
మాస్కులు, రక్షణ కిట్లు (పి.పి.ఇ) అందించక పోవడంతో రాష్ట్రంలో వైద్యులు కోవిడ్ -19 వ్యాధి గ్రస్తులకు చికిత్స చేసేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. వైద్యులకు సరైన రక్షణ కిట్లు అందుబాటులో లేకపోవడంతో వైరస్ భారిన పడుతున్న సంఘటనలు రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాయి. అనంతపురం జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న ఇద్దవు వైద్యులు, మరో ఇద్దరు పారమెడికల్ సిబ్బంది వైరస్ భారిన పడిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యుడు సుధాకరరావు ఒక మాస్క్ 15 రోజులు వాడుకోవాల్సి వస్తుందని, వ్యాధులంటే ఎంత నిర్లక్ష్యం ఎందుకని ప్రశించిన మరుసటిరోజే అనంతపురం సంఘటన వెలుగు చూసింది.
మరోవైపు ప్రవేట్ ఆసుపత్రులను తమ అధీనంలోకి తీసుకున్న ప్రభుత్వం వీటిలో కొన్నింటిని క్వారెంటైన్ సెంటర్లుగా మార్చింది. కర్నూలు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అనంతపురంలో నలుగురు వైద్య సిబ్బంది కరోనా భారిన పడటంతో కర్నూలులో ఈ చికిత్సలకు ప్రభుత్వ వైద్యులు దూరమయ్యారు. దీంతో ప్రభుత్వం ఎస్మా చట్టం కింద అనేకమంది డాక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటన ఎలా ఉండగా ప్రభుత్వ వైద్యులు దూరమవడంతో ప్రస్తుతం మొత్తం భారం ప్రైవేటు వైద్యులపైనే పడింది. పీపీఈ, మాస్క్‌లు లేకుండా వైద్యము చేయలేమని ప్రైవేటు వైద్యులు స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యం జీజీహెచ్‌కే ఇచ్చి ప్రభుత్వ సిబ్బందికీ విధులు అప్పగించాలని వారు పట్టుబడుతున్నారు. అప్పుడే తాము సేవలు అందిస్తాం కాదంటే అరెస్టులకూ సిద్ధమేనని అంటున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టే విధంగా ఉంది.
మరోవైపు వైద్యులకు మాస్క్ లు, పి.పి.ఇ కిట్లు ఇవ్వలేని ప్రభుత్వం తమ తప్పిదాలు కప్పిపుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఆర్ధికమంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ అమెరికాలోని వైద్యులకు పి.పి.ఇ కిట్లు ఇవ్వడం లేదని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మాస్క్ లు, పి.పి.ఇ కిట్ ల గురించి బయటకు చెప్పిన వైద్యుడు సుధాకరరావును సస్పెండ్ చేశారు. ఇతను ఆసుపత్రికి వచ్చేటప్పుడు అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లాడని స్థానిక ఎమ్మెల్యే ఆరోపించి రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఈ విషయంపై స్పందించింది. సుధాకరరావు పై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని, వైద్యులందరికీ మాస్క్ లు, పి.పి.ఇ కిట్లను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఎప్పటికయినా తప్పును సరిచేసుకోకుంటే ప్రభుత్వంతో పాటు వైరస్ భారిన పడిన వారు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వాసుయింది.