
పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయేలా విషెస్ చెప్పారు. అకీరా చిన్నతనంలో మెగాస్టార్ ఎత్తుకొని దిగిన ఫొటోను అభిమానులకు షేర్ చేస్తూ విషెస్ చెప్పడం ఆకట్టుకుంది. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం.. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6’4). అన్ని విషయాల్లోనూ అందరిని ఇలానే మించిపోవాలని కోరుకుంటున్నా.. విష్ యూ ఏ ‘పవర్`ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్‌డే అకీరా’ అంటూ మెగాస్టార్ తన ట్వీటర్లో ట్వీట్ చేశాడు.
అదేవిధంగా నేడు మెగా ఫ్యామిలీ చెందిన మరో హీరో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. ‘బన్నీ.. నీవు బాగుండలబ్బా’ అంటూ మెగాస్టార్ అల్లు అర్జున్ కు విషెస్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. అల్లు అర్జున్ తో తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నతనం నుంచి డాన్స్ లో అల్లు అర్జున్ లో కసి, కృషి అంటే తనకిష్టమని ట్వీటర్లో ట్వీట్ చేసి విషెస్ చెప్పారు. అల్లు అర్జున్, అకీరాతోపాటు మరో హీరో అఖిల్ పుట్టిన రోజు ఈరోజే కావడం విశేషం.
మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ, ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు.(6'4") అన్ని విషయాల్లో కూడా అందరిని ఇలానే మించిపోవాలి.Wish you a "Power"ful future. Happy Birthday Akira! #8thApril pic.twitter.com/wDO7qSwxHx
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2020
మెగాస్టార్ ఆరాధ్య దైవమైన ఆంజనేయ స్వామి బర్త్ డే కూడా ఈ రోజే. హనుమంతుడికి తనకుగల అనుబంధాన్ని చిరంజీవి ఓ మధురానుభూతి ద్వారా అభిమానులను వివరించారు. చిరంజీవికి చిన్నతనంలో లాటరీలో హనుమంతుడి బొమ్మ వచ్చింది. అది ఇప్పటికీ తానే దగ్గరే ఉందని చెప్పుకొచ్చారు. తన చేతిలో ఉన్న హనుమంతుడి బొమ్మను చూసి తన తండ్రి అచ్చు తనలాగే ఉందని చెప్పాడని అప్పటి నుంచి ఆ బొమ్మను భద్రంగా దాచుకున్నట్లు ట్వీటర్లో తెలిపారు.