
ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే ప్లాపులర్ అయి స్టార్డమ్ సంపాదించుకుంది ప్రియా ప్రకాశ్ వారియర్. ‘ఒరు ఆడార్ లవ్’ మూవీలో ఆమె కన్నుగీటుకు కుర్రకారంతా ఫిదా అయిపోయారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రియా వారియర్ ఒక్కరోజులోనే స్టార్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడికి లక్షల్లో అభిమానులయ్యారు. ప్రియా ప్రకాశ్ వారియర్ ఇన్ స్ట్రాగ్రామ్ ను 7.2మిలియన్ మంది ఫాలో అవుతున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే ప్రియా వారియర్ ఇటీవల తన ఇన్ స్ట్రాను డీ యాక్టివ్ చేసింది. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియాకు దూరంగా ఉందనే ప్రచారం జరిగింది. కొందరు ఆమెపై అసభ్యకరంగా మెసేజ్ పెట్టడంతోనే సోషల్ మీడియా నుంచి దూరం వెళ్లిందనే ప్రచారం జరిగింది. అయితే ఏమాత్రం వాస్తవం లేదని ప్రియావారియర్ రీ ఎంట్రీతో స్పష్టమైంది.
తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ తన ఇన్ స్ట్రాగ్రామ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను పబ్లిసిటీ కోసం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. ఆ అవసరం కూడా తనకు లేదని చెప్పుకొచ్చింది. కొన్నిరోజులు కావాలనే బ్రేక్ తీసుకున్నట్లు చెప్పింది. మానసిక ప్రశాంతత కోసమే ఇలా చేశానని ప్రియా ప్రకాశ్ వారియర్ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళంలో బీజీగా మారింది. అదేవిధంగా తెలుగులో నితిన్ తో ఓ మూవీలో నటిస్తుంది. లాక్డౌన్ పూర్తయ్యాక ఈ మూవీ ప్రారంభం కానుంది. ఏదిఏమైనా ప్రియా వారియర్ ఇన్ స్ట్రాలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.