Home Blog Page 8405

ఛాన్స్ లు కోసం హాట్ నెస్ కే యాంకర్ ఫిక్స్ !


జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. ఎన్నో ఆటుపోట్లు భరించి చివరికి హాట్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకుని.. ఆ క్రేజ్ తో చిన్న సినిమాల్లో హీరోయిన్ అయింది రష్మి గౌతమ్. అయితే వెండితెరైనా బుల్లితెరైనా అందాల భామలకు తక్కువ కెరీరే ఉంటుంది. ఈ మధ్యలో వాళ్ల కెరీర్లో ఎప్పుడో ఒకసారి డల్ ఫేజ్ ను భరించాల్సిందే. ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ కూడా అలాంటి దశలోనే ఉందని, అమ్మడు తెగ ఇదైపోతోందట. ఒకపక్క తన కొలీగ్ అనసూయకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ పోతుంటే.. తనకు మాత్రం ఆ రేంజ్ డిమాండ్ రావట్లేదని రష్మీ బాధ పడుతుందట.

అయితే టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రం ఈ ముదురు బ్యూటీకి చెప్పుకోదగ్గ ఆఫర్లు లేవని, అదే అనసూయకైతే స్టార్ హీరోల సినిమాల్లోనూ మెయిన్ క్యారెక్టర్స్ ఇస్తున్నారని, తనకు మాత్రం సైడ్ క్యారెక్టర్ లు కూడా ఎందుకు ఇవ్వట్లేదని కనబడ్డ అందర్నీ అడుగుతుందట. ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటానికి తరచుగా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండాలని, ముఖ్యంగా ఆ ఫోటోల్లో నీ గ్లామర్ ఓ రేంజ్ లో ఉండాలని, మెయిన్ గా నీలో గ్లామర్ ఇంకా తగ్గలేదని నిరూపించుకుంటేనే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఎవ్వరో సెలవిచ్చారట. దాంతో ఇక ఆ పని చేసేయాలని ఈ హాట్ భామ ఫిక్స్ అయిపోయింది.

ఓటీటీలో ‘నవరసాలు’ పండించనున్న సూర్య

నిజానికి రష్మి గౌతమ్ చూపుల్లోనే హాట్ నెస్ ఉన్నా.. అనసూయ భారీ అందాల ముందు రష్మి వయ్యారాలు తెలిపోతున్నాయి. అదే గ్లామర్ ను ఎలివేట్ చేయడంలో అనసూయను మించిపోతే.. టాలీవుడ్ డైరెక్టర్స్ అనసూయ కోసం ప్రత్యేకంగా రోల్స్ రాసినట్టు, రష్మి కోసం కూడా తమ సినిమాల్లో కీలకమైన రోల్స్ రాస్తారు. అలాగే ఆ మధ్య డబ్బులు ఇస్తున్నారు కదా అని, చిన్న చితకా సినిమాల్లో బాగానే హడావుడి చేసింది రష్మి.. మరి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావాలంటే.. ఊరు పేరు లేని సినిమాలకు దూరంగా ఉండాలి. కానీ ఈ అమ్ముడు మాత్రం ఇదంతా పట్టించుకోకుండా ముందుకు పోతే ఉపయోగం ఏముంది !

చినబాబుకు జగన్ పెద్ద స్కెచ్..!


జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక ఓవైపు ప్రజా సంక్షేమ పథకాలతో దూసుకెళుతూనే మరోవైపు ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ హయాంలోని అవినీతి అక్రమాలను బయటికి తీస్తూ ఆపార్టీ నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్నాయుడు, తదితర నేతలను జైలుకి పంపించారు. మరికొందరిని కూడా జైళ్లకు పంపించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నారు. దీంతో ఎప్పుడు ఏవార్త వినాల్సి వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు.

ఇదిలా ఉంటే చిన్నబాబుకు సీఎం జగన్ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మండలిలో టీడీపీ బలంగా ఉండటంతో ప్రభుత్వ బిల్లులు పాస్ చేయకుండా అడ్డుకోగలుగుతుంది. దీంతో సీఎం జగన్ మండలి రద్దు దిశగా పూనుకున్నారు. అయితే అది ఇంకా పూర్తిస్థాయిలో కాలేదు. దీంతో మండలిలో టీడీపీ నేతలను తమవైపు తిప్పుకొని వైసీపీ బలాన్ని పెంచుకుంటోంది. మరోవైపు ఎమ్మెల్సీ లోకేష్ బాబుపై అనర్హత వేటు వేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

జగన్ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడట..!

ఇందుకు టీడీపీ గతంలో తమపై ఉపయోగించిన ఎథిక్స్ కమిటీని అస్త్రంగా ఉపయోగించాలని భావిస్తోంది. లోకేష్ పై అనర్హత వేటు వేయాలంటే బలమైన కారణం చూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం బడ్జెట్ సమావేశాల్లో జరిగిన గొడవని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. సభలో మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్సీలకు మధ్య గొడవ జరిగినప్పుడు లోకేశ్ ఫోన్లో ఫొటోలు తీశారు. ఈ వ్యవహారం అంతా సభలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.

శాసన మండలిలో లోకేష్ బాబు సెల్ ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. లోకేష్ సభ నిబంధనలు ఉల్లంఘించారని వైసీపీ నేతలు అంటున్నారు. దీనిపై ఇప్పటికే లోకేశ్‌పై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి అనర్హత వేటువేసేలా వైసీపీ పావులు కదుపుతోంది. ఒకవేళ చైర్మన్ చిన్నబాబుపై చర్యలు తీసుకుంటే టీడీపీ మండలిలో గట్టి ఎదురుదెబ్బ ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది.

పట్టుబడిన నగదు బాబుదే నంట..

ఇప్పటికే మండలిలో వైసీపీ తన బలాన్ని పెంచుకుంటూ పోతుంది. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికే వైసీపీ మద్దుతు తెలిపారు. తాజాగా చినబాబుపై అనర్హత వేటుపడితే మరికొంతమంది వైసీపీలో చేరడం ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు. ఓవైపు చినబాబుకు చెక్ పెడుతూనే మరోవైపు మండలిలో టీడీపీని మరింత బలహీనం చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళుతుంది. దీంతో మండలి రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కన్పిస్తుంది.

వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ ఆయుధం అదే?


టీడీపీ అధినేత చంద్రబాబుకు నో ఆప్షన్. ఇక అదే ఆయుధమని ఫిక్స్ అయిపోయారట.. అవును.. ఎన్నడూ లేనంత బలంగా అధికార వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. 40 ఇయర్స్ చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే దూసుకొస్తున్న జగన్ ను ఎదుర్కోవడానికి అన్ని అస్త్రాలు వాడేస్తున్న చంద్రబాబుకు ఇక ఎలా ఎదుర్కోవాలని బుర్రబద్దలు కొట్టుకుంటున్నాడట.. ఈ క్రమంలోనే ఇక ఉన్న ఏకైక అస్త్రం అదేనని డిసైడ్ అయినట్టు తెలిసింది.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కునారిల్లుతోంది. వయసైపోయిన చంద్రబాబు ఒకవైపు.. నాయకత్వ పగ్గాలు అందిపుచ్చుకోని నారా లోకేష్ మరోవైపు.. వైసీపీ కేసులు.. అరెస్ట్ లతో చెదిరిపోయిన టీడీపీ నేతలు ఇంకో వైపు టీడీపీ భవిష్యత్ రాజకీయాలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలోనే బాగా ఆలోచించిన టీడీపీ అధినేత.. ఆయన అనుకూల మీడియా పెద్దలు ఇక అదే ఆయుధంగా ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

ఎన్టీఆర్ మామకు మంత్రి పదవీ దక్కేనా?

జగన్ ధాటికి తెలుగుదేశం పార్టీ తన సమస్యలన్నింటికి ఒకే ఔషధం మందులా పనిచేస్తుందని భావిస్తోంది. బలమైన రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి ఒకే ఒక్క ఆయుధంగా ఆలోచిస్తోంది. వైసీపీని ఎదుర్కోవడానికి దానికి మించిన ఆయుధం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఫిక్స్ అయ్యారట..

చంద్రబాబు మరోసారి బీసీ బాధితుల కార్డ్ ను తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. పార్టీ ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు… వైసీపీ ప్రారంభించిన ప్రతీ దాడికి టీడీపీ ఇప్పటివరకు ఈ కార్డును మాత్రమే ఉపయోగిస్తోంది.

ఈఎస్ఐ కుంభకోణంలో సీనియర్ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ బీసీకార్డునే తెరపైకి తెచ్చింది. కానీ ఈ కుంభకోణంలో అచ్చెన్నాయుడు ప్రమేయం లేదని చంద్రబాబు, టీడీపీ ఒక్కసారి కూడా ఖండించలేదు.

అదే విధంగా ఓ హత్యకేసుకు సంబంధించి మచిలీపట్నం మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అరెస్ట్ చేసినప్పుడు అదే బీసీ కార్డును ప్రవేశపెట్టారు.

ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత పితాని సత్యనారాయణ.. అతడి కుమారుడు ఆర్థిక దుశ్చర్యలకు అరెస్ట్ కాబోతున్నారు. ఈ సారి చంద్రబాబు మరోసారి బీసీ కార్డును ఉపయోగించబోతున్నారట..

ఈ మేరకు రెడ్డిలతో బలంగా ఉన్న వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆదినుంచి టీడీపీకి అనుకూలంగా.. ఆలవాలంగా ఉన్న బీసీలనే ప్రయోగించబోతున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రభాస్ ఒక్కడే దిక్కు.. మరి ఒప్పిస్తాడా?


షార్ప్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ప్రస్తుతం ఒక స్టార్ హీరో కావాలి. మరి మెగాస్టార్ చిరంజీవితో ఏకంగా పాన్ ఇండియా లెవల్లో సైరాను తీసిన తరువాత, మళ్ళీ ఏ మిడియమ్ రేంజ్ హీరోతోనో సినిమా చేస్తే.. ఏం బాగుంటుందనే ఫీల్ లో ఉన్నాడు సురేందర్ రెడ్డి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా సురేందర్ రెడ్డికి పేరు లేదు గాని, నిజంగా ఆ రేంజ్ టాలెంట్ ఉన్న డైరెక్టరే. దానిలో ఎలాంటి అనుమానం లేదు. కానీ, సక్సెస్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకునే ఫక్తు కమర్షియల్ ఇండస్ట్రీ అయ్యే సినిమా ఇండస్ట్రీ. అందుకే, సురేందర్ రెడ్డి స్టార్ హీరో కోసం వెతుక్కుంటున్నాడని తెలిసి కూడా ఏ స్టార్ హీరో, ఆయనను పిలిచి అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. పాపం సైరాతో సురేందర్ రెడ్డికి మిగిలింది ఏమి లేదు.

పైగా సంవత్సరాల తరబడి సై సై సైరా అంటూ కాలక్షేపం చేశాడు. ఈ లోపు ఇంకో స్క్రిప్ట్ కూడా తయ్యారు చేసుకోలేకపోయాడు. సైరాకి ముందు సురేందర్ రెడ్డికి మంచి గుర్తింపే ఉంది. సైరా తరువాత కూడా అదే గుర్తింపు, ఆయన రేంజ్ మారలేదు, దానికితోడు ఏ స్టార్ హీరో ప్రస్తుతం ఆయనతో సినిమా చేయడానికి రెడీగా లేదు. కారణాలు ఎన్నో చెప్పొచ్చు, అదే సైరా, బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసి ఉంటే.. సురేంధర్ రెడ్డి కోసం స్టార్ హీరోలంతా క్యూలో ఉండే వారు కాదా… ఏది ఏమైనా సురేంధర్ రెడ్డి స్క్రిప్ట్ సిద్ధం చేసి రెడీగా ఉన్నా.. ఆయనతో వెంటనే సినిమాని స్టార్ చెయ్యటానికి ఏ స్టార్ హీరో ముందుకు వచ్చే పరిస్థితి లేదు. చరణ్ , ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఆల్ రెడీ తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అలాగే తరువాత సినిమాలను ఇప్పటికే ఫిక్స్ అయి ఉన్నారు.

‘ఆర్ఆర్ఆర్’ నుంచి సెన్సేషనల్ అప్‌డేట్..

చివరికి కిక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రవితేజ కూడా గోపీచంద్ మలినేనితో, రమేష్ వర్మతో, ఆ తరువాత నక్కిన త్రినాథరావుతో వరస సినిమాలు చేయడానికి కమిట్ అయ్యాడు. మొత్తానికి ప్రభాస్ అయితేనే సురేంద్ర రెడ్డికి త్వరగా సినిమాని మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. నాగ్ అశ్విన్ తో మాత్రమే ప్రభాస్ కమిట్ అయ్యాడు. ఆ సినిమా ఇప్పట్లో స్టార్ట్ అవ్వదు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న రాధే శ్యామ్ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిందట. అంటే వచ్చే ఏడాది మొత్తం ప్రభాస్ ఖాళీ. మరి సురేంధర్ రెడ్డి గాని, ప్రభాస్ కి నచ్చే కథ పట్టుకెళ్ళితే అవకాశం ఉంటుంది. ఒకరకంగా ఇప్పుడున్న పరిస్ధితుల్లో ప్రభాస్ ఒక్కడే దిక్కు.

‘బన్నీ’.. సుకుమార్ ని కంట్రోల్ పెట్టు !


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమా చేద్దామని ప్లాన్ చేసుకొని షూటింగ్ మొదలుపెట్టాలనుకునే లోపు ఎంట్రీ ఇచ్చింది కరోనా. దాంతో బన్నీ పాన్ ఇండియా కలలు మరో ఏడాది దాకా నెరవేరేలా కనబడటం లేదు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ గా ముద్ర సంపాధించిన సుకుమార్ మాత్రం ఈ సినిమా పై రోజుకొక రకంగా మార్పులు చేర్పులు అంటూ హడావుడిగా ఉన్నాడు. దీనికి తోడు తన రైటర్ టీమ్ తో స్క్రిప్ట్ ను పోస్ట్ మార్టం చేస్తున్నాడు. అసలుకే సంవత్సరాలు తరబడి కథలు రాసే సుకుమార్, మళ్ళీ కథలో మార్పులు చేస్తూ పోతే అనవసరమైన విషయం ఎక్కువై, సినిమాలో మెయిన్ కంటెంట్ దెబ్బ తినే ప్రమాదం లేకపోలేదు. సుకుమార్ మహేష్ తో చేసిన నేనొక్కడినే అదే బాపతు సినిమా. ఇప్పుడు పుష్పకి అదే గతి పడితే ఎలా.. ఎందుకైనా మంచింది బన్నీ , సుకుమార్ ని స్క్రిప్ట్ విషయంలో కంట్రోల్ పెట్టడం మంచింది.

చిరు చెల్లి పై రూమర్స్.. ఫైనల్ చేయలేదు !

ఇక అక్టోబర్ సెకెండ్ వీక్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి రావటం, అలాగే సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువుగా ఉండటం, షూటింగ్ కి ఎక్కువమంది సిబ్బంది అవసరం కావడంతో ఏమి చేయాలా అని యూనిట్ తర్జనభర్జన పడుతోంది. పైగా అటవి ప్రాంతంలో షూట్ చేయాలి. అందుకే మొదట బన్నీ – రష్మిక పై సాంగ్స్ ను షూట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో మాత్రం ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ ను షూట్ చేస్తారు.

అన్నట్టు ఈ ఐటమ్ పాట కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకున్నారు. ఇక ఎలాగూ తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటించడానికి మొదట ఒప్పుకుని, ఆ తరువాత కరోనాతో డేట్స్ ఎడ్జెస్ట్ కాలేదు అంటూ బన్నీకి హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నను తీసుకున్నారు. అన్నిటికంటే మ్ముఖ్యంగా ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటంతో మ్యూజిక్ పై అంచనాలు పెరుగుతున్నాయి.

నాని మౌనం వెనుక కారణాలెంటీ?


కొడాలి నాని సడెన్ గా సెలైంటయ్యారు.. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరున్న నాని ఒక్కసారిగా సైలంటవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో కొన్నాళ్లు పని చేసి చంద్రబాబుతో విబేధించి వైసీపీలో చేరారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా చంద్రబాబును చెడుగుడు ఆడుకోవడంలో నాని తర్వాతే ఎవరైనా అనే టాక్ ఏపీలో రాజకీయాల్లో తరుచూ విన్పిస్తుంటుంది.

జగన్ సీఎం అయ్యాక కొడాలి నానికి మంత్రి పదవీ దక్కింది. మాములుగానే ఆయన ఫైర్ బ్రాండ్.. దానికితోడు మంత్రి పదవీ దక్కడంతో ఇక చంద్రబాబుపై ఓ రేంజ్లో పంచ్ డైలాగులతో విరుచుపడేవారు. వీటిలో కావాల్సినంత మసాలా ఉండేదనుకొండి.. అదేవేరే విషయం.. అయితే కొద్దిరోజులుగా నాని మౌనం పాటిస్తున్నారు. సడెన్ గా ఆయన సైలంట్ అవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

నాన్న వైఎస్ఆర్ పై జగన్ కు ఎంత ప్రేమ ఉంది?

టీడీపీ నాయకులు సీఎం జగన్, ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు నాని దీటైన సమాధానం ఇచ్చేవారు. ప్రజావేదిక కూల్చివేత, రాజధాని రైతులు, అమరావతి ఇష్యూలో కొడాలి నాని తెలుగు తమ్ముళ్లను, ప్రధానంగా చంద్రబాబును ఓ ఆటాడుకునేవారు. కాగా కొద్దిరోజులుగా టీడీపీ నేతలు ప్రభుత్వం గట్టిగా విమర్శలు చేస్తున్న నాని మౌనంగానే ఉంటున్నారు. నిమ్మగడ్డ ఇష్యూ నుంచి కొడాలి స్పీడ్ తగ్గించారనే మాట విన్పిస్తుంది.

అయితే నాని పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. దీనిని నాని సన్నిహితులు ఖండిస్తున్నారు. నానికి ఎలాంటి అసంతృప్తిలేదని కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. గుడివాడలో ఆయన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. నిత్యం సీఎం కార్యాలయానికి వస్తున్నారని ఆయన ప్రెస్ మీట్ పెట్టే స్థాయిలో టీడీపీ విమర్శలు లేవని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రత్యర్థులు కోరుకుంటున్నట్లు నాని తనస్టైల్లో కౌంటర్ ఎప్పుడిస్తారో చూడాలి..!

వ్యాయామం చేయండి.. లేకపోతే అంతేనట!

Exercise

Exercise

కరోనా దెబ్బతో గత ఆరేడు నెలలుగా ఇంటికే పరిమితమైన వాళ్ళు ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.  శరీరానికి వ్యాయామం లేకుంటే దాని వలన అనేక సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇంటికే పరిమితమై పనులు చేస్తున్నారు.  దీంతో శరీరం గురించిన శ్రద్ద తగ్గిపోయిందని సర్వేలు చెప్తున్నాయి. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పటికీ తప్పనిసరిగా కనీసం 30 నిముషాలు వ్యాయామం చేయాలనీ నిపుణులు సూచిస్తున్నారు.

ఇలా చేయడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా,  శరీరంలో వ్యాధినిరోధక శక్తి  పెరుగుతుంది.  ఫలితంగా కరోనా నుంచి బయటపడొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  వ్యాయామం చేయని వ్యక్తుల్లో చాలా వరకు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.  ఊబకాయంతో పాటుగా మనిషిలో క్రమంగా మతిమరుపు కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   ఊబకాయం వలన ప్రపంచంలో ప్రతి ఏడాది 5.3 మిలియన్ మంది మరణిస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయి.  ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే వ్యాయామం తప్పనిసరి చేయాల్సిందే.  ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ప్రతిరోజూ చిన్న చిన్న వ్యాయామాలు చేయాలని  నిపుణులు సూచిస్తున్నారు.

రాజధానిలో కుప్పలు తెప్పలుగా టు-లెట్లు!

Tolet board

Tolet board

హైదరాబాద్‌ మహానగరంలో ఒకప్పుడు అద్దె ఇంటి కోసం రోజుల తరబడి వెతికే పరిస్థితి నుండి ఇప్పుడు ఎటు చూసినా అద్దె ఇల్లు దొరికే స్థితికి వచ్చింది. ఒకప్పుడు అద్దె ఇళ్లకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. టు-లెట్ బోర్డు పెట్టడం ఆలస్యం.. వెంటనే ఆరాలు మొదలవుతాయి. ఇల్లు ఫిల్ అయిపోతుంది.

కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తోంది. ఈ నగరంలో కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతుండటం.. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో జనాలు భయపడి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. వలస కార్మికులే కాదు.. మిగతా వాళ్లు కూడా హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగిస్తున్నారు.

ఐతే లాక్ డౌన్ దెబ్బకు అందరి ఆదాయాలూ దెబ్బ తిన్నాయి. ఉపాధి పోయింది. దీంతో సామాను ఇక్కడే పెట్టి భారీగా అద్దె కట్టే పరిస్థితి కూడా లేదు. అలాగని సామానంతా తీసుకుని సొంతూర్లకూ వెళ్లలేరు. అదంత తేలికైన విషయం కాదు. తిరిగి సామానంతా ఇక్కడికి తెచ్చుకోవడమూ కష్టమే. ఈ నేపథ్యంలో ఇలాంటి వాళ్లందరూ సామాను పెట్టుకోవడం కోసమే వెలసిన గోడౌన్లను ఆశ్రయిస్తున్నారు. ఇంటి సామాను పెట్టి నెలకు ఇంత అని తక్కువ మొత్తంలో అద్దె వసూలు చేసే గోడౌన్లు ఇటీవల చాలా తయారయ్యాయి.

వివిధ వ్యాపారాల కోసం ఉపయోగించే గోడౌన్లు చాలానే ఈ మధ్య ఖాళీ అయిపోయాయి. వాటిని ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థలు టేకోవర్ చేస్తున్నాయి. ఇంటి అద్దెతో పోలిస్తే తక్కువ మొత్తంతో ఇక్కడ సామాను పెట్టుకుని లాక్ చేసుకునే సౌలభ్యం కనిపిస్తుండటంతో జనాలు వాటిని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లో టు లెట్ బోర్డులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అద్దెలు తగ్గిస్తున్నా సరే.. జనాలు అద్దె ఇళ్లలోకి రాకపోతుండటంతో యజమానులు నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

ఎన్టీఆర్ మామకు మంత్రి పదవీ దక్కేనా?


ఏపీలో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ పదవులను దక్కించుకునేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. సీఎం జగన్ దృష్టిలో పడేందుకు శతవిధలా ప్రయత్నిస్తున్నారు. జగన్ కరుణిస్తే తమకు మంత్రి పదవీ దక్కడం ఖాయమని లెక్కలేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు మంత్రి పదవులకు బోలెడన్నీ పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్ మామగా నార్నె శ్రీనివాసరావు అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి నార్ని శ్రీనివాసరావుకు ఏకైక కూతురు. చంద్రబాబుతో ఉన్న బంధువుత్వంతో ఆయన గతంలో టీడీపీ పని చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా ఆయన టీడీపీలో ఎక్కడా కన్పించలేదు. వీరిమధ్య ఏం జరిగిందో ఏమోగానీ 2019ఎన్నికల్లో వైసీపీ తరఫున నార్న శ్రీనివాసరావు పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నాన్న వైఎస్ఆర్ పై జగన్ కు ఎంత ప్రేమ ఉంది?

2019ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి నార్నె శ్రీనివాసరావు గట్టిగానే ప్రయత్నించారు. జగన్మోహన్ ఫ్యాన్ గాలి ఏపీలో జోరుగా వీయడంతో ఆ ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చవిచూసింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పార్టీకోసం కష్టపడిన వారందరికీ పదవుల పంపకం చేశారు. ఆఖరికి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి కూడా తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక నార్నె శ్రీనివాస యాక్టివ్ గా ఎక్కడ కన్పించడం లేదనే టాక్ విన్పిస్తుంది.

నందమూరి ఫ్యామిలీకి చెందిన లక్ష్మీ పార్వతికి సైతం పదవీ కట్టబెట్టిన జగన్ నార్నెకు ఏ పదవీ ఇవ్వకపోవడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే నార్నె శ్రీనివాసరావుపై కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ ఉండటం లేదని ప్రచారం జరుగుతోంది. దీంతోనే ఆయన జగన్ ఎలాంటి పదవీ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే నందమూరి ఫ్యామిలీతో చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు నార్నెకు కూడా ఏదైనా పదవీ జగన్ ఇవ్వచ్చనే టాక్ విన్పిస్తుంది.

ప్రస్తుతం మంత్రి పదవులు పంపకం ఉండటంతో నార్నెకు ఛాన్స్ ఉండే అవకాశం ఉందని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ సమీకరణాల దృష్ట్యా కేవలం జగన్ పెద్దగా ప్రయోగాలు చేయకపోవచ్చని టాక్ విన్పిస్తుంది. జగన్ మరోసారి క్యాబినెట్ విస్తరిస్తే నార్నె శ్రీనివాసరావుకు మంత్రి పదవీ లేదా క్యాబినెట్ హోదా కలిగిన పదవీ తప్పక దక్కుతుందని వైసీపీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. అయితే ఎన్టీఆర్ మామ జాక్ పాట్ కొడుతారా? లేదో వేచి చూడాల్సిందే..!

5జి వెనుక ముఖేష్ అంబానీ వ్యూహాలు?

Mukesh ambhani

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్జానంతో తమ కంపెనీ 5జి నెట్‌వర్క్‌ ను సిద్ధం చేసిందని ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. అందుకు ముఖేష్ అంబానికి రెండు వ్యూహాలు ఉండొచ్చు.. అందులో ఒకటి ఆత్మనిర్భర భారత్‌ ఆలోచనకు దగ్గరగా ఉండాలని, రెండవది చైనా దిగ్గజ కంపెనీ హువావే సంస్థ భారత్‌ లో 5జి విస్తరణ ప్రయత్నాలకు ఇది గండికొట్టాలని కావొచ్చు. ఏది ఏమైనా ముకేశ్ అంబానీ పెట్టుబడుల వేటగాడు. గత మూడు నెలల కాలంలో ఆయన 11మంది భారీ ఇన్వెస్టర్లను ఆకర్షించి తన సంస్థలోకి 20బిలియన్‌ డాలర్ల సొమ్మును రాబట్టగలిగారు.

ఈ మొత్తం ద్వారా ఆయన 21బిలియన్‌ డాలర్ల సంస్థ అప్పులను తీర్చడమే కాకుండా ఈ-కామర్స్‌ రంగంలో దిగ్గజాలైన అమెజాన్‌లాంటి సంస్థలకు దీటుగా ఇండియాలో విస్తరించాలని భావిస్తున్నారు. ఫేస్‌ బుక్‌, వాట్సప్‌ లకున్న 40 కోట్లమంది కస్టమర్లను దేశంలోని చిల్లర దుకాణాలకు అనుసంధానం చేయడం ద్వారా తన రిలయన్స్‌ మార్ట్‌ ను మరింత విస్తరించాలని అంబానీ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏప్రిల్‌ నెలలో ఫేస్‌బుక్‌ సంస్థ 6బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని రిలయన్స్‌లో పెట్టడనికి ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ కారణంగా చైనాతో వ్యాపార సంబంధాలను సమీక్షించాలని భారత్‌ భావిస్తోంది. ఇండియాలో అత్యంత వేగంగా విస్తరించిన మొబైల్‌ నెట్‌వర్క్‌ గా మారిన రిలయన్స్‌ జియో గత సంవత్సరమే నంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది.

2016 సెప్టెంబర్‌ లో కార్యక్రమాలు ప్రారంభించిన రిలయన్స్‌ జియో, సుమారు 40 కోట్లమంది సబ్‌స్క్రైబర్లను సాధించి రికార్డు సృష్టించింది. రాబోయే మూడేళ్లలో 50 కోట్ల కస్టమర్లకు చేరువ కావాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో కిరాణ సరుకులను ఇంటింటికి చేర్చే మార్కెటింగ్‌ వ్యవస్థను సిద్ధం చేస్తామని జనవరిలో రిలయన్స్‌ ప్రకటించింది. ఇది ఇండియాలో అమెజాన్‌కు పోటీ సంస్థ కానుంది. మార్కెట్‌ విస్తరణకు ఇండియాలో మంచి అవకాశాలు ఉన్నాయని అమెరికా టెక్నాలజీ కంపెనీలు భావిస్తున్నాయి. 2022నాటికి ఇంటర్నెట్ యూజర్లు 85కోట్లు దాటే అవకాశం ఉందని ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్‌ సంస్థ అంచనా వేసింది. జియో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కు అధిపతి అయిన ముకేశ్‌ అంబాని ప్రస్తుతం ప్రపంచ కోటీశ్వరులలో 9వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్‌ మేగజైన్‌ అంచనాల ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ 68.7 బిలియన్‌ డాలర్లు.

అప్పలరాజుకు మంత్రి యోగం?


ఏపీలో ఇప్పుడెక్కడ చూసిన జగన్ క్యాబినెట్లో ఎవరికీ అవకాశం దక్కుతుందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుత సమచారం మేరకు జగన్ క్యాబినెట్లో ఇద్దరికి మాత్రమే చోటు దక్కనుందట. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా క్యాబినెట్లో మార్పులు పెద్దగా చేయకపోవచ్చని టాక్ విన్పిస్తోంది. అయితే ఆశావహులు మాత్రం తమకే మంత్రి పదవీ దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.

శాసనమండలి రద్దు నిర్ణయంతో జగన్ క్యాబినెట్లోని ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి వచ్చింది. వీరిస్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. జగన్ తొలిసారి క్యాబినెట్ భర్తీ చేపట్టినపుడే అన్ని కులాలు, ప్రాంతాలు, వర్గాలు లెక్కవేసుకొని పదవుల పంపకం చేపట్టారు. సామాజిక లెక్కల కారణంగానే పార్టీలోకి కొందరి వీరవిధేయులకు కూడా మంత్రి పదవీ దక్కలేదు. అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో జగన్ క్యాబినెట్ పై ప్రతిపక్షాలు సైతం నోరుమెదపకుండా ఉన్నాయి.

వంశీ అందుకే వెనక్కి తగ్గడా?

జగన్ ఏడాది పాలన పూర్తయ్యేనాటికి క్యాబినెట్లో రెండు మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. వీటి భర్తీతోపాటు కొంతమందిని తప్పించి మరికొందరికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే దీనిపై సీఎం జగన్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఖాళీ అయిన స్థానంతో ఎవరినీ తీసుకుంటారనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్ గానే కొనసాగుతోంది. కొత్త మంత్రుల విషయంలో రోజుకో కొత్తపేరు తెరపైకి వస్తోంది. తాజాగా సిక్కోలు జిల్లా పలాసాకు చెందిన డాక్టర్ సీదరి అప్పరాజు పేరు తెరపైకి వచ్చింది.

జగన్ క్యాబినెట్లో ఖాళీ అయిన రెండు పోస్టుల్లో అప్పలరాజుకు అవకాశం దక్కనుందని టాక్ విన్పిస్తోంది. అప్పలరాజు వృత్తి రీత్య డాక్టర్ కావడంతో ప్రజల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. గతంలోనే ఆయన మంత్రి పదవీ లభిస్తుందని ఆశించారు. అయితే మండలి నుంచి ఎన్నికైన మోపిదేవీ రమణకు మంత్రి పదవీ దక్కింది. అయితే తాజాగా ఆయన మంత్రి పదవీ ఖాళీ అవడంతో అప్పలరాజుకే అవకాశం దక్కుతుందని అందరూ భావిస్తున్నారు.

మత్స్య సామాజిక వర్గం కూడా ఆయనకు కలిసి రానుందని లెక్కలు వేసుకుంటున్నారు. జగన్ దృష్టిలోనూ అప్పలరాజుకు మంచి గుర్తింపు ఉండటంతో ఈసారి ఆయనకే అవకాశం దక్కతుందని సిక్కోలువాసులు ఘంటాపథంగా చెబుతున్నారు. మరీ సీఎం జగన్ లెక్కల్లో అప్పలరాజు ఉన్నాడో లేదో వేచిచూడాల్సిందే..!

కేసీఆర్ మౌనం వెనుక పెద్ద వ్యహమే ఉందా?

CMKCR in Pragathi Bhavan

CMKCR in Pragathi Bhavan

రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై కమలనాథులు రెచ్చి పోతున్నారు. కోవిద్ ని కట్టడి చేయడంలో టిఆర్ఎస్ సర్కార్ విఫలమైందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం కెసిఆర్ ఇప్పుడు ఎదుర్కొంటున్న విమర్శలు తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఎదుర్కోలేదనే టాక్ నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండడం…. దూకుడైన బండి సంజయ్ పగ్గాలు చేపట్టడంతో బిజెపి నలువైపులా కేసీఆర్ ను చుట్టుముడుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల అద్వాన పరిస్థితిని ఎత్తి చూపడం, అతి తక్కువ సంఖ్యలో టెస్టింగ్ ని హైలైట్ చేయడం మరియు కెసిఆర్ పాలన పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ తమిళసై ని రంగంలోకి దించడం వంటి చర్యలతో టిఆర్ఎస్ ను విపరీతంగా ఇబ్బందిపెడుతోంది.

అయితే సీఎం కేసీఆర్ కూడా బీజేపీ పై తనదైన శైలిలో బిజెపికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నాడు. విషయం ఏమిటంటే తెలంగాణపై దూకుడుగా వెళ్తున్న కమల దళానికి కాంగ్రెస్ తో చెక్ పెట్టే వ్యూహాన్ని కేసీఆర్ తెరమీదకు తెచ్చాడు. ఇప్పుడు కెసిఆర్ మరియు అతని మంత్రులు, అధికార పార్టీ నేతలు బీజేపీ విమర్శలపై పెద్దగా స్పందించడం లేదు. కేవలం కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ పై ఘాటయిన కౌంటర్లు ఇస్తూ బిజెపి వారిపై వ్యూహాత్మక మౌనం నిర్వహిస్తున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే కాని అసలు బిజెపిని తాము లెక్కలోకి తీసుకోమన్నట్లు వ్యవహరిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసే పనిలో ఉన్నారు. ఇలా మానసికంగా దెబ్బతిన్న బిజెపి చివరికి అరిచి అరిచి ఓపిక నశించి కామ్ అవుతుందన్నది కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.

అందుకే తాజాగా కరోనా కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలు ధర్నాలను సులువుగా పర్మిషన్లు ఇస్తోందట టీఆర్ఎస్ సర్కార్. అంతకుముందు అస్సలు అనుమతి ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ఆందోళనలకు అధికారులు ఆటంకం కలిగించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి ఒక కొత్త స్ట్రాటజీని అవలంబించుకోవడం ద్వారా… బిజెపి ని హైలెట్ చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన కేసీఆర్, కాంగ్రెస్ ఎంత దూకుడుగా వెళ్లినా పరిస్థితి తమ అదుపులోనే ఉంటుందన్న నమ్మకంతో ఉన్నాడు. అంతే ఒకటే దెబ్బకు అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ఇద్దరినీ సరైన సమయం లో చూసి ఒకే దెబ్బ కొడితే ఇద్దరూ మట్టికరుస్తారని కేసీఆర్ ప్లాన్ అన్నమాట.

కూల్చివేతలపై కేంద్రం జోక్యం.. ఏం జరుగనుంది?


తెలంగాణలో గడిచిన ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ కు ఎదురులేకుండా పోయింది. రాష్ట్రంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక టీఆర్ఎస్ సర్కార్ కు రోజుకో తలనొప్పి వచ్చిపడుతోంది. కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగానే కేసీఆర్ కొద్దిరోజులు అదృశ్యమవడం.. సచివాలయం కూల్చివేత.. మసీదు, గుడి నిర్మాణాలపై శిథిలాలు పడటం.. బీజేపీ ఎంపీపై దాడి వంటి అంశాలు టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోన్నాయి. ఇన్నాళ్లు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాట సాగింది. ప్రస్తుతం పరిస్థితులు మాత్రం కేసీఆర్ కు వ్యతిరేకంగా మారుతున్నట్లు కన్పిస్తోంది.

సీఎం కేసీఆర్ కొత్త సచివాలయం నిర్మించాలని ఏ మూహుర్తాన అనుకున్నారోగానీ ప్రతీసారి బ్రేకులు పడుతూనే ఉన్నాయి. సస్పెన్స్ థిల్లర్ ఎపిసోడ్ లా సచివాలయ కూల్చివేత కొనసాగుతోంది. టీఆర్ఎస్ సర్కార్ సచివాలయం కూల్చి కొత్తది కట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు, ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. దీనిపై సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వగా ప్రభుత్వం కూడా చకచకా పనులు మొదలుపెట్టింది. ఇప్పటికే సచివాలయ కూల్చివేత పనులు 60శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఊహించినవిధంగా హైకోర్టు మరోసారి సచివాలయం కూల్చివేతలపై స్టే ఇచ్చింది.

కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ బాగానే పడిందిగా?

పాత సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మిస్తున్నందున తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు ఉండాల్సిందేనని హైకోర్టు అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతుల విషయంపై క్లారిటీ ఇవ్వాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని వాదించారు. ఇటువంటి విషయాల్లో కోర్టు తీర్పు ఏదైనా మీ వద్ద ఉంటే వాటిని సమర్పించాలని న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. దీంతో రేపటి వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతలు సచివాలయ కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కోర్టు కేంద్రం చేతిలో పెట్టడంతో కేసీఆర్ కు మరిన్ని ఇబ్బందులు తెచ్చేలా కన్పిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు ఒకడుగు ముందుకేసీ సచివాలయం కింద నిజాం గుప్తనిధులున్నాయని.. అందుకే అర్థరాత్రి కూల్చివేతలు మొదలెట్టారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. కరోనా కేసులు విజృంభిస్తున్న వేళ సచివాలయం కూల్చడం ఏంటని సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలోకి కేంద్రాన్ని కూడా కోర్టు లాగడంతో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.

నాన్న వైఎస్ఆర్ పై జగన్ కు ఎంత ప్రేమ ఉంది?


వైఎస్ జగన్ పార్టీ పేరే ‘వైఎస్ఆర్’ కాంగ్రెస్.. పార్టీ పేరులోనే నాన్నను ఇముడ్చుకున్నాడు ఏపీ సీఎం.. ఇక తన ప్రతీ పథకానికి ఆయన పేరే పెట్టుకుంటున్నాడు. మరి వైఎస్ఆర్ చనిపోయాడు.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆరాధ్యుడు కాబట్టి జగన్ ఆయనను ఓన్ చేసుకున్నారా? లేక నిజంగానే చిన్నప్పటి నుంచి ఈ ప్రేమ ఉందా? జగన్ కు నాన్న వైఎస్ఆర్ పై ప్రేమ ఎంత ఉంది? దీనిపై తాజాగా వైఎస్ఆర్ భార్య, జగన్ తల్లి అయిన విజయమ్మ హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆమె రాసిన ‘నాలో నాతో వైఎస్ఆర్’ పుస్తకంలో జగన్ గురించి ఆమె కొన్ని సీక్రెట్స్ చెప్పారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.

వైఎస్ జగన్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్.. చాలా తక్కువ కాలంలోనే రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు. ఇక తండ్రి మరణంతో జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాటి కాంగ్రెస్ ను సోనియా గాంధీని దిక్కరించి సొంతంగా పయనించారు. 10 ఏళ్లలో అష్టకష్టాలు పడ్డారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురునిలిచారు. 16 నెలలు జైలుకు కూడా వెళ్లారు. 2014లో ఓడిపోయి 2019లో ఎట్టకేలకు గెలిచారు.

రాజకీయాల్లోకి వచ్చాక కఠిన ఆహార నియమాలు రూపొందించుకున్నారు సీఎం జగన్.. వాస్తవానికి ఒకప్పుడు జగన్ కి చికెన్ అంటే చాలా ఇష్టం. అధికంగా చికెన్ తినేవారట.. చిన్నప్పటి నుండి వైయస్సార్ కొడుకు జగన్, కూతురు షర్మిలలు చికెన్ ఇష్టపడి తినేవారట.. అయితే జగన్ మాత్రం 1996 నుండి చికెన్ తినడం మానేశారు. దాదాపుగా పాతికేళ్లుగా జగన్ చికెన్ తినడం మానేశారు. దీనివెనుక బలమైన కారణం కూడా ఉంది.

వైఎస్ఆర్ పై ప్రేమ.. జగన్ పై కోపం.. ఎందుకు?

వైయస్సార్ అప్పుడు ఓటమెరుగని రాజకీయ నాయకుడిగా వెలుగొందుతున్నాడు. పులివెందుల ఎమ్మెల్యేగా.. కడప ఎంపీగా పోటీచేస్తూ గెలుస్తున్నారు. జీవితంలో ఏనాడు ఓటమి ఎరుగని ఒకే ఒక నాయకుడిగా సొంతమైన రికార్డును వైఎస్ఆర్ కలిగి ఉన్నారు. అలాంటి వైయస్సార్ కి 1996లో కడప పార్లమెంటు ఎన్నికల్లో టెన్షన్ మొదలైంది. 1996 లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కౌంటింగ్ రోజు నాటికి వైఎస్ఆర్ కుటుంబంలో ఏదో తెలియని టెన్షన్ మొదలైంది. గెలిస్తామనే ఆశలు సన్నగిల్లాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం చాలా టెన్షన్ పడ్డారట. ఆ టెన్షన్ చూసి జగన్, షర్మిల కూడా చాలా ఆందోళన చెందారు.

దీంతో ఏనాడు ఉపవాసం తెలియని షర్మిల.. నాన్న వైఎస్ఆర్ విజయం సాధించాలని దేవుడికి ఆరోజంతా ఉపవాస దీక్ష పాటించారు. షర్మిల అలా చేస్తే.. జగన్ తన తండ్రి గెలవాలని దేవుడికి తనకిష్టమైనది త్యాగం చేస్తానని వేడుకున్నాడు. తండ్రి ఎన్నికల్లో గెలిస్తే తనకు అత్యంత ఇష్టమైన చికెన్ తినడం మానేస్తానని జగన్ ప్రార్థించాడు… జగన్, షర్మిల కోరికలు ఫలించాయి. వైయస్సార్ 1996 ఎన్నికల్లో కడప ఎంపీగా గెలుపొందారు.

అంతే ఆ రోజు నుండి ఈరోజు వరకు వైఎస్ జగన్ చికెన్ తినడం మానేశారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ తల్లి వైయస్ విజయమ్మ ఇటీవల రాసిన ‘నాలో నాతో వైఎస్ఆర్’ పుస్తకంలో ప్రస్తావించారు.

తండ్రి కోసం ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని జగన్ ఈరోజు వరకు తండ్రి వైఎస్సార్ చనిపోయి పదేళ్లు అయినా వెనక్కి తీసుకోలేదు. ఇప్పటికీ జగన్ చికెన్ తినడం లేదు. తండ్రి అంటే ఎంతటి మమకారం ప్రేమ, గౌరవము అని చెప్పడానికి ఈ ఒక్క విషయం నిరూపిస్తోంది. అందుకే జగన్ అన్ని విషయాల్లోనూ తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగిపోతున్నారు.. ఇలాంటి అత్యాధునిక రాజకీయాల్లో ఇంకా మాటకు కట్టుబడి ఉండడం.. మాట తప్పడు మడమ తిప్పడని పేరున్న జగన్ అదే మాటపై 25ఏళ్లుగా నిలబడడం విశేషమే మరీ..

-నరేశ్ ఎన్నం

బ్రేకింగ్: జగన్ కేబినెట్‌లోకి ఇద్దరు మంత్రులు వీరే..


ఏపీ సీఎం జగన్ అనూహ్య నిర్ణయాలు.. కీలక సమీకరణాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన పార్టీ నాయకులు, రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయే నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు.

జూన్ 2019లో ఆయన మొదటి కేబినెట్‌ను ఏర్పాటు చేసినప్పుడు, జగన్ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తారని, బలహీన వర్గాలకు 50 శాతం కేబినెట్ బెర్త్‌లను కేటాయించాలని ఎవరూ ఊహించలేదు.

ప్రస్తుత క్యాబినెట్ మంత్రులలో 80 శాతం మంది రెండున్నర సంవత్సరాల తరువాత మారుతారని.. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ మొదట్లోనే ప్రకటించారు.

కేబినెట్ మంత్రుల ఎంపికలో కూడా జగన్ సీనియర్లు, మేధావులన్న కొలమానం చూడలేదు. పార్టీకోసం.. ప్రజల కోసం బాగా పనిచేసేవారిని గుర్తించారు. తన సొంత లెక్కల ప్రకారం వెళ్లి అనేక మంది జూనియర్ ఎమ్మెల్యేలకు పదవులు కల్పించారు. ధర్మాన ప్రసాద రావు, అంబటి రాంబాబు, అల్లా రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజాలాంటి ఫైర్ బ్రాండ్ వంటి అనేక మంది సీనియర్లను పక్కనపెట్టి పెను ఆశ్చర్యాన్ని కలిగించారు.

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావు జగన్..?

ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎక్సైజ్ మంత్రి మోపిదేవి వెంకట్ రమణలు ఎమ్మెల్యేలుగా గెలవకపోయినా సరే ఆది నుంచి తన వెంట నడించినందుకు వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఆ మంత్రి పదవులకు రాజీనామా చేసిన తరువాత ఇప్పుడు రెండు ఖాళీలు తలెత్తాయి. మొదటి రౌండ్ క్యాబినెట్ ఏర్పాటులో చోటుదక్కని సీనియర్లు అందరూ బెర్తుల కోసం ఇప్పుడు లాబీయింగ్ ప్రారంభించారు.

అయితే, ఇద్దరు మంత్రుల ఎంపికలో జగన్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తారని ముఖ్యమంత్రికి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ వర్గాల సమాచారం ప్రకారం, శ్రీకాకుళం జిల్లాలోని పలాసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన యువ అనుభవం కూడా లేని ఎమ్మెల్యే డాక్టర్ సిదిరి అప్పల రాజును మంత్రిగా తీసుకోబోతున్నట్టు తెలిసింది. అప్పల రాజు.. వృత్తిరీత్యా వైద్యుడు. ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారి సమయంలో ప్రజలకు సేవ చేయడంలో చాలా పేరును.. కీర్తిని సంపాదించాడు. జగన్ పట్ల తన అంకితభావం సేవా-ధోరణితో బాగా ఆకట్టుకున్నాడు.

అంతేకాకుండా, అప్పల రాజు కూడా మత్స్యకారుల వర్గానికి చెందినవాడు. మోపిదేవి వెంకటరమణ కూడా అదే వర్గం.. దీంతో అప్పలరాజును మంత్రివర్గంలోకి తీసుకుంటే. ప్రస్తుత మంత్రి అల్లా నాని సరిగ్గా నిర్వహించలేని వైద్య మరియు ఆరోగ్య శాఖలను రాజుకు ఇవ్వవచ్చని జగన్ ఆలోచిస్తున్నట్టు తెలిసింది.

మరొక క్యాబినెట్ బెర్త్ విషయంలో కూడా జగన్ ఆశ్చర్యం పరిచేలా నిర్ణయం తీసుకునేలా ఉన్నాడని తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన చెల్లుబొయినా వేణుగోపాల కృష్ణుడి పేరును కూడా ఆయన మంత్రిగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. శెట్టి బలిజా వర్గానికి చెందిన వేణుగోపాల కృష్ణను అదే జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో తీసుకుంటారని తెలిసింది. వీరిద్దరూ ఒకే వర్గానికి చెందినవారు కావడంతో ఆయనకు అవకాశం దక్కబోతున్నట్టు తెలుస్తోంది.

జగన్ తాజా నిర్ణయాలతో మళ్ళీ సీనియర్లు నిరాశ చెందకతప్పదు అన్న చర్చ వైసీపీలో సాగుతోంది.

ఆ డబ్బు ఎవరిది..?


తమిళనాడులో పట్టుబడిన వాహనంలో రూ.5.25 కోట్లు ఉండటం, ఆ వాహనానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించి ఉండటం రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. తమిళనాడు రిజిష్ట్రేషన్ తో ఉన్న ఈ పాట్చూనర్ వాహనం డ్రైవర్ ఒంగోలుకు చెందిన వ్యక్తి, అతనితోపాటు వాహనంలో మరో నలుగురు వ్యక్తులు ఉన్నారు. తొలుత తమిళనాడు మీడియా రాష్ట్ర మంత్రి బాలినేనికి చెందిన డబ్బును తరలిస్తున్నట్లు ప్రచారం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడింది. ముఖ్యమంత్రి జగన్ అవినీతికి దూరంగా ఉండాలని మంత్రులు ఎమ్మెల్యేలకు పదే పదే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తుంది.

టీడీపీ మరో స్కాం వెలుగులోకి.. మాజీ మంత్రి బుక్

ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటంతో పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ డబ్బు ఎవరిదనే అంశంపై తమిళనాడు అరంబక్కం పోలీసులు ఆరా తీస్తున్నారు. కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు డబ్బుతోపాటు ప్రయాణిస్తుండగా పోలీసులు తనిఖీల సందర్భంగా ఇద్దరు వ్యక్తులు తప్పించుకుని పరారవగా, మరో ముగ్గురు మాత్రమే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హవాలా విధానంలో తరలిస్తున్నారా లేక నల్లధనమా అనే అంశంపైనా దృష్టి సారించారు. వాహనం ప్రకాశం జిల్లా వైపు నుంచి తమిళనాడు రాష్ట్రానికి వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో ఒ బంగారు వ్యాపారి ఇళ్ళలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఈ వ్యాపారికి చెందిన సోమ్మును తరలించేందుకు మంత్రి పేరు వినియోగించుకున్నారనే వాధన ఉంది. మరోవైపు కారులో నుంచి పరారైన వారిలో రాజకీయ నాయకుడి తనయుడు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.

డబ్బు పట్టుబడిన సంఘటన జరిగిన అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాసరావు మీడియాకు ఓ వీడియోను విడదల చేశారు. తమిళనాడులో పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు తనది కాదని స్పష్టం చేశారు. కారు డ్రైవర్ ఒంగోలుకు చెందిన వ్యక్తి కావడం, ఎమ్మెల్యేగా తన పేరుతో ఉన్న స్టిక్కర్ ను వినియోగించడంతో తనదిగా పోలీసులు భావించారని తెలిపారు. ఈ ఘటనపై వాస్తవాలు తెలిసేందుకు పోలీసులు అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. స్టిక్కర్ ఫోటో జిరాక్స్ తో ఉందని చెప్పారు. వాహనం తమిళనాడు రాష్ట్రానికి చెందినదేనని పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించి బాధ్యుతలను కఠినంగా శిక్షించాలని కోరారు.

విశాఖ వరుస ప్రమాదాలలో బాబు కుట్ర కోణం?


విశాఖ పారిశ్రామిక వాడలోని రాంకీ ఫార్మాలో నిన్న జరిగిన ప్రమాదం అధికారపక్షం మరియు విపక్షాల మధ్య పెద్ద చర్చకు దారితీసింది. వైజాగ్ లో జరుగుతున్న వరుస పారిశ్రమిక ప్రమాదాలకు వైసీపీ ప్రభుత్వ అలసత్వమే కారణం అని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరుసగా మూడు భారీ ప్రమాదాలు వైజాగ్ లో రెండు నెలల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. ఎల్ జి పాలిమర్స్ లో జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం చోటు చేసుకోవడంతో పాటు, ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆ తరువాత సాయినార్ పార్మా కంపెనీలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది.తాజాగా నిన్న రాంకీ పార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వలన పెద్ద ఎత్తున పేలుడు మరియు మంటలు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా కొందరు గాయాలపాలయ్యారు.

టీడీపీ మరో స్కాం వెలుగులోకి.. మాజీ మంత్రి బుక్

వైజాగ్ లో వరుస ప్రమాదాలు ప్రభుత్వ వైఫల్యమే అని ప్రతిపక్షం విమర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఇందులో ఏదో కుట్ర కోణం ఉందని ఆరోపిస్తున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాధ్ గుడివాడ, వైజాగ్ వరుస పారిశ్రామిక ప్రమాదాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలో భాగమే అని అంటున్నారు. అమరావతిని రాజధానిగా ఎలాగైనా కొనసాగేలా చేయడానికి ఉద్దేశ పూర్వకంగా ప్రమాదాలు సృష్టిస్తున్నారు అన్నారు. వైజాగ్ పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో భయాందోళను కలిగించాలని, వైజాగ్ రాజధానిగా పనికి రాదనే తప్పుడు అభిప్రాయాన్ని కలిగేలా చేయడానికి, ఈ ప్రమాదాలకు కుట్రపన్నారు అంటున్నారు. అమరావతి కోసం వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీయాలని చూస్తున్నారు అన్నారు.

వైసీపీ నేత ఆరోపణలతో రాష్ట్రంలో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఆయన ఆరోపణలో నిజం ఉన్నా లేకున్నా సంచలనం రేపుతున్నాయి. ఈ ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి కారకులకు శిక్ష పడేలా చేస్తాం అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే పారిశ్రామిక ప్రమాదాలు జరిగినట్లు మాట్లాడం సరికాదు అంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈస్ట్ గోదావరిలో ఓ ఎం జి సి గ్యాస్ పైప్ లైన్ లీకై 22 మంది కాలిబూడిదైన ఘటనను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏదిఏమైనా విశాఖ ప్రమాదాలపై అధికార విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి.