
గత ఐదేళ్ల టీడీపీ పాలనపై అనేక అవినీతి ఆరోపణలు రాగా.. వాటిలో ఏపీ ఫైబర్ గ్రిడ్ ఒకటి. టీడీపీ ప్రభుత్వం లో ఐటీ మినిస్టర్ గా ఉన్న నారా లోకేష్ ఈ ప్రాజెక్ట్ విషయంలో అనేక అవకతవకలు, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. పరికరాల కొనుగోలు, కాంట్రక్టుల కేటాయింపు విషయంలో నియమాలు పాటించకుండా, కమీషన్స్ వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని, అప్పట్లో ప్రతిపక్షపార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. 2017లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా ప్రజలకు మరియు సంస్థలకు అతి తక్కువ ధరలో ఇంటర్నెట్ సేవలు అందించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
నిమ్మగడ్డ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ ఆంధ్రా బీజేపీ..!
కాగా ఈ ప్రాజెక్ట్ విషయంలో జరిగిన అవకతవకలు బయటకు తీసే పనిలో వైసీపీ ప్రభుత్వం ఉందట. ఇప్పటికే కీలక ఆధారాలుసేకరించిన అధికారులు లోకేష్ కి వారం రోజులలో నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. మరి అదే జరిగితే అధికారులు ఆదేశాను సారం లోకేష్ విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. విచారణ సమయంలో ఆయన అవినీతికి పాల్పడినట్లు రుజువైతే అరెస్ట్ తప్పదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఇప్పటికే జరిగిన అరెస్ట్ లపై టీడీపీ నానా రాద్ధాంతం చేస్తుండగా… లోకేష్ వరకు వస్తే టీడీపీ నాయకులు దాడి మరింత ఉధృతం చేసే అవకాశం కలదు. ఎవరేమనుకున్నా అనుకున్నది చేసే జగన్, కీలక ఆధారాలు దొరికితే లోకేష్ అరెస్ట్ కి వెనుకాడడు.
వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!
దీనితో ఫైబర్ గ్రిడ్ అవినీతి ఆరోపణల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హీటు రేపుతోంది. లోకేష్ అరెస్ట్ కనుక జరిగితే టీడీపీ వర్గాలలో భయం మొదలవుతుంది. గత ప్రభుత్వంలో అందరు మంత్రుల మధ్య అనుసంధాన కర్తగా లోకేష్ ఉన్నాడు. టీడీపీ ప్రభుత్వంలో ఎవరు ఎటువంటి అవినీతికి పాల్పడినా అది లోకేష్ కనుసన్నలలో, కమీషన్స్ పందారంలో నడిచిన అంశమే. కాబట్టి లోకేష్ అరెస్ట్ కొద్ది మంది మంత్రుల అరెస్ట్ లకు దారి తీసే అవకాశం కలదు. అధికారుల విచారణలో లోకేష్ సమాధానాలపై మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కావున ఫైబర్ గ్రిడ్ అవినీతి వ్యవహారం తెరపైకి రావడం, తెలుగు తముళ్లలో గుబులు రేపుతుంది.