Home Blog Page 8508

రెండు సినిమాలకు కథ రెడీ చేస్తున్న దర్శకుడు తేజ


నేనే రాజు నేనే మంత్రి ‘ చిత్రం తరవాత ` సీత ` సినిమా తో సరైన విజయం అందుకోని దర్శకుడు తేజ ఇపుడు వెబ్ సిరీస్ చేయబోతున్నాడు అని వస్తున్న వార్తలను ఖండించడం జరిగింది . నాకు వెబ్ సిరీస్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని తేల్చి చెప్పడం జరిగింది. కొద్ది రోజుల నుంచి ప్రముఖ వార్తాసంస్థలు కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు తేజ ని వెబ్ సిరీస్ కోసం సంప్రదించినట్టు వార్తలు రావడం తో తేజ ఈ విధంగా స్పందించాల్సి వచ్చింది అని తెలిపాడు ..అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టి లో పెట్టుకొని తేజ తాను డైరెక్ట్ చేసినా , చేయక పోయినా నిర్మాతగా వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్న వార్తలు కూడా బయటికి వచ్చాయి అని తేజ తెలిపాడు .

నిజానికి ఏమి జరుగుతుందంటే దర్శకుడు తేజ ప్రస్తుతం రెండు సినిమా స్క్రిప్ట్ లను రెడీ చేస్తున్నాడు. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి తీరాలన్న పట్టుదలతో నేను సినిమా స్క్రిప్ట్ లను తయారు చేసుకొంటుంటే నాపై ఈ అనవసర గాసిప్స్ వచ్చాయి అని తేజ తెలిపాడు. మరోసారి చెబుతున్నాను నేను వెబ్ సిరీస్ చెయ్యను గాక చెయ్యను అన్నాడు .

మహా నటుడి మరణానికి చిరు ప్రతిస్పందన


నిన్న ఏప్రిల్ 29.. అంత‌ర్జాతీయ నృత్య దినోత్స‌వం సంద‌ర్భంగా సాయంత్రం ఆరు గంటలకు ఇప్ప‌టిదాకా ఎవ‌రూ చూడ‌ని డ్యాన్స్ వీడియోలు కొన్ని వ‌ర‌ల్డ్ డ్యాన్స్ డే సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిరంజీవి ప్రకటించడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆ ప్రయత్నం విరమించడం జరిగింది.

స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి

దేశంలోనే కాదు అంతర్జాతీయం గా కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్న ప్రముఖ హిందీ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ మ‌ర‌ణ వార్త విన్న చిరంజీవి తన డాన్స్ వీడియో లు ట్విట్టర్ లో పోస్ట్ చేసే కార్యక్రమం విరమించు కొన్నాడట .. 2018 నుంచి క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఈ లెజెండ‌రీ బాలీవుడ్ న‌టుడు ముంబ‌యిలోని కోకిలా బెన్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 29 ఉద‌యం మ‌ర‌ణించాడు.నిజానికి చిరంజీవి ఉద‌యం డ్యాన్స్ వీడియోల గురించి ట్విట్టర్ లో ప్ర‌క‌ట‌న చేసే స‌మ‌యానికి ఇర్ఫాన్ ఖాన్ మ‌ర‌ణ వార్త ఆయ‌న‌కు తెలియ‌లేదు. త‌ర్వాత ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త తెలుసుకొన్న చిరంజీవి తన డాన్స్ వీడియోల విరమణ ద్వారా నివాళి అర్పించాడు.

రాజస్థాన్ లోని జైపూర్ లో పుట్టిన సహాబజాదే ఇర్ఫాన్ అలీ ఖాన్ , నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా ( N S D ) లో నసీరుద్దీన్ షా ప్రముఖుల ఆద్వర్యం లో నటన నేర్చుకొని అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. 1988 లో `సలాం బాంబే ‘ చిత్రం తో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఇర్ఫాన్ ఖాన్ ” హాసిల్ , పాన్ సింగ్ తోమర్ , మఖ్బూల్ , లైఫ్ ఇన్ మెట్రో , ది లంచ్ బాక్స్ , హిందీ మీడియం , తల్వార్ వంటి హిందీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పిచడం జరిగింది అంతేకాదు ” జురాసిక్ వరల్డ్ ,. ది అమేజింగ్ స్పైడర్ మాన్ ,, ఇన్ ఫెర్నో,, స్లమ్ డాగ్ మిలియనీర్ ,, లైఫ్ అఫ్ ఫై ,, ది నేమ్ సేక్ , , ది వారియర్ , ఎ మైటీ హార్ట్ ” వంటి ఆంగ్ల చిత్రాల్లో నటించి విశ్వ ఖ్యాతి సంపాదించాడు. భార్య సుతాప సిఖ్దర్ , విద్యా బాలన్ నటించిన ” కహాని ” చిత్ర రచయిత్రి ,అంతేకాదు N S D లో ఇర్ఫాన్ ఖాన్ సహచరి. .వీరికి బాబిల్ , అయాన్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు ..

ఇంతటి గొప్పనటుడికి చిరంజీవి నివాళి అర్పించడం నిజంగా సమర్థనీయం. అందులో ఎటువంటి సందేహం అక్కర లేదు .. .

హెరిటేజ్ లో ‘కరోనా’పై చంద్రబాబు స్పందించాలి


హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో ఉన్న హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో పని చేస్తున్న కొందరు ‘కరోనా’ బారిన పడ్డారంటూ జరుగుతున్న ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి పాలప్యాకెట్లు తీసుకు వెళతారు కనుక ఇలాంటి చోట ‘కరోనా’ బాధితులు ఉంటే విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని అన్నారు. కనుక, తక్షణమే ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని అన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి చాలా సలహాలు ఇచ్చే చంద్రబాబు, తమ సంస్థలో వైరస్ బాధితులు ఉన్నారన్న ప్రచారంపై వివరణ ఇవ్వకపోతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తికమకపడే అవకాశం ఉంది కనుక దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉప్పల్ లోని హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో సుమారు 40 మందికి కరోనా సోకిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సంస్థ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులలో ఆందోళన నెలకొంది. సంస్థ నిర్వాహకులు ఈ సంఘటనపై స్పందించ లేదు.

కరోనా రోగుల సేవలకు రోబోలు..!


కరోనా వైరస్ బారినపడిన వారికి సేవలందిస్తున్న వైద్యులు, పారమెడికల్ సిబ్బంది వైరస్ బరినపడుతుండటంతో నెల్లూరు అధికారులు ప్రత్యామ్నాయంగా రోబోను రంగంలోకి దించారు. ఈ రోబోలు ఒకేసారి 40 కేజీల ఆహారం, మందులను సరఫరా చేయగల రోబో కరోనా వైరస్ కేసులు ఏపీలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాతలు జిల్లా అధికారులకు రోబోను అందించారు. రోగులకు ఆహారం, మందులు అందించేందుకు రోబోలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు రోబోలను అధికారులు రంగంలోకి దించారు.

ఇప్పటికే ఓ రోబో సేవలను ప్రారంభిచింది. తాజాగా దీనికి మరో రెండు రోబో జతచేరనున్నాయి. మరోవైపు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,332కి పెరిగింది. మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 7,727 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకూ 88,061 మందికి అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు.

‘కరోనా’ వైసీపీ నాయకులకు ఏటీఎం గా మారింది: బాబు


కరోనాను అడ్డుపెట్టుకుని భాదితులకు సాయమందించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో విపరీతంగా చందాలు వసూలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఏపీ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ట్రస్టు ముసుగులో బలవంతపు వసూళ్లకు, పంపిణీ ముసుగులో వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘కరోనా’.. వైసీపీ నాయకులకు ఏటీఎంగా మారిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలను నిరసిస్తూ మండల స్థాయిలో కూడా దీక్షలు నిర్వహించాలని, 12 గంటల దీక్షలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో ఓట్ల కక్కుర్తితో వైసీపీ నేతలు గుంపులుగా తిరిగారని, కర్నూలు, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాలను ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు. ‘కరోనా’ వైరస్ తీవ్రంగా ఉన్న 15 జిల్లాల్లో కర్నూలు ఒకటి కావడం ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. టీడీపీ నాయకులు కరోనా కారణంగా ఇబ్బందులలో ఉన్నవారిని ఎదుకోవాలని సూచించారు.

అడ్డంగా దొరికిన చంద్రబాబు.. జగన్ బుక్ చేస్తాడా?


నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి సీఎం వైఎస్ జగన్ వరకు ఎందరో ప్రత్యర్థి సీఎంలు ఎంత వెతికినా దొరకకుండా తప్పించుకుంటున్న మేధావి మన టీడీపీ అధినేత చంద్రబాబు అని కథలు కథలుగా చెబుతారు. ఒక్క కేసీఆర్ ముందు మాత్రం చంద్రబాబు పప్పులు ఉడకలేదు. ‘ఓటుకు నోటు’లో బాబు గారు దొరికిపోయారనే ప్రచారం సాగింది. ఆ ఒక్కటి తప్పితే చంద్రబాబుపై కేసులు లేవు.. ఆయన దోషిగా తేలిన సందర్భాలు లేవు. పాలనలో అంత తెలివిగా తన చేతికి మట్టి అంటకుండా చంద్రబాబు వ్యవహరిస్తాడని.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం అదని రాజకీయాల్లో గొప్పగా చెబుతారు. కానీ ఎట్టకేలకు ఓ కేసులో చంద్రబాబుకు కష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి. కుప్పంలో తవ్వకాలు చేపడుతున్న వైసీపీ వలలో ప్రస్తుతానికి చంద్రబాబు పీఏ దొరికాడట.. ఇప్పుడు ఆయనను బేస్ చేసుకొని చంద్రబాబు మెడకు చుట్టాలనే ప్రయత్నాలు జోరుగానే సాగుతున్నాయనే ప్రచారం మొదలైంది.

*బాబు పీఏ అడ్డంగా బుక్కయ్యాడా?
ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ బ్యాంకు స్కామ్ కు పాల్పడ్డారంటూ ఆయనపై కుప్పం పోలీస్ స్టేషన్ లో తాజాగా కేసు నమోదైంది. వైసీపీ కార్యకర్తల ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. ఇది ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. చంద్రబాబును బుక్ చేసేందుకు రంగం సిద్ధమైందనే ప్రచారం మొదలైంది. కుప్పం కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో ఈ స్కామ్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ స్కామ్ లో చంద్రబాబు సొంత పీఏ మనోహర్ ప్రమేయం ఉందని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

*స్కాం ఏంటి?
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.192 కోట్ల స్కాం బ్యాంకులో జరిగినట్టు కుప్పం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉపేంద్రకుమార్ తెలిపారు. గత నెల మార్చిలో జరిగిన ఆడిట్ లో ఈ మొత్తం స్కామ్ వెలుగుచూసినట్లు చైర్మన్ తెలిపారు. రూ.46.75 లక్షల 30 బంగారం ప్యాకెట్లు .. దీనిపై వడ్డీ రూ.38.44 లక్షలు ఉందని వివరించారు. దీంతో పాటు నగదు కలిపి 192కోట్ల స్కాం జరిగినట్టు గుర్తించామన్నారు ఈ బ్యాంకులో శ్రీనివాసులు అనే వ్యక్తి చంద్రబాబు పీఏ మనోహర్ రికమండేషన్ మేరకు వచ్చి 16 ఆలయ బాండ్లను పెట్టి ఈ డబ్బులు తీసుకెళ్లాడని ఈ బ్యాంకు మేనేజర్ వీఎస్వీ నవీన్ బాబు తెలిపారు. ఇదంతా టీడీపీ హయాంలోనే జరిగినట్టు వివరించారు. దీంతో చంద్రబాబు పీఏపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

*బాబును ఇరికిస్తాడా?
వైఎస్ నాడు ఎంతో ప్రయత్నించారు. చంద్రబాబు లూప్ హోల్స్ అన్నీ వెతికారు. కానీ ఒక్క కేసుల్లోనూ బాబును ఇరికించిలేకపోయారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు జగన్ కు అంతకుమించిన కోపం ఉంది. చంద్రబాబు వల్లేనే ఆయన జైలు పాలయ్యారనే అపవాదు.. రాజకీయ శతృత్వం పీకలదాకా ఉంది. అందుకే వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరేడు నెలలుగా చంద్రబాబు పాలనలోని బొక్కలన్నీ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నా బాబు గారు మాత్రం తన చేతికి మట్టి అంటకుండా అన్నీ చక్కదిద్దేశారట.. సో ఇప్పుడు కుప్పం స్కారం దొరికింది.మరి దీన్ని అయినా చంద్రబాబు మెడకు చుడుతారా.? ప్రస్తుతానికి ఆయన పీఏ మనోహర్ దొరికేశాడు. తర్వాత నెక్ట్స్ ఏంటనేది ఆసక్తిగా మారింది.

*కుప్పంలో బాబుకు చెక్ పెట్టేందుకేనా?
కుప్పంలో చంద్రబాబుకు, టీడీపీకీ చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వెళుతోంది. చంద్రబాబు ఎలాగూ రాష్ట్రానికి చివరన ఉండే ఆ కుప్పం నియోజకవర్గానికి వెళ్లడం లేదు. ఆయన ఎమ్మెల్యే కావడంతో ఆయన వ్యవహారాలన్నీ బాబు పీఏ మనోహర్ చూస్తుంటాడు. బాబు తర్వాత అన్నీ ఈయనే. అంతటి కీలక వ్యక్తి అక్కడ వైసీపీని తట్టుకొని నిలబడుతున్నాడు. ఇప్పుడు పీఏ మనోహర్ ను చాకచక్యంగా బుక్ చేసిన వైసీపీ చంద్రబాబుకు ఆ నియోజకవర్గంలో నూకలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు ప్రచారం సాగుతోంది. మరి ఇదే జరిగితే రాజకీయంగానూ.. కేసుల పరంగానూ చంద్రబాబుకు పెద్ద దెబ్బే అనడంలో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు చెబుతున్నారు.

-నరేశ్ ఎన్నం

స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


కరోనా మహమ్మారి లాక్ డౌన్ నేపథ్యంలో సుదూర ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు పర్యాటకులు, విద్యార్థులు తమతమ సొంతూళ్లకు వెళ్లవచ్చని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు వారికి ఏర్పాట్లు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖరాసింది.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మరో నాలుగు రోజుల్లో ముగుస్తుందనగా కేంద్ర హోంశాఖ అంతరాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. లాక్‌డౌన్ వల్ల పలు ప్రాంతాల్లో వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు చిక్కుకుపోయారు.

వాళ్లను తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించండి. ఇందుకోసం ప్రతి రాష్ట్రం నోడల్ అధికారులను నియమించాలి. ఎవరెవరిని పంపిస్తున్నారు? ఎవరెవరిని అనుతిస్తున్నారన్న వివరాలను నమోదు చేయాలని సూచించింది.

ఒకవేళ పక్క రాష్ట్రాలకు వెళ్లేవారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వారుంటే.. ఆయా రాష్ట్రాల పరస్పరం సంప్రదింపులు జరుపుకోవాలి. పరస్పర ఒప్పందంతో రోడ్డు మార్గంలో వారిని తరలించాలి. సొంతూళ్లకు వెళ్లే వారిని విధిగా స్క్రీనింగ్ చేయాలి. ఎటువంటి కరోనా లక్షణాలు లేకుంటేనే అనుమతించాలి.

సమూహంగా వెళ్లేవారిని బస్సుల్లో తరలించాలి. బస్సును శానిటైజ్ చేయడంతో పాటు సీటింగ్ విషయంలో సామాజిక దూరం పాటించాలి. సొంత ప్రాంతాలకు చేరుకున్న తర్వాత వారిని స్థానిక అధికారులు స్క్రీనింగ్ చేసి హోం క్వారంటైన్ చేయాలి. వారంతా ఆరోగ్యసేతు యాప్ ద్వారా నిత్యం ఆరోగ్య వివరాలను నమోదు చేయాలి.

Amrya Dastur Recent Photos

సూర్యాపేటలో సీన్ మారింది!

కొద్ది రోజుల క్రితం సూర్యాపేటలో కరోనా కేసులు ఊహించని రీతిలో పెరగడంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని జిల్లా యంత్రాంగం పేర్కొంది.గత వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ మేరకు అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 83 పాజిటివ్ కేసులు నమోదవగా, 75 యాక్టీవ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు మరో ఇద్దరు డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 8 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ప్రకటించారు. కాగా, 4551 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు.

గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సూర్యాపేటలో అంతకంతకూ కరోనా కేసులు పెరిగిన తీరు అధికార యంత్రాంగాన్ని కంగారెత్తించింది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం.. సూర్యాపేటలో కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. లాక్‌ డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలు జరిపింది. కరోనా చైన్ సిస్టమ్‌ ను బ్లాక్ చేసింది. దీంతో సూర్యాపేటలో కరోనా వ్యాప్తి దాదాపుగా నిలిచిపోయింది. తాజాగా గడిచిన వారం రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Parvati Nair Glamorous Pics

Parvati Nair Beautiful Pictures

జగన్ మూడోసారి.. కెసిఆర్ ఎందుకనో ఒక్కసారే!

తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభన నేపథ్యంలో లాక్ డౌన్ ని అమలుపరుస్తున్నారు. దింతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో నిత్యావసర సరుకుల విషయంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఇద్దరు సీఎం లు ఉచిత రేషన్ ని ప్రజలకు అందిస్తున్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ సీఎం తో పోలిస్తే ఏపీ సీఎం జగన్ ముందంజలో ఉన్నారు. లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత జగన్ రెండు సార్లు ఉచిత రేషన్ ఇచ్చి ఇప్పుడు మూడోసారి కూడా ఇవ్వడానికి సిద్ధమౌతున్నారు.కానీ సీఎం కేసీఆర్ ఈ విషయంలో వెనుకపడ్డారు. ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే రేషన్ ఇచ్చారు.

అంతేకాకుండా ఒక్కో రేషన్ కార్డ్ పై 12 కేజీల బియ్యం మాత్రమే కేసీఆర్ సర్కార్ అందిస్తుంది. కానీ జగన్ సర్కార్ అందుకు భిన్నంగా రేషన్ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యంతోపాటు ప్రతి కార్డుకు కిలో కందిపప్పును ఉచితంగా అందిస్తున్నారు.

ప్రతి కుటుంబానికి రు.1500 ఇస్తా అని కేసీఆర్ మాట. ఇచ్చారు. కానీ అందరికి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా లాక్ డౌన్ లో ప్రజలకు ఇచ్చిన హామీలు బియ్యం, కంది పప్పు, వంటి నిత్యావసర వస్తువులు, రూ.1000 ఆర్థిక సహాయం చేశారు. సీఎం కెసిఆర్ మాత్రం ఇచ్చిన మాటను నెరవేర్చడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా పేద ప్రజలకు కనీసం నిత్యావసర సరుకులు పంపిణీ. చేసే విషయంలో కేసీఆర్ కంటే జగన్ ముందజలో ఉన్నారు.

తెలుగు టాప్ పత్రిక ఇంత దిగజారిందా?


తెలుగులోనే నంబర్ 1 పత్రిక ఇంత దిగజారిందా? మొన్నటికి మొన్న దాని ఓనర్ ఏకంగా తెలుగు రాష్ట్రాలకు చెరో 10 కోట్ల చొప్పున 20 కోట్ల విరాళం ఇచ్చాడు. అలాంటి ఆయన పత్రిక ఉద్యోగులపై లీవులపై పంపిందని విన్నాం. ఇప్పుడు ఉన్న వారికి చరిత్రలోనే తొలిసారి జీతాలు ఆలస్యం చేస్తోంది. ఇది ఆ నంబర్ 1 పత్రికలో ఇదే ప్రప్రథమమట.. ఠంచనుగా 1వ తారీఖునే పడే జీతాలను ఈసారి 10వ తారీఖున వేస్తామని యాజమాన్యం తెలిపిందట.. మరీ మొత్తం వేస్తారా? ఏమైనా 20, 30 శాతం కోతలు వేస్తారో తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఆ పత్రిక జీతాలు లేటు వేస్తామని ప్రకటన ఇచ్చిందట..

*నాడు వైఎస్ దెబ్బను తట్టుకుంది..
నిజానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఆయనను ఎదురించిన ఆ పత్రిక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. దాని ఆర్థిక మూలాలు దెబ్బతీసిన వైఎస్ఆర్ నాడు పత్రిక మనుగడనే కష్టం చేశారు. దీంతో ఏ దిక్కు లేకపోయేసరికి దేశంలోనే నంబర్ 1 కుబేరుడిని ఆశ్రయించి ఆయన కంపెనీ ద్వారా పత్రికలో షేర్లు కొనిపించి గట్టెక్కింది. ఇక అప్పుడు కూడా 1వ తారీఖునే జీతాలిచ్చింది ఆ పత్రిక.

*కరోనా దెబ్బకు కుదేలైందట..?
అయితే కరోనా ఇప్పుడు పత్రికను తీవ్రంగా దెబ్బతీసిందట.. దెబ్బతీసిందా? వీరే గల్లాపెట్టె నుంచి డబ్బులు బయటకు తీయడం లేదో తెలియదు.. కానీ జీతాలను 10వ తారీఖున వేస్తామని తెలిపారట.. నిజానికి తెలుగులోనే నంబర్1 పత్రికకు ఆర్థిక కష్టాలు అంటే ఎవరూ నమ్మని పరిస్థితి. జీతాలు ఇచ్చే డబ్బులు కూడా లేవు అని వాయిదా వేయడాన్ని ఎవరూ నమ్మడం లేదు. కానీ తమ గల్లాపెట్టె తీయకుండా ఈ కరోనా టైంలో పత్రిక ద్వారా వచ్చిన ఆదాయంతోనే డబ్బులివ్వాలని వచ్చినదాన్ని బట్టి జీతాల్లో కోతలు వేయాలనే ఆ ప్రధాన పత్రిక ఆలోచనగా చెబుతున్నారు.

*వీళ్ల పోస్టులు ఊస్ట్
ఇక ఇదే పత్రిక ఆఫ్టర్ కరోనా తమ డెస్కుల్లో పనిచేసే డిజైనర్లను ఇక రావద్దని చెప్పిందట.. వేరే చూసుకోండని సూచించిందట.. ఇక నుంచి వీరి డిజైనర్ల పనిని కూడా సబ్ ఎడిటర్ల చేతే చేయించాలని యోచిస్తోందట.. ఇలా దిగ్గజ పత్రికలోనూ పేజినేషన్ చేసే డిజైనర్లు రోడ్డున పడడం ఖాయంగా కనిపిస్తోంది.

*ముందుంది జర్నలిస్టులకు గడ్డుకాలమే
ఇక ఆ ప్రధాన పత్రిక దగ్గినా తుమ్మినా ఫాలో అయిపోయే మిగతా పత్రికలు కూడా అదే బాటలో పయనిస్తాయి. కాబట్టి మిగతా సంస్థల్లోనూ ఈ సంస్కరణలు అమలవుతాయి. ప్రస్తుతానికి ఇలాంటి సంస్కరణలకు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న అధికారపార్టీ పత్రికలు దూరంగా ఉన్నాయి. కానీ కరోనా టైం ఇలాగే కొనసాగితే వాటిలోనూ ఈ తీసివేతలు.. కోతలు తప్పకపోవచ్చు. అందుకే అందరూ కాలు కాలిన పిల్లుల్లా సైలెంట్ గా ఉంటున్నారు. చూడాలి మరీ కరోనాతో దెబ్బతిన్న పత్రిక పడవలో జర్నలిస్టుల జీవితాలు ఏ తీరాలకు చేరుతాయో..?

లాక్ డౌన్ నుంచి మరికొన్నింటికి మినహాయింపు…!


కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లాక్ డౌన్ సడలింపునకు అదనంగా మరికొన్ని మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచనల మేరకు కొత్త గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వ్యవసాయ రంగం, హార్టికల్చర్ పనులకు మినాహాయింపు ఇచ్చింది. ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఆర్థిక రంగానికి మినహాయింపు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనుల తో పాటు పవర్ లైన్స్, టెలికం కేబుల్స్ పనులకు మినహాయింపు కల్పించారు. కావల్సిన అనుమతులతో ఈ కామర్స్ కంపెనీలకు, వారు వాడే వాహనాలకు అనుమతి ఇచ్చారు. వలస కార్మికులకు రాష్ట్రం పరిధిలో వారి సొంత ప్రాంతాలకు వెళ్లి పని చేసుకునేందుకు అనుమతించారు. కరోనా లక్షణాలు లేని వారికి మాత్రమే ఈ మీనాహాయింపు వర్తిస్తోందని పేర్కొన్నారు. పుస్తకాల షాపులకు, ఎలక్ట్రికల్ షాపులకు మినహాయింపు లభించింది. ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించారు. మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతంలో ఉంటే షాపులు, మార్కెట్ కాంప్లెక్స్ లకు అనుమతి ఇచ్చినట్లు ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

పోకిరి సినిమా చేసుంటే తెలుగులో నేనే నెంబర్ వన్


పూరి జగన్నాథ్ నిర్మించిన ‘ఏక్ నిరంజన్’ చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన కంగనా రనౌత్ ఆ తరవాత హిందీ చిత్రాల్లో నటిస్తూ బాలీవుడ్ లో సెటిల్ అయిపొయింది. ఇంకొంచెం ముందుకెళ్లి దర్శకురాలుగా కూడా మారింది . ” ఫ్యాషన్ , తను వెడ్స్ మను , కైట్స్ , క్వీన్ , మణికర్ణిక ” వంటి చిత్రాలతో హిందీలో తనకంటూ ఓ స్థానం సంపాదించు కొంది. కంగనా రనౌత్.ఇపుడు బాలీవుడ్ అగ్ర హీరోయిన్లలో ఒకరు.

స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి

కాగా ఇటీవల కంగనా రనౌత్ ఒక ఆశ్చర్యకర వార్త బయట పెట్టింది .తెలుగు సినీ రంగంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన ‘పోకిరి’ సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ నాకే అఫర్ వచ్చిందని తెలిపింది. సరిగ్గా అదే సమయానికి తాను ‘గ్యాంగ్ స్టర్’ అనే హిందీ చిత్ర అఫర్ రావడం తో “పోకిరి ” చిత్రాన్ని వదులు కొన్నానని తెలిపింది .ఆడిషన్స్ కు వెళ్లిన ఫై రెండు సినిమాల్లో తనకు అవకాశం వచ్చిందని… అయితే, ‘గ్యాంగ్ స్టర్’కు ముందుగానే డేట్లు ఇచ్చేయడంతో, ‘పోకిరి’ సినిమా చేయలేకపోయానని తెలిపింది. అలా ‘పోకిరి’ సినిమా వదులు కొని తెలుగులో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించు కోలేక పోయానని ఒకింత భాదతో చెప్పింది .

ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

ఫోన్ కు తాళి కట్టిన వరుడు.. వీడియో చూసి తీరాల్సిందే..


కరోనా ఎఫెక్ట్ అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ప్రతీయేటా ఈ సీజన్లో వేలాదిగా పెళ్లిళ్లు జరుగేవి. ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ కొనసాగుతుండటంతో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. కొందరు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో తాము అనుకున్న ముహుర్తానికే పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలు జంటలు నాలుగైదురుగా మధ్యలో తుతూమంత్రంగా పెళ్లి చేసుకున్న సంఘటనలు చూశాం. అయితే తాజాగా ఓ పెళ్లిజంట ఆన్ లైన్లో పెళ్లి చేసుకున్నారు. వరుడు పెళ్లి కుమార్తెకు కాకుండా ఫోన్ తాళికట్టడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన శ్రీజిత్ నాదేషన్, అంజనా వివాహాన్ని పెద్దలు జనవరిలో నిశ్చయించారు. అయితే అనుకోని కారణాలతో ఆ పెళ్లి ఏప్రిల్ 26వ తేదికి వాయిదా పడింది. అంజనా ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. లాక్డౌన్ వల్ల ఆమె కేరళకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో వీరిద్దరు ముందుగానే వీడియో కాల్ మాట్లాడుకొని ఆన్ లైన్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు పెద్దలను ఒప్పించారు.

వధువు లక్నోలో.. వరుడు కేరళలో ఉండి వీడియో కాల్ ద్వారా పెళ్లి చేసుకున్నారు. ఆన్ లైన్లో ఒకరికి ఒకరు ఎదురుగా ఉండగా అంజనా స్నేహితులు, శ్రీజిత్ కుటుంబ సభ్యులు చూస్తుండగా వరుడు ఫోన్ కు తాళికట్టాడు. ఇదే సమయంలో ఆమె తాళిని తనకు మెడకు ఒక ముడి వేసుకొంది. లాక్డౌన్ ముగిసి.. ఆమె కేరళకు చేరుకున్నాక శ్రీజిత్ మరో రెండు ముళ్లు వేస్తాడని.. ఆ తర్వాత బంధువులకు మ్యారేజ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్లు శ్రీజిత్ కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రాండ్ గా జరగాల్సిన పెళ్లి కాస్తా లాక్డౌన్లో కారణంగా అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి మాదిరిగా మారిపోయిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దరిలేని లాక్ డౌన్…దూరమైన సొంతూరు!

 

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలుపరుస్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాలల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పని లేక పరాయి పంచన ఉండలేక, వారు సొంతూళ్లకు వెళ్లే మార్గంలేక సతమతమై పోతున్నారు. లాక్ డౌన్ ని మొదట 21 రోజులన్నారు ఆ తర్వాత మరో 19 రోజులు పెంచి మే 3 వరకు లాక్ డౌన్ విధించారు. మరళా లాక్ డౌన్ ని పొడిగించే సూచనలు కనిపించడంతో కార్మికులు సొంతూరు వెళ్లేందుకు ధర్నాలు, ఆందోళనలు చేబడుతున్నారు. తమను సొంతూళ్లకు పంపించాలని లాక్ డౌన్ నియమాలను ఉల్లంగిస్తూ.. రోడ్లెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజు కూడా ఐఐటీ హైదరాబాద్ భనవనాల వద్ద సుమారు 1600మంది కార్మికులు ఆందోళనకు దిగారు.

ఆయా సందర్భాలలో వలస కూలీల అవస్థలు

మల్కాజిగిరి లోని సఫీల్ గూడ లో జైన్ కనెస్ట్రక్షన్స్ వద్ద బీహార్, యూపీ, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్‌ కు చెందిన సుమారు 500మంది ధర్నాకు దిగారు. తమకు గత 15 రోజులుగా ఎవరు పట్టించుకోవడంలేదని, కనీసం తాగడానికి నీళ్లివ్వడం లేదని వారు వాపోయారు. తమ కాంట్రాక్టర్లు గాని ప్రభుత్వం కానీ తమకు ఎటువంటి సహాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారంతా సఫీల్ గూడ రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేకపోతే తమ రాష్ట్రాలకు తరలించాలని వేడుకుంటున్నారు. తమకు ఎక్కడా సోషల్ డిస్టెన్స్ లేదని ఒక్కొక్క గదిలో 10 మందిని ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చందానగర్‌ నుంచి మధ్యప్రదేశ్‌ కు దాదాపు వందమంది డీసీఎం వ్యాన్‌ లో బయల్దేరగా బాచుపల్లి చౌరస్తా వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడ్డారు. అలాగే గచ్చిబౌలి నుంచి 200 మంది కాలినడకన బయల్దేరితే రేతిబౌలి వద్ద పోలీసులు నిలువరించి వెనక్కి పంపారు. టోలిచౌకి నుంచి మధ్యప్రదేశ్‌ కే బయల్దేరిన మరో యాభై మందికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. నగరంలోనే ఇలా దాదాపు వేయి మంది ఊరెళ్లిపోవడానికి పరిపరి విధాల ప్రయత్నించారు.  తమ రాష్ట్రాలకు పంపించేందుకు అనువైన ఏర్పాట్లు చేయాలంటూ వారు వేడుకున్నారు.

సుమారు 200 మంది వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లాలని హైదరాబాద్‌ లో మూటాముల్లె సర్దుకొని, చంటి పిల్లలను ఎత్తుకొని నడుచుకుంటూ బయలుదేరారు. హబ్సిగూడ జెన్‌ పాక్‌ ప్రాంతంలోని పోలీసు తనిఖీ కేంద్రం దగ్గర అడ్డుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా వెంటనే అక్కడికి చేర్చుకుని వారిని సుముదాయించారు.

హైదరాబాద్ శివారులోని నానక్ రాంగూడ ప్రాంతంలో ఒక్క చోటే 1200 నుంచి 1500 మంది వరకు వలస కార్మికులు కనిపించారు. ‘మా ఆరోగ్యం గురించి పట్టించుకొనేవారు కూడా లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో వేల సంఖ్యాలో.. దేశం మొత్తం మీద లక్షల సంఖ్యలో వలస కూలీలా బాధలు వర్ణణాతీతం. వారిని సొంతూళ్లకి పంపిసచే ఏర్పాట్లు చేస్తే మంచిదని అనేకమంది విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

దేశమంతా లాక్‌ డౌన్‌ తో స్తంభించిన వేళ.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లినా.. ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. కార్మికుల బాగోగులు చూసుకోవాలని భవన నిర్మాణ సంస్థలు, పలు కంపెనీలకు ఆదేశాలు జారీ చేసాం. ప్రభుత్వ, పోలీస్ శాఖ ఆదేశాలను కార్మిక సంస్థలు, భవన నిర్మాణ సంస్థలు బేఖాతర్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’అని కమిషనర్‌ పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా అమలు చేసిన లాక్ డౌన్ కారణంగా వలస కార్మికుల జీనోపాధికి సంబంధించిన సమస్యలు మరియు వారికి సంబంధిచిన ఇతర సమస్యలు పరిష్కరించడానికి దేశవ్యాప్తంగా 20 కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.