
కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జాక్ డోర్సే ఒక బిలియన్ డాలర్ల భారీ విరాళం ప్రకటించారు. డిజిటల్ పేమెంట్ గ్రూప్ నకు సంబంధించిన తన వాటా నుంచి ఈ మొత్తాన్ని బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం జాక్ డోర్సీ ఆదాయం 3.3 బిలియన్ డాలర్లు. తన సంపదలో నాలుగింట ఒక వంతు మొత్తాన్ని అతని ఛారిటీ ఫండ్ కు విరాళంగా ఇస్తానని, అన్ని విరాళాల వివరాలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో వుంటాంటూ దీనికి సంబంధించిన లింక్ ను కూడా షేర్ చేశారు జాక్ డేర్సే. కరోనా కట్టడి, ఇతర సహాయక చర్యల కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్టు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. తన ఆధ్వర్యంలోని స్వచ్ఛంధ సంస్థ స్టార్ట్ స్మాల్ ఎల్ ఎల్ సీ ద్వారా ఈ నిధులను కొవిడ్-19 కట్టడికి వినియోగాస్తానని తెలిపారు. భూమ్మిద నుంచి కరోనా పారిపోయాకు..తాను బాలిక విద్య, ఆరోగ్యం, కనీస ఆదాయం వంటి సంక్షేమ కార్యక్రమాలవైపు దృష్టిపెడతానన్నారు.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జాక్ డోర్సీ.. తన దాతృత్వానికి సంబంధించిన వివరాలను ఇంతకాలం గోప్యంగా ఉంచారు. కానీ ఇకపై స్వచ్చంధ సంస్థ ద్వారా చేయబోయే వ్యయాలన్ని ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా.. ఈ నిధులను సమకూర్చేందుకు జాక్ డార్సీ ట్విటర్‌లో తనకున్న వాటాలపై ఆధారపడలేదు. అందుకు బదులుగా.. స్కేర్ ఐఎన్‌సీలో అనే పేమెంట్ ప్రోసెసింగ్ సంస్థలో తనపేర ఉన్న షేర్లు విక్రయించడం ద్వారా ఆయన నిధులను సేకరించనున్నారు. స్కేర్ ఐఎన్‌సీలో ఎక్కువ వాటా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని జాక్ డోర్సీ వెల్లడించారు.