
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూకంపం వచ్చింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.7గా నమోదైంది. దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తుండగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. గత రెండ్రోరోజుల వ్యవధిలో రెండుసార్లు భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లలోని వెళ్లాలంటేనే జంకుతున్నారు. సోమవారం వచ్చిన భూకంపంతో పలువురి ఇళ్లలోని సామాన్లు కిందపడిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరుగకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా ఆదివారం కూడా భూకంపం వచ్చింది. 3నుంచి 4సెకన్లపాటు భూప్రకంనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లో 3నుంచి 4సెకన్లపాటు భూకంపం వచ్చిన సంగతి తెల్సిందే. ఆదివారం వచ్చిన భూకంపం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైందని ఢిల్లీలోని భూకంప కేంద్రం ప్రకటించింది. కాగా ఢిల్లీలో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశముందని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. ఓ వైపు కరోనా మహమ్మరి, మరోవైపు వరుస భూకంపాలు వస్తుండటంతో ప్రజలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నిన్నటి కంటే ఈ రోజు భూకంపం తీవ్రత తక్కువగా నమోదైంది.