
పాకిస్తాన్, ఒక గూఢచార పావురాన్ని మన దేశానికి పంపి మన గుట్టు తెలుసుకునేందుకు పన్నాగం పన్నింది. దీంతో అలర్టైన భద్రతా సిబ్బంది పావురాన్ని స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా కనిపించిన ఈ గూఢచార పావురాన్నికథువా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలో పాక్ కు చెందిన డ్రోన్ లు ఇండియా బోర్డర్ లో హల్ చల్ చేశాయి. ఆ సమయంలో ఇండియన్ అధికారులు వాటిని కూల్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పాక్ బోర్డర్ నుంచి ఎగురుతూ వచ్చిన జమ్మూ కాశ్మీర్ లోని కథువా జిల్లాలోని మన్యారి గ్రామస్తులు పావురాన్ని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తెల్లని పావురానికి కాళ్ళ భాగంలో ఎర్రగా రంగు పూసి ఉన్నది. చూడటానికి సాధారణంగా ఉన్నా, దాని కాళ్లకు రింగు ఉన్నది. దానిపై కోడింగ్ తో ఉన్న గుర్తులు ఉండటంతో ఆ పావురాన్ని, ఉంగరాన్ని స్థానిక పోలీసులు ఆర్మీ అధికారులకు అప్పగించారు. అది పాక్ గూఢాఛార పావురంగా దానిని గుర్తించారు. రింగ్ పై ఉన్న కోడింగ్ ను డీకోడ్ చేయడానికి ఆర్మీ ప్రయత్నిస్తోంది.