Home Blog Page 8464

ప్రేమ పెళ్లికి ఒకే చెప్పిన ‘సాహో’ దర్శకుడు

Sujeeth

Sujeeth

షార్ట్ ‌ఫిల్మ్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చి .. ఇరువై మూడేళ్లకే సూపర్ హిట్‌ సినిమా అందించిన దర్శకుడు సుజీత్. శర్వానంద్ హీరోగా.. ‘రన్ రాజా రన్’‌ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సుజీత్‌ ఫస్ట్‌ మూవీలో తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ వెంటనే ప్రభాస్‌తో ‘సాహో’ అని దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ముచ్చటగా మూడో చిత్రంలోనే మెగాస్టార్ చిరంజీవికి దర్శకత్వం వహించే చాన్స్‌ కొట్టేశాడు సుజీత్. లూసిఫర్ తెలుగు రీమేక్‌కు డైరెక్షన్‌ చేయనున్న ఈ టాలెంటెడ్‌ యంగ్‌స్టర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

ఈ మధ్యే నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ పెళ్లి పీటలు ఎక్కారు. దగ్గుబాటి రానా కూడా అదే బాటలో ఉన్నాడు. ఇప్పుడు ఈ జాబితాలో 29 ఏళ్ల సుజీత్‌ కూడా చేరనున్నారు. ప్రవళిక అనే డెంటిస్ట్‌తో గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ యంగ్‌ డైరెక్టర్ పెద్దల అంగీకారంతో‌ త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌లో ఈ ఇద్దరి నిశ్చితార్థం జరగనుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. ఎంగేజ్‌మెంట్‌ రోజే పెళ్లి తేదీ ప్రకటన కూడా వచ్చే చాన్సుంది.

అతిదారుణంగా స్కూల్ పిల్లలపై కత్తితో దాడి!

China school children

China school children

అభం శుభం ఎరుగని 37 మంది చిన్నారులను అతి కిరాతకంగా కత్తితో పొడిచిన ఘటన చైనాలో చోటు చేసుకుంది. ఓ సెక్యూరిటీ గార్డ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. మానవత్వాన్ని మంట గలుపుతూ.. ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మీద దాడికి పాల్పడ్డాడు. 37 మంది పిల్లలను కత్తితో పొడిచాడు. మరో ఇద్దరు పెద్దవారి మీద కూడా కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటన చైనాలోని చాంగ్ ఉ కౌంటీలో జరిగింది.

రోజూ వెళ్తున్నట్లుగానే ఈ రోజు కూడా విద్యార్థులు స్కూలుకు వచ్చారు. 8.30 గంటల సమయంలో వారు స్కూల్లో ఉన్నప్పుడు 50 ఏళ్ళ వయసున్న ఓ సెక్యూరిటీ గార్డ్ చేతిలో కత్తితో దాడిచేశాడు. క్లాసులో ఉన్న విద్యార్థులు కనిపించిన వారిని కనిపించినట్టు పొడిచాడు. అడ్డుకోబోయిన ఇద్దరు టీచర్ల మీద కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడిన 39 మందిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ‘అతడు ఓ ఉన్మాదిలా ప్రవర్తించాడు. అసలు అడ్డుకోలేకపోయాం.’ అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో చిన్న పిల్లలకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. టీచర్లకు మాత్రం బలమైన గాయాలు అయినట్టు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలల పాటు చైనాలో స్కూళ్లు మూత పడ్డాయి. మేలో పునఃప్రారంభించారు.

నిత్యా మీనన్ కాదన్నది.. మరి తాప్సీ అంత బరువు మోస్తుందా..?

Karnam Malleswari

Karnam Malleswari

కరణం మల్లేశ్వరి. ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన భారత తొలి మహిళగా చరిత్ర సృష్టించిన తెలుగు తేజం. వెయిట్‌ లిఫ్టింగ్‌లో అత్యున్నత శిఖరాలు అధిరోయించిన ఆమె ఎంతో మందికి అదర్శంగా నిలిచింది. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి.. అంతగా మద్దతులేని క్రీడలో దేశం గర్వించే స్థాయికి ఎదిగిన మల్లేశ్వరి జీవితం సినిమా కథకు ఏ మాత్రం తీసిపోదు. అందుకే ఆ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీస్తున్నట్టు ఎం.వి.వి. సత్యనారాయణ, కోన వెంకట్‌ ఈ మధ్యే ప్రకటించారు. వీరిద్దరి నిర్మాణంలో సంజనా రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని మల్లేశ్వరి పుట్టినరోజు అయిన జూన్ 1న అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.

ఎన్నో పతకాలు సాధించిన దిగ్గజ వెయిట్ లిఫ్టర్ మల్లేశ్వరి పాత్రను ఎవరు పోషిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టాలీవుడ్ సమాచారం మేరకు ఈ పాత్ర కోసం చిత్ర యూనిట్‌ ముగ్గురు హీరోయిన్లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ముగ్గురు నిత్యా మీనన్, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సీ. అయితే, మొదటగా నిత్యా మీనన్‌ను సంప్రదించగా.. ఈ ఆఫర్ను ఆమె సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. దాంతో, రకుల్ లేదా తాప్సీలో ఒకరిని ఖాయం చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ ఇద్దరిలోనూ తాప్సీ అయితేనే బెటర్ అని అనుకుంటున్నారని సమాచారం. ఎందుకంటే చిత్రాన్ని వివిధ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. పైగా, క్రీడా నేపథ్య సినిమా కావడంతో మల్లేశ్వరి పాత్రలో నటించి హీరోయిన్‌కు ఫిట్నెస్‌పై అవగాహన ఉండాలి. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటే మరీ మంచిది. ఫిట్‌నెస్ పరంగా రకుల్‌ ఎదురు లేదు. కానీ, ఈ మధ్య బాలీవుడ్‌లో వరుస హిట్లతో తాప్సీ దూసుకెళ్తోంది. నటన విషయంలోనూ ఆమెకు ఎదురు లేదు. కాబట్టి తాప్సీ అయితేనే మల్లేశ్వరి పాత్రకు సూటవుతుందని చిత్ర యూనిట్‌ తుది అంచనాకు వచ్చిందట. ఆమెకు కథ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే హైదరాబాద్ లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో నటిస్తున్న తాప్సీ మరో స్పోర్ట్స్‌ బయోపిక్‌కు ఓకే చెబుతుందా? మల్లేశ్వరి పాత్రలో బరువులు మోస్తుందా? చూడాలి.

వేదం.. అద్భుత ప్రయాణానికి దశాబ్దం..

vedam

vedam

అల్లు అర్జున్‌ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘వేదం’. ఆ చిత్రం విడుదలై పదేళ్లు అవుతోంది. దేశ ముదురు, పరుగు చిత్రాలతో మంచి విజయాలు ఖాతాలో వేసుకొని హీరోగా పీక్‌ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఈ మల్టీస్టారర్మూవీలో నటించిన బన్నీ పెద్ద సాహసమే చేశాడు. జాగర్లమూడి చెప్పిన కథ నచ్చడంతో తన స్టార్డమ్‌ను పక్కనపట్టి మరీ ‘వేదం’లో భాగస్వామి అయ్యాడు. కేబుల్ రాజు పాత్రలో జీవించాడు. వేశ్య పాత్రలో నటించిన అనుష్క అందరినీ ఆశ్చర్యపరచగా.. అద్భుతమైన నటనతో బన్నీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో ఓ పాటకు కొరియోగ్రఫీ కూడా చేశాడు. మనోజ్‌ బాజ్‌పెయ్, మంచు మనోజ్‌, దీక్షా సేత్, శరణ్య ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమా విమర్శల ప్రశంసలు అందుకుంది.అనేక పురస్కారాలు అందుకుంది.

2010 జూన 4వ తేదీన ఈ సినిమా రిలీజైంది. అంటే ఈ రోజుతో దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్‌ ‘వేదం’ను గుర్తు చేసుకున్నాడు. ‘వేదం సినిమాకు పదేళ్లు. ఇంత అందమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎంతో గొప్ప విజన్, అభిరుచి ఉన్న దర్శకుడు క్రిష్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సినిమాలో నటించిన మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్‌పేయి, ఇతర నటీనటులు, మద్దతుగా నిలిచిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు` అన్ని బన్నీ ట్వీట్ చేశాడు.

వైద్యులకు కరోనా సోకడంపై హైకోర్టు ఆరా!

High court

High court

వైద్య సిబ్బందికి కరోనా సోకడంపై హైకోర్టు ఆరా తీసింది. సిబ్బందికి రక్షణ కిట్లు ఇచ్చారా..? అంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన పలు అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకిందన్న విషయాన్ని కోర్టుకు వివరించారు. వైద్యులకు రక్షణ కిట్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. అసలు వైద్య సిబ్బందికి కరోనా ఏలా వచ్చిందో ఈనెల 8వ తేదీలోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా నిమ్స్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్‌లో పలువురు వైద్య విద్యార్థులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది సైతం కరోనా మహమ్మారి బారిన పడిన సంగతి విదితమే.

కరోనా పై పాటను రిలీజ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ap-corona-song

ap-corona-song

కరోనా ప్రభావం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్ దేశాలు శక్తీ మేర కృషి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఐతే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల చాలా మంది వివిధ రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.

ఐతే ఇప్పట్లో కరోనా కి వాక్సిన్ వచ్చే అవకాశం లేదు కాబ్బటి కరోనా భారిన పడకుండా మనందరం జాగ్రత్త ఉంటూ, లొక్డౌన్ సమయం లో ఎలా ఐతే మనం పోలీసులుకు, వైద్య సిబ్బందికి సహకరించామో అదే రీతిన ఇక పై కొనసాగాలని, కరోనా వల్ల, దెబ్బ తిన్న మన జీవితాలని మళ్ళీ మనమే నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలనీ అర్ధం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైస్సార్సీపీ రాజ్య సభ సభ్యులు శ్రీ విజయ సాయి రెడ్డి యంగ్ హీరో నిఖిల్ తో కలిసి ఓ పాట ని సిద్ధం చేయించారు.

ఈ పాటకు ప్రముఖ దర్శకుడు చందు మొండేటి కాన్సెప్ట్ ని రెడీ చేశారు. అలానే ఈ పాట కు ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. అలానే ఈ పాటలో వివిధ రంగాలకు చేసిన ప్రముఖులు కనిపించారు., వారిలో కాజల్ అగర్వాల్, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, సుధీర్ బాబు, పి వి సింధు తదితరులు ఉన్నారు. మనం అంతా కలిసి కరోనా ని అడ్డుకోవాలి అని చాటి చెప్పే రీతిన ఈ పాటను తాజాగా విజయ్ సాయి రెడ్డి విడుదల చేశారు

భరతక్కగా మారిన ప్రియమణి

Priyamani

Priyamani
జూన్ 4న ప్రియమణి బర్త్ డే ను పురస్కరించుకొని ప్రియమణి భారతక్క అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రియమణి తాజాగా చిత్రం ‘విరాటపర్వం’. ఈ మూవీలో ప్రియమణి నక్సలైట్ గా నటిస్తుంది. ‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది.. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట ప‌ర్వంలో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం’ అంటూ ప్రియమణి ఫస్ట్‌లుక్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది.

ఇందులో ప్రియమణి ఎలాంటి లేకుండా సాదాసీదాగా నల్లటి డ్రెస్ లో బ్యాగ్ భుజన వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ కన్పిస్తుంది. గన్ పట్టుకుని ‘కామ్రేడ్ భారతక్క’ పాత్రలో ఇమిడిపోయినట్లు కన్పిస్తుంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రల్లో కన్పించిన ప్రియమణి సడెన్ గా నక్సలైట్ పాత్రలో కన్పించడంతో అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. ఈ మూవీకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవల సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా కూడా విరాటపర్వం నుంచి ఆమెకు సంబంధించిన ఫస్టు లుక్ రిలీజైంది. అమరవీరుల స్థూపం దగ్గర ఎదురు చూస్తూ కూర్చున్న సాయి పల్లవి లుక్‌ విడుదల చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 1980లో తెలంగాణ పల్లెల్లో జరిగిన సాయుధ పోరాటం, బ్యాక్ డ్రాప్లో సాగే అందమైన ప్రేమకథగా ‘విరాటపర్వం’ తెరకెక్కుతోంది. ఈ మూవీలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. సాయిపల్లవి, ప్రియమణి ఫస్టు లుక్ రిలీజ్ కావడంతో ఇకపై రానా లుక్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. సాయిపల్లవి ట్వీటర్లో ‘భరతక్క’కు బర్త్ డే విషెస్ తెలిపింది.

మీరా చోప్రా వివాదంలో.. కటకటాల్లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్?

Meera Chopra lodges complaint against NTR fans https://www.thehansindia.com/cinema/tollywood/meera-chopra-lodges-complaint-against-ntr-fans

Meera Chopra lodges complaint against NTR fans https://www.thehansindia.com/cinema/tollywood/meera-chopra-lodges-complaint-against-ntr-fans

సోషల్ మీడియాలో గత రెండుమూడ్రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మీరాచోప్రా వివాదం నడుస్తోంది. తాజాగా మీరాచోప్రా ట్వీటర్లో లైవ్ ఛాట్ చేసిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు? అని ఓ నెటిజన్ ఆమె అడిగాడు. దీనికి ఆమె మహేష్ బాబు పేరు చెప్పింది. అయితే ఒక ఎన్టీఆర్ అభిమాని ఆమెను ఎన్టీఆర్ గురించి అడుగగా తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదని.. తనకు ఎన్టీఆర్ కంటే మహేష్ అంటే ఇష్టమని చెప్పింది. ఆమె అలా అనడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్టయ్యారు. దీంతో పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై వ్యక్తిగత దూషణలకు దిగడం వివాదానికి కారణమైంది.

తనతోపాటు తన తల్లిదండ్రులపై కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇష్టారీతిన బూతుపురాణం విప్పడంతో మీరాచోప్రా సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఆన్ లైన్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీరాచోప్రాను వేశ్య, పోర్న్ స్టార్ అంటూ అసభ్యకరమైన రీతిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై రెచ్చిపోయారు. ఆమెను గ్యాంగ్ రేప్, యాసిడ్ దాడి చేస్తామని బెదిరించడంతో ఈ విషయాన్ని సైబర్ పోలీసులకు, ఎన్టీఆర్ కు కూడా ట్వీటర్లో పోస్టు చేసింది. ‘ఇలాంటి ఫ్యాన్స్ తో మీరు విజయవంతం అయ్యారా? అంటూ ప్రశ్నించింది. ఈ ఇష్యూపై మీరు స్పందిస్తారని అనుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ కు ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు.

మీరాచోప్రాపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తుండటంతో మీరాచొప్రా మనస్థాపం చెందింది. ఈ విషయంపై మహిళా కమిషన్ కు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారి అకౌంట్లను స్కీన్ షాట్ తీసి మహిళా కమిషన్ కు ట్వీటర్లో పోస్టు చేసింది. ఈ వివాదంలో మహిళలు, నెటిజన్ల నుంచి మీరాచోప్రాకు మద్దతు లభిస్తుంది. మహిళల విషయంలో ముందుండే పోరాడే సింగర్ చిన్నయి సలహామేరకు ఆమె మహిళా కమిషన్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూపై ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయారు. మీరా చోప్రా ట్వీట్ కు ఇప్పటివరకు ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంలో మహిళా కమిషన్ ఎంట్రీ ఇవ్వడంతో మీరాచోప్రాపై అత్యు త్సాహంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ జైలుకు వెళ్లడం ఖాయం కన్పిస్తుంది.

15 రోజుల్లోనే మరో లక్ష కేసులు!

lock down 5.0

lock down 5.0

దేశంలో కరోనా కేసుల సంఖ్య బుధవారం నాటికి రెండు లక్షలు దాటింది. మే 17 నాటికి లక్ష దాటిన కరోనా కేసులు ఈ నెల 3 నాటికి 2లక్షలు దాటడం గమనార్హం. అంటే 15 రోజుల్లోనే దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యాయి. తాజాగా 24 గంటల్లో గరిష్ఠంగా 8,909 కొత్త కేసులు నమోదయ్యాయి. దింతో కేసుల సంఖ్య 2,07,615కి చేరింది. మొదటి లక్ష కేసులకు 111 రోజులు పడితే… రెండో లక్ష కేసులు 15 రోజుల్లోనే నమోదయ్యాయి. వరుసగా మూడోరోజు 200కి పైగా మరణాలు నమోదయ్యాయి.

“ఈ గణాంకాలు మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తున్నాయి.
కొవిడ్‌ కల్లోలం నెలకొన్న అనేక దేశాలతో పోలిస్తే మరణాల రేటు తక్కువగా ఉండటంతోపాటు కోలుకుంటున్న వారి శాతమూ పెరుగుతుండటం కొంత ఊరటనిస్తున్నా… ఇప్పుడు ప్రతిఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉంటే మహమ్మారి తీవ్రత నుంచి అంతగా బయటపడతాం.” అని వైద్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

నటి స్నేహ ‘కరెంట్ బిల్లు’ షాక్..

Actress-Sneha

Actress-Sneha
లాక్డౌన్ కారణంగా గత రెండు మూడు నెలలుగా విద్యుత్ శాఖ మీటర్ రీడింగ్ తీయలేదు. కొందరు పాత విద్యుత్ బిల్లుల ఆధారంగా కొందరు విద్యుత్ బిల్లులు చెల్లించారు. అయినప్పటికీ కరెంట్ బిల్లులు అధికంగా వస్తుండటంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లాక్డౌన్ సడలించడంతో జూన్ నెల నుంచి విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ బిల్లులు తీస్తున్నారు. గత మూడునెలలకు కలిపి ఒకేసారి రీడింగ్ తీస్తుండటంతో విద్యుత్ బిల్లులు వేలల్లో వస్తున్నాయి. వీటిని చూసిన జనాలు లబోదిబోమంటున్నారు. ఉదాహరణకు లాక్డౌన్ ముందు సామాన్యుల విద్యుత్ బిల్లులు రూ.200లోపు వస్తే ఈసారి ఏకంగా వెయ్యి నుంచి రెండువేలకు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక వినియోగదారులు తలలు పట్టుకున్నారు.

స్నేహ దంపతులకు షాకిచ్చిన విద్యుత్ బిల్లు..
విద్యుత్ శాఖ సామాన్యులకే కాదు సెలబ్రెటీలకు సైతం షాక్ ఇస్తోంది. ప్రముఖ సినీ దంపతులు స్నేహ-ప్రసన్నలకు విద్యుత్ బోర్డు షాకిచ్చింది. వారు నివసిస్తున్న ఇంటికే ఏకంగా 70వేల రూపాయాల కరెంట్ బిల్లు రావడంతో వారు అవాక్కయ్యారు. దీనిపై వారు మాట్లాడుతూ నలుగురి ఉండే ఇంటికే ఏకంగా 70వేల విద్యుత్ బిల్లు రావడం ఏంటని ప్రశ్నించారు. ప్రతీ రెండు మాసాలకు వచ్చే బిల్లు కంటే ఈసారి ఎన్నో రెట్లు ఎక్కువగా వచ్చిందని తెలిపారు. తమకు 70వేల బిల్లు చెల్లించే ఆర్థిక స్థోమత ఉందని.. ఇదే సామాన్యులకు వస్తే పరిస్థితి ఏంటని వాళ్లు ఎలా బ్రతుకగలరని విద్యుత్ శాఖ తీరుపై మండిపడ్డారు.

దీనిపై విద్యుత్ బోర్డులో పనిచేసే ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా మూడునెలలకు కలిపి ఒకేసారి విద్యుత్ బిల్లు ఇవ్వడంతోనే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని తెలిపారు. మీటర్ రీడింగుల్లో తప్పులు దొర్లడం వల్లనే వేలల్లో విద్యుత్ బిల్లు వస్తుందన్నారు. వెంటనే ప్రసన్న ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు వెళ్లి మళ్లీ రీడింగ్ కొత్త బిల్లు ఇస్తారని తెలిపారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు తప్పిదానికి సామాన్యులు మరింత ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే డబ్బుల్లేక సామాన్యులు అవస్థలు పడుతుంటే పుండుమీద రొకటి పోటుగా విద్యుత్ శాఖ కరెంటు బిల్లులు నిర్వాకం ఉందని పేద, మధ్యతరగతి ప్రజలు మండిపోతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు కరెంటు బిల్లులు విషయంలో వినియోగదారులకు క్లారిటీ ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

IAS రమామణి మృతికి వేధింపులే కారణమా?

Ramani

Ramani
ఐఎఎస్‌ అధికారిణి రమామణి మృతి వెనుక నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె మృతికి కారణం
మానసిక వేధింపులేనని కుటుంబ సభ్యుల‌తో పాటు బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆమె అనారోగ్యంతో మృతి చెందారని తొలుత అంతా భావించారు. కొద్ది నెలలుగా ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధించడంతో తీవ్రమైన మానసిక వేదనకు గురై ఆమె మృతి చెందిందని అంటున్నారు. ఈ వ్యవహారమంతా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కేంద్రంగా చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమామణి మృతిపై బీజేపీ నేత రఘురాం డీఓపీటీ (డిపార్ట్మెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. సీఎంఓలో ఉన్న ఐఎఎస్ అధికారి పోస్టింగ్ ఇచ్చే విషయంలో సాటి అధికారిపై వేధింపులకు పాల్పడిన విషయం ఈ లేఖ బహిర్గతం అవడంతో వెలుగులోకి వచ్చింది.

విధి నిర్వహణలో అవినీతికి తావు ఇవ్వకుండా ప్రజలకు సేవ చేసిన ఒక ఐఏఎస్ అధికారి కనీసం గుర్తింపు, పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం సరైన చర్య కాదనే అభిప్రాయాన్ని ఐఏఎస్ అధికారులు సైతం వ్యక్తం చేస్తున్నారు. రమామణి మృతి విషయం ఇప్పుడు ఐఏఎస్ అధికారులలో చర్చనీయాంశంగా మారింది. సీఎంఓలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ అంతా తానేగా చక్రం తిప్పుతూ ఐఏఎస్ అధికారుల పోస్టింగ్ విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు వాస్తవమేననే వాదనలు వినిపిస్తున్నాయి.

మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేధింపులు సామాన్యులకు, ప్రతిపక్ష పార్టీ సభ్యలకే పరిమితం అవలేదు, ఐఏఎస్ అధికారులకు వీటి బెడద ఎదుర్కొంటున్నారనడానికి రమామణి ఘటనే ఒక ఉదాహరణ. ఇటీవల మృతి చెందిన ఆమెకు పోస్టింగ్ ఇచ్చే విషయంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని ఆమెను ప్రశించగా, ఈ అంశం వాస్తవం కాదని ఆమె అధికారి దృష్టికి తెచ్చారు. తనకు వాట్సప్ తప్ప వేరే సోషల్ మీడియా ఖాతాలు లేవని ఆమె స్పష్టం చేసినా ప్రవీణ్ ప్రకాష్ వినిపించుకోకుండా వాట్సప్ లొనే పోస్టింగ్స్ పెట్టుంటారు అని బెదిరింపులకు దిగారని, అదేవిధంగా ఈ సాకుతో పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఆమె కొందరు సన్నిహితుల వద్ద వాపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

సీనియర్ ఐఏఎస్ అధికారిణిని జూనియర్ వేధింపులకు గురిచేయడం ఏంటని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ శ్రీధర్ ప్రశ్నించారు. ప్రవీణ్ ప్రకాష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపించి బాద్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.

ఈ రోజు కూడా వంద దాటిన కరోనా కేసులు!

Telangana

Telangana

తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ రోజు కొత్తగా 129 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 108, రంగారెడ్డి 6, అసిఫాబాద్ 6, మేడ్చల్ 2, సిరిసిల్ల 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఏడుగురు కరోనా రోగులు ఈ రోజు మరణించారు. మరో ఇద్దరు వలస కూలీలు కరోనా బారినపడ్డారు.

తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,020కి చేరింది. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. కరోనా వైరస్‌‌తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1556 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1365 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు పేషెంట్లకు ప్లాస్లా థెరపీ ద్వారా చికిత్స అందించినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీని ద్వారా మెరుగైన ఫలితాలు సంభవిస్తాయని అధికారులు చెప్పారు. వీరు క్రమంగా కోలుకుంటున్నారని.. ఒకరు ఇప్పటికే డిశ్చార్జి అయ్యారని బులెటిన్‌ లో పేర్కొన్నారు.

కేంద్రం చేపట్టిన వందే భారత్ మిషన్ ద్వారా ఇతర దేశాల నుంచి తెలంగాణకు 458 మంది భారతీయులు వచ్చారు. వారిని ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి కరోనా పరీక్షలు చేయగా.. 212 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికుల్లో 206 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!

ysr vahana mithra

ysr vahana mithra

కరోనా కష్టకాలంలోనూ, ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమైన, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం అక్టోబర్‌లో ఇవ్వాల్సిఉన్నా కరోనా కష్టాల నేపథ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రవాణా శాఖ ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది.

 

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 37,756 వేల మంది ఈ పధకానికి దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది లబ్ది పొందిన 2 లక్షల మందికి పైగా దరఖాస్తుదారులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 4 వ తేదీన ఆన్ లైన్ ద్వారా అకౌంట్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. మొత్తం 2,62,493 మంది లబ్దిదారులకు ప్రయోజనం కలగనుంది. ఈ పధకంలో భాగంగా సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నారు.

ఈ పథకం కింద ఎంపికైన మొత్తం 2,62,493 మంది లబ్ధిదారుల్లో 61,390 మంది ఎస్సీలు, 1,17,096 మంది బీసీలు, 14,590 మంది ఈబీసీలు, 29,643 మంది కాపులు, 10,049 మంది ఎస్టీలు, 28,118 మంది మైనార్టీలు, 581 బ్రాహ్మణ, 1,026 మంది క్రైస్తవులు ఉన్నారని అధికారులు తెలిపారు.

మోడీ, వన్ నేషన్-వన్ మార్కెట్

Farmers

Farmers

కేంద్రం రైతులకు తీపి కబురు చెప్పింది. వన్ నేషన్ వన్ మార్కెట్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తూ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక పై రైతులు తమ పంటలను దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా అమ్ముకునేలా అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు మేలు చేసేందుకు నిత్యవసరాల చట్టాన్ని సైతం సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి  ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. నిత్యావసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటుచేసుకుని రైతుల ఆదాయం పెరిగేందుకు ఉపయోగపడుతుందన్నారు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీతో ఏర్పడుతున్న ఇబ్బందులు ఇక రైతులకు ఉండకుండా సులభతరం చేసినట్లు తెలిపారు.

రాజధానిలో ఆర్టీసీ బస్సులకు గ్రీన్ సిగ్నల్!

City rtc

City rtc

హైదరాబాద్ మెట్రో రైళ్ళను ఈ నెల మూడోవ వారం నుండి పున:ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. విద్యా సంస్థలు,థియేటర్స్ మినహా దాదాపుగా ఎకనమిక్ యాక్టివిటీస్ అన్నీ తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణలో అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలు,పారిశ్రామిక కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి. అయితే హైదరాబాద్‌ లో సిటీ బస్సులు,మెట్రో, ఎంఎంటీఎస్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో.. ఆఫీసులకు,పనులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా సిటీ బస్సులకు కూడా రవాణా శాఖ మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.

సాధారణంగా హైదరాబాద్‌ లో ప్రతీరోజూ దాదాపు 33 లక్షల మంది ప్రయాణికులు సిటీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం సిటీ బస్సులు లేకపోవడంతో సొంత వాహనాల పైనే ఆధారపడుతున్నారు. సొంత వాహనాలు లేనివారు దూర ప్రాంతంలో ఉన్న తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం జూన్ 8 నుంచి సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వీరికి కష్టాలు తప్పుతాయి. అయితే కరోనా నేపథ్యంలో సిటీ బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతారన్నది వేచి చూడాలి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 8వ తేదీ నుంచి గ్రేటర్‌ లో సిటీ బస్సులను నడిపేందుకు ఆయన సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ బస్సులు నడుస్తుండటంతో.. హైదరాబాద్‌ లోనూ బస్సు సర్వీసులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

దాని కోసమే ఆ పని చేశా: ప్రియా వారియర్

Priya Prakash Varrier

Priya Prakash Varrier
ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే ప్లాపులర్ అయి స్టార్డమ్ సంపాదించుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. ‘ఒరు ఆడార్ లవ్’ మూవీలో ఆమె కన్నుగీటుకు కుర్రకారంతా ఫిదా అయిపోయారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రియా వారియర్ ఒక్కరోజులోనే స్టార్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడికి లక్షల్లో అభిమానులయ్యారు. ప్రియా ప్రకాశ్ వారియర్ ఇన్ స్ట్రాగ్రామ్ ను 7.2మిలియన్ మంది ఫాలో అవుతున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రియా వారియర్ ఇటీవల తన ఇన్ స్ట్రాను డీ యాక్టివ్ చేసింది. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాకు దూరంగా ఉందనే ప్రచారం జరిగింది. కొందరు ఆమెపై అసభ్యకరంగా మెసేజ్ పెట్టడంతోనే సోషల్ మీడియా నుంచి దూరం వెళ్లిందనే ప్రచారం జరిగింది. అయితే ఏమాత్రం వాస్తవం లేదని ప్రియావారియర్ రీ ఎంట్రీతో స్పష్టమైంది.

తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ తన ఇన్ స్ట్రాగ్రామ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. ఆ అవసరం కూడా తనకు లేదని చెప్పుకొచ్చింది. కొన్నిరోజులు కావాలనే బ్రేక్ తీసుకున్నట్లు చెప్పింది. మానసిక ప్రశాంతత కోసమే ఇలా చేశానని ప్రియా ప్రకాశ్ వారియర్ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళంలో బీజీగా మారింది. అదేవిధంగా తెలుగులో నితిన్ తో ఓ మూవీలో నటిస్తుంది. లాక్డౌన్ పూర్తయ్యాక ఈ మూవీ ప్రారంభం కానుంది. ఏదిఏమైనా ప్రియా వారియర్ ఇన్ స్ట్రాలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Talasani Trust Distributes Provisions to Media People