
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. వారం రోజుల నుంచి రోజుకు సగటున 150 నుంచి 200 వరకు కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికి వెయ్యి పడక గదులుకి తోడు, అదనంగా 350 పడకలు ఏర్పాటు చేసేందుకు గాంధీ యంత్రాంగం సిద్ధమైంది.
కొత్తగా వచ్చే వారిని ఎక్కడ పెట్టాలనే అంశంపై డాక్టర్లు తర్జనభర్జన పడుతున్నారు. పడకల నిష్పత్తికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఆ మేరకు వైద్య సిబ్బందిని కూడా నియమించక పోవడంతో విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై తీవ్ర పనిభారం పడుతోంది. వైద్యులు రాసిన మందులను మంచంపై పడేయడం, ఆహారాన్ని కనీసం చేతికి కూడా ఇవ్వకుండా ఓ చోట వదిలి వెళుతుండడం లాంటి ఘటనలు రోగులను మానసికంగా కుంగదీస్తున్నాయి. కరోనా సెంటర్ ఏర్పాటు చేసిన నాటి నుంచి మే 3వ తేదీ వరకు కరోనా పాజిటివ్ లక్షణాలతో 3020 మంది రోగులు చేరగా, వీరిలో విదేశీయులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 448 ఉన్నారు.