
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అత్యధిక కాలం పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. అంతటి ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నేడు దిక్కుమొక్కు కరువైంది. ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది.
కాంగ్రెస్ సీనియర్ నేతల్లోని గ్రూపు రాజకీయాల వల్లే తెలంగాణలో పార్టీ కోలుకోలేకపోతుందని విమర్శలున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చామని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడంతో 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అపజయం పాలైంది. ఆ తర్వాత 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ ను కోలుకులేని దెబ్బతీశాడు. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడంతో తెలంగాణలో కాంగ్రెస్ దారుణ పరాజయం పాలైంది.
కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?
నాటి నుంచి ఏ ఎన్నిక తీసుకున్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఏమాత్రం పోటీ ఇచ్చిన దాఖలాలు లేవు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన లోక సభ, కార్పోరేషన్, మున్సిపల్, పంచాయతీ, సహకార వంటి ఏ ఎన్నికలో కూడా కాంగ్రెస్ పార్టీ కనీస పోటీ ఇవ్వలేకపోవడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాడు తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఉమ్మడి ఏపీ విడిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీనే అధికారంలోనే ఉంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా ప్రతిపక్ష పార్టీ ఉండబోతుంది. ఇప్పటికే ఆరేళ్లు ఏళ్లు గడిచాయి. కాంగ్రెస్ లోని ముఖ్యనేతలంతా కారెక్కేశారు. ఉన్న కొద్దిపాటి నేతలు గ్రూపు రాజకీయాలు, పీసీసీ పదవీ కోసం పాకులాడుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయడంలేదని విమర్శలున్నాయి. తొలి నుంచి టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ ను ఢీకోడుతున్న రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చేయాలని భావిస్తోంది. దీనికి కాంగ్రెస్ సీనియర్లంతా మొకాలడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!
ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. కాంగ్రెస్ యూత్లోలోనూ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తిమ్మిని బమ్మి చేసే కేసీఆర్ లాంటి నేతను ఎదుర్కోవాలంటే వాగ్దాటి ఉన్న రేవంత్ రెడ్డినే కరెక్ట్ నేత అని యూత్ నేతలు అంటున్నారు. ఈమేరకు కాంగ్రెస్ యూత్ నేతలు రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. నాడు కాంగ్రెస్ బతికిందంటే వైఎస్ఆర్ వల్లేనని నేడు కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ రెడ్డి రావాలంటూ నినదిస్తున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ల మాటను పక్కనపెట్టి రేవంత్ కు పీసీసీ పదవీ కట్టబెడుతుందో లేదో వేచి చూడాల్సిందే..!