
బాలీవుడ్లో క్రేజీ జంట ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు రణ్ వీర్ సింగ్-దీపీకా పదుకునే. వీరిద్దరి పెళ్లి చేసుకున్నాక లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్లో ఉంటూ అలరిస్తుంటారు. ఇక లాకౌన్డ్ కారణంగా షూటింగులు వాయిదాపడటంతో కలిసొచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. వీరిద్దరి తెరపైనే కాదు.. నిజజీవితంతోనూ చాలా రోమాంటిక్ కపుల్ అనిపించుకుంటన్నారు. వీరిద్దరి ఏ విషయాన్ని చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటారు. తాజాగా రణ్ వీర్ సింగ్ తన భార్య దీపికా పదుకొనే గురించి చెప్పిన ఓ విషయం అందరిలో ఆసక్తిని రేపుతోంది.
భార్యభర్తలు అన్నాక ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూనే ఉంటారు. అయితే ఆ విషయంలో మాత్రం ప్రతీసారి తన భార్యదే పైచేయి అని చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా తన భార్యపై పైచేయి సాధించే రోజు రావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. దీంతో రణ్ వీర్ సింగ్ ఏ విషయం గురించి చెప్పాడా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఇంతకీ రణ్ వీర్ సింగ్ ఏమన్నాడంటే.. తన భార్యది మంచి అథ్లెట్ బాడీ అని.. తాను కూడా మంచి అథ్లెట్ నే అంటూ చెప్పాడు. తామిద్దరం బ్యాడ్మింటన్లో పోటీ పడుతుంటామని చెప్పాడు. ఈ పోటీలో ప్రతీసారి తన భార్యనే విజయం సాధిస్తుందని నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలువలేదంటూ వాపోయాడు.
బ్యాడ్మింటన్ గేమ్ ను దీపికా సీరియస్ గా తీసుకుంటుందని రణ్ వీర్ సింగ్ చెప్పాడు. ప్రతీ పాయింట్ విషయంలో దీపికా తనను అలవోకగా ఓడిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు తనపై ఒక్కసెట్లోనూ పది పాయింట్లు కూడా సాధించలేదని చెప్పాడు. ఎప్పటికైనా తనపై ఒక్క సెట్ అయినా గెలుచుకుంటానని రణ్ వీర్ సింగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా దీపికా పదుకొనే తండ్రి ప్రకాశ్ పదుకునే ఒకప్పటి స్టార్ బ్యాడ్మింటన్. ఆయన వల్లే దీపికా, ఆమె చెల్లెలు బ్యాడ్మింటన్ నేర్చుకున్నారు. ఆమె చెల్లెలు పలు టోర్నీలు ఆడగా దీపికా మాత్రం హీరోయిన్ గా సెటిల్ అయింది. ఎప్పటికైనా రణ్ వీర్ బ్యాడ్మింటన్లో ఓడిస్తాడో లేదో వేచి చూడాల్సిందే..!