
కరోనా వైరస్, లాక్ డౌన్ నేపధ్యంలో అధికార, విపక్షాల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. మెడ్ టెక్ జోన్ పైన విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ పుట్టినరోజు వేడుకలు సోమవారం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి’ అంటూ జగన్ ట్వీట్ చేశారు. సీఎం ట్వీట్కు స్పందించిన చంద్రబాబు, జగన్ కు ధన్యవాదాలు తేలిపారు.