
బుల్లితెరపై ‘జబర్దస్’ కామెడీ హంగామా అంతా ఇంతా కాదు.. టెలివిజన్ షోలో ‘జబర్దస్’ కామెడీ షో ఓ కొత్త ట్రెండ్ సృష్టించింది. అప్పటివరకు ఏడుపుగొట్టు సీరియల్స్ అలవాటుపడిన జనాన్ని కామెడీ వైపు మరల్చింది. అత్యధిక టీఆర్పీలతో దూసుకెళుతూ టెలివిజన్ షోలలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ కామెడీ షోలో గత కొంతకాలంగా పలుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. జబర్దస్ షోకు మెగా బ్రదర్ నాగబాబు, సీనియర్ హీరోయిన్ రోజాలు కొన్నేళ్లపాటు జడ్జీలుగా వ్యవహరించారు. అయితే ఉన్నట్టుండి నాగబాబు ఈ షో నుంచి తప్పుకోవడం సంచలనంగా మారింది. అంతేకాకుండా అయిన మరో టీవీ ఛానల్లో ‘జబర్దస్’ కు ధీటుగా ‘అదిరింది’ కామెడీ షోను ప్రారంభించారు.
మెగా బ్రదర్ నాగబాబు స్థానంలో జబర్దస్ నిర్వాహాకులు జడ్జీలుగా పలువురిని ట్రై చేశారు. సీనియర్ నటుడు నరేష్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, అల్లరి నరేష్, సునిల్, సింగర్ మనులను ట్రై చేశారు. ప్రస్తుతం రోజాకు తోడుగా సింగర్ మను జడ్జీగా వ్యహరిస్తున్నారు. అయితే లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో ‘జబర్దస్’ పాత షోలను రిపీట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగబాబు షో నుంచి వెళ్లి సమయంలో ఆయనతోపాటు మరికొందరు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయారు. చమాక్ చంద్ర, వేణు, ధనరాజ్ తదితర నటులు ‘అదిరింది’ షోకు వెళ్లిపోయారు. తాజాగా జబర్దస్ షో నుంచి ఓ యాంకర్ బయటకు వెళుతుందనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.
జబర్దస్ కామెడీ షో పాపులర్ కావడానికి యాంకర్ అనసూయ, రష్మిలు కూడా ఓ కారణం. ఈ ఇద్దరు యాంకర్లు తమ గ్లామర్ తో ఈ షోకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. లాక్డౌన్ తర్వాత ప్రారంభమయ్యే జబర్దస్త్ షో నుంచి అనసూయ, రష్మిలలో ఒకరు బయటికి వెళుతారని టాక్ విన్పిస్తోంది. వీరిస్థానంలో ఓ కొత్త యాంకర్ వస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల హాట్ హాట్ ఫొటో షూట్ లతో ఆకట్టుకుంటున్న మంజూష ఆ స్థానాన్ని భర్తీ చేయనుందని టాక్ విన్పిస్తుంది. ఇప్పటికే మంజూష ఆది స్క్రీట్ లో ఒకసారి కన్పించింది. కాగా ఈసారి యాంకర్ స్థానంలో కన్పించనుందట. అయితే గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడు యాంకర్ వర్షిణి, శ్రీముఖి పేర్లు బలంగా విన్పించాయి. అయితే అలాంటిదేమీ జరుగలేదు. ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్లలో ఒకరు బయటికి వెళితే ఎవరు వెళ్తారనేది ఆసక్తిని రేపుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!