
కరోనా లాక్ డౌన్ తో ఇంట్లో కూర్చొని టైం పాస్ గాక ఇబ్బంది పడుతున్న ప్రతిభావంతులకు చక్కటి అవకాశం కల్పిస్తోంది. ‘పీపుల్ మీడియా సోషల్’.. ప్రతిభ కలిగిన లఘు చిత్ర నటీ నటులు,దర్శకులు మరియు సాంకేతిక నిపుణులకు ఇది ఓ మంచి అవకాశం. ఈ లాక్ డౌన్ సమయంలో నూతన దర్శకులను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ` పీపుల్ మీడియా సోషల్ ` వారు లఘు చిత్ర ( short film ) పోటీలను నిర్విహిస్తున్నారు.
ఈ సందర్భంగా ‘పీపుల్ మీడియా సోషల్’ పోస్ట్ చేస్తూ.. “ఈ కష్టకాలంలో ఇంట్లోనే ఉండి, మీ వద్ద ఉన్నసదుపాయాల తోనే ఓ షార్ట్ ఫిల్మ్ చేయండి. ఉత్తేజకరమైన కంటెంట్ మీ దగ్గర ఉంటే వెంటనే షార్ట్ ఫిల్మ్ చేయండి. అలా తీయబడ్డ వాటిలో ఉత్తమ లఘు చిత్రాన్నీ ఎన్నిక చేసి , లక్ష రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది.”. అని ‘పీపుల్ మీడియా సోషల్’ ప్రకటించింది. కాగా షార్ట్ ఫిల్మ్ ను మే 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో సబ్ మిట్ చేయాల్సిందిగా కోరారు.