Home Blog Page 8435

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?


వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు పెట్టిన టీడీపీ సానుభూతి పరుడు నలంద కిషోర్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. ఈ నలంద కిషోర్ మరెవరో కాదు… మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు అనుచరుడు కావడం గమనార్హం.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

అయితే తాజాగా తన అనుచరుడి అరెస్ట్ పై గంటా స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న పోస్టింగ్ ను ఫార్వర్డ్ చేసినందుకు తన అనుచరుడిని అరెస్ట్ చేయడం దారుణమని గంటా శ్రీనివాసరావు నిరసన వ్యక్తం చేశారు. ఆ పోస్టును అసలు ఎవరు సృష్టించారో వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాతీసిన పోలీసులకు దిమ్మదిరిగే సమాధానం దొరికిందట..

పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని భావించిన సీఎం జగన్ ఆ అభివృద్ధి పర్యవేక్షణ బాధ్యతను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం సాయిరెడ్డి ఒక ప్రభుత్వ అధికారులు, మంత్రులతో కలిసి ఒక బృందంగా పనిచేస్తున్నారు. ఈ బృందంలోనే ఉన్న ఒక కమ్మ ఆడిటర్ ఈ వివాదాస్పద పోస్ట్ ను చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. విజయసాయిరెడ్డి బృందంలోనే ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా ఈ పోస్టును టీడీపీ నేతలకు, సోషల్ మీడియాకు ఈ కమ్మ ఆడిటరే లీక్ చేశాడని పోలీసులు తేల్చినట్టు సమాచారం.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

ఈ కమ్మ ఆడిటర్ విశాఖను అభివృద్ధి చేసే విజయసాయిరెడ్డి బృందంలో ఆడిటర్ గా పనిచేస్తున్నాడట. ఈయన టీడీపీ, చంద్రబాబు బ్యాచ్ కు లోపాయికారిగా పనిచేస్తున్నాడట.. ఈ కమ్మ ఆడిటర్ విశాఖలో భూకబ్జా కార్యకలాపాలు చేసే ప్రయత్నం చేశారని.. కానీ సాయిరెడ్డి దగ్గర ఆ ఆటలు చెల్లకపోవడంతో ఇలా పోస్ట్ పెట్టి అభాసుపాలు చేయాలని చూశాడని విచారణలో తేలిందట.. ఈయనకు పొరుగు జిల్లాకు చెందిన మరో సీనియర్ వైసీపీ నాయకుడు కూడా సహకరించారని విచారణలో తేలింది. జగన్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఈ నాయకుడు విశాఖపట్నం రాజకీయాలలో పూర్తి పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లో అంతా పారదర్శకంగా జరుగుతుండడంతో తట్టుకోలేక ఇలా ఆడిటర్ ద్వారా ఆయనను అభాసుపాలు చేసే కుట్రకు తెరతీశాడని పోలీసులు భావిస్తున్నారు.

విశాఖలో భూ కబ్జాలు చేయడానికి సహకరించని కారణంగా విజయసాయిరెడ్డిపై పగ తీర్చుకోవడానికే కమ్మ ఆడిటర్ తో చేతులు కలిపి సదురు వైసీపీ సీనియర్ నేత సోషల్ మీడియాలో వారి ప్రతిష్ట దిగజార్చేలా పోస్టులు ప్రచారం చేయించాడని తేలింది. సాయిరెడ్డి, అవంతి ఇద్దరూ విశాఖ బృందంలో ఉండడంతో వీరిద్దరినీ సోషల్ మీడియా ద్వారా అవమానించేలా ఈ పోస్టులు సర్య్కూలేట్ చేసినట్టు సమాచారం.

ఈ పోస్టింగ్ లను షేర్ చేసిన టీడీపీ కార్యకర్త నలంద కిషోర్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఈ నిజాలన్నీ బయటపెట్టినట్టు సమాచారం. కానీ పోస్టింగులు సృష్టించిన నిజమైన నిందితులు ఇప్పుడు సేఫ్ సైడ్ లో ఉండగా.. దానిని షేర్ చేసిన నలంద కిషోర్ బుక్కైపోయాడు. త్వరలోనే ఆ ప్రధాన నిందితులపై కూడా చర్యలు తీసుకునే దిశగా పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నట్టు తెలిసింది. ఇలా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిన వారు ఇప్పుడు కటకటాల బాట పట్టడానికి రెడీ అయ్యారు. రాజకీయ విమర్శలను ఏమాత్రం సహించని విజయసాయిరెడ్డి తన ప్రత్యర్థులకు ఇలా చుక్కలు చూపిస్తున్నారు.

చైనాకు షాక్ ట్రీట్మెంట్ మొదలెట్టిన భారత్..


భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జూన్ 15న భారత సరిహద్దుల్లోని గాల్వానా లోయ ప్రాంతంలో చైనా-భారత్ సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చైనా దొంగదెబ్బతీయడంతో భారత్ జవాన్లు 20మంది వీరమరణం పొందారు. చైనా దాడిని భారత జవాన్లు సమర్ధవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘర్షణలో చైనా సైనికులు 40మంది మృతిచెందినట్లు సమాచారం. సరిహద్దుల్లో భారత జవాన్లను చైనా సైన్యం దొంగదెబ్బతీయడంతో యావత్ భారత్ రగిలిపోయింది.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

అమరులైన వీరజవాన్ల మృతికి వృథాకావొద్దని భారతీయులు పెద్దఎత్తున నినదించారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి జవాన్లకు ఘనంగా నివాళర్పించి చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చైనాను రక్షణపరంగా ఎదుర్కొవడంతోపాటు ఆర్థికంగా దెబ్బతీయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా చైనా వస్తువులను బహిష్కరించాలని భారతీయ నెటిజన్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేపట్టారు. దీనికి భారతీయులు నుంచి అనుహ్య స్పందన లభిస్తోంది.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

ఓవైపు శాంతి చర్చలు అంటూనే భారత జవాన్లపై దొంగదెబ్బ తీసిన చైనాకు గుణపాఠం చెప్పాలని కేంద్రం సైతం సిద్ధమైంది. ఈనేపథ్యంలోనే సరిహద్దుల్లో కమాండర్ స్థాయి అధికారులకు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది. అంతేకాకుండా త్రివిధ దళాలను సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. అయితే ఇటీవల చైనా-భారత్ ఆర్మీ అధికారుల చర్చల నేపథ్యంలో ఇరుదేశాల సైనికులు వెనక్కి వెళ్లేందుకు నిర్ణయానికొచ్చారు.

ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!

మరోవైపు చైనాకు భారత్ షాకిచ్చిందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే చైనా కంపెనీలకు చెందిన పలు కాంట్రాక్టులను కేంద్రం రద్దుచేసింది. చైనా నుంచి దిగుమతులను కట్టడి చేసేందుకు రెడీ అవుతోంది. కఠినమైన నాణ్యతా నిబంధనలు, అధిక టారిఫ్‌ల విధింపుతో చైనా వస్తు దిగుమతులను తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఇప్పటికే 370 ప్రొడక్టులతో ఒక జాబితాను రూపొందించినట్లు సమాచారం. ఈ దిగుమతులపై కఠినమైన నాణ్యత ప్రమాణాలు నిర్దేశించడం ద్వారా వీటిని నిలువరించి చైనాకు షాకిచ్చేందుకు భారత్ రెడీ అవుతోంది.

మహేష్ తో ఫైటింగ్‌కు తమిళ స్టార్ హీరో ఎస్‌!


‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్‌ మూవీ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’తో భారీ హిట్‌ అందుకున్న పరశురామ్‌ ఈ చిత్రానికి డైరెక్టర్. . మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్‌ ప్లస్‌ పతాకాలపై నవీన్‌ యర్నేని, రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి హీరోయిన్‌గా కీర్తీ సురేశ్‌ను ఈ మధ్యే ఫైనల్‌ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో షూటింగ్‌కు వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ… ఈ మూవీలో విలన్‌ రోల్‌పై మాత్రం సస్పెన్స్‌ వీడడం లేదు. బ్యాంకింగ్‌ మోసాల బ్రాక్‌డ్రాప్‌లో సాగే కథ ప్రకారం దీనికి ఓ స్టైలిష్‌ విలన్‌ అవసరం. ఆ పాత్రలో నటించేది ఎవరనే విషయంపై చిత్రబృందం ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. విలన్‌ పాత్రకు ముందు ఉపేంద్ర, ఆ తర్వాత సుదీప్‌ పేర్లు వినిపించాయి. వాళ్లలో ఎవరు నటించిన కోలీవుడ్‌ మార్కెట్‌కు ప్లస్‌ అవుతుందని చిత్ర బృందం భావించింది. కానీ, ఇద్దరూ నో చెప్పారట. దాంతో ఇప్పుడు మరో తమిళ సీనియర్ హీరో అరవింద్‌ స్వామి ని చిత్ర బృందం సంప్రదించిందట.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

తమిళ్‌తో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్న అరవింద్‌ నేరుగా టాలీవుడ్‌లో నటించి చాలా కాలమైంది. 2016లో రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ధృవ’ సినిమాలో స్టయిలిష్‌ విలన్‌గా మెప్పించాడు. ఆ క్రైమ్‌ థ్రిల్లర్లో హీరోతో పోటాపోటీగా ఉండే క్యారెక్టర్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. సినిమాకు చాలా ప్లస్‌ అయ్యాడు. దాంతో, ఇప్పుడు మహేశ్‌ లెవల్‌కు అరవింద్‌ అయితేనే బాగుటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. అరవింద్‌ నటిస్తే తమిళ్‌లో కూడా ఈ మూవీకి క్రేజ్‌ వస్తుంది. ఇదే విషయాన్ని స్వామికి చెబితే అతను ఒప్పుకున్నట్టు టాలీవుడ్‌ టాక్‌. దీనిపై యూనిట్‌ అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ చేయాల్సి ఉంది.

రాజకీయ రంగు పై ఎన్టీఆర్ క్లారిటీ ?


తెలుగు నాట సీనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఓ శక్తి అని ఆయన అభిమానులు భవిష్యత్తులో అందరికీ చెప్పాల్సిన పరిస్థితి రావొచ్చేమో. వచ్చే తరానికి ఆ ఎన్టీఆర్ గురించి పేరు తప్ప ఏమీ తెలియదు. పోనీ ఈ తరం ఎన్టీఆర్ ఉన్నాడు కదా అనుకుంటే.. సినిమాల పరంగా ఈ ఎన్టీఆర్ ని ఆ ఎన్టీఆర్ తో పోల్చి చూడలేం. కనీసం భవిష్యత్తులోనైన పోల్చుకున్నే ధైర్యమైనా చెయ్యొచ్చా అంటే అనుమానమే. అయితే సీనియర్ ఎన్టీఆర్ కి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే తెలుగు సినిమా రంగంలో తాత పేరును పెంచకపోయినా నిలబెట్టిన మాట వాస్తవం. కానీ రోజురోజుకు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం పై అనేక రూమర్స్ వస్తున్నాయి. తారక్ ఇంకా సినిమాల్లో చేయాల్సింది సాధించాల్సింది చాలా ఉందనేది చాలామంది చెప్పే రొటీన్ డైలాగ్. ఇలాంటి టైంలో రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఈ మధ్య తెలుగు తమ్ముళ్లతో పాటు టీడీపీ సానుభూతి పరులు కూడా ఎన్టీఆర్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం బలంగా చేస్తున్నారు.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

కానీ తారక్ సినిమాల గురించి తప్ప ఇంకోటి ఆలోచించట్లేదు అని ఆయన సన్నిహితుల నుండి వివరణలు వినిపిస్తున్నాయి. అయితే తారక్ మాత్రం నేటి రాజకీయం పై తన భావవ్యక్తీకరణ కోసమైనా ఈ మధ్య స్పందించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ దారుణమైన ఓటమిని కూడగట్టుకున్నాక కూడా తారక్ రాజకీయాలు గురించి ఏమి మాట్లాడలేదు. అంతటి దారుణమైన ఓటమినుండి పార్టీని బలోపేతం చేయాలనీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నా.. తారక్ మాత్రం పార్టీకి నైతిక సహాయసహకారాలు కూడా అందించడం లేదనేది టీడీపీ నాయకుల ఆరోపణలు. మొత్తానికి గత కొన్ని నెలలుగా ఎన్టీఆర్ రాజకీయ రూమర్స్ కి, సినిమా విశేషాలకు మధ్య వారధిగా మారిపోయాడు. ఇప్పటికైనా తనకు ఏ రాజకీయ రంగు లేదని తారక్ నిరూపించుకుంటే అది ఆయన సినిమాల కలెక్షన్స్ కే కలిసొస్తుంది. మరి ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తాడా !

‘జనగణమన’పై పూరి క్లారిటీ


వరుస ఫ్లాపుల అనంతరం ‘ఇస్మార్ట్ శంక‌ర్’ చిత్రంతో భారీ విజ‌యం ఖాతాలో వేసుకున్నాడు తెలుగు అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ‘ఫైటర్’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో పాన్‌ ఇండియా మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్‌ యువ నటి అనన్యా పాండే హీరోయిన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ముంబైలో శరవేగంగా జరుగుతున్న షూటింగ్‌ కు కరోనా వైరస్‌ బ్రేక్‌ వేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన పూరి ఈ మూవీతో పాటు ఫ్యూచర్లో చేయబోయే ప్రాజెక్టుల కథ, కథనాలపై దృష్టి పెట్టాడు. చాలా వేగంగా స్క్రిప్ట్ వర్క్‌ పూర్తి చేసే పూరి.. ఈ విరామంలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జ‌న‌గ‌ణ‌మ‌న’పై కూడా దృష్టి పెట్టాడు.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

మహేష్‌బాబు హీరోగా ఈ సినిమా తీయనున్నట్లు గతంలోనే పూరి జగన్నాథ్‌ ప్రకటించాడు. కానీ, ఏళ్లు గడిచినా ఈ మూవీ పట్టాలెక్కలేదు. దాంతో పూరి చిత్రాన్ని పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. కానీ, వాటిని స్టార్ డైరెక్టర్ ఖండించాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేశాడు.అందేకాదు దీన్ని పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తానని చెప్పాడు. దీంతో పూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ విరామంలో ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను పూరి పూర్తి చేశాడట. స్క్రిప్టు అద్భుతంగా వ‌చ్చింద‌ని స‌మాచారం. అయితే ఈ సినిమాను ఏ హీరోతో చేయబోతున్నది పూరి జగన్నాథ్‌ వెల్లడించలేదు. త్వరలో ఈ సస్పెన్స్‌ వీడనున్నట్లు సమాచారం.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం


అరిగిపోయిన బీసీ కార్డును ఇంకా రుద్దుతూనే ఉన్నాడు నారా లోకేష్. అచ్చెన్నాయడు అరెస్ట్ జరిగిన నాటి నుండి ఆయన కులం అనే ఆయుధంతో పోరాటం చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ డీపితో పాటు, చంద్రబాబు, నారా లోకేష్ ట్విట్టర్ డీపీలుగా అచ్చెన్నాయుడు ఫోటో పెట్టుకున్నారు. అలాగే ‘వి స్టాండ్ విత్ అచ్చెన్నాయుడు’ అనే ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. బీసీ నాయకుడు అచ్చెన్న పై కక్ష పూరిత అరెస్ట్ లకు పాల్పడితే వైసీపీలోని బీసీ నాయకులు ఏమి చేస్తున్నారని..ఆయన ప్రశ్నిస్తున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిన నాటి నుండి వస్తున్న ఆరోపణలు, వాటిపైన అసలు నిజాలు పక్కన పెట్టి బీసీ నాయకుల అణచివేత అనే కార్డు పట్టుకు తిరుగుతున్నారు లోకేష్.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

అచ్చెన్నాయుడిది అక్రమ అరెస్ట్ అని ఆయన నిరూపించేలా గట్టి ఆధారాలతో అధికార పక్షాన్ని టార్గెట్ చేస్తే.. ఏమైనా ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా ఈ కులవాద రాజకీయం వలన లోకేష్ కి క్రెడిట్ రాకపోగా, ఇమేజ్ డామేజ్ అవుతుంది. అవినీతి ఆరోపణలను కులరాజకీయాలతో ఎదుర్కొవాలనుకోవడం అవివేకం అవుతుంది. ఓ పక్క స్ఫష్టమైన ఆధారాలతోనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు చెవుతుంటే లోకేష్ మాత్రం అచ్చెన్నాయుడిని వెనకేసుకొని వస్తున్నాడు. ఏ పార్టీ నాయకుడిపై అవినీతి ఆరోపణలు వచ్చినా లేదా అరెస్ట్ లు జరిగినా, సదరు పార్టీకి చెందిన నాయకులు ఆరోపణలు ఖండించి, ఆ నాయకుడిని కాపాడుకొనే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి యొక్క గత చరిత్ర, చిత్త శుద్ధి వంటివి ప్రమాణంగా… అతన్ని కాపాడే ప్రయత్నం జరగాలి. కానీ లోకేష్ బాబు మాత్రం అచ్చెన్నాయుడు విషయంలో కులం కార్డుతో మాత్రమే కాపాడాలని అనుకుంటున్నాడు.

గవర్నర్ కు లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలివే..!

వైసీపీలోని బీసీ నాయకులెవ్వరూ…అచ్చెన్నాయుడు అరెస్ట్ ని ప్రశ్నించరా అని లోకేష్ సోషల్ మీడియా వేదికగా అడగడం ఆయన కుల రాజకీయం ఏస్థాయికి చేరిందో అర్థం అవుతుంది. ఆయన ద్రుష్టిలో అచ్చెన్నాయుడు బీసీ కనుక, అవినీతికి పాల్పడినా… కాపాడుకోవాల్సిన బాధ్యత అన్నీ పార్టీల బీసీ నాయకులకు ఉంది అన్నట్లుగా ఉంది. ఒక వేళ అచ్చెన్నాయుడు నిజంగా ఎటువంటి అవినీతికి పాల్పపడకుంటే..ఆయన నిర్దోషిగా బయటపడతారు. తనపై వచ్చిన ఆరోపణలకు బాధ్యత తీసుకొని న్యాయపోరాటం చేస్తే గౌరవంగా ఉంటుంది. అలా కాకుండా ఇలా కుల ప్రస్తావనతో అవినీతి ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అభాసుపాలు కావాల్సివస్తుంది.

కొత్త అవతారంలో తమన్నా ‘ఆహా’ అనిపిస్తుందా?


మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సపరేటు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోందామె. వయసు పెరిగినా ఆమె జోరు తగ్గడం లేదు. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు స్పెషల్‌ సాంగ్స్‌, గెస్ట్‌ రోల్స్‌తో రెండు చేతులా సంపాదిస్తోంది. ‘ది నవంబర్స్‌ స్టోరీ’ అనే తమిళ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. షూటింగ్‌ పూర్తయి పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటోన్న ఈ వెబ్‌ సిరీస్‌ త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన తమన్నా.. ఓ టాక్‌ షోను హోస్ట్‌ చేసేందుకు రెడీ అయినట్టు సమచారం. దక్షిణాదితో పాటు హిందీలో నటించి అన్ని చోట్లా తనకంటూ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏర్పరచుకున్న తమన్నాతో ఓ టాక్‌ షో చేయించేందుకు బడా నిర్మాత అల్లు అర్జున్‌ ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ‘ఆహా’ పేరుతో ఆయన ప్రారంభించిన తెలుగు ఓటీటీ అంతగా హిట్‌ కాలేదు. అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, జీ5, సన్‌ నెక్ట్స్‌ వంటి పాపులర్ ప్లాట్‌ఫామ్స్‌తో పోటీలో వెనుకబడింది. దాంతో, ‘ఆహా’ను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి అర‌వింద్ ప‌లువురు ద‌ర్శకులు, రచయితలను రంగంలోకి దింపుతున్నాడు. యువ హీరోయిన్స్‌తో వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే హెబ్బా ప‌టేల్, బిందు మాధవి ఓ సిరీస్‌లో నటించారు. మరో యువ నటి పాయ‌ల్ రాజ్‌పుత్ ‘ఆహా’లోకి రానుందట.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

ఈ క్రమంలో వైవిధ్యంగా డిజైన్‌ చేసిన ఓ టాక్‌ షోకు తమన్నాకు హోస్ట్‌ గా ఎంచుకున్నట్టు సమాచారం. ఈ షోలో ఇతర సెలబ్రిటీలు కూడా పాల్గొంటారట. మెగా హీరోలు అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌తో పాటు రవితేజ లాంటి నటులతో ఆమె ముచ్చటిస్తుందనట. దాంతో షో హిట్టవడంతో పాటు ‘ఆహా’కు మంచి ప్రమోషన్‌ లభిస్తుందని అల్లు అరవింద్‌ ప్లాన్‌. కాగా, తమన్నా తెలుగు తాజా చిత్రం ‘దటీజ్‌ మహాలక్ష్మి’ విడుదలకు సిద్ధంగా ఉంది. గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ చిత్రం కూడా చేస్తోంది. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘బోలే చుడియా’ షూటింగ్ పార్ట్‌ పూర్తయింది.

శర్వానంద్‌‌కు విలన్‌గా సిద్దార్థ్!


టాలీవుడ్‌లో ఈ మధ్య మల్టీ స్టారర్ మూవీల హవా నడుస్తోంది. కుర్రాళ్లతో పాటు సీనియర్ హీరోలు కూడా ఈ జానర్లో చేస్తున్నారు. కథ డిమాండ్‌ చేస్తే ఇతర హీరోల మూవీల్లో చిన్న పాత్రలు, చివరకు ప్రతి నాయక పాత్రలకు కూడా రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్‌లో హీరోలు శర్వానంద్‌, సిద్దార్థ ముందుంటారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ‘ఆర్ఎస్‌ 100’తో అనూహ్య విజయంతో టాలీవుడ్‌కు పరిచయమైన యువ దర్శకుడు అజయ్‌ భూపతి దీనికి డైరెక్టర్. తన రెండో సినిమాకే అతను ఓ క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేశాడు. ‘మహా సముద్రం’ టైటిల్‌తో రూపొందే ఈ మూవీలో అదితీ రావు హైదరి హీరోయిన్. అనిల్‌ సుంకర నిర్మాత.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

తన ఫస్ట్‌ మూవీతోనే సక్సెస్‌తో పాటు వెరైటీ పాత్‌ను ఎంచుకున్న అజయ్ అతని రెండో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. దీనిపై రోజుకో వార్త వినిపిస్తోంది. శర్వానంద్, తెలుగులో చాన్నాళ్ల తర్వాత స్ట్రెయిట్‌ మూవీ చేస్తున్న సిద్దార్థ్‌ ఇందులో ప్రాణ స్నేహితులుగా నటిస్తారట. కానీ, ఓ అమ్మాయి కారణంగా బద్ద శత్రువులుగా మారిపోతారట. ఫస్టాప్‌ ఫ్రెండ్షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్టైన్మెంట్‌గా సాగే మూవీ సెకండాఫ్‌కు వచ్చే సరికి అసలైన క్రైమ్‌ జానర్లోకి వెళ్తుందట. తొలి భాగంలో శర్వాతో స్నేహంగా మెలిగే సిద్దార్థ్‌ రెండో భాగంలో విలన్‌గా మారపోతాడని టాలీవుడ్‌ టాక్‌. బలమైన పాత్ర కావడంతో విలన్‌గా నటించేందుకు సిద్దార్థ్‌ ఒప్పుకున్నాడట. ఈ మేరకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయినట్టు సమాచారం. అయితే, దీనిపై డైరెక్టర్ అజయ్‌ భూపతి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వచ్చిన వార్తలు నిజమైతే మాత్రం ఇద్దరు యువ హీరోలు, ఓ యంగ్‌ డైరెక్టర్తో ఓ ఆసక్తికర చిత్రం ప్రేక్షకులను కనువిందు చేయడం ఖాయం.

‘రొమాంటిక్’గా చెప్పేస్తోన్న ఎనర్జిటిక్ స్టార్ !


‘హీరో రామ్’ హీరోగా హిట్ అయి ఏళ్ళు గడిచిపోయినా ఇంకా స్టార్ హీరోగా చలామణి కాలేకపోతున్న ఓ మంచి హీరో. విజయ్ దేవరకొండ లాంటి హీరో కూడా వచ్చిన హిట్ ను వాడుకొని సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుని స్టార్ హీరో అనిపించుకుంటున్నా.. రామ్ మాత్రం ఎప్పుడూ అలా చేయలేదు. కొన్ని సినిమాల్లో ఓవర్ యాక్షన్ చేశాడు గాని, బయట మాత్రం మములు యాక్షనే చేస్తున్నాడు. పైగా మంచి వ్యక్తి అనే ట్యాగ్ లైన్ కూడా సంపాధించుకున్నాడు. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సూపర్ హిట్ తరువాత రామ్, ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

అయితే తనకు మంచి హిట్ మూవీ ఇచ్చిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోసం , పూరి కుమారుడు ఆకాష్ పూరి హీరోగా చేస్తోన్న ‘రొమాంటిక్’ సినిమా కోసం రామ్ వాయిస్ ఓవర్ చెబుతున్నాడు. ఈ రోజు ప్రసాద్ ల్యాబ్ లో రామ్ వాయిస్ ఓవర్ చెబుతున్నట్లు తెలుస్తోంది. రామ్ వాయిస్ ఫుల్ ఎనర్జీ.. అలాంటి రామ్ వాయిస్ తో రొమాంటిక్ మొదలు కాబోతుందంటే ఖచ్చితంగా సినిమాకి ప్లస్ అవుతుంది. కాగా కొత్త దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పూరి నిర్మిస్తున్నారు. కొడుకు కోసం పూరి చేస్తున్న మరో రిస్క్ ప్రాజెక్టు ఇది.

ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!

మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా రాబోతున్న ఈ సినిమాలో సీనియర్ హాట్ బ్యూటీ రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఆకాశ్ పూరి సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరి హిట్ కొడతాడా.. లేక మళ్లీ ప్లాప్ తో తండ్రికి నష్టాలను మిగులుస్తాడా అనేది చూడాలి. అన్నట్టు మాజీ బబ్లీ హీరోయిన్ ఛార్మి కూడా పూరి జ‌గ‌న్నాథ్ సాన్నిహిత్యంలో పూరి టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?


మామూలుగా గవర్నర్ అంటే ఉత్సవ విగ్రహంలా అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. కాంగ్రెస్ హయాంలో రాజ్ భవన్ కదిలేవారు కాదు.. కానీ బీజేపీ హయాంలోని గవర్నర్లు మాత్రం తమ ప్రత్యర్థి పార్టీలను ఈ గవర్నర్లతోనే దెబ్బతీస్తున్నారు. గవర్నర్లను చోదక శక్తిగా ఉపయోగించుకొని ఇప్పటికే కర్ణాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ , రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఇతర ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను గద్దెనెక్కిస్తున్నారు.

భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్

ఈ పరంపరలోనే ఎన్నికల వేళ ప్రధాని మోడీని ఎదురించిన తెలంగాణ సీఎం కేసీఆర్ పై నజర్ పెట్టిన మోడీషాలు ఆయనపై బలమైన తమిళనాడు బీజేపీ నేత తమిళిసైని రంగంలోకి దించారు. తెలంగాణకు గవర్నర్ గా పెట్టారు. రాగానే టీఆర్ఎస్ ప్రభుత్వ లూప్ హోల్స్, వివిధ కార్యక్రమాల్లో వేలు పెట్టి హల్ చల్ చేసిన తమిళ్ సై ఆరు నెలలుగా సైలెంట్ గా ఉన్నారు. కరోనా ప్రభావం కూడా దానికి కారణం.

తాజాగా మళ్లీ గవర్నర్ తమిళ్ సై జూలు విదులుస్తున్నారు.టీఆర్ఎస్ సర్కార్ ను షేక్ చేస్తున్నారు. గులాబీ నేతలకు చమటలు పట్టిస్తున్నారు. గవర్నర్ తమిళ్ సై ఈ కరోనా టైంలోనూ ప్రజలను కలువడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వివిధ తెలంగాణ సమస్యలపై ఆమె స్పందిస్తోంది. ఇటీవలే సోషల్ మీడియాలో యోగా వీక్ ను నిర్వహించింది.

ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!

తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ తమిళ్ సై గాంధీ ఆసుపత్రిని సందర్శించి వైద్య సిబ్బందితో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని ఆమె విమర్శించడం దుమారం రేపింది. తక్కువ కరోనా పరీక్షలు చేయడంపై కూడా కేసీఆర్ సర్కార్ పై అసంతృప్తిని వ్యక్తం చేసింది.

ఇక కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి పోటీగా గవర్నర్ ఏకంగా పీఎం కేర్స్ కు విరాళాలను స్వీకరించడం తాజాగా చర్చనీయాంశమైంది. కోవిడ్ వైరస్ పై పోరాడడానికి ఒంటరిగా విరాళాలు స్వీకరిస్తున్న గవర్నర్ తీరు కేసీఆర్ పై ప్రత్యక్ష దాడిగానే టీఆర్ఎస్ శ్రేణులు పరిగణిస్తున్నారు.

తాజాగా కరోనాపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. కేసీఆర్ వైఫల్యంపై కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు విమర్శించగా.. ప్రధాని మోడీ అసంబద్ద విధానాలు, లాక్ డౌన్ ల సడలింపుల వల్లే ఇలా జరిగిందని టీఆర్ఎస్ మంత్రులు ఎదురుదాడి చేశారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాపై మంత్రి ఈటల హరీష్ రావులు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే తమిళ్ సై కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా చర్యలు చేపడుతుండడం వేడి పుట్టిస్తోంది.

నిర్మాతలు బుద్ధి తెచ్చుకోవడం నేర్చుకోండి !


సినిమాకి ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సింది విలువ, విషయం ఉన్న కంటెంట్. ఈ డిజిటల్ యుగంలో విలువ ఉన్నది కామెడీకే. అయితే విశ్వసనీయత, విషయం ఉన్న కామెడీ స్క్రిప్ట్ లను రాసే వారే లేకుండా పోయారు. ఎవరో ఒకరు రావాలి. సమస్యల వలయంలో బతుకు భయంతో బాధ పడుతున్న నేటి జనరేషన్ కి ఉపశమనం కలిగించే హాస్య బ్రహ్మ కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది. కానీ జంధ్యాల మార్క్ కామెడీ మళ్ళీ వస్తోందా.. ఈవివి మాస్ కామెడీని క్రియేట్ చేసే విజన్ ఎవరికైనా ఉంటుందా ? రావాలని కోరుకోవడం తప్ప మనం ఏమి చేయగలం.

‘ఇఎస్ఐ’ విచారణలో జరిగేది ఇదేనా?

కానీ నిర్మాతలు చేయగలరు. కామెడీ రాసే శక్తి ఉన్నవారికి రెమ్యునరేషన్ ను అమాంతం పెంచాలి. మనం అందరం జబర్దస్త్ లో స్కిట్ లు చూసి బాగా ఎంజాయ్ చేస్తాం. అయితే ఆ స్కిట్ లో నటించే చివరి ఆర్టిస్ట్ సంపాధించే అంత కూడా ఆ స్కిట్ రైటర్ సంపాధించలేనప్పుడు ఎవరు మాత్రం ఎందుకు రైటర్ అవుతాడు. సినిమా అయినా, స్కిట్ అయినా, ఇంకేదైనా అది అందర్నీ మెప్పించాలంటే రైటర్ బాగా రాయాలి. రాసిన రైటర్ కి విలువ లేనప్పుడు విలువైన కామెడీని ఎలా ఆశించిగలం.

నిర్మాతలు దర్శకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవడం నేర్చుకోండి. రైటర్ లను తక్కువ చేసి.. తానూ గొప్ప అనిపించుకోవాలనుకునే దర్శకులు బతుకులు తలక్రిందులు అయిపోయిన సంఘటనలు మనం ఎన్ని చూడలేదు. స్క్రిప్ట్ కు రైటర్ కు విలువ ఇవ్వని నిర్మాతలు నష్టాల కష్టాలతో మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూసి ఈ సినీ మా తల్లి ఎన్నిసార్లు నవ్వుకోలేదు. ఇప్పటికైనా రైటర్ కి తగిన గౌరవం ఇవ్వకపోతే భవిష్యత్తులో వారే దర్శకులు.. వారే నిర్మాతలు. ఎందుకంటే రాబోయే కాలం రైటర్స్ దే. ఎవడు గొప్పగా కామెడీ రాయగలడో వాడికే డిమాండ్ రాబోతోంది.

ఫోన్‌ చేస్తే వచ్చేస్తా అంటున్న తెలుగు హీరోయిన్


తెలుగు తెరపై అచ్చ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడమే అరుదు. ఒకవేళ వచ్చినా సక్సెస్‌ సాధించిన వాళ్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఆ జాబితాలో చేరబోతున్న తెలుగమ్మాయి రీతూ వర్మ. ‘బాద్‌ షా’లో చిన్న పాత్రతో టాలీవుడ్‌కు పరిచమైన ఆమె..‘ఎవే సుబ్రమణ్యం’లో ఓ హీరోయిన్‌గా నటించింది. అయితే, ‘పెళ్లి చూపులు’తో టాలీవుడ్‌పై తనదైన ముద్ర వేసింది. ఆ తర్వాత నిఖిల్‌ సరసన ‘కేశవ’లో మెప్పించింది. అయితే, సరైన బ్రేక్‌ రాకపోవడంతో కోలీవుడ్‌ వైపు దృష్టి పెట్టింది. దుల్కర్ సల్మాన్‌ సరసన నటించిన ఆమె గౌతమ్‌ మేనన్- చియాన్‌ విక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ధ్రువ నక్షత్రం’లో చాన్స్‌ కొట్టేసింది. అదే టైమ్‌లో తెలుగులోనూ ఆమె రెండు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంది.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

నాని సరసన ‘టక్‌ జగదీశ్‌’లో నటిస్తున్న ఆమె.. మరో యువ హీరో శర్వానంద్‌తో తెలుగు, తమిళ్‌లో విడుదల కాకున్న ఇంకో సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాల చిత్రీకరణ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు షూటింగ్స్‌ స్టార్ట్‌ కావడంతో తన చిత్రాల గురించి చిత్రీకరణ గురించి ఆమె ఆలోచిస్తోంది. చిత్ర యూనిట్స్‌ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడు మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు రావాలా అని ఆత్రుతగా ఉన్నానని రీతూ అంటోంది. అయితే, హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడే షూటింగ్స్‌ మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయపడింది. కానీ, మొదలు పెడదామని తన దర్శక, నిర్మాతలు నిర్ణయిస్తే మాత్రం తానూ సరేనంటానని చెప్పింది. వాళ్లు ఫోన్‌ చేస్తే వెంటనే షూటింగ్‌ స్పాట్‌ కు వచ్చేస్తానని అంటోంది.

ఆ లెక్కల్లో కొన్ని బొక్కలున్నాయ్..?

Cmie

 

Cmie

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించి సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎక‌ననీ(సీఎంఐఏ) కొన్ని గణాంకాలను విడుదల చేసింది. ఈ సంస్థ‌ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశ ఆర్ధిక వ్యవస్థ బాగా పుంజుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలో లాక్ డౌన్ పూర్వ‌పు ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయ‌ని ఈ సంస్థ తెలిపింది.

లాక్ డౌన్ కు పూర్వం ఇండియాలో నిరుద్యోగ రేటు 8.5 శాతం వ‌ర‌కూ ఉండేదని, లాక్ డౌన్ విధించ‌డంతో అది ఏకంగా 40 శాతం వ‌ర‌కూ రీచ్ అయ్యింద‌ని ఈ సంస్థ చెబుతోంది. న‌గ‌రాల్లో, ప‌ట్ట‌ణాల్లో భారీగా నిరుద్యోగిత పెరిగిన వైనాన్ని ఆ శాతంతో చెబుతోంది. మే నెల‌లో అలాంటి పరిస్థితి నెల‌కొంద‌ని వివ‌రించింది. అయితే ఇప్పుడిప్పుడు ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చేసింద‌ని ఆ సంస్థ చెబుతోంది. జూన్ మూడో వారానికి నిరుద్యోగ రేటు న‌గ‌రాల్లో 8 శాతానికి చేరుకుంద‌ని, ఒక ద‌శ‌లో 27 శాతం ఉండిన నిరుద్యోగ రేటు ఇప్పుడు ఎనిమిది శాతానికి చేరుకుంద‌ని ఈ సంస్థ చెబుతోంది. అంటే లాక్ డౌన్ పూర్వంలా న‌గ‌రాల్లో మ‌ళ్లీ ఎవ‌రి ప‌ని వారు చేసుకుంటున్న‌ట్టుగా ఈ సంస్థ చెబుతోంది.

ఇంత వరకు వినడానికి బాగానే ఉన్నా.. లాక్ డౌన్ పూర్వ ప‌రిస్థితులు ఏర్ప‌డిపోయానేదే… న‌మ్మ‌శ‌క్యంగానే ఉందా? ఇంకా అనేక ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు పూర్వ‌పు స్థాయిలో ప‌ట్టాలెక్కిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. అయితే ఈ సంస్థ మాత్రం అంతా పూర్వ‌పు స్థితికి వ‌చ్చేసింద‌ని అంటోంది. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో భారత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కుదేలయింది. ప్ర‌త్యేకించి దిగువ, మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు, చిన్న స్థాయి ఉద్యోగులను లాక్ డౌన్ తీవ్రంగా దెబ్బతీసింది. చిన్న చిన్న ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ‌టం, మార్కెటింగ్ జాబ్స్ చేసుకునే వాళ్ల అవ‌కాశాలూ దెబ్బ‌తిన‌డాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇక వ‌ల‌స కార్మికుల కష్టాలు వర్ణనాతీతం. ఈ విధంగా కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. క‌రోనా నివార‌ణ‌కు విధించిన లాక్ డౌన్ క్ర‌మంలో దేశంలో నిరుద్యోగ రేటు గ‌ణ‌నీయంగా పెరిగింద‌ని సీఎంఐఏ కూడా ఒప్పుకుంటోంది.

ఫెయిలైనా విద్యార్థులకు గుడ్ న్యూస్..!


ఈ ఏడాది ఇంటర్మీడియట్లో ఫెయిలైయిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా పరీక్షలను నిర్వహించే అవకాశం లేదని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. ఈనేపథ్యంలో ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ చేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

ఇప్పటికే తెలంగాణ పదో విద్యార్థులందరినీ ప్రభుత్వం పాస్ చేసిన సంగతి తెల్సిందే. ప్రీఫైనల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ చేసింది. కాగా ఇంటర్మీయట్ పరీక్షలు రాష్ట్రంలో లాక్డౌన్ విధించడానికి ముందే అయిపోయింది. దీంతో విద్యార్థులకు కొంత ఊరట లభించింది. అనంతరం లాక్డౌన్ విధించారు. ఆ తర్వాత లాక్డౌన్ సడలింపుల్లో పేపర్ వాల్యుయేషన్ చేసి ఇంటర్ రిజల్ట్ ను జూన్ 18న ప్రభుత్వం విడుదల చేసింది.

ఇందులో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 1,92,172మంది ఫెయిలవగా సెకండ్ ఇయర్లో 1,28,169మంది ఫెయిలయ్యారు. మొత్తంగా 3,20,341మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇంటర్మీయట్ బోర్డు వీరికి ప్రభుత్వం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఇంటర్మీయట్ బోర్డు సప్లమెంటరీ పరీక్ష తేదిలను విడుదల చేయలేదు. మరోవైపు ఏపీలో ఇంటర్మీడియట్ రిజల్ట్ విడుదల చేసి సప్లమెంటరీ తేదిలను ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత సప్లమెంటరీ పరీక్షలను రద్దుచేసి ఫెయిలైన విద్యార్థులందినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులను పాస్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ కు లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్న అంశాలివే..!

ఫెయిల్ విద్యార్థులను ఏవిధంగా పాస్ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంటర్మీయట్ బోర్డు చర్చిస్తుంది. ఫెయిలైన విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలపాలా? లేక కండోనేషన్‌ మార్కులు(సబ్జెక్టుకు 10 నుంచి 15మార్కులు కలపడం) కలపాలా అని ఆలోచిస్తోంది. ఏదోవిధంగా విద్యార్థులందరినీ పాస్ చేసేందుకే ఇంటర్మీయట్ బోర్డు, ప్రభుత్వం మొగ్గుచూపుతుందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

‘ఇఎస్ఐ’ విచారణలో జరిగేది ఇదేనా?


ఇఎస్ఐ స్కామ్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా మరో ముగ్గురు అధికారులను మూడు రోజులు పాటు ఏసీబీ కస్టడీకి తీసుకొని విచారించనుంది. అనారోగ్యం కారణంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలోనే విచారించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించడంతో ఆక్కడ, ఆయన న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు.

భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్

ఈ స్కామ్ లో రూ.150 కోట్లు అవినీతి జరిగిందని అభియోగం మోపిన ఏసీబీ టెలీ మెడిసిన్ కాంట్రాక్టులు కేటాయింపు, చెల్లింపులు, మందులు, ఇతర పరికరాలు, ఫర్నిచర్ కొనుగోళ్ళలో అక్రమాలు చోటు చేసుకున్నామని వెల్లడించింది. ఈ అంశాలను విచారించేందుకు 35 ప్రశ్నలు సిద్ధం చేశారు. మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు విచారణ జరగనుంది.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

ఈ కేసులో అరెస్టు అయిన రమేష్ కుమార్ సహా మరో ఇద్దరు అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ లో ఉన్నారు. వీరు ముగ్గురిని ఏసీబీ అధికారులు రాజమండ్రి జైలులోనే విచారించనున్నారు. ఈ స్కామ్ మంత్రి వత్తిడి వల్లే జరిగిందని అధికారులు గతంలో తెలిపారు. కాంట్రాక్టులు, టెండర్లు ఎవరెవరికి కెటయించాలనే విషయాన్ని మంత్రి తన లెటర్ హెడ్ పై రాసి ఇచ్చారని ఏసీబీ అధికారులు ప్రాధమిక విచారణలో నిర్ధారణ కు వచ్చారు. ఏసీబీ విచారణలో ఇఎస్ఐ అధికారులు మరోమారు ఇదే విషయాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వారు విచారణలో ఈ అంశాలనే వెల్లడిస్తే మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఈ కేసులో చిక్కులు తప్పకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. మంత్రి ఇచ్చే వివరాలను పరిగణలోకి తీసుకుని ఏసీబీ అధికారులు ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

సారూ… నిద్రలేవండి!

Kcr sleep

 

Kcr sleep

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని ప్ర‌తిప‌క్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ప్రస్తుత కాలంలో తెలంగాణ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అనేకమంది నిపుణులు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఉన్న కేసుల సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువైనప్పటికీ.. పెరుగుతున్న కేసుల సంఖ్యతో పాటు ఇప్పటి వరకు నమోదైన గణాంకాలు చూస్తే ముంచుకొస్తున్న కరోనా కల్లోలం కనపడుతుంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ తర్వాత తెలంగాణలో కరోనా విలయతాండవం చేయబోతుందని లెక్కలు చెప్తున్నాయి. తెలంగాణలో చేస్తున్న టెస్టులు, వస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్యను చూస్తే పాజిటివ్ రేటు 15.10శాతం. మహారాష్ట్రలో 17.27శాతం, ఢిల్లీలో 17.31శాతం ఉండగా ఆ తర్వాత తెలంగాణ ఉంది. పైగా తెలంగాణలో టెస్టుల సంఖ్య అతి తక్కువగా ఉంది. టెస్టులు పెంచితే కేసులతో పాటు పాజిటివ్ రేటు కూడా భారీగా పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. గత నాలుగైదు రోజులుగా ఇదే విషయం స్పష్టమవుతోంది.

కరోనా మరణాల రేటు కూడా తెలంగాణలో క్రమంగా పెరుగుతోంది. కరోనా మరణాల రేటు ఎక్కువగా గుజరాత్ లో 6.02శాతం ఉండగా, ఢిల్లీలో 3.45శాతం, మహారాష్ట్రలో 4.70శాతం, మధ్యప్రదేశ్ లో 4.28శాతం, పంజాబ్ లో 2.39శాతం, రాజస్థాన్ లో 2.34శాతం ఉండగా. తెలంగాణలో 2.30శాతం ఉంది. అంటే దేశంలోని టాప్ టెన్ రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఈ గణాంకాలు రాబోయే పెను ముప్పుకు సంకేతమని, టెస్టింగ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గణాంకాలు మరింత దారుణంగా పడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించే హెల్త్ బులెటిన్లలో పారదర్శకత లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. కనీసం వేల సంఖ్యలో కూడా క‌రోనా టెస్ట్‌లు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వైద్యం చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నప్పటికీ వారికి కూడా రక్షణ లేకుండా పోయింది. పీపీఈ కిట్లు, మాస్కులు కూడా లేవని వైద్యులు ఆందోళనకు దిగుతుంటే సీఎం కేసీఆర్, మంత్రులు పట్టించుకున్న పాపాన పోవ‌డం లేదనే విమ‌ర్శ‌లున్నాయి. 10 లక్షల పీపీఈ కిట్లు, మాస్కులు అన్నారు. వాటిని ఎక్కడ పంపిణీ చేశారో తెలియ‌దు. ఇప్పటికైనా సీఎం అబద్దాలు మాని వైద్యులు. పోలీసులు, జ‌ర్న‌లిస్టులలను, రాష్ట్ర ప్రజలను కాపాడాలని కోరుకుందాం…

అలాంటి మాస్కులు వస్తే హాట్ కేకుల్లా..!


కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదనేది సగటు మనిషి ఆవేదన. ఈ మహమ్మరి దెబ్బకు అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు సైతం ఆర్థికంగా కోలుకోలేని దెబ్బే. ఇక సినిమా ఇండస్ట్రీల పరిష్టితి అయితే మరి దారుణంగా ఉంది. సీరియల్ షూటింగ్ చేయటానికి కూడా కరోనా వల్ల భయపడాల్సి వస్తోందంటే.. సినిమాల షూటింగ్స్ గురించి ఇక ఆలోచించుకునే అవకాశమే లేకుండా పోయింది. మొత్తానికి సినిమా వాళ్ళు భయాందోళనకు గురవుతోన్నారు. పైగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నా.. అటు కేంద్ర ప్రభుత్వం గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. అయితే మరణాలు సైతం భారీగా నమోదవుతుండటం కరోనా పట్ల ప్రజలందరిలో ఓ తెలియని నిర్లిప్తం నెలకొని ఉంది.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

ఇక ఈ క్రమంలో ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం అనేది జీవితంలో సర్వసాధారణం అయిపొయింది. సరే ఈ మాస్కులు ధరించినా ప్రజలను అవి కరోనా నుండి ఎంతమాత్రం కాపాడుతాయనేదే ఇక్కడ మరో పెద్ద ప్రశ్న. అయితే ఇప్పుడు ఆ అనుమానాలన్నిటికీ చెక్ పెట్టబోతోంది ఓ ఇజ్రాయిల్ కంపెనీ. తమ కంపెనీ తయారు చేసిన మాస్కులను వాడితే మాత్రం ఇక కరోనా వైరస్ రాదట. ఇప్పటికే తమ మాస్కును ప్రయోగశాలల్లో ప్రయోగించినట్లు కూడా ఆ కంపెనీ పేర్కొంది. నిజంగా ఇలాంటి మాస్క్ లు వస్తే ఇక హ్యాపీగా షూటింగ్స్ చేసుకోవచ్చు.

భారతీయులకు గుణపాఠం చెప్పిన ట్రంప్

ఇంతకీ ఈ మాస్క్ ఎలా కాపాడుతుంది అంటే.. మాస్క్ క్లాత్‌ లోని నానో పార్టికల్స్ ఒకరకంగా శానిటైజర్‌గా పనిచేస్తాయని… మాస్క్‌ వద్దకు వచ్చే అన్ని సూక్ష్మ క్రిములను అవి నాశనం చేస్తాయని తెలుస్తోంది. మొత్తానికి మాస్కుల తయారీలో ఈ ఫార్ములా విజయవంతం అయితే వీటిని త్వరలోనే మార్కెట్లోకి వదులుతారు. ఏది ఏమైనా ఇలాంటి మాస్కులు మార్కెట్లోకి వస్తే మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవడం ఖాయం. ముఖ్యంగా సినిమా వాళ్లకు ఇలాంటి మాస్క్ లు చాల బాగా ఉపయోగపడతాయి.