
మిల్కీ బ్యూటీ తమన్నాపై ఖాళీగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్న వారిపై ఫైరవుతోంది. వరుస సినిమాలతోనే తాను బీజీగా ఉంటే కొందరు ఇష్టమొచ్చినట్లు ఎందుకు కామెంట్లు పెడుతారని తమన్నా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొందరు పనిగట్టుకొని ఇలాంటి కామెంట్లు పెడుతున్నారని.. ఇలాంటివారే నిజంగా ఖాళీగా ఉన్నారనే విషయం తెలుసుకోవాలని హితవు పలికింది. తనపై ఇలాంటి కామెంట్లు పెడితే సహించేది లేదని ఈ బ్యూటీ హెచ్చరిస్తుంది..
ప్రస్తుతం తాను సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ మూవీలో నటిస్తున్నట్లు తెలిపింది. హీరో గోపిచంద్ పాత్రకు ధీటైన పాత్రలో ఈ అమ్మడు నటిస్తుంది. గోపిచంద్ ఏపీ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తుండగా తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు నువ్వా.. నేనా అన్న రీతిలో దర్శకుడు తీర్చిదిద్దనట్లు సమాచారం. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా తమన్నా కబడ్డీ నేర్చుకుంటుంది. ఈ మూవీలో తమన్నా తెలంగాణ యాసలో రఫ్పాడించనున్నట్లు తెలుస్తోంది.
కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమైంది. వంటింట్లో వాళ్లకు సాయం చేస్తుంది. ఇలాంటి టైంలో కొందరు తమన్నా పని అయిపోయింది?. దర్శక, నిర్మాతలు తమన్నాను పక్కకు పెట్టారు? తమన్నా పని అయిపోయింది? అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఎలాంటి పనిపాటలేని వాళ్లే ఇలాంటి వదంతులకు పాల్పతుంటారని ఇలాంటి వాటిని అభిమానులు నమ్మవద్దని కోరింది. ‘సైరా’ మూవీలో తమన్నా చేసిన ‘లక్ష్మీ’ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ అమ్మడు కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకే మొగ్గుచూపుతోంది. మిల్కీ బ్యూటీ ఇటీవల సినిమాల్లో తన 15ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకోవడం విశేషం.