Home Blog Page 8541

వారికి సెల్యూట్ చేసిన జగన్ !


జిల్లాల్లోని కోవిడ్‌ ఆసుపత్రిలు, అలాగే క్రిటికల్‌ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారు వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ చాలా కష్టపడి సేవలు చేస్తున్నారని, తెలియని భయం ఉన్నప్పటికీ కూడా మీరు వైద్య సేవలు అందిస్తున్నందుకు నేను సెల్యూట్‌ చేస్తున్నానని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కలెక్టర్లు, కోవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్యులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మీద యుద్ధంలో మీరు అందిస్తున్న సేవలు చాలా ప్రశంసనీయం చాలా ఎక్కువగా కష్టపడి సేవలు అందిస్తున్నారని చెప్పారు.

వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా, అంకిత భావంతో సేవలు అందిస్తున్నారన్నారు.లాక్‌డౌన్‌ కుముందు నుంచి కూడా సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి నాలుగు క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రుల్లో ఉత్తమ వైద్య సేవలను అందించడానికి గుర్తించామని, ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా కేసులు సంఖ్య పెరిగిందని, పూర్తిగా వారందర్నీ ట్రేస్‌ చేసి వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను, సెకండరీ కాంటాక్ట్స్‌ను పూర్తి క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌లో ఉంచినట్లు చెప్పారు.

మొత్తం మీద పరిస్థితి అదుపులో ఉందనే చెప్పారు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నట్లు తెలిపారు. మీరందిస్తున్న సేవలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నానాని చెప్పారు.

అల్లు వారి అబ్బాయి మల్లు వారి మనసు గెలిచాడు


కరోనా సమయంలో తెలుగు సినీ స్టార్లు స్పందిస్తున్న తీరుపై ప్రశంసలు పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఆ క్రమంలో దేవుని స్వస్థలం అయిన కేరళకు సాయం చేస్తూ బన్నీ మల్లు వుడ్ వారి మనసులు గెలుచు కొన్నాడు కేవలం తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు వారికే సాయం చేస్తే అదేమంత గొప్ప కాదు. భౌగోళికంగా ఈ మాత్రం సంబంధం లేని ప్రజల నుంచి , అదీ విద్యావంతులు అధికంగా వుండే మలబారు తీరంలో మల్లు అర్జున్ తన ఉనికి ఘనంగా చాటుకొన్నాడు.

అందరూ లాక్ డౌన్ సందర్భంగా విరాళాలు ఇస్తున్న నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ..కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా భారీగా విరాళం ఇచ్చి తన ఉదాత్త హృదయాన్ని చాటుకున్నాడు. ఆ క్రమంలో కేరళకు ఇచ్చిన 25లక్షల విరాళం పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ బన్నీకి ధన్యవాదాలు తెలిపారు.

అంతేకాదు కేరళ ప్రజలు ఎప్పటికీ మల్లు అర్జున్ కి రుణపడి ఉంటారని.చెబుతూ .. మీ సహాయన్ని మా మలబార్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.మిమ్మల్ని కలకాలం గుర్తుంచు కొంటారని తెలిపారు.నిజానికి గతంలో కూడా బన్నీ ఎన్నోసార్లు కేరళీయులకు విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ మధ్య కేరళను వరదలు ముంచెత్తినపుడు కూడా మొట్టమొదటగా స్పందించి భారీగా విరాళం అందించింది మన అల్లు అర్జునే కావడం విశేషం. అవన్నీ గమనించిన కేరళ ప్రజలు విపత్తు లపై ఏమాత్రం స్పందించని మల్లూ హీరోలకు బాగానే చురకలు అంటించారు. ఆ విషయం లో సాక్షాత్తూ కేరళ టూరిజం మంత్రి మలయాళ సూపర్ స్టార్లను బహిరంగంగా విమర్శించడం జరిగింది. కూడా .. .

గుడ్ ఫ్రైడే ఎలా జరుపుకోవాలో.. జగన్ సలహా!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి రాజ్యమేలుతుంది. కోవిద్-19 భయంతో అన్ని పండగలు జరుపుకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. ఉగాది, శ్రీరామనవమి వంటి పండగలను కూడా ప్రజలు ఇళ్లలోనే ఉంటూ జరుపుకున్నారు. ఈ రోజు గుడ్ ఫ్రైడే. యేసుక్రీస్తును శిలువ వేసిన రోజు. క్రైస్తవులకు అతి ప్రాముఖ్యమైన పండుగ. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవులకు కీలక సూచనలు చేశారు. ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని వినిపించారు. ‘మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం… ఇవీ జీసస్‌ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశాలు. గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ సండే వేడుకల్ని క్రైస్తవ సోదర సోదరీమణులంతా మీ ఇళ్ళలో, మీ కుటుంబంతో ఘనంగా జరుపుకోవాలి. కోవిడ్‌ నుంచి మానవాళిని రక్షించాలని రక్షకుడైన యేసుక్రీస్తుని మనమంతా ప్రార్థించాలి.’ అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

వారికి రూ.5000 గిఫ్ట్ ప్రకటించిన కెసిఆర్!


కరోనా వ్యాపించకుండా రోడ్లను ఊడుస్తూ, వీధులను, గల్లీలను శుభ్రం చేస్తూ.. బ్లీచింగ్ పౌడర్‌ ను చల్లుతూ జాగ్రత్త పడుతున్నవారికి సీఎం కెసిఆర్ గుడ్ న్యూస్ తెలిపారు. వారి కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి ప్రోత్సాహకం అందజేశారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌డబ్ల్యూలో పనిచేస్తున్న వారికి రూ.7500, గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న వారికి రూ.5వేలు ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే సీఎం స్పెషల్ ఇన్సెంటివ్ నిధులు విడుదలయ్యాయి. ప్రతి కార్మికుడి ఖాతాల్లోకి నేటి నుంచి రూ.5వేలు జమకానున్నాయి. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.21.84 కోట్లు విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో సఫాయి కర్మచారులు 43,661 మంది, మునిసిపాలిటీల్లో 21,531మంది, హైదరాబాద్‌ వాటర్‌వర్క్స్‌ అండ్‌ సేవరేజ్‌ బోర్డులో 2510, జీహెచ్‌ఎంసీలో 20690 మంది.. మొత్తం 95,392 మంది పనిచేస్తున్నారు. వారందరికీ సీఎం గిఫ్ట్ అందనుంది. వారి జీతాల్లోనూ కోత పెట్టకుండా చర్యలు తీసుకున్నారు సీఎం.

తెరపైకి ‘సైరా-సాహో’ కాంబినేషన్


మెగాస్టార్ చిరంజీవి తాజాగా ‘ఆచార్య’ మూవీలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ చిరంజీవి డ్యుయల్ రోల్స్ చేస్తున్నారు. డైనమిక్ ఎండోన్మెంట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై దాదాపు సగం పార్ట్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ‘ఆచార్య’ షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ మూవీ తర్వాత మెగాస్టార్ సాహో దర్శకుడితో కలిసి పని చేయనున్నట్లు తెలుస్తోంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసీఫర్’ హక్కులను సొంత చేసుకున్న తెల్సిందే. ఈ మూవీని తన తండ్రితో రీమేక్ చేయనున్నట్లు చెర్రీ గతంలోనే ప్రకటించాడు. దీంతో ఈ మూవీని రీమేక్ చేసే దర్శకుల విషయంలో పలు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘లూసీఫర్’ను రీమేక్ చేసే దర్శకుడిపై క్లారిటీ ఇచ్చారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ మూవీని తెరకెక్కించిన ‘సాహో’ దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించనున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని ఇప్పటకే దర్శకుడు సుజిత్ కు తెలిపినట్లు మెగాస్టార్ ప్రకటించారు. సుజిత్ స్ర్కీప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడని చిరంజీవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రకటించారు. తెరపైకి ‘సైరా-సాహో’ కాంబినేషన్ రావడంపై ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సైరా’ తెలుగులో భారీ హిట్టయినా మిగతా భాషల్లో అనుకున్నంత సాధించలేదు. అలాగే ‘సాహో’ మూవీతో బాలీవుడ్లో భారీ విజయం సాధించినా తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేదు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూవీ సెట్ కావడం ఆసక్తికరంగా మారింది. ‘సైరా-సాహో’ కాంబినేషన్లో రానున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో వేచి చూడాల్సిందే..

లాక్ డౌన్ ఎత్తేసినా సినిమా హాళ్లు నిండుతాయా !


కరోనా వలలో పడి చేప పిల్లలా విలవిల్లాడుతున్న తెలుగు సినిమా రంగం మ‌ళ్లీ మామూలు పరిస్థితికి ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. ఏప్రిల్ 14 వ‌ర‌కు ఉన్న లాక్ డౌన్‌ను మరికొంత కాలం కొన‌సాగించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఆ త‌ర్వాత లాక్ డౌన్ ఎత్తేసినా.. వెంట‌నే థియేట‌ర్ల‌లో సినిమాల ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తులిస్తారో లేదో తెలియ‌దు.

ఒక‌వేళ అనుమ‌తులిచ్చినా. మునుప‌టిలా సినిమాల ప్ర‌ద‌ర్శ‌న ఉండ‌ద‌న్న‌ది తేట తెల్లం అవుతోంది. థియేట‌ర్ల‌లో సీటు కి సీటు కి మధ్య ఖాళీ వ‌దల‌డం , శానిటైజేష‌న్ కోసం..థియేటర్ సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు తప్పనిసరి చేయడం తో పాటు ప్రేక్ష‌కుల‌కు జ్వరం లాంటి ప‌రీక్ష‌లు చేయ‌డానికి థ‌ర్మామీట‌ర్ల వంటి వాటి కోసం అద‌నంగా ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. థియేటర్ యాజమాన్యం ఇంత చేసినా జ‌నాలు వెంట‌నే థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్ట‌మే.

ఆ కోణం లో ఆలోచిస్తే మామూలు రోజుల్లో వ‌చ్చే కలెక్షన్ లో స‌గం అయినా వస్తుందా అన్నది సందేహమే. అలాంటి స్థితిలో సినిమా థియేట‌ర్లు తెరుచుకున్నాక తొలి రెండు నెల‌ల్లో సినిమాల‌కు క‌ష్ట కాలం దాపరించి నట్లే .. ఇలాంటి సంక్లిష్ట స‌మ‌యంలో త‌మ సినిమాలు రిలీజ్ చేసుకోవ‌డానికి ఏ నిర్మాత ముందుకొస్తారో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఏప్రిల్ 15 న లాక్ డౌన్ పూర్తయే స‌మ‌యానికి నాని నటించిన `వి ‘ సినిమా తో పాటు , మెగా మేనల్లుడి `ఉప్పెన‌’ , రానా నటించిన `అర‌ణ్య‌’ , రామ్ నటించిన ` రెడ్ ‘, రాజ్ తరుణ్ నటించిన `ఒరేయ్ బుజ్జిగా’ లాంటి సినిమాలు రెడీ ఫ‌ర్ రిలీజ్ పొజిషన్ లో ఉన్నాయి. రాబోయే కాలంలో లాక్ డౌన్ ఎత్తేసి సినిమా థియేట‌ర్లు తెరుచుకున్నా రెవెన్యూ బాగా త‌క్కువ వ‌చ్చే అవ‌కాశ‌ ముంది అలాంటి నేప‌థ్యంలో ఈ చిన్న సినిమాల్ని థియేటర్ లలో రిలీజ్ చేయ‌డానికి నిర్మాతలు మొగ్గు చూపుతారా లేదా ఆన్ లైన్ స్ట్రీమింగ్ కి మొగ్గు చూపుతారా అన్నది వేచి చూడాలి.

బిలియ‌నీర్ల కోసం రూల్స్ బ్రేక్ చేసిన ఐపీఎస్ పై చర్యలు!

లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి బిలియ‌నీర్లు క‌పిల్ వాద్వానా, దీర‌జ్ వాద్వానాల‌ను ముంబై నుంచి మ‌హాబ‌లిపురంలోహౌజ్‌ కు త‌ర‌లించేందుకు స‌హాయ‌ప‌డ్డ ఐపీఎస్ ఆఫీస‌ర్‌ పై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకున్న‌ది.  ఈ కేసులో ఐపీఎస్ ఆఫీస‌ర్ అమితాబ్ గుప్తాను లీవ్‌ పై పంపించారు.

లాక్‌ డౌన్ నియ‌మాల‌ను ఉల్లంఘించి సుమారు 20 మంది స‌భ్యులు ఫార్మ్‌హౌజ్‌ కు వెళ్లారు. బుధ‌వారం రాత్రి అయిదు కార్ల‌లో వెళ్లిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారెంటైన్ చేశారు.  మ‌హారాష్ట్ర హోంశాఖ‌లో ప‌నిచేస్తున్న ఆఫీస‌ర్‌ అమితాబ్ గుప్తా.. వాద్వాన్ కుటుంబానికి పాస్‌ లు ఇప్పించిన‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి వాద్వాన్ సోద‌రులు కొన్ని ఫ్రాడ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.

ఫ్యామిలీ ఎమ‌ర్జెన్సీ కోసం మ‌హాబ‌లిపురం వెళ్తున్నార‌ని, వారికి అనుమ‌తి ఇవ్వాలంటూ ఆయ‌న ఆ లేఖ‌లో రాశారు. అయితే వాద్వాన్ స‌భ్యులు త‌మ వంట సిబ్బందిని కూడా వారితో తీసుకువెళ్లారు.  స్థానికుల స‌మాచారం మేర‌కు ఆ కుటుంబంపై పోలీసులు కేసు బుక్ చేశారు.  ఇప్ప‌టికే యెస్ బ్యాంక్‌, డీహెచ్ఎఫ్ఎల్ అవినీతి కేసులో వాద్వానా సోద‌రుల‌కు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసింది.  అయితే క్వారెంటైన్ ముగిసిన వెంట‌నే వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ద‌మ‌య్యారు.  ఈ ఘ‌ట‌న‌లో హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేయాలంటూ ప్ర‌తిప‌క్ష బీజేపీ డిమాండ్ చేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

ఇంకా పొడిగించాలి అనుకోవడం బద్దకస్తుల పని: JP


కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం మూడు వరాల పాటు లాక్‌డౌన్ ప్రకటించడం ద్వారా వైరస్ విస్తరించకుండా చేసేందుకు ఉపయోగ పడినా ఇంకా పొడిగించాలి అనుకోవడం ఏమీ చేయకుండా అంతా ఏదో చేస్తున్నామని ప్రచారం చేసుకొనే బద్దకస్తుల పని కాగలదని లోక్ సత్తా అధినేత డా. ఎన్ జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు.

అయితే క్రమంగా సడలిస్తూ, వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొంటూ, ఉత్పత్తి కార్యక్రమాలను వీలైనంత వరకు ప్రారంభించాలని ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూచించారు. ఈ లోగా పెద్ద ఎత్తున వైరస్ టెస్ట్ లు జరిపి, వైరస్ సోకినా వారందరిని గుర్తించి, వేరు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద 1.20 లక్షల మందికి మించి టెస్ట్ లు జరగలేదని చెబుతూ, వచ్చే ఒకటి, రెండు నెలల్లో కనీసం కోటి మందికి టెస్ట్ లు జరపాలని కోరారు.

10 లక్షల మందికి 80 టెస్టులు మాత్రమే జరిపామని, కొన్ని దేశాలలో 15,000 వరకు టెస్ట్ లు జరిపారని చెప్పుకొచ్చారు. అందుకనే టెస్ట్ ల సంఖ్య వంద రేట్లు పెరగవలసి ఉన్నాడని తెలిపారు. అందుకోసం ర్యాపిడ్ టెస్ట్, వైరస్ ఎదుర్కొనే సామర్ధ్యపు టెస్ట్ లను విస్తృతంగా జరపాలని, అందుకోసం కేంద్రం కనీసం రూ 2,000 కోట్లతో పరికరాలు సేకరించాలని సూచించారు.

లాక్ డౌన్ ఉన్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతున్నదని, అయితే వ్యాధిగా మారి, మరణాలు జరగడం మాత్రం ఎక్కువగా లేదని చెబుతూ ప్రాధమిక వైద్య సదుపాయాల పట్ల ప్రభుత్వం దృష్టి సారించడానికి ఇదొక్క మంచి అవకాశమని చెప్పారు. కొన్ని ప్రభుత్వాలు జీడీపీలో 10 శాతం వరకు వైద్యం కోసం ఖర్చు చేసుంటే మనం 1 శాతం కూడా చేయడం లేదని గుర్తు చేశారు. కనీసం 2 శాతం ఖర్చు చేసిన అద్భుతంగా ప్రస్తుతం గల సదుపాయాలను పెంపొందింపవచ్చని పేర్కొన్నారు.

ప్రజలకు తాయిలాలు అందించే పధకాల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందే ధోరణులకు ఇప్పటికైనా రాజకీయ పార్టీలు స్వస్తి పొందాలని జయప్రకాశ్ హితవు చెప్పారు. స్వతంత్రం తర్వాత భారత్ ఎదుర్కొంటున్న అతి పెద్ద ఉపద్రవం ఇదే అని చెబుతూ ఇటువంటి సమయంలో తీవ్రమైన ఆర్ధిక సమస్యలు ఎదురు కావడానికి తాయిలాలకు నిధులు వృద్ధ చేయడం వల్లననే అని స్పష్టం చేశారు. ఆ విధంగా చేయక పోవడంతో అమెరికా వంటి దేశాలు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టగలుగుతున్నాయని తెలిపారు.

లాక్‌డౌన్ దారుణంగా పేదల జీవితాలు దారుణంగా మారాయని, వారిని ఆదుకొనే శక్తీ మన ప్రభుత్వాలకు లేదని చెబుతూ కేవలం కోమాలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను వీలయినంత మేరకు క్రియాశీలం చేయడం ద్వారా మాత్రమే వారిని ఆదుకోగలమని స్పష్టం చేశారు. హిత వచనాలు చెప్పడంకాకుండా రాష్ట్రాలకు తాగిన వనరులు కల్పించడానికి కేంద్రం పూనుకోవాలని కోరారు.

అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా, మన దేశంలో అమ్మకపు ధరలు తగ్గించకుండా ప్రభుత్వం తన ఆదాయాన్ని విశేషంగా పెంచుకొంటున్నదని చెబుతూ ఆయా మొత్తాలలో కొంత మొత్తాన్ని వైద్య సదుపాయాలు మెరుగుపరచడం కోసం ఖర్చు పెట్టాలని కోరారు. సాంఘిక దూరం, పరిశుభ్రత పాటించమనడం వంటి సూచనలు బాగుంటాయి గాని పెద్ద మురికివాడలలో సాధ్యమా అని ప్రశ్నించారు.

ప్రస్తుతం కరోనా వ్యతిరేక పోరాటంలో మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఒకే మాటపై ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఇదే స్ఫూర్తిని దేశంలో మౌలిక వైద్య సదుపాయాలు కొనసాగించడానికి కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రంగంలో ఉచితంగా కరోనా టెస్ట్ లు జరపాలని సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం ఎందుకని టెస్టులు జరుపలేక పోతున్నదని కోర్ట్ ప్రశ్నించదే అని విస్మయం వ్యక్తం చేశారు.

బత్తాయిల అమ్మకాలపై చేతులెత్తేసిన కేసీఆర్


లాక్ డౌన్ కారణంగా రైతులకు ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని, వారి ఇంటికి వచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేసి, వారికి గిట్టుబాటు ధర అందిస్తుందని చెబుతూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బత్తాయి రైతుల విషయంలో మాత్రం చేతులెత్తివేస్తున్నారు. ఆయన ఆదేశాలను స్వయంగా ఆయన మంత్రి, ఉన్నతాధికారులు నిరాకరించడంతో మౌనం వహిస్తున్నారు.

నల్లగొండ, పాలమూరు బత్తాయిలను గ్రేటర్‌ హైదరాబాద్‌కు సరఫరా చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు గాలిలో కలిసిపోయాయి. రైతుల నుంచి బత్తాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయించడం అసాధ్యమని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు స్పష్టం చేయడంతో సీఎం ఏమీ చేయలేకపోయారు.

రాష్ట్రంలో పండించిన బత్తాయిని ఎగుమతి చేయనీయొద్దని, హైదరాబాద్‌ వాసుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇక్కడే విక్రయించాలన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనతో రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం పక్షం రోజులుగా ఎదురు చూస్తున్నారు.

‘‘రాష్ట్రంలో బత్తాయి వినియోగం తక్కువ. ఉత్తరాది రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ప్రతి సీజన్‌లో బత్తాయి ఎగుమతి అవుతుంది. ఈసారి ఇక్కడే వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు ఆ దిశగా ఆలోచించాం. కానీ, ప్రస్తుతం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చాం’’అని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇది ఢిల్లీ, ఉత్తరాది మార్కెట్‌పై ఆధారపడిన అంశమని, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వమే తేల్చాలని అంటూ చేతులెత్తేశారు. ఈ సారి రేటు తక్కువైనా రైతులు ఓర్చుకోవాలి అంటూ వారికి ఓ ఉచిత సలహా ఇచ్చారు. టన్నుకు రూ.40-50 వేల ధర పలికే ఈ సీజన్‌లో రూ.10వేలకు పడిపోవటం, కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్రం వెనుకడుగు వేయడంతో బత్తాయి రైతులకు దిక్కు తోచడం లేదు.

గత నెల 22 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నా ఢిల్లీ, కోల్‌కతా, కర్నూలుకు చెందిన వ్యాపారులు నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులను ఫోన్లలో సంప్రదించారు. ఎగుమతులకు అనుమతి లేదని రైతులు చెప్పటంతో మిన్నకుండిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చటంతో రైతులకు ఏమి చేయాలో అంతుబట్టడం లేదు.

లాక్ డౌన్ పొడిగింపుకు వైద్యపర కారణం లేదు!


కేవలం పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయలేక, కరోనా బాధితులను గుర్తిస్తే వారికి అవసరమైన వైద్య సదుపాయాలు కలిగించలేకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లోక్ డోన్ పొడిగింపుకు చేస్తున్నాయా? అవుననే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ లోక్ డౌన్ ఏప్రిల్ 14 తర్వాత పొడిగింపుకు ఎటువంటి వైద్యపరమైన కారణం లేదని స్పష్టం చేసింది.

దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేయవచ్చని చెబుతూనే హాట్ స్పాట్ లో మాత్రం నిషేధపు ఉత్తరువులు జారీ చేయాలని స్పష్టం చేస్తూ, ఈ సందర్భంగా సవివరమైన నివేదికను సమర్పించింది. ఈ నివేదికను యడియూరప్ప ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని, ఒకట్రెండు రోజుల్లో ఏదో ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

నారాయణ హృదయాలయ ఆస్పత్రుల ఫౌండర్, డాక్టర్ దేవి శెట్టి ఆధ్వర్యంలో కర్ణాటక ప్రభుత్వం హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసింది . లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో వేలాది మంది వలస కార్మి కులు ఆదాయం, ఆహారం లేక విలవిల్లాడుతున్నారు. ప్రజల్లో నెలకొన్న ఫ్రస్టెసన్ ను నివారించడానికి, వారిలో నమ్మకాన్నికలిగించడానికి, చాలామందికి జీవనోపాధి అందించేందుకు.. దశల వారీగాలాక్ డౌన్ ఎత్తేయడం చాలా అవసరమని వీరు స్పష్టం చేశారు.

ఐటీ, బిజినెస్ టెక్నాలజీ సంస్థలు, ఇతర వ్యాపా ర సంస్థలు తమ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంచేసేలా ప్రోత్సహించాలని, వర్క్ ఫ్లో 50 శాతం మంది ఆఫీసుల్లో పనిచేసేలా చూసుకోవాలని, ఫ్యాక్టరీలు పలు సంస్థలు తిరిగి తెరుచుకుని 50 శాతం ఉత్పత్తి జరిగేలా చూడాలిని, ప్రతి ఉద్యోగికి పూర్తి జీతం చెల్లించాలని, నిర్మాణ రంగం కూడా తిరిగి ప్రారంభం కావాలని సూచించింది.

ప్రభుత్వం గుర్తించిన హాట్ స్పాట్ లలో రెండు వారాలు లాక్డౌన్ కొనసాగించాలని, ఏప్రిల్ 3 0 వరకు రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగించాలని, అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేయాలని, విమానాలు, రైళ్లు, ఏసీ బస్సులు, మెట్రో బస్సులు తిప్పవద్దని, కేవలం గూడ్స్ వాహనాలను మాత్రమే అనుమతించాలిని ఈ నిపుణుల బృందం సిఫార్స్ చేసింది. మే 31 వరకు ప్రజలు సాంఘిక దూరం నియమాలను కచ్చితంగా పాటించేలా కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

బహిరంగ ప్రదేశాలలో ఆరుగురి కన్నా ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా చూడాలని, అవసరమైన చోట్ల 144 సెక్షన్ను విధించాలని, జిమ్లు, బార్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, మత సంస్థలు, పెళ్ళ్లిలుసహా ఇతర ఫంక్షన్లు ఏప్రిల్ 30 వరకు ఆపేయాలని, చూయింగ్ గమ్ నమలడాన్ని నిషేధించాలని, పాన్ తినడం పైనా ఆంక్షలు విధించాలని, ఏసీలు వాడకుండా షాప్లు ఇతర, సంస్థలు నడవాలని వివరించారు.

విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతులు నిర్వహించాలని, మరిన్ని టెస్టింగ్ కిట్లను తెప్పించుకోవాలని, ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్ల వాడకంపై ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వాలని, గ్రామీణ వ్యవ సాయ కార్యకలాపాలను మరింత పెంచాలని, జనం ఎక్కువగా ఉండేప్రాంతాల్లో కామన్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, సీనియర్ సిటిజన్లు ఇంట్లోనే ఉండాలని కఠిన ఉత్తరువులు జారీ చేయాలని ఈ బృందం సూచించింది.

కొవిడ్-19 అనేది 3 నెలల వయస్సున్న వైరస్ అని చెబుతూ ఏప్రిల్ లో రెండు వారాలు ముగిశాక క్షేత్రస్థాయి వాస్తవాలు ఎలా ఉంటాయనే దాన్ని ఎవరూ అంచనా వేయలేరని పేర్కొన్నది. అందుకే ఈనెల 15 నుంచి 30 వరకు రెండు వారాల ఒక కార్యాచరణ ప్రణాలికను రూపొందించుకోవాలని వీరు సూచించారు.

Arthi Venkatesh Latest Photo Stills

కరోనా వైరస్ రకాలు.. అవి వ్యాప్తి చెందే పరిస్థితులు!

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వివిధ రూపాల్లో ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఈ వైరస్ మొత్తం ఏడు రకాలుగా ఉన్నాయని, అందులో నాలుగు రకాలు సాధారణ శ్వాస సంబంధిత ఇబ్బందులను కలగజేస్తాయి. మిగిలిన మూడు రకాల వైరస్ లు శరీరంలోని ఇతర భాగాల్లో ప్రభావితం చూపిస్తూ..మనుషులను ఇబ్బంది పెడతాయి.

ఈ వైరస్‌ లు వేడి వాతావరణంలో ఉండలేవా? డిసెంబర్ నుంచి మే వరకు ఈ వైరస్‌లు వ్యాప్తి చెందుతాయా? చల్లటి వాతావరణంలోనే విజృంభిస్తాయా? అంటే అవుననే పరిశోధకులు అంటున్నారు. వైరస్ అత్యధికంగా వ్యాప్తి చెందుతున్న వాతావరణ పరిస్థితుల్ని అధ్యాయనం చేస్తే.. ఈ నిర్ణయానికే రావచ్చంటున్నారు.

కరోనా వైరస్‌ లలో నాలుగు రకాలు సాధారణ శ్వాస సంబంధిత ఇబ్బందులను కలగజేస్తాయి. ఇవి సీజనల్‌ గానే వ్యాప్తి చెందుతున్న విషయాన్ని పరిశోధకులు కనిపెట్టారు. సాధారణంగా వ్యాప్తి చెందే నాలుగు రకాల కరోనా వైరస్ సోకిన కేసుల్లో పెద్దవాళ్లలో తొమ్మిది, పిల్లల్లో 20 శాతం వరకు మాత్రమే వైద్యుల చికిత్స అవసరం పడుతుంది. ఈ నాలుగు వైరస్‌ లు ఎక్కువగా డిసెంబర్ నుంచి మే నెలల మధ్యనే వ్యాప్తి చెందుతున్నాయని పరిశోధకులు తెలిపారు.

యంగ్ హీరోయిన్ తో రెండో పెళ్లికి సిద్ధమైన హీరో?


యంగ్ హీరోయిన్ సునైన తనకంటే ఏజ్ లో పెద్దవాడైన, పెళ్లయి.. విడాకులు తీసుకున్న హీరోను పెళ్లి చేసుకోనుందని తమిళ ఇండస్ట్రీలో టాక్ విన్పిస్తుంది. సునైన ‘టెన్త్ క్లాస్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఈ తెలుగు ఘన విజయం సాధించినప్పటికీ ఆమెకు సినిమా ఆఫర్లు మాత్రం అంతగా రాలేదు. దీంతో ఈ అమ్మడి చూపు తమిళ ఇండస్ట్రీపై పడింది. తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత క్రేజ్ మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా ఓ తమిళ హీరోతో ఈ అమ్మడు ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ తో ‘పంజా’ మూవీని తెరకెక్కించిన విష్ణువర్ధర్ సోదరుడు కృష్ణ కులశేఖరన్ తో సునైన ప్రేమలో పడింది. కులశేఖరన్ కు అల్రెడీ అప్పటికీ వివాహామైంది. ఈ ప్రేమాయణం కొనసాగుతుండగానే కులశేఖరన్ తన భార్యకు 2016లో విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరి లవ్ స్టోరీ కంటిన్యూ అయినట్లు కోలివుడ్లో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంలో సునైన ఇంట్లో తెలియడంతో వారు పెళ్లికి నిరాకరించినట్లు సమాచారం. విడాకులు తీసుకున్నవాడితో పెళ్లంటీ? అని ఆమె తల్లిదండ్రులు మందలించారట. అయితే ఆమె తన తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో ఓకే అన్నారని తెలుస్తోంది.

ఈ విషయంలో ఆలస్యం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని సునైనా-కులశేఖర్ భావించి త్వరగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారట. ఏప్రిల్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ వల్ల పెళ్లి వాయిదా వేసుకున్నట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం సునైనా శ్రీవిష్ణుతో కలిసి ‘రాజారాజా చోళ’ మూవీలో నటిస్తుంది. లాక్డౌన్ ఎత్తేశాక సునైనా-కులశేఖర్ పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్ కోడై కూస్తుంది. వయస్సులో పెద్దవాడైనా, పెళ్లయి..విడాకులు తీసుకున్న వాడిని పెళ్లి చేసుకునేందుకు సునైనా రెడీ అవుతుండటంపై పలువురు అవాక్కవుతున్నారు. ఈ సినిమా హీరోయిన్లంతా సెకండ్ హ్యండ్ మొగుళ్లనే ఇష్టపడుతుంటారు.. ఎందుకో.. అంటూ పలువురు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

విశాఖపట్నంలో ఓలా క్యాబ్ లకు అనుమతి…!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యవసర వైద్య సదుపాయం అవసరమయ్యే పౌరులకు రవాణా కోసం ఓలా క్యాబ్ లకు విశాఖపట్నం నగరంలో పైలట్ ప్రాజెక్ట్ గా అనుమతించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు & భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి (రాష్ట్ర సమన్వయకర్త) ఎమ్. టి. కృష్ణ బాబు గురువారం తెలిపారు.

కోవిడ్ కాకుండా డయాలసిస్, క్యాన్సర్, గుండె జబ్బులు తదితర రోగులను ఆసుపత్రులకు తీసుకుని వెళ్ళడానికి , తిరిగి ఇళ్లకు తీసుకుని వెళ్లాడానికి అనుమతించడం జరిగిందన్నారు. అలాగే విధుల్లో ఉన్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది విధులకు హాజరు కావడానికి ఈ సడలింపు ఇవ్వడం జరిగిందన్నారు. పైలట్ గా విశాఖపట్నం లో అమలుకు అనుమతించడం జరిగిందన్నారు.

కర్ణాటక రాష్ట్రంలో ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సహకారంతో కర్ణాటక రాష్ట్రంలో ఇటువంటి అనుమతులు ఇవ్వడం జరుగుతున్నాయని, తమకు అవకాశం ఇవ్వాలని ఓలా సంస్థ కోరారన్నారు. రవాణా, పోలీసు విభాగాలతో సంప్రదించి పై అభ్యర్థనను పరిశీలించి, ఓలా క్యాబ్ వారి అభ్యర్థన మేరకు ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ట్రయల్ ప్రాతిపదికన ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఈ సౌకర్యం వైద్య అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఉపయోగించు కోవాలని తెలిపారు.

భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రమాణాలకు లోబడి డ్రైవర్‌ను మినహాయించి ప్రయాణికుల సంఖ్య ఇద్దరు మాత్రమే ఉండాలన్నారు. ఈ ప్రయాణ క్రమంలో వినియోగదారులు మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించాలన్నారు. నియమాలను అతిక్రమించి ప్రయాణలను తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు. క్యాబ్ క్రమం తప్పకుండా డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్ చేయడం మరియు శుభ్రపరచడం చేయాలన్నారు. తద్వారా ఓలా ప్రయాణీకుల భద్రతను ఖచ్చితంగా పాటించాలని ఆయన తెలియచేసారు.

లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్రానికి విజ్ఞప్తి


లాక్‌డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్రానికి టీడీపీ పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది. కొద్ది సేపటి క్రితం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. హైదరాబాద్ నుంచి ఆన్ లైన్ లో జూమ్ యాప్ సాయంతో పొలిట్ బ్యూరో సభ్యులు అందరితో సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. అనంతరం టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, కరోనా వైద్యసేవలు అందిస్తూ మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు ఇవ్వాలని కోరారు. రైతుల కరెంట్‌, నీటి బిల్లులను రద్దు చేయాలని, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోవాలని, అందరికీ ఉచితంగా కరోనా టెస్ట్‌లు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ అసమర్థత వల్ల రైతులు నష్టపోతున్నారని దుయ్యబట్టారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకోవాలని, కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.5 వేలు ఇవ్వాలని కేంద్రం చెబుతున్నా అరకొర సాయంతో ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. మెడ్‌టెక్‌ జోన్‌ ఫలితం దేశమంతా ఉపయోగపడుతోందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముందుచూపును టీడీపీ పొలిట్‌బ్యూరో అభినందించింది.

లావణ్య త్రిపాఠి కెరీర్ లైన్లో పడింది!


అందాల రాక్షసి ఫేమ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి టాలెంట్ అండ్ గ్లామర్ పరంగా స్టార్ హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదు.అయినా గానీ లావణ్య కి లక్ కలిసి రాలేదు. రీసెంట్ గా ‘అర్జున్ సురవరం’ సినిమా రూపంలో మంచి హిట్ వచ్చినాక లావణ్య త్రిపాఠి కెరీర్ కొంచెం ముందుకు కదులుతోంది అని చెప్పొచ్చు ..

కెరీర్ ఆరంభంలో లో అంగాంగ ప్రదర్శన చెయ్యనని.,. తన పాత్ర సినిమాలో కీలకంగా ఉండాలని గిరిగీసుకొని చాలా ఛాన్స్ లు పోగొట్టు కొంది. .ఇప్పుడు గ్లామర్ రోల్స్ కి కూడా రెడీ అని డైరెక్టర్స్ కి సిగ్నల్స్ పంపుతుందట. దాంతో హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబో చిత్రం లో లావణ్య త్రిపాఠి కి హీరోయిన్ గా అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే వచ్చే ఏడాది నాని -మారుతి కాంబినేషన్ లో రాబోయే సినిమాలో కూడా లావణ్య త్రిపాఠి నే హీరోయిన్ గా అనుకుంటున్నారట. అలాగే అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’కి సీక్వెల్ గా చేస్తోన్న ‘బంగార్రాజు’ చిత్రం లో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది .

ఇటీవల కరోనా పై పోరాటంలో భాగంగా ఏ స్టార్ హీరోయిన్ విరాళం ప్రకటించని సమయంలోనే అందరి కంటే ముందే లక్ష రూపాయిలు విరాళంగా ప్రకటించి తన ఔదార్యం చాటుకొంది లావణ్య త్రిపాఠి.

పవన్ పై ‘ఇస్మార్ట్’ బ్యూటీ అదిరిపోయే కామెంట్

Golden chance for Nidhi Agarwal in Prabhas movie
Golden chance for Nidhi Agarwal in Prabhas movie


దేశంలో లాక్డౌన్ అమలుతో సినిమా షూటింగ్ లు వాయిదా పడ్డాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. హీరోయిన్లు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ వేసవిని మరింత హీటెక్కిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఇటీవల తానే స్వయంగా కేక్ తయారు చేసి అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో పెట్టింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తాజాగా ట్వీటర్ ద్వారా ఈ అమ్మడు అభిమానులతో ఇంటరాక్ట్ అయి వారడిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలిచ్చి అందరినీ ఖుషీ చేసింది.

నిధి అగర్వాల్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. బుధవారం ట్వీటర్లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి వారడిని ప్రశ్నలకు అదిరిపోయే సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా అభిమానులు పవన్ కళ్యాణ్‌, హృతిక్ రోషన్, నిధి పెళ్లిపై పలు ప్రశ్నలు అడిగారు. ‘పవన్ కల్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పండి’ అని అడగగా.. ‘సినిమాకు పవన్ కల్యాణ్ సార్ ఒక గిఫ్ట్’ అని నిధి సమాధానమిచ్చింది. నిధి చెప్పిన సమాధానికి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. అలాగే హృతిక్ గురించి అడిగిన ప్రశ్నకు ‘ఇప్పటివరకు నేను చూసిన మోస్ట్ కంప్లీట్ యాక్టర్ ఆయనే.. నిజమైన స్ఫూర్తి.. అందగాడు..’ అంటూ పొగడ్తలవర్షం కురిపించింది.

‘లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? ఆరెంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా?’ అనే ప్రశ్నకు.. తాను ఇంట్లో కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని స్పష్టం చేసింది. టాలీవుడ్లో ఎంతోమంది ప్రతిభావంతులైన హీరోయిన్లు ఉన్నారంది. తాను ఎవరికీ పోటీ కాదని.. తనకు తానే పోటీ అని ‘గబ్బర్ సింగ్’ డైలాగ్ చెప్పింది. ప్రస్తుతం ఈ భామ రవితేజతో, మహేష్ అల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచమవుతున్న మూవీలో నటిస్తుంది.