
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 2014ఎన్నికలకు ముందే జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. పవన్ కల్యాణ్ మద్దతుతో టీడీపీ 2014ఎన్నికల్లో గెలిచింది. అయితే 2019ఎన్నికల్లో మాత్రం జనసేన-టీడీపీ వేర్వురుగా పోటీచేసి రెండు పార్టీలు దారుణంగా పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీకి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు రాగా అప్పటిదాకా అధికారంలో ఉన్న టీడీపీ కేవలం 23సీట్లు మాత్రమే వచ్చారు. 2019లో వైసీపీ ఫ్యాన్ గాలికి వీయడంతో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలతో ప్రజలను ఆకట్టుకున్నాడు. అన్నివర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూ చేరవుతున్నారు. ఇక ప్రతిపక్ష టీడీపీ వైసీపీపై కౌంటర్లు చేస్తూ నిత్యం మీడియాలో నానుతోంది. ఏపీలో టీడీపీ వర్సస్ వైసీపీగా కన్పిస్తుంది. అయితే జనసేన పార్టీ ఎన్నికల ఓటమి నుంచి ఇంకా తేరుచుకున్నట్లు కన్పించడం లేదు. అడుపదడుపా ఒకటోరెండో కార్యక్రమాలకు పరిమితవడం.. ట్వీటర్లలో పోస్టు పెట్టడం మినహా ప్రత్యక్ష పోరాటాలకు దిగడం లేదని విమర్శలు ఆ పార్టీపై వెల్లువెత్తుతున్నాయి.
ఈనేపథ్యంలో జనసైనికులు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఒత్తిడి పెంచే యత్నం చేస్తున్నారు. పవన్ పాలిటిక్స్ లో యాక్టివ్ లేకపోతే కిందిస్థాయి నేతలంతా వైసీపీ లేదా టీడీపీ వైపు వెళ్లే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేనకు దాదాపు 6శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 10వేల ఓట్ల తేడాతో 35సీట్లను జనసేన కొల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు పవన్ సినిమాల్లోకి వెళ్లారనే సాకుతో ఒక్కొక్కరు ఇతర పార్టీకి జంప్ అవుతున్నారు. గతంలో పవన్ కల్యాణ్ తాను సినిమాలు చేయనని రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఉంటానని ప్రకటించాడని వారు గుర్తుచేసి మరీ పార్టీని వీడుతుండటం గమనార్హం.
వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం
పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జనసైనికులు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. పవన్ సినిమాలతోపాటు పాలిటిక్స్ ఉంటాడని చెబుతున్నారు. అయితే పవన్ యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవడంతో కిందిస్థాయి నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. దీంతో ఒక్కొక్కరు పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలోనే పవన్ కల్యాన్ పార్టీ విషయంలో ఏం ఆలోచిస్తారనేది తేల్చుకునేందుకు జనసైనికులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పవన్ ను త్వరలోనే కలిసి అసలు పార్టీని నడిపిస్తారా? లేదా అని ఖరాఖండీగా అడగాలని డిసైడ్ అని పార్టీవర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇప్పటికే మెగాబ్రదర్ నాగబాబు జనసేన పార్టీకి అంటిముంటనట్లే ఉంటున్నాడు. అప్పుడప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో పార్టీకి సంబంధం లేని పోస్టు పెడుతూ జనసైనికులను ఇరకాటంలో పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవన్ పెద్దన్నయ్య చిరంజీవి వైసీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి మెగాస్టార్ బహిరంగంగానే మద్దతు తెలిపిన సంగతిని జనసైనికులు గుర్తుచేసుకుంటున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ ఇప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ బీజేపీతో పొత్తుపెట్టుకొని ఆ పార్టీని భుజాన మోస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో జనసేన పార్టీ కూడా ప్రజారాజ్యం పార్టీలా మారుతుందా అనే అనుమానం జనసైనికుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయాన్నే పవన్ దృష్టికి తీసుకెళ్లాలని యువ నాయకత్వం భావిస్తుంది. త్వరలోనే జనసేన భవితవ్యం ఏంటో తేలిపోనుందనే టాక్ రాజకీయ వర్గాల్లో విన్పిస్తుంది. దీనిపై పవన్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!