Home Blog Page 8474

యువతపై ‘బాబు’ గురి..!


పార్టీలో నెలకొన్న సంకోభాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు క్లారిటీకి వచ్చారు. ప్రస్తుతం నాయకులంతా టీడీపీని వీడుతున్న తరుణంలో సంక్షోభం నుంచి బయట పడేందుకు యువత అవకాశం కల్పించడం తప్ప మరో మార్గం లేదని గుర్తించారు. ఈ విషయాన్నే నిర్మొహమాటంగా మహానాడు వేదికపై వ్యక్తం చేశారు.

పార్టీలో యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలని, యువ నాయకులను తయారు చేయాలని చంద్రబాబు అన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీని వీడటం, మరికొందరు మరణించడంతో ఏర్పడిన లోటు తీర్చు కోవడానికి యువతకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. మహానాడు ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడిందన్నారు. కార్యకర్తల త్యాగాలను ఎన్నడూ మర్చిపోనని చెప్పారు.గడిచిన ఏడాది కాలంలో దురదృష్టమైనదిగా పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా చోట్ల అధికార పార్టీ వేధింపులకు గురయ్యారని చెప్పారు. అయినప్పటికీ ఎంతో దైర్యంతో పార్టీ కోసం పని చేస్తున్నారని చెప్పారు. పార్టీ కోసం కుటుంబ సభ్యులను కోల్పోయిన వెనకడుగు వేయకుండా పని చేయడం అందరికి స్ఫూర్తిని ఇచ్చిందన్నారు. ఇటువంటి కార్యకర్తలు కలిగి ఉన్న పార్టీ టిడిపి అని చెప్పారు. వీరందరికి పాదాభివందనం చరిస్తున్నానని తెలిపారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు సేవానిరతిని ప్రదర్శించారని అన్నారు. రాష్ట్రంలో పలు చోట్ల పేదలకు ఆహారం, నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారని చెప్పారు. అభివృద్ధిలోను రెండు రాష్ట్రాల్లో టీడీపీ చెరగని ముద్ర వేసిందన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని, సాంకేతిక నగరంగా సైబరాబాద్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీలో విమానాశ్రయాలు, పోర్టులు, సీడ్ పార్క్, విశాఖ మెడ్ టెక్ జోన్ అభివృద్ధి చేశామని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. పార్టీ ఏర్పాటు చేసి 38 అయ్యిందని, 22 అధికారం చేపట్టమని, 16 ఏళ్ళు ప్రతి పక్షంలో ఉన్నామని తెలిపారు. టీడీపీ చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, ఇతర రాష్ట్రాలు ఏ పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు.

ఆ ఫ్లైఓవర్లు జాతికి అంకితం!

kamineni flyover

 

kamineni flyover

రాజధానిలోని ఎల్‌బీ నగర్, కామినేని ఆసుపత్రి ప్రాంతంలో నిర్మించిన ఫ్లైఓవర్లు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయని, వీటిని గురువారం నాడు జాతికి అంకితం చేస్తామని పట్టణాభివృద్ధి, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటిఆర్ ట్విట్టర్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. నగరాభివృద్ధిలో తలమానికంగా నిలిచిన రోడ్ల అభివృద్ధి, ఫ్లై ఓవర్ల నిర్మాణంపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని స్పష్టంచేశారు. దుర్గం చెరువుపై ఊగే వంతెన నిర్మాణం పనులు కూడా పూర్తికావచ్చాయి.

రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతున్నది. ఒకవైపు కాళేశ్వరం జలాలను కొండ పోచమ్మసాగర్‌ లోకి పంపింగ్‌ చేస్తూ రైతుల కోసం కష్టిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విశేషంగా కృషిచేస్తుందన్నారు.

కారు ప్రమాదంలో సినీ నటి మృతి

వర్ధమాన సినీనటి కారు ప్రమదంలో మృతిచెందడంతో చిత్ర పరిశ్రమలో విషాదచాయలు నెలకొన్నాయి. కన్నడ సినీ, టెలివిజన్ నటి మెబియానా మైఖేల్(22) బుధవారం కారుప్రమాదంలో మృతిచెందింది. ఆమె మృతిపై కన్నడ చిత్ర, టెలివిజన్ నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా కిందటి నెలలోనూ తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఓ యువదర్శకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దర్శకుడు శంకర్ దగ్గర అసిస్టెంట్ పని చేసిన అరుణ్ కూడా అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.

మెబియానా మైఖేల్ తన స్నేహితులతో కలిసి బెంగళూరు నుంచి తన స్వస్థలమైన మాడికేరికి కారులో బయలుదేరింది. ఈక్రమంలోనే దేవిహల్లి వద్ద మలుపులోవారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులోని వారందరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికులు సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. అయితే తీవ్రగాయాలపాలైన మెబిలియా మైఖేల్ ఆసుప్రతిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. ఆమె స్నేహితుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కన్నడ రియాలిటీ షో ‘ప్యతే హుదుగిర్ హల్లి లైఫ్’ సీజన్ 4 ద్వారా టెలివిజన్‌లోకి రంగంలోకి ప్రవేశించించింది. అంతకముందు కొన్నేళ్లపాటు మెబియానా మైఖేల్ మోడలింగ్‌లో ఉన్నారు. కొన్ని సీరియల్స్, సినిమాల్లో నటించడానికి చర్చలు జరుపుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు దుర్మరణం చెందారు. 22ఏళ్ల వయస్సులోనే ఆమె మృత్యువాతపడటంతో స్నేహితులు, బంధువులు, తోటి నటీనటులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతిపై పలువురు సెలబ్రెటీలు సంతాపం వ్యక్తం చేశారు.

రానాను త్రిష అంత మాట అనేసిందా?


టాలీవుడ్‌లో ప్లేబాయ్‌ ఇమేజ్ ఉన్న నటుడు రానా దగ్గుబాటి. తన జిగ్రీ దోస్తు అల్లు అర్జున్‌ ఇప్పటికే ఇద్దరు పిల్లల తండ్రి అయినా.. రామ్‌ చరణ్ ఎప్పుడో పెళ్లి చేసుకున్నా రానా 35 ఏళ్లు వచ్చే దాకా బ్యాచ్‌లర్గా ఉన్నాడు. ఈ మధ్యే మిహికా బజాజ్‌ అనే అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తానే ఆమెకు ప్రపోజ్‌ చేయగా ఓకే చెప్పిందని రానా స్వయంగా వెల్లడించాడు. ఇన్నాళ్లకు రానా ఒక ఇంటివాడు అవుతున్నందుకు అందరూ సంతోషిస్తున్నారు. అదే సమయంలో ఇది వరకు రానా లవ్‌ ఎఫైర్స్‌ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. మన బల్లాలదేవుడి గాళ్‌ఫ్రెండ్స్‌ లిస్టు పెద్దదే అయినా మొదట గుర్తుచ్చేది త్రిష గురించే. గతంలో త్రిషతో డేటింగ్‌ చేసినట్టు రానానే చెప్పాడు. త్రిషతో రిలేషన్‌ నిజమే అని, తమ మధ్య కొంతకాలం డేటింగ్‌ నడిచిన మాట వాస్తవమే అని ఓ టాక్‌షోలో వెల్లడించాడు. ఆ తర్వాత ఆ అఫైర్కు పుల్‌స్టాప్‌ పెట్టి స్నేహితులుగానే ఉండాలని అనుకున్నామని రానా చెప్పాడు.

మిహికాతో మ్యారేజ్‌ను అనౌన్స్‌ చేసిన తర్వాత లక్ష్మీ మంచుతో ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడిన రానా.. తన గాళ్‌ఫ్రెండ్స్‌ గురించి ప్రస్తావించాడు. మిహికాతో పెళ్లి అనగానే వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారని చెప్పాడు. త్రిష కూడా రానాకు ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్పిందన్న వార్తలు వచ్చాయి. అయితే, కొంతకాలం తెలుగులో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ చర్చనీయాంశమైంది. తమ మాజీ ప్రియురాళ్లను స్నేహితులుగా కొనసాగించాలని అనుకునేవాళ్లు అహంకారులుగా మిగిలిపోతారని ఒక స్టడీలో తేలిందని త్రిష పోస్ట్ చేసింది. ఈ విషయం తనకు ముందే తెలుసు అని కామెంట్‌ చేయడం చర్చనీయాంశమైంది.

రానాను ఉద్దేశించే త్రిష ఈ పోస్ట్‌ పెట్టిందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. బల్లాలదేవుడిని త్రిష అంత మాట అనేసిందా? అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాంతో, త్రిష ఈ పోస్టును డిలీట్ చేసింది. అయినా రచ్చ ఆగడం లేదు. అప్పటికే ఈ కామెంట్‌ను స్ర్కీన్‌ షాట్‌ తీసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు.

లాక్డౌన్ ఎఫెక్ట్.. బుల్లితెర నటి ఆత్మహత్య

TV actress Preksha Mehta

TV actress Preksha Mehta

చైనా వైరస్ దేశంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించింది. దీంతో ఎంతోమంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా షూటింగులు వాయిదా పడటంతో దీని ప్రభావం కళాకారులపై తీవ్రంగా పడింది. ఎన్నో ఆశలతో సినీ రంగంలోకి ప్రవేశించిన వారి కలలను లాక్డౌన్ చిధిమేసింది. రెండునెలలు షూటింగులు లేకపోవడంతో కొందరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు తమకు సినిమాల్లో అవకాశాలు రావేమోననే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హిందీ చిత్రసీమకు చెందిన బుల్లితెర నటి, హోస్ట్ ప్రేక్ష మోహతా(21) ఆత్మహత్య చేసుకుంది. ప్రేక్ష మెహతా ‘క్రైమ్ పెట్రోల్’, ‘లాల్ ఇష్క్’, ‘మేరీ దుర్గ’ వంటి పలు టీవీ షోలతో పాటు అక్షయ్ కుమార్ చిత్రం ‘ప్యాడ్ మేన్’లో కూడా ఆమె నటించింది. ఆమె మృతితో హిందీ చిత్రసీమలో విషాదచాయలు నెలకొన్నాయి. ఈ సంఘటనపై పలువురు నటీనటులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

లాక్డౌన్ కారణంగా షూటింగులు వాయిదా పడటంతో ఆమె ఇంటికే పరిమితమైంది. రెండున్నర నెలలు గడిచినప్పటికీ షూటింగులు ప్రారంభం కాకపోవడంతో మానసికంగా కుంగిపోయినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె చనిపోవడానికి ముందు ఆమె ఇన్‌స్టాలో ఓ మెసేజ్ పెట్టింది. ‘కన్న కలలు చనిపోయినప్పుడు.. జీవితం చెత్తగా ఉంటుందంటూ అందులో పేర్కొంది..’ అయితే ఆమె ఆత్మహత్యకు ఇంకేమైనా కారణాలున్నాయా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

‘జబర్దస్’ కు టాటా చెబుతున్న యాంకర్ ఎవరో?

బుల్లితెరపై ‘జబర్దస్’ కామెడీ హంగామా అంతా ఇంతా కాదు.. టెలివిజన్ షోలో ‘జబర్దస్’ కామెడీ షో ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది. అప్పటివరకు ఏడుపుగొట్టు సీరియల్స్ అలవాటుపడిన జనాన్ని కామెడీ వైపు మరల్చింది. అత్యధిక టీఆర్పీలతో దూసుకెళుతూ టెలివిజన్ షోలలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కామెడీ షోలో గత కొంతకాలంగా పలుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. జబర్దస్ షోకు మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజాలు కొన్నేళ్లపాటు జడ్జీలుగా వ్యవహరించారు. అయితే ఉన్నట్టుండి నాగబాబు ఈ షో నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. అంతేకాకుండా అయిన మరో టీవీ ఛానల్లో ‘జబర్దస్’ కు ధీటుగా ‘అదిరింది’ కామెడీ షోను ప్రారంభించారు.

మెగా బ్రదర్ నాగబాబు స్థానంలో జబర్దస్ నిర్వాహాకులు జడ్జీలుగా పలువురిని ట్రై చేశారు. సీనియర్ నటుడు నరేష్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, అల్లరి నరేష్, సునిల్, సింగర్ మనులను ట్రై చేశారు. ప్రస్తుతం రోజాకు తోడుగా సింగర్ మను జడ్జీగా వ్యహరిస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో ‘జబర్దస్’ పాత షోలను రిపీట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగబాబు షో నుంచి వెళ్లి సమయంలో ఆయనతోపాటు మరికొందరు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. చమాక్ చంద్ర, వేణు, ధనరాజ్ తదితర నటులు ‘అదిరింది’ షోకు వెళ్లిపోయారు. తాజాగా జబర్దస్ షో నుంచి ఓ యాంకర్ బయటకు వెళుతుందనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.

జబర్దస్ కామెడీ షో పాపులర్ కావడానికి యాంకర్ అనసూయ, రష్మిలు కూడా ఓ కారణం. ఈ ఇద్దరు యాంకర్లు తమ గ్లామర్ తో ఈ షోకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. లాక్డౌన్ తర్వాత ప్రారంభమయ్యే జబర్దస్త్ షో నుంచి అనసూయ, రష్మిలలో ఒకరు బయటికి వెళుతారని టాక్ విన్పిస్తోంది. వీరిస్థానంలో ఓ కొత్త యాంకర్ వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల హాట్ హాట్ ఫొటో షూట్ లతో ఆకట్టుకుంటున్న మంజూష ఆ స్థానాన్ని భర్తీ చేయనుందని టాక్ విన్పిస్తుంది. ఇప్పటికే మంజూష ఆది స్క్రీట్ లో ఒకసారి కన్పించింది. కాగా ఈసారి యాంకర్ స్థానంలో కన్పించనుందట. అయితే గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడు యాంకర్ వర్షిణి, శ్రీముఖి పేర్లు బలంగా విన్పించాయి. అయితే అలాంటిదేమీ జరుగలేదు. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్లలో ఒకరు బయటికి వెళితే ఎవరు వెళ్తారనేది ఆసక్తిని రేపుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!

ఖమ్మంలో మరోసారి కరోనా కలకలం!

Khammam map

Khammam map

లాక్‌ డౌన్‌ సడలింపులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివిధ రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకుంటున్న వారిలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చిన వారిలో మధిర మండలం మహదేవపురానికి చెందిన ఓ వ్యక్తికి, పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ సోకడం కలకలం రేపుతోంది. అదే బస్సులో వచ్చిన వీఎం బంజరకు చెందిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లుగా అధికారులు చెప్పారు.

లాక్‌ డౌన్‌ సడలింపు ఇవ్వడంతో ఖమ్మం జిల్లాకు చెందిన ఏడుగురు, హైదరాబాద్‌ కు చెందిన ఓ వ్యక్తి, మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి మహారాష్ట్ర నుంచి ఓ బస్సును అద్దెకు మాట్లాడుకున్నారు. హైదరాబాద్, మహబూబాబాద్ వ్యక్తులు తమ ప్రాంతాల్లో దిగగా.. మిగిలిన ఏడుగురు ఖమ్మం చేరుకున్నారు. అయితే ఆ ఏడుగురిలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ రాగా.. ఆమెతో పాటు క్వారంటైన్‌లో ఉంచిన మిగిలిన ఆరుగురిని కూడా ఈనెల 23న ఖమ్మంలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. 40 ఏళ్ల వయసున్న మరో వ్యక్తికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని నేరుగా 108ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా నుంచి ఉపాధి కోసం మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు వెళ్లి స్వగ్రామాలకు చేరుకున్న 260 మందిని అధికారులు క్వారంటైన్లలో ఉంచారు.

దిశ మార్చుకోకపోతే.. 27గంటల్లోనే విద్వంసం!

గంటకు 12-15 కిలోమీటర్ల వేగంతో తెలంగాణపైకి దూసుకొస్తున్న మిడతల దండును ఎలా ఎదుర్కోవాలో అనే అంశం పై రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండు దిశను మార్చుకోకుంటే.. మరో 27 గంటల్లో.. రాకాసి మిడతల దండు తెలంగాణపై దాడి చేయడం ఖాయం. పాకిస్తాన్ నుంచి భారత్‌ లోకి ప్రవేశించిన మిడతలు.. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లో పంటలకు నష్టం కలిగించాయి. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని మిడతలు ఝాన్సీ గుండా ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించగా.. ఇంకొన్ని మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతానికి చేరాయి. ఈ కీటకాల గుంపు తెలంగాణవైపునకే దూసుకొచ్చే అవకాశాలుండటంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది.

మిడతల దాడి నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి బి. జనార్దన్ రెడ్డి.. మహారాష్ట్ర అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపుతున్నారు. మిడతల దండు రాష్ట్ర సరిహద్దుకు 400 కిలోమీటర్ల దూరంలో ఉందని, అవి రాష్ట్రంలోకి ప్రవేశించేది లేనిది మరికొద్ది గంటల్లో తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డిలో హైఅలర్ట్ ప్రకటించినట్లు తెలిసింది.
మహారాష్ట్రలోనూ వ్యవసాయ అధికారులు.. మిడతల్ని పారద్రోలేందుకు చర్యలు చేపట్టినా, వాటి ప్రభావం తక్కువగా ఉందని, రాకాసి దండు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుస్తోంది. దీనిపై వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి.. సరిహద్దు జిల్లాల అధికారులు, కీటకాలను పారదోలడంలో నిపుణులైనవారితో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మిడతలు దాడి చేసే అవకాశమున్న జిల్లాల్లో యంత్రాంగం, రైతులు.. రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు జనార్థర్ రెడ్డి సూచించారు.

ఇస్మార్ట్ హీరోయిన్‌.. మరింత పదును పెడుతోంది..


కరోనా వైరస్‌ ను కంట్రోల్‌ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో రెండు నెలల పాటు దేశంలో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. నాలుగో దశలో కొన్ని సడలింపులు ఇవ్వడంతో చాలా మందికి ఊరట లభించింది. అయితే, షూటింగ్స్‌ ఇంకా అనుమతి రాకపోవడంతో సినీ సెలబ్రిటీలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ సుదీర్ఘ విరామ సమయంలో తమకు తోచిన పనులు చేసుకుంటూ టైంపాస్‌ చేస్తున్నారు. మరికొందరేమో ఈ బ్రేక్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. అందులో ఒకరు హీరోయిర్ నిధి అగర్వాల్.

బాలీవుడ్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యువ నటి ఇస్మార్ట్‌ శంకర్ లో మెప్పించింది. టాలీవుడ్‌లో ఈ మధ్యే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. వైవిధ్యమైన పాత్రలు పోషించాలని అనుకుంటున్న ఈ ఇస్మార్ట్‌ బ్యూటీ తన నటనా నైపుణ్యాలకు మరింత పదును పెడుతోంది. ఇందు కోసం లాక్‌డౌన్‌ బ్రేక్‌ను ఉపయోగించుకొంటోంది. ఈ టైమ్‌లో ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఆన్‌లైన్‌లో యాక్టింగ్ కోర్స్‌లో జాయిన్ అయింది. షూటింగ్‌ మొదలైతే మళ్లీ బిజీగా మారుతాను కాబట్టి ఈ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా అని నిధి చెబుతోంది. న్యూయార్క్‌ ఫిల్మ్‌ అకాడమీ కోర్సు ద్వారా తన నటనా నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుంటున్నాఅని చెప్పింది.

నటనతో పాటు ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలి, దానికి తగట్టు ఎలా నటించాలి, ఏ పాత్రకు ఎలాంటి మేకప్‌ వేసుకుంటే బాగుటుంది అనే అంశాలపై తర్పీదు పొందుతున్నానని చెప్పింది. అంతర్జాతీయ సినీ నిపుణులు ఇచ్చిన సూచనలతో ఈ కోర్సు నడుస్తోందని తెలిపింది. తనకు నటన రాదని కాదు గానీ..కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలు కావడంతో తన ప్రతిభను మరింత మెరుగు పరుచుకుంటున్నాని చెబుతోంది. ఇలాంటి అవకాశం మళ్లీ రాదన్నది. ఈ కోర్సు ద్వారా తాను చాలా విషయాలు నేర్చుకున్నానని వాటిని ఎప్పుడు ఆచరణలో పెడదామా అని ఎదురు చూస్తున్నానని అంటోంది ఈ అమ్మడు. ఇప్పటిదాకా తన అందాలతో అలరించిన నిధి ఇకపై తన నటనా నైపుణ్యాలతో మరింత మెప్పించేందుకు రెడీ అయింది.

సినిమాటోగ్రఫర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి


సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడిని పోలీసులు అరెస్టు చేశారనే వార్త తెలియడంతో టాలీవుడ్లో కలకలం మొదలైంది. శ్యామ్ కే నాయుడు ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కే నాయుడి తమ్ముడు కాగా యంగ్ హీరో సందీప్ కు స్వయనా మేనమామ. టాలీవుడ్లో ఎన్నో సినిమాలకు శ్యామ్ కే నాయుడు పని చేశారు. మంచి సినిమాటోగ్రఫర్ గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్ బాబు నటించిన పోకిరి, బిజినెస్ మేన్, పవన్ కల్యాణ్ నటించిన కెమెరా మెన్ గంగతో రాంబాబు సినిమాలకు శ్యామ్ కే నాయుడు కెమెరామెన్ గా పని చేశారు.

ఇదిలా ఉంటే శ్యామ్ కే నాయుడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారనే చర్చ మొదలైంది. ఛీటింగ్ కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సినీ నటి సాయి సుధ ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని నటి సుధ ఎస్ఆర్ నగర్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుది. కాగా నటి సుధ సాయి టాలీవుడ్లో అర్జున్ రెడ్డి మూవీతోపాటు పలు సినిమాల్లో నటించింది.

పోలీసు ఎదుటకు టీడీపీ నేత కూన..!


మూడు రోజుల అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్న తెలుసుకున్న రవికుమార్ ఈ రోజు పొందూరు పోలీసు స్టేషన్లకు వచ్చి
లొంగిపోవడం జరిగింది. పొందూరు తహసీల్దారు రామకృష్ణను దూషించిన కేసులో ఆయన నిందితుడు. దీంతో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

తనను అసభ్య పదజాలంతో రవికుమార్ దూషించి, బెదిరించారంటూ పోలీసులకు తహసీల్దారు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తర్వాత ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లేసరికి ఆయన ఇంట్లో లేరు. రవి కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆయన ఫాలోవర్స్, టిడిపి నాయకులు పోలీస్ స్టేషన్ ముందు గుంపులుగా ఉండి నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారని చంద్రబాబుపై కేసులు పెట్టింది, మరి ఈ సంఘటనపై ఏం కేసులు పెడతారో.

లారెన్స్‌ ట్రస్ట్‌లో కరోనా కలకలం…


పేద ప్రజలు, దివ్యాంగులు, అనాథలకు సాయం చేయడంలో ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటారు. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన లారెన్స్‌.. చెన్నై అశోక్‌ నగర్లోని చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంతో మంది అనాథలు, దివ్యాంగులు ఉంటున్నారు. ఈ ట్రస్ట్‌లో కరోనా కలకలం రేపింది. తమిళనాడులో విపరీతంగా విజృంభిస్తున్న వైరస్‌ ఈ ట్రస్ట్‌ను తాకింది. అక్కడ ఉంటున్న వారిలో 21 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇందులో 18 మంది చిన్నారులు, ముగ్గురు ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించారు.

కరోనా వైరస్‌ బారిన పడిన వారందరినీ చెన్నై లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని ట్రస్టు వర్గాలు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ట్రస్టులో మిగిలిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

నలుగురికి జ్వరం రావడంతో

తమిళనాడులో కరోనా వైరస్‌ రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. చెన్నై అశోక్‌ నగర్లో నివాసం ఉంటున్న ఇద్దరికీ కరోనా వచ్చిందని అధికారులు గుర్తించారు. దాంతో, ఆ ప్రాంతంలో ఉంటున్న ఇతరులకు కూడా వైరస్‌ సోకిందా? అన్న అనుమానంతో మరికొందరికి పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో లారెన్స్‌ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందుతున్న నలుగురికి జర్వం రావడంతో శనివారం వారికి కరోనా పరీక్షలు చేయగా కరోనా నిర్దారణ అయింది. దాంతో, మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహించగా..ఏకంగా 21 మందికి వైరస్‌ సోకినట్టు తేలింది. వంట మనిషి నుంచి చిన్నారులు వైరస్ సోకిందని అధికారులు గుర్తించారు. దాంతో, ఆ ఆశ్రయాన్ని మూసివేసిన అధికారులు.. ఆ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు.

ఆ విందుతో కరోనా చెలరేగింది!

భారత్ లో కరోనా వ్యాపించడానికి ప్రధాన కారణం ఏమిటని ఎవరినైనా అడిగితే వారు వెంటనే చెప్పే జవాబు… ఢిల్లీ ప్రార్ధనలు. అంతకు ముందు కరోనా వైరస్ వుహాన్ లో పుట్టి కొద్దీ కాలంలోనే ప్రపంచ దేశాలకు పాకడానికి కారణం ఏమిటని అడిగితే సమాధానం ఉండదు. అయితే తాజాగా ఆ గుట్టును బయటపెట్టారు. అత్యంత వేగంగా చైనా నుంచి వివిధ దేశాలకు పాకిపోవడానికి కారణాలను శోధించి పట్టుకున్నారు.  కరోనా వ్యాధి వుహాన్ లో విస్తారంగా వ్యాపించడానికి కారణం ది భైబూటింగ్ విందు.  బైబూటింగ్ కమ్యూనిటీకి చెందిన 40వేల కుటుంబాలు కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 19 వ తేదీన పాట్ లక్ విందును ఏర్పాటు చేశారు.  బైబూటింగ్ కమ్యూనిటీ  ఇచ్చిన పాట్ లక్ విందులో 13,986 రకాల వంటకాలు వండి వడ్డించారు. ఇది రికార్డ్.

ఈ రికార్డ్ కోసం ప్రతి ఏడాది ఇలాంటి విందులు నిర్వహిస్తుంటారు.  అయితే, దేశంలో కరోనా ఉందని, ఈ విందుకు అనుమతి ఇవ్వొద్దని కొందరు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కుదరలేదు.  ఈ కమ్యూనిటీ ప్రజలు అక్కడ 57 భవనాల్లో నివసిస్తున్నారు.  ఈ విందు జరిగిన 15 రోజుల్లోపే 33 భవనాల్లో కరోనా వ్యాపించింది. అప్పటికే ఈ 40వేల కుటుంబాలకు చెందిన వారిలో చాలా మంది విందులో పాల్గొన్న తరువాత వివిధ దేశాలకు వెళ్లిపోయారు.  వుహాన్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లిపోయారు. జనవరి 23 తరువాత ఉదృతి పెరిగింది.  ఆ తరువాత ఈ బైబూటింగ్ కమ్యూనిటీ విందులో పాల్గొన్న వ్యక్తులే ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. వీరి నుంచే ఇతరులకు, ఇతర ప్రాంతాలకు కరోనా వ్యాపించినట్టు చైనాలోని ప్రముఖ పత్రిక పేర్కొన్నది.  అయితే, ఈ విషయాలను చైనా ఎందుకు దాచిపెట్టిందో తెలియడం లేదు. కరోనా కాలంలో 40వేల కుటుంబాలు ఒకచోట చేరి విందు చేసుకోవడం అంటే మాములు విషయం కాదు.  కరోనా వేగంగా ప్రపంచంలో వ్యాపించడానికి ఇదొక కారణం. దీనిపై చైనా ప్రభుత్వం ఇప్పటికీ కూడా నోరుమెదపక పోవడం గమనార్హం.

ఈసారికి ఇంట్లోనే ఎన్టీఆర్ కు నివాళి..!


రేపు(మే 28)న విశ్వవిఖ్యాత నటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి. ప్రతీయేటా ఆయన జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకొని నివాళులర్పిస్తుంటారు. అయితే ఈసారి లాక్డౌన్ కారణంగా ఎన్టీఆర్ మనవాళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ రామ్ లు ఆయనకు ఇంటి వద్దే నివాళ్లులు అర్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో గురువారం ఎన్టీఆర్ ఘాట్ కు ఈసారికి వెళ్లొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రముఖ పీఆర్వో, నిర్మాత మహేష్ కొనేరు ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీయార్, కల్యాణ్ రామ్ లు ఈసారి ఎన్టీఆర్ ఘాట్‌కు రావడంలేదని.. ఇంట్లోనే ఆయనకు నివాళ్లులు అర్పిస్తారని ట్విటర్లో ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతం రెడ్ జోన్లో ఉంది. దీంతోనే ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్ జోన్లో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో గుంపులు గుంపులుగా తిరగకూడదు.. భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ ఘాట్ కు వస్తున్నారనే తెలిస్తే నందమూరి ఫ్యాన్స్ పెద్దఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించబడుతాయి. అంతేకాకుండా చైనా వైరస్ ప్రబలే అవకాశం ఉన్నందుకు వారిద్దరి అభిమానుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈసారికి ఎన్టీఆర్ కు కుటుంబ సభ్యులు, అభిమానులు ఎవరి ఇళ్లలో వారే ఉంటూ నివాళ్లులు అర్పించనున్నట్లు తెలుస్తోంది.

వకీల్ సాబ్ షూటింగ్ షూరూ అయ్యేది అప్పుడే..

Vakeelsab-movie


పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ను వెండితెరపై చూసి దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. చివరగా ‘అజ్ఞాతవాసి’గా ప్రేక్షకులకు కనిపించాడు పవన్‌. రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారిన తర్వాత సినిమాలకు దూరం అవుతున్నట్టు ప్రకటించిన పవర్ స్టార్.. తర్వాత మనసు మార్చుకున్నాడు. ఏకంగా మూడు సినిమాలకు ఓకే చెప్పాడు. వకీల్‌ సాబ్‌, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చిత్రీకరణ ఇప్పటికే మొదలయ్యాయి. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఇంకో సినిమాను ప్రకటించారు.

బాలీవుడ్ హిట్ మూవీ.. ‘పింక్‌’కు రీమేక్‌ అయిన వకీల్ సాబ్‌కు వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతాలు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో పాటు ఫస్ట్‌ సింగిల్‌కు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. దాంతో, పవన్‌ను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఆత్రుతగా ఉండగా.. లాక్‌డౌన్‌ వారి ఆశలపై నీళ్లు కుమ్మరించింది. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల పాటు సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు అనుమతి ఇచ్చింది.షూటింగ్‌లకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది. జూన్‌ తొలివారం నుంచి షూటింగ్స్‌ తిరిగి ప్రారంభించేందుకు నిర్మాణ సంస్థలు రెడీ అవుతున్నాయి.

కానీ, ఆ లిస్ట్‌లో వకీల్‌ సాబ్‌ లేకపోవడం పవన్‌ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం. ఈ సినిమాకు సంబంధించి మరో ముప్పై రోజుల షూటింగ్ మిగిలుందని తెలుస్తోంది. అయితే, వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే చిత్రీకరణ తిరిగి మొదలు పెడదామని నిర్మాతలకు పవన్‌ చెప్పినట్టు సమాచారం. దాంతో, జూలై నుంచి షూటింగ్ షురూ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన వకీల్‌ సాబ్‌ రాక మరింత ఆలస్యం కానుంది.

పారాసిటమాల్… బ్లీచింగ్ పౌడర్.. ఆర్జీవీ ‘కరోనా’ ట్రైలర్


రామ్‌గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. సమజంలో జరిగే యాదార్థ సంఘటనల ఇతివృత్తంగా సినిమాలు తీయడంలో ఆర్జీవీని మించిన వాళ్లు లేరు. రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్‌ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. అదే కోవలోకి చెందిన చిత్రాలు. మరెన్నో సినిమాలు, సిరీస్‌లు ప్రకటించినా అవి మరుగునపడిపోవడం వేరే విషయం అనుకోండి. ఈ మధ్యే అమెరికా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో ‘క్లైమాక్స్‌’ సినిమా టీజర్, ట్రైలర్,మ్యూజికల్ వీడియోతో హల్‌చల్‌ చేసిన ఆర్జీవీ ఇప్పుడు కరోనాపై పడ్డాడు. ఈ విశ్వాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్‌పై ప్రపంచంలోనే తొలి సినిమాను రాము ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఆర్జీవీ శిష్యుడు ఆగస్త్య మంజు డైరెక్షన్‌లో ‘కరోనా వైరస్’ టైటిల్‌లో రూపొందించించాడు.

ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఏకంగా నాలుగు నిమిషాల నిడివి ఈ ఉన్న ఈ ట్రైలర్ను గమనిస్తే.. లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికి పరిమితమైన కుటుంబంలో కరోనా కారణంగా ఎలాంటి మార్పులు జరిగాయో చెప్పేలా ఉంది. కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతుండగా.. ఆ ఇంట్లో ఓ అమ్మాయి తీవ్రంగా దగ్గుతూ ఉంటుంది. దాంతో, వాళ్ల నాన్నతో పాటు అందరిలో భయం మొదలవుతుంది. ఆమెకు కరోనా వచ్చిందేమో అని సోదరుడు సెటైర్ వేస్తే.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనకు రాదని తండ్రి ధైర్యం చెబుతాడు. ఆపై, ఇంట్లో ఓ వృద్ధురాలు కూడా దగ్గడంతో అందరూ వారికి దూరంగా ఉంటారు. చివరకు భార్యాభర్తలు కూడా దూరంగా పడుకుంటారు. ఆపై, కుటుంబ సభ్యులంతా మొబైల్ ఫోన్‌ చూస్తుండగా..కరోనా వ్యాప్తి మొదట్లో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు చేసిన కామెంట్స్‌ పెట్టాడు ఆర్జీవీ. పారాసెటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని కేసీఆర్, బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలాని జగన్‌ చెబుతున్న మాటలను కుటుంబ సభ్యులను ఆశ్చర్యంగా చూస్తుండంతో ట్రైలర్ ముగుస్తుంది.

కరోనా వైరస్‌ కంటే సినిమా ట్రైలరే ఎక్కువ భయపెట్టేలా ఉందని ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. ఇక, ఈ సినిమా మొత్తం లాక్‌డౌన్‌లోనే చిత్రీకరించినట్టు ఆర్జీవీ చెప్పడం మరో విశేషం. దీనిపై ట్విట్టర్లో మరోసారి క్లారిటీ ఇచ్చాడు. ‘ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ కరోనా వైరస్‌ ఫిల్మ్ మొత్తాన్ని లాక్‌డౌన్‌లో షూట్ చేశాం. ఈశ్వర్, అల్లా, జీసస్‌తో పాటు ప్రభుత్వం మీద ఒట్టేసి చెబుతున్నా ఇది నిజం’ అని ట్వీట్ చేశాడు.

ఊబకాయుడైన కన్నాకు దీక్షలు అవసరం..!


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఊబకాయంతో బాధపడుతున్నందున ఆయనకు ఉపవాస దీక్షలు అవసరమని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నిన్న దీక్ష కారణంగా ఒక అరా కేజీ బరువు తగ్గి ఉంటారని నువ్వులు పూయించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ టిటిడి నిరర్దక ఆస్దులు విక్రయించాలని టిడిపి ప్రభుత్వం హయాంలో సబ్ కమిటి వేశారని, ఆ సబ్ కమిటిలో భానుప్రకాష్ రెడ్డి, డిపి అనంత, సుచిత్రా ఎల్లా, సండ్ర వెంకట వీరయ్య(టిడిపి ఎంఎల్ఏ)లు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సబ్ కమిటి దాదాపు 53 నిరర్ధక ఆస్ధులను గుర్తించిందన్నారు. వాటిలో 50 ఆస్తులను విక్రయించాలని బిజేపి సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సంతకం చేశారని చెప్పారు. 2016, జనవరి 30వ తేదీన సబ్ కమిటి ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

హరి ప్రసాద్ అనే వ్యక్తి జనసేన తరపున కూడా మెంబర్ గా ఉన్నారని తెలిపారు. వీరందరూ కలసి టిటిడి ఆస్ధులు అమ్మాలని తీర్మానం చేసింది వాస్తవమా కాదా కన్నా సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
టిటిడి ఆస్తులకు సంబంధించి విలువలు కూడా చంద్రబాబు ప్రభుత్వంలో నిర్ణయించినవేనని తెలిపారు. వీటన్నింటిని పక్కన పెట్టి వాళ్లే అమ్మమని చెప్పి ఈ రోజు రాద్దాంతం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలకు దీని వల్ల లాభం లేదు గాని కన్నాకు హెల్త్ రీత్యా ఉపయోగపడచ్చు అని చెప్పారు. మొన్న పోతిరెడ్డిపాడు విషయంలో చూసాం, బిజేపి తెలంగాణాలో ఒక స్టాండ్, ఆంధ్రప్రదేశ్ లో ఒక స్టాండ్ తీసుకుంటోందన్నారు. అదే విధంగా టిటిడి ఆస్తుల విషయంలో కన్నా లక్ష్మీ నారాయణ ఒక స్టాండ్, భానుప్రకాష్ రెడ్డి ఒక స్టాండ్ తీసుకున్నారని విమర్శించారు. అధిష్టానాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రతివారికి తప్పుడు సమాచారం పంపిస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వంలో హిందుత్వానికి ముప్పు జరుగుతోందని, హిందుత్వం అంటే ఏదో కన్నా లక్ష్మీ నారాయణ ఇంట్లో పుట్టినట్లుగా హిందూ సమాజాన్ని ఆయన ఒక్కడే ఉద్దరిస్తున్నట్లుగా మాట్లాడం సరైంది కాదన్నారు.

చంద్రబాబు నలభై ఆలయాలు పడగొట్టినప్పుడు బిజేపి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేవలం చంద్రబాబుకు అమ్ముడుపోయి జగన్ మోహన్ రెడ్డిని ఎదిరించలేక, సంక్షేమ పధకాలు ఆగాయని, అభివృధ్ది ఆగిందని చెప్పలేక, చివరకు హిందూమతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే వ్యక్తి కూడా ఒక రాజకీయనాయకుడేనా అంటూ ఎద్దేవ చేశారు. అదే విధంగా చంద్రబాబు, అతని చేసిన తప్పును కూడా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పడం చాలా బాధాకరం అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన ఆర్డర్ ను రద్దు చేస్తూ సీఎం పేషి నుంచి ఆదేశాలు ఇస్తే అది కూడా రాజకీయం అంటూ కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతున్నారని చెప్పారు. డబ్బులకు అమ్ముడుపోయినా ఇంత నీచ రాజకీయాలు చేస్తారా అని ప్రశ్నించారు.