కేంద్ర హోం శాఖకు మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి తెదేపా నాయకులు లేఖ పంపినట్లు తప్పుడు ఆరోపణలు ఉపసంహరించుకోకపోతే పరువు నష్టం దావా వేస్తామని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య హెచ్చరించారు. కరోనా నేపధ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని, వైకాపా ప్రభుత్వ దురుసుతనం మూలంగా రక్షణ కల్పించాలని కేంద్ర హోం శాఖకు లేఖ రాశానని స్వయంగా రమేష్ కుమార్ వెల్లడించినా విజయసాయిరెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. రమేష్ కేంద్రాన్ని రక్షణ కోరితే సిగ్గుపడాల్సిన ప్రభుత్వం మాత్రమేనని ఎద్దేవా చేశారు. లేఖ విషయంలో తెదేపా నాయకులు కనకమేడల రవీంద్ర కుమార్, టీడీ జనార్దన్, వర్ల రామయ్య పేర్లు వాడి మా గౌరవానికి భంగం తెచ్చినందుకు సోమవారం పరువునష్టం దావా వేస్తున్నట్లు నోటీస్ పంపిస్తున్నానని వర్ల స్పష్టం చేశారు.
లేఖ తాము సృష్టించలేదని మీడియా ముందు క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని చెప్పారు. నేరాల్లో, ఘోరాల్లో మునిగిన జగన్, విజయసాయిరెడ్డిలకు పరువునష్టం దావాలు ఎన్ని వచ్చినా చీమకుట్టినట్లుండని తెలుసన్నారు.
రమేష్ కుమార్ సంతకాన్ని తెదేపా నాయకులు ఫోర్జరీ చేశారని డీజీపీకి ఆధారరహితంగా ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నించారు.
దొంగ సంతకాలు చేయడంలో విజయసాయిరెడ్డి నేర్పరని, ఆ లేఖ ఫోర్జరీ కాదని, తానే రాశానని రమేష్ కుమార్ చెప్పారని, అంతకన్నా ఏంకావాలని ప్రశ్నించారు. న్యాయస్థానాలను తప్పు పట్టించడానికి తాపత్రయపడుతున్నారని విమర్శించారు. రమేష్ కుమార్ పై అనుమానాలు రేకెత్తేలా ఆరోపణలు, ఫిర్యాదు చేసి సీఐడీ దర్యాప్తు చేస్తోందని కోర్టులను తప్పుదారి పట్టించడానికి కుయుక్తులు పన్నుతున్నారన్నారు. కనకరాజ్ ను ఎస్ ఈ సి గా నియమించడంపై కోర్టు సోమవారం వాదన విననుందని తెలిపారు. రమేష్ రాసిన లేఖ వ్యవహారంలో తప్పుడు ఫిర్యాదు చేసి సీఐడీ దర్యాప్తు చేస్తోందని చెప్పడానికి ప్రయత్నం జరుగుతోందని వర్ల అనుమానం వ్యక్తం చేశారు. జగన్ బృందంపై 9 ఏళ్ళుగా కేసులున్నాయని, సత్వరంపరిష్కారం చేయాలని కోర్టులను చేతులెత్తి నమస్కరించి కోరుతున్నానని చెప్పారు.
కోర్టుల్లో కేసులు వాదనలు పూర్తయితే నిందితుల బండారం బయటపడుతుందన్నారు. ముఖ్యమంత్రికి తెలిసినట్లయితే కరోనా విభృంచడానికి కారణమైన విజయసాయితోపాటు పలువురు ఎమ్మెల్యేలను కోరంటైన్ లో ఉంచమని ఆదేశించేవారేనాని తెలిపారు. న్యాయస్థానాలలో వాదనలను పక్కదారి పట్టించడానికి లేనిపోని ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం తగదని వారించారు.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Varla ramaiah fires on vijayasai reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com