Home Blog Page 8509

అనూహ్య పరిణామంతో నిమ్మగడ్డ కేసు వాయిదా..!


రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిమ్మగడ్డ రమేశ్ తొలగింపు పిటిషన్‍పై, బుధవారం హైకోర్టులో వాదనలు తిరిగి ప్రారంభం అయ్యాయి. నిన్న ఆరుగురు పిటిషనర్ల తరపు వాదనలు విన్న ధర్మాసనం, మరికొందరు పిటిషనర్ల తరపు వాదనలు వినటానికి సిద్ధం అయ్యింది. ప్రముఖ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు ప్రారంభం చేసారు.

వీడియో కాన్ఫరెన్స్ విచారణ జరుగుతున్న సమయంలో జరిగిన ఒక సంఘటన హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. వీడియో కాన్ఫరెన్స్ విచారణలో అనుమతించినవారు, మరికొందరు ఇతర న్యాయవాదులు ప్రవేశించడంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. కేవలం 10 మందికి పాస్ వర్డ్ ఇస్తే, ఒకేసారి 40 మంది వీడియో కాన్ఫరెన్స్ లోకి ఎలా వచ్చారన్న ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. పాస్‍వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతుందని సీజే ఆగ్రహం వ్యక్తం చేసారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనలు జరుగుతుండగానే క్రాస్‍టాక్ రావడం పట్ల ప్రధాన న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు.

దీంతో నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ పిటిషన్‍పై విచారణ సోమవారానికి వాయిదా వేసారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని, నేరుగా కోర్టులోనే విచారణ చేస్తామని, సీజే చెప్పారు. కోర్టుతో సంబంధమున్న న్యాయవాదులకు పాసులు జారీ చేసేలా డీజీపీకి ఆదేశాలు ఇస్తాం అని అన్నారు. కొంత మంది న్యాయవాదులు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండటంతో, సీజే దీనికి సంబంధించి డీజీపీకి లేఖ రాస్తాం అని చెప్పారు. సోమవారం అందరూ సమాజీక దూరం పాటిస్తూ, నిబంధనులు పాటిస్తూ, కోర్ట్ కు హాజరు కావాలని చెప్పారు.

ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పాస్‍వర్డ్ లీక్ ఎలా అయ్యింది, ఎవరు ఆ వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చారు అనేది తెలియాల్సి ఉంది. బయట వ్యక్తులు ఎలా వస్తారు అంటూ, చర్చ మొదలైంది. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ప్రభుత్వం నూతన సంస్కరణల సాకుతో ఆర్డినెన్స్ ద్వారా తొలిగించింది అంటూ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై నిమ్మగడ్డ వ్యక్తిగతంగాను, మాజీ మంత్రి కామినేని శ్రీనివాతో పాటు ఆరు గురు ప్రజావ్యాజ్య పిటిషన్లును హైకోర్టులో దాఖలు చేసారు. ఈ పిటీషన్లకు సంబంధించి ఫిర్యాదుదారులు, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్ని కల సంఘం కౌంటర్లు దాఖలు చేశాయి. ఈ కేసుకు సంబంధించి మంగళవారం వాద, ప్రతివాదనలు కొనసాగాయి. ధర్మాసనానికి ఆరుగురు వాదనలు వినిపించారు.

సమంత కొత్త నిర్ణయాలు


తెలుగులో అనుష్క ,కాజల్ , తమన్నా వంటి తారలు సూపర్ ఫార్మ్ లో ఉన్న సమయం లో ” ‘ఏ మాయ చేశావే ” చిత్రం తో టాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేసిన సమంత తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ” బృందావనం ” , “దూకుడు “, ” అత్తారింటికి దారేది ” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకొంది. అదే క్రమంలో నాగ చైతన్య ని పెళ్ళాడి అక్కినేని వారి కోడలు అయ్యింది. విచిత్రంగా పెళ్లయ్యాక కూడా ” రంగస్థలం , మహానటి , మజిలీ , ఓ బేబీ ” వంటి వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతోంది

స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి

కాగా నిన్న 34 వ పుట్టినరోజు జరుపుకున్న సమంత కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుందట. దాంట్లో మొదటిది ఇక మీదట సోషల్ సర్వీస్ ఆక్టివిటీస్ ను పెద్ద ఎత్తున చేయాలను కోవడం ఒకటైతే ,రెండోది ఈ సంవత్సరం ఓ సొంత నిర్మాణ సంస్థ ను పెట్టి , కొత్త దర్శకులతో కథాబలం ఉన్న సినిమాలను తీయాలని అనుకోవడం … అన్నపూర్ణ బ్యానర్ ఉన్నప్పటికీ సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించడానికి కారణం లేడీ ఓరియెంటెడ్ సినిమాలనే సమంత నిర్మించాలనుకుంటున్నదట .” ఓ బేబీ , యూ టర్న్” వంటి కొత్త తరహా కథల పైనే దృష్టి సారించ బోతోందట …ఆ క్రమంలో ఇపుడు రీసెంట్ గా కన్నడ లో హిట్ అయిన “దియా ” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉంది . కాగా ఇదొక పాటలు లేని ప్రేమ కదా చిత్రమట….అందుకే పునర్ నిర్మించాలని అనుకొందట ….

తమిళ టాప్ హీరో అజిత్ చిత్రంలో నవదీప్


మంచి నటుడు అయినప్పటికీ కాలం కలిసి రాక వెనుక బడ్డ హీరో నవదీప్. `చందమామ , గౌతమ్ ఎస్ ఎస్ సి `వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచిన ఈ హీరో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆల వైకుంఠపురంలో ‘ కనిపించిన నవదీప్ ఇపుడు తమిళం లో టాప్ హీరో తో కల్సి నటించ బోతున్నాడు. తమిళ టాప్ హీరో అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ అనే సినిమా చేస్తున్నాడు . . ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించ నున్నాడు .కాగా ఈ చిత్రం లో ఓ కీలకపాత్ర కోసం తెలుగు యువ హీరో కార్తికేయ ని , ఆ తర్వాత నవీన్ చంద్ర ని నటింప జేయాలని అనుకొన్నా కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు . అయితే తాజాగా నవదీప్ ఆ పాత్ర కోసం ఎన్నిక అయినట్టు తెలుస్తోంది.

అన్ని సక్రమంగా జరిగితే దసరాకి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తుంది . శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఖాఖీ ఫేమ్ హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇకపోతే ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ భామ హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. ఇక అజిత్ తాజా చిత్రం ‘నెర్కొండ పారవై’ (తెలుగు లో వకీల్ సాబ్ ) ను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని కూడా సూపర్ హిట్ చేయాలని తపన తో కష్టపడుతున్నట్టు తెలుస్తోంది .

హమ్మయ్యా..భాగ్యనగరం ఫ్రీ!

 

 

గత కొంతకాలంగా కరోనా విజృంభనతో తెలంగాణలో కొన్ని ప్రాంతాలను  రెడ్, కంటైన్మెంట్ జోన్లగా ప్రకటించి కఠినమైన లాక్ డౌన్ నియమాలను అమలుపరుస్తున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్‌ లో పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. మర్కజ్ ఘటనతో ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంది.

తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కంటైన్మెంట్ జోన్లను ఫ్రీ చేస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌ ను దాటడం లేదు. దీంతో చార్మినార్‌ జోన్‌ పరిధిలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఫలక్‌ నామా, రాజేంద్ర నగర్‌ లోని క్వారంటైన్ సెంట‌ర్లను తొలగించారు. చాంద్రాయణ గుట్ట సర్కిల్‌ లో గతంలో 35 పాజిటివ్‌ కేసులు ఉండగా, 10 కంటైన్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 3 కేంద్రాలను తాజాగా తొలగించారు.

చార్మినార్‌ సర్కిల్‌ లో 16 పాజిటివ్‌ కేసులు ఉండగా 9 కంటైన్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక దాన్ని తొలగించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ లో 9 పాజిటివ్‌ కేసులు ఉండగా 7 కేంద్రాలు ఉండేవి. వాటిలో ఐదింటిని తొలగించారు.

అలాగే సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తాలో పూర్తి స్థాయిలో కట్టడి చేశారు. మెట్టుగూడ, ఆలుగడ్డబావి నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఆ ఏరియాలో కరోనా కేసుల ప్రభావం ఎక్కువగా ఉండటం, ఆ పక్కనే గాంధీ ఆస్పత్రి ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఆరోగ్యశాఖ మంత్రి అటెండరుకు పాజిటివ్‌


రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలో పనిచేసే అటెండరుకు నిర్వహించిన ట్రూనాట్‌ పరీక్షలో ప్రిజంటివ్ పాజిటివ్‌ వచ్చింది.

తుది నిర్ధారణకు నమూనాను వైరాలజీ ల్యాబ్‌కి (ఆర్టీపీసీఆర్‌ పరీక్షకు) పంపారు. అటెండర్‌ను పిన్నమనేని సిద్దార్ధ వైద్య కళాశాలకు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి నాని, ఆయన భద్రత సిబ్బంది, పేషీలోని మిగతా అధికారులు, ఉద్యోగులు కలిపి మొత్తం 12 మందికి పరీక్షలు చేశారు. మంగళవారం అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో వారందరికీ నెగెటివ్‌ వచ్చిందని వైరాలజీ ల్యాబ్‌ ప్రొఫెసర్‌ రత్నకుమారి తెలిపారు. దీంతో సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం మంత్రి పెషీకి రాకపోకలు సాగిస్తున్న వారి పరిస్థితి గందరగోళంగా మారింది.

తారా చౌదరిపై క్రిమినల్ కేసు..!


ప్రకాశం జిల్లా పామూరు ఎస్సైపై సంచలన ఆరోపణలు చేసిన తారా చౌద‌రిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఎస్సైను దుర్భాషలాడుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌ పెట్టినందుకు తారా చౌద‌రితో పాటూ ఆమె భర్త రాజ్‌కుమార్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్యవహారంపై పామూరు సీఐ ఏఎస్‌ రామకృష్ణారెడ్డి స్ప‌ష్ట‌త‌ ఇచ్చారు.

పామూరులో ఉంటున్న తారా చౌదరి.. స్థానిక ఎస్పై చంద్రశేఖర్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. లాక్‌డౌన్ సమయంలో అకారణంగా తన భర్తను కొట్టి.. అక్రమంగా కేసులు పెట్టార‌ని ఆరోపించారు. తన కుమారుడు మెడిసిన్, నిత్యావసరాలు తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భర్త రాజ్‌కుమార్‌ను ఎస్సై కొట్టారని.. నాటుసారా తాగాడని, అక్రమ రవాణా చేస్తున్నాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తన భర్తకు బ్రీత్ ఎన‌లైజ్ టెస్టులు చేయాల‌న్నారు.

ఎస్సై చంద్రశేఖర్ కావాల‌నే తన భర్తను టార్గెట్ చేశారని, 20 రోజుల క్రితం ట్రాన్స్‌ఫర్ అయ్యారని, ఆయన పామూరులో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు తారా చౌదరి. తాను లాక్‌డౌన్ సమయంలో ప్రజల సమస్యల్ని ఎస్సైకు వివరించామని ఆ కోపంతోనే తన భర్తను టార్గెట్ చేశారని తారా చౌదరి ఆరోపించారు. తన భర్త ఒంటిపై గాయాలను మీడియాకు చూపించారు. ఆమె చేసిన ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు తెలిపారు.

ఏపీలో 31 మంది కరోనా యోధులకు వైరస్


ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కట్టడికోసం ముందుండి పోరాడుతున్న వారిలో31 మందికి వైరస్ కు గురయ్యారు. వారిలో క‌రోనా రోగులకు చికిత్స ఇస్తున్న 12 మంది డాక్ట‌ర్లు, 12 మంది న‌ర్సులు, ఏడుగురు పారిశుధ్య కార్మికులు ఉన్నార‌ని ఆరోగ్య శాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్రెట‌రీ జ‌వ‌హ‌ర్ రెడ్డి వెల్లడించారు.

అలాగే రాజ్ భవన్ లో న‌లుగురికి కరోనా పాజిటివ్ రావడం తెలిసిందే. దానితో గవర్నర్ దంప‌తుల‌కు కూడా టెస్ట్ చేశామ‌ని, వారికి నెగటివ్ వచ్చిందని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో కీలకమైన ఒక మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న అటెండర్ కు కూడా పాజిటివ్ రావడంతో అక్కడ ఆపనిచేస్తున్న ఉద్యోగులు అందరు ఖంగారు పడుతున్నారు.

రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన పరీక్షల్లో 73 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసులు 1332 కాగా.. 287 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 31 మరణించారు. ప్రస్తుతం 1014మంది చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎక్కువగా 29 కేసులు గుంటూరు జిల్లాలో నమోదయ్యాయి.

దానితో ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 283 కాగా, కర్నూల్‌లో 343, కృష్ణా 236, నెల్లూరు 82, చిత్తూరు 77, కడప 69, ప్రకాశం 60, పశ్చిమగోదావరి 56, అనంతపురం 58, తూర్పుగోదావరి 40, విశాఖ 23, శ్రీకాకుళం జిల్లాలో 05 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్త కేసులన్నీ కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచే వస్తుండటం గమనార్హం.

‘ప్రతి పదిలక్షల మందికిగానూ 1504 పరీక్షలు చేస్తూ దేశంలోనే ముందంజలో ఉన్నాం. పాజిటివ్‌ కేసులు దేశంలో సగటున 4.13 శాతం ఉంటే, రాష్ట్రంలో 1.57 శాతమే. మరణాల రేటు జాతీయస్థాయిలో 3.19 శాతం ఉంటే.. రాష్ట్రంలో 2.46 శాతమే’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

రంజాన్ రోజుల్లో లాక్ డౌన్ కు కేసీఆర్ సడలింపు!


తెలంగాణలో అకస్మాత్తుగా కరోనా పరీక్షలు తగ్గించడం, లాక్ డౌన్ నిబంధనల అమలు పట్టించుకొనక పోవడం వెనుక రంజాన్ మాసం ప్రారంభమే కారణమనే సంకేతాలు వెలువడుతున్నాయి. చివరకు రెడ్ జోన్ లలో కూడా లాక్ డౌన్ నిబంధనలను గాలికి వదిలివేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.

ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ప్రతి రోజూ రంజాన్ పిండివంటలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవంక ప్రతి రోజు సాయంత్రం ముస్లింల దుకాణాల తెరుచుకోవడానికి లోపాయికారిగా అనుమతి ఇస్తున్నారు. రెడ్ జోన్ లలో సహితం యధేచ్చగా యువకులు తిరుగుతున్నా వారిని ఆడుకొనే ప్రయత్నం జరగడం లేదు.

రాష్ట్రాలకు కాసులు రాల్చని మోదీ ప్రభుత్వం

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ప్రార్ధన మందిరాలు అన్నిట్నీ మూసివేశారు. పండుగలు ఏవీ బహిరంగంగా జరుపుకోరాదని స్పష్టం చేస్తున్నారు. అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే ఇప్పటికే రాజకీయ వత్తిడుల కారణంగా పాత బస్తి వంటి ప్రాంతాలలో లాక్ డౌన్ నిబంధనలను గాలికి వదిలి వేస్తున్నారు.

ఇక ఇప్పుడు రంజాన్ సందర్భంగా ముస్లింలు అందరికి సాయంత్రం 4 గంటల నుండి తమ షాప్ లను తెరచుకోవడానికి అనధికారిరకంగా అనుమతి ఇస్తున్నారు. పలు చోట్ల రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచే ఉంటున్నాయి. దేశంలో మరెక్కడా ఇటువంటి వెసులుబాటు ఇవ్వకపోవడం గమనార్హం.

హిందువులు సాంప్రదాయం గా జరుపుకొనే, హోలీ ఉగాది శ్రీరామనవమి వంటి మహా పండుగలను ఇళ్ళల్లోనే నిర్వహించుకున్నారు. కానీ రంజాన్ పండుగకు మాత్రం వారి ఇష్టానికి వదిలివేస్తున్నారు. ఇదంతా పాతబస్తీ కేంద్రంగా ఉన్న రాజకీయ పక్షం వత్తిడులే కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వరంగల్ మండి బజార్ లో నాలుగైదు రోజుల క్రితం జరిగిన గొడవ తదనంతరం స్థానిక ఎమ్మెల్యే పోలీసు అధికారులు కొంతమేరకు వారి కోసం కొంత సడలింపు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. మండి బజార్ ప్రాంతం పూర్తిగా రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ ఇలాంటి ఈ సంఘటన జరుగుతుండడం భయాందోళనలకు గురి చేస్తుంది.

ఇలా ఉండగా, హైదరాబాద్ లో పరిస్థితుల పరిశీలనకు రెండు, మూడు రోజుల పర్యటనకు మాత్రమే వచ్చిన కేంద్ర బృందం ఐదో రోజు కూడా ఇక్కడే మకాం వేయడం, పలు ప్రదేశాలకు ఆకస్మిక పర్యటనలు జరపడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులలో కలకలం రేపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను నిర్ధారించుకొనే ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

మహమ్మారికి వెయ్యిమంది బలి!

దేశంలో కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటగా, కేసుల సంఖ్య 31,332 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ సోకడం వల్ల చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 22,629 కాగా, 7,695 మంది కోలుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మంగళవారం సాయంత్రం నుంచి మొత్తం 70 మరణాలు సంభవించాయి. దింతో కరోనా భారిన పడి మరణించిన వారి సంఖ్య 1007కి చేరింది. వీటిలో 31 మరణాలు మహారాష్ట్ర నుండి, 19 గుజరాత్ నుండి, ఏడు మధ్యస్థాదేశ్, రాజస్థాన్ నుండి ఐదు, ఉత్తర ప్రదేశ్ నుండి మూడు, పశ్చిమ బెంగాల్ నుండి రెండు మరియు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ నుండి ఒక్కొక్కరు మరణించారు.

1,007 మంది మరణాలలో 400 మంది మరణాలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది, గుజరాత్ 181 వద్ద, మధ్యప్రదేశ్ 120, ఢిల్లీ 54, రాజస్థాన్ 51, ఉత్తర ప్రదేశ్ 34, ఆంధ్రప్రదేశ్ 31 తర్వాత స్థానాలలో ఉన్నాయి.

ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య తెలంగాణలో 26, తమిళనాడులో 25, పశ్చిమ బెంగాల్‌లో 22 కాగా, కర్ణాటకలో 20 మందిగా నమోదయ్యింది. అలాగే పంజాబ్‌లో ఇప్పటివరకు 19 మరణాలు నమోదయ్యాయి. ఈ వ్యాధి వల్ల జమ్మూ కాశ్మీర్‌లో ఎనిమిది, కేరళలో నలుగురు, జార్ఖండ్, హర్యానాలో మూడు మరణాలు నమోదయ్యాయి. బీహార్‌ లో రెండు మరణాలు సంభవించగా, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, అస్సాం ఒక్కొక్కటి మరణించినట్లు మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఉదయం అప్‌డేట్ చేసిన గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా 9,318 కేసులు నమోదయ్యాయి. గుజరాత్ 3,744, ఢిల్లీ 3,314, మధ్యప్రదేశ్ 2,387, రాజస్థాన్ 2,364, తమిళనాడు 2,058, ఉత్తర ప్రదేశ్ 2.053, ఆంధ్రప్రదేశ్‌ లో 1,259, తెలంగాణలో 1,004 కేసులకు పెరిగింది. పశ్చిమ బెంగాల్‌ లో 725, జమ్మూ కాశ్మీర్‌లో 565, కర్ణాటకలో 523, కేరళలో 485, బీహార్‌లో 366, పంజాబ్‌ లో 322 కేసుల సంఖ్య పెరిగింది. హర్యానాలో 310 కరోనావైరస్ కేసులు, ఒడిశాలో 118 కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్‌లో మొత్తం 103 మందికి, ఉత్తరాఖండ్‌లో 54 మందికి ఈ వైరస్ సోకింది.

చండీఘర్ లో 56 కేసులు, హిమాచల్ ప్రదేశ్‌ లో 40 కేసులు, అస్సాం, ఛత్తీస్‌గడ్ లో ఇప్పటివరకు 38 కేసులు నమోదయ్యాయి. అండమాన్, నికోబార్ దీవుల్లో 33 కోవిడ్ -19 కేసులు ఉండగా, లడఖ్‌ లో ఇప్పటివరకు 22 కేసులు నమోదయ్యాయి. మేఘాలయలో 12 కేసులు, పుదుచ్చేరిలో ఎనిమిది కేసులు, గోవాలో ఏడు కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. మణిపూర్, త్రిపురాల్లో రెండు కేసులు ఉండగా, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్‌ లో ఒక్కో కేసు నమోదైందని కేంద్ర మంత్రుత్వ శాఖ వెల్లడించింది.

మహేష్ బాబు మూవీ కి కథ మారింది


సరిలేరు నీకెవ్వరు చిత్రం తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకొన్న మహేష్ బాబు తన తరవాతి సినిమా విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటు యాక్షన్ ఎంటర్ టైనర్ కంటే ఫామిలీ ఎంటర్ టైనర్ మేలు అనుకోని ఆ దిశగా ఆలోచించాడు. ఆ క్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రాబోతుంది. కాగా కథ ప్రకారం ఈ చిత్రంలో చాల భాగం యుఎస్ బ్యాక్‌ డ్రాప్ లో షూటింగ్ జరపాలట .. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో షూట్ చేయడం కష్టం కనుక స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా ఈ చిత్రం యొక్క నటీనటుల ఎన్నిక జరుగుతోంది. మహేష్ బాబుకు జోడీగా మహానటి కీర్తి సురేష్ ఖాయం అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. రీసెంట్ గా ఇదే విషయాన్నీ ఉపేంద్ర మీడియా తో చెప్పడం జరిగింది . సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో పోషించిన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్నా అది విలన్ పాత్ర కాదు. కాగా కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, మహేష్ బాబు సినిమాలో విలన్ గా చేయడానికి కొంచెం ఆలోచిస్తున్నానని ఈ మధ్యనే అన్నాడు . కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం ఉపేంద్ర నే ఒప్పించాలని పట్టుదలగా ఉన్నారు .

వైసిపి ఎంపీ కల్యాణ మండపంలో రేషన్ బియ్యం!


అనకాపల్లిలో వైసిపి ఎంపీ కుటుంబంకు చెందిన కల్యాణ మండపంలో రేషన్ బియ్యం దర్శనమివ్వడం కలకలం రేపుతున్నది.

స్థానిక ఎంపీ డా. సత్యవతి కుటుంబం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న వివేకానంద ట్రస్ట్ కు చెందిన కల్యాణమండపంలో సోమవారం రాత్రి అన్‌లోడ్‌ జరిగిన రేషన్ బియ్యాన్ని రెవిన్యూ అధికారులు పట్టుకోవడంతో రాజకీయ దుమారం చెలరేగింది.

‘కరోనా’ వైసీపీ నాయకులకు ఏటీఎం గా మారింది: బాబు

రేషన్ షాప్ లకు వెళ్ళవలసిన రేషన్ బియ్యాన్ని అన్‌లోడ్‌ చేస్తుండగా సిపిఎం కార్యకర్తలు పట్టించారు. ఈ విషయమై జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌ అనకాపల్లి వెళ్లి విచారణ జరిపారు. బియ్యం దారిమళ్లింపు వాస్తవమేనని విచారణలో తేలడంతో ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జిని సస్పెండ్‌ చేశారు.

అలాగే 30వ నంబరు డిపో డీలర్‌ను కూడా సస్పెండ్‌ చేశారు. వాహనాన్ని దారిమళ్లించిన కాంట్రాక్టర్‌-2 వాహనాన్ని సీజ్‌ చేసి, బ్లాక్‌ లిస్టులో పెట్టారు.

వాహనంలో పది టన్నుల బియ్యం తరలింపునకు మాత్రమే రిలీజ్‌ ఆర్డర్లు వుండగా, 10.5 టన్నులు తీసుకువెళ్లినట్టు తేలడంతో సంబంధితులపై చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ డీవీఎంకు శివశంకర్ సూచించారు. ఎంపీ ట్రస్టుపై 6ఏ కేసు పెట్టాలని డిప్యూటీ తహసీల్దార్‌ను ఆదేశించారు.

ఇలా ఉండగా, ఈ నెల 30న జరుగనున్న అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి జన్మదిన వేడుకల్లో పేదలకు పంపిణీ చేయడానికి బియ్యం పంపాలంటూ కొంతమంది రేషన్‌ డీలర్లను ఒత్తిడి చేసినట్టు ప్రచారం జరుగుతున్నది.

కానీ రేషన్‌ బియ్యం ఇలా ఇవ్వడం సాధ్యం కాదని, పంపిణీ వ్యవహారమంతా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు అవుతుందని చెప్పడంతో డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ బియ్యం పంపినట్టు తెలుస్తున్నది.

బిజెపి మద్దతు దారులకే భారీగా రుణాల రద్దు!


కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర్కొంటున్న‌ది. ఇలాంటి క్లిష్ట‌ సంద‌ర్భంలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిన ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా బిజెపిని ఇరకాటంలో పడవేస్తున్నది. ఎక్కువగా రుణాలు ఎగవేస్తినా వారి 50 మంది జాబితా ప్రకటించామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభలో కోరగా అందుకు ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ నిరాకరించారు.

అయితే ఇప్పుడు ఈ జాబితాను సమాచార హక్కు చట్టం క్రింద ఆర్‌బీఐ ప్రకటించడం బిజెపిని ఆత్మరక్షణలో పడవేస్తున్నది. వీరిలో అత్యధికులు బిజెపికి సన్నిహితులని స్వయంగా రాహుల్ గాంధీ ఆరోపించడమే అందుకు కారణం. ప్రకటించిన 50 మందికి సంబంధించి రూ.68,607 కోట్ల రుణాల‌ను సాంకేతికంగా మాఫీ చేసిన‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది. సెప్టెంబర్ 30, 2019 నాటికి బ్యాంకుల్లో బ‌కాయిప‌డ్డ‌ రూ.68,607 కోట్ల‌ రుణాలను నిలిపివేసినట్లు ఆర్బీఐ సమాధానంగా చెప్పింది.

రుణాలు తీసుకుని ఎగవేసిన టాప్‌-50 కార్పొరేట్ల బకాయిలను బ్యాంకులు సాంకేతికంగా వదిలించుకున్నాయి. గతేడాది సెప్టెంబర్‌ 30 వరకు రూ.68,607 కోట్ల కార్పొరేట్‌ రుణ బకాయిలను దేశీయంగా బ్యాంకులు రద్దు చేశాయి. వీటిలో మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యాకు చెందిన సంస్థలతోపాటు దక్కన్‌ క్రానికల్‌ తదితర సంస్థల బాకీలున్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తెలిపిన వివరాల ప్రకారం చోక్సీ (పీఎన్‌బీ కుంభకోణం ప్రధాన నిందితుల్లో ఒకరు)కి చెందిన గీతాంజలి జెమ్స్‌, గిల్లీ ఇండియా, నక్షత్ర బ్రాండ్‌ బకాయిలు అత్యధికంగా రూ.8,048 కోట్లు రద్దు కావడం గమనార్హం.

ఆ తర్వాత ఆర్‌ఈఐ అగ్రో రూ.4,314 కోట్లు, విన్సమ్‌ డైమండ్స్‌ రూ.4,076 కోట్లున్నాయి. అలాగే రోటోమాక్‌ గ్లోబల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2,850 కోట్లు, కుడోస్‌ కెమీ లిమిటెడ్‌ రూ.2,326 కోట్లు, రుచి సోయా రూ.2,212 కోట్లు, జూమ్‌ డెవలపర్స్‌ రూ.2,012 కోట్ల బకాయిలను బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు ఆర్బీఐ చెప్పింది.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ.1,943 కోట్లు, ఫరెవర్‌ ప్రీషియస్‌ జ్యుయెల్లరీ అండ్‌ డైమండ్స్‌ రూ.1,962 కోట్లు, దక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ రూ.1,915 కోట్ల బకాయిలు కూడా రద్దయ్యాయి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 16 దాకా ఉన్న వివరాలను తెలుపాలంటూ తన దరఖాస్తులో ఆర్టీఐ కార్యకర్త సాకేత్‌ గోఖలే ఆర్బీఐని కోరారు. అయితే నిరుడు సెప్టెంబర్‌ 30 వరకున్న సమాచారాన్నే ఆర్బీఐ అందించింది. ఫిబ్రవరి 16దాకా సమాచారం లేదని స్పష్టం చేసింది. ఇదిలావుంటే రద్దయిన బాకీలకు సంబంధించిన సంస్థలు, వాటి యజమానులపై సీబీఐ, ఈడీల దర్యాప్తులు జరుగుతున్నాయి.

ఈ మేరకు ఆర్టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే తన ట్విటర్ ఖాతా ద్వారా వివరాలను వెల్ల‌డించారు. టాప్ 50 ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై రాహుల్‌ గాంధీ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థికమంత్రి సమాధానం చెప్ప‌డానికి నిరాక‌రించడంతో తాను అదే విషయంపై ఆర్టీఐని ఆశ్రయించాన‌ని గోఖలే ట్వీట్ చేశారు.

ఇప్పుడు ఆర్‌బీఐ వెల్లడించిన జాబితాలో నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ త‌దిత‌ర‌ బీజేపీ స‌న్నిహితులు ఉన్నార‌ని, అందుకే ప్రభుత్వం పార్లమెంట్‌లో వాస్తవాలను కప్పిపుచ్చిందని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమాకి 32 ఏళ్ళు


1998 ఏప్రిల్ 29 న చిరంజీవి హీరోగా ఆయన ఫ్రెండ్స్ అయిన నటుడు నారాయణ రావు , పిచ్చకొట్టుడు ఫేమ్ నటుడు సుధాకర్ నిర్మించిన ఒక చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటివరకు తెలుగులో ఉన్న బాక్స్ ఆఫీస్ రికార్డు కలెక్షన్స్ అన్నిటిని అవలీలగా తుడిచి పెట్టింది. ఆ క్రమంలో తెలుగులో మొదట సారిగా తెలుగులో 5 కోట్లకు పైగా షేర్ సాధించిన తొలి చిత్రం గా ఒక రికార్డు క్రియేట్ చేసింది .కేవలం 30 లక్షల బడ్జట్ తో నిర్మించ బడ్డ ఈ సినిమా అప్పటి ఆంధ్ర ప్రదేశ్ లో 5.కోట్ల 60 లక్షలు షేర్ సాధించి సినీ పండితుల్ని ఆశ్చర్య పరిచింది.

కాగా ఈ `యముడికి మొగుడు ` చిత్రం తో దర్శకుడు రవిరాజా పినిశెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఈ చిత్రంలో చిరంజీవిని స్టైలిష్ గా చూపడంతో పాటు , పాటల చిత్రీకరణ లో వినూత్న వరవడి కి నాంది పలికాడు. అవన్నీ చూసి చిరంజీవి అభిమానులు వెర్రెత్తి పోయారు. సినిమా కి నీరాజనాలు పలుకుతూ ఒకటికి పది సార్లు మూవీ చూసారు .. ఇక ఈ చిత్ర విజయానికి మూల స్తంభాల్లా నిలిచిన సత్యానంద్ , రాజ్ కోటి గురించి యెంత చెప్పినా తక్కువే ..ఈ సినిమాలోని వానజల్లు గుచ్చుకొంటే ఎట్టాగమ్మా , అధరం హిందోళం పాటలు అప్పటి శ్రోతల్ని ఉర్రూత లూగించాయి వెరసి ” యముడికి మొగుడు ” చిత్రం చిరంజీవి సినీ కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచి పోయింది ..

బాలయ్యతో అనిల్ రావిపూడి


సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ సినిమాలకి ఇటీవల ఆదరణ బాగా తగ్గింది.వరుసగా పైసా వసూల్ , జై సింహ , ఎన్ టి ఆర్ కధానాయకుడు , ఎన్ టి ఆర్ మహానాయకుడు , రూలర్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాల్చీ తన్నాయి. అందుకే బాలకృష్ణ తనకి అలవాటు లేకపోయినా కానీ బోయపాటి శ్రీను కథ సిద్ధం చేసేవరకు వేచి చూసాడు

ఇదిలావుంటే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్య కి
వీరాభిమాని. .బాలకృష్ణతో సినిమా చేయాలనేది అతని చిరకాల స్వప్నం. ఆ క్రమంలో ఇంత‌కుముందు అనిల్ రావిపూడి బాలకృష్ణ తో ` రామారావు ` అనే సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే బాల‌య్య ఆసక్తి చూపలేదు . కానీ ఇప్పుడు బాల‌య్య ఆలోచ‌న మారింది. అనిల్‌ రావిపూడి తో సినిమా చేయ‌డానికి బాలయ్యే రాయ‌బారం పంపాడ‌ని తెలుస్తోంది .

దర్శకుడిగా ఇప్పుడు ఎంత డిమాండ్ పెరిగినా కానీ అనిల్ రావిపూడికి బాలయ్య పై అభిమానం అలాగే ఉంది. అందుకే ఆయనతో సినిమా తీసి తీరాలని ఫిక్స్ అయ్యాడు. ఇది తెలిసి బాలయ్య సంతోషంగా అనిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. కాగా అనిల్ రావిపూడి తో వరుస సినిమాలు చేస్తున్న దిల్ రాజు బ్యానర్ లోనే ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది .

తెలంగాణలో కరోనా కేసుల తగ్గుదలకు కారణమేంటి?

TRS


తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పడిపోతోంది. మంగళవారం కొత్తగా కేవలం 6 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ 6 కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. తాజా కేసులతో తెలంగాణలో 1009కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటిదాకా 25మంది మృతిచెందారు. మంగళవారం డిశ్చార్జి కానున్న 42మందితో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 374 మంది డిశ్చార్జి అయ్యారు.

*తెలంగాణలో తగ్గుతున్నాయా? పరీక్షలు లేవా?
తెలంగాణ కరోనా తగ్గుముఖం పడుతున్నాయని సర్కారు చెబుతోంది. ఏపీలో పెరుగుతున్నాయి. ఏపీలో వేలకు వేల పరీక్షలు చేస్తుండడంతో 100లోపు కేసులు నమోదవుతున్నాయి. అయితే అందుకు భిన్నంగా తెలంగాణలో కేవలం లక్షణాలు బయటపడ్డవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో సింగిల్ డిజిట్ కే కేసులు పరిమితమవుతున్నాయి. నిజానికి పరీక్షలు లేని కారణంగా కేసులు తగ్గుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి..

*పరీక్షలు తగ్గించిన తెలంగాణ
కరోనా వైరస్ వ్యాపించకుండా పక్కనున్న ఏపీ సహా అన్ని రాష్ట్రాలు కేసుల సంఖ్యను పెంచుతున్నాయి. సీఎం జగన్ అయితే కొరియా నుంచి కొత్త కరోనా కిట్స్ తెప్పించి మరీ వందల సంఖ్యలో రోజుకు పరీక్షలు చేస్తున్నారు. కానీ తెలంగాణ మాత్రం లక్షణాలు బయటపడ్డ వారికే చేయడం చర్చనీయాంశమవుతోంది. మార్చి 22 నుంచి దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను అన్ని రాష్ట్రాలు పెంచగా తెలంగాణ మాత్రం తగ్గించడం అనుమానాలకు తావిస్తోంది.

*లక్షణాలతో వచ్చిన వారికి చేయని వైనం
తాజా సమాచారం ప్రకారం.. కొంతమంది వ్యక్తులు తమకు కరోనా లక్షణాలున్నాయని.. టెస్టులు చేయాలని కింగ్ కోఠి ఆస్పత్రికి పెద్ద ఎత్తున వస్తున్నారట. అయితే రోగి వయసు, ట్రావెల్ హిస్టరీ, ఎవరెవరితో సంబంధం ఉందని చూసి ఏమీ లేకపోవడంతో వారికి పరీక్షలు చేయకుండానే పంపిస్తున్నారట.. తాజాగా ఓ జర్నలిస్టుకు ఇదే చేదు అనుభవం ఎదురుకావడం గమనార్హం.

*హాట్ స్పాట్ లోనే పరీక్షలు.. బయటవారికి బంద్?
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆదేశాల ప్రకారం హాట్ స్పాట్స్ లో నివసించే వారికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడితే కరోనా పరీక్షలు చేయాలి. కేంద్రం కూడా ఇవే ప్రొటోకాల్ పాటించాలని సూచించింది. దీని ఆధారంగా తెలంగాణ సర్కారు పరీక్షలను పూర్తిగా తగ్గించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి పడితే వారికి బయట నుంచి వచ్చిన వారికి చేయవద్దని సూచించింది. తాజాగా న్యూస్ 18 సీనియర్ జర్నలిస్టు ప్రియ తనకు కరోనా టెస్టులు చేయమన్నా అధికారులు చేయలేదట.. 33 ఏళ్ల వయసున్న మీరు కరోనాతో మీ శరీరం పోరాడగలదని.. టెస్టు అవసరం లేదని తిప్పి పంపించారట..దీన్ని ట్విట్టర్ లో పెట్టి ఆమె తెలంగాణ వైద్యుల తీరును ఎండగట్టింది. దీన్ని బట్టి తెలంగాణ సర్కారు పరీక్షలు చేయకుండా కరోనా కేసులను తక్కువగా చూపిస్తోందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

* కేంద్రాన్ని బూచీగా చూపి తెలంగాణ మమ అంటోందా?
కరోనా పరీక్షల విషయంలో కేంద్రం నిబంధనలు సాకుగా చూపి తెలంగాణ సర్కారు పరీక్షలను చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయంగా దేశాలు కూడా పూర్తిగా లక్షణాలు బయటపడి సీరియస్ ఉన్నవారికే చికిత్సలు చేస్తున్నాయి. తెలంగాణ కూడా ఇదే ఫార్ములాను అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 27నాటికి జాతీయ సగటు 620తో పోలిస్తే ప్రతీ పది లక్షల మందికి 375 పరీక్షలు నిర్వహించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇదే పొరుగు రాష్ట్రం ఏపీ ఇదే 10 లక్షలమందికి 1100 పరీక్షలు నిర్వహించింది. పరీక్షల విషయంలో పారదర్శకత పాటించని తెలంగాణ సర్కారు ఇలా నిర్లక్ష్యంగా పరీక్షలు చేయక మూల్యం చెల్లించుకుంటుందా అన్న అనుమానాలకు కలుగుతున్నాయి. మరి మున్ముందు కరోనా నిజంగానే తగ్గిందా? పరీక్షలు చేయకపోవడం వల్లనే కేసులు బయటపడడం లేదా అన్నది తేలాల్సి ఉంది.

–నరేశ్ ఎన్నం

విశాఖలో కేసుల్లేవ్.. రాజధాని కోసం దాచేస్తున్నారా?


ఏపీ వ్యాప్తంగా కరోనా ప్రబలుతోంది. మొన్నటి వరకు అస్సలు ఉనికే లేని శ్రీకాకుళంలో కూడా ముగ్గురికి సోకింది. కానీ ఆరంభంలో విశాఖపట్నంలో అధికంగా కేసులు నమోదై ఇప్పుడు వ్యాప్తియే లేకుండా పోయింది. ఏంటీ మతలబు అన్నది అంతుచిక్కని విధంగా ఉంది. దీనివెనుక కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ తొలుస్తోంది.

*విశాఖల్లో కేసుల్లేవ్.. మతలబు ఏంటి?
గడిచిన వారం పదిరోజులుగా విశాఖలో కొత్త కేసులు లేనే లేవు. పైనున్న శ్రీకాకుళంలో వెలుగుచూసినా విశాఖలో అస్సలు కరోనా వ్యాప్తియే లేదు. ఆరంభంలో చాలా ఎక్కువగా నమోదైన కేసులు తర్వాత ఇంత వేగంగా సున్నాకు పడిపోతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

*కొత్త రాజధానిలో దాచేస్తున్నారా?
ఏపీ కొత్త రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖ పట్నంకు వైసీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. దాని ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కాపాడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖపట్నంలో ఆరంభంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కొద్దిరోజులుగా విశాఖ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఒక్కసారిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా బాధితులను ప్రభుత్వం దాస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఆరోపణలకు బలం చేకూరుస్తూ అక్కడ కేసుల సంఖ్య కొద్దిరోజులుగా ఒక్కటి నమోదు కాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

*విశాఖలో సున్నా కేసులు
ప్రభుత్వం విడుదల చేసిన తాజాగా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఆ జిల్లాలో 22 కేసులు నమోదయ్యాయి. అందులో కేవలం మూడు మాత్రమే యాక్టివ్ కేసులులున్నాయి. 19మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్యయ్యారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. కొత్తగా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. ఇంత ప్రబలంగా ఆరంభంలోనే కరోనా విస్తరించి ఇప్పుడు సున్నాకు పరిమితం కావడం అన్ని వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు పెరిగి విశాఖలో మాత్రం తగ్గుదల అందరిలోనూ అనుమానాలకు కారణం అవుతోంది. గడిచిన వారం రోజులుగా అయితే ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రెడ్ జోన్ల సంఖ్య కూడా ఇక్కడ నామమాత్రంగా ఉంది. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

* రాజధాని కోసమేనంటూ ప్రచారం..
రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో ప్రతీరోజు కనీస సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా విశాఖలో మాత్రం వారంరోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు కరోనా కేసులను దాచిపెట్టి ప్రభుత్వం రాజధాని తరలింపునకు రంగం సిద్ధం చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కరోనా కేసుల సంఖ్య లేకపోవడం అనుమానాలకు కారణమవుతోంది. అయితే అధికారులు మాత్రం దీనిపై నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది.

*అనుమానితులున్నా.. కేసులు సున్నా..
నిజానికి విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ కొద్దిరోజులుగా అక్కడక్కడా అనుమానితులను గుర్తిస్తున్నారు. వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. వారి నమూనాలను పరీక్షలకు పంపుతున్నారు. అయితే పాజిటివ్ రావడం లేదని తెలుపుతున్నారు. విశాఖ సరిహద్దుల్లో కేసులు లేని శ్రీకాకుళం, విజయనగరం ఉండడం.. సరిహద్దు ఒడిషాలో అసలే కేసులు లేకపోవడం.. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడడం కేసులు లేకపోవడానికి కారణమంటున్నారు. అయితే విపక్షాలు మాత్రం రాజధాని కోసమే కేసుల సంఖ్యను దాచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

-నరేశ్ ఎన్నం

చైనా నుండి మరో సంచలన వార్త!


2019వ సంవత్సరం చివరిలో పుట్టిన కరోనా మహమ్మారి 2020లో తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. ఈ మాయదారి వైరస్ విజృంభనతో ప్రపంచ దేశాలు వణికిపోతున్న తరుణంలో చైనా నుండి వచ్చిన మరో సంచలన వార్త హాట్ టాపిక్ గా మారింది. మనిషి తన జీవితంలో సుదీర్ఘకాలంపాటు కోవిడ్‌19 తో ప్రయాణం చేయాల్సి ఉంటుందని చైనా చెప్పిన వార్తకు వివిధ దేశాల నుండి భయాందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మహమ్మరిని పూర్తిగా రూపుమాపలేమని చైనాకు చెందిన వైద్యశాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 సీజనల్‌ ఫ్లూ మాదిరిగా ప్రతియేడు ఉనికి చూపెడుతుందని వెల్లడించారు.

ఈ వైరస్ ఇప్పుడే అంతం కావడం కష్టమని, సుదీర్ఘకాలంపాటు కోవిడ్‌ ఉంటుందని చైనాలోని అత్యున్నత పరిశోధన సంస్థ పాథోజెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జిన్‌ కి పేర్కొన్నారు. భారత్‌ లోని వైద్యశాస్త్ర నిపుణులు కూడా ప్రపంచ మానవాళిపై సార్స్‌-కోవ్‌-2 తిష్ట వేసుకు కూర్చుందని చెప్తున్నారు. అత్యధిక ట్రాన్స్‌మిషన్‌ రేటు కలిగిన కోవిడ్‌ చాలాకాలం మనుగడలో ఉంటుందని అంటున్నారు. ఇక ఇదే అభిప్రాయాన్ని అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్‌ఫెక్చువస్‌ డైరెక్టర్‌ ఆంథోని ఫాసీ కూడా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ శీతాకాలం ఫ్లూగా మానవ జీవితంలో భాగమవుతుందన్నారు. రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులపై కోవిడ్‌ మళ్లీ మళ్లీ దాడి చేస్తుందని భారత వైద్య పరిశోధన మండలిలో పనిచేసిన ఎపిడెమాలజిస్టు డాక్టర్‌ లలిత్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు.

ప్రతియేడు ఫ్లూ కారణంగా మూడు లక్షల నుంచి 6 లక్షల 50 వేల మంది మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ తో కోవిడ్‌ చెక్‌ పెట్టొచ్చునని వైద్యశాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు.