Home Blog Page 8514

పిల్లో ఛాలెంజ్.. తమన్నా అందాల అరబోత


దేశవ్యాప్తంగా కేంద్రం లాక్డౌన్ విధించడంతో సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో సినిమా సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. లాక్డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు హీరోయిన్లు హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వేసవిని మరింత హిటెక్కిస్తున్నారు. మరికొందరు ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తూ తమ అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు.

టాలీవుడ్లో హీరోహీరోయిన్లు సరికొత్త ఛాలెంజ్ లతో అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. హీరోలంతా ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ ను ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్లో హీరోలు ఇంట్లో మహిళలకు సాయం చేస్తూ మరికొందరినీ నామినేట్ చేస్తుండటంతో ‘ది రియల్ మేన్’ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఈ ఛాలెంజ్ మాదిరిగానే హీరోయిన్లు ‘పిల్లో ఛాలెంజ్’ ను ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. ఈ ఛాలెంజ్లో హీరోయిన్లు కేవలం పిల్లో తన అందాలను కవర్ చేస్తారు. పిల్లో అడ్డుపెట్టుకొని న్యూడ్ గా హీరోయిన్లు దర్శనమిస్తుండటంతో ఈ ఛాలెంజ్ వైరల్ అవుతోంది. మిల్కీ బ్యూటీ పాలరాతి అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం తమన్నా పిల్లో పిక్స్ వైరల్ అవుతున్నారు. నిన్నటి దాకా పాయల్ అందాలకు ఫిదా అయిన అభిమానులు తాజాగా తమన్నా అందాలకు ముగ్ధులవుతున్నారు. ఇక రేపు ఏ అమ్మడు పిల్లో చాటున అందాలను ఆరబోస్తుందా? అని అభిమానులు అత్రుతగా వేచి చూస్తున్నారు.

https://www.instagram.com/p/B_Z6JNmJX9k/

ఏపీలో పెన్షనర్లకు శుభవార్త..!


కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక వనరులు తగ్గిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ లలో 50 శాతం మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంపై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ముఖ్యంగా పెన్షనర్ల పెన్షన్ లో కోత విధించడాన్ని అన్ని వర్గాలు తప్పుబట్టయి. దీంతో పెన్షన్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ జి.ఓ 37 ను ఆదివారం జారీ చేసింది. రేపటి నుంచి జీతాల బిల్లులు చేసుకునే అవకాశం.

పెన్షన్లపై కోత విధించడాన్ని ఆ సంగం తరుపున కొందరు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22వ తేదీన సీఎం జగన్ కు లేఖ రాశారు. ఎట్టకేలకు ప్రభుత్వం
దిగి వచ్చింది.

జగన్‌కు అమిత్ ‌షా ఫోన్‌…!


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఫోన్ చేశారు. ఏప్రిల్‌ 20 నుంచి ఇచ్చిన సడలింపులు, వాటి అమలుపై అనంతర పరిణామాలపై చర్చించారు. మే 3వ తేదీ లాక్‌డౌన్‌ ఉపసంహరణ, తర్వాత అనుసరించిన వ్యూహాలపై కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్‌ హోం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో అనుమానితులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతి మిలియన్‌ జనాభాకు 1,274 మందికి పరీక్షలు నిర్వహించిన దేశవ్యాప్తంగా ప్రథమ స్థానంలో ఉన్నామన్న అమిత్ షాకు వివరించారు.

మరోవైపు గుజరాత్‌లో చిక్కుకుపోయిన తెలుగు మత్స్యకారులను రప్పించడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కోవిడ్‌–19 నివారణా చర్యలకోసం రాష్ట్రానికి కేంద్రం తరఫున నోడల్‌ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్న నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి జగన్ ఫోన్ లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అంశాన్ని సీనియర్‌ అధికారి సతీష్‌ చంద్ర చూసుకుంటారంటూ కేంద్ర మంత్రికి తెలియజేసినట్లు చెప్పారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక అధికారిని అప్పగించారని తెలిపారు. ఇద్దరి మధ్య సమన్వయం కుదిర్చి తెలుగు మత్స్యకారులను గుజరాత్‌ నుంచి ఏపీకి తీసుకువచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేస్తానంటూ నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారని చెప్పారు. సముద్రమార్గం ద్వారా తీసుకురావడానికి ప్రయాణికుల నౌకకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి, సంబంధిత విభాగాల నుంచి అనుమతులు రావాల్సిన అవసరం ఉందని, దీనికి చాలా సమయం పడుతుందని అధికారులు నివేదించిన నేపథ్యంలో ఈ ప్రయత్నాలు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

కరోనా టెస్టుల్లో టాపే.. రికవరీలో..!


రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం అధిక సంఖ్యలో పరీక్షలు చేస్తోంది. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రంగా ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు ఊదరగొడుతున్నారు. ఒక మిలియన్ ప్రజలకు 1,274 మంది అనుమానితుల స్వాబ్ నమునాలను సేకరించి పరీక్షలు చేస్తున్నారు. కరోనా వైరస్ రాష్ట్రంలో ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకూ 68,034 మందికి పరీక్షలు నిర్వహించి 1,097 మందికి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు.

కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో, దీని భారినపడి కోలుకుంటున్న బాధితుల సంఖ్యలో, అదేవిధంగా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్యలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మెరుగెన పనితీరు ప్రదర్శించలేకపోయింది. కరోనా పరీక్షల గురించి ఏకరు పెట్టేవారు ఈ విషయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కేవలం పరీక్షలు చేసినంత మాత్రాన వ్యాధికి చికిత్స చేసినట్లు కాదు, ఇతర రాష్ట్రాల కంటే కరోనా మరణాల రేటు తగ్గించి లేక వైరస్ భారినపదిన వారిని తొందరగా కోలుకునేటట్లు చేసి ఆ విషయం ప్రచారం చేసుకుంటే దానికి ఓ అర్థం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తిలో తెలంగాణ కంటే తక్కువ కేసులతో దేశంలో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రం మరణాల విషయంలో 5వ స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఐదు రాష్ట్రాలలో అత్యధిక మరణాలు (31 మంది) ఏపీ లోనే సంభవించాయి. తమిళనాడులో మొత్తం కేసులు 1,755 నమోదవగా మరణించింది కేవలం 22 మంది మాత్రమే. దేశంలోనే మొట్టమొదటి కేసు కేరళలో గుర్తించినా ఆ రాష్ట్రం వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంతో 450 కేసులు మాత్రమే నమోదయ్యాయి, మరణించిన వారు ముగ్గురే ఉన్నారు. నిన్నటి వరకూ మన కంటే ఎక్కువ కేసులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 25 గానే ఉంది.

మరోవైపు కరోనా వైరస్ భారినపడి కోలుకున్న వారి సంఖ్యా రాష్ట్రంలో తక్కువగానే ఉంది. కేరళ రాష్ట్రంలో వైరస్ భారినపడి కోలుకున్న వారు 73.6 శాతంగా ఉంటే, తమిళనాడు లో 49.3 శాతం, కర్ణాటక లో 32.1 శాతం, తెలంగాణ లో 29.6 శాతంగా ఉంటే ఏపీ మాత్రం 16.8 శాతంగా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వైద్యులు, పారామెడికల్ సిబ్బంది రాష్ట్రంలో అధికంగా వైరస్ భారిన పడ్డారనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రచారంపై దృష్టి తగ్గించి వైరస్ వ్యాప్తి నిరోధించడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది.

వైసిపి ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా!


ఏపీలో అత్యధికంగా కర్నూల్ లో కరోనా వైరస్ వ్యాప్తికి స్థానిక అధికార పక్షానికి చెందిన ఎమ్యెల్యే కారణం అని, ఆయన వత్తిడుల కారణంగా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోలేక పోతున్నదని ఒక వంక విమర్శలు చెలరేగుతూ ఉండగా, తాజాగా వైసీపీకి చెందిన కర్నూల్ ఎంపీ ఇంట్లోనే ఆరుగురికి వైరస్ సోకున్నట్లు వెల్లడైనది.

ఇప్పటికే జిల్లాలో మొత్తం 279 కేసులు నమోదయ్యాయి. కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురికి కరోనా సోకున్నట్లు ఆయనే స్వయంగా ఎంపీనే మీడియాకు వెల్లడించారు.

వైరస్ సోకిన వారిలో ఎంపీ ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, వీరిలో ఒకరి కుమారుడు(14) ఉండగా, 83ఏళ్ల తండ్రికీ సోకినట్లు నిర్ధారణ అయింది. తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులే కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

లాక్ డౌన్ ఉన్నప్పటికీ వైరస్ కట్టడి కాకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, తన కుటుంభ సభ్యులు అందరూ ప్రభుత్వ ఆసుపత్రులలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

రెండు ఛారిటీలను ప్రారంభించిన విజయ్ దేవరకొండ


టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు ఛారిటీ సంస్థలను ఏర్పాటు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టీడీఎఫ్), మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎంసీఎఫ్) పేరిట చారిటీలను నెలకొల్పాడు. టీడీఎఫ్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేసి ఉద్యోగులుగా తీర్చనున్నాడు. లక్షమంది ఉద్యోగులను తయారు చేయడమే తన లక్ష్యమని తెలిపాడు. ఈ ఛారిటికీ కోటి రూపాయాలను కేటాయించాడు.

ఎంసీఎఫ్ ద్వారా మిడిల్ క్లాస్ ప్రజలకు సేవలందించనున్నాడు. దీనికి రూ.25లక్షలు కేటాయించాడు. ఎంసీఎఫ్ ద్వారా మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేయనున్నాడు. ఇందుకోసం thedeverakondafoundation.org వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఫౌండేషన్ సభ్యులు స్వయంగా నిత్యావసర సరుకులు అందించనున్నట్లు తెలిపాడు. 2వేల కుటుంబాల అవసరాలని తీర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్వీటర్లో ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్మాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ డిజాస్టర్ కావడంతో విజయ్ తో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. అలాగే కరోనా సమయంలో స్టార్ హీరోలంతా విరాళాలు ప్రకటిస్తుండగా విజయ్ దేవరకొండ మౌనం పాటించడంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈనేపథ్యంలో విజయ్ దేవరకొండ తాజాగా రెండు ఛారిటీలు స్థాపించి కోటి 25లక్షల విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఆర్ ఎక్స్ 100 చిత్రానికి సీక్వెల్ రెడీ


రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యుడిగా సినీ రంగంలో పనిజేసిన అనుభవం తో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి తన తోలి చిత్రం ` ఆర్ ఎక్స్ 100 ` తో సూపర్ సక్సెస్ అందుకొన్నాడు . హీరో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా 2018లో వచ్చిన ` ఆర్ ఎక్స్ 100 ` తెలుగు నాట ఓ సంచలన విజయం నమోదు చేసుకొంది. .. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ యూత్ ని బాగా ఆకట్టు కొంది.కాగా ఈ చిత్రం హీరో కార్తికేయకు మొదటి హిట్. కాగా పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. హీరోయిన్ గా గ్లామర్ ఒలకబోస్తూ , నెగెటివ్ షేడ్స్ కలిగిన రోల్ లో పాయల్ రాజ్ ఫుట్ ప్రేక్షకుల్ని అలరించడం తో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నిర్మాతలకు కాసుల పంట పండించింది.

కాగా ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి `ఆర్ ఎక్స్ 100 `కి సీక్వెల్ తీయనున్నాడని తెలుస్తోంది . ఇప్పటికే ఈ సీక్వెల్ కి సంబంధించిన కథ కూడా పూర్తి చేశాడట దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం `మహా సముద్రం `అనే యాక్షన్ క్రైమ్ డ్రామాని సెట్స్ పైకి తీసుకెళ్లే పనిలో ఉన్న అజయ్ భూపతి ఈ చిత్రం పూర్తయిన అనంతరం ` ఆర్ ఎక్స్ 100 ` మూవీ సీక్వెల్ ని మొదలుపెడతాడట …

అపన్న హస్తం భారతీయ సంస్కృతిలో భాగం: మోదీ


దేశంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ ప్రజలకు ఎలా సేవలందించాలనే ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో అపన్నహస్తం భాగమని.. కరోనా సమయంలో ప్రజల అవసరాలను తీరుస్తున్న ప్రతీఒక్కరికి సెల్యూట్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. కరోనా పోరులో ప్రజలే నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ప్రతీపౌరుడు సైనికులాడిలా పోరాడుతున్నారని ఆయన కొనియాడారు.

ప్రభుత్వం చేపడుతున్న ప్రతీ కార్యక్రమానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారన్నారు. విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కతాటిపై పని చేస్తున్నాయని అన్నారు. కరోనాపై పోరులో ఉద్యోగులు, ఫించన్‌దారులు తమ వేతనాల్లో కొంతభాగం త్యాగం చేశారన్నారు. ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలకు భారత్ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలంతా లాక్డౌన్ కు సహకరిస్తున్నారని తెలిపారు. కరోనాపై పోరులో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలపై ప్రశంసలు కురిపించారు.

లాక్డౌన్ వేళ రైల్వే సేవలు అభినందనీయమన్నారు. పెద్ద ఎత్తున నిత్యవసరాలను రవాణాచేసి తమవంతు సహకారం అందజేస్తుందన్నారు. అలాగే కరోనా వైరస్ మన జీవనశైలి, పని విధానంలో అనేక మార్పులకు కారణమైందని తెలిపారు. ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని సూచించారు. ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు పండ్లను తినాలని ప్రధాని మోదీ సూచించారు.

డిఫాల్టర్ గా జగన్ ప్రభుత్వం.. కొత్త అప్పులకు చుక్కెదురు


ఏపీలో వై వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆర్ధికంగా పీకలలోతు సమస్యలలో చిక్కుకు పోతున్నది. ఒక వంక కరోనా, లాక్ డౌన్ ల కారణంగా ప్రభుత్వ ఆదాయం కుదించుకు పోవడం, కేంద్రం నుండు ఆశించిన నిధులు కూడా రాకపోవడంతో పాటు అప్పులు చేద్దామన్నా ఇచ్చేవారు కనిపించడం లేదు.

ఇంతకు ముందు తీసుకున్న అప్పులు చెల్లించక పోవడంతో కొత్తగా మళ్ళి అప్పులు ఎట్లా ఇస్తామని ప్రశ్నలు తలెత్తుతూ ఉండడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫాల్టర్‌గా పేర్కొంటూ బకాయిలు తీర్చనిదే కొత్తగా అప్పులు ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నాయి.

ఇది వరకే ఈ మేరకు స్టేట్ బ్యాంకు, నబార్డ్‌, మరికొన్ని ఇతర బ్యాంకుల నుంచి ఇటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తాజాగా ఇచ్చిన రుణాన్ని తిరిగి తీర్చడంలో విఫలమైనందున రాష్ట్రానికి కొత్త రుణం ఇచ్చేందుకు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ (ఎన్‌సిడిసి) విముఖత వ్యక్తం చేస్తుంది.

రబీ జొన్న, మొక్కజొన్న, పసుపును సేకరించేందుకు రూ 2,000 కోట్లు రుణాన్నివ్వాలని రాష్ట్ర సహకార మార్కెటిరగ్‌ ఫెడరేషన్‌ (మార్క్‌ఫెడ్‌) ఎన్‌సిడిసికి వ్రాసిన లేఖకు చుక్కెదురయినది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వ హామీ ఉన్నదని చెప్పినా ప్రయోజనం లేకపోయింది.

సహకార చక్కెర కర్మాగారాలకు కావాల్సిన పెట్టుబడి కోసం గత ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే రెండు విడతలుగా రూ.200 కోట్లు విడుదల చేసింది. ఈ రెండు రుణాల మొత్తాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 13న తిరిగి చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు చెల్లించలేదని గుర్తు చేసింది.

ప్రస్తుతం రాష్ట్రం నుంచి తమకు రూ 225 కోట్లు రావాల్సి ఉన్నదని, అందుకే పాత బకాయిలను తీర్చపోవడం వల్ల కొత్తగా అడుగుతున్న రూ.2,000 కోట్ల ప్రతిపాదనలు పరిశీలించలేమని స్పష్టం చేసింది.

డాన్సర్స్ కి సాయం చేసిన లారెన్స్

నటుడు , నృత్య దర్శకుడు అయిన డైరెక్టర్ రాఘవ లారెన్స్.కరోనా ఎఫెక్ట్ తో పని లేక ఇబ్బందులు పడుతున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు మూడు కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించిన రాఘవ లారెన్స్ మరో మారు తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆ క్రమంలో హైదరాబాద్ లోఉన్న డాన్సర్స్ ఒక్కొక్కరికీ 25,000 రూపాయల చొప్పున 10 మందికి 2,.50,000 రూపాయలు పంపడం జరిగింది. అదే విధంగా చెన్నై లో ఉన్న 13 మంది డాన్సర్స్ కి 25,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు రాఘవ లారెన్స్ డైరెక్ట్ గా వారి వారి అకౌంట్లలో డైరెక్ట్ గా వేయడం జరిగింది. అలా డాన్స్ నే నమ్ముకుని,సినీ రంగంలో బతుకుతూ ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్నిరాఘవ లారెన్స్ అందించడం జరిగింది. కష్టకాలంలో ఉన్న నృత్య కళాకారులకు అండగా నిలిచి రాఘవ లారెన్స్ అందరి చేత శభాష్ అనిపించు కొంటున్నాడు.

ప్రభుదేవా దగ్గర నృత్య సహాయకుడిగా చేరి 1993 లో వచ్చిన `ఉళైప్పాలి ` చిత్రం తో సినీ రంగ ప్రవేశం చేసాడు.1997 లో వచ్చిన `హిట్లర్ `తెలుగు చిత్రం తో డాన్స్ డైరెక్టర్ గా మారాడు. ఇక 1999 లో వచ్చిన `స్పీడ్ డాన్సర్` తెలుగు చిత్రం తో నటుడిగా మారి ఆ తరవాత 2004 లో వచ్చిన `మాస్ ` చిత్రం తో డైరెక్టర్ గా ఎదిగి సినీ రంగంలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చు కొన్నాడు. అలా తను పైకి వచ్చిన నృత్య రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని కష్టకాలంలో ఆదుకుంటూ రాఘవ లారెన్స్ తన పెద్ద మనసు మరోసారి చాటుకున్నాడు. కాగా రాఘవ లారెన్స్ ప్రస్తుతం స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ` కాంచన` హిందీ రీమేక్ “లక్ష్మీ బాంబ్ ` కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎపుడు తన చుట్టూ వున్నవారికి సాయం చేయాలనుకొనే గొప్ప మనిషి రాఘవ లారెన్స్ ని అందరూ మనస్పూర్తి గా అభినందిస్తున్నారు .

విజయవాడలో 300 మంది క్వారంటైన్ కు..!


తాజా బులిటెన్ ప్రకారం ఒక్క కృష్ణా జిల్లాలోనే ఒక్కరోజే 52 కరోనా పాజిటివ్ కేసులు నమోడవటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ స్థాయిలో జిల్లాలో కేసులు నమోడవటం ఇదే తొలిసారి. వైరస్ భరినపడిన వారి సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో కృష్ణలంక, మాచవరం ప్రాంతాలు ఉన్నాయి.

కృష్ణలంకకు చెందిన ఇద్దరు డ్రైవర్లు నిర్వాకం వల్ల నగరంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓ ట్రక్ డ్రైవర్, చుట్టుపక్కల ఉన్న వారిని పేకాట ఆడేందుకు పిలిచాడు. వారితో కలిసి పేకాట ఆడాడు. తనలో కరోనా ఉందని తెలియకుండానే అతను చేసిన ఈ పని అతని ద్వారా మరో 24 మందికి వైరస్ ను అంటించింది. మరో ఘటనలో ఇదే ప్రాంతంలోని కార్మికనగర్ లో నివాసం ఉంటున్న లారీ డ్రైవర్ ఇంటింటికి తిరిగి పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుని వారందరికీ వైరస్ వ్యాప్తి అయ్యేలా చేశాడు. ఈ రెండు ఘటనల కారణంగానే, గడచిన రెండు రోజుల్లో నగరంలో 40 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా, ఆదివారం ఒక్కరోజే 52 కేసులు గుర్తించారు. వీరిద్దరు లారీ డ్రైవర్ ల నిర్వాకానికి తాజాగా 300 క్వారెంటైన్ తరలించాల్సి వచ్చింది.

భౌతిక దూరాన్ని పాటించడంలో వీరందరూ విఫలమైన కారణంగానే వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. విజయవాడ ప్రాంతం, ఏపీలోనే పెద్ద హాట్ స్పాట్ గా అవతరించింది. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 15 శాతం… అంటే సుమారు 150 కేసులు ఇక్కడే నమోదయ్యాయి. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదు. గుణదల కొండ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద స్థానికులు భారీగా చేరి పేకాట ఆడుతున్నారు. అదేవిధంగా మద్యం సేవిస్తున్నారని అక్కడి నిర్వాహకులు తెలిపారు.

లాక్ డౌన్ లో హెయిర్ కటింగ్.. ఆరుగురికి సోకిన కరోనా


దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తోంది. దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచిస్తుంది. పోలీసులు ఎంత చెప్పిన కొందరు మాత్రం తామకేమీ పట్టనట్లుగా బయట తిరుగుతున్నారు. అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సూచిస్తున్న కొందరు పాటించడం లేదు. బయటికి వెళితే ఏం జరుగుతుందనేది ఓ బార్బర్ షాపు ఉదాంతం తెలియజేసింది. లాక్డౌన్ సమయంలో హెయిర్ కటింగ్ వెళ్లి ఆరుగురు వ్యక్తులు కరోనా అంటించుకున్న వైనం తాజాగా వెలుగుచూసింది.

మధ్యప్రదేశ్లోని ఖర్గావ్ జిల్లాలోని బార్గావ్ గ్రామంలో కొంతమంది వ్యక్తులు హెయిర్ కటింగ్ కోసం బార్బర్ షాపుకు వెళ్లారు. కటింగ్ షాపు యజమాని ఎప్పటిలాగే ఒకే టవల్ ఉపయోగించింది వారికి కటింగ్ చేశాడు. ఈ సంఘటన ఆరుగురు వ్యక్తులకు కరోనా సోకడానికి కారణమైంది. అదేలా అంటే.. ఇండోర్ కు చెందిన లాక్డౌన్ వల్ల తన స్వగ్రామానికి వచ్చాడు. ఏప్రిల్ 5న ఆ వ్యక్తి బార్బర్ షాపు వెళ్లి కటింగ్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్యులు టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది.

ఈ విషయం తెలియని బార్బర్ కరోనా వ్యక్తికి వాడిన టవల్ నే తన కటింగ్ షాపుకు వచ్చిన 12మందికి ఉపయోగించాడు. తాజాగా వీరిందరికీ టెస్టులు నిర్వహించగా ఇందులో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కటింగ్ చేసిన బార్బర్ మాత్రం కరోనా నెగిటివ్ రావడం విశేషం. ఇప్పటికైనా ప్రజలు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

చిరుతల సంచారం భయాందోళనలో ప్రజలు..!


కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రజలు బయటకు రాకుండా ఉండటంతో అటవీ సమీప ప్రాంతంలో అడవి జంతువులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన తిరుమల తిరుపతిలో ఇటీవల దుప్పిలు, జింకలు రోడ్డుపై సంచరించడం తెలిసిందే. కేరళలోని ఒక ప్రాంతంలోని వీధిలో రాత్రి వేళ ఏనుగు దర్జాగా తిరిగిన సంఘటన ఆ వీధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రం ఆలయ సమీపంలోని సాక్షిగణపతి, హటకేశ్వరం రహదారిలో చిరుతపులుల సంచారం చేస్తున్నాయి. రెండు చిరుత పులులు రోడ్డుపై తిరుగుతుండగా చూశామని స్థానికులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని దేవస్థానం అధికారులు, రెవెన్యూ అధికారులకు తెలియజేసారు.

దీంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం వారు మైక్ లో అనౌన్స్ మెంట్ చేసి స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంత వాసులు చిరుతల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు.

పాతబస్తీలో అల్లరి మూకలదే రాజ్యం.. !!


ఎంతో శక్తివంతమైన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ లోని పాతబస్తీ అంటేనే వణికి పోతున్నది. అక్కడ కరోనా వైరస్ కట్టడికి అధికారులు దాదాపు చేతులు ఎత్తివేస్తూ ఉండడంతో దిక్కుతోచడం లేదు.

మొత్తం తెలంగాణలోని కరోనా కేసులలో సగం హైదరాబాద్ కు చెందినవే కాగా, వాటిల్లో సగంకు పైగా పాతబస్తీవే. పలు ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా ప్రకటించినా ఎవ్వరు లెక్క చేయడం లేదు.

అనుమానితులు వైద్య పరీక్షలకు ముఖం చాటేయడం, వైరస్ సోకినా వారు కూడా పోలీసులను సహితం లెక్క చేయకుండా ద్విచక్ర వాహనాలపై రోడ్లపైకి వచ్చి హల్ చల్ చేస్తుండడంతో పోలీసులు సహితం ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తున్నది. వారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే వారిపైననే అల్లరి మూకలు ఎదురు తిరుగుతున్నారు.

ఇక్కడ యధేచ్చగా తిరుగుతున్న అల్లరి ముఖాలకు రాజకీయ ప్రాపకం ఉండడంతో అధికారులు, అధికార పక్షానికి చెందిన వారు సైతం ఒక గీత దాటి ముందుకు వెళ్లలేక పోతున్నారు. బయటకు రావద్దని హెచ్చరిస్తున్న పోలీసులపై కొంతమంది పోకిరీలు జులం చేస్తున్నారు.

ఇప్పటి వరకు నగరంలో 480 వరకు కేసులు నమోదుగా అత్యధిక కేసులు పాతబస్తీ ప్రాంతాలకు చెందినవే. జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్యశాఖ అధికారులు కంటైన్‌మెంట్ జోన్లలో నివసించే ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా, ఇతరులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు పాటించాలని ఎంతగా చెబుతున్నా వినిపించుకోవడం లేదు.

రేషన్‌బియ్యం, నగదు రూ.1500లు, జన్‌ధన్ ఖాతా డబ్బులు, నిత్యావసర సరుకుల పేరుతో సామాజిక దూరంగా పాటించకుండా గుంపులు గుంపులుగా ఒకే దగ్గర చేరుతున్నారు. ఈవిధంగా చేస్తుంటే కరోనా వైరస్ మిగతా వారికి వస్తుందని స్థానిక అధికారులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. పైగా ఆ విధంగా వారించినా అధికారులపైనే తిరుగుబాటు చేస్తున్నారు.

బేగంబజార్ ప్రాంతంలో ఉదయం 8గంటల తరువాత ఖర్జురా గల్లీకి పెద్ద ఎత్తున వస్తూ మధ్యాహ్నం 12గంటల వరకు అక్కడే తిష్టవేస్తూ సరుకుల కొనుగోలు చేస్తున్నామంటూ కనీసం మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యంగా దుకాణాల ముందు హంగామా చేస్తున్నారు.

మర్కజ్ వెళ్లిన వారిలో 420 మంది వరకు ఈ ప్రాంతాలకు చెందినవారే ఉన్నారు. చార్మినార్ యునానీ ఆసుపత్రిలో కరోనా చికిత్సలు అందిస్తున్నప్పటికీ వైద్య పరీక్షలకు ముందుకు రావడం లేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా స్థానికులు ఆసుపత్రికి రాకుండా చుట్టుపక్కల వారిని భయాందోళనలకు గురిచేస్తున్నట్లు పోలీసులు కూడా అంగీకరిస్తున్నారు.

తాము వెళ్లి బలవంతంగా తీసుకొస్తే తప్ప ఎవరు వైద్యపరీక్షలకు ముందుకు రావడం లేదని, తక్కువ సంఖ్యలో ప్రభుత్వం సిబ్బంది వెళ్లితే బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీస్ అధికారులు వాపోతున్నారు.

ఎస్.ఈ.సి పిటీషన్ కొట్టివేయండి..!


రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తన తొలగింపుపై దాఖలు చేసిన పిటీషన్ కొట్టేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ లో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఎన్నికలను వాయిదాకు సంబంధించి నోట్ పైలు సిద్ధం చేయలేదని, కార్యాలయ అధికారులతో గానీ సంప్రదించలేదని ఎన్నికల సంఘం కార్యదర్శి ఎస్.రామసుందర రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు అన్ని పూర్తిగా వ్యక్తి గత నిర్ణయాల వాలే తీసుకున్నారని, ఈ నిర్ణయాలు తీసుకునే ముందు పాటించాల్సిన విధి విధానాన్ని పక్కన పెట్టేశారని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఏ పైలు కార్యాలయ నిబంధనల ప్రకారం నడవలేదని స్పష్టం చేశారు. మార్చి 18 నుంచి హైదరాబాద్ లోనే ఉంటూ తొలగింపు జరిగే వరకూ కార్యాలయానికి రాలేదని పేర్కొన్నారు. ఇతర పలు అంశాలను వెల్లడిస్తూ… ఎస్.ఈ.సి పిటీషన్ కోటీయాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు.

మరోవైపు ఈ అంశంపై బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ఈ కౌంటర్ ను దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు టాస్క్‌ఫోర్స్ నియమించిందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ సూచనలను రాష్ట్రం ఆమోదించిందన్నారు. దాని ప్రకారం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఐదు సంవత్సరాల పదవీకాలం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదని నిబంధన ఉందన్నారు. ఎన్నికల కమిషనర్‌కు 65 సంవత్సరాల వయసు ఉండాలని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు కూడా చెబుతున్నాయని ఉటంకించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఆమోదించిన టాస్క్‌ఫోర్స్ నిబంధనలను పట్టించుకోలేదన్నారు. రాజ్యాంగంలోని 217 నిబంధనకు ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పూర్తి విరుద్ధం అని పేర్కొన్నారు. 65 సంవత్సరాలు పైబడిన వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఎన్నికల సంస్కరణల కిందకు రాదన్నారు.

ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే : వర్ల


కేంద్ర హోం శాఖకు మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తెదేపా నాయకులు లేఖ పంపినట్లు తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హెచ్చరించారు. కరోనా నేపధ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని, వైకాపా ప్రభుత్వ దురుసుతనం మూలంగా రక్షణ కల్పించాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని స్వయంగా రమేష్ కుమార్ వెల్లడించినా విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. రమేష్ కేంద్రాన్ని రక్షణ కోరితే సిగ్గుపడాల్సిన ప్రభుత్వం మాత్రమేనని ఎద్దేవా చేశారు. లేఖ విషయంలో తెదేపా నాయకులు కనకమేడల రవీంద్ర కుమార్, టీడీ జనార్దన్, వర్ల రామయ్య పేర్లు వాడి మా గౌరవానికి భంగం తెచ్చినందుకు సోమవారం పరువునష్టం దావా వేస్తున్నట్లు నోటీస్ పంపిస్తున్నానని వర్ల స్పష్టం చేశారు.

లేఖ తాము సృష్టించలేదని మీడియా ముందు క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని చెప్పారు. నేరాల్లో, ఘోరాల్లో మునిగిన జగన్, విజయసాయిరెడ్డిలకు పరువునష్టం దావాలు ఎన్ని వచ్చినా చీమకుట్టినట్లుండని తెలుసన్నారు.
రమేష్ కుమార్ సంతకాన్ని తెదేపా నాయకులు ఫోర్జరీ చేశారని డీజీపీకి ఆధారరహితంగా ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నించారు.

దొంగ సంతకాలు చేయడంలో విజయసాయిరెడ్డి నేర్పరని, ఆ లేఖ ఫోర్జరీ కాదని, తానే రాశానని రమేష్ కుమార్ చెప్పారని, అంతకన్నా ఏంకావాలని ప్రశ్నించారు. న్యాయస్థానాలను తప్పు పట్టించడానికి తాపత్రయపడుతున్నారని విమర్శించారు. రమేష్ కుమార్ పై అనుమానాలు రేకెత్తేలా ఆరోపణలు, ఫిర్యాదు చేసి సీఐడీ దర్యాప్తు చేస్తోందని కోర్టులను తప్పుదారి పట్టించడానికి కుయుక్తులు పన్నుతున్నారన్నారు. కనకరాజ్ ను ఎస్ ఈ సి గా నియమించడంపై కోర్టు సోమవారం వాదన విననుందని తెలిపారు. రమేష్ రాసిన లేఖ వ్యవహారంలో తప్పుడు ఫిర్యాదు చేసి సీఐడీ దర్యాప్తు చేస్తోందని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోందని వర్ల అనుమానం వ్యక్తం చేశారు. జగన్ బృందంపై 9 ఏళ్ళుగా కేసులున్నాయని, సత్వరంపరిష్కారం చేయాలని కోర్టులను చేతులెత్తి నమస్కరించి కోరుతున్నానని చెప్పారు.

కోర్టుల్లో కేసులు వాదనలు పూర్తయితే నిందితుల బండారం బయటపడుతుందన్నారు. ముఖ్యమంత్రికి తెలిసినట్లయితే కరోనా విభృంచడానికి కారణమైన విజయసాయితోపాటు పలువురు ఎమ్మెల్యేలను కోరంటైన్ లో ఉంచమని ఆదేశించేవారేనాని తెలిపారు. న్యాయస్థానాలలో వాదనలను పక్కదారి పట్టించడానికి లేనిపోని ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం తగదని వారించారు.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…!


రాష్ట్ర పాలనా యంత్రాంగంలో సమూల మార్పులు తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే గ్రామ స్థాయిలో 10 మందిని వివిధ శాఖలకు కార్యదర్శులు నియమించింది. వీరికి తోడు ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్లను నియమించింది. తాజాగా జిల్లా స్థాయిలో ఐఏఎస్ అధికారుల సంఖ్యను పెంచి వారికి బాధ్యతలను విభజించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలో ఇకపై ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను నియమించనుంది. సీనియర్‌ టైమ్‌ స్కేలు ఉన్న ఐఏఎస్‌ అధికారులను జేసీలుగా నియమించి, ముగ్గురికీ పని విభజనలో సర్కారు స్పష్టత ఇవ్వనుంది. వీరు ముగ్గురు జిల్లా కలెక్టర్‌కు పాలన వ్యవహారాల్లో సహకారం అందిస్తారు. ఎందుకు సంభందించిన ఉత్తర్వులు నేడో, రేపో వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు పలు సంక్షేమ పథకాల పర్యవేక్షణ బాధ్యత కొత్త జాయింట్ కలెక్టర్ లకు అప్పగించనున్నారు. మరింత జవాబుదారీతనం, అవినీతి రహిత పాలన, ప్రభుత్వ సేవలు సమర్ధవంతంగా, సజావుగా అందించాలన్నదే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.