
రాజధానిలో పాత సమస్య మళ్ళీ తెరపైకి వచ్చింది. లాక్ డౌన్ కాలంలో వాహనాల రాకపోకలు తగ్గి వాయుకాలుష్యం చాలా పరిమితంగా ఉండేది. తాజాగా లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో ఒక్కసారిగా వాహనాలు రోడ్ల మీదకు వచ్చేశాయి. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న 6 ప్రాంతాల్లో ఆన్ లైన్ మానిటరింగ్ ద్వారా గుర్తిస్తున్న గాలి నాణ్యత సూచికలు ఎప్పటికప్పుడు వాయు కాలుష్య తీవ్రతను వెల్లడిస్తున్నాయి. దీంతో గాలి నాణ్యత గ్రీన్ జోన్ నుంచి ఎల్లో, తర్వాత ఆరెంజ్ లోకి మారుతోంది. లాక్ డౌన్ కు ముందు (మార్చి 22కు ముందు) నగరంలో నమోదైన గాలి నాణ్యత 150 (మైక్రో గ్రామ్స్ ఇన్ క్యూబిక్ మీటర్స్) గా ఉండేది. ఆ తర్వాత అది 44 స్థాయికి తగ్గి గ్రీన్ జోన్ లో ఉంది. సడలింపులతో వాహనాల రాకపోకలు పెరిగి ప్రస్తుతం 97కు పైకి చేరింది. లాక్ డౌన్ కాలంలో వాయు కాలుష్యం తీవ్రత 100లోపు ఉం డగా.. బుధవారం ఒకేసారి 112 వరకు పెరిగింది.