
మూడు రోజుల అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కూన రవికుమార్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్న తెలుసుకున్న రవికుమార్ ఈ రోజు పొందూరు పోలీసు స్టేషన్లకు వచ్చి
లొంగిపోవడం జరిగింది. పొందూరు తహసీల్దారు రామకృష్ణను దూషించిన కేసులో ఆయన నిందితుడు. దీంతో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
తనను అసభ్య పదజాలంతో రవికుమార్ దూషించి, బెదిరించారంటూ పోలీసులకు తహసీల్దారు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తర్వాత ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లేసరికి ఆయన ఇంట్లో లేరు. రవి కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆయన ఫాలోవర్స్, టిడిపి నాయకులు పోలీస్ స్టేషన్ ముందు గుంపులుగా ఉండి నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారని చంద్రబాబుపై కేసులు పెట్టింది, మరి ఈ సంఘటనపై ఏం కేసులు పెడతారో.