చైనా తో సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న తరుణం లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాం లో జరిగిన రెండు సంఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఒకటి 2008 లో కాంగ్రెస్ – చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందం (MOU). రెండోది , 2006 లో చైనా రాయబార కార్యాలయం నుంచి భారీగా ముట్టిన డొనేషన్. ఈ రెండు ఈ టైం లో కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టేవే. అలాగే శాంతి సంధిలో భాగంగా సియాచిన్ హిమప్రాంతాన్ని నిరాయుధీకరణ చేసే ప్రయత్నం కూడా జరిగిందనేది దేశాన్ని షాక్ కి గురిచేసింది. అది పాకిస్తాన్ కన్నా చైనా కి మేలుచేసే చర్య. 1984 లో భారత్ సియాచిన్ గ్లాసియర్ ని నియంత్రణ లోకి తెచ్చుకున్న తర్వాత చైనా కి కంటకంగా మారింది. పాకిస్తాన్ ద్వారా దీన్ని నిరాయుధీకరణ ప్రతిపాదన చేయించటం లో చైనా పాత్ర ఎక్కువగా వుంది. ఈ మూడు ఘటనలు కాంగ్రెస్ పార్టీ చైనా తో లాలూచీ ని బయటపెట్టాయి.
రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్ విడుదలచేసిన వార్షిక నివేదిక లో చైనా రాయబార కార్యాలయం నుంచి ఈ సంస్థకి పెద్దమొత్తం లో షుమారు కోటి రూపాయలు డొనేషన్ ముట్టినట్లు ప్రకటించటం , అదీ ఆ మొత్తం సాధారణ డొనేషన్ల లో చూపించటం విశేషం. ఇతరదేశాలనుంచి డొనేషన్లు స్వీకరిస్తే అవి విదేశీ నియంత్రణ చట్టాల కిందకు వస్తాయి. మరి విదేశీ కరెన్సీ నియంత్రణ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్నారో తెలియదు. పై మూడు సంఘటనలు ఒకదానికి ఒకటి ముడి పడి ఉన్నాయా అనేది పరిశీలకులకు సందేహం. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా వుంది.
ఈ సంస్థ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా నడుపుతున్నారు. ఈ ఫౌండేషన్ కి సోనియా గాంధీ చైర్ పర్సన్ . డాక్టర్ మన్మోహన్ సింగ్, పి చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ట్రస్టీ లు. ఆ సమయం లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి, సోనియా గాంధీ యుపిఏ చైర్ పర్సన్ . ఈ టైం లో ఈ ట్రస్ట్ కి ఎంతోమంది పారిశ్రామికవేత్తల నుండి డొనేషన్లు వచ్చాయి. అవన్నీ ఒక ఎత్తయితే ఒక విదేశీ రాయబార కార్యాలయం నుంచీ , అదీ మనకు పక్కలో బల్లెమయిన చైనా నుంచి రావటం తో వివాదాస్పదంగా మారింది. ఇందులో నిజా నిజాలు ముందు ముందు మరింత వెల్లడవుతాయి , అప్పటిదాకా వేచి చూద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: China gave donations to congress party
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com