Homeఆంధ్రప్రదేశ్‌వైఎస్ఆర్ పై ప్రేమ.. జగన్ పై కోపం.. ఎందుకు?

వైఎస్ఆర్ పై ప్రేమ.. జగన్ పై కోపం.. ఎందుకు?


కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అత్యంత సన్నిహితులైన వారు శత్రువులవుతారు. శత్రువులు మిత్రులవుతారు. అందుకే రాజకీయాల్లో విశ్వసనీయత అనేది చాలా తక్కువ. అలాంటి నేతలను గుర్తించి దూరంగా ఉండడం తెలివైన నేతల లక్షణం. ఈ లక్షణం ఏపీ సీఎం జగన్ లో పుష్కలంగా ఉందని నిరూపితమైంది. తన ప్రత్యర్థులెవరు? నమ్మినబంట్లు ఎవరనే విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారట వైఎస్ జగన్. తాజా పరిణామాలు కూడా జగన్ దూరదృష్టికి నిలువుటద్దంగా నిలిచాయి.

నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అప్పట్లో రైట్ హ్యాండ్ లాంటి వారు ఉండవల్లి అరుణ్ కుమార్. వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నన్నీ రోజులు ఆయనతో సాన్నిహిత్యం నెరిపారు. 2004 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి ఎంపీగా ఉండవల్లిని కాంగ్రెస్ తరుఫున నిలబెట్టి మరీ వైఎస్ఆర్ గెలిపించారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెలుగులోకి తెచ్చిన నేత.ఆ తర్వాత తన వాక్చాతుర్యంతో ఏపీ రాష్ట్రంలో ఉండవల్లి ప్రసిద్ది చెందారు.కాంగ్రెస్ తోపాటు అంతర్థానమైపోయారు. వేరే పార్టీలో చేరకుండా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే ఉండవల్లితో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. రామోజీ రావు మార్గదర్శి సామ్రాజ్యంపై ఉండవల్లి దాడి చేసి, దానిలోని చట్టవిరుద్ధమైన అంశాలను బహిర్గతం చేసినప్పుడు ఉండవల్లిలోని ధైర్యం కనిపించింది. న్యాయవాదిగా అతని నేపథ్యం ఇందుకు దోహదపడింది. మీడియా టైకూన్ తో న్యాయ పోరాటంలో అతనికి ఇది చాలా సహాయపడింది. ఇక రాజమండ్రి ఎంపీగా గెలిచిన ఉండవల్లి ఆయన నియోజకవర్గంలో అవినీతి రహిత రాజకీయ నాయకుడిగా పేరొందాడు. అదే సమయంలో తన పదవీకాలంలో గణనీయంగా ఏమీ చేయలేదని, అందువల్ల అతను మంచివాడు కాని ఉపయోగపడడు అని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

ఇప్పటికీ ఉండవల్లిపై రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ మెజారిటీ ప్రజల్లో వ్యతిరేకతే ఉందంటారు. ‘ఉండవల్లి తన పార్టీ అధిపతికి ఎప్పటికైనా ఉపయోగపడే నాయకుడు. ఎందుకంటే ప్రెస్ మీట్స్‌లో తన వక్తృత్వ నైపుణ్యంతో ప్రత్యర్థులపై పంచులతో మీడియాలో హైలెట్ అవుతుంటాడు. కానీ ఒక పాలకుడిగా ప్రజలకు అతడు చేసింది తక్కువ. ప్రజలకు ఉపయోగపడని నాయకుడు. నాడు వైయస్ఆర్ వేవ్ లోనే గెలిచాడు.. సొంతంగా ఎన్నికలలో గెలిచే సామర్థ్యం ఉండవల్లికి లేదు’ ఇప్పటికీ అక్కడి ప్రజలు ఉండవల్లి శక్తిసామర్థ్యాలను విశ్లేషిస్తుంటారు.

అయితే ఏదిఏమైనా చంద్రబాబు పాలనలో 2014 – 2019 మధ్య జరిగిన అవినీతిని బహిర్గతం చేయడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంతో కృషి చేశారనే వాస్తవాన్ని చాలా మంది అంగీకరిస్తున్నారు. విద్యావంతులైన ఓటర్లు ఆయన ప్రసంగాల ద్వారా బాగా ప్రభావితమయ్యారని.. టిడిపిపై ద్వేషం మరియు కోపాన్ని పెంచడంలో ఉండవల్లి వైసీపీకి ఎంతో సాయం చేశారని అంటుంటారు..

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఉండవల్లి తీరు మారింది. వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీ రఘు రామ కృష్ణరాజు, సబ్బాం హరి వంటి వారి సరసన ఉండవల్లి చేరిపోయాడు. తాజాగా ప్రెస్ మీట్ లో జగన్ ప్రభుత్వం గురించి విమర్శించాడు. నెల్సన్ మండేలా కథను ఈ సందర్భంగా వివరించాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తన ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోకుండా పగలు పక్కనపెట్టి మంచి పాలనను మాత్రమే అందించాలని సూచించాడు.

ఎంపీ రఘు రామ కృష్ణరాజు గురించి విలేకరులు అడిగినప్పుడు.., అతను తన స్నేహితుడు కాబట్టి తనపై వ్యాఖ్యానించలేనని ఉండవల్లి పేర్కొన్నాడు. దీంతో ఉండవల్లి ముక్కుసూటి తనం చచ్చిపోయిందని.. ఉండవల్లి కూడా మారిపోయారని వైసీపీ నేతలు ఆడిపోసుకుంటున్నారు. కరోనా కేసుల కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఉండవల్లి ఆరోపించారు. దేశంలోనే ఏపీలో అత్యధిక పరీక్షలను వైసీపీ ప్రభుత్వం చేస్తోంది. అంతేకాదు.. ప్రతి క్వారంటైన్ లో ఉన్న రోగిని ఏపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కోలుకున్న తర్వాత 2000 రూపాయలతో ఇంటికి తిరిగి పంపుతుంది. జేసీ అచ్చెన్నాయుడు అరెస్టులను ప్రతీకార రాజకీయంగా ఉండవల్లి తాజాగా ఎత్తిచూపారు. అచ్చన్నాయుడు ఈఎస్ఐ మందుల కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొంటుండగా, నకిలీ రిజిస్ట్రేషన్ల బస్సులను నడుపుతున్న ఆరోపణలను జేసీ ప్రభాకర్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. వీరి నేరాలకు కోర్టులు కూడా బెయిల్ ఇవ్వని పరిస్థితి నెలకొంది.అలాంటి వారి పక్షాన ఉండవల్లి మాట్లాడడంపై వైసీపీ నేతలు ముక్కునవేలేసుకున్నారు.

వైయస్ఆర్ తో సాన్నిహిత్యం ఉన్నప్పటికీ.. వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రికి స్నేహితుడైన ఉండవల్లిని ఇన్ని సంవత్సరాలు ఎందుకు దూరంగా ఉంచారో ఇప్పటికీ ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తాజాగా సంఘటనలతో అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఉండవల్లి , రఘు రామ కృష్ణరాజు, సబ్బాం హరి వంటి నేతలు వైయస్ఆర్ కు దగ్గరగా లేరు. కానీ వైఎస్ఆర్ ఆత్మ అయిన ఆయన స్నేహితుడు కేవీపీ రామచంద్రరావుకు వీరంతా సన్నిహితులుగా ముద్రపడ్డారు. వారు వైయస్ఆర్ సానుభూతిపరులుగా నటిస్తారు కాని కేవీపీ కోసం పనిచేస్తారనే తెలిసే జగన్ దూరం పెట్టారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular