
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా ప్రముఖలంతా విషెస్ తెలియజేశారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం తన కొడుకు పుట్టిన రోజు సందర్భంగా కనీసం విష్ చేస్తూ ట్వీట్ కూడా చేయపోవడం హాట్ టాపిక్ గా మారింది. అకీరా బర్త్ డేను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో అకీరాకు బర్త్ డే విషెస్ చెప్పారు. మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, వరుణ్ తేజ్ బర్త్ డే విషెస్ చెప్పారు. పవన్ మాత్రం కనీసం ఒక్క ట్వీట్ కూడా చేయపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ యాక్టివ్ గానే ఉంటారు. ప్రజలపై ట్వీటర్లో స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాడు. అలాగే పలువురికి ట్వీటర్లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటవలే జనసేన నేత నాదెండ్ల మనోహర్ బర్తేడే సందర్భంగా ట్వీటర్లో విషెస్ చెప్పారు. బీజేపీ ఆవిర్భావం ఏప్రిల్ 6న బీజేపీ పెద్దలకు పవన్ శుభాకాంక్షలు తెలిపారు. మార్చి 27న రాంచరణ్ బర్త్ డేకు పవన్ ట్వీట్ చేశాడు. కానీ కన్నకొడుకు అకిరా బర్త్ డేకు విషెస్ చెప్పలేదు. ఇది కావాలని జరిగిందో లేక కాకతాళీయంగా జరిగిందో తెలియదుగానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం పవన్ చేసిన పనికి నొచ్చకుంటున్నారు.
ఇదిలా పవన్ ఫ్యాన్స్‌కు చిరంజీవి ట్వీట్ మాత్రం కాస్త ఉత్సాహాన్నిచ్చింది. ‘మన బిడ్డ మనకంటే ఎత్తుకు ఎదగాలని కోరుకుంటాం.. నా చేతిలో ఒదిగిపోయిన ఈ బిడ్డ.. ఎత్తులో అందరికంటే ఎదిగిపోయాడు(6’4). అన్ని విషయాల్లోనూ అందరిని ఇలానే మించిపోవాలి.. విష్ యూ ఏ `పవర్`ఫుల్ ఫ్యూచర్. హ్యాపీ బర్త్‌డే అకీరా’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ట్వీట్లో అభిమానుల్లో జోష్ నింపింది. చిరుతోపాటు రాంచరణ్, వరుణ్ తేజ్ పలువురు ప్రముఖులు అకీరాకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. అకీరాకు బన్నీ విషెస్ చెప్పలేదని సాకుతో పవన్ కల్యాణ్ ను ఏమనలేక అల్లు అర్జున్ పై తమ కొపాన్ని చూపిస్తు్న్నారు పవన్ ఫ్యాన్స్..