చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ మహమ్మరి దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం 21రోజుల లాక్డౌన్ అమలు చేసింది. ఏప్రిల్ 14తో లాక్డౌన్ గడువు ముగిస్తుందనగా లాక్డౌన్ మే 3వరకు పొడగిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఏప్రిల్ 20తర్వాత కొన్నిరంగాలకు మినహాయింపులు ఉంటాయని చెప్పారు. కేంద్రం చెప్పినట్లుగా కొన్ని రంగాలకు లాక్డౌన్ పీరియాడ్లో మినహాయింపులిచ్చారు. భారత్ వ్యవసాయ రంగం దేశమయినందునా వ్యవసాయాధారిత పరిశ్రమలకు కొన్ని షరతులతో కూడిన మినహాయింపులిచ్చారు. దీనివల్ల రానున్న రోజుల్లో దేశంలో నిత్యావసర సరుకులు లోటు రాకుండా ప్రధాని మోదీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పరిస్థితి మరోవిధంగా ఉండటంతో శోచనీయంగా మారింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 21మంది మృతిచెందగా 186మంది కోలుకున్నారు. ప్రస్తుతం 651యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగేందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమైందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కరోనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా లైట్ తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ కరోనా వైరస్ తెలంగాణ వాతావరణంలో బ్రతికే ఆస్కారం లేదని, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండదని చెప్పుకొచ్చారు. అంతేకాదు పారాసిటామాల్ గోలి వేసుకుంటే తక్కువైపోతుందని తనకు ఓ సైంటిస్టు చెప్పినట్లు చెప్పారు. తొలుత నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కరోనా కట్టడికి పకడ్బంధీ చర్యలు తీసుకుంది. కరోనా సృష్టించే విలయతాండవాన్ని ముందే గ్రహించిన కేసీఆర్ కేంద్రం కంటే ముందుగానే రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేశారు. దీని వల్ల రాష్ట్రంలో కరోనా కేసులు కొంత తగ్గుముఖంగా పట్టినట్లు కన్పించాయి.
దేశంలో కరోనా కేసులకుు మర్కజ్ ప్రార్థనలకు లింకు ఉండటంతో కేంద్రం ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నట్లు సమాచారం ఇవ్వడంతో ఆయా ప్రభుత్వాలు అలర్టయ్యాయి. ముస్లింలు ఎక్కువగా ఉంటే హైదరాబాద్, పాతబస్తీ ఏరియాల్లో మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిని ప్రభుత్వం సరిగా గుర్తించలేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగట్టుగానే రాష్ట్రంలో నమోదవుతున్న ఎక్కువ కేసుల్లో హైదరాబాద్ ప్రాంతం తొలిస్థానంలో నిలిచింది. సగానికి పైగా కేసులు హైదరాబాద్ ప్రాంతానివే కావడం గమనార్హం.
తెలంగాణలో ముస్లింలను ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో భాగంగా సీఎం కేసీఆర్ వారి విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించాలని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో కరోనా కేసులు కట్టడి చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా కరోనాతో తెలంగాణలో చావులకు కారణమవుతున్నారని మండిపడుతున్నారు.
తాజాగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్డౌన్ మే 7వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై పలువర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీఎం చెప్పే మాటలకు.. చేతలకు పొంతన లేకుండా పోతుందని ఎద్దేవా చేస్తున్నారు. కరోనాపై అందరికంటే ముందే మెల్కొన్న తెలంగాణ ప్రభుత్వం కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోయిందని ప్రశ్నించారు. లాక్డౌన్ పేరిట అన్నిరంగాల ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రం సడలించిన రంగాలకు కూడా తెలంగాణలో మినహాయింపు ఇవ్వకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్లు ఏప్రిల్ నెలలో 12కిలోల ఉచిత బియ్యం, రూ.1,500 ఇంకా అందలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రయివేట్ ఉద్యోగులకు కోతలు విధించగా ఉదారతతో జీతాలు ఇవ్వాలని చెబుతున్న ప్రభుత్వం తాను మాత్రం ఉద్యోగుల జీతాల్లో 50శాతం కోత విధిస్తోంది. దీంతోపాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులను విడుదల చేస్తుంది. ఈమేరకు 20ఏళ్లుగా ఉద్యానవన శాఖలో పనిచేస్తున్న 200మంది ఉద్యోగులను తీసేస్తున్నట్లు ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఓ వైపు ధనిక రాష్ట్రమని చెప్పుకోనే కేసీఆర్ కేవలం నెలరోజుల లాక్డౌన్లో ఉద్యోగుల జీతాలకు సగమేర కోతలు విధించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే వైద్య సిబ్బందికి సరిపడా కిట్లు సకాలంలో అందించకపోవడంతో కరోనా కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. ఎవరైనా మీడియా ప్రతినిధులు కేసీఆర్ ను వీటిపై ప్రశ్నిస్తే వారిపై నానాయాగీ చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. దీంతో మీడియా ప్రతినిధులు కూడా ఆయన్ను ప్రశ్నలు అడిగేందుకు జంకుతున్నారు. కేసీఆర్ చెప్పిందే రాసుకోవడం జర్నలిస్టులకు కేసీఆర్ అలవాటు చేశారు. అలాగే కరోనా టెస్టులను ఎక్కువ సంఖ్యలో చేయకపోవడం కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముస్లిం వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం మహ్మద్ అలీని కనీసం ప్రగతి భవన్లోకి రానీవ్వకుండా పంపించిన ఘటనలు మీడియాలో వచ్చాయి. మర్కజ్ ప్రార్థనలు వెళ్లొచ్చిన ముస్లింలు కొందరు స్వచ్చంధంగా ముందుకొచ్చిన మరికొందరు రాలేదు. వీరిని కాంటాక్టులను పట్టుకోవడంతో ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లనే తెలంగాణలో ఈమేరకు కేసులు సంఖ్య పెరిగిందని తెలుస్తోంది. ఏదిఏమైనా తెలంగాణలో కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండడటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కంట్రోల్లోకి వచ్చిందనేలోపే మరుసటి రోజుకు కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతుంది. కొందరి కరోనా లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వస్తుందటం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో మాత్రం కరోనా మహమ్మరి దోబుచులాట ఆడుతుంది. కేవలం కేసీఆర్ లాక్డౌన్ ఒక్కటే బ్రహ్మస్త్రంగా భావిస్తున్నాయి. దీని వల్ల కరోనా కేసులు కంట్రోల్ అవుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజల ప్రాణాలతోపాటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు చేపట్టే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Kcr failure in corona lockdown implement
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com