
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో సుమారు 50 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. తెలంగాణలో ఇరు పార్టీలు కలిసి పనిచేసే అంశంపై ఈ సమావేశంలో చర్చినట్లు సమాచారం.
ఇప్పటికే ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లోనూ కలిసి పనిచేస్తామని ఇది వరకే ఇరు పార్టీల నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ కలిసి పనిచేసే అంశంపై చర్చించినట్లు సమాచారం. అయితే బీజేపీ వర్గాలు మాత్రం వారిద్దరు మర్యాదపూర్వకంగానే సమావేశమైనట్లు చెబుతున్నాయి. గతంలో బండి సంజయ్ ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ ప్రకటించిన తర్వాత.. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్-సంజయ్ భేటీపై రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.