Home Blog Page 8478

‘టీటీడీ’ వ్యవహారంపై ప్రభుత్వ నిర్ణయం ఇదే..!


టీటీడీకి చెందిన భూములను విక్రయించాలన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. స్వపక్షం, విపక్షాలు, భక్తులు అందరి నుంచి టిటిడి ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ మేరకు భూముల విక్రయంపై చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వ హాయంలోని ట్రస్టు బోర్డు 50 ఆస్తులు విక్రయించాలని 2016, జనవరి 30 తేదీన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి తీర్మానం 253 నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేసింది.

టిటిడి ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలో సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భూముల అమ్మకంపై చర్చించారు. సమావేశం అనంతరం విక్రయాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వ్యవహారంపై మత పెద్దలు, ధార్మిక సంస్థలు, భక్తులు ఇతర భాగస్వామ్యపక్షాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ స్థలాల్లో దేవాలయాల నిర్మాణం, ధర్మ ప్రచార కార్యక్రమాలు లాంటివి చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

కొద్ది రోజుల క్రితం టిటిడి వేరే రాష్ట్రాల్లో ఉన్న 50 ఆస్తులను వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ వ్యవహారంపై విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని, అప్పటి వరకు తీర్మానాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగినా చర్చల అనంతరం ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

పెరిగిన వాల్యుయేషన్ వేగం.. తగ్గిన రిజల్ట్స్ డేట్!

తెలంగాణలో విద్యా శాఖ అధికారులు, ఇంటర్ పరీక్షా పేపర్ల వాల్యుయేషన్ అనుకున్నదానికంటే ముందుగానే ప్రక్రియ పూర్తి చేసేలా ఉన్నారు. అందువల్ల వీలైనంత త్వరగా రిజల్ట్స్ ప్రకటించేందుకు ఇంటర్ బోర్డ్ రెడీ అవుతోంది. జూన్ 8 తర్వాత ఎప్పుడైనా ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ ఉంది. ఇప్పటికే సెకండ్ ఇయర్ పరీక్షల పత్రాల్ని చెక్ చేశారు. వాల్యుయేషన్ పూర్తైంది. ఆ వివరాల్ని కంప్యూటర్లలో ఎంటర్ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆన్సర్ షీట్లు… ఇంటర్ బోర్డుకు చేరినట్లు తెలిసింది.

ముందుగా అనుకున్న ప్లానైతే… మొదట సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేసి… తర్వాత ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఇవ్వాలనుకున్నారు. కానీ… ఇప్పుడు వాల్యుయేషన్ వేగంగా పూర్తవుతోంది. శని, ఆది వారాల్లో కూడా ఇది కొనసాగుతోంది. ఒక్కో లెక్చరర్… 45 ఆన్సర్ షీట్లను చెక్ చేస్తున్నారు. కాబట్టి… ఒకే రోజు రెండు ఫలితాల్నీ ప్రకటించాలని అనుకుంటున్నారు. 28 తర్వాత ఫస్ట్ ఇయర్ ఫలితాల్ని కంప్యూటర్లలో ఫీడ్ చేస్తారు. అది మరో వారంలో పూర్తి కావచ్చు. ఆ తర్వాత ప్రభుత్వంతో సంప్రదించి ఇంటర్ బోర్డు… ఫలితాలు ప్రకటించనుంది.

ఇక ఎంసెట్‌ జులై 8 నుంచి జరగనుంది. ఆలోపే సప్లిమెంటరీ పరీక్షలు కూడా పూర్తవుతాయి. ఇంటర్ రిజల్ట్స్ నాడే సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు జరిపేదీ చెబుతారు. జూన్ చివర్లో ఇవి మొదలై… జులై మొదటి వారంలోగా ఇవి పూర్తవుతాయని తెలుస్తోంది. ఎంసెట్‌ లో ఇంటర్ ఫలితాల్ని కూడా లెక్కలోకి తీసుకోనున్నారు. ఇక సెప్టెంబర్ నుంచి కొత్త విద్యా సంవత్సరం క్లాసులు మొదలవుతాయి. అయితే.. ఇంటర్ తరగతులు మాత్రం… ఆగస్టు నుంచే ప్రారంభించేలా బోర్డు ప్రయత్నిస్తోంది. అందుకు టెక్ట్స్ బుక్స్ రెడీ చేస్తోంది.

కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష..కీలక నిర్ణయాలు!

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మే 27న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా చేపట్టిన లాక్‌ డౌన్‌, రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై సమావేశం నిర్వహించనున్నారు. వర్షాకాల వ్యవసాయం, నియంత్రిత సాగు, రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించిన అంశాలనూ చర్చించనున్నారు. ప్రగతి భవన్‌ లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ జరగనుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌ లో సగం షాపులు ఒక రోజు, సగం షాపులు మరుసటి రోజు తెరుస్తున్నారు. మరి కొంత కాలం ఇలాగే కొనసాగించాలా ఏమైనా మార్పులు చేయాలా అనే విషయంపై చర్చించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అటు రోహిణి కార్తె ప్రవేశించిన నేపథ్యంలో వర్షాకాలం వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై సీఎం చర్చిస్తారు. గ్రామాల్లో ఎరువుల లభ్యత ఉందా లేదా, విత్తనాలు అందుబాటులో ఉన్నాయా లేవా అనే విషయాలపై సమీక్ష జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా జరపాలనే విషయం కూడా చర్చించనున్నారు కేసీఆర్.

1 ప్లస్ 9 హత్యల మిస్టరీ వీడింది

వరంగల్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన బావిలో శావాల కేసు మిస్టరీ వీడింది. సంజయ్ అనే బీహార్ వ్యక్తితో ఒక స్త్రీ పెట్టుకున్న అక్రమ సంబంధం ఆ స్త్రీతో పాటు మరో 9మందిని బలి తీసుకుంది. వరంగల్‌ గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాం లో పరిచయం, ఇంటివరకు వచ్చిన సంబంధం, 10 మందిని బలి తీసుకున్న అక్రమ సంబంధం. ఇది టోటల్ గా సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటన.

ఈ ఉదంతంలో పాత్రలు

సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ (24) నిందితుడు, మక్సూద్‌ (గోదాం లో సంజయ్ తో పాటు పని చేసేవాడు)
రఫీకా (31) (సంజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి)
బుస్రా, (రఫీకా కూతురు సంజయ్ తో ప్రేమ)
నలుగురు వ్యక్తులు మక్సూద్‌ కుటుంబ సభ్యులు కాగా మరో ముగ్గురు బయట వ్యక్తులు.. ఈ పది మందికి సంజయ్‌ హత్య చేశాడు.

పరిచయం నుండి హత్య వరకు ఇలా..

గోనె సంచులు తయారు చేసే కేంద్రంలో మక్సూద్‌, అతడి భార్య పనిచేసేవారు. ఈ క్రమంలోనే బిహార్‌ కు చెందిన సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ కు ఆ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. మక్సూద్‌ భార్య నిషా అక్క కూతురు రఫీకా (31)తో పరిచయం ఏర్పడింది. అప్పటికే భర్తతో విడిపోయి ముగ్గురు పిల్లలతో ఒంటరిగా ఉంటున్న రఫీకాకు సంజీవ్‌ దగ్గరయ్యాడు. అనంతరం గీసుకొండ మండలం జాన్‌ పాక ప్రాంతంలో రెండు గదుల ఇంటిని కిరాయికి తీసుకుని ఆమెతో సహజీవనం చేశాడు. అయితే తన కుమార్తెతో కూడా నిందితుడు చనువుగా ఉండడాన్ని రఫీకా గమనించి సంజయ్‌ ను నిలదీసింది. పలుమార్లు అతడితో గొడవ పడింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన కుమార్తెతో సన్నిహితంగా ఉండడంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో రఫీకాను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుని, పెళ్లి విషయాన్ని పెద్దలతో చెప్పేందుకు వెళ్దామని రఫీకాను మాత్రమే తీసుకుని సంజీవ్‌ యాదవ్‌ మార్చి 6న విశాఖ వైపు వెళ్లే గరీభ్‌ రథ్‌ రైలు ఎక్కాడు. దారిలో మజ్జిగ ప్యాకెట్లు కొని అందులో నిద్రమాత్రలు కలిపి ఆమె అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో రైల్లోంచి తోసేశాడు. అనంతరం తిరిగి గీసుకొండ చేరుకున్నాడు. అయితే, తన అక్క కూతురు గురించి మక్సూద్‌ భార్య నిషా నిలదీసింది. ఆమె గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పింది. దీంతో మక్సూద్‌ కుటుంబాన్ని కూడా హతమార్చాలని టార్గెట్‌ పెట్టుకున్నాడు.

ఈ క్రమంలో ఈ నెల 16వ నుంచి 20వ తేదీ వరకు రోజూ వారు పనిచేసే గోనె సంచుల తయారీ కేంద్రాన్ని సందర్శించేవాడు. చుట్టు పక్కల ప్రదేశాలను పరిశీలించాడు. ఈ నెల 20వ తేదీన మక్సూద్‌ మొదటి కుమారుడైన షాబాజ్‌ పుట్టిన రోజు అని తెలుసుకుని ఆ రోజే చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం 18వ తేదీన వరంగల్‌ చౌరస్తాలో ఓ మెడికల్‌ షాపులో సుమారు 60 నిద్రమాత్రలు కొనుగోలు చేశాడు. 20వ తేదీ రాత్రి వారితో ముచ్చటించాడు. అనుకూలంగా ఉన్న సమయంలో మక్సూద్‌ కుటుంబం తయారు చేసుకున్న భోజనంలో నిద్రమాత్రలు కలిపాడు. తాను ఇక్కడికి వచ్చిన విషయాన్ని బయటకు చెబుతారన్న ఉద్దేశంతో ఈ కుటుంబానికి సంబంధం లేని శ్యాం, శ్రీరాం తయారు చేసుకున్న భోజనంలోనూ నిద్రమాత్రలు కలిపాడు. వారంతా నిద్రలోకి జారుకున్నాక అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య వరకు మత్తులో ఉన్న వారందరినీ గోదాము పక్కనే ఉన్న బావిలో పడేసి ఇంటికెళ్లి పోయాడు.

ఈ కేసును ఛేదించేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేసి, గోదాం, గొర్రెకుంట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలు ఆధారంగా ఈ కేసును పోలీసులు ఛేదించారు.

కమల్ తో ఆ రిలేషన్ లేదంటున్న హీరోయిన్


ఇండియన్ సినిమాల్లో కమలహాసన్ లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలనటుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కమలహాసన్ ఆ తర్వాత హీరోగా రాణించారు. తెలుగు, తమిళంతోపాటు అన్నిభాషల్లో కమల్ హాసన్ నటించి ఇండియన్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. ఆయన నటించిన ప్రతీ సినిమా అన్ని భాషల్లో విడులవుతుంటాయి. తమిళంతోపాటు తెలుగులోనూ కమల్ హాసన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే కమల్ హాసన్ కు మాత్రం పెళ్లి జీవితం అంతగా కలిసి రాలేదు. కమల్ హాసన్ రెండు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ గౌతమితో కొన్ని సంవత్సరాలు సహజీవనం చేశాడు. ఇటీవలే గౌతమి-కమలహాసన్ విడిపోయిన సంగతి తెల్సిందే. అయితే గౌతమితో విడిపోయాక కమల్ పూజా కుమార్ తో సహజీవనం చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా పూజా కుమార్ ఓ ఇంటర్యూలో క్లారిటీ ఇచ్చారు.

తాను కమలహాసన్ తో రిలేషన్లో ఉన్నానని వస్తున్న వార్తలో నిజం లేదని పూజా కుమార్ స్పష్టం చేసింది. తాను గడిచిన ఐదారేళ్లుగా కమల్ సార్ తో కలిసి పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కమల్ హాసన్ ఓ గొప్ప క్రియేటర్.. క్రియేటివ్ జీనియన్ అని ప్రశంసలు కురిపించింది. ఆయన దగ్గరి నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చకున్నానని పూజా కుమార్ తెలిపారు. అంతేకాకుండా కమల్ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పింది. ఆయన కుటుంబ సభ్యులు, కూతుళ్లతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని పూజా కుమార్ తెలిపారు. ఇదిలాఉంటే గతేడాది జరిగిన కమల్ పుట్టినరోజు వేడుకల్లో పూజ స్వయంగా పాల్గొని అన్ని ఏర్పాట్లు చేయడంతోపాటు కమల్ ఫ్యామిలీతో ఫొటో దిగింది. కమల్ ఫ్యామిలీలో పూజా కుమార్ కన్పించడంతో వారిద్దరు రిలేషన్లో ఉన్నారనే ప్రచారానికి బీజం పడింది. తాజాగా దీనిపై ఆమె స్పందిస్తూ అలాంటిదేమీ లేదని తేల్చేసింది.

కాగా కమలహాసన్ కు శృతిహాసన్, అక్షర హాసన్, సుబ్బలక్ష్మి అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. కమలహాసన్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ మూవీలో నటిస్తున్నాడు. ‘ఇండియన్-2’ షూటింగుల్లో ఇటీవల పెద్ద ప్రమాదం జరుగగా అందులో నుంచి కమలహాసన్ క్షేమంగా బయటపడ్డారు. ఇండియన్-2 మూవీని దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్ నటిస్తున్నారు. త్వరలోనే ఇండియన్-2 సినిమాను ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.

బోర్డర్ లో పట్టుబడ్డ పాక్ పావురం!

పాకిస్తాన్‌, ఒక గూఢచార పావురాన్ని మన దేశానికి పంపి మన గుట్టు తెలుసుకునేందుకు పన్నాగం పన్నింది. దీంతో అలర్టైన భద్రతా సిబ్బంది పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఈ గూఢచార పావురాన్నికథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గతంలో పాక్ కు చెందిన డ్రోన్ లు ఇండియా బోర్డర్ లో హల్ చల్ చేశాయి.  ఆ సమయంలో ఇండియన్ అధికారులు వాటిని కూల్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ బోర్డర్ నుంచి ఎగురుతూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలోని మన్యారి గ్రామస్తులు పావురాన్ని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.  తెల్లని పావురానికి కాళ్ళ భాగంలో ఎర్రగా రంగు పూసి ఉన్నది.  చూడటానికి సాధారణంగా ఉన్నా, దాని కాళ్లకు రింగు ఉన్నది.  దానిపై కోడింగ్ తో ఉన్న గుర్తులు ఉండటంతో ఆ పావురాన్ని, ఉంగరాన్ని స్థానిక పోలీసులు ఆర్మీ అధికారులకు అప్పగించారు.  అది పాక్ గూఢాఛార పావురంగా దానిని గుర్తించారు.  రింగ్ పై ఉన్న కోడింగ్ ను డీకోడ్ చేయడానికి ఆర్మీ ప్రయత్నిస్తోంది.

హిందూ మతంపై వైసీపీ ప్రభుత్వం కుట్ర ఇది..!


ప్రాంతీయ పార్టీలు హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని చాలా చులకనగా చూస్తున్నాయని, ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. టిటిడి భూముల విక్రయాలు అంశంపై, హిందూ దేవాలయాల పరిరక్షణపై మీడియా తో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కృష్ణా పుష్కరాల సమయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హిందూ దేవాలయాలను కూల్చివేస్తే, 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఏకంగా హిందూ మతాన్నే రాష్ట్రంలో లేకుండా చేయాలని కుట్ర పన్నుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయ భూములకు రక్షణ అవసరం అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ గత తొమ్మిది నెలలుగా పలుమార్లు ముఖ్యమంత్రికి లేఖ ద్వారా, పత్రికా ముఖంగా ప్రస్తావించింది. అన్నవరం, సింహాచలం దేవస్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చిన్న చిన్న దేవాలయాల భూములకు కూడా రక్షణ లేకుండా పోయిందని, వైకాపా నాయకులు దేవాలయ భూములను కబ్జా చేయాలనే కుట్రలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అడ్డుకుంటోందని స్పష్టం చేశారు.

వైకాపా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టిటిడి పాలకమండలి ఏకంగా స్వామి వారికి చెందిన తమిళనాడులోని 23 ఆస్తులను విక్రయించేందుకు వేలం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని, దశాబ్దాలుగా వివాదంలో ఉన్న సింహాచలం ఆలయ భూములను పరిరక్షించకుండా కరోనాను అడ్డం పెట్టుకుని వాటిని కూడా ఆక్రమించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. నూతనంగా వైకాపా ప్రభుత్వం దేవాదాయ శాఖకు ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్లను జీవో నెంబరు 39 ప్రకారం నియమించడం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయ భూములను, ఆస్తులను గుట్టు చప్పుడు కాకుండా దోచేందుకే జాయింట్ కలెక్టర్లను ప్రత్యేకంగా కేటాయించారేమో అని అనుమానాలు, భయాందోళనలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ విధంగా నూతన జాయింట్ కలెక్టర్లను దేవాదాయ శాఖకు కేటాయించడం వెనుక అధికార పార్టీ ఉద్దేశం ఏంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయ భూములకు పరిరక్షించేందుకు, దేవాదాయాల సంరక్షణ కోసం, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వ వైఖరి పట్ల నిరసనగా ఈనెల 26 వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోందని తెలియజేశారు. ఈ నిరసన ఉపవాస దీక్ష కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వెంకన్న భక్తులు తప్పకుండా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఆ పార్టీతో కలిసి నిరసన తెలపండి..!

BJP-Janasena


టిటిడి భూముల విక్రయానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ మంగళవారం చేపట్టే నిరసన కార్యక్రమాల్లో జనసేన శ్రేణులు పాల్గొని, పార్టీ తరపున మద్దతు తెలుపుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బి.జె.పి. జనసేన కలసి చేసే ఈ నిరసన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారనీ, ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. స్థానిక బీజేపీ నాయకులను సమన్వయం చేసుకొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టి.టి.డి. భూములను వేలం ద్వారా విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదని, టి.టి.డి. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో భారతీయ జనతా పార్టీ మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. దీంతో ఈ అంశంపై నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ పార్లమెంటరీ సంయుక్త కమిటీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడాది వరకు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన కూడదని నిర్ణయం తీసుకున్నమని, అయితే ప్రభుత్వం పాలనలోకి వచ్చిన కొద్ది కాలం నుంచే ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా, ప్రణాళిక లేని పాలన మొదలుపెట్టిందన్నారు. సమస్యలు ఉత్పన్నమైన ప్రతి సందర్భంలో జనసేన పార్టీ తగు రీతిలో స్పందించిందని చెప్పారు. రాజకీయ పోరాటాలతో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్లాలన్నారు.

బీజేపీతో పొత్తు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలన్నీ కలసి చేద్దామని భావించామని, విద్యుత్ ఛార్జీలపై గత వారం నల్లజెండాలతో ఎవరి ఇళ్లలో వారు నిరసన కార్యక్రమం నిర్వహించారన్నారు. ముందు ముందు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బీజేపీతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశం మీద ఓ రోడ్ మ్యాప్ రూపొందిస్తామని తెలిపారు. జనసేనాని పవన్ కల్యాణ్ కోవిడ్-19 దృష్ట్యా సామాజిక దూరం ఖచ్చితంగా పాటించమని, నిరసనల్లో పది మందీ కలిసి కూర్చోవడం కాకుండా దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న మన వల్ల మన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకూడదని తెలిపారు.

లాక్ డౌన్ సడలించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలు, కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సి.ఐ.డి. విభాగాన్ని వాడుకుని పనిగట్టుకుని మరీ జిల్లాల్లో జనసైనికుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందన్నారు. మన అధికార ప్రతినిధుల్ని సైతం ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని చెప్పారు.

పవన్, బండి సంజయ్ తో భేటీ..కీలక నిర్ణయం?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లో సుమారు 50 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. తెలంగాణలో ఇరు పార్టీలు కలిసి పనిచేసే అంశంపై ఈ సమావేశంలో చర్చినట్లు సమాచారం.

ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లోనూ కలిసి పనిచేస్తామని ఇది వరకే ఇరు పార్టీల నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ కలిసి పనిచేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే బీజేపీ వర్గాలు మాత్రం వారిద్దరు మర్యాదపూర్వకంగానే సమావేశమైనట్లు చెబుతున్నాయి. గతంలో బండి సంజయ్‌ ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ ప్రకటించిన తర్వాత.. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్‌-సంజయ్‌ భేటీపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

షాషీద్ కపూర్ తో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ భామ


బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పక్కన తొలి మూవీతోనే జతకట్టింది. ‘దబాంగ్’ మూవీలో సల్మాన్ కు జోడీగా నటించి మెప్పించింది. ఈ మూవీ బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టుకావడంతో సోనాక్షి సిన్హా ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ మూవీ తర్వాత ఆమెకు బాలీవుడ్లో వరుస అవకాశాలు వచ్చాయి. పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్టుకావడంతో సోనాక్షి సిన్హా గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. అయితే అదే రేంజుల్లో ఈ భామపై గాసిప్స్ మొదలైయ్యాయి. ప్రభుదేవా దర్శకత్వంలో 2013లో వచ్చిన ‘ఆర్.. రాజ్ కుమార్’ సినిమాలో సోనాక్షి సిన్హా షాహిద్ కపూర్ కు జోడీగా నటించింది. ఈ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని.. డేటింగ్ కూడా చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత షాహిద్ కపూర్ 2015లో మీరా రాజ్ పుత్ ని వివాహం చేసుకోవడం డేటింగ్ ప్రచారానికి తెరపడింది.

అయితే తాజాగా ఆ డేటింగ్ వార్తలపై సోనాక్షి సిన్హా స్పందించింది. తాను షాహిద్ తో డేటింగ్ చేస్తున్న అన్న వార్తల్లో నిజం లేదని.. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది. ఖాళీగా ఉంటే కొంతమంది వ్యక్తులు ఇద్దరు పెళ్లి కాని నటిస్తున్నప్పుడు ఇలాంటి రూమర్లు సృష్టిస్తుంటారని తెలిపింది. అయితే ఈ వార్తలేమి తనను బాధపెట్టలేదని.. వీటిని చూసి తాను, షాహిద్ కపూర్ నవ్వుకునే వాళ్లమంటూ సెలవిచ్చింది ఈ భామ. షాహిద్ పెళ్లి తర్వాత కూడా తామిద్దరం మంచి స్నేహితుల్లాగానే కొనసాగుతున్నామని సొనాక్షి చెప్పింది. ఇటీవలే షాహిద్ కపూర్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టు సాధించిన ‘అర్జున్ రెడ్డి’ మూవీని బాలీవుడ్లో కబీర్ సింగ్ తీసి భారీ విజయం అందుకున్నాడు. కబీర్ సింగ్ మూవీ బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో షాహిద్ కు జోడీగా కియారా అడ్వాణీ నటించింది.

ఆ ఆటలో తన భార్యదే పైచేయి అంటున్న హీరో


బాలీవుడ్లో క్రేజీ జంట ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు రణ్ వీర్ సింగ్-దీపీకా పదుకునే. వీరిద్దరి పెళ్లి చేసుకున్నాక లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్లో ఉంటూ అలరిస్తుంటారు. ఇక లాకౌన్డ్ కారణంగా షూటింగులు వాయిదాపడటంతో కలిసొచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వీరిద్దరి తెరపైనే కాదు.. నిజజీవితంతోనూ చాలా రోమాంటిక్ కపుల్ అనిపించుకుంటన్నారు. వీరిద్దరి ఏ విషయాన్ని చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. తాజాగా రణ్ వీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనే గురించి చెప్పిన ఓ విషయం అందరిలో ఆసక్తిని రేపుతోంది.

భార్యభర్తలు అన్నాక ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూనే ఉంటారు. అయితే ఆ విషయంలో మాత్రం ప్రతీసారి తన భార్యదే పైచేయి అని చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా తన భార్యపై పైచేయి సాధించే రోజు రావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. దీంతో రణ్ వీర్ సింగ్ ఏ విషయం గురించి చెప్పాడా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఇంతకీ రణ్ వీర్ సింగ్ ఏమన్నాడంటే.. తన భార్యది మంచి అథ్లెట్ బాడీ అని.. తాను కూడా మంచి అథ్లెట్ నే అంటూ చెప్పాడు. తామిద్దరం బ్యాడ్మింటన్లో పోటీ పడుతుంటామని చెప్పాడు. ఈ పోటీలో ప్రతీసారి తన భార్యనే విజయం సాధిస్తుందని నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలువలేదంటూ వాపోయాడు.

బ్యాడ్మింటన్ గేమ్ ను దీపికా సీరియస్ గా తీసుకుంటుందని రణ్ వీర్ సింగ్ చెప్పాడు. ప్రతీ పాయింట్ విషయంలో దీపికా తనను అలవోకగా ఓడిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు తనపై ఒక్కసెట్లోనూ పది పాయింట్లు కూడా సాధించలేదని చెప్పాడు. ఎప్పటికైనా తనపై ఒక్క సెట్ అయినా గెలుచుకుంటానని రణ్ వీర్ సింగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా దీపికా పదుకొనే తండ్రి ప్రకాశ్ పదుకునే ఒకప్పటి స్టార్ బ్యాడ్మింటన్. ఆయన వల్లే దీపికా, ఆమె చెల్లెలు బ్యాడ్మింటన్ నేర్చుకున్నారు. ఆమె చెల్లెలు పలు టోర్నీలు ఆడగా దీపికా మాత్రం హీరోయిన్ గా సెటిల్ అయింది. ఎప్పటికైనా రణ్ వీర్ బ్యాడ్మింటన్లో ఓడిస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!

ఉత్తమ్ సడన్ గా ఎందుకు యాక్టివ్ అయ్యారు?


ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ గా ఒక్క ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను విజయతీరాలకు చేర్చకుండా ఫ్లాప్ నాయకుడిగా కాంగ్రెస్ రాజకీయాల్లో మిగిలిపోయారు. తన సొంత ఇలాకా.. కాంగ్రెస్ కు కంచుకోట అయిన హుజూర్ నగర్ లో కూడా తన భార్యను గెలిపించలేకపోయారు. ఆ ఓటమితో రాజకీయాల్లో మౌనం దాల్చారు. తక్కువ ప్రొఫైల్ మెయింటేన్ చేశారు. ఓటమి తెచ్చిన నిరాశనో.. లేక గెలిపించలేకపోయానన్న బాధో కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం రాజకీయాల్లో కొద్దికాలంగా సైలెంట్ అయ్యారు.

*ఉత్తమ్ మళ్లీ యాక్టివ్..
తాజాగా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఒక్కసారిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వరుసగా ప్రకటనలు ఇవ్వడం.. విమర్శలను ఖండించడం.. ఆందోళనలు చేయడంతో లైమ్ లైట్ లోకి వచ్చారు. వాడి వేడి విమర్శలతో మరోసారి కాంగ్రెస్ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు.

*ఉత్తమ్ చురుకుదనం వెనుక కారణమేంటి?
సైలెంట్ గా ఉంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా సడన్ గా ప్లేటు ఫిరాయించి యాక్టివ్ కావడం వెనుక కారణమేంటన్న ప్రశ్న కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనికి కారణంపై ఆరాతీయగా.. పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ నే కొనసాగించడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. ఆ భరోసాతోనే ఉత్తమ్ మళ్లీ యాక్టివ్ అయ్యాడని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

*ఉత్తమ్ ను ఆనాడే తీసేద్దామనుకున్నారు..
నిజానికి ఉత్తమ్ తన పదవీకాలాన్ని పూర్తిచేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘోర పరాజయం పాలవ్వడం.. ఏమాత్రం పోటీ ఇవ్వకపోవడంతో ఉత్తమ్ తప్పుకోవాలనే డిమాండ్ వచ్చింది. అయితే తోక్ సభ ఎన్నికల వరకు ఉండమని పార్టీ ఉత్తమ్ ను కోరింది. తరువాత హూజూర్ నగర్ ఉప ఎన్నికల జరిగింది. అందులోనూ తన భార్యను గెలిపించలేకపోయాడు. దీంతో రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. పీసీసీ చీఫ్ రేసులో చాలా మంది నిలిచారు.. వీహెచ్ నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరూ టీపీసీసీ చీఫ్ కావాలని కోరుకున్నారు. అయితే ఉత్తమ్ వారసుడిని నిర్ణయించలేక..కొత్త పీసీసీ చీఫ్ నియామకాన్ని కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేసింది.

*జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు ఉత్తమే
ఇప్పుడు రేవంత్ సహా అందరూ ఆశగా ఎదురుచూస్తుండగా.. పీసీసీ చీఫ్ పీఠంపై ఫైట్ మొదలైంది. రేవంత్ వర్సెస్ సీనియర్లుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో ఈ కరోనా టైంలో అనవసరంగా కాంగ్రెస్ ను డిస్టబ్ చేయలేక జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు కొనసాగాలని హైకమాండ్ ఉత్తమ్ ను కోరినట్టు తెలిసింది.దీంతో మరో సంవత్సరం పాటు ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా కంటిన్యూ కాబోతున్నారు.

* భగ్గుమంటున్న పీసీసీ ఆశావాహులు
ఉత్తమ్ ను మళ్లీ పీసీసీ చీఫ్ గా కొనసాగించడంపై రేవంత్ రెడ్డి సహా ఆశావాదులు భగ్గుమంటున్నారు. హైకమాండ్ నిర్ణయం గురించి లోలోపల విరుచుకుపడుతున్నారు. ఉత్తమ్ ఒక్క ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ను గెలిపించలేకపోయినా తిరిగి ఆయనకే పదవి కట్టబెట్టడంపై కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. ఇది ఎప్పుడు బద్దలవుతుందనేది అంతుచిక్కని విధంగా ఉంది.

కింగ్ కోబ్రాకు తల స్నానం..


ఇంట్లో సేదతీరే మనుషులే ఎండదెబ్బకి తట్టుకోలేకపోతున్నారు. ఎండలో బయట తిరిగే మూగజీవాలు, వన్యప్రాణులు పరిస్థితి ఏమో పాపం. మాములుగా జనాలకు పామును చూస్తేనే వంట్లో వణుకుపుడుతుంది, అలాంటిది ఒక వ్యక్తి ఏకంగా  కింగ్ కోబ్రాకు తల స్నానం చేయించాడు.ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. మీరు కూడా ఓ లుక్ ఏయ్యండి.

https://youtu.be/UPHAGS_Tmeo

ఢిల్లీ నుండి బెంగ‌ళూరుకు 5 ఏళ్ల బాలుడి ఒంట‌రి ప్ర‌యాణం..


5 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులు లేకుండా ఢిల్లీ నుండి బెంగ‌ళూరుకు ఒక్కడే విమానంలో ప్రయాణం చేసాడు, వివరాల్లోకి వెళితే, బెంగ‌ళూరుకు చెందిన 5 ఏళ్ల విహాన్ శ‌ర్మ లాక్‌డౌన్ వ‌ల్ల ఢిల్లీలో చిక్కుకుపోయాడు. అయితే 3 నెల‌ల అనంత‌రం ప్ర‌స్తుతం విమానాలు న‌డుస్తుండ‌డంతో అత‌ను ఢిల్లీ నుంచి బెంగ‌ళూరుకు ఒంట‌రిగా విమానంలో ప్ర‌యాణించి క‌న్న‌త‌ల్లి వ‌ద్ద‌కు చేరుకున్నాడు.. ఆ స‌మ‌యంలో వారిద్ద‌రినీ తీసిన వీడియోలు, ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

https://twitter.com/BLRAirport/status/1264797556460015616

 

విమానాల్లో మధ్య సీట్లపై సుప్రీం క్లారిటీ!

 

వందేభారత్ మిషన్ లో భాగంగా ప్రత్యేక విమానాలు పంపించి విదేశాలలో ఉన్న భారతీయులను రప్పించడంలో భౌతిక దూరం పై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. భౌతిక దూరం నిబంధనలను కేంద్రం ఉల్లంఘిస్తోందని మండిపడింది. ఇది విమానం కాబట్టి వేరే వ్యక్తికి సోకకూడదని వైరస్‌ కి ఏమైనా తెలుస్తుందా..? అని వ్యంగ్యాస్త్రం సంధించింది. జూన్ ఆరు తర్వాత మిడిల్ సీట్లను ఖాళీగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. లాభాల కోసం కాకుండా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్వీసులు నడిపించాలని ఎయిరిండియాకి సూచించింది.

మిడిల్ సీట్ల బుకింగ్‌ పై గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎయిర్ ఇండియా సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడా ఎయిర్ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ముంబై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఎయిర్ ఇండియా పిటిషన్ కొట్టివేసింది. కరోనా వైరస్ కట్టడి కోసం భౌతిక దూరం పాటించడం ఇంగిత జ్ఞానం అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే వచ్చే పది రోజులు మాత్రం మద్య సీట్లను కూడా నింపి కార్యకలాపాలు జరుపుకోవచ్చని సుప్రింకోర్టు తెలిపింది. ఎయిర్ ఇండియాకు ఈ మేరకు వెసులుబాటు కల్పించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను ఉద్దేశించి మాత్రమే సుప్రీం ఈ వాఖ్యలు చేసింది. సీట్లను ఖాళీగా ఉంచడం కంటే, పరీక్షలు చేయడం, క్వారంటైన్ లో ఉంచడమే మంచి విధానమని, జూన్ 16 వరకు బుకింగ్స్ పూర్తయ్యాయని ఎయిరిండియా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

ఆ విషయంలో సినిమా ఇండస్ట్రీనే బెటర్: నందిని రాయ్


నందిని రాయ్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తెలుగులో ‘మెసగాళ్లకు మెసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘మాయ’ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ భామకు అనుకున్నంత స్టార్డమ్ మాత్రం రాలేదు. సరైన అవకాశాలకు కోసం ఎదరుచూస్తున్న ఈ బ్యూటీకి ‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో ఆఫర్ వచ్చింది. నందినిరాయ్ ఈ షోలో పాల్గొని తన టాలెంట్ తో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాల కంటే బిగ్ బాస్ ద్వారానే ఈ అమ్మడికి మరింత క్రేజ్ వచ్చింది. తాజాగా నందిని రాయ్ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు అగిడిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇందులో క్యాస్టింగ్ కౌచ్ పై నందిని రాయ్ చెప్పిన సమాధానం అందరినీ ఆలోచించేలా చేస్తోంది.

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాలేదని అంటోంది. ఇది అన్నిరంగంల్లోనూ ఉందని దీనికి చిత్రపరిశ్రమ మినహాయింపు కాదని చెబుతోంది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో మిగతా ఇండస్ట్రీలతో పొలిస్తే ఒకరకంగా చిత్రసీమనే బెటరని అంటోంది. తనకు సినిమా పరిశ్రమలో అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని చెబుతోంది. అయితే తన ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారని వారి చెప్పే కొన్ని విషయాలు వింటుంటే ఒకరకంగా సినిమా ఇండస్ట్రీనే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది. అంతేకాదు అమ్మాయిలైనా.. హీరోయిన్లు అయినా ‘నో’ అని చెబితే ఎవరూ ఏం చేయలేరని.. ‘నో’ అన్నాక బలవంతం చేసే పరిస్థితులు ఉండవని చెబుతోంది. ఇదంతా అమ్మాయిలు వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుందని నందినిరాయ్ అంటోంది.

దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో అమ్మాయిలే తప్పు అన్నట్లు నందినిరాయ్ మాట్లాడటం తగదని పలువురు విమర్శలు చేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ విషయం సినిమా ఇండస్ట్రీని వెనుకేసు రావడం వెనుక నందిని రాయ్ అంతర్యం ఏంటో తెలియడం లేదు. సినిమాల్లో అవకాశాల కోసమే నందినిరాయ్ ఇలా మాట్లాడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు దక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే..!