Home Blog Page 8526

జైలులో పెరోల్ వద్దంటున్న చిన్నమ్మ శశికళ


మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి, చిన్నమ్మగా పిలువబడే శశికళ బెయిల్ పై బయటకు పంపడానికి అధికారులు సిద్ధంగా ఉన్నా, ఆమె మాత్రం జైలులోనే ఉంటానని అంటున్నట్లు చెబుతున్నారు. తమిళ రాజకీయాలలో చక్రం తిప్పడం కోసం మొదట్లో బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కోర్టులు అంగీకరించలేదు.

కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా ఖైదీలను ఉదారంగా బెయిల్ పై బయటకు పంపుతున్నారు. కానీ ఆమె జైలు లోపలనే తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకొంటూ గడపడానికి ఇష్ట పడుతున్నారు. బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఆమె ప్రస్తుతం వదినమ్మ ఇలవరసి, అబ్బాయి సుధాకరన్‌ లతో కలసి ఉండడం తెలిసిందే.

కరోనా కలవరం రెట్టింపు కావడంతో జైలులో మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఆమెను పేరోలపై బయటకు తీసుకు రావడానికి మక్కల్‌ మున్నేట్ర కళగం పార్టీ వర్గాలు ప్రయత్నం చేసినా ఆమె తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితులలో ఆమె ఉంటున్న జైలు నుంచి 1,112 మంది ఖైదీలు తాత్కాలిక బెయిల్, పెరోల్‌ మీద వెళ్లడంతో జైలులో దాదాపుగా అనేక గదులు, పరిసరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

భోజనం కోసం బారులు తీరాల్సిన పరిస్థితి లేని దృష్ట్యా, తమకు కావాల్సింది తెచ్చుకుని ఆరగిస్తున్నారట. చిన్నమ్మ ఉన్న గదిలో అయితే ఇదివరకు ముగ్గురు ఉండేవారు. వారిలో ఒకరు పెరోల్‌ మీద బయటకు వెళ్లడంతో ప్రస్తుతం శశికళ, ఇలవరసి మాత్రమే ఉంటున్నారు. ఆమె జైలు నుండి బైటకు రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు బైటకు వచ్చినా రాజకీయంగా తమిళనాడులో చేయగలిగింది ఏమీ ఉండదు. ఇప్పట్లో ఎన్నికలు అంటూ కూడా ఏమీ లేవు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఎటువంటి ప్రభావం చూపలేదు. బైటకు వచ్చిన కాలం మేరకు అదనంగా శిక్ష పూర్తి అయ్యేందుకు జైలులో గడపవలసి వస్తుంది.

వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగవలసి ఉన్నాయి. ఆ లోపుగా శిక్షాకాలం పూర్తిచేసుకొని బైటకు వస్తే ఎన్నికలలో ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదే `సత్ప్రవర్తన’ పేరుతో శిక్షాకాలం పూర్తి చేసుకొని ముందుగా జైలు నుండి బైటకు రావడానికి కర్ణాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ప్రయత్నం చేశారు. కానీ అంతలో ఆ ప్రభుత్వం అస్థిరత్వానికి గురికావడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.

కేరళ లాక్‌డౌన్‌ సడలింపుపై కేంద్రం ఆగ్రహం


కేంద్రం ఆదేశాలను పట్టించుకోకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ను సడలించడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ ను సడలిస్తూ కేరళ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై కేంద్రం సీరియస్ అయింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్లు, బుక్‌ షాపులు తెరవడం, కొన్ని పట్టణాల మధ్య బస్సు సర్వీసులు నడపడం, కార్లలో వెనుక సీట్లలో ఇద్దరితో ప్రయాణానికి అనుమతినివ్వడం వంటి సడలింపులను తప్పుబట్టింది. తక్షణమే వీటిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు కేంద్రం రూపొందించిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి కేరళ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏప్రిల్‌ 15,2020న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆ లేఖలో తప్పుబట్టారు.

విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం జారీ చేసిన నిబంధనలను పాటించకుండా కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా వివిధ కార్యకలాపాల నిర్వహణకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం పట్ల పినరయి విజయన్‌ ప్రభుత్వాన్ని కేంద్రం నిలదీసింది.

అయితే కేంద్ర విమర్శలను కేరళ ప్రభుత్వం తిప్పికోట్టింది. మార్గదర్శకాల ప్రకారమే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించామని కేరళ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. అపార్థాలు చోటుచేసుకున్నందు వల్లే ఇలా జరిగిందని చెప్పారు.

కేంద్రం కోరిన వివరణను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. వివరణ ఇచ్చిన తర్వాత సమస్య సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర నిబంధనలనే మేం కచ్చితంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

కాగా లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో కరోనా తీవ్రత ఆధారంగా రాష్ట్రంలోని జిల్లాలను రెడ్‌, ఆరెంజ్ ఏ, ఆరెంజ్‌ బీ, గ్రీన్‌ జోన్లుగా విభజిస్తూ అక్కడ పాటించాల్సిన నిబంధనలపై కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.

కాసర్‌గడ్‌, కన్నూరు, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాలను రెడ్‌ జోన్‌… పతనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం జిల్లాలను ఆరెంజ్‌ ఏ జోన్‌… ఆరెంజ్‌ బీ జోన్‌లోని అలప్పుజ, తిరువనంతపురం, పాలక్కాడ్‌, వయనాడ్‌, త్రిసూర్ జిల్లాలు… కొట్టాయం, ఇడుక్కి జిల్లాలను గ్రీన్‌ జోన్‌ కింద పరిగణిస్తూ కొన్ని రంగాలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చింది.

టోల్ గేట్ చార్జీల మోత!


లాక్ డౌన్ తో కుదేలైన ప్రజలపై కేంద్రం టోల్ పీజులు పెంచి మరింత భారం మోపింది. టోల్ పీజుల వసూళ్లు కొన్నాళ్ళు వాయిదా వేయాలని లారీ యజమానుల సంఘము కొడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా టోల్ ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా ఏ వాహనానికి ఎంతమేరే చార్జీలు పెంచారనే విషయం పరిశీలిస్తే… లైట్ మోటార్, కమర్షియల్ వాహనాలపై రూ.5, బస్సు, ట్రక్ లకు రూ.10, భారీ వాహనాలకు రూ.20 చొప్పున పెంపు నేటి అర్ధరాత్రి నుంచి పెంచిన టోల్ గేట్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ హై వే అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) అధికారి విద్యాసాగర్ తెలిపారు.

ప్రతి ఏడాది ఏప్రిల్ 1నే టోల్ ఛార్జీలు పెంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ‘కరోనా’ కారణంగా ఈ ఏడాది టోల్ ఛార్జీల పెంపులో జాప్యం జరిగిందని నేషనల్ హై వే అథారిటీస్ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) అధికారి విద్యాసాగర్ తెలిపారు. లాక్ డౌన్ లో భాగంగా రేపటి నుంచి కొన్ని సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలను అనుమతిస్తామని చెప్పారు.

ప్రస్తుతానికి సరుకు రవాణా వాహనాలు మినహా ఇతర ప్రజా రవాణా వాహనాలకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. వ్యక్తిగత వాహనాలకు స్థానికంగా తప్పితే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతి లేదు. రెండవ విడత లాక్ డౌన్ మే 3వ తేదీతో ముగుస్తున్నప్పటికీ మరికొన్ని రోజులు ప్రజా రవాణాపై ఆంక్షలు కొనసాగించాలనే కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల దాష్టికానికి యువకుడు మృతి!


లాక్ డౌన్ సందర్భంగా ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసేందుకు పోలీసులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సరైన కారణం లేకుండా ఇళ్ల నుంచి రోడ్లపైకి వచ్చే వారిని నివారించేందుకు కొన్ని చోట్ల బతిమాలి చెబుతుంటే మరికొన్ని చోట్ల సున్నితంగా మండలిస్తున్నారు. కొన్నిచోట్ల కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారు. కర్నూలలో కాల్లుపట్టుకుని బతిమాలడం అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా సత్తెనపల్లి పట్టణంలో జరిగిన సంఘటన వాటన్నింటికి విరుద్ధంగా ఉంది. పోలీస్ దెబ్బలకు యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే వెంకటపతి కాలనీ కి చెందిన మొహమ్మద్ గౌస్ (28) ఈ రోజు ఉదయం 8 :40 నిమిషాలకు
మందుల కోసం వెళ్లి వస్తుండగా ఘటన చెక్ పోస్టు వద్ద పోలీసులు అతనిని అడ్డుకుని ప్రశ్నించారు. అతను చెపుతున్న సమాధానం వినకుండా లాఠీతో కొట్టడంతో మొహమ్మద్ గౌస్ అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయాడు. దీంతో గౌస్ ను పోలీస్ వాహనం లో హాస్పిటల్ కు తరలించగా చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చనిపోయిన మొహమ్మద్ గౌస్ కు పెళ్లి అయినదని, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రికి చేరుకున్న గౌస్ బంధువులు ఆందోళనకు దిగారు.

కష్టకాలం.. సొంత నిర్ణయాలు వద్దు:కేంద్రం

నేటి నుంచి రెస్టారెంట్లకు, బస్సు సర్వీసులకు అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా హోం శాఖ కార్యదర్శి లేఖ రాశారు. అత్యవసరం కాని సేవలకు అనుమతివ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

దేశ వ్యాప్తంగా ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్ డౌన్ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలు తప్పక పాటించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. లాక్‌ డౌన్‌ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం సరికాదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ ద్వారా తెలిపారు. అత్యవసరం కాని సేవలు, కార్యకలాపాలకు పలు రాష్ట్రాలు అనుమతిస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు. దేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేటి నుంచి లాక్ డౌన్ లో కొన్ని సేవలకు సడలింపు ఇచ్చిందన్నారు.

దేశమంతా విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు పాటించాలని ఆదేశించిన కేంద్ర హోంశాఖ.. రాష్ట్రాలు అనుసరించాల్సిన వైఖరిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేసింది. ఎవరికి వారి నిర్ణయాల వల్ల దేశమంతా నష్టపోయే పరిస్థితి రాకూడదని హెచ్చరించింది.

విజయసాయిరెడ్డి బీజేపీ అధికార ప్రతినిధిగా మారారా!


వైసిపిలో ప్రధాన అధికార కేంద్రానికి దూరంగా నెట్టివేయబడినప్పటి నుండి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో తానే `నిజమైన బాస్’ అని నిరూపించుకోవడం కోసం వైసిపి ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి ఎన్నో తిప్పలు పడుతున్నట్లు కనిపిస్తున్నది.

నిత్యం రెచ్చగొట్టే మీడియా ప్రకటనల ద్వారా తన రాజకీయ ఉనికి కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని సొంతపార్టీ వారే పలువురు భావిస్తున్నారు. తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ జాతీయ నాయకత్వం విధానాలకు భిన్నంగా మాట్లాడుతున్నారని అంటూ విజయసాయిరెడ్డి ప్రకటించడం చాలామందికి విస్మయం కలిగించింది.

బిజెపి జాతీయ నాయకత్వం విధానాల గురించి మాట్లాడానికి ఆయన ఏమైనా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో లోటుపాట్లను నిత్యం ఎత్తిచూపుతూ, అర్ధవంతంగా కన్నా చేస్తున్న విమర్శలు వైసిపి నాయకత్వాన్ని ఇరకాటంలో పడవేస్తుండడం అందరికి తెలిసిందే.

అందుకని ఇప్పటి వరకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకొని నిత్యం విమర్శలు గుప్పించే విజయసాయిరెడ్డి ఇప్పుడు కన్నాను చేసుకున్నట్లు కనిపిస్తున్నది. పైగా, విజయసాయిరెడ్డి విమర్శలను చంద్రబాబు అసలు పట్టించుకొనక పోవడంతో, ప్రజలు కూడా సీరియస్ గా తీసుకోవడం లేదని గ్రహించినట్లున్నారు.

అందుకనే ఇప్పుడు కన్నా వైపు దృష్టి సారించినట్లున్నారు. పైగా, చంద్రబాబు చేసే విమర్శల కన్నా కన్నా చేస్తున్న విమర్శలే సూటిగా, పదునుగా అధికార పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.

1990వ దశకం నుండి చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేస్తూ వస్తున్న కన్నాను టిడిపి వాళ్లంతా ఒక విధంగా `ద్వేషిస్తారు’ అని చెప్పవచ్చు. కానీ జగన్ పాలనపై చేస్తున్న విమర్శలను మాత్రం వారంతా ప్రశంశింపకుండా ఉండలేకపోతున్నారు. చంద్రబాబు కన్నా పదునుగా జగన్ ను నిలదీస్తున్నారని కూడా భావిస్తున్నారు.

అందుకనే కన్నా విమర్శలు వైసిపి నేతలకు ఆత్మరక్షణలో పడవేస్తున్నాయి. సూటిగా సమాధానం చెప్పలేక పోతున్నారు.

విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, అధికారుల వద్ద మంచి సాన్నిహిత్యం పెంచుకొంటూ, వారెవ్వరూ రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలపై చర్య తీసుకోకుండా కాపాడుకొనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలోని బిజెపి నాయకులకన్నా ఆయనకే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం వద్ద ఎక్కువ పలుకుబడి ఉన్నదనే ప్రచారం ఉంది.

అదే విధంగా రాష్ట్రంలోని పలువురు బిజెపి నాయకులు సహితం జగన్ పై పెదవి విప్పకుండా `మానేజ్’ చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతున్నది. జివిఎల్ నరసింహ రావు, సునీల్ దేవధర్ వంటి పలువురు బిజెపి నేతలను విజయసాయిరెడ్డి ప్రభావితులను చేశారనే కధనాలు వెలువడుతున్నాయి.

అదే తరహాలో కన్నాను కూడా `వశపరచు’ కొనే ప్రయత్నం చేసి విఫలమైన్నట్లున్నది. అందుకనే ఇప్పుడు కన్నాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. పైనా కన్నా చంద్రబాబుకు అమ్ముడు పోయి, పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడుతున్నారని అంటూ కూడా ఆరోపించారు.

చంద్రబాబుకు రూ.20 కోట్లకు కన్నా అమ్ముడుపోయారు. వారిద్దరికీ మధ్య బ్రోకర్‌ సుజనా చౌదరే అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కన్నా లేవనెత్తే విమర్శలకు సమాధానాలు చెప్పలేక, నిస్పృహతో ఇటువంటి ఆరోపణలను విజయసాయిరెడ్డి దిగుతున్నారని కొందరు వైసిపి నేతలు సహితం భావిస్తున్నారు.

కేంద్రం రిటైలర్ల వత్తిడులకు లొంగిందా!


లాక్‌డౌన్‌ నుంచి అత్యవసరం కాని వస్తువుల విక్రయాలకు వెసులుబాటు లభించిందనుకున్న ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం అకస్మాత్తుగా గా కళ్లెం వేయడంతో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థలు ఖంగుతిన్నాయి.

పప్పుదినుసులు తదితర ఆహారోత్పత్తులు, ఔషధాలు, వైద్య పరికరాలు వంటి అత్యవసరాల సేవలు మినహా మిగతా వాటిని ఆపేయాలని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ మొదలగు ఆన్‌లైన్‌ సంస్థలను తాజాగా ఆదేశించడంతో విస్మయం చెందుతున్నారు.

ఈ నెల 20 నుంచి మొబైల్‌ ఫోన్లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్లు, వాషింగ్‌ మెషీన్లు, రెడిమేడ్‌ దుస్తులు తదితర అత్యవసరం కానీ వస్తువుల అమ్మకం కూడా ఈ-కామర్స్‌ సంస్థలు జరుపవచ్చని 15వ తేదీన కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఆన్‌లైన్‌ సంస్థలన్నీ కస్టమర్ల నుంచి ఆర్డర్లు కూడా తీసేసుకున్నాయి.

ఈ క్రమంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆదివారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అకస్మాత్తుగా ప్రకటించారు. ఈ-కామర్స్‌ సంస్థలు వినియోగించే వాహనాలు.. అవసరమైన అనుమతులతో మాత్రమే నడుస్తాయని తాజా ఆదేశంలో ఆయన స్పష్టం చేశారు.

కరోనా తీవ్రతతో నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తున్నదని హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాత్సవ చెప్పినా ఈ నిర్ణయం వెనుక రిటైలర్ల వత్తిడులు కారణమని తెలుస్తున్నది. ఆన్‌లైన్‌ మార్కెట్‌ జోరందుకున్న దగ్గర్నుంచి సంప్రదాయ రిటైల్‌ మార్కెట్‌ కళ తప్పుతూ ఉండడం తెలిసిందే. ఈ-కామర్స్‌ సంస్థలు ఇస్తున్న ఆఫర్లు.. రిటైలర్ల వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలకు మొబైల్‌ ఫోన్స్‌, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు తదితర అత్యవసరం కానీ వస్తువుల అమ్మకాలకు అనుమతి ఇవ్వొద్దని, కేంద్రంపై రిటైలర్లు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తున్నది. వారిని అనుమతిస్తే.. తమ షాపులూ తెరుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని స్థానికి వ్యాపారులు డిమాండ్‌ చేసినట్లు చెబుతున్నారు.

ఈ-కామర్స్‌ సంస్థల ద్వారా అత్యవసరం కాని ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించడం అటు వినియోగదారులను, ఇటు చిరు వ్యాపారులను నిరాశపరిచిందని అమెజాన్ విచారం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం తయారీదారులనూ నిరాశకు గురిచేసిందని పేర్కొన్నది.

అయితే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాల ఈ నిర్ణయాన్ని అఖిలభారత వర్తకుల సంఘం స్వాగతించింది. దేశీయ వర్తకుల మనోభావాలకు విలువనిచ్చారని, సంప్రదాయ వ్యాపారుల ప్రయోజనాలను రక్షించారని కొనియాడారు.

బన్నీ సినిమాలో బాబీ సింహ


కరోనా ఎఫెక్ట్ తో చాలా సినిమాల అంచనాలు తారుమారు అవుతున్నాయి ముఖ్యగా నటీనటుల కాల్ షీట్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఏర్పడు తున్నాయి. ఆ క్రమంలో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ‘పుష్ప’ కూడా ప్రాబ్లమ్స్ పేస్ చేస్తోంది. నిజానికి `పుష్ప` సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈపాటికే స్టార్ట్ కావాలి . కానీ ఈ సినిమాలో నటించాల్సిన విజయ్ సేతుపతి కాల్ షీట్స్ విషయం లో చిన్న మెలిక పెట్టాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ” పుష్ప ” చిత్రంలో నేను ఖచ్చితంగా విలన్ పాత్రలో నటిస్తాను గాని ఈ సినిమా తమిళ వెర్షన్ లో మాత్రం నేను విలన్ గా ఉండను. నాకు తమిళ నాట ఉన్న హీరో ఫాలోయింగ్ కి ప్రోబ్లం వస్తుంది అని చెప్పాడట ..దాంతో సుకుమార్ టీం వేరే నటుడి కోసం అన్వేషణ మొదలెట్టారు .

ఆ క్రమంలో ` భైరవ గీత ` ఫేమ్ కన్నడ నటుడు ధనంజయను విజయ్ సేతుపతి స్తానం లో తీసుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ధనంజయను సంప్రదించింది విలన్ విజయ్ సేతుపతి కి ప్రత్యమ్నాయం గా కాదు. సినిమాలో మరో ముఖ్య పాత్రకు…దర్శకుడు సుకుమార్ మెయిన్ విలన్ పాత్రకు విజయ్ సేతుపతి స్థానంలో బాబీ సింహా లేదా అరవింద్ స్వామిని తీసుకోవాలని అనుకొంటున్నాడు. కానీ అరవింద్ స్వామి బిజీ ఆర్టిస్టే కావడం తో పారితోషకం చాలా ఎక్కువ అడుగు తున్నాడట..ఆ క్రమంలో దర్శకుడు సుకుమార్ బాబీ సింహా వైపే మొగ్గు చూపుతున్నాడు. బాబీ సింహ టాలెంట్ ఏమిటో ‘జిగర్ తాండా ` సినిమాలో సుకుమార్ చూసి ఉండటం తో మెయిన్ విలన్ పాత్ర అతనికే ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. పుట్టుకతో తెలుగు వాడైన బాబీ సింహ ‘పుష్ప’లో నటించడానికి అమితాసక్తితో ఉన్నాడట .పైగా . పారితోషకం గురించి అసలు పట్టించుకోవం లేదని, ఎన్ని కాల్ షీట్స్ కావాలంటే అన్ని ఇవ్వడానికి కూడా రెడీ అని..అంటున్నాడట …జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు తీసుకొన్న బాబీ సింహ మొత్తానికి మాతృ భాషలో మంచి ఛాన్స్ దక్కించు కొన్నాడు.

పవన్ కళ్యాణ్ కి ఎనిమిది రోజులు చాలు

pawan


కరోనా ప్రభావం తో ఎన్నో సినిమాలు లాస్ట్ షెడ్యూల్ లో ఆగిపోయాయి అలాంటి సినిమాల్లో .పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కూడా ఉంది . నిజానికి ఈ చిత్రం ఈపాటికి షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లాల్సింది. అలాగే ఈ సినిమా మే 15న రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించడం కూడా జరిగింది.

షూటింగ్ అంతా సజావుగా సాగిపోతుండగా కరోనా మహమ్మారి వచ్చి అడ్డు పడింది. దీంతో దిల్ రాజు చిత్ర బృందం సైలెంటుగా ఉండిపోయింది ఇపుడు పరిస్థితి చూస్తే .మేలో అసలు థియేటర్లు తెరుచుకునే ప్రసక్తే లేదు. దానికి తోడు వకీల్ సాబ్’ షూటింగ్ కూడా ఇంకా పెండింగ్ ఉంది. కాబట్టి ‘వకీల్ సాబ్’ ఇప్పుడిప్పుడే రిలీజయ్యేలా అనిపించడం లేదు.

దరిమిలా ‘వకీల్ సాబ్’ దసరాకు వాయిదా పడ్డట్లు వార్త లొచ్చాయి .ఐతే దిల్ రాజు ఆలోచన వేరే విధంగా ఉంది. జూన్ నెలాఖరు వరకు థియేటర్లు మూతపడే ఉన్నట్టయితే ఆగస్టు 15కు ‘వకీల్ సాబ్’ను రెడీ చేయాలని దిల్ రాజు అనుకొంటున్నాడట.. మే లేదా జూన్ లో షూటింగులు స్టార్ట్ అయితే పెండింగ్ లో ఉన్న `వకీల్ సాబ్’ మిగతా భాగం యొక్క షూటింగ్ పూర్తి చేయాలను కొంటున్నాడు .

ఆ లెక్కన పవన్ కళ్యాణ్ కేవలం 8 రోజుల డేట్లు కేటాయిస్తే చాలు..సినిమా లో ఆయన పార్ట్ ఫినిష్ అవుతుంది .ఇక మిగతా నటీనటులతో ముడిపడ్డ ప్యాచ్ వర్క్ కూడా వేగంగా పూర్తి చేసి. స్వాతంత్ర దినోత్సవ కానుకగా `వకీల్ సాబ్’ సినిమాను రిలీజ్ చేద్దామని దిల్ రాజు ఆలోచిస్తున్నట్టు తెలిసింది .
Also Read: లోకేష్ కు సైకిల్ ఎక్కాలని ఆశ!

తీరని కరోనా దాహం…ఆగని మారణహోమం!

ప్రపంచవ్యాప్తంగా గంట గంటకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి కోవిద్19 మృతుల సంఖ్య ఆగడం లేదు. ఇప్పటికే 193 దేశాలలో కరోనా విజృంభిస్తోంది.ఏ దేశంలో చూసిన కరోనా మారణహోమం ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వ్యాధితో దాదాపు 24 లక్షల మంది పోరాడుతున్నారు. వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,65,00 చేరింది.

అమెరికాలో ఏడున్నర లక్షల మందిని వేధిస్తున్న వైరస్. 40వేల మందిని పొట్టన పెట్టుకుంది. ఈ దేశం 38 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. భారతదేశంలో కూడా కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు 3,83,985 మంది నుంచి తీసుకున్న 4,01,586 రక్త నమూనాలను పరీక్షించామని, 17,615 మందికి పాజిటివ్ అని , 500 పైగా ప్రజలు కోవిడ్ వ్యాధితో చనిపోయారని వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. తెలంగాణలో 809, ఏపీలో 603 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటివరకు రెండు రాష్ట్రాల్లో కలిపి 34 మంది చనిపోయారు.

అంతేకాకుండా కరోనా వైరస్‌ 193 దేశాల్లో మృత్యు ఘంటికలను అధికం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 23,86,329 మంది ఈ మహమ్మారి బారినపడగా.. ఆదివారం నాటికి 1,63,928 మంది చనిపోయారు. అమెరికాలో బాధితులు 7,54,563 మంది కాగా.. మరణాల సంఖ్య 39,863కి చేరింది. ఇటలీలో 24 గంటల్లో 433 మరణాలు సంభవించాయి. వారం రోజుల్లో ఇన్ని తక్కువ మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. స్పెయిన్‌లో మార్చి 22 నుంచి చూస్తే.. అతి తక్కువగా 410 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో ఆదివారం   395 మరణాలు సంభవించాయి. బ్రిటన్‌లో 1,14,217 మందికి వైరస్‌ సోకగా.. 15,464 మంది ప్రాణాలు విడిచారు. హాంకాంగ్‌, మకావుతో కలిపి తమ దేశంలో 2,735 కేసులు నమోదైతే 4,632 మంది మృతి చెందినట్టు చైనా వెల్లడించింది. బెల్జియంలో  5,453 మంది మరణిస్తే.. వారిలో 2,772 మంది రిటైర్మెంట్‌ హోముల్లో ఉంటున్నవారే. రష్యాలో 24 గంటల్లో 48 మంది చనిపోయారు. ఆదివారం రికార్డు స్థాయిలో 6,060 కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్‌లో 24 గంటల్లో 514 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో సంఖ్య 7,993కి చేరింది. 159 మంది మరణించారు.

కేంద్రం సడలింపు.. రాష్ర్రం బిగింపు!

Kcr

దేశంలో కరోనా భయంతో అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య లాక్ డౌన్ ను అమలుపరుస్తున్నారు. మొదటి దశగా 21 రోజుల లాక్ డౌన్ ను అమలుపరచగా.. రెండో దశలో మరో 19 రోజులు పొడిగించారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు(ఏప్రిల్ 20) నుండి కరోనావైరస్‌ వ్యాప్తి ఉదృతం(హాట్‌ స్పాట్‌)గా లేని ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు (మే 7 వరకు) పొడిగిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:మోడీ నిర్ణయాలకు కేసీఆర్ గుడ్ బై?

తెలంగాణలో ఏప్రిల్‌ 20 తర్వాత ఎలాంటి సడలింపులు ఉండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. వచ్చే నెల ఏడో తేదీ వరకు లాక్‌ డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూలను పొడిగిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలే యథాతథంగా ఉంటాయన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మే 5న మరోసారి పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. కిరాణా దుకాణాలు, కూరగాయల షాపులు తెరిచి ఉంటాయన్నారు. బియ్యం, నూనె మిల్లులు కొనసాగుతాయని, శానిటైజర్ల తయారీ, ఫార్మా కంపెనీలు పనిచేస్తాయన్నారు. కరోనాకు మందులు, టీకాలు, నియంత్రించే ఔషధాలు లేవు, కాబట్టి ఉపశమన చర్యలు తప్పవని అందుకే కేంద్రం సడలింపు ఇచ్చినా తెలంగాణాలో మాత్రం ఆంక్షలు యథావిథిగా కొనసాగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

Raashi Khanna Latest Pictures

కరోనాపై మంచు మ‌నోజ్ పాట.. వైరల్


హీరో మంచు మ‌నోజ్ ఒక పాట పాడారు. ప్ర‌స్తుతం స‌మాజంలో క‌రోనా వైర‌స్‌ క‌రాళ నృత్యం చేస్తున్న సంక్షోభ కాలంలో ఆ మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేస్తున్న కృషిని శ్లాఘిస్తూ.. వైద్య సిబ్బంది, పోలీసులు, రైతులు, పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా ప్ర‌జ‌ల కోసం పాటు ప‌డుతున్న తీరును ప్ర‌శంసిస్తూ.. పౌరులుగా మ‌న బాధ్య‌త‌ను గుర్తు చేస్తూ.. మ‌నం బాగుంటామ‌నే ఆశ‌ను ప్ర‌క‌టిస్తూ ‘అంతా బాగుంటంరా’ అని పాడారు. పాట చివ‌ర‌లో ఆయ‌న‌తో పాటు మంచు ల‌క్ష్మి కుమార్తె విద్వా నిర్వాణ మంచు ఆనంద్‌ కూడా గ‌ళం క‌ల‌ప‌డం విశేషం.

ఈ పాట‌ను ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు తెలంగాణ ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ సోష‌ల్ మీడియా ఎకౌంట్ ద్వారా ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా “ఈ చీకటి ఇలాగే ఉండిపోదని, మళ్ళా వెలుగు వస్తుందని, గొప్ప ఆత్మ స్థైర్యం ఇచ్చే గీతం” అంటూ ఆయ‌న ప్ర‌శంసించారు. “హీరో మ‌నోజ్ పాడిన ఈ ఉత్సాహ‌భ‌రిత‌మైన పాట మ‌న హృదయాలను ఆశతో, సానుకూలతతో నింపుతుంది. కుదోస్” అని కొనియాడారు.

‘అంతా బాగుంటంరా’ పాట‌ను ఆవిష్క‌రించినందుకు కేటీఆర్‌కు మ‌నోజ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. “ఇది చాలా హృదయాలలో కొంత సానుకూల ఆశను నింపుతుందని మేము నమ్ముతున్నాం” అని ఆయ‌న ట్వీట్ చేసి, కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు.

Priya Singh Glamorous Pics

Mannara Chopra Latest Pictures

Anusha Dandekar Hot Photos

నిలోఫర్ లో క్వారంటైన్‌కు 200 మంది సిబ్బంది


హైదరాబాద్ లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణలో తాజాగా నమోదవుతున్న కేసులలో మూడొంతులు నగరంలోనే ఉంటున్నాయి.

ఒక వంక రాష్ట్రంలో కేసుల సంఖ్యా 800 ను మించి పోగా, నగరంలో పేరొందిన ని నీలోఫర్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న 200 మంది సిబ్బందిని క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆదేశాలు జారీ చేయడం కలకలం రేపుతున్నది.

దేశం మొత్తంలో ఒక ఆసుపత్రిలో ఇంతమంది సిబ్బందిని ఒకేసారి క్వారంటైన్‌కు పంపిన దాఖలాలు లేవని చెప్పాలి. ఆసుపత్రిలో చికిత్స పొందిన 45 రోజుల బాలుడికి కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈనెల 15, 16, 17 తేదీల్లో ఆసుపత్రిలో విధులు నిర్వహించిన ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ఫ్రొఫెసర్లు, నర్సులు, ఇతర సిబ్బంది అందరిని క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.

నారాయణపేట్‌ జిల్లా అభంగాపూర్‌కు చెందిన మహిళ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో బిడ్డను ప్రసవించింది. డిశ్చార్జి అయ్యాక నలభై ఐదు రోజుల వయసున్న చిన్నారికి జ్వరంరావడంతో అతని తండ్రి స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు.

ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆ బాలుడిని నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చిన్నారి నుంచి సేకరించి శాంపిల్స్‌తో కరోనా పాజిటివ్‌ అని తేలడంతో సూపరింటెండెంట్‌ ఈ ఆదేశాలు జారీచేశారు. అలాగే చిన్నారి కుటుంబ సభ్యులు ఆరుగురిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.