నుంచి వచ్చిన పన్నుల్లో వాటా, స్థానిక సంస్థల నిధుల వల్ల రూ 13,500 కోట్ల వరకు ఆదాయం ఒక్క మార్చి నెల్లోనే కనిపించింది.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన ఆదాయం కన్నా ఇది దాదాపుగా రెట్టింపు. ఖర్చుల విషయానికి వస్తే జనవరిలో చేసిన రూ 16,597 కోట్ల కన్నా ఫిబ్రవరిలో దాదాపు మూడు వేల కోట్లు తక్కువగా ఖర్చు చేసినప్పటికీ, మార్చిలో రూ 20,641 కోట్లు ఖర్చు పెట్టారు.

24 గంటల్లో 540 మందికి కరోనా…!

Corona death


దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 540 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5,734కి చేరిందని ఈ రోజు ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 166 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 5,095 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 473 మంది కోలుకున్నారు.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,135 మందికి కరోనా సోకింది. తమిళనాడులో 738, ఢిల్లీలో 669, తెలంగాణలో453, రాజస్థాన్‌లో 381, ఉత్తర్‌ప్రదేశ్‌లో 361 మందికి కరోనా సోకింది. 24 గంటల్లో దేశంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్‌లో కరోనాతో ఈ రోజు మొదటి మరణం సంభవించింది.

గత 12 గంటల్లో ఒక్క కరోనా కేసు లేదన్న ఏపీ ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్ లో బుధవారం రాత్రి 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకూ జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎందుకు సంబంధించిన బులిటెన్ విడుదల చేసింది.

రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 217 సాంపిల్స్ ను పరీక్షించగా, అన్ని కేసులు నెగటివ్ గా నిర్దారించబడ్డాయని బులిటెన్ వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో 348 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 9 మంది చికిత్స అనంతరం కరోనా నెగటివ్ నిర్దారణ అయి, డిశ్చార్జ్ అయ్యారు.

నెటిజన్లపై ఫైరవుతున్న తమన్నా


మిల్కీ బ్యూటీ తమన్నాపై ఖాళీగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్న వారిపై ఫైరవుతోంది. వరుస సినిమాలతోనే తాను బీజీగా ఉంటే కొందరు ఇష్టమొచ్చినట్లు ఎందుకు కామెంట్లు పెడుతారని తమన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు పనిగట్టుకొని ఇలాంటి కామెంట్లు పెడుతున్నారని.. ఇలాంటివారే నిజంగా ఖాళీగా ఉన్నారనే విషయం తెలుసుకోవాలని హితవు పలికింది. తనపై ఇలాంటి కామెంట్లు పెడితే సహించేది లేదని ఈ బ్యూటీ హెచ్చరిస్తుంది..

ప్రస్తుతం తాను సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ మూవీలో నటిస్తున్నట్లు తెలిపింది. హీరో గోపిచంద్ పాత్రకు ధీటైన పాత్రలో ఈ అమ్మడు నటిస్తుంది. గోపిచంద్ ఏపీ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తుండగా తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నువ్వా.. నేనా అన్న రీతిలో దర్శకుడు తీర్చిదిద్దనట్లు సమాచారం. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా తమన్నా కబడ్డీ నేర్చుకుంటుంది. ఈ మూవీలో తమన్నా తెలంగాణ యాసలో రఫ్పాడించనున్నట్లు తెలుస్తోంది.

కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. వంటింట్లో వాళ్లకు సాయం చేస్తుంది. ఇలాంటి టైంలో కొందరు తమన్నా పని అయిపోయింది?. దర్శక, నిర్మాతలు తమన్నాను పక్కకు పెట్టారు? తమన్నా పని అయిపోయింది? అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఎలాంటి పనిపాటలేని వాళ్లే ఇలాంటి వదంతులకు పాల్పతుంటారని ఇలాంటి వాటిని అభిమానులు నమ్మవద్దని కోరింది. ‘సైరా’ మూవీలో తమన్నా చేసిన ‘లక్ష్మీ’ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ అమ్మడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకే మొగ్గుచూపుతోంది. మిల్కీ బ్యూటీ ఇటీవల సినిమాల్లో తన 15ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం విశేషం.

లాక్ డౌన్ ని పొడిగించిన ఒడిశా సీఎం!


దేశ వ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ ఈ నెల 14వరకు ముగియనుంది. కానీ దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న సమయంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పీఎం మోడీకి లాక్ డౌన్ పొందించాలని విజ్ఞప్తి చేశారు. దింతో ఈ నెల 11న అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాక లాక్‌ డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయాలని ప్రధాని మోడీ నిర్ణయించగా అంతకంటే ముందే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఏప్రిల్ 30వరకూ లాక్‌ డౌన్ పొడిగించారు.

రాష్ట్రంలో ఇప్పటికే మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒడిశాలో ఇప్పటివరకూ 42 మందికి కరోనా సోకింది. ఒకరు చనిపోయారు. వాస్తవానికి ఈ నెల 14వరకూ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా నవీన్ పట్నాయక్ బాటలో పయనించే అవకాశాలు కనపడుతున్నాయి

మలేరియా మందుతో కరోనాకి కళ్ళెం!

“ఏ చెట్టు లేకపోతే..ఆముదం చెట్టు కూడా మహా వృక్షమే” అని ఒక సామెత ఉండేది. కరోనా భయంతో ప్రస్తుతం ప్రపంచ దేశాల పరిస్థితి ఇలానే ఉంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్ కోసం ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. నిజానికి ఇది మలేరియా నివారణకు వాడే ఒక మందు. కరోనాని నియంత్రిస్తుందని చెప్పడానికి ఎక్కడా స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఈ మందును వాడటం వల్లే చైనా కరోనా కేసులను నిలువరించిందనే టాక్ వచ్చింది. దానికి తోడు ఈ మందు వల్లే భారత్ లో కరోనా అంతగా వ్యాప్తి కాలేదు అని మరియు అక్కడక్కడ కొంతవరకు కరోనా వ్యాధిగ్రస్తులకు వాడి సత్ఫలితాలు రావడంతో ఈ మందు కోసం అమెరికా అర్థించింది.. బ్రెజిల్ బతిమాలింది.. ఇటలీ యాచించింది.. స్పెయిన్‌ వేడుకున్నది.. ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలు అడుగుతున్నాయి.. అన్ని దేశాల చూపు భారత్ వైపే ఉంది. మలేరియా నివారణకు వాడే ఈ మందును ప్రపంచంలోనే ఎక్కువ ఉత్పత్తి చేస్తోంది ఇండియా.

మలేరియా జ్వరానికి విరుగుడుగా దక్షిణ అమెరికాలో సిన్‌ చోనా అనే చెట్టు బెరడును వాడేవారు. ఈ బెరడు నుంచే క్వినైన్ మందును తయారు చేశారు. అయితే.. మలేరియా వ్యాధి తీవ్రం కావడంతో ఈ మందును కృత్రిమంగా తయారు చేయడం ప్రారంభించారు. అదే క్లోరోక్విన్. దాన్ని శుద్ధి చేసి, తయారీ విధానంలో మార్పులు చేసి.. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌‌ను రెడీ చేశారు. ఇది మలేరియా పరాన్న జీవి వల్ల కలిగే వాపును నివారించి, ఇతర కణాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది.

చాలా చవకగా దొరికే ఈ మందును భారత్, చైనాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. మన దేశంలో ఇప్కా లేబొరేటరీస్‌, జైడస్‌ కేడిలా కంపెనీలతో పాటు పలు స్థానిక కంపెనీలు తయారు చేస్తున్నాయి. దీన్ని ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది భారతే. కరోనా వ్యాధిని తగ్గించడానికి ఈ మందు ఉపయోగపడుతుందని తెలీగానే.. ప్రపంచవ్యాప్తంగా భారీ గిరాకీ ఏర్పడింది. దాంతో భారత ఫార్మా కంపెనీలు ఉత్పత్తిని మూడు రెట్లు పెంచేశాయి. అయితే.. అమెరికా వద్ద సరైన నిల్వలు లేకపోవడంతో భారత్‌ ను అభ్యర్థించింది. అంతేకాదు.. క్లోరోక్విన్ మిరాకిల్ డ్రగ్ అని ట్రంప్ వ్యాఖ్యానించడంతో ఈ మందుకు మంచి గిరాకీ ఏర్పడింది.

ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్లో 85 శాతం మన దేశంలోనే తయారవుతాయి. ఇప్పుడు ఉత్పత్తిని మరింత పెంచడంతో కావల్సినన్ని నిల్వలు మన వద్ద ఉన్నాయని కేంద్రం ప్రకటించింది కూడా. మన అవస

‘కరోనా’ నుంచి వైద్యులకు రక్షణేది…!


మాస్కులు, రక్షణ కిట్లు (పి.పి.ఇ) అందించక పోవడంతో రాష్ట్రంలో వైద్యులు కోవిడ్ -19 వ్యాధి గ్రస్తులకు చికిత్స చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. వైద్యులకు సరైన రక్షణ కిట్లు అందుబాటులో లేకపోవడంతో వైరస్ భారిన పడుతున్న సంఘటనలు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాయి. అనంతపురం జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న ఇద్దవు వైద్యులు, మరో ఇద్దరు పారమెడికల్ సిబ్బంది వైరస్ భారిన పడిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు సుధాకరరావు ఒక మాస్క్ 15 రోజులు వాడుకోవాల్సి వస్తుందని, వ్యాధులంటే ఎంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశించిన మరుసటిరోజే అనంతపురం సంఘటన వెలుగు చూసింది.

మరోవైపు ప్రవేట్ ఆసుపత్రులను తమ అధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం వీటిలో కొన్నింటిని క్వారెంటైన్ సెంటర్లుగా మార్చింది. కర్నూలు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అనంతపురంలో నలుగురు వైద్య సిబ్బంది కరోనా భారిన పడటంతో కర్నూలులో ఈ చికిత్సలకు ప్రభుత్వ వైద్యులు దూరమయ్యారు. దీంతో ప్రభుత్వం ఎస్మా చట్టం కింద అనేకమంది డాక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటన ఎలా ఉండగా ప్రభుత్వ వైద్యులు దూరమవడంతో ప్రస్తుతం మొత్తం భారం ప్రైవేటు వైద్యులపైనే పడింది. పీపీఈ, మాస్క్‌లు లేకుండా వైద్యము చేయలేమని ప్రైవేటు వైద్యులు స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యం జీజీహెచ్‌కే ఇచ్చి ప్రభుత్వ సిబ్బందికీ విధులు అప్పగించాలని వారు పట్టుబడుతున్నారు. అప్పుడే తాము సేవలు అందిస్తాం కాదంటే అరెస్టులకూ సిద్ధమేనని అంటున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టే విధంగా ఉంది.

మరోవైపు వైద్యులకు మాస్క్ లు, పి.పి.ఇ కిట్లు ఇవ్వలేని ప్రభుత్వం తమ తప్పిదాలు కప్పిపుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఆర్ధికమంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ అమెరికాలోని వైద్యులకు పి.పి.ఇ కిట్లు ఇవ్వడం లేదని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మాస్క్ లు, పి.పి.ఇ కిట్ ల గురించి బయటకు చెప్పిన వైద్యుడు సుధాకరరావును సస్పెండ్ చేశారు. ఇతను ఆసుపత్రికి వచ్చేటప్పుడు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లాడని స్థానిక ఎమ్మెల్యే ఆరోపించి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ విషయంపై స్పందించింది. సుధాకరరావు పై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని, వైద్యులందరికీ మాస్క్ లు, పి.పి.ఇ కిట్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఎప్పటికయినా తప్పును సరిచేసుకోకుంటే ప్రభుత్వంతో పాటు వైరస్ భారిన పడిన వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వాసుయింది.

తెలంగాణలో 90 శాతం అదుపులో కరోనా!

TRS


తెలంగాణలో కరోనా వైరస్ ఆందోళనకర రీతిలోకి మారినప్పటికీ, క్రమంగా అదుపులోకి వస్తున్నది. 90 శాతం అదుపు చేయగలిగామని ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ భరోసా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో వైరస్ ఉనికి ఉండబోదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖ్రరావు ప్రకటించిన మరుసటి రోజునుండి ఉపద్రవం వలే డిల్లీ మర్కజ్‌ నుంచి పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా ఎదురు కావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఒకింత తీవ్రమైన వత్తిడికి గురయింది.

మొదట్లో ఢిల్లీ నుండి వచ్చిన వారు సహకరింపక పోవడం, వైద్య సిబ్బందిపై దాడులకు కూడా దిగడంతో ఒక విధంగా గందరగోళానికి గురయ్యారు. అయితే క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తూ ఉండడంతో అధికారులు ఇప్పుడు ఊపిరి పీల్చుకొంటున్నారు.

డిల్లీ మర్కజ్‌ నుంచి రాష్ర్టానికి 1,100 మందికి పైగా రాగా, వారితో కాంటాక్ట్‌ అయిన 3,158 మందిని క్వారంటైన్‌ సెంటర్లలో ఉంచామని, వారిని పరీక్షించి నెగెటివ్‌ వచ్చినవారిని 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచుతామని రాజేందర్ తెలిపారు. వాళ్లంతా ఏప్రిల్‌ 21 వరకు ఇండ్లలోనే ఉండాలని స్పష్టంచేశారు.

వారిపై వైద్య, పోలీసు సిబ్బంది పర్యవేక్షణ ఉంటుందని, రోజుకు రెండుసార్లు వైద్యసిబ్బంది వెళ్లి పరీక్షిస్తారని మంత్రి చెప్పారు. మర్కజ్‌ కేసులు తగ్గినప్పటికీ పరిస్థితిని తేలిగ్గా తీసుకోవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు వెల్లడించారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరి పరిస్థితీ విషమంగా లేదని తెలిపారు. వారిలో కొందరికి పరీక్షలు నిర్వహించి నెగెటివ్‌ వచ్చినవారిని డిశ్చార్జ్‌ చేస్తామని మంత్రి ఈటల పేర్కొన్నారు.

మరోవంక, పీపీఈలు, ఎన్‌-96 మాస్క్‌లు, గ్లౌజ్‌లు, మందులు.. టెస్టింగ్‌ కిట్లు అధికసంఖ్యలో అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం కేసీఆర్‌ స్వయంగా ఆయా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడుతున్నారు. 5 లక్షల పీపీఈ కిట్లు, 5 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు, 2 కోట్ల డాక్టర్‌ మాస్క్‌లు, కోటి గ్లౌజ్‌లు, 5 లక్షల గాగుల్స్‌, 3.5 లక్షల టెస్టింగ్‌ కిట్లు త్వరలో రానున్నట్లు మంత్రి వెల్లడించారు.రూ.400 కోట్ల వ్యయంతో మందులు కొంటున్నామని చెప్పారు.

ఇక, తెలంగాణలో ఐదారు పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తిస్తూ, ప్రత్యేక పర్యవేక్షణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు ఆ విధంగా 125 ప్రదేశాలను గుర్తించగా, వాటిల్లో 60 హైదరాబాద్ నగరంలోనే ఉండడం గమనార్హం.

ప్రమాదంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మనుగడ!


కరోనా వైరస్ సందర్భంగా చైనాకు వంత పాట పాడుతూ, ఒక విధంగా ముందే హెచ్చరికలు చేసిన తైవాన్ వంటి దేశాలను ఎగతాళి చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ మనుగడ ఇప్పుడు ప్రమాదంలో పడినట్లు అనిపిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ఈ సంస్థపై కొద్దీ వారాలుగా మండిపడుతున్నారు. ప్రపంచాన్ని తప్పుదారి పట్టించినట్లు ధ్వజమెత్తుతున్నారు.

తాజాగా ఈ సంస్థకు తమ దేశం నుంచి అందాల్సిన నిధుల్లో కోత విధించనున్నట్టు ప్రకటించారు. ఐక్యరాజ్య సమితితో సహా పలు బహుళ దేశాల సంస్థల నిర్వహణ వ్యయంలో అమెరికా అతి పెద్ద భాగస్వామిగా ఉంటూ వస్తున్నది. ఇప్పుడు అమెరికా నిధులలో కొత్త విధిస్తే మిగిలిన సంపన్న దేశాలు సహితం అనుసరించే అవకాశం ఉంది. అప్పుడు వాటి మనుగడ ప్రశ్నార్ధకరంగా మారే అవకాశం లేకపోలేదు.

కరోనా మహమ్మారి చైనాలో మొదట తీవ్రంగా వ్యాపించినప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అనుకూల వైఖరి అవలంబించిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వైరస్ వెలుగు లోకి వచ్చిన తొలినాళ్లలో ఆ ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ వద్ద సమాచారం ఉన్నప్పటికీ చైనా అనుకూల వైఖరితో పంచుకోడానికి ఇష్టపడలేదని ట్రంప్ మండిపడుతున్నారు.

చైనాలో కరోనా తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో అమెరికా ఆ దేశ ప్రయాణాలపై నిషేధం విధిస్తే ప్రపంచ ఆరోగ్యసంస్థ వ్యతిరేకించిందని ట్రంప్ గుర్తు చేశారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అతిపెద్ద తప్పుడు నిర్ణయంగా ఆయన స్పష్టం చేశారు. తమ దేశ సరిహద్దులు చైనా వైపు తెరిచి ఉంచాలన్న ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సును అదృష్టవశాత్తు తాను వ్యతిరేకించానని ఆయన పేర్కొన్నారు.

కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సెనేట్ విదేశాంగ సంబంధాల కమిటీ ఛైర్మన్ జిమ్‌రిష్ స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. అంతకు ముందు టెడ్రోస్ అధనోమ్ ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ పదవికి రాజీనామా చేసే వరకు నిధుల్ని నిలిపి వేయాలని కోరుతూ అమెరికాలో ఉభయ పక్షాలకు చెందిన 24 మంది సభ్యులతో కూడిన చట్టసభల ప్రతినిధుల బృందం తీర్మానించింది.

మరోవైపు కరోనా ను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేసిన 2.2 ట్రిలియన్ డాలర్ల నిధిని పర్యవేక్షిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ను ట్రంప్ నిధుల నుంచి తప్పించారు. వాస్తవానికి గత డిసెంబర్ లోని చైనాలో జరుగుతున్న దానిని తైవాన్ బైట పెడితే ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఖండించింది.

ఇలా ఉండగా, ట్రంప్ చేసిన ఆరోపణలు నిజం కాదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. కరోనా కల్లోలం ఇంకా ప్రారంభదశలోనే ఉన్న కారణంగా డబ్ల్యూహెచ్ఓకు అందే నిధులకు కత్తెరేయ్యాలనే ఆలోచన కూడా సరికాదని అభ్రిప్రాయపడింది.

2019లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా 400 మిలియన్ డాలర్లకు పైగా నిధులు సమకూర్చింది. చైనా సమకూర్చిన మొత్తం కంటే ఇది రెండు రెట్లకుపైగానే కావడం గమనార్హం. మరోవైపు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాతో కలిసి పనిచేయడమనేది కరోనా వైరస్‌పై అవగాహన పెంచేందుకు ఎంతో అవసరమని సంస్థ డైరెక్టర్ జనరల్ బ్రూస్ ఎలివార్డ్ స్పష్టం చేశారు.

అమరావతి రీజియన్ లో లాక్‌డౌన్‌ లేదా!


కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం దేశం అంతటా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్ని స్తంభింప చేసి, కేవలం అత్యవసర సేవలపైననే కేంద్రీకరిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయాన్ని ఇంకా కొనసాగించాలని దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.

అయితే రాజధాని అమరావతి రీజియన్ లో మాత్రం లాక్‌డౌన్‌ అమలులో లేదా అన్న సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. వంద రోజులకు పైగా మూడు రాజధానుల ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళలు, కరోనా కారణంగా  ఇళ్లలోనే దీక్షలు జరుపుతున్నారు.

అయితే వారిని వేధించి, అమరావతి ఉనికినే లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కూడా అక్కడి ప్రజలను వేధించడం మానకపోవడం విస్మయం కలిగిస్తుంది. లాక్‌డౌన్‌ అమలులో ఉన్న అధికారులే పట్టించుకొనక పోవడం గమనార్హం.

మంగళవారం నీరుకొండ, ఐనవోలులో…, బుధవారం మందడంలో సీఆర్డీఏ అధికారులు పర్యటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్‌లోని ఆర్‌5 రెసిడెన్షియల్‌ జోన్‌పై ప్రజాభిప్రాయసేకరణకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని అధికారులు చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందుకు ఇదా సమయం అని నిలదీశారు. కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయాలను స్కైప్‌ ద్వారా తెలియజేయాలని చెబుతున్నారు. ఈ సమయంలో వారి రాక అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. ఈ సందర్భంగా రెండు గంటల పాటు వాగ్వివాదం జరిగిన తర్వాత అధికారులు వెనుతిరిగారు.

లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో సీఆర్‌డీఏ అధికారులు అభిప్రాయ సేకరణకు రావడం చట్టరీత్యా నేరమని రైతులు స్పష్టం చేస్తున్నారు. సీఆర్‌డీఏ అధికారుల తీరును, వారి పేరు, ఐడీ తదితర వివరాలను వీడియో రికార్డు చేశారు. కేంద్ర హోం శాఖ సెక్రటరీకి వీడియోలను పంపాలని రైతులు, జేఏసీ నేతలు తీర్మానించారు. అలాగే సీఆర్‌డీఏ కమిషనర్‌కు పరిస్థితిపై సమాచారం అందించాలని నిర్ణయించారు.

అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న మహిళలపై ఫేస్‌బుక్‌ వేదికగా అసభ్యపదజాలంతో పోస్టులు సృష్టించి వేధించడం మరోవంక జరుగుతున్నది. ఆ విధంగా మహిళలను తీవ్రంగా అవమానించిన ఘటనలో వర్రా రవీందర్‌ రెడ్డిపై కేసు నమోదు చేశామని సైబర్‌ క్రైమ్‌ ఎస్పీ రాధిక తెలిపారు.

మహిళలను అసభ్యపదజాలంతో అవమానించిన వారు జైలుకు వెళ్లకతప్పదని స్పష్టం చేస్తూ సోషల్‌ మీడియాలోగానీ, ప్రత్యక్షంగా గానీ మహిళల విషయంలో ఎవరైనా పరిధులు దా టి వ్యవహరిస్తే వారికి జైలు శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు.