Homeజాతీయ వార్తలురంజాన్ రోజుల్లో లాక్ డౌన్ కు కేసీఆర్ సడలింపు!

రంజాన్ రోజుల్లో లాక్ డౌన్ కు కేసీఆర్ సడలింపు!


తెలంగాణలో అకస్మాత్తుగా కరోనా పరీక్షలు తగ్గించడం, లాక్ డౌన్ నిబంధనల అమలు పట్టించుకొనక పోవడం వెనుక రంజాన్ మాసం ప్రారంభమే కారణమనే సంకేతాలు వెలువడుతున్నాయి. చివరకు రెడ్ జోన్ లలో కూడా లాక్ డౌన్ నిబంధనలను గాలికి వదిలివేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.

ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ప్రతి రోజూ రంజాన్ పిండివంటలు ఏర్పాటు చేస్తున్నారు. మరోవంక ప్రతి రోజు సాయంత్రం ముస్లింల దుకాణాల తెరుచుకోవడానికి లోపాయికారిగా అనుమతి ఇస్తున్నారు. రెడ్ జోన్ లలో సహితం యధేచ్చగా యువకులు తిరుగుతున్నా వారిని ఆడుకొనే ప్రయత్నం జరగడం లేదు.

రాష్ట్రాలకు కాసులు రాల్చని మోదీ ప్రభుత్వం

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా ప్రార్ధన మందిరాలు అన్నిట్నీ మూసివేశారు. పండుగలు ఏవీ బహిరంగంగా జరుపుకోరాదని స్పష్టం చేస్తున్నారు. అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే ఇప్పటికే రాజకీయ వత్తిడుల కారణంగా పాత బస్తి వంటి ప్రాంతాలలో లాక్ డౌన్ నిబంధనలను గాలికి వదిలి వేస్తున్నారు.

ఇక ఇప్పుడు రంజాన్ సందర్భంగా ముస్లింలు అందరికి సాయంత్రం 4 గంటల నుండి తమ షాప్ లను తెరచుకోవడానికి అనధికారిరకంగా అనుమతి ఇస్తున్నారు. పలు చోట్ల రాత్రి 8 గంటల వరకు షాపులు తెరిచే ఉంటున్నాయి. దేశంలో మరెక్కడా ఇటువంటి వెసులుబాటు ఇవ్వకపోవడం గమనార్హం.

హిందువులు సాంప్రదాయం గా జరుపుకొనే, హోలీ ఉగాది శ్రీరామనవమి వంటి మహా పండుగలను ఇళ్ళల్లోనే నిర్వహించుకున్నారు. కానీ రంజాన్ పండుగకు మాత్రం వారి ఇష్టానికి వదిలివేస్తున్నారు. ఇదంతా పాతబస్తీ కేంద్రంగా ఉన్న రాజకీయ పక్షం వత్తిడులే కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వరంగల్ మండి బజార్ లో నాలుగైదు రోజుల క్రితం జరిగిన గొడవ తదనంతరం స్థానిక ఎమ్మెల్యే పోలీసు అధికారులు కొంతమేరకు వారి కోసం కొంత సడలింపు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది. మండి బజార్ ప్రాంతం పూర్తిగా రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ ఇలాంటి ఈ సంఘటన జరుగుతుండడం భయాందోళనలకు గురి చేస్తుంది.

ఇలా ఉండగా, హైదరాబాద్ లో పరిస్థితుల పరిశీలనకు రెండు, మూడు రోజుల పర్యటనకు మాత్రమే వచ్చిన కేంద్ర బృందం ఐదో రోజు కూడా ఇక్కడే మకాం వేయడం, పలు ప్రదేశాలకు ఆకస్మిక పర్యటనలు జరపడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులలో కలకలం రేపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను నిర్ధారించుకొనే ఉన్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular