Homeఎంటర్టైన్మెంట్మీరా చోప్రా వివాదంలో.. కటకటాల్లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్?

మీరా చోప్రా వివాదంలో.. కటకటాల్లోకి ఎన్టీఆర్ ఫ్యాన్స్?

Meera Chopra lodges complaint against NTR fans https://www.thehansindia.com/cinema/tollywood/meera-chopra-lodges-complaint-against-ntr-fans

సోషల్ మీడియాలో గత రెండుమూడ్రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ మీరాచోప్రా వివాదం నడుస్తోంది. తాజాగా మీరాచోప్రా ట్వీటర్లో లైవ్ ఛాట్ చేసిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. తెలుగులో మీకు ఇష్టమైన హీరో ఎవరు? అని ఓ నెటిజన్ ఆమె అడిగాడు. దీనికి ఆమె మహేష్ బాబు పేరు చెప్పింది. అయితే ఒక ఎన్టీఆర్ అభిమాని ఆమెను ఎన్టీఆర్ గురించి అడుగగా తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదని.. తనకు ఎన్టీఆర్ కంటే మహేష్ అంటే ఇష్టమని చెప్పింది. ఆమె అలా అనడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హార్టయ్యారు. దీంతో పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై వ్యక్తిగత దూషణలకు దిగడం వివాదానికి కారణమైంది.

తనతోపాటు తన తల్లిదండ్రులపై కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇష్టారీతిన బూతుపురాణం విప్పడంతో మీరాచోప్రా సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఆన్ లైన్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మీరాచోప్రాను వేశ్య, పోర్న్ స్టార్ అంటూ అసభ్యకరమైన రీతిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై రెచ్చిపోయారు. ఆమెను గ్యాంగ్ రేప్, యాసిడ్ దాడి చేస్తామని బెదిరించడంతో ఈ విషయాన్ని సైబర్ పోలీసులకు, ఎన్టీఆర్ కు కూడా ట్వీటర్లో పోస్టు చేసింది. ‘ఇలాంటి ఫ్యాన్స్ తో మీరు విజయవంతం అయ్యారా? అంటూ ప్రశ్నించింది. ఈ ఇష్యూపై మీరు స్పందిస్తారని అనుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ కు ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు.

మీరాచోప్రాపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తుండటంతో మీరాచొప్రా మనస్థాపం చెందింది. ఈ విషయంపై మహిళా కమిషన్ కు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. తనపై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారి అకౌంట్లను స్కీన్ షాట్ తీసి మహిళా కమిషన్ కు ట్వీటర్లో పోస్టు చేసింది. ఈ వివాదంలో మహిళలు, నెటిజన్ల నుంచి మీరాచోప్రాకు మద్దతు లభిస్తుంది. మహిళల విషయంలో ముందుండే పోరాడే సింగర్ చిన్నయి సలహామేరకు ఆమె మహిళా కమిషన్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూపై ఎన్టీఆర్ సైలెంట్ అయిపోయారు. మీరా చోప్రా ట్వీట్ కు ఇప్పటివరకు ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంలో మహిళా కమిషన్ ఎంట్రీ ఇవ్వడంతో మీరాచోప్రాపై అత్యు త్సాహంతో వ్యక్తిగత దూషణలకు పాల్పడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ జైలుకు వెళ్లడం ఖాయం కన్పిస్తుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular