Home Blog Page 8484

ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

కరోనా ప్రభావంతో కేంద్రం విధించిన లాక్ డౌన్ కారణంగా ఆదాయం లేకపోవడంతో రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతమే జీతమే తీసుకుంటున్నారు. జీతాలు, గత రెండు నెలల బకాయిలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. ఈ నెల నుంచి ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి సూచనల మేరకు అజయ్ కల్లమ్ ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కల్లామ్ జూన్ నెల నుంచి అందరికీ పూర్తి జీతాలు చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

గత రెండు నెలల బకాయిలపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని తీసుకోనుంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 50 శాతం కోత విధించడంపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన న్యాయ శాఖ ఉద్యోగి లక్ష్మీ నర్సింహమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఉద్యోగులకు రెండు నెలల పూర్తి జీతం చెల్లించాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్ లకు మే నెల నుంచే నూరు శాతం పెన్షన్ ఇస్తున్నారు.

‘ప్రపంచ మానవాళికి శత్రువుగా ఉగ్రవాదం’

ఉగ్రవాద నిర్మూలన దినోత్సవం సందర్బంగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వరుస ట్వీట్లు చేశారు. ప్రపంచ మానవాళికి ఉగ్రవాదం శత్రువుగా మారిందని, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి ఇది పెద్దముప్పుగా పరిణమించిందని తెలిపారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశాలను ఒంటరి చేయాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడం కోసం అన్నిదేశాలు ఏకతాటిపైకి రావాలని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాలను ఒంటరి చేసేందుకు అన్నిదేశాలు కలిసి పనిచేయాలని వెంకయ్యనాయుడు కోరారు.

భారత్‌ లో శాంతికి విఘాతం కలిగించే ఉగ్రమూకలను ఓడించేందుకు భద్రత బలగాలకు పౌరులందరూ అండగా నిలిచి తమ ఐకమత్యాన్ని చూపాలని చెప్పారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా గురువారం ఉగ్రవాద నిర్మూలన దినోత్సవంగా పాటిస్తున్న సంగతి తెలిసిందే.

షూటింగ్ సడలింపులపై తుది నిర్ణయం కేసీఆర్ దే


మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సీనిపెద్దలు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ తో గురువారం ఉదయం బేటీ అయ్యారు. ఇందులో సినిమా షూటింగుల ప్రారంభం, సినీ కార్మికుల సమస్యలు, థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు? వంటి అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు సీని పెద్దలు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్మకాలను పాటిస్తూ షూటింగులు చేసేందుకు తాము సిద్ధమేనంటూ ప్రకటించారు. ఇప్పటికే లాక్డౌన్లో అన్నిరంగాలకు సడలింపులు ఇచ్చారని తమ ఇండస్ట్రీని నమ్ముకొని వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారని వివరించారు. షూటింగులు ప్రారంభించకపోతే ఇండస్ట్రీని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడాల్సి వస్తుందని ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి షూటింగులకు అనుమతి ఇవ్వాలని కోరారు. సినీ రంగానికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని వారు కోరారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం సినిమా రంగానికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు చేసుకోవచ్చని తెలిపారు. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. సీనిరంగంలోని కార్మికుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై ఒకట్రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని తెలిపారు. షూటింగులకు అనుమతిచ్చేది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ బేటీలో మెగాస్టార్ చిరంజీవితోపాటు అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌రాజు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సి.కల్యాణ్‌, జెమిని కిరణ్, స్రవంతి రవికిషోర్‌, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వినాయక్‌, త్రివిక్రమ్‌ తదితరులు పాల్గొన్నారు.‌ అన్ని అనుకున్నట్లు జరిగితే జూన్లో సినిమా షూటింగులు ప్రారంభం కావడం కన్పిస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఏపీలో మండే ఎండలు.. విలవిలలాడుతున్న …


లాక్ డౌన్ నుంచి గ్రీన్, ఆరంజ్ జోన్ ప్రజలకు కేంద్రం వెసులుబాటు ఇచ్చినా ఎపి ప్రజలు లాక్ డౌన్ పాటించక తప్పడం లేదు. ఇందుకు కారణం రెండు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరగడమే. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలో 43 నుంచి 47.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల ముప్పు కూడా ఉందని పేర్కొంది. రాయలసీమ, కోస్తాంధ్రలో ఎండలు తారస్థాయికి చేరుకుంటాయని వెల్లడించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే గుంటూరు జిల్లా రెంటచింతలలో నిన్న ఏకంగా 47.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న రాష్ట్రంలోని పలు చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ అమరావతి డైరెక్టర్‌ స్టెల్లా వెల్లడించారు.

ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాంలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఆదివారం వరకూ నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. అంఫాన్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండి వర్షాలు కురుస్తాయని ఆశించిన రాష్ట్ర ప్రజానీకానికి నిరాశే మిగిలింది. వార్షాలు పడకపోగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి.

‘విద్యుత్’ విషయంలో జగన్ దారి ఎటు?


విద్యుత్ చట్టానికి సవరణలు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్న సమయంలో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం కనీస స్పందన కూడా లేదు. 2003 విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు 2020 తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్ రంగం.. కొత్త బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభిస్తే కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. అలాగే ప్రవేటు సంస్థల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, ఇతర అంశాలను కేంద్రమే పర్యవేక్షిస్తుంది. పరిస్థితులను బట్టి రైతులకు, పరిశ్రమలకు, ఇతర సేవా సంస్థలకు చార్జీల విషయంలో రాయితీలు ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉండదు.

కేంద్రం విద్యుత్ విషయలో జాతీయ స్థాయిలో ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏపీలోని వైసీపీ ప్రభుత్వం పీపీఏల విషయంలో దూకుడుగా వ్యవహరించడమే కారణమనే వాదనలు ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ళలో గత టీడీపీ ప్రభుత్వం యూనిట్ కు రూ.6 వరకూ చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంది. అనంతరం యూనిట్ విలువ రూ.2.48 వరకూ పడిపోయింది. టీడీపీ అధికారంలో ఉండగా ఒప్పందం ప్రకారం ప్రవేటు విద్యుత్ తయారీ సంస్థలకు పాత రేటు చెల్లించారు. అధికారం చేపట్టాక జగన్ విద్యుత్ ఒప్పందాలపై సమీక్ష నిర్వహించి చెల్లించే రేట్లు తగ్గించారు. ఈ వ్యవహారంపై ఆ సంస్థ కోర్టులను ఆశ్రయించాయి. కేంద్రం జోక్యం చేసుకుని పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ (పి.పి.ఏ) రద్దు చేయవద్దని, ఇది ఇబ్బందికరంగా మారుతుందని సూచించింది. అయినా జగన్ దూకుడు కొనసాగించారు. ఇటువంటి సమస్యలు భవిష్యత్ లో తలెత్తకుండా ఉండాలనే కేంద్రం విద్యుత్ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కేంద్రం తెస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాలన్నీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ముసాయిదాపై జూన్ 5 వ తేదీలోగా అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్రం కోరింది. ఇప్పటి వరకూ కేంద్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోని జగన్ ఈ విషయంలో కూడా అదే వైఖరిని ప్రదర్శిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ వైఖరి కూడా అదే విధంగా కనిపిస్తోంది. రాష్ట్రాల ప్రయోజనాలకు విరుద్దంగా ఉన్న ఈ చట్టానికి జగన్ సుముఖత తెలిపితే మరోసారి ప్రతిపక్షాలు, ఇతర రాష్ట్రాల నించి విమర్శలకు గురవక తప్పదు.

నార్త్ పై ప్రభాస్ స్పెషల్ ఫోకస్..


డార్లింగ్ ప్రభాస్ కు దక్షిణాదితోపాటు ఉత్తరాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ‘బాహుబలి’ సిరీసులతో ప్రభాస్ దక్షిణాదితోపాటు నార్త్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ‘బాహుబలి‘, ‘బహుబలి-2’ మూవీలు ఉత్తరాదిన భారీ కలెక్షన్లు సాధించి ప్రభాస్ ను ఇండియన్ హీరోగా మార్చేశాయి. ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ప్రభాస్ ‘సాహో’గా ప్రేక్షకులకు ముందుకొచ్చాడు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ దక్షిణాదిన అనుకున్నంత విజయం సాధించకపోయినా నార్త్ తో మాత్రం భారీ విజయం సాధించింది. నార్త్ లో ప్రభాస్ స్టామీనా ఏంటో ‘సాహో’ మూవీ చూపించింది. దీంతో ప్రభాస్ నార్త్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు.

టాలీవుడ్లో సంక్రాంతి, దసరా సినిమాలకు హీరోలంతా ఫస్టు లుక్, ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కు శుభాకాంక్షలు చెబుతుంటారు. మనలాగే నార్త్ లోనూ హీరోలంతా రంజాన్ కు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లాంటి హీరోలు రంజాన్ కు తమ సినిమాలను రిలీజ్ చేస్తూ సూపర్ హిట్లు కొడుతుంటారు. ఇదేతరహాలో ప్రభాస్ కూడా రంజాన్ సందర్భంగా ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ కానుక ఇవ్వబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ తాజాగా యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్ రంజాన్ సందర్భంగా చిత్రబృందం రిలీజ్ చేయనుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా హ్యాష్ ట్యాగులతో ట్రెండింగ్ చేస్తున్నారు.

లాక్డౌన్లో కారణంగా సినిమాలకు సంబంధించి ఎలాంటి రిలీజ్ డేట్స్ అనౌన్స్ కావడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రంజాన్ సందర్భంగా ప్రభాస్ కొత్త మూవీకి సంబంధించిన ఫస్టు రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుందట. ఈమేరకు చిత్రబృందం రాత్రింబవళ్లు కష్టపడుతుందని టాక్ విన్పిస్తుంది. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏదిఏమైనా ప్రభాస్ సౌత్ తోపాటు నార్త్ పై స్పెషల్ ఫోకస్ పెట్టడంపై అభిమానులు ఖుషీ అవుతున్నారు. రంజాన్ సందర్భంగా డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!

నాగబాబు పై కేసు నమోదు!

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నాగబాబు తాజాగా మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సే పుట్టినరోజు సందర్భంగా వివాదాస్పద వాఖ్యలు చేశాడు. దీంతో ఆయన పై ఉస్మానియా యూనివర్సీటీ (ఓయూ) పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు అయింది. గాడ్సే నిజమైన దేశభక్తుడని అంటూ ట్వీట్ చేశాడు. నాగబాబు చేసిన ఈ వాఖ్యాలపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ నేపధ్యంలోనే నాగబాబుపై టీపీసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నటుడు నాగబాబుకు మతి భ్రమించిందని, అయన మానసిక పరిస్థితి బాగాలేనందునే ట్విట్టర్‌ లో జాతిపిత గాంధీని చంపిన నాథూరాం గాడ్సే‌ దేశభక్తుడని అన్నారని పేర్కొన్నారు. ఇలాంటి వాఖ్యలు చేసిన నాగబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడా నాగబాబు ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు పిల్లలు ఉంటే గాంధీ ని మరిచిపోతారంటూ.. ఆయన అసహనం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో  నాగబాబు మరో ట్వీట్ చేశాడు. ‘దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండి. నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదు. నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నాను. నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వాళ్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవం’ అంటూ నాగబాబు మరో ట్వీట్ చేశారు.

ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు 12 ప్రైవేట్ ల్యాబ్‌ లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇటీవల ఆ 12 ల్యాబ్‌ లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు నిరాకరిస్తూ ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌లలో కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయడానికి, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించడానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన గాంధీ లేదా మరో ఆస్పత్రిలోనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఒత్తిడి చేయకూడదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షలకు, చికిత్సకు అయ్యే ఖర్చును భరించే స్తోమత ఉన్నవారు ప్రైవేటు సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. కాకపోతే ఐసీఎంఆర్‌ ఆమోదించిన ఫీజులే వసూలు చేయాలని ఆయా ఆస్పత్రులు, ల్యాబ్‌ లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ లక్ష్మణ్‌ లతో కూడిన ధర్మాసనం నిన్న ఆదేశాలిచ్చింది.

ఇదిలా ఉండగా, తెలంగాణలో ఎన్ని కరోనా టెస్టులు చేశారన్న వివరాలు లేవని కేంద్రం తెలిపింది. ఈ సందర్భంగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణలో ప్రైవేటు ల్యాబ్‌ లను ఉపయోగించుకోకపోవడాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతి సూదన్‌ తప్పుపట్టారు. ప్రైవేట్ ల్యాబ్‌ లను అనుమతించకపోవడం వల్లే తెలంగాణలో ఎక్కువ టెస్టింగ్‌ లు చేయలేకపోతున్నారని అన్నారు. టెస్టింగ్‌ లు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటానికి ఇదే ముఖ్య కారణమని తెలిపారు.

వివాదాల్లో చిక్కుకున్న అనుష్క


లాక్డౌన్లో విరుష్క జోడీ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. నిత్యం తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెల్సిందే. వివాదాలకు దూరంగా ఉండే అనుష్క శర్మ ప్రస్తుతం ఓ వివాదంలో ఇరక్కుపోయింది. ఈమేరకు ఆమెకు లీగల్ నోటీసులు జారీకావడంతో విరుష్క జోడీ సెలబ్రెషన్స్ కు తాత్కాలికంగా బ్రేక్ పడేలా కన్పిస్తోంది. సినిమాల్లో హీరోయిన్ గా బీజీగా ఉండే అనుష్క శర్మ నిర్మాతగా మారి పాతల్ లోక్ అనే వెబ్ సీరిసును నిర్మించింది. అయితే తొలి వెబ్ సీరిసుతోనే ఆమె వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. ఈ వెబ్ సీరిసులో ఓ వర్గాన్ని(కులాన్ని) తక్కువచేసి చూపించారని ఆమెకు లీగల్ నోటీసులు జారీకావడంతో ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

పాతల్ లోక్ వెబ్ సీరిస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో రిలీజయింది. ఓ పోలీస్ అధికారి ఉన్నత స్థాయి దర్యాప్తులో భాగంగా అండర్ వరల్డ్ యొక్క చీకటి రాజ్యంలోకి ఎలా వెళుతుంది? అనే కోణంలో ఈ వెబ్ సీరిస్ రూపొందించారు. ఇందులో గోర్ఖా అనే పదాన్ని కించపరిచేలా మాట్లాడారని ప్రణయ్ రాయ్ అండ్ అసోసియేషట్స్ కు చెందిన విరేన్ శ్రీ గురుంగ్ అనుష్క శర్మకు లీగల్ నోటీసులు పంపించారు. నేపాలికీ చెందిన గోర్ఖా కమ్యూనిటీని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని గోర్ఖా కమ్యూనిటీ కూడా సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్ట్రీకు ఆన్ లైన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవలే ఈ వెబ్ సీరిసుకు విరాట్ కోహ్లీ రివ్యూ రాసి నటీనటులకు కితాబిచ్చాడు. తాజాగా ఈ వెబ్ సీరిస్ వివాదాల్లో చిక్కుకోవడంతో అనుష్క శర్మ దీనిపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తిని రేపుతోంది. అనుష్క శర్మ ఈ వివాదాన్ని ఎలా డీల్ చేస్తారో వేచి చూడాల్సిందే..!

ఏపీలో బారులు తీరిన జనం..!


రాష్ట్రంలోని రోడ్లపై ఆర్టీసీ బస్సులు పరుగులు ప్రారంభించాయి. లాక్‌డౌన్‌ కారణంగా గత రెండునెలలుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో విజయవాడ, విశాఖ సిటీ సర్వీసులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్‌ సర్వీసులు గురువారం ఉదయం 7 గంటల నుంచి సంస్థ ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్‌ బుకింగ్‌ నిన్న సాయంత్రం నుంచే మొదలైంది. రాష్ట్రంలోని 436 మార్గాల్లో 1,683 బస్సులు (17 శాతం) నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్టీసీకి మొత్తం 12 వేల బస్సులు ఉండగా ప్రస్తుతం 1,683 బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీని బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచే యోచనలో అధికారులు ఉన్నారు.

ఉదయం నుంచే ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది. విశాఖలోని ద్వారకా బస్‌ కాంప్లెక్స్‌ వద్ద ప్రయాణికులు బారులు తీరారు. ప్రస్తుతానికి బస్టాండ్ల మధ్య మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. నగదు రహిత విధానంలోనే టికెట్లు జారీ చేస్తున్నారు. ముందుగా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులను మాత్రమే బస్సులోకి అనుమతిస్తున్నారు. అన్ని బస్టాండ్లలోనూ కరెంట్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించారు. కౌంటర్‌లో టికెట్‌ కొనుగోలు చేసేవారి పేరు, ఫోన్‌ నంబరు నమోదు చేసుకుంటున్నారు. తప్పనిసరిగా మాస్కులు వినియోగించాల్సి ఉంది.

దూర ప్రాంతానికి రాత్రి సర్వీసుల్లో వెళ్లాలనుకునేవారు సాయంత్రం 7 గంటల కంటే ముందే బస్టాండ్లకు చేరుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకూడని సూచిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రయాణికులకు అందరినీ పరీక్షించి బస్సుల్లోకి అనుమతిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని ప్రయాణానికి అనుమతించడం లేదు.

చిరు ఇంటికి వెళ్లిన తెలంగాణ మంత్రి…!

అన్ని రంగాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సినీ రంగం పై కూడా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. క‌రోనా వైర‌స్ వ‌ల‌న సినీ పరిశ్రమ కొన్నాళ్ళుగా స్తంభించిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్స్‌ తో పాటు ప్రీ, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇప్ప‌ట్లో క‌రోనా విముక్తి ఉండ‌ద‌ని భావిస్తున్న ప్ర‌భుత్వాలు దాంతో క‌లిసి జీవించ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో లాక్‌ డౌన్ విష‌యంలో చాలా స‌డ‌లింపులు కూడా ఇచ్చాయి.

చిత్ర ప‌రిశ్ర‌మ విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌డ‌లింపు ఇవ్వ‌క‌పోవ‌డంతో దాని గురించి చ‌ర్చించేందుకు మెగాస్టార్ నేతృత్వంలో కొంద‌రు ప్ర‌ముఖులు మీటింగ్ ఏర్పాటు చేయ‌నున్నార‌ట‌. టాలీవుడ్ ప్రముఖులతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్ మోహన్ రావు ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు. చిరంజీవి నివాసంలో  చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ మీటింగ్‌ లో  సినిమా షూటింగ్స్ పునః ప్రారంభం, థియేటర్స్, సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, కరోనా బారిన పడకుండా షూటింగ్‌ లో తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి విషయాలపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే క‌రోనాతో సినీ ప‌రిశ్ర‌మ కూడా బాగా చితికిపోగా, ఈ మీటింగ్ ద్వారా ఏమేం చెబుతార‌నే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొని ఉంది.

ఏపీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.!


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) లాక్ డౌన్ కారణంగా 58 రోజుల నుంచి బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో సంస్థ రూ.1,200 నష్టాన్ని మూటగట్టుకుంది. నేటి నుంచి బస్సులు నడుపుతున్నప్పటికీ వాటి సంఖ్య అరకొరె. నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించక పోవడంతో కొన్ని దిద్దుబాటు చర్యలతో నష్టాలను కొంతమేరకు తగ్గించుకోవచ్చని భావిస్తోంది.

ఈ క్రమంలో వివిధ వర్గాల వారికి కల్పిస్తున్న రాయితీ అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు సహా వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాల్సిన నేపథ్యంలో బస్సుల్లో సీట్ల సంఖ్యను ఆర్టీసీ కుదించింది. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సహా ఏసీ సర్వీసుల్లో సీట్లను తగ్గించింది. దీంతో ఆర్థికంగా సంస్థకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నందున వివిధ వర్గాలకు అందిస్తున్న రాయితీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.

కేటీఆర్ కు లక్ష ఇళ్లు ఇప్పుడు గుర్తొచ్చాయా?


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేద ప్రజలకు లక్ష రెండు గదుల ఇళ్లను వేగంగా పూర్తిచేసి ఈ సంవత్సరంలోనే అందించాలని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కె టి రామారావు అధికారులను ఆదేశించారు. వచ్చే ఆగష్టు నాటికి 50,000 గృహాలు, దసరానాటికీ మరో 50,000 గృహాలు సిద్దమవుతాయని అధికారులు చెబుతున్నారు.

అయితే నగరంలోని పేదప్రజలకు లక్ష గృహాలు నిర్మించి ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చి నాలుగున్నరేళ్ల అవుతుంది. ఆయనకు ఆ హామీ ఇప్పుడు గుర్తు వచ్చిన్నట్లున్నది. జనవరి, 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టి ఆర్ ఎస్ ఎస్ ప్రచార బాధ్యతలను నిర్వహించిన కేటీఆర్ ఒక సంవత్సరంలోగా ఒక లక్ష గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.

అయితే ఆ హామీని ఆయన ఆ తర్వాత పట్టించుకోలేదు. మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి, 2021తో పూర్తవుతుంది. అంటే వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరుపవలసి వస్తుంది. ఆ ఎన్నికలకు సన్నాహాలుగానే గతంలో చేసిన వాగ్ధానాలను కేటీఆర్ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొంటున్నట్లు కనిపిస్తున్నది.

అప్పట్లో కేటీఆర్ చాలా హామీల వర్షం కురిపించారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా మారుస్తామన్నారు. ట్రాఫిక్ జామ్ లు లేకండా అనేక ఎక్సప్రెస్స్ రహదారుల నిర్మాణంతో పాటు, రాపిడ్ ఫ్లై ఒవెర్ల్స్ నిర్మాణం కూడా చేస్తామనన్నారు. ఎన్నో మ్యాప్ లను ప్రజల ముందుంచారు. అయితే అవేమీ పూర్తి కాకపోవడంతో ఇప్పుడు హడావుడిగా కొన్ని పనులైనా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఒక వంక లాక్ డౌన్ లో ప్రభుత్వ యంత్రాంగం అంతా కరోనా కట్టడిలో నిమగ్నమై ఉండగా,కేటీఆర్ మంత్రిత్వ శాఖ మాత్రం హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణం వంటి పనులలో తీరికలేకుండా ఉండిపోయింది. ఎట్లాగైనా మరోసారి జి హెచ్ ఎం సిలో తమ పార్టీని గెలిపించాలని పట్టుదలగా కృషి చేస్తున్నారు.

2016లో కాంగ్రెస్, బిజెపి, టిడిపిల మధ్య ప్రతిపక్ష ఓట్ల చీలికతో టి ఆర్ ఎస్ అనూహ్యంగా 99 సీటు గెలుపొందింది. ఎంఐఎంతో వ్యూహాత్మక అవగాహన సహితం తోడ్పడింది. అయితే ఇప్పుడు ఆ పార్టీలు అంత బలంగా లేవు. టి ఆర్ ఎస్ సహితం అంతర్గతంగా వర్గ పోరును ఎదుర్కొంటున్నది. పలువురు బలమైన నేతలు మౌనంగా ఉంటున్నారు. ఇటువంటి సమయంలో నూతన రాజకీయ సమీకరణలకు తెరలేచె అవకాశం లేకపోలేదు.

ప్రధాని మోదీతో భేటీకి సిద్ధమవుతున్న మెగాస్టార్?


దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడగా, షూటింగులు వాయిదా పడ్డాయి. దీంతో ఇండస్ట్రీని నమ్ముకొని జీవిస్తున్న వేలాది మంది కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులను ఆదుకునేందుకు ఆయా చిత్రసీమలోని పెద్దలు ముందుకొస్తున్నారు. కాగా టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ మనకోసం’ ఛారిటీని ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకుంటున్నారు. ‘సీసీసీ మనకోసం’ ఛారిటీకి సెలబ్రెటీలు తమకు తోచినంత విరాళం అందించి కార్మికులకు అండగా నిలిచారు. ఇదిలా ఉంటే నేడు మెగాస్టార్ ఆధ్వర్యంలో సినీపెద్దలంతా బేటి అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం దేశంలో లాకౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31వరకు లాక్డౌన్ కొనసాగునుంది. అయితే లాక్డౌన్ 3.0లో సినిమా షూటింగులకు అనుమతి వస్తుందని అందరూ భావించారు. అయితే అలాంటివేమీ జరుగలేదు. దీంతో టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ తో నేడు బేటీ అయి లాక్డౌన్లో 4.0 తర్వాత షూటింగులు ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగులు ప్రారంభించాలి? ఇండస్ట్రీని కార్మికులను ఎలా ఆదుకోవాలి? హీరో హీరోయిన్ల రెమ్యూనేషన్ తగ్గింపు? థియేటర్లను ఎలా తెరిపించాలి? అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ బేటిలోని అంశాలను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే షూటింగులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈమేరకు మెగాస్టార్ ఆధ్వర్యంలో సినీ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిచేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా భారత ప్రధాని మోదీని కలిసి సినీ ఇండస్ట్రీని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరనున్నారని తెలుస్తోంది. లాక్డౌన్ ఇలానే కొనసాగితే ఇండస్ట్రీకి, కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందులను వారికి వివరించాలని మెగాస్టార్ భావిస్తున్నారట. ఈమేరకు తగిన కార్యచరణ రూపొందించి త్వరలోనే ప్రధాని మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీని పెద్దలు కలువనున్నారట. ఈమేరకు ఇప్పటికే వారికి అపాయిమ్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇన్నాళ్లూ షూటింగుల విషయంలో స్తబ్ధుగా ఉన్న చిత్రసీమ లాక్డౌన్లో సినిమాలకు కూడా పర్మిషన్ ఇవ్వాలని కోరుతోంది. కేంద్ర మార్గదర్శకాలతో షూటింగులు ప్రారంభించేందుకు తాము సిద్ధమేనంటూ ప్రకటిస్తున్నారు. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే..!

మెగా కోడలు ఓపెన్ ఛాలెంజ్.. అది ధరించే దమ్ముందా..!


మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో మెగా అభిమానులతో ఎల్లప్పుడు టచ్లో ఉంటూనే ఉంటారు. హెల్త్, ఫిటెనెస్, సామాజిక కార్యక్రమాలతో ఉపాసన అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఉపాసన చేసిన పనికి నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కండోమ్ తో తయారుచేసిన స్కర్టును మెగా కోడలు ధరించి ఆ ఫొటోను తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు చేసింది. అంతేకాకుండా ఇలాంటివి ధరించే ధైర్యం ఉందా? అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. గతంలోనూ మెగా కోడలు ఇండియన్ టాలెంట్ పొజిషన్లో కూర్చొని ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పించారు. వెస్టన్ టాయిలెట్స్ అలవాటయ్యాక ఇలా కూర్చోవడం అందరూ మరిచిపోయారా? ఇండియన్ టాలెంట్ పొజిషన్ వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని స్వయంగా ఆమెచేసి చూపించి అందరినీ ఆకట్టకున్న సంగతి తెల్సిందే..

https://www.instagram.com/p/CAXwCLyDTHO/

ఉపాసన అపోలో సంస్థల భాగస్వామిగా ఉంటూనే మెగా కోడలిగా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. తనకు తోచినవిధంగా సాయం చేస్తూ అందరినీ మన్నలను పొందుతోంది. అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తనకి తెలిసిన టిప్స్ ను సోషల్ మీడియాలో వివరిస్తుంది. తాజాగా ఉపాసన పనికిరాని వస్తువులను కూడా ఎలా ఉపయోగించుకుకోవచ్చో తెలియజేస్తూ ఇన్ స్ట్రాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. కండోమ్స్ తో తయారుచేసిన డిజైర్ వేర్ ధరించిన ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేసింది. తాను ధరించిన స్కట్ కూడా డిఫెక్టెడ్ కండోమ్స్(పనికి రాని కండోమ్స్)తో తయారు చేసిందని పేర్కొంది. ఉపాసన కండోమ్ స్కట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ కండోమ్ స్కర్టులో ఉపాసన ఏంజిల్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఉపాసన ఓపెన్ ఛాలెంజ్ కు ఎంతమంది స్పందిస్తారో వేచిచూడాల్సిందే..!

రాజధాని పాత సమస్య మళ్ళీ తెరపైకి!

రాజధానిలో పాత సమస్య మళ్ళీ తెరపైకి వచ్చింది. లాక్‌ డౌన్‌ కాలంలో వాహనాల రాకపోకలు తగ్గి వాయుకాలుష్యం చాలా పరిమితంగా ఉండేది. తాజాగా లాక్‌ డౌన్‌ లో సడలింపులు ఇవ్వడంతో ఒక్కసారిగా వాహనాలు  రోడ్ల మీదకు వచ్చేశాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టూ ఉన్న 6 ప్రాంతాల్లో ఆన్‌ లైన్‌ మానిటరింగ్‌ ద్వారా గుర్తిస్తున్న గాలి నాణ్యత సూచికలు ఎప్పటికప్పుడు వాయు కాలుష్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. దీంతో గాలి నాణ్యత గ్రీన్‌ జోన్‌ నుంచి ఎల్లో, తర్వాత ఆరెంజ్‌ లోకి మారుతోంది. లాక్‌ డౌన్‌ కు ముందు (మార్చి 22కు ముందు) నగరంలో నమోదైన గాలి నాణ్యత 150 (మైక్రో గ్రామ్స్‌ ఇన్‌ క్యూబిక్‌ మీటర్స్‌) గా ఉండేది. ఆ తర్వాత అది 44 స్థాయికి తగ్గి గ్రీన్‌ జోన్‌ లో ఉంది. సడలింపులతో వాహనాల రాకపోకలు పెరిగి ప్రస్తుతం 97కు పైకి చేరింది. లాక్‌ డౌన్‌ కాలంలో వాయు కాలుష్యం తీవ్రత 100లోపు ఉం డగా.. బుధవారం ఒకేసారి 112 వరకు పెరిగింది.