
కరోనా భయంతో దేశం మొత్తం లాక్ డౌన్ అమలపరుస్తున్నారు. అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య 21రోజుల సంపూర్ణ లాక్ డౌన్ నేటితో 20వ రోజుకి చేరుకుంది. రేపటితో ఈ లాక్ డాన్ ముగియనుంది.కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన రూ.1500 మాత్రం ఇంకా ప్రజల అకౌంట్లలోకి రాలేదు.
దేశంలో కరోనా కలకలం పుట్టిస్తున్న తొలి రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ హడావుడిగా లాక్ డోన్ విధించారు. దింతో దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా కేంద్రం మాటకు తలొగ్గాయి. ఈ క్రమంలోనే పేద ప్రజలు, అసంఘటిత కార్మికులు రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకు సహాయం చేయాలని వివిధ రాష్ట్ర సీఎంలు నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే.. కొన్ని వాక్దానాలు చేశారు. మోడీ మహిళలకు నెలకి రూ.500 చొప్పున మూడు నెలలకు రూ.1500 జన్ ధన్ అకౌంట్ లో వేస్తా అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడత రూ.500 అకౌంట్ లో వేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా లాక్ డౌన్ లో ప్రజలకు ఇచ్చిన హామీలు బియ్యం, కంది పప్పు, వంటి నిత్యావసర వస్తువులు, రూ.1000 ఆర్థిక సహాయం చేశారు. సీఎం కెసిఆర్ మాత్రం ఇచ్చిన మాటను నెరవేర్చడంలో విఫలమయ్యారు.
తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కరికి 12కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.1500 ఆర్థిక సహాయం చేస్తా అని సీఎం కెసిఆర్ మాట ఇచ్చారు. రేపటితో 21రోజుల లాక్ డౌన్ ముగియనుంది.12కేజీల బియ్యం అయితే అందాయి కానీ రూ.1500 మాత్రం ప్రజలకు అందలేదు. డైరెక్ట్ గా అకౌంట్ లో పడతాయని చెబుతున్నారు. ఎవరి అకౌంట్ లో పడతాయి? ఎలా పడతాయి? ఎప్పుడు పడతాయి? అనే విషయం లో క్లారిటీ లేదు. కనీసం గ్రామాలలో ఉంటున్న ప్రజల దగ్గరికి వచ్చి ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా అకౌంట్ లు తీసుకోలేదు. వాటి గూర్చి ప్రస్తావన కూడా లేదు. తాజాగా ఈ రోజు కూడా కెసిఆర్ మరో మాట ఇచ్చారు. నెలకి సరిపడే నిత్యావసర వస్తువులు ఇంటికే పంపిస్తున్నాం” అని అన్నారు. ఇవైనా వస్తాయా.. లేక రూ.1500 వలే ఇదిగో పులి అదిగో తోక అంటారో వేచి చూడాలి.