
అల్లు అర్జున్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘వేదం’. ఆ చిత్రం విడుదలై పదేళ్లు అవుతోంది. దేశ ముదురు, పరుగు చిత్రాలతో మంచి విజయాలు ఖాతాలో వేసుకొని హీరోగా పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో ఈ మల్టీస్టారర్మూవీలో నటించిన బన్నీ పెద్ద సాహసమే చేశాడు. జాగర్లమూడి చెప్పిన కథ నచ్చడంతో తన స్టార్డమ్‌ను పక్కనపట్టి మరీ ‘వేదం’లో భాగస్వామి అయ్యాడు. కేబుల్ రాజు పాత్రలో జీవించాడు. వేశ్య పాత్రలో నటించిన అనుష్క అందరినీ ఆశ్చర్యపరచగా.. అద్భుతమైన నటనతో బన్నీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో ఓ పాటకు కొరియోగ్రఫీ కూడా చేశాడు. మనోజ్ బాజ్‌పెయ్, మంచు మనోజ్, దీక్షా సేత్, శరణ్య ఇతర పాత్రల్లో నటించిన ఈ సినిమా విమర్శల ప్రశంసలు అందుకుంది.అనేక పురస్కారాలు అందుకుంది.
2010 జూన 4వ తేదీన ఈ సినిమా రిలీజైంది. అంటే ఈ రోజుతో దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ ‘వేదం’ను గుర్తు చేసుకున్నాడు. ‘వేదం సినిమాకు పదేళ్లు. ఇంత అందమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎంతో గొప్ప విజన్, అభిరుచి ఉన్న దర్శకుడు క్రిష్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సినిమాలో నటించిన మనోజ్, అనుష్క, మనోజ్ బాజ్‌పేయి, ఇతర నటీనటులు, మద్దతుగా నిలిచిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు` అన్ని బన్నీ ట్వీట్ చేశాడు.