Home Blog Page 8434

మాటల్లో స్నేహం, చర్యల్లో యుద్ధం..వైసీపీ ఎంపీ తీరిదే..!


కొన్నాళ్లుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు చర్యలు ఆ పార్టీ నేతలకు తలనొప్పిగా మారగా, దీనికి అడ్డుకట్ట వేయాలని రెండు రోజులక్రితం ఆయనకు షో కాజ్ నోటీసులు జారీచేశారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న తన వ్యాఖ్యల వెనుక కారణం తెలియజేయాలని కోరారు. దీనిపై రఘురామ కృష్ణం రాజు విభిన్నంగా స్పందించారు. నేను ఎప్పుడూ పార్టీకి కానీ..పార్టీ అధినేత జగన్ కి కానీ వ్యతిరేకంగా మాట్లాడింది లేదు అన్నారు. జగన్ అధ్బుత పథకాలతో ప్రజాకర్షణ పాలన చేస్తున్నప్పటికీ..క్షేత్రస్థాయిలో వాటి అమలులో జరుగుతున్న లోపాల గురించిన మీడియా ముఖంగా తెలియజేశాను. అంత మాత్రాన నేడు పార్టీ వ్యతిరేకిని ఎలా అవుతాను అన్నారు. ఈ మాటలను బట్టి ఆయన సంధి మార్గం ఎంచుకుంటున్నారని అనిపించినా..మరలా అనేక అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.

ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

మీరు పార్టీ నుండి సస్పెండ్ కావాలని…ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని బయట ప్రచారం జరుగుతుంది..మీ అభిప్రాయం ఏమిటనగా? పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేస్తే నేను చాలా భాధపడతాను. జగన్ ని బాగా అభిమానించే వ్యక్తులలో నేను ఒకరిని..నేను ఎందుకు సస్పెండ్ కావాలని కోరుకుంటాని అని ఆయన అన్నారు. ఐతే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు మీదుగా కృష్ణం రాజుకు షో కాజ్ నోటీసులు రావడాన్ని ఆయన తప్పుబట్టినట్లు తెలుస్తుంది. ఇలాంటి విషయాలపై స్పందిచాల్సింది క్రమ శిక్షణా సంఘం కదా…వైస్సార్సీపీ పార్టీకి క్రమశిక్షణా సంఘం లేదా అని ఆయన ప్రశ్నిస్తున్నారట.

ఈ పరిణామాలతో వైసీపీ పార్టీతో ఆయన సంధి కోరుకుంటున్నారా లేక సమరానికి సిద్ధం అవుతున్నారా అనేది స్పష్టం కావడం లేదు. మొదటి నుండి పరిణామాలను గమనిస్తే ఆయన వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ కావాలని కోరుకుంటున్నారని అర్థం అవుతుంది. వైసీపీ పార్టీలో తనకు ప్రాధాన్యం లేదు, కనీసం జగన్ అప్పాయింట్మెంట్ కూడా దొరకని స్థితిలో ఈ ఎంపీ ఉన్నారు. దీనికి తోడు ఈయనకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం ఒక ప్రధాన కారణం. తన విపరీత చర్యల వలన వైసీపీ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయగలదు కానీ, ఎంపీ పదవిని పోగొట్టలేదు. కావున ఆయన వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ అయినా…బీజేపీ పార్టీలో చేరి అన్ని విధాలుగా ప్రయోజనాలు అనుభవించవచ్చు, అనేది ఆయన లోలోపల ఉన్న ఆలోచన కావచ్చు. మరి కొన్ని రోజులలో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కలదు.

ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలకు 45 సంవత్సరాలు

ఇప్పటికి 45 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ రాత్రికి రాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించింది. విశేషమేమంటే ఇందిరా గాంధీ ముందుగా ఎమర్జెన్సీ విధించిన తర్వాతనే రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ ఆమోద ముద్ర వేయటం జరిగింది. అంటే ఎటువంటి అధికారం లేకుండానే ఇందిరా గాంధీ ఆత్యయిక స్థితిని విధించటమే కాకుండా అర్ధరాత్రి అందరి రాజకీయ నాయకుల్ని ఇళ్లనుంచి తీసుకొచ్చి జైళ్లలో కుక్కటం జరిగింది. మరుసటి రోజు పత్రికలన్నీ సంపాదకీయం ఖాళీగా అట్టిపెట్టి ప్రచురించాయి. ఎందుకంటే అప్పటికే పత్రికా సెన్సార్ ని అమలులోకి తెచ్చింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రచురించటానికి వీల్లేదు. ప్రతివార్త ప్రభుత్వ అనుమతి తోనే జరగాలి. ప్రస్తుతం చైనా లో ఇదే జరుగుతుంటుంది. ఎందుకంటే అక్కడ ప్రైవేటు ప్రచురణలు నిషిద్దం కాబట్టి. మనం కూడా ఆ పోలీసు రాజ్యాన్ని కొన్నాళ్ళు అనుభవించాం. ఆ తర్వాత పుట్టిన తరాల వారికి ఈ విషయం పుస్తకాల్లో చదువుకోవటం ద్వారానే తెలిసింది.

ఇందిరా గాంధీ అంటే అప్పట్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకురాలు. స్వతహాగా పెద్ద వక్త కాదు. కానీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి రాజకీయాలు ప్రత్యక్షంగా చూసేది. తను అధికారం లో కొచ్చిన కొత్తలో కాంగ్రెస్ పార్టీలోని అతిరధ మహారదులనుంచి సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని చాక చక్యంగా ఎదుర్కోవటమే కాకుండా తన అధికారానికి పార్టీలో తిరుగులేకుండా పావులు కదిపింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పార్టీ చీలిపోయింది. కానీ అధికారం తన చేతులో ఉండటంతో పార్టీ ని హస్తగతం చేసుకోగలిగింది. తన అధికారాన్ని పదిలపరుచుకునే క్రమంలో ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించటం కోసం బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు చర్యలను చేపట్టింది. అవి తన ఓటు బ్యాంకుని పదిలపరచటమే కాకుండా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీగా ముద్రపడింది. అప్పటిదాకా హిందీ ప్రాంతాల్లో సోషలిస్టులు, హిందీయేతర ప్రాంతాల్లో కమ్యూనిస్టులు పేద ప్రజల పార్టీలుగా ముద్రపడ్డాయి. వాటి ఓటు బ్యాంకు దీనితో ఇందిరా కాంగ్రెస్ కి మారింది. 1971 లో ఇందిరాగాంధీ అఖండ విజయాన్ని సాధించింది.

ఆ తర్వాత ఓ పెద్ద చారిత్రాత్మక సంఘటన జరిగింది. 1971 చివరలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వతంత్రం పొందింది. ఆ పోరాటం లో భారత సైన్యం లేకుంటే అది జరిగేది కాదు. ఈ ఘటనతో ఇందిరా గాంధీ ప్రజాదరణ పతాకస్థాయి నంటింది. పార్లమెంటులో ప్రతిపక్షనాయకుడు అటల్ బిహారీ వాజపాయీ ఆమెను అపర దుర్గగా వర్ణించాడు. అసలు ఇందిరా కాంగ్రెస్ పుట్టుకే వ్యక్తి పూజతో మొదలయితే అది ఈ సంఘటనతో ఎక్కడిదాకా వెళ్లిందంటే అస్సాం కాంగ్రెస్ నాయకుడు దేవకాంత్ బరువా ‘ ఇండియా ఇందిరా, ఇందిరా ఇండియా’ అనేదాకా వెళ్ళింది. తన అధికారానికి హద్దులు లేని సమయం లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ( ఈయన సోషలిస్టు పార్టీ స్థాపకుల్లో ఒకరు) ‘సంపూర్ణ క్రాంతి’ ఉద్యమాన్ని ప్రారంబించాడు. ప్రజలు పెద్దఎత్తున తన సభలకు రావటం జరిగింది. విద్యార్ధుల్లో ఇది ఓ విప్లవంలాగా మారింది. ఈ నేపధ్యంలో ఒక సంఘటన చరిత్రగతిని మార్చింది. ఇందిరా గాంధీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని కోర్టు కెళ్ళిన సోషలిస్టు నాయకుడు రాజ్ నారాయణ్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇందిరా గాంధీ పదవికోల్పోవల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపధ్యమే చివరకు ఎమర్జెన్సీ ని విధించటానికి దారి తీసింది. నిజమే మరి, ఇండియా ఇందిరా, ఇందిరా ఇండియా అయినప్పుడు ఆవిడలేకపోతే దేశమే లేదుకదా!

ఇదంతా ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే కొత్త తరాలకు ఈ భారత దేశ చరిత్ర తెలియదు. తెలిసినా చూచాయగానే తప్ప.  ప్రజల త్యాగాలు చేయబట్టే ఈరోజు స్వేచ్చగా జీవించ గలుగుతున్నామని గుర్తుంచుకోవాల్సి వుంది. ఎమర్జెన్సీ చీకటి రోజులు మన పెద్ద వాళ్ళు అనుభవించారు కాబట్టే అవి పునరావృతం కాకుండా రాజ్యాంగం లో మార్పులు తీసుకొచ్చారు. వేరే ఏ దేశంలో నయితే ప్రజల ప్రాధమిక హక్కుల్ని హరించి నందుకు కఠిన శిక్షలు పడేవి. వారికి తిరిగి పోటీ చేసే అర్హత వుండేది కాదు. కానీ అలా జరగలేదు. తిరిగి అదే కుటుంబం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ దీర్ఘకాలం పరిపాలన చేసింది. ఎమర్జెన్సీ లో 20 సూత్రాల పేరుతో ఆర్ధిక కార్యక్రమాలు ప్రకటిస్తే వాటిని భుజాన వేసుకొని దేశమంతా తిరిగి సిపిఐ ప్రచారం చేసింది. ఆ మకిలి లో భాగం వాళ్లకు కూడా వుంది. యువ రాకుమారుడు సంజయ్ గాంధీ ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా తయారయ్యి 5 సూత్రాల పేరుతో ఇంకో కార్యక్రమాన్ని ప్రారంభించాడు. దాంట్లో భాగంగా పేద ప్రజల్ని బలవంతంగా తీసుకెళ్ళి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపించటంతో కధ అడ్డం తిరిగింది.  సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండేజ్ ప్రజల్లో సంచలనం సృష్టించటం కోసం కొన్ని హింసాత్మక చర్యలకు కూడా పాల్పడ్డాడు. అందుకనే ఎమర్జెన్సీ ఎత్తేసినా తను జైలు లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జైలు లోనుంచే పోటీ చేసి బీహార్ నుంచి లోక్ సభ సభ్యుడుగా గెలుపొందాడు. ఆ వారసత్వపు పార్టీనే నేటి జనతాదళ్ యునైటెడ్ బీహార్ లో అధికారం లో వుంది.

ఎమర్జెన్సీ రోజులు గుర్తుకురాగానే ఏదో చెప్పలేని ఆవేదన, ఆక్రోశం కట్టలు తెంచుకుంటుంది. అప్పట్లో విద్యార్ధిగా వుండి  ప్రత్యక్షంగా చూసిన మాకు కాంగ్రెస్ ని , నెహ్రు కుటుంబాన్ని చూడగానే అవే చేదు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో వున్న వారిలో చాలామంది ఆరోజు జైలు జీవితం అనుభవించిన వారే.  ఇది రెండో స్వతంత్ర పోరాటం. ఎంతోమంది ఎమర్జెన్సీ లో బాధలు అనుభవించినవారే. బాధాకర విషయమేమంటే ఇంతగా ప్రజాస్వామ్యం ఖూని జరిగినా, ప్రాధమిక హక్కులకు భంగం కలిగినా మన వుమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరిగి కాంగ్రెస్ కే ఓటు వేసింది. అత్యధిక కాంగ్రెస్ సభ్యులని ఎన్నుకున్న రాష్ట్రంగా 1977 ఎన్నికల్లో మన తెలుగు రాష్ట్రానికి పేరు వచ్చింది. ఒకవిధంగా అపఖ్యాతి మూటకట్టుకుంది. హిందీ ప్రాంతాలు, పశ్చిమ ప్రాంతాలు పెద్దఎత్తున తిరుగుబాటు చేస్తే దక్షిణాదిలో స్పందన అంతంత మాత్రంగా వుండటం ఆశ్చర్యమేసింది. అంటే మనకి ప్రజాస్వామ్యం, ప్రాధమిక హక్కులు ప్రధానం కాదా ? ఏది ఏమైనా కాంగ్రెస్ పై ముఖ్యంగా నెహ్రు కుటుంబంపై మన తెలుగు రాష్ట్రాలకు అమితమైన ప్రేమాభిమానాలు ఉండేవి.

2014 లో దీనికి చరమగీతం పలికారు మన  తెలుగు ప్రజలు. ప్రత్యేక తెలంగాణ, సమైక్య ఆంధ్రా ఉద్యమాల పుణ్యమా అని కాంగ్రెస్ పునాదులు పూర్తిగా కదిలిపోయాయి. తెలంగాణా లో ఇంత మంది మరణానికి కారణమని తెలంగాణా వాసులు, ఆంధ్రాకు పూర్తిగా అన్యాయం చేసిందని ఆంధ్రా వాసులు కాంగ్రెస్ ని  సోదిలో లేకుండా చేసారు. ఆంధ్రలో అయితే దాని ఉనికి పూర్తిగా కోల్పోయింది. తెలంగాణా లో ఉనికి కోల్పోకపోయినా కెసిఆర్ పర్సనాలిటీ ముందు సోనియా గాంధీ పర్సనాలిటీ వెలవెల పోయింది. అయినా దింపుడు కళ్ళెం ఆశతో తెలంగాణా ఇచ్చిన ” దేవత ” గా సోనియా గాంధీని ఎప్పటికైనా ఆదరిస్తారనే నమ్మకంతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వున్నారు. కానీ వాళ్ళ ఆశలు నెరవేరే పరిస్థితులు లేకపోగా అసలు ఉనికికే ప్రమాదం వచ్చేటట్లు వుంది. తెరాసకి ప్రత్యామ్నాయంగా బిజెపి తెరమీదకు వచ్చింది. ఉత్తర తెలంగాణా లో ఇప్పటికే ఆ పని జరిగిపోయింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కి ఇప్పటికీ ఆశలు సజీవంగా వున్నాయి. వచ్చే నాలుగు సంవత్సరాల్లో బిజెపి ఇక్కడ కూడా కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశాలే మెండుగా వున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరపాలిక ఎన్నికలు ఈ సమస్యని పరిష్కరిస్తాయి. తెరాస కి ఇక్కడ ప్రత్యామ్నాయంగా బిజెపి వుండే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. అదేజరిగితే కాంగ్రెస్ తెలంగాణా లో కూడా బిషానా సర్దుకోవలసి వుంటుంది. వుమ్మడి నల్గొండ జిల్లా హైదరాబాద్ నగర పాలిక ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పట్టునుంచి బయటపడే అవకాశముంది. కాబట్టి ఎమర్జెన్సీలో కాంగ్రెస్ కి ఓటు వేసిన తెలుగు ప్రజలు ఆ బాకీ ఇప్పుడు తీర్చుకున్నట్లయ్యింది.

ఎమర్జెన్సీ చేదు జ్ఞాపకాలతో ఈ 45 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యం బలపడింది. పార్టీలు ఏవి అధికారం లో వున్నా ప్రాధమిక హక్కుల్ని, భావ స్వేచ్చని అరికట్టే సాహసం చేయలేరు. ముఖ్యంగా కొత్త తరాలు భావ స్వేచ్చ లేకుండా బతక లేరు. అది సానుకూల పరిణామం. మధ్యతరగతి క్రమేపీ పెరగటం కూడా ప్రజాస్వామ్యం బలపడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భారత్ ఇక ఎప్పటికీ ఎమర్జెన్సీ కి వెళ్ళే అవకాశాలు లేవు. ఎమర్జెన్సీ అనేది కేవలం చరిత్ర గానే మిగిలిపోతుంది. దానితోపాటు చిరకాలపు ముద్దాయిగా బోనులో కాంగ్రెస్ కూడా కొనసాగుతుంది. ఇవీ ఎమర్జెన్సీ కి సంబంధించి కొన్ని చేదు గుర్తులు. దురదృష్టవశాత్తూ మీడియా లో ఈరోజు దీనిపై ఫోకస్ లేదు. కారణాలు మీకే వదిలేస్తూ …

పవన్ పై ఒత్తిడి తెస్తున్న జనసైనికులు.. ఎందుకంటే?


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2014ఎన్నికలకు ముందే జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. పవన్ కల్యాణ్ మద్దతుతో టీడీపీ 2014ఎన్నికల్లో గెలిచింది. అయితే 2019ఎన్నికల్లో మాత్రం జనసేన-టీడీపీ వేర్వురుగా పోటీచేసి రెండు పార్టీలు దారుణంగా పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీకి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు రాగా అప్పటిదాకా అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23సీట్లు మాత్రమే వచ్చారు. 2019లో వైసీపీ ఫ్యాన్ గాలికి వీయడంతో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నాడు. అన్నివర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూ చేరవుతున్నారు. ఇక ప్రతిపక్ష టీడీపీ వైసీపీపై కౌంటర్లు చేస్తూ నిత్యం మీడియాలో నానుతోంది. ఏపీలో టీడీపీ వర్సస్ వైసీపీగా కన్పిస్తుంది. అయితే జనసేన పార్టీ ఎన్నికల ఓటమి నుంచి ఇంకా తేరుచుకున్నట్లు కన్పించడం లేదు. అడుపదడుపా ఒకటోరెండో కార్యక్రమాలకు పరిమితవడం.. ట్వీటర్లలో పోస్టు పెట్టడం మినహా ప్రత్యక్ష పోరాటాలకు దిగడం లేదని విమర్శలు ఆ పార్టీపై వెల్లువెత్తుతున్నాయి.

ఈనేపథ్యంలో జనసైనికులు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్నారు. పవన్ పాలిటిక్స్ లో యాక్టివ్ లేకపోతే కిందిస్థాయి నేతలంతా వైసీపీ లేదా టీడీపీ వైపు వెళ్లే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు దాదాపు 6శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 10వేల ఓట్ల తేడాతో 35సీట్లను జనసేన కొల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు పవన్ సినిమాల్లోకి వెళ్లారనే సాకుతో ఒక్కొక్కరు ఇతర పార్టీకి జంప్ అవుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ తాను సినిమాలు చేయనని రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఉంటానని ప్రకటించాడని వారు గుర్తుచేసి మరీ పార్టీని వీడుతుండటం గమనార్హం.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జనసైనికులు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. పవన్ సినిమాలతోపాటు పాలిటిక్స్ ఉంటాడని చెబుతున్నారు. అయితే పవన్ యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవడంతో కిందిస్థాయి నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో ఒక్కొక్కరు పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలోనే పవన్ కల్యాన్ పార్టీ విషయంలో ఏం ఆలోచిస్తారనేది తేల్చుకునేందుకు జనసైనికులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పవన్ ను త్వరలోనే కలిసి అసలు పార్టీని నడిపిస్తారా? లేదా అని ఖరాఖండీగా అడగాలని డిసైడ్ అని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇప్పటికే మెగాబ్రదర్ నాగబాబు జనసేన పార్టీకి అంటిముంటనట్లే ఉంటున్నాడు. అప్పుడప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పార్టీకి సంబంధం లేని పోస్టు పెడుతూ జనసైనికులను ఇరకాటంలో పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ పెద్దన్నయ్య చిరంజీవి వైసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి మెగాస్టార్ బహిరంగంగానే మద్దతు తెలిపిన సంగతిని జనసైనికులు గుర్తుచేసుకుంటున్నారు.

మరోవైపు పవన్ కల్యాణ్ ఇప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ బీజేపీతో పొత్తుపెట్టుకొని ఆ పార్టీని భుజాన మోస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో జనసేన పార్టీ కూడా ప్రజారాజ్యం పార్టీలా మారుతుందా అనే అనుమానం జనసైనికుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్నే పవన్ దృష్టికి తీసుకెళ్లాలని యువ నాయకత్వం భావిస్తుంది. త్వరలోనే జనసేన భవితవ్యం ఏంటో తేలిపోనుందనే టాక్ రాజకీయ వర్గాల్లో విన్పిస్తుంది. దీనిపై పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

‘ఎమ్మెల్యే రోజా’ మెగాస్టార్ కి సిస్టర్ అట !


మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనది. హీరోకి చెల్లి పాత్ర అయిన ఈ పాత్రలో మంజు వార్యర్ అద్భుతంగా నటించింది. కాగా తెలుగు వర్షన్ లో ఈ పాత్రలో ఎమ్మెల్యే రోజా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాలి.

నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!

ఆయితే ఈ పాత్రకు మాత్రం రోజా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. హీరో పై ద్వేషంతో ఆవేశంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ కు రోజా పూర్తి న్యాయం కూడా చేస్తోంది. పైగా మెగాస్టార్ కి సిస్టర్ గా రోజా అంటే కొత్తగా కూడా ఉంటుంది. కాగా తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా లూసిఫెర్ స్క్రిప్ట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేశారని.. ముఖ్యంగా హీరోయిజమ్ ఎలివేషన్స్ ఉన్న సన్నివేశాలు సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలిచేలా సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయట.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

ఇక గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో మిశ్రమ ఫలితాలను అందుకున్నా… మెగాస్టార్ చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికి ఈ భారీ సినిమా అవకాశం ఇచ్చారు. మరి ఈ మెగా ఛాన్స్ ను సుజీత్ ఉపయోగించుకుంటే ఇక అతను స్టార్ డైరెక్టర్ అయిపోయినట్లే. మరి ఈ మూవీని ఈ యంగ్ డైరెక్టర్ ఏ రేంజ్ లో హిట్ చేస్తాడో చూడాలి.

అనుష్క పెళ్లి.. ఈ సారి నమ్మే విధంగానే.. !


స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క ఇరవై ఏళ్ల క్రితమే పెళ్లి ఈడుకొచ్చేసింది. కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకుని ఉండి ఉంటే అనుష్క కూతురు కూడా ఈ పాటికి హీరోయిన్ అయి ఉండేది అని సోషల్ మీడియాలో అనుష్క మీద నెటిజన్లు బోల్డ్ అండ్ చెత్త జోక్స్ కూడా ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు. ఇక అనుష్క వివాహం విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఏ ఒక్కటీ నిజం కాలేదు. అయితే కొన్ని నెలలుగా అనుష్క పెళ్లి పై ఒక రూమర్ మాత్రం బాగా హల్ చల్ చేస్తోంది. అనుష్క వివాహం చేసుకోబోయే వరుడు టాలీవుడ్ సీనియర్ దర్శకుడి కుమారుడు అంటూ గతంలో పుకార్ల కంటే బలంగా ఈ రూమర్ కొన్ని నెలలుగా చక్కర్లు కొడుతుండటం విశేషం.

నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!

ఇప్పుడు మరో రూమర్ కూడా అనుష్క పెళ్లి పై వినిపిస్తోంది. తన బంధువుల అబ్బాయినే అనుష్క పెళ్లి చేసుకోబోతుందని.. పెళ్లి ఆగస్టులో ఉండే అవకాశం ఉందని లేటెస్ట్ రూమర్ సారాంశం. మరి దీనిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అనుష్కనే క్లారటీ ఇవ్వాలి. అన్నట్టు ప్రభాస్ తో సహా ఇంకో యువ హీరో పేరును కూడ అనుష్కతో లింక్ చేసి రూమర్స్ రాశారు రాతల రాయుళ్లు. కానీ అవేవీ వాస్తవం కాదని త్వరగానే తేలిపోయాయనుకోండి. అయితే తాజాగా అనుష్క పెళ్లి విషయంలో వస్తోన్న గాసిప్ పెద్ద ఎత్తులో గుప్పుమనడం.. అది నమ్మే విధంగా ఉండటంతో అదే నిజం అనుకునే పరిస్థితి వచ్చింది.

ఏది ఏమైనా అనుష్క త్వరగా పెళ్లి చేసుకునే దాకా సోషల్ మీడియాలో ఈ రూమర్లు ఆగవు. అనుష్క పెళ్లి అంటూ డీటైలింగ్ ఇస్తూ ఎవడొకడు ఏదొకటి పుట్టిస్తూనే ఉంటాడు. ఇకపోతే అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ విడుదలకు సిద్ధంగా ఉన్నా.. విడుదల అయ్యే పరిస్థితులు కనబడటం లేదు.

వైఎస్ఆర్ పై ప్రేమ.. జగన్ పై కోపం.. ఎందుకు?


కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అత్యంత సన్నిహితులైన వారు శత్రువులవుతారు. శత్రువులు మిత్రులవుతారు. అందుకే రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా తక్కువ. అలాంటి నేతలను గుర్తించి దూరంగా ఉండడం తెలివైన నేతల లక్షణం. ఈ లక్షణం ఏపీ సీఎం జగన్ లో పుష్కలంగా ఉందని నిరూపితమైంది. తన ప్రత్యర్థులెవరు? నమ్మినబంట్లు ఎవరనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారట వైఎస్ జగన్. తాజా పరిణామాలు కూడా జగన్ దూరదృష్టికి నిలువుటద్దంగా నిలిచాయి.

నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అప్పట్లో రైట్ హ్యాండ్ లాంటి వారు ఉండవల్లి అరుణ్ కుమార్. వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నన్నీ రోజులు ఆయనతో సాన్నిహిత్యం నెరిపారు. 2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి ఎంపీగా ఉండవల్లిని కాంగ్రెస్ తరుఫున నిలబెట్టి మరీ వైఎస్ఆర్ గెలిపించారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెలుగులోకి తెచ్చిన నేత.ఆ తర్వాత తన వాక్చాతుర్యంతో ఏపీ రాష్ట్రంలో ఉండవల్లి ప్రసిద్ది చెందారు.కాంగ్రెస్ తోపాటు అంతర్థానమైపోయారు. వేరే పార్టీలో చేరకుండా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే ఉండవల్లితో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. రామోజీ రావు మార్గదర్శి సామ్రాజ్యంపై ఉండవల్లి దాడి చేసి, దానిలోని చట్టవిరుద్ధమైన అంశాలను బహిర్గతం చేసినప్పుడు ఉండవల్లిలోని ధైర్యం కనిపించింది. న్యాయవాదిగా అతని నేపథ్యం ఇందుకు దోహదపడింది. మీడియా టైకూన్ తో న్యాయ పోరాటంలో అతనికి ఇది చాలా సహాయపడింది. ఇక రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఉండవల్లి ఆయన నియోజకవర్గంలో అవినీతి రహిత రాజకీయ నాయకుడిగా పేరొందాడు. అదే సమయంలో తన పదవీకాలంలో గణనీయంగా ఏమీ చేయలేదని, అందువల్ల అతను మంచివాడు కాని ఉపయోగపడడు అని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

ఇప్పటికీ ఉండవల్లిపై రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ మెజారిటీ ప్రజల్లో వ్యతిరేకతే ఉందంటారు. ‘ఉండవల్లి తన పార్టీ అధిపతికి ఎప్పటికైనా ఉపయోగపడే నాయకుడు. ఎందుకంటే ప్రెస్ మీట్స్‌లో తన వక్తృత్వ నైపుణ్యంతో ప్రత్యర్థులపై పంచులతో మీడియాలో హైలెట్ అవుతుంటాడు. కానీ ఒక పాలకుడిగా ప్రజలకు అతడు చేసింది తక్కువ. ప్రజలకు ఉపయోగపడని నాయకుడు. నాడు వైయస్ఆర్ వేవ్ లోనే గెలిచాడు.. సొంతంగా ఎన్నికలలో గెలిచే సామర్థ్యం ఉండవల్లికి లేదు’ ఇప్పటికీ అక్కడి ప్రజలు ఉండవల్లి శక్తిసామర్థ్యాలను విశ్లేషిస్తుంటారు.

అయితే ఏదిఏమైనా చంద్రబాబు పాలనలో 2014 – 2019 మధ్య జరిగిన అవినీతిని బహిర్గతం చేయడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంతో కృషి చేశారనే వాస్తవాన్ని చాలా మంది అంగీకరిస్తున్నారు. విద్యావంతులైన ఓటర్లు ఆయన ప్రసంగాల ద్వారా బాగా ప్రభావితమయ్యారని.. టిడిపిపై ద్వేషం మరియు కోపాన్ని పెంచడంలో ఉండవల్లి వైసీపీకి ఎంతో సాయం చేశారని అంటుంటారు..

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఉండవల్లి తీరు మారింది. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీ రఘు రామ కృష్ణరాజు, సబ్బాం హరి వంటి వారి సరసన ఉండవల్లి చేరిపోయాడు. తాజాగా ప్రెస్ మీట్ లో జగన్ ప్రభుత్వం గురించి విమర్శించాడు. నెల్సన్ మండేలా కథను ఈ సందర్భంగా వివరించాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోకుండా పగలు పక్కనపెట్టి మంచి పాలనను మాత్రమే అందించాలని సూచించాడు.

ఎంపీ రఘు రామ కృష్ణరాజు గురించి విలేకరులు అడిగినప్పుడు.., అతను తన స్నేహితుడు కాబట్టి తనపై వ్యాఖ్యానించలేనని ఉండవల్లి పేర్కొన్నాడు. దీంతో ఉండవల్లి ముక్కుసూటి తనం చచ్చిపోయిందని.. ఉండవల్లి కూడా మారిపోయారని వైసీపీ నేతలు ఆడిపోసుకుంటున్నారు. కరోనా కేసుల కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఉండవల్లి ఆరోపించారు. దేశంలోనే ఏపీలో అత్యధిక పరీక్షలను వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. అంతేకాదు.. ప్రతి క్వారంటైన్ లో ఉన్న రోగిని ఏపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కోలుకున్న తర్వాత 2000 రూపాయలతో ఇంటికి తిరిగి పంపుతుంది. జేసీ అచ్చెన్నాయుడు అరెస్టులను ప్రతీకార రాజకీయంగా ఉండవల్లి తాజాగా ఎత్తిచూపారు. అచ్చన్నాయుడు ఈఎస్ఐ మందుల కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొంటుండగా, నకిలీ రిజిస్ట్రేషన్ల బస్సులను నడుపుతున్న ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. వీరి నేరాలకు కోర్టులు కూడా బెయిల్ ఇవ్వని పరిస్థితి నెలకొంది.అలాంటి వారి పక్షాన ఉండవల్లి మాట్లాడడంపై వైసీపీ నేతలు ముక్కునవేలేసుకున్నారు.

వైయస్ఆర్ తో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రికి స్నేహితుడైన ఉండవల్లిని ఇన్ని సంవత్సరాలు ఎందుకు దూరంగా ఉంచారో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తాజాగా సంఘటనలతో అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఉండవల్లి , రఘు రామ కృష్ణరాజు, సబ్బాం హరి వంటి నేతలు వైయస్ఆర్ కు దగ్గరగా లేరు. కానీ వైఎస్ఆర్ ఆత్మ అయిన ఆయన స్నేహితుడు కేవీపీ రామచంద్రరావుకు వీరంతా సన్నిహితులుగా ముద్రపడ్డారు. వారు వైయస్ఆర్ సానుభూతిపరులుగా నటిస్తారు కాని కేవీపీ కోసం పనిచేస్తారనే తెలిసే జగన్ దూరం పెట్టారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

‘ఆ రోజే జగన్ సామాన్యుడికి దూరమయ్యాడు’

Prajavedhika

 

Prajavedhika

 

ఏపీ సీఎం జగన్ తన ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకొని, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను ఆ ప్రాంతంలోకి రానివ్వకుండా చేసి, సామాన్యుడికి దూరమయ్యాడని టీడీపీ నేత పట్టాభిరాం ఆరోపించారు. ప్రజావేదిక కూల్చి గురువారం నాటికి ఏడాది అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ గేట్లు సామాన్యుడికి ఏ రోజైనా తెరిచారా? అని ప్రశ్నించారు. ఒక్క సామాన్యుడైనా ఆ ప్యాలెస్‌ లోకి వెళ్లగలిగాడా? అని అన్నారు. ఆ రోజున ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు స్వతంత్ర్యంగా వెళ్లి చంద్రబాబును కలిసేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పట్టాభిరాం విమర్శించారు.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజావేదిక కూల్చివేత ఏడాది సందర్బంగా ఒక ట్వీట్ చేశారు. “ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికను కూల్చడం ఒక బాధ్యతా రాహిత్యమైన చర్య. ఆ శిథిలాలను తొలగించకుండా అలాగే ఉంచడం ఒక ఉన్మాద చర్య. నాటి విధ్వంసానికి, మీ ప్రభుత్వ ఉన్మాద పాలన ప్రారంభానికి ఏడాది అయిన సందర్భంగా తెలుగుదేశం నేతలు మీ చర్యలను ప్రజల దృష్టికి తెస్తుంటే ఉలికి పడుతున్నారెందుకు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇలా మొదలై అలా ముగిసిన ప్రజావేధిక!

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజ‌ధానిని అమరావతికి త‌ర‌లించిన తొలినాళ్ల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి స‌మావేశ మందిరం లేక‌పోవ‌డంతో ప్రైవేట హోట‌ళ్లలో స‌మావేశాలు నిర్వ‌హించేవారు. ప్ర‌భుత్వానికి ఒక స‌మావేశ మందిరం ఉండాలంటూ 2017లో ప్ర‌జావేదిక పేరుతో గ్రీవెన్స్ హాల్ నిర్మించారు.

చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా క‌లెక్ట‌ర్లతో ముఖ్య‌మంత్రి స‌మీక్ష స‌మావేశాలు, ఇతర సమావేశాలు ప్రజావేదికలోనే నిర్వ‌హించారు. టీడీపీ కార్య‌క‌లాపాల‌కు కూడా ప్ర‌జావేదిక కేంద్ర స్థానంగా ఉండేది. ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, ఎన్నిక‌ల తర్వాత కూడా టీడీపీ కార్య‌క‌లాపాల‌న్నీ ప్ర‌జావేదిక నుంచే జ‌రిగాయి. టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు అధికారిక భ‌వ‌నం వినియోగించ‌డంపై వైసీపీ ప‌లుమార్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. టీడీపీ అధ్య‌క్షుడి హోదాలో చంద్ర‌బాబు స‌మావేశాల‌ను ప్ర‌జావేదిక‌లో నిర్వ‌హించ‌డాన్ని తప్పుపడుతూ.. వచ్చింది. ఈ క్రమంలో జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత “అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేతను ప్ర‌జావేదిక భ‌వ‌నం నుంచే మొద‌లుపెడుతున్నాం” అని జగన్ ప్రకటించి, 2019 జూన్ 25న కూల్చివేశారు.

ఫైబర్ గ్రిడ్ ఉచ్చులో లోకేష్..వారంలో నోటీసులు?


గత ఐదేళ్ల టీడీపీ పాలనపై అనేక అవినీతి ఆరోపణలు రాగా.. వాటిలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ఒకటి. టీడీపీ ప్రభుత్వం లో ఐటీ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ ఈ ప్రాజెక్ట్ విషయంలో అనేక అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. పరికరాల కొనుగోలు, కాంట్రక్టుల కేటాయింపు విషయంలో నియమాలు పాటించకుండా, కమీషన్స్ వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో ప్రతిపక్షపార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2017లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ప్రజలకు మరియు సంస్థలకు అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ సేవలు అందించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.

నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!

కాగా ఈ ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అవకతవకలు బయటకు తీసే పనిలో వైసీపీ ప్రభుత్వం ఉందట. ఇప్పటికే కీలక ఆధారాలుసేకరించిన అధికారులు లోకేష్ కి వారం రోజులలో నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. మరి అదే జరిగితే అధికారులు ఆదేశాను సారం లోకేష్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. విచారణ సమయంలో ఆయన అవినీతికి పాల్పడినట్లు రుజువైతే అరెస్ట్ తప్పదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే జరిగిన అరెస్ట్ లపై టీడీపీ నానా రాద్ధాంతం చేస్తుండగా… లోకేష్ వరకు వస్తే టీడీపీ నాయకులు దాడి మరింత ఉధృతం చేసే అవకాశం కలదు. ఎవరేమనుకున్నా అనుకున్నది చేసే జగన్, కీలక ఆధారాలు దొరికితే లోకేష్ అరెస్ట్ కి వెనుకాడడు.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

దీనితో ఫైబర్ గ్రిడ్ అవినీతి ఆరోపణల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హీటు రేపుతోంది. లోకేష్ అరెస్ట్ కనుక జరిగితే టీడీపీ వర్గాలలో భయం మొదలవుతుంది. గత ప్రభుత్వంలో అందరు మంత్రుల మధ్య అనుసంధాన కర్తగా లోకేష్ ఉన్నాడు. టీడీపీ ప్రభుత్వంలో ఎవరు ఎటువంటి అవినీతికి పాల్పడినా అది లోకేష్ కనుసన్నలలో, కమీషన్స్ పందారంలో నడిచిన అంశమే. కాబట్టి లోకేష్ అరెస్ట్ కొద్ది మంది మంత్రుల అరెస్ట్ లకు దారి తీసే అవకాశం కలదు. అధికారుల విచారణలో లోకేష్ సమాధానాలపై మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కావున ఫైబర్ గ్రిడ్ అవినీతి వ్యవహారం తెరపైకి రావడం, తెలుగు తముళ్లలో గుబులు రేపుతుంది.

నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!


ఆంద్రప్రదేశ్ లో మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రకంపనలు రేపుతున్నాయి. సస్పెన్షన్ లో ఉన్న నిమ్మగడ్డ బీజేపీ నాయకులతో రహస్య సమావేశంలో పాల్గొనడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాన్ని వైసీపీ ప్రభుత్వంపై జరుగుతున్న కుట్ర అని ఆ పార్టీ నాయకులు వాదిస్తుండగా…నిమ్మగడ్డ వారిని కలవడంలో తప్పేంటి అని టీడీపీ జవాబు ఇస్తుంది. నిజానికి ఈ విషయంలో టీడీపీ ఎందుకు జోక్యం చేసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం. ఇక్కడ నిమ్మగడ్డ కలిసింది..ఒకప్పటి టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మరియు బీజేపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కావడం గమనార్హం. నిమ్మగడ్డ రాజ్యాంగ పదవిలో ఉండి, ప్రైవేటుగా నేతలను కలవడం పెద్ద దుమారం లేపుతుంది.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

ఐతే ఈ వ్యవహారంలో బీజేపీ నేతలు భాగస్వాములు కావడం ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులలో అసహనానికి కారణమైంది. నిమ్మగడ్డతో సుజనా మరియు కామినేని మీటింగ్ వలన బీజేపీ పై ప్రజల్లో చెడు అభిప్రాయం తీసుకొచ్చే సూచనలు కలవని వారు భావిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆంద్రప్రదేశ్ లో ఎదుగుతున్న బీజేపీ పార్టీకి ఇలాంటి సంఘటనలు చేటు చేసే అవకాశం కలదని వారు భావిస్తున్నారు. దీనితో ఈ మీటింగ్ లో పాల్గొన్న బీజేపీ నేతలపై వీరు చర్యలకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం అందుతుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ మరికొందరు సీనియర్ నాయకులు కేంద్రంలో అధిష్ఠానాన్ని కలిసి సుజనా మరియు కామినేనిపై పిర్యాదు చేయనున్నారట.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో తమ అనుమతి లేకుండా నిమ్మగడ్డను రహస్యంగా కలవాల్సిన అవసరం ఏమిటనేది రాష్ట్ర బీజేపీ నాయకుల ప్రశ్న. ఈ రహస్య భేటీ బీజేపీ వర్గాలలో అభద్రతా భావం, మరియు అయోమయానికి గురిచేసినట్లు తెలుస్తుంది. టీడీపీ గవర్నమెంట్ లో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలున్న సుజనా ఈ మీటింగ్ లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేసుల నుండి తప్పించుకోవడానికి మరియు టీడీపీ కోవర్టుగా వ్యవహరించడానికి ఆయన బీజేపీలో చేరాడన్న వాదన ఎప్పటి నుండో ఉంది. ఆయన బీజేపీలో చేరింది చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడానికే అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుజనా రాష్ట్ర స్థాయిలో బీజేపీకి చేటు చేసే ప్రమాదం ఉందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మరి వీరిపై బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

కల్నల్ సంతోష్ బాబు విగ్రహం రెడీ.. చూస్తారా?


భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వానాలోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. చైనా దొంగదెబ్బ తీయడంతో తెలంగాణకు చెందిన సంతోష్ బాబు వీరమరణం పొందాడు. సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు సహా మరో 19మంది అమరులయ్యారు. ఈ ఘర్షణలో చైనాకు చెందిన 40మంది సైనికులు మృతిచెందినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించలేదు.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

భారత జవాన్ల మృతిపై యావత్ దేశం ఘనంగా నివాళి అర్పించింది. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటామని ప్రకటించారు. సంతోష్ బాబు కుటుంబానికి రూ.5కోట్ల భారీసాయం ప్రకటించారు. ఇటీవల సీఎం కేసీఆర్ సూర్యాపేటలోని సంతోష్ బాబు కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. సంతోష్ బాబు పిల్లల పేరిట 4కోట్లు, ఆయన తల్లిదండ్రులకు ఒక కోటి రూపాయాల చెక్కును అందజేశారు. సంతోష్ బాబు భార్యకు బంజార హిల్స్ 711గజాల ఇంటిస్థలం, గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగ నియామక ప్రతాన్ని అందించారు.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

అంతేకాకుండా సూర్యాపేటలో సంతోష్ బాబు గౌరవార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సూర్యాపేటలోని పాత బస్టాండ్ జంక్షన్లో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తుంది. ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శిల్పులు ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. విగ్రహ నిర్మాణం దాదాపు పూర్తయింది. చివరగా విగ్రహానికి తుది మెరుగులు చేస్తున్నారు. ఈ విగ్రహాన్ని త్వరలోనే సూర్యాపేట పాత బస్టాండ్ జంక్షన్ ప్రతిష్టించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

హోంమంత్రి నిర్లక్ష్యం ఎవరి కొంప ముంచనుందో?


తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన హోంమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుండంపై పలువురు మండిపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు తదితరులు ఈ మహ్మమరి బారినపడి మత్యువాత పడుతున్నారు. పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

తాజాగా హోంమంత్రి భద్రతా సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ తేలింది. ఇది ఒకరి నుంచి మరొకరి చేరి భద్రతా సిబ్బందిలో మొత్తం ఎనిమిది మందికి పాటిటివ్ వచ్చింది. ఆయన భద్రతా సిబ్బంది పాజిటివ్ వచ్చిందంటే ఆ చుట్టుపక్కల ఉన్నవారందరికీ ప్రమాదమనే చెప్పక తప్పదు. ఈ తరుణంలో ఆయన ఇంటికే పరిమితమై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా.. దానికి విరుద్ధంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావుడి చేస్తుండటంపై నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జీహెచ్ఎంసీలో రోజురోజుకీ కేసులు పెరుగుతుండగా సామాన్యులంతా ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. సంపన్నులు, నేతలంతా తమ రోజువారీ కార్యక్రమాల్ని సైతం బంద్ చేసుకొని ఎవరికీ వారు ఇంటికే పరిమితమవుతున్నారు. ఎవరూ ఇంటికి రావద్దని కోరుతుండటం గమనార్హం.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

హోంమంత్రి నివాసం ఉండే మలక్ పేట నియోజవర్గంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఆయన భద్రతా సిబ్బందికి పాజిటివ్ తేలింది. ఇలాంటి సమయంలో ఆయన నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావుడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అలీ తీరును ప్రస్తావిస్తూ పోస్టులు చేస్తున్నారు. హోంమంత్రి ఇప్పటికైనా పనుల హడావుడిని పక్కన పెట్టి ఆచితూచి వ్యవహరించాలని కోరుతున్నారు. లేకపోతే ఆయనతోపాటు చుట్టుపక్కల ఉండేవారికి మహమ్మారి ముప్పు తప్పదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

చైనా నుంచి కాంగ్రెస్ కి విరాళాలు ?

చైనా తో సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న తరుణం లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో జరిగిన రెండు సంఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఒకటి 2008 లో కాంగ్రెస్ – చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (MOU). రెండోది , 2006 లో చైనా రాయబార కార్యాలయం నుంచి భారీగా ముట్టిన డొనేషన్. ఈ రెండు ఈ టైం లో కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టేవే. అలాగే శాంతి సంధిలో భాగంగా సియాచిన్ హిమప్రాంతాన్ని నిరాయుధీకరణ చేసే ప్రయత్నం కూడా జరిగిందనేది దేశాన్ని షాక్ కి గురిచేసింది. అది పాకిస్తాన్ కన్నా చైనా కి మేలుచేసే చర్య. 1984 లో భారత్ సియాచిన్ గ్లాసియర్ ని నియంత్రణ లోకి తెచ్చుకున్న తర్వాత చైనా కి కంటకంగా మారింది. పాకిస్తాన్ ద్వారా దీన్ని నిరాయుధీకరణ ప్రతిపాదన చేయించటం లో చైనా పాత్ర ఎక్కువగా వుంది. ఈ మూడు ఘటనలు కాంగ్రెస్ పార్టీ చైనా తో లాలూచీ ని బయటపెట్టాయి.

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్ విడుదలచేసిన వార్షిక నివేదిక లో చైనా రాయబార కార్యాలయం నుంచి ఈ సంస్థకి పెద్దమొత్తం లో షుమారు కోటి రూపాయలు డొనేషన్ ముట్టినట్లు ప్రకటించటం , అదీ ఆ మొత్తం సాధారణ డొనేషన్ల లో చూపించటం విశేషం. ఇతరదేశాలనుంచి డొనేషన్లు స్వీకరిస్తే అవి విదేశీ నియంత్రణ చట్టాల కిందకు వస్తాయి. మరి విదేశీ కరెన్సీ నియంత్రణ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నారో తెలియదు. పై మూడు సంఘటనలు ఒకదానికి ఒకటి ముడి పడి  ఉన్నాయా అనేది పరిశీలకులకు సందేహం. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా వుంది.

ఈ సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా నడుపుతున్నారు. ఈ ఫౌండేషన్ కి సోనియా గాంధీ చైర్ పర్సన్ . డాక్టర్ మన్మోహన్ సింగ్, పి చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ట్రస్టీ లు. ఆ సమయం లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, సోనియా గాంధీ యుపిఏ చైర్ పర్సన్ . ఈ టైం లో ఈ ట్రస్ట్ కి ఎంతోమంది పారిశ్రామికవేత్తల నుండి డొనేషన్లు వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తయితే ఒక విదేశీ రాయబార కార్యాలయం నుంచీ , అదీ మనకు పక్కలో బల్లెమయిన చైనా నుంచి రావటం తో వివాదాస్పదంగా మారింది. ఇందులో నిజా నిజాలు ముందు ముందు మరింత వెల్లడవుతాయి , అప్పటిదాకా వేచి చూద్దాం.

కాంగ్రెస్ బతకాలంటే ఆయన రావాల్సిందేనా?


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక కాలం పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అంతటి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నేడు దిక్కుమొక్కు కరువైంది. ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది.

కాంగ్రెస్ సీనియర్ నేతల్లోని గ్రూపు రాజకీయాల వల్లే తెలంగాణలో పార్టీ కోలుకోలేకపోతుందని విమర్శలున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చామని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అపజయం పాలైంది. ఆ తర్వాత 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ ను కోలుకులేని దెబ్బతీశాడు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ దారుణ పరాజయం పాలైంది.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

నాటి నుంచి ఏ ఎన్నిక తీసుకున్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఏమాత్రం పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన లోక సభ, కార్పోరేషన్, మున్సిపల్, పంచాయతీ, సహకార వంటి ఏ ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఉమ్మడి ఏపీ విడిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోనే ఉంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా ప్రతిపక్ష పార్టీ ఉండబోతుంది. ఇప్పటికే ఆరేళ్లు ఏళ్లు గడిచాయి. కాంగ్రెస్ లోని ముఖ్యనేతలంతా కారెక్కేశారు. ఉన్న కొద్దిపాటి నేతలు గ్రూపు రాజకీయాలు, పీసీసీ పదవీ కోసం పాకులాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయడంలేదని విమర్శలున్నాయి. తొలి నుంచి టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ ను ఢీకోడుతున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చేయాలని భావిస్తోంది. దీనికి కాంగ్రెస్ సీనియర్లంతా మొకాలడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!

ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. కాంగ్రెస్ యూత్లోలోనూ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తిమ్మిని బమ్మి చేసే కేసీఆర్ లాంటి నేతను ఎదుర్కోవాలంటే వాగ్దాటి ఉన్న రేవంత్ రెడ్డినే కరెక్ట్ నేత అని యూత్ నేతలు అంటున్నారు. ఈమేరకు కాంగ్రెస్ యూత్ నేతలు రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. నాడు కాంగ్రెస్ బతికిందంటే వైఎస్ఆర్ వల్లేనని నేడు కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ రెడ్డి రావాలంటూ నినదిస్తున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ల మాటను పక్కనపెట్టి రేవంత్ కు పీసీసీ పదవీ కట్టబెడుతుందో లేదో వేచి చూడాల్సిందే..!

వైసీపీలోకి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు జంప్?


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శాసన మండలి ఇప్పట్లో రద్దయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే శాసన సభ మండలిని రద్దు చేయాలని కోరుతూ శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర పరిశీలించి పార్లమెంట్ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్లును సిద్ధం చేసి లోక్ సభలో ఆమోదించిన అనంతరం రాజ్య సభలో ఆమోదిస్తే గాని మండలి రద్దయ్యే అవకాశం లేదు. కరోనా వైరస్ తో సమస్యలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు అంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

మరోవైపు మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేసి కొద్ది రోజుల కిందట వైసీపీలో చేరారు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. మండలి రద్దు నిర్ణయంతో తొలుత వైసీపీ ఆ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉండదని అందరూ భావించారు. నామినేషన్ దాఖలుకు చివరి రోజు వైసీపీ అభ్యర్థిగా డొక్కాను ప్రకటిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీల్లో కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

ఇదే ఆఫర్ తమకు ఇస్తే పార్టీ మారేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. అధికార పార్టీ అంగీకరిస్తే టీడీపీ నుంచి జంప్ చేసేస్తామంటూ వారి అభిప్రాయాన్ని వైసీపీలోని ఓ ముఖ్య నేతను కలిసి వీరంతా వెలిబుచ్చినట్లు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే బాటలో అధికార పార్టీలోకి మరికొందరు టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లే అవకాశం లేకపోలేదని సమాచారం. పవర్ పాలిటిక్స్ కాబట్టి తప్పులేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు మండలి రద్దయ్యే అవకాశాలు లేకపోవడంతో మండలిలో తమ బలం పెంచుకునేందుకు చర్యలు తీసుకోక వైసీపీకి మరో మార్గం లేదు. శాసన సభలో వైసీపీకి 151 సీట్లు ఉన్నా మండలిలో సరైన బలం లేకపోవడంతో తమకు అవసరమైన బిల్లులు ఆమోదించుకుని చట్టాల రూపంలో తెచ్చుకునే పరిస్థితి అధికార పక్షానికి లేదు. కాబట్టి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీలను రాజీనామా చేసిన అనంతరం ఆ సీటు వారికే ఇచ్చే ఒప్పందంతో పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇది విన్నారా..? పెట్రోల్ కంటే డీజిల్ ధర…!

గత పందొమ్మిది రోజులుగా వరసగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ కన్నా డీజిల్ ధర ఎక్కువ కావడం విశేషం. తాజాగా గురువారం పెరిగిన ధరలతో ఢిల్లీతో సహా పలు చోట్ల డీజిల్ ధర లీటర్ ఎనభై రూపాయలు దాటింది. పెట్రోల్ లీటర్ ధర 79.90 పైసలుగా ఉంది. సాదారణంగా పెట్రోల్ కన్నా డీజిల్ ధరలు ఆరేడు రూపాయలు తక్కువగా ఉండవలిసింది పోయి. భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. ఈ 19 రోజులలో పెట్రోల్ ధర 8.21 రూపాయలు, డీజిల్ ధర 10.62 రూపాయలు పెరిగింది.

వాస్తవానికి 2012 ముందునాటి వరకు డీజిల్ ధర పెట్రోల్‌ ధరలో రెండు నుంచి మూడోవంతు మాత్రమే ఉండేది. 2002 నుంచి 2012 మధ్య పెట్రోల్ రిటైల్ ధరలు డీజిల్ రిటైల్ ధర కంటే ఎప్పుడూ మించలేదు. 2010లో డీజిల్ ధర పెట్రోల్‌ కంటే 28 శాతం తక్కువగా ఉండగా.. మే 2012 నాటికి ఈ రెండిటి మధ్య ధరల్లో వ్యత్యాసం 79 శాతంగా ఉంది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ‘‘రూ.80’’ అనే పదం ట్రెండింగ్‌ గా ఉంటూ వచ్చింది.

దీంతో తాజాగా నెటిజన్లు 2012 నాటి పెట్రోల్ ధరల పెంపుపై అమితాబ్ బచ్చన్ పోస్టు చేసిన ట్వీట్‌ను వెలికి తీశారు.  అప్పట్లో పెట్రోల్ ధర రూ.8 పెరిగినందుకుగానూ బిగ్‌ బీ సైటైర్లు విసిరారు. పెట్రో మంటపై రగిలిపోయిన ప్రజలు తమ కార్లను ఎలా తగలబెట్టాలనుకుంటున్నారో చెబుతూ అప్పట్లో ఆయన విసిరిన వ్యంగ్యాస్త్రం ఇప్పటికీ సరిగ్గా సరిపోయేలా ఉంది. అమితాబ్ ట్వీట్ ప్రకారం.. ‘‘ఎంత పొయ్యమంటారు సర్ పెట్రోల్’’ అని పంప్ అటెండెంట్ అడుగుతాడు.. ముంబై వాసి దానికి బదులిస్తూ, ‘‘2 లేదా 4 రూపాయల పెట్రోల్ కారు మీద చల్లు బ్రదర్.. తగలపెట్టేస్తాను..’’ అంటాడు. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు దీన్ని బయటికి లాగిన నెటిజన్లు ఈ పోస్టుపై తెగ కామెంట్లు గుమ్మరిస్తున్నారు. ‘‘భలే జోక్ సర్.. మళ్లీ ఒకసారి వెయ్యరా ప్లీజ్..’’ అని ఓ నెటిజన్ కోరగా.. ‘‘హలో అబితాబ్ సర్.. మీ ‘జమీర్’ (బిగ్‌ బీ హీరోగా వచ్చిన సినిమా) ఇంకా బతికే ఉన్నాడా..’’ అని మరొకరు ప్రశ్నించారు. ‘‘సర్, ఇప్పుడు మీ కారు పెట్రోల్‌ తో కాదు.. నీళ్లతో నడుస్తోంది..’’ అని మరొకరు ఛమత్కరించగా.. ‘‘భారతీయ సెలబ్రిటీలు నిజాన్ని ధైర్యంగా మాట్లాడేందుకు ఇదే సరైన సమయం…’’ అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!


నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్నా తన తీరు మార్చుకోలేదు. షోకాజ్ నోటీస్ కు ఇచ్చిన సమాధానంతో ఆ పార్టీని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని, తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ జారీ చేశారనే సమాధానంతో పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. తనకు నోటీస్ ఇచ్చిన లెటర్ హెడ్ కు, బ్ ఫామ్ కు తేడా ఉందని స్పష్టం చేశారు. దీంతో షోకాజ్ నోటీస్ కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీపై విమర్శల విషయంలో వెనక్కి తగ్గుతారనే వైసీపీ నేతల ఆశలు ఆడియాశలు అయ్యాయి.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

తనకు ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు చట్ట బద్ధత లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘము నిబంధనల ప్రకారం పార్టీలో సభ్యులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినప్పుడు పార్టీలోని క్రమశిక్షణా సంఘము సమావేశం నిర్వహించి, ఆ అంశాన్ని చర్చించి అప్పుడు నోటీసు ఇవ్వాలన్నారు. అలా ఇస్తే ఆ సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. సమావేశం నిర్వహించకుండా ఇచ్చారు. అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణా సంఘము లేదన్నారు.

తాను గెలుపోపొందిన యువజన శ్రామిక రైతు పార్టీ ప్రాంతీయ పార్టీ అని పేర్కొన్నారు. ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని ప్రశ్నించారు. తనకు షోకాజ్ నోటీస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయ సాయిరెడ్డి పేరుతో వచ్చిందన్నారు.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

అదేవిధంగా ఆయన విడుదల చేసిన వీడియోలో తాను పార్టీని ఎప్పుడు విమర్శించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాల విషయంలో లోటు పాట్లను సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే దొరకపోవడంతో కొన్ని అంశాలు మీడియా ముఖంగా సీఎంకు తెలియజేశానని చెప్పారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు పని చేయలేదన్నారు. అదే విధంగా షోకాజ్ నోటీస్ పై వారం రోజుల్లో సమాధానం ఇమ్మన్నారని తాను ఒక్క రోజులోనే సమాధానం పంపిస్తున్ననట్లు చెప్పారు.

‘దిల్ రాజు’ గారి ఆవేదన !


టాలీవుడ్ లో దిల్ రాజు అనే వ్యక్తి ఒక అగ్ర నిర్మాత.. పైగా థియేటర్ల పై అధికారం సాధించి కొనసాగుతున్న ఒక శక్తి కూడా. కానీ ఎంత శక్తి అయినా ఏదొక రోజు శక్తి కోల్పోవాల్సి వస్తోందనేది పురాణ ఇతిహాసాలు కూడా చెప్పాయి. ఇప్పుడు దిల్ రాజు కూడా శక్తి పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. చేతిలోని థియేటర్లను మెయింటైన్ చెయ్యలేక వాటిని వదిలించుకునే ఆలోచనలో ఉన్నాడు.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

అదే జరిగితే ఇన్నేళ్లు అగ్ర నిర్మాతగా ఈ తరం సినీ నిర్మాణ విభాగానికి ప్రతినిధిగా వస్తోన్న అగ్ర గౌరవం అగ్ర గుర్తింపు ఇక రావడం కష్టమే. ఇన్నాళ్లు తన నిర్మాణ సంస్థే ఒక చిన్న సినీ పరిశ్రమ అన్న స్థాయిలో ప్రమోట్ చేసుకున్న రాజు.. ఇక నుండి నిర్మాతల అందరిలో ఒకడిగా ఉండిపోవాల్సిందే.

పైగా అగ్ర హీరోలతో కూడా దిల్ రాజు ఈ మధ్య చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాడని.. ముఖ్యంగా సినిమా బిజినెస్ విషయంలో స్టార్ హీరోలతో దిల్ రాజుకి తలనొప్పిగా మారిందని… ఒక సూపర్ స్టార్ తో గత సినిమా బిజినెస్ విషయంలో దిల్ రాజుకి అభిప్రాయభేదాలు వచ్చాయని సమాచారం. దానికి కారణం ఈ మధ్య హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నాన్-థియోటర్స్ రైట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఇక థియేటర్ల నుండి వచ్చేది లేదు.. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

మొత్తానికి దీని పై దిల్ రాజు అసహనంగా ఉన్నాడట. కరోనా అనంతరం కూడా ఇది ఇలాగే కొనసాగితే ఇక నిర్మాతకి ఒక రూపాయి కూడా రాదనేది రాజుగారి ఆవేదన. మరి ఇప్పటికైనా సినిమాలకి హీరోలు రెమ్యూనరేషన్ తీసుకుని, నాన్-థియోటర్స్ రైట్స్ తీసుకోవడం మానేయాలి. అయినా లాభాలు వచ్చేవాటిని హీరోలు తీసుకుంటే.. నిర్మాతలకు ఇక సినిమాలు చేసి ఏమి లాభం. పైగా కరోనా లాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలతో సినిమాలు చేయడం అసాధ్యం కూడా.