Home Blog Page 8525

నా సినిమా చూసి సమస్యలు తెచ్చుకొకండి

దక్షిణ భారత దేశం లో లవ్ , థ్రిల్లర్ జానర్ లో సినిమాలు చేసే దర్శకుల్లో గౌతమ్ మీనన్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ..సున్నితమైన అంశాలతో సినిమాల్ని టెంపో తో నడపడం లో గౌతమ్ మీనన్ దిట్ట .

అందుకే లాక్ డౌన్ సమయం లో గౌతమ్ మీనన్ సినిమాల్ని జనాలు బాగానే చూస్తున్నట్లు తెలిసింది. వెంకటేష్ ఘర్షణ( రీమేక్) , సన్నాఫ్ సూర్య,, రాఘవన్,, ఏమాయ చేసావె (రీమేక్ ), చెలి ,,ఎంతవాడు గానీ. ..వంటి విభిన్న సినిమాలు తీసాడు. గౌతమ్ మీనన్ . ఇవన్నీ కూడా లాక్ డౌన్ పిరియడ్ లో జనాలకు బాగానే ఆనందం పంచుతున్నాయి . ఆ విషయం తెలుసుకొన్న గౌతమ్ మీనన్ నా సినిమాలు ఆదరిస్తున్నందుకు థాంక్స్ కానీ.. నా దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాలు మాత్రం చూడొద్దని ప్రేక్షకుల్ని కోరుతున్నా అంటున్నాడు గౌతమ్.మీనన్ ….

ఇంతకీ గౌతమ్ మీనన్ లాక్ డౌన్ టైంలో చూడొద్దని కోరుతున్న రెండు సినిమాలు ఏంటో తెలుసా ? ఏమాయ చేసావె ,, ఎంతవాడు గానీ.(అజిత్ మూవీ ),, ఈ రెండు సినిమాల్లో కథానాయకులు నాగచైతన్య, అజిత్.. రోడ్ మీద తిరుగుతూ ఆహ్లాదంగా గడుపుతారు. ఇప్పుడు లాక్ డౌన్ టైములో ప్రేక్షకులు ఆ సినిమాలు చూస్తే.. వాళ్లకు బయట ప్రపంచంలో విహరించాలని అనిపిస్తుందని..కాబట్టి వాటికీ దూరంగా ఉండటం మంచిదని హితవు చెప్పాడు…

నిజంగానే ఆ రెండు సినిమాల్లో హీరోలు చేసే జర్నీ చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. ప్రేక్షకుల హృదయాల్లో స్పందన తీసుకురావడంలో గౌతమ్ మీనన్ అందెవేసిన చేయి . .కనుక అలాంటి టెంప్టింగ్ మూవీస్ చూస్తే ప్రేక్షకుడికి బయట తిరగాలి అనిపిస్తుందని ముందు జాగ్రత్తగా గౌతమ్ మీనన్ హెచ్చరించాడు అని తెలుస్తోంది …

తండ్రి కడసారి వీడ్కోలుకు సీఎం దూరం!

కరోనావైరస్ లాక్ డౌన్ అమలులో భాగంగా రేపు (మంగళవారం) తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకానని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లేఖ ద్వారా తెలిపారు. సిఎం ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ (89) ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) లో సోమవారం ఉదయం కన్నుమూశారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనావైరస్ లాక్ డౌన్ దృష్ట్యా సీఎం యోగి తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.యూపీ లో లాక్ డౌన్ నేపథ్యంలో రేపు ఉదయం ఉన్నతాధికారులతో కీలక భేటీ జరుగనుంది. కావున సీఎం యోగి తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేరని అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని యోగి తన తల్లికి లేఖ ద్వారా తెలియజేసారు.

యోగి తండ్రికి కాలేయం మరియు మూత్రపిండాల సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. తీవ్రమైన కాలేయ సంక్రమణ, డియాలసిస్ సమస్యతో మార్చి 13 ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుండి బిష్ట్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు) లో వెంటిలేటర్ సహాయంతో ఉన్నాడు. కాగా ఈ రోజు ఉదయం ఆయన మరణించారు.

కరోనా బారిన పడుతున్న జర్నలిస్టులు


దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీఒక్కరికి సోకుతోంది. కరోనాకు మందు లేకపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోవిడ్-19 వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 17,265పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 543మంది మృతిచెందగా 2,547మంది కరోనా నుంచి బయటపడ్డారు. అయితే దేశంలో ఎక్కువ నమోదవుతున్న కేసుల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై తొలిస్థానంలో నిలువడం శోచనీయంగా మారింది. ముంబైలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. మహరాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తుంది. తాజాగా మహారాష్ట్రలో 53మంది జర్నలిస్టులకు కరోనా వచ్చినట్లు బీఎంసీ నిర్వహించిన టెస్టుల్లో తేలింది. మొత్తం 170మంది జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లకు టెస్టులు చేయగా 53మందికి పాజిటిల్ వచ్చింది. టెస్టులు నిర్వహించడానికి ముందు వీరికి కరోనా లక్షణాలు లేవని వైద్యులు తెలపడం గమనార్హం.

మ‌హారాష్ట్ర కరోనా దాటికి విలవిలలాడుతోంది. ఆదివారం ఒక్క‌రోజే రాష్ట్రంలో 552 వైర‌స్ పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఒక్కరోజులో పెద్దసంఖ్యలో కేసులు నమోదవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో మ‌హారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,200లకు చేరింది. కరోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 223మంది మృతిచెందగా ఆదివారం 142మంది డిశార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,470గా ఉంది. కరోనా నుంచి మొత్తంగా 507మంది కోలుకున్నట్లు సమాచారం. చేరింది. అత్య‌ధికంగా ముంబైలో రెండు వేల‌కుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్ర లాక్డౌన్ పొడగిస్తున్నట్లు ప్రకటించింది. మహారాష్ట్రలో కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపడుతున్నా తగ్గుముఖం పట్టడంలేదు. తాజాగా కరోనా లక్షణాలు లేకుండా కొత్తగా కేసులు నమోదవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

బాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్!


కరోనా వైరస్, లాక్ డౌన్ నేపధ్యంలో అధికార, విపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. మెడ్ టెక్ జోన్ పైన విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పుట్టినరోజు వేడుకలు సోమవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. సీఎం ట్వీట్కు స్పందించిన చంద్రబాబు, జగన్ కు ధన్యవాదాలు తేలిపారు.

ఎస్.ఇ.సి కేసులో కనగరాజ్ కౌంటర్ దాఖలుకు ఆదేశం!


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ తొలగింపునకు సంభవించిన కేసులో ప్రస్తుత ఎస్.ఇ. సి కనగరాజ్ అదనపు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కనగరాజ్ చెన్నైలో ఉన్నందున, 3 వారాల గడువు కావాలని కనగరాజు తరపు న్యాయవాది వాదించారు.

ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదానాలు వినిపిస్తూ ప్రభుత్వం తరపున అదనపు కౌంటర్ దాఖలు కోసం మరికొంత సమయం కావాలని కోరుకున్నాడు.

ప్రమాణ స్వీకారం చేయడానికి కనగరాజును చెన్నై నుండి తీసుకురావడానికి వారు 24 గంటల కన్నా తక్కువ సమయం తీసుకున్నారని, అదనపు కౌంటర్ దాఖలు చేయడానికి వారికి ఎక్కువ సమయం ఎందుకని రమేష్ కుమార్ తరపున న్యాయవాది వాదించారు. ఎన్నికలు నిర్వహించడానికి కనగరాజ్ నుంచి ఎలాంటి ఉత్తర్వులను అడ్డుకుంటూ తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన ధర్మాసనం కోరారు.

ఎన్నికలను 6 వారాల వరకు వాయిదా వేస్తూ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు ఇచ్చిందని, ఆ కాలం ఏప్రిల్ 30 తో ముగుస్తుందని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 30 కి ముందు కనగరాజు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది కోర్టు ధిక్కారం అవుతుందని, అతని నిర్ణయం చట్టబద్ధంగా ఆమోదించబడదని ధర్మాసనం తెలిపింది.

చివరగా అన్ని అదనపు కౌంటర్ లు ఈ నెల 24 లోగా దాఖలు చేయవచ్చని, పిటిషనర్లు అదనపు ప్రతి కౌంటర్ ఈ నెల 27 వ తేదీలోగా దాఖలు చేయవచ్చని, చివరి విచారణ ఏప్రిల్ 28 న దాఖలు చేయవచ్చని హెచ్‌సి బెంచ్ తెలిపింది. పిటిషనర్లు మరియు ప్రతివాదులు ఇద్దరూ ఈ తేదీలకు కట్టుబడి ఉండాలని మరియు తదుపరి వాయిదాను అంగీకరించలేమని ధర్మాసనం స్పష్టంగా తెలిపింది

కరోనా కట్టడిలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నారా?


చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం 21రోజుల లాక్డౌన్ అమలు చేసింది. ఏప్రిల్ 14తో లాక్డౌన్ గడువు ముగిస్తుందనగా లాక్డౌన్ మే 3వరకు పొడగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఏప్రిల్ 20తర్వాత కొన్నిరంగాలకు మినహాయింపులు ఉంటాయని చెప్పారు. కేంద్రం చెప్పినట్లుగా కొన్ని రంగాలకు లాక్డౌన్ పీరియాడ్లో మినహాయింపులిచ్చారు. భారత్ వ్యవసాయ రంగం దేశమయినందునా వ్యవసాయాధారిత పరిశ్రమలకు కొన్ని షరతులతో కూడిన మినహాయింపులిచ్చారు. దీనివల్ల రానున్న రోజుల్లో దేశంలో నిత్యావసర సరుకులు లోటు రాకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి మరోవిధంగా ఉండటంతో శోచనీయంగా మారింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21మంది మృతిచెందగా 186మంది కోలుకున్నారు. ప్రస్తుతం 651యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగేందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమైందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కరోనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా లైట్ తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ కరోనా వైరస్ తెలంగాణ వాతావరణంలో బ్రతికే ఆస్కారం లేదని, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండదని చెప్పుకొచ్చారు. అంతేకాదు పారాసిటామాల్ గోలి వేసుకుంటే తక్కువైపోతుందని తనకు ఓ సైంటిస్టు చెప్పినట్లు చెప్పారు. తొలుత నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కరోనా కట్టడికి పకడ్బంధీ చర్యలు తీసుకుంది. కరోనా సృష్టించే విలయతాండవాన్ని ముందే గ్రహించిన కేసీఆర్ కేంద్రం కంటే ముందుగానే రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేశారు. దీని వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు కొంత తగ్గుముఖంగా పట్టినట్లు కన్పించాయి.

దేశంలో కరోనా కేసులకుు మర్కజ్ ప్రార్థనలకు లింకు ఉండటంతో కేంద్రం ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు సమాచారం ఇవ్వడంతో ఆయా ప్రభుత్వాలు అలర్టయ్యాయి. ముస్లింలు ఎక్కువగా ఉంటే హైదరాబాద్, పాతబస్తీ ఏరియాల్లో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని ప్రభుత్వం సరిగా గుర్తించలేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగట్టుగానే రాష్ట్రంలో నమోదవుతున్న ఎక్కువ కేసుల్లో హైదరాబాద్ ప్రాంతం తొలిస్థానంలో నిలిచింది. సగానికి పైగా కేసులు హైదరాబాద్ ప్రాంతానివే కావడం గమనార్హం.

తెలంగాణలో ముస్లింలను ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో భాగంగా సీఎం కేసీఆర్ వారి విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించాలని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో కరోనా కేసులు కట్టడి చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా కరోనాతో తెలంగాణలో చావులకు కారణమవుతున్నారని మండిపడుతున్నారు.

తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ మే 7వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పలువర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం చెప్పే మాటలకు.. చేతలకు పొంతన లేకుండా పోతుందని ఎద్దేవా చేస్తున్నారు. కరోనాపై అందరికంటే ముందే మెల్కొన్న తెలంగాణ ప్రభుత్వం కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయిందని ప్రశ్నించారు. లాక్డౌన్ పేరిట అన్నిరంగాల ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం సడలించిన రంగాలకు కూడా తెలంగాణలో మినహాయింపు ఇవ్వకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్లు ఏప్రిల్ నెలలో 12కిలోల ఉచిత బియ్యం, రూ.1,500 ఇంకా అందలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రయివేట్ ఉద్యోగులకు కోతలు విధించగా ఉదారతతో జీతాలు ఇవ్వాలని చెబుతున్న ప్రభుత్వం తాను మాత్రం ఉద్యోగుల జీతాల్లో 50శాతం కోత విధిస్తోంది. దీంతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులను విడుదల చేస్తుంది. ఈమేరకు 20ఏళ్లుగా ఉద్యానవన శాఖలో పనిచేస్తున్న 200మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఓ వైపు ధనిక రాష్ట్రమని చెప్పుకోనే కేసీఆర్ కేవలం నెలరోజుల లాక్డౌన్లో ఉద్యోగుల జీతాలకు సగమేర కోతలు విధించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే వైద్య సిబ్బందికి సరిపడా కిట్లు సకాలంలో అందించకపోవడంతో కరోనా కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. ఎవరైనా మీడియా ప్రతినిధులు కేసీఆర్ ను వీటిపై ప్రశ్నిస్తే వారిపై నానాయాగీ చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. దీంతో మీడియా ప్రతినిధులు కూడా ఆయన్ను ప్రశ్నలు అడిగేందుకు జంకుతున్నారు. కేసీఆర్ చెప్పిందే రాసుకోవడం జర్నలిస్టులకు కేసీఆర్ అలవాటు చేశారు. అలాగే కరోనా టెస్టులను ఎక్కువ సంఖ్యలో చేయకపోవడం కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముస్లిం వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం మహ్మద్ అలీని కనీసం ప్రగతి భవన్లోకి రానీవ్వకుండా పంపించిన ఘటనలు మీడియాలో వచ్చాయి. మర్కజ్ ప్రార్థనలు వెళ్లొచ్చిన ముస్లింలు కొందరు స్వచ్చంధంగా ముందుకొచ్చిన మరికొందరు రాలేదు. వీరిని కాంటాక్టులను పట్టుకోవడంతో ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో ఈమేరకు కేసులు సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. ఏదిఏమైనా తెలంగాణలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కంట్రోల్లోకి వచ్చిందనేలోపే మరుసటి రోజుకు కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కొందరి కరోనా లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వస్తుందటం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో మాత్రం కరోనా మహమ్మరి దోబుచులాట ఆడుతుంది. కేవలం కేసీఆర్ లాక్డౌన్ ఒక్కటే బ్రహ్మస్త్రంగా భావిస్తున్నాయి. దీని వల్ల కరోనా కేసులు కంట్రోల్ అవుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతోపాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు చేపట్టే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పాల్ఘర్ ఘటనని ఆ కోణంలో చూడొద్దు:ఉద్దవ్

మహారాష్ట్రలోని, పాల్ఘర్ లో ఏప్రిల్ 17న జరిగిన ఘటన హిందూ-ముస్లింలకు సంబంధించినది కాదని ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే స్పష్టం చేశారు. ఈ విషయంపై నేడు కేంద్ర హోంశాఖ వివరణ కోరగా ఉద్దవ్ స్పందించారు. ఇంతకు ముందు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఈ ఘటనను హిందూ-ముస్లింల మధ్య గొడవగా భావించవద్దని సీఎం తెలిపారు.

Also Read:పాల్ఘర్ లో అసలేమీ జరిగింది?

ఈ సందర్బంగా సీఎం ఉద్దవ్ మాట్లాడుతూ.. “ఇద్దరు సాధువులు, వాళ్ళ డ్రైవర్ మొత్తం ముగ్గురు వ్యక్తులు దాద్రా నగర్ హవేలీ వెళ్ళడానికి ప్రయత్నిచారు కానీ లాక్ డౌన్ కారణంగా వారిని బోర్డర్ ప్రాంతమైన పాల్ఘర్ గ్రామం వద్ద అధికారులు అడ్డుకున్నారు. వారు తల దాచుకోవడానికి ఆ గ్రామంలోకి వెళ్లారు. అప్పటికే ఆ ప్రాంతాలలో దొంగలు వస్తున్నారనే వార్త బాగా వైరల్ అయింది.దింతో ఆ వ్యాన్ లో ఉన్న ముగ్గుర్ని అనుమానంతో ఆ గ్రామస్థులు కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేసుకున్నారు కానీ గ్రామస్థుల దాడిని ఆపలేకపోయారు. దింతో ఆ ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఉద్దవ్ స్పష్టం చేశారు.

ఈ కేసుకి సంబంధించి 110 మందిని అదుపులోకి తీసుకున్నామని, మరి కొంత మంది పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే పట్టుకొని శిక్ష విధిస్తామని ఉద్దవ్ తెలిపారు.ఇది రిమోట్ ఏరియా కావడంతో వదంతులు ఎక్కువగా పుట్టాయి తప్పా ఇది హిందూ-ముస్లిం ల మధ్య గొడవ కాదని మరోసారి సీఎం స్పష్టం చేశారు.

పాల్ఘర్‌ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా!

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ లో ఏప్రిల్ 17 న దొంగతనం జరిగిందనే అనుమానంతో గ్రామస్తులు ముగ్గురు వ్యక్తులను కొట్టి చంపిన సంఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మహారాష్ట్ర ప్రభుత్వం నుండి నివేదిక కోరింది. కాసాలోని పాల్ఘర్ పోలీస్ స్టేషన్ యొక్క ఇద్దరు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై 110 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది, వారిలో 101 మందిని ఏప్రిల్ 30 వరకు పోలీసు కస్టడీకి పంపారు మరియు 9 మంది మైనర్లను బాల్య ఆశ్రయ గృహాలకు పంపించారు.

అసలేమి జరిగింది…?

ఏప్రిల్ 17 రాత్రి 9.30 నుండి 10గంటల మధ్యలో ఒక వ్యానులో ముంబయి నుండి సూరత్ కి బయల్దేరిన సుశీల్ గిరి మహారాజ్ (35), నీలేష్ తెల్గేన్ (35), చికానే మహారాజ్ కల్పవ్రిక్షిగిరి (70) అనే ముగ్గురి వ్యక్తుల్ని పాల్ఘర్‌ గ్రామ ప్రజలు ఆపి విచక్షణ రహితంగా కొట్టి చంపారు. ఆ ముగ్గురిలో ఇద్దరు సాధువులు కాగా మూడో వ్యక్తి డ్రైవర్. అయితే అంతకంటే ముందే ఆ గ్రామంలోకి పిల్లల్ని కిడ్నాప్ చేసి, అవయవాలు అమ్ముకునే వారు వస్తున్నారనే వార్త వైరల్ అయింది. దింతో ఆ గ్రామస్థులు మెలకువగా ఉండి సూరత్ లో అంత్యక్రియలకు వెళ్తున్న వ్యానిని ఆపి అనుమానంతో దాడి చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని వారిని రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. గ్రామస్థులందరు ఒక్కసారిగా దాడి చేయడంతో ఒక వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోగా ఇద్దరు సమీప ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.ఆ ముగ్గురి పై దాడి చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ కావడంతో.. కేంద్ర హోమ్ శాఖ నివేదిక ఇవ్వాలని ఉద్ధవ్ ప్రభుత్వన్ని కోరింది.

ఇళ్లల్లోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి


ఇళ్లల్లోనే రంజాన్‌ ప్రార్థనలు చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్లు, ముస్లిం మత పెద్దలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రపంచంలో, దేశంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయాలు అందరికీ తెలిసినవేనన్నారు.

కరోనా వైరస్‌ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉగాది, శ్రీరామ నవమి, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ ఇళ్లల్లోనే చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని చెప్పారు. ఇప్పుడు రంజాన్‌ కూడా వచ్చిందన్నారు.

ఇళ్లలోనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఈ రంజాన్‌మాసంలో మీరంతా కూడా సహకరించి ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కోరుతున్నా, మీ అందర్నీ అభ్యర్థిస్తున్నానని చెప్పారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పండంటూ ముస్లిం మత పెద్దలకు మత పెద్దలను కోరారు. ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే.. చెప్పక తప్పని పరిస్థితి అని చెప్పారు.

మరోవైపు రాష్ట్రంలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లాలో 16 కేసులు గత 24 గంటల్లో నమోదు అయ్యాయి. దీంతో లాక్ డౌన్ మరింత కట్టు దట్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

యంగ్ హీరోయిన్ ను మిస్సవుతున్న పూరీ


స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో రెండు దశాబ్దాలు పూర్తయింది. దీంతో ఆయనకు పలువురు సెలబ్రెటీలు, అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. పూరి జగన్మాథ్ 2000 సంవత్సరంలో తెరకెక్కించిన ‘బద్రి’ సినిమా నేటితో 20ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ పూరి జగన్మాథ్, హీరోయిన్ రేణుదేశాయ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. పవన్ తొలినాళ్లలో ‘బద్రి’ మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్లాడు డైరెక్టర్ పూరి జగన్మాథ్. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రాంచరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమా తెరకెక్కించారు. అయితే ఇటీవల కాలంలో వరుస ప్లాపులతో కొంత ఢీలా పడ్డారు.

విజయసాయిరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా!

డైరెక్టర్ గా పూరి పని అయిపోయిందనుకున్న టైంలోనే పూరి తన మార్క్ హిట్టందుకొని మళ్లీ సక్సస్ బాటపట్టారు. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో పూరి జగన్నాథ్ తనలో సత్తా తగ్గలేదని నిరూపించారు. ఈ సినిమాలో రామ్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఇందులో హీరోయిన్లుగా నిధి అగర్వాల్, నభా నటేష్ లు నటించారు. ఈ సినిమా డైరెక్టర్ పూరితోపాటు హీరో రామ్, హీరోయిన్లకు మంచి లైఫ్ ఇచ్చింది. డైరెక్టర్ గా 20సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూరి జగన్నాథ్ కు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో విషెస్ చెప్పింది. ‘మానవత్వం ఉన్న మనిషి.. లవ్ యూ సార్’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.

కక్షసాధింపు వదిలి కరోనా సంగతి చూడు జగన్

నిధి అగర్వాల్ ట్వీట్ కు స్పందించిన పూరి వెంటనే ‘నిధి ఐ లవ్ యూ.. నిన్ను మిస్ అవుతున్నా.. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అంటూ రీ ట్వీట్ చేశాడు. ఇదంతా బాగనే ఉన్నా.. యంగ్ హీరోయిన్ కు పూరి జగన్నాథ్ ఐ లవ్ యూ.. మిస్ అవుతున్నా అంటూ సంబోధించడం ఆసక్తికరంగా మారింది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లలో మరో సినిమా రాబోతుందని పూరి హింటిచ్చాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చూడాలి మరీ రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..!

‘ఆర్ ఆర్ ఆర్’ ని తలదన్నేలా ప్రభాస్ చిత్రం


ప్రభాస్ సినిమా కెరీర్ ని రెండు రకాలుగా చెప్పక తప్పదు .బాహుబలి కి ముందు , బాహుబలి తరవాత అనే విధంగా ప్రభాస్ కెరీర్ మారిపోయింది. బాహుబలి కి ముందు ప్రభాస్ చిత్రాలు తెలుగు మార్కెట్ వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇపుడు ప్రభాస్ రేంజ్ మారింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఉత్తర భారత దేశం లో, మరీ ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ప్రభాస్ కి మార్కెట్ బాగా పెరిగింది. సాహో లాంటి ఫెయిల్యూర్ (తెలుగులో) చిత్రం హిందీ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. మంచి షేర్ రాబట్టింది.

పోలీసుల దాష్టికానికి యువకుడు మృతి!

కాగా ప్రస్తుతం ప్రభాస్ ` జిల్ ` ఫేమ్ దర్శకుడు రాధా కృష్ణ తో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్నాడు. లాక్ డౌన్ ముగిసిన తరువాత ఈ చిత్రాన్ని ఫినిష్ చేయడం జరుగుతుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి మంచి బిజినెస్ అఫర్లు వస్తున్నాయి .కాగా ప్రభాస్ తన తదుపరి చిత్రంగా ` మహానటి ` ఫేమ్ నాగ్ అశ్విన్ తో భారీ పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు .

విజయసాయిరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా!

సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కనుంది. ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్న దర్శకుడు నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ విషయం లో కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఆ క్రమం లో హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దింపనున్నారట…అలాగే బాలీవుడ్ నుండి హీరోయిన్ తో పాటు కీలక నటులను దిగుమతి చేసుకో నున్నారు .. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఆ క్రమం లో ఈ చిత్రం యొక్క బడ్జెట్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కి మించ నుంది.

లఘు చిత్రం తీయండి లక్ష గెలుచుకోండి


కరోనా లాక్ డౌన్ తో ఇంట్లో కూర్చొని టైం పాస్ గాక ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతులకు చక్కటి అవకాశం కల్పిస్తోంది. ‘పీపుల్ మీడియా సోషల్’.. ప్రతిభ కలిగిన లఘు చిత్ర నటీ నటులు,దర్శకులు మరియు సాంకేతిక నిపుణులకు ఇది ఓ మంచి అవకాశం. ఈ లాక్ డౌన్ సమయంలో నూతన దర్శకులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ` పీపుల్ మీడియా సోషల్ ` వారు లఘు చిత్ర ( short film ) పోటీలను నిర్విహిస్తున్నారు.

ఈ సందర్భంగా ‘పీపుల్ మీడియా సోషల్’ పోస్ట్ చేస్తూ.. “ఈ కష్టకాలంలో ఇంట్లోనే ఉండి, మీ వద్ద ఉన్నసదుపాయాల తోనే ఓ షార్ట్ ఫిల్మ్ చేయండి. ఉత్తేజకరమైన కంటెంట్ మీ దగ్గర ఉంటే వెంటనే షార్ట్ ఫిల్మ్ చేయండి. అలా తీయబడ్డ వాటిలో ఉత్తమ లఘు చిత్రాన్నీ ఎన్నిక చేసి , లక్ష రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది.”. అని ‘పీపుల్ మీడియా సోషల్’ ప్రకటించింది. కాగా షార్ట్ ఫిల్మ్ ను మే 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో సబ్ మిట్ చేయాల్సిందిగా కోరారు.

వలస కూలీల ఆశలపై నీళ్లు?


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఇతర దేశాల్లో చిక్కుకు పోయిన ఉద్యోగస్తులని, వ్యాపారవేత్తలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ యంత్రంగాం ప్రత్యేక విమానాలు ఏర్పాట్లు చేశారు. ఈ రోజు నుండి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ రూల్స్ ని కేంద్రం సడలించింది. హాట్ స్పాట్ కానీ ప్రాంతాలలో మరి కొన్ని సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దింతో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ ప్రాంత విద్యార్థులను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. కానీ సరైన ప్రణాళిక లేకుండా అమలుపరిచిన లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను వారి వారి సొంత ఇళ్లకు పంపించడానికి మాత్రం మన బడా నేతలకు, అధికారులకు మనసు రావడం లేదు.

అది జనవరి మాసం కరోనా వైరస్ అప్పుడప్పుడే అడుగులో అడుగు వేసుకుంటూ చైనాలోని వుహాన్ లో ముందుకు సాగుతున్న వేళ భారత్ యంత్రంగాం అప్రతమై వెంటనే ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసి ఆ దేశంలో ఉన్న ఉద్యోగులను, వ్యాపార వేత్తలను హుటా హుటీనా భారత్ కి తీసుకొచ్చింది. ఆ తర్వాత కరోనా విజృంభన ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుండటంతో వివిధ దేశాలలో ఉన్నప్రవాస భారతీయుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసి మరీ వారందని ఇండియా కి తీసుకొచ్చారు. కానీ దేశ వ్యాప్తంగా ఉన్న వలస కూలీల పట్ల మన భారత్ యంత్రంగాం చాలా చిన్న చూపు చూస్తుందని స్పష్టంగా అర్థమౌతుంది.

Also Read:వలస కూలీల వేదన వర్ణానాతీతం!

పనిలేక-పరాయి పంచన ఉండలేక దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది వలస కూలీలు ఇబ్బంది పడుతున్నారు. లాక్ డౌన్ టైం లో అనేక వేలమంది కార్మికులు వారి వారి గృహాలకు వెళ్లేందుకు మూటాముల్లె సర్దుకొని, చంటి పిల్లలను ఎత్తుకొని, నడుచుకుంటూ బయల్దేరి మార్గం మధ్యలోనే ఇరుక్కుపోయారు. వారందరు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్స్ లోనే ఉంటున్నారు. ఇటీవల ముంబయిలో స్వస్థలాలకు వెళ్లిపోతామని వేల మంది రోడ్డెక్కారు. హైదరాబాద్‌ లోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఏప్రిల్ 14 తర్వాత మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించడంతో వలస కూలీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రవాణా సౌకర్యం లేక, కాలి నడకను నమ్ముకున్నవారిని ఆకలి కబళిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉన్నచోట ఉండలేక, సొంత గూటికి చేరుకోలేక వలస కూలీలు తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నారు.ఈ రోజు నుంచి నిబంధనలు సడలింపుతో తమ సొంత ఊళ్లకు వెళ్లాలని చాలామంది వలస కూలీలు ఆశ పెట్టుకున్నారు. వారిని సొంత ఇళ్లకు పంపించే ఏర్పాట్లు చేస్తారో లేక వారి ఆశలపై మరోసారి నీళ్లు చల్లుతారో వేచి చూడాలి.

మెగా ఫ్యాన్స్ కు బుక్కయిన ‘అల్లు’డు


దేశంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. నిత్యవసర సరుకుల షాపులు మినహా అన్ని బంద్ అయ్యాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. లాక్డౌన్ పీరియాడ్లో ఒక్కొక్కరు ఒక్కో బాధ కన్పిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తలసీమియా వ్యాధిగ్రస్తుల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. లాక్డౌన్ కారణంగా రక్తదాతలు ఇళ్లకు పరిమితమవడంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం దొరకని పరిస్థితి నెలకొంది. తలసీమియా వ్యాధిగ్రస్తులకు సకాలంలో మార్పిడి చేయకపోతే వారి ప్రాణాలుపోయే ప్రమాదం ఉంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించి రక్తదాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిరంజీవి, హీరో శ్రీకాంత్, బెనర్జీ తదితరులు స్వయంగా రక్తదానం చేసి ఈ వీడియోను షేర్ చేశారు.

రక్తదానం చేసిన చిరంజీవి..

చిరంజీవి పిలుపునకు స్పందించి పలువురు రక్తదానం చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ తరుణంలో మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ కూడా చిరంజీవి పిలుపుకు స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘డన్ కేసీ గారు.. తప్పకుండా మేం తొందరగా రక్తదానం చేస్తాం’ అంటూ అల్లు శిరీష్ చిరంజీవి వీడియోను షేర్ చేస్తూ అన్నాడు. ఈ ట్వీట్ చూసిన మెగా ఫ్యాన్స్ అల్లు శిరీష్ పై ఫైరవుతోన్నారు. చిరంజీవిని పట్టుకొని కేసీ గారంటావా? అంటూ తిట్టిపోస్తున్నారు. మెగాస్టార్ అని పిలువలేవా అంటూ మందలిస్తున్నారు. ఈ వివాదం ముదురుతుందని గ్రహించిన అల్లు శిరీష్ ఫ్యాన్స్ కు వివరణ ఇచ్చాడు.

విజయసాయిరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా!

తమ ఫ్యామిలీలో చిరంజీవి గారిని ‘కేసీ గారు.. లేదా కేసీ సార్’ అంటామని మెగా ఫ్యాన్స్ ను చల్లబరిచే ప్రయత్నం చేశాడు. అభిమానులకు నమస్కారం పెట్టి వివాదం పెద్దది కాకుండా చూసే ప్రయత్నం చేశాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ కొంత చల్లబడినప్పటికీ కొంతమంది మాత్రం ఒక్క హిట్టుకే అంత పొగరు పనికి రాదంటూ విమర్శిస్తున్నారు. ఇప్పటికే అల్లు ఫ్యామిలీకి.. అల్లు అర్జున్ ఫ్యామిలీకి దూరం పెరిగిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వివాదాలు తెరపైకి రావడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని మెగాస్టార్ లైట్ తీసుకుంటున్న తెలుస్తోంది.

విజయసాయిపై కన్నా అగ్గిమీద గుగ్గిలం


తాను చంద్రబాబు నాయుడుకు రూ 20 కోట్లకు అమ్ముడుబోయిన్నట్లు వైసిపి నేత విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

తనను కొనే దమ్ము ఈ భూమి మీద ఎవడికి లేదని స్పష్టం చేస్తూ “నీకు దమ్ముంటే.. మగాడివైతే కాణిపాకంలో ప్రమాణం చేస్తావా?” అంటూ సవాల్ చేశారు.

విజయసాయిరెడ్డి అధికారమదం తలకెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని హెచ్చరించారు.

తనపై విమర్శలంటే ఆకాశంపై ఉమ్మేసినట్లేనని కన్నా చెప్పుకొచ్చారు.

ప్రభుత్వ పారదర్శకత నిరూపించుకోవాలంటే మీకెందుకు పొడుచుకొచ్చిందని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయి ఇష్టానుసారం మాట్లాడితే పరువునష్టం దావా వేస్తానని కన్నా హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు చెప్పారు.

“మీరు ప్రజాధనాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా?. నిజాయితీ నిరూపించుకోమని అడగడం దుష్ప్రచారం ఎలా అవుతుంది?’ అని విజయసాయిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

‘కరోనా టెస్టింగ్‌ కిట్లపై అధికారులు ఒక్కొక్కరు ఒక్కో ధర చెబుతున్నారు. హైదరాబాద్‌లోని శాండర్‌ ఏజెన్సీకి ఒక్కో కిట్‌కు రూ.730 పర్చేజ్ ఆర్డర్‌ ఇచ్చారు. ఒక్కో కిట్‌ రూ.640 అని జవహర్‌ రెడ్డి చెబుతున్నారు. విశాఖ మెడ్‌టెక్‌లో రూ.1200కే కరోనా టెస్టింగ్‌ కిట్‌ అని సాక్షిలో రాశారు” అని గుర్తు చేశారు.

కిట్ల ధర విషయంలో గందరగోళం ఉందనే పారదర్శకత నిరూపించుకోవాలని తాను రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పానని కన్నా పేర్కొన్నాను. కరోనాపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలని ధ్వజమెత్తారు.

ఎన్నికలు పెట్టాలన్న ఆత్రం తప్ప ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదని కన్నా మండిపడ్డారు.

మే 4 నుంచి కూడా ప్రజా రవాణా అనుమానమే?


దేశంలో తొలుత 21 రోజులు, అనంతరం మరో 19 రోజులు చొప్పున మొత్తం 40 రోజుల లాక్ డౌన్ మే 3తో ముగియనుండగా, 4వ తేదీ నుంచి విమానాలు, రైళ్లు నడవటం అనుమానమేనని తెలుస్తోంది. ఈ విషయంలో ఇంతవరకూ స్పష్టమైన ప్రకటనేదీ కేంద్రం నుంచి వెలువడలేదు. అయితే, రెండు రోజుల కిందట రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రులు, ప్రయాణాలను మే 15 తరువాత అనుమతించే ఆలోచన చేయాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది.

విమానాల సర్వీసులపై ఎటువంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఇదే సమయంలో విమానాలను పార్కింగ్ చేసి వుండటం ఆయా సంస్థల ఖర్చును పెంచుతోంది. మే 4 నుంచి కూడా ప్రయాణాలపై ఆంక్షలు ఉండవచ్చు. 15 తరువాత పరిస్థితిపై తదుపరి సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి” అని ఇదే సమావేశానికి హాజరై, పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. విమాన సర్వీసుల విషయమై ఆ శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మొత్తం 14,175 యాక్టివ్ కేసులుండగా, 2,546 మంది కోవిడ్ నుంచి కొలుకున్నారు. 543 మంది మరణించారు. రోజు సుమారు వెయ్యి కొత్త కేసులు నమోదు అవుతుండటం విశేషం.

దేశంలో విమానాలు, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఓ తేదీని నిర్ణయించలేదు. నిజం చెప్పాలంటే ఇందుకు కొంత సమయం పడుతుందనేది స్పష్టమవుతుంది. ప్రజా రవాణా పునరుద్ధరణ అంటే, లాక్ డౌన్ పూర్తిగా తొలగినట్టుగా భావించవచ్చు. ఎయిర్ ఇండియా మే 4 నుంచి దేశవాళీ సర్వీసులకు, జూన్ 1 నుంచి విదేశీ సర్వీసులను టికెట్ల బుకింగ్ ను ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కేంద్రం నిర్ణయం ప్రకటించే వరకూ ఎటువంటి బుకింగ్స్ నిర్వహించ వద్దని విమానయాన సంస్థలకు సూచించింది.

ఆర్ధిక ఇబ్బందుల్లో మైత్రి మూవీ మేకర్స్


2015 లో ` శ్రీమంతుడు ` చిత్రం తో ఘనంగా ప్రారంభమైన మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం తెలుగు లో ఉన్న అతి పెద్ద నిర్మాణ సంస్థలలో ఒకటి. ఆ క్రమంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి, అగ్ర దర్శకులకి ఈ సంస్థ భారీ అడ్వాన్సులు ఇచ్చి కూర్చుంది. అలాగే వీరి సినిమాలు పలు దశలలో నిర్మాణంలో ఉన్నాయి. వీరి నిర్మాణం లో తయారైన, మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ నటించిన ` ఉప్పెన ` చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది . మైత్రి మూవీస్ ఈ చిత్రంపై 22 కోట్లకి పైగా పెట్టుబడి పెట్టడంతో పాటు సినిమా మీద నమ్మకం తో స్వయంగా విడుదల చేసుకుందాం అనుకొంది. కానీ సడన్ గా కరోనా లాక్ డౌన్ రావడం వల్ల వడ్డీ భారం పెరుగుతోంది.

అదలా ఉంటే బన్నీ నటిస్తున్న “పుష్ప” సినిమాపై ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేసారు. అలాగే ప్రభాస్ కి, మహేష్ బాబు కి చెరో ఇరవై కోట్ల వరకు అడ్వాన్స్ ఇచ్చారని తెలుస్తోంది. అలా మైత్రి మూవీ మేకర్స్ వారి డబ్బు మొత్తం లాక్ అయిపోయి వున్న సమయం లో ఈ ప్రాజెక్టులు ముందుకి కదలకపోతే వడ్డీ భారం మరింతగా పెరుగుతూ పోతుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబో లో మూవీ ఒకటి ఖాయం చేసుకుని ఉన్నారు. ఆ లెక్కన మైత్రి మూవీస్ వారికి కనీసం వంద కోట్ల వరకు రికవరీ అవ్వాలి. దరిమిలా మైత్రి మూవీస్ వారు ఆర్ధిక ఇబ్బందుల్లో ఈదుతున్నారు .