Home Blog Page 8406

ఈ లాజిక్ ఎలా మిస్సయ్యావు జగన్..?


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరాల జల్లులలో ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. కరోనా కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం సగానికి తగ్గిపోయినా పథకాల ప్రవాహం ఆగడం లేదు. ఆయన బటన్ నొక్కితే ఎదో ఒక వర్గం ఖాతాలలో నేరుగా డబ్బులు జమవుతున్నాయి. కొందరికైతే మరో ఏడాది రాకముందే పథకం రెండో విడత డబ్బులు కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. మరి ఇంతలా ఆయన ప్రజలపై ప్రేమ కురిపిస్తుంటే… కొందరికి అది వెగటు వేస్తుందట. కొందరు ఏంటి ఈయన డబ్బులు ఇలా పంచేస్తున్నారని అంటుంటే.. జగన్ జనాన్ని సోమరులను చేస్తున్నారని మరి కొందరు పెదవి విరుస్తున్నారు. ఆ పెదవి విరిచినవారు కూడా పథకాలలో తమ కోటా తమకు అందినప్పుడు.. ఆహా జగన్, ఓహో జగన్ అంటున్నారు.

గొప్పల బాబు…మారేదెప్పుడు?

మరి వచ్చే ఐదేళ్లలో జగన్ సంక్షేమ పథకాల అమలులో ఇదే జోరు కనబరిస్తే…టీడీపీ మరియు జనసేన దుకాణాలు సర్దుకోవలసిందే. ప్రతిపక్ష హోదాలో బాబు ఎన్ని విమర్శలు చేసినా, ప్రత్యర్థిగా ఉన్న పవన్ ఎన్ని అవాకులు పేల్చినా జనం వారిని నమ్మడం, జగన్ పై నమ్మకం కోల్పోవడం కష్టమే. హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్పితే వాళ్లకు ఓటేసే వారు ఉండరు. అందుకే జగన్ ప్రతి పధకం అవినీతి మయమే అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు బాబు. ఇదిలా ఉంటే జగన్ సంక్షేమ పథకాల మైకంలో పడి కొన్నిసార్లు లాజిక్ ఫాలో కావడం లేదేమో అనిపిస్తుంది.

కరోనా బాధితుల కోసం జగన్ ప్రకటించిన ఓ స్కీమ్ అర్థం లేనిదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కరోనా బారినపడి పూర్తి ఆరోగ్యంగా ఇంటికి వెళుతున్న ప్రతి ఒక్కరికి జగన్, ప్రభుత్వం తరపున రూ. 2000 ఇవ్వడం జరుగుతుంది. తాజాగా కరోనా వలన మరణించి వారి అంతిమ సంస్కారాల కోసం రూ.15000 ఇవ్వవలసిందిగా జగన్ అధికారులను ఆదేశించింశారు. ఐతే కరోనా వలన మరణించిన వ్యక్తి శరీరం నుండి కూడా కరోనా వ్యాపిస్తుంది. దీనితో ఆ శవాలను కుటుంబ సభ్యులకు అప్పగించడం లేదు. వైద్య సిబ్బంది వారిని ఖననం చేయడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో అంతిమ సంస్కారాల కొరకు రూ. 15000 ఎందుకు అని అడుగుతున్నారు. అంతిమ సంస్కారాలకు ఉద్దేశించిన ఆ డబ్బుని కుటుంబ సభ్యులకు గాని, వైద్య సిబ్బందికి గానీ ఇవ్వడం కుదరదు. మరి జగన్ ఈ పథకం ఏ ఉద్దేశంతో ప్రకటించారనేది సగటు పౌరుడి ప్రశ్న కూడా.

సుశాంత్ ఆత్మహత్యలో ఊహించని ట్విస్ట్!

Sushant Singh Rajput death

Sushant Singh Rajput death
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ మృతి పట్ల భారత అత్యున్నత నిఘా సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) మాజీ అధికారి ఎన్‌కే సూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ ది ఆత్మహత్య కాదని… అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠానే హత్య చేసిందని ఆరోపించారు. దీని వెనుక దావూద్ ప్రమేయం కూడా ఉందని అన్నారు.

చాలామంది బి-టౌన్ సెలబ్రెటీలు విదేశాలలో దావూద్ బృందం నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొంటారు. గ్యాంగ్ స్టర్ డబ్బు సంపాదించడానికి సహాయం చేస్తుంటారు. ఇది ఐఎస్ఐ నిధుల కోసం ఉపయోగించబడుతుంది. సెలబ్రెటీలు ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును అందుకుంటారని ఎన్కే సూద్ తెలిపారు. ఈ ముఠానే సుశాంత్‌ని ఫోన్ ద్వారా బెదిరించిందని, అది అతడిని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిందని సూద్ పేర్కొన్నారు.

అంతేకాకుండా దావూద్ నుంచి తప్పించుకునేందుకు సుశాంత్ తన ఫోన్ నంబరును 50 సార్లు మార్చాడని చెప్పారు. సుశాంత్ మరణానికి ఒక రోజు ముందు సీసీటివి కెమెరాలు ఆగిపోవడం గురించి కూడా సూద్ మాట్లాడారు. అతడు ఆత్మహత్య చేసుకున్న గది తాళం కూడా నకిలీవన్నారు. ఇంతకంటే.. సుశాంత్‌ ది ఆత్మహత్య కాదు.. హత్యే అనేందుకు ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించారు.

ఓటీటీలో ‘నవరసాలు’ పండించనున్న సూర్య


కరోనా మహమ్మారి మనుషుల జీవన విధాలనాలను సమూలంగా మార్చేసింది. ఇప్పుడు మన అలవాట్లు మారిపోయాయి. ‘కలిసి’ బతకలేకపోతున్నాం. కలివిడిగా ఉండలేకపోతున్నాం. ప్రపంచానికి పెను సవాల్‌ విరుసుతున్న ఈ ప్రాణాంతక వైరస్‌ అనేక రంగాలను కుదిపేసింది. అందులో ప్రధానమైనది సినిమా ఇండస్ట్రీ. లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్లకే బ్రేక్ పడగా.. థియేటర్లకు తాళాలు పడ్డాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియడం లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమాలను కూడా బిగ్‌ స్క్రీన్‌పై ప్రదర్శించే చాన్స్‌ లేకుండా పోయింది. అయితే, చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు ఓటీటీల బాట పడుతున్నాయి. బాలీవుడ్‌లో పెద్ద సినిమాలు సైతం ఓటీటీల్లో రిలీజవుతుండగా.. సౌత్‌ ఇండస్ట్రీ దర్శక నిర్మాతలు తమ ఆలోచనలు మార్చుకుంటున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ నుంచి సెన్సేషనల్ అప్‌డేట్..

భవిష్యత్తు డిజిటల్‌ మీడియాదే అనే వాస్తవాన్ని గ్రహిస్తూ.. ఇప్పుడిప్పుడే ఓటీటీల బాట పడుతున్నారు. వాళ్లే కాదు స్టార్లు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పటికే సమంత, నిత్యా మీనన్, ప్రియమణి తదితరులు హిందీ వెబ్‌ సిరీస్‌ల్లో నటించారు. దర్శకుడు క్రిష్ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ‘ఆహా’ కోసం పని చేస్తున్నారు. నవదీప్‌, ప్రియదర్శి, సందీప్‌ కిషన్‌, సత్యదేవ్‌, బిందు మాధవి, హెబ్బా పటేల్‌ తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో నటించాడు. అయితే, తెలుగులోనే కాకుండా సౌత్‌లో పెద్ద హీరోల్లో ఒక్కరు కూడా ఇప్పటిదాకా వెబ్‌ సిరీస్‌ల్లో అడుగు పెట్టలేదు.

అయితే, సౌత్‌ స్టార్ సూర్య ఇప్పుడు ఈ పాత్‌ను బ్రేక్‌ చేయబోతున్నాడు. ఓటీటీ సత్తా ఏమిటో చాన్నాళ్ల క్రితమే గ్రహించిన సూర్య.. థియేటర్ యజమానులతో విభేదించి తాను నిర్మించిన ఓ మూవీని ఓటీటీలో రిలీజ్‌ చేశాడు. ఇప్పుడు నేరుగా ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు రెడీ అయ్యాడు. తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది ఎపిసోడ్స్‌ తీసేలా మణిరత్నం వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ఓ వెబ్ సిరీస్‌ను ప్లాన్‌ చేశాడు. ఆయనతో పాటు గౌతమ్‌ మీనన్, కార్తీక్‌ నరేన్‌, నంబియార్, హీరోలు సిద్ధార్థ్‌, అరవింద్‌ స్వామి మరో ముగ్గురు ఒక్కో ఎడిసోడ్‌కు డైరెక్షన్‌ వహిస్తారు. దీనికి ‘నవరస’ అనే టైటిల్‌ ఖారారు చేశాడు మణిరత్నం. నవరసాల్లోని ఒక్కో ఎమోషన్‌ను ఒక్కో ఎపిసోడ్‌లో చూపించబోతునారు. ఈ వెబ్‌ సిరీస్‌లో సూర్య విలన్‌గా నటించేందుకు ఒప్పుకున్నాడని తెలుస్తోంది. దీన్ని వెబ్‌ సిరీస్‌ బృందం ఖరారు చేస్తే మూవీ ఇండస్ట్రీ ఫ్యూచర్ మారే చాన్సుంది. మరెందరో స్టార్లు వెబ్‌ బాట పట్టే అవకాశం లేకపోలేదు.

ఆధ్యాత్మికత కోసం బాలయ్య కసరత్తులు !


మెగాస్టార్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడో వందల కోట్ల మార్క్ ను దాటి ఆయా హీరోల పేర్లను బాక్సాఫీస్ వద్ద సగర్వంగా చాటాయి. పాపం బాలయ్య సినిమాలు మాత్రం ఏభై కోట్లు కలెక్ట్ చేయడమే గగనం అయిపోయింది. మరీ ఈ మధ్య బాలయ్యగారి సినిమాలు గట్టిగా పది కోట్లు కూడా కలెక్ట్ చేయలేని దుస్థితిలోకి వెళ్లిపోయాయంటే బాలయ్య మార్కెట్ రేంజ్ అర్ధం చేసుకోవచ్చు. అందుకే సోషల్ మీడియాలో కూడా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ బాలయ్య పని అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. కానీ వరుసగా డిజాస్టర్లు ఇవ్వడం బాలయ్యకు కొత్తేమి కాదు, అలాంటి డిజాస్టర్ ల తరువాత కూడా ‘సింహా’తో క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి తెలిసిందే.

ఆ హీరో, డైరెక్టర్ ల కెరీర్ లు పోయినట్టేనా ?

అందుకే బాలయ్య ఎప్పుడూ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. బాడీ తగ్గించే పనిలో ఉన్నాడు. దాదాపు పది కిలోలు బాలయ్య తగ్గనున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య బాబు కొన్ని సన్నివేశాల్లో పూర్తి ఆధ్యాత్మిక వేత్తగా కనిపించబోతున్నాడని.. ఆ పాత్ర కోసమే బాడీ తగ్గిస్తున్నాడని తెలుస్తోంది. ఆధ్యాత్మికతతో మొదలైయ్యే బాలయ్య పాత్ర చాల వైవిధ్యంగా అలాగే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని.. ఈ పాత్రలో కొత్త బాలయ్యని చూస్తామట.

ఇక ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ మూవీలో మొదట హీరోయిన్ గా కేథరీన్ థెరీసా తీసుకోవాలనుకున్నారు, కానీ అమ్మడు బాలయ్య సరసన అనే సరికి రెమ్యునిరేషన్ ను భారీ రేంజ్ లో డిమాండ్ చేయడం, ఆ తర్వాత అంజలిని అనుకున్నారు, కానీ అంజలి కంటే కొత్త అమ్మాయే బెటర్ అని ఫీల్ అయ్యారట మేకర్స్. అన్నట్టు ఈ సినిమా ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ స్టోరీతో వస్తోన్నా.. సినిమాలో యాక్షన్ చాల సహజంగా ప్లాన్ చేస్తున్నారట.

చిరు చెల్లి పై రూమర్స్.. ఫైనల్ చేయలేదు !


మెగాస్టార్ సిస్టర్ పాత్ర పై ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. ఇంతకీ ఈ సిస్టర్ గోల ఏంటి అనుకుంటున్నారా.. మెగాస్టార్ ‘లూసిఫర్’లో హీరోకి చెల్లి పాత్ర ఉంటుంది. అయితే మలయాళంలో మంజు వార్యర్ ఆ పాత్రలో అద్భుతంగా నటించింది. చిన్నప్పటి నుండి తెలియకుండానే హీరో పై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఆ ఎమోషనల్ రోల్ లో కుష్బూ నటించబోతున్నట్లు, లేదూ రోజా చేస్తోందని, కొన్ని రోజులు అయితే ఏకంగా విజయశాంతినే చేస్తోందని, ఈ మధ్యలో సుహాసిని కూడా ఆ రోల్ కు ఫిక్స్ అయిందని ఇలా ఈ సినిమా అనుకున్న దగ్గర నుండి రూమర్స్ కు అడ్డుఅదువు లేకుండా పోయింది. అసలు ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించి ఎవర్నీ ఫైనల్ చేయలేదు. ఆ మాటకొస్తే ఫుల్ స్క్రిప్ట్ కూడా ఇంకా ఫైనల్ కాలేదు.

చిరు ‘ఆచార్య’ ఆఫర్కు సాయి పల్లవి నో!

కానీ రాతల రాయుళ్లు మాత్రం వాళ్లకు వాళ్లే క్యాస్టింగ్ ను ఫైనల్ చేసేసి.. ఫలానా రోజు ఓపెనింగ్, ఫలానా రోజు షూటింగ్ అంటూ అర్థంపర్ధం లేని గాసిప్స్ రాసి జనం మీదకు వదులుతున్నారు. అందుకే వీటిలో ఏ ఒక్కటి నిజం కాదని చిత్రబృందమే తెలుపుతుంది. ఆయితే ఈ పాత్రకు మాత్రం కుష్బూ పర్ఫెక్ట్ గా సరిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కుష్బూ గ్లామర్ హీరోయిన్ అయినప్పటికీ మంచి గ్రేస్ ఉన్న ఫిజిక్.. పైగా డామినేట్ చేసే అటిట్యూడ్.. చెల్లి పాత్రకు ఇలాంటి ఫీచర్స్ ఉన్న నటినే కావాలి. సో.. కుష్బూ తప్ప ఇక ఆ పాత్రకు మరో అప్షన్ లేకపోవచ్చు. కానీ ఆ ఎమోషనల్ రోల్ కు సుహాసిని కూడా పూర్తి న్యాయం చేయగలదని పైగా మెగాస్టార్ కి సిస్టర్ గా సుహాసిని ఆయితేనే బాగుంటుందని టాక్ వినిపిస్తోంది.

ఇక మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీని.. తెలుగు ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నారు. ఎలాగూ సినిమాలో మెగాస్టార్ హీరోయిజమ్ ఎలివేషన్స్ భీభత్సంగా ఉంటాయి. పైగా మెగా అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చేలా యాక్షన్ సీక్వెన్స్ ను తీయడంలో సుజీత్ మంచి టాలెంట్ ఫెలో. అయితే, గత ఏడాది సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన సాహో ప్రభాస్ రేంజ్ ను తగ్గించింది. అయినా, మెగాస్టార్, సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికి ఈ భారీ సినిమా అవకాశం ఇచ్చారు.

టీడీపీ మరో స్కాం వెలుగులోకి.. మాజీ మంత్రి బుక్

ఏపీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల జాతరను వెలికి తీస్తున్నారు. వరుసగా ఒక్కో స్కాం బయటపడుతుంటే టీడీపీ మాజీ మంత్రుల పూసాలు కదిలిపోతున్నాయి. టీడీపీ నేతల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే టీడీపీ మాజీ మంత్రులంతా మౌనం దాల్చారు. అస్సలు యాక్టివ్ కావడం లేదు. ఫైర్ బ్రాండ్ దేవినేని ఉమ సైతం సైలెంట్ గా ఉండడం గమనార్హం.

ఇప్పటికే ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని విజయవంతంగా జైలుకు పంపిన వైసీపీ సర్కార్ తాజాగా అదే కేసులో మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణను బుక్ చేయడానికి సిద్ధమైంది. ఇక జేసీ ట్రావెల్స్ అక్రమాలపై ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను జైలుకు పంపింది. ఈ నేపథ్యంలోనే నెక్ట్స్ ఏ మంత్రి బుక్కవుతారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆ బుక్కయ్యే మంత్రి ఎవరో పరోక్షంగా వెల్లడించారు. టీడీపీ శిభిరాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు.

రాష్ట్రానికి అప్పు ఇచ్చేది ఆ సంస్థేనా..!

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో బాంబు పేల్చారు. టిడిపి ప్రభుత్వంలో పెద్ద కుంభకోణం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఓ మాజీ మంత్రి ఉన్నాడంటూ ఆయన పరోక్షంగా ఆరోపించారు. రూ.12 కోట్ల విలువైన సైకిళ్ల కుంభకోణం జరిగిందని లీకులు ఇచ్చారు.

విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేస్తూ.. ‘తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!’’అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

ఇక టీడీపీ నాయకుడి ఆట కూడా కట్టైందని విజయసాయిరెడ్డి సంచలన లీక్ చేశారు. 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మళ్లీ ప్రభుత్వానికే విక్రయిస్తున్న ఆ టీడీపీ నాయకుడి పేరు ప్రపంచానికి త్వరలో పరిచయం చేయబోతున్నారు అంటూ బాంబు పేల్చారు.

ఇలా ప్రస్తుతానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు మరో టీడీపీ కబ్జా నేతకు మూడినట్టేనని వైసీపీ సర్కార్ లో నంబర్ 2 అయిన విజయసాయిరెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. నెక్ట్స్ గంటాకు గంట మోగడం ఖాయమనే ప్రచారం ఆయన చేసిన ట్వీట్ తో అర్థమవుతోంది.

వంశీ అందుకే వెనక్కి తగ్గడా?


2019ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో 175స్థానాలకుగాను వైసీపీ 151, టీడీపీ 23, జనసేన పార్టీకి ఒక సీటు వచ్చాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, బీఎస్పీ పార్టీలకు ఒక్కసీటు కూడా రాకపోవడం గమనార్హం. టీడీపీ అధికారం కొల్పోవడంతో ఆపార్టీలోని నేతలంతా అధికార పార్టీవైపు చూడటం మొదలుపెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఓవైపు ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెడుతూనే మరోవైపు టీడీపీని టార్గెట్ చేశారు. దీంతో టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి.

ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే చంద్రబాబులా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తీసుకోనని జగన్ గతంలోనే ప్రకటించారు. ఎవరైనా తన పార్టీలోకి వస్తే రాజీనామా చేసి రావాలని స్పష్టం చేశారు. దీంతో వైసీపీకి మద్దతు ప్రకటిస్తున్న రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో ముఖ్యంగా గన్నవరం ఎమ్మల్యే వల్లభనేని వంశీ పేరు విన్పిస్తుంది. ఈయన 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.

ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

ఆ తర్వాత చంద్రబాబుతో విబేధించి జగన్ సర్కారుకు మద్దతు ప్రకటించారు. దీంతో టీడీపీ వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో వంశీ తన ఎమ్మెల్యే పదవీ రాజీనామా చేసి వైసీపీ తరుఫున పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాజా తన నిర్ణయాన్ని వంశీ మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన గెలుపుకోసం పని చేసిన టీడీపీ ఇప్పుడు ఆయనను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉందట. గన్నవరంలోని ఆయన సామాజికవర్గం కూడా టీడీపీ వైపు చూస్తుందట. వైసీపీలోనూ తనకు వ్యతిరేకవర్గం ఎక్కువగా ఉందట. దీంతో ఇప్పటికిప్పుడు గన్నవరంలో ఎన్నికలు నిర్వహిస్తే గెలుపు కష్టమేనని లెక్కవేసుకుంటున్నారట.

అటూ టీడీపీ, ఇటూ వైసీపీ నేతలు తనకు ఓటమికి పనిచేసే అవకాశాలు ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారనే వాదన విన్పిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా కరోనా కట్టడి, కొత్త జిల్లాల పునర్విభజన, క్యాబినేట్ విస్తరణ పనుల్లో బీజీగా ఉండటంతో ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని భావించడంతోనే వంశీ వెనక్కి తగ్గినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ ఎప్పుడు ఆదేశాలిస్తే అప్పడు ఎన్నికలకు సిద్ధమేనంటూనే గెలుపుపై ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడట. దీంతో ఆయన బీజేపీపై వైపు కూడా చూస్తారనే టాక్ విన్పిస్తుంది. ఒకవేళ వంశీ ఉప ఎన్నికలకు వెళితే గెలుపు అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది.

సచిన్ కి సీఎం కుర్చీ దక్కేనా?

Sachin pilot

Sachin pilot

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుతిరిగిన సచిన పైలట్ కి ఆ మూడు దారులు ఇంకా పదిలంగానే ఉన్నాయి. అయితే ఆయన ఏ దారిలో వెళ్లినా ఆయనకు కావాల్సింది మాత్రం సీఎం కుర్చీనే అనేది తాజా పరిస్థితుల్లో స్పష్టమౌతోంది.  ఆ సీఎం పోస్ట్ కోసం ఆయన తదుపరి ఎలా వ్యవహరిస్తారనేది ఇప్పడు అందరి మదిలో మెదలుతున్నది. రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవితోపాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయనను తొలగించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా నోటీసులు కూడా జారీ చేసింది. సీఎల్పీ భేటీకి గైర్హాజరులపై రెండు రోజుల్లో సమాధానం చెప్పకపోతే పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ ముందు ప్రధానంగా మూడు మార్గాలున్నాయి.

అందులో ఒకటి తలొగ్గి తిరిగి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం. సచిన్ కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే ఆయనతో మంతనాలు జరిపి బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ రాజీ ఒప్పందానికి రావచ్చని తెలుస్తున్నది. సీఎం పదవి ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేయడంతో ఆ పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే ప్రత్యామ్నాయంగా పార్టీలో సచిన్‌ కు గౌరవం దక్కేలా పీసీసీ చీఫ్ పదవిని తిరిగి కట్టబెట్టడం, ఆయన అనుచరులకు క్యాబినెట్‌ లో చోటు కల్పించడం, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వారికి ఎక్కువ టికెట్లు కేటాయించడం వంటి వాటిపై ఒప్పందం జరిగే అవకాశమున్నది.

ఇక సచిన్ పైలట్ ముందు ఉన్న రెండో మార్గం.. బీజేపీలో చేరడం. అయితే ఈ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రంలో కొన్నేండ్లుగా బీజేపీపై పోరాడుతున్న తాను ఆ పార్టీ చెంతన చేరలేనని చెబుతున్నారు. బీజేపీలో చేరే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఒకవేళ బీజేపీ ప్రముఖులు సచిన్‌ ను సంప్రదించి సీఎం పదవి ఇస్తామని చెబితే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అన్నది సందేహమే. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత మెజార్టీ ఉండటంతో ఈ దిశగా ఆయన ప్రయత్నించకపోవచ్చు.

చివరిగా సచిన్ పైలట్‌ కు ఉన్న మరో మార్గం.. సొంత పార్టీని ఏర్పాటు చేయడం. బీజేపీకి, కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా కొత్తగా ప్రాంతీయ పార్టీని నెలకొల్పడం. తన అనుచరులతో కలిసి సీఎం గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టడం. అనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటడం. ఈ మూడు మార్గాల్లో సచిన్ పైలట్ దేన్ని ఎంచుకుంటారో అన్నది వేచి చూడాలి.

తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందా?


తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాటి ఆంధ్రప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ నేతల ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. మరోవైపు ఆంధ్రాలోనూ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో రెంటికి చెడ్డరెవడిలా కాంగ్రెస్ పరిస్థితి మారింది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై లక్ష్యంగా ఆవిర్భావించిన టీఆర్ఎస్ 2014ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. దీంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఐదేళ్ల పాలన పూర్తికాకుండానే కేసీఆర్ వ్యూహంలో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీని మరోసారి దెబ్బకొట్టారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం కూడా కాంగ్రెస్ కలిసిరాలేదు. దీంతో 2018 ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. నాటి నుంచి కాంగ్రెస్ నేతల్లో నిరుత్సాహం నెలకొంది.

దీంతో తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన కాంగ్రెస్ ఢీలా పడిపోతూ వస్తోంది. మున్సిపల్, కార్పొరేషన్, సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తాచాటలేకపోయింది. అయినప్పటికీ కాంగ్రెస్ అక్కడడక్కడ సత్తాచాటింది. సీఎం కేసీఆర్ పాలనపై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత వస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అలర్టయింది. కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఐక్యతరాగం ఆలపిస్తున్నారు. నిన్నటి వరకు ఉప్పునిప్పులా ఉన్న నేతలంతా ఒకటే అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.

బీజేపీపై కేసీఆర్ కాంగ్రెస్ అస్త్రం.. ఫలిస్తుందా?

ఇటీవల కాంగ్రెస్ చేపట్టిన జలదీక్షకు కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజాసంఘాల నుంచి పెద్దఎత్తున మద్దతు లభించడంతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. పొతిరెడ్డిపాడు ఎత్తు పెంచడం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి మారుతుందని తెల్సినా ప్రభుత్వం స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కరోనా విజృభిస్తున్నవేళ కేసీఆర్ అదృశ్యం, స‌చివాల‌యం కూల్చివేత వంటి అంశాలను హైలెట్ చేసి కాంగ్రెస్ ప్రజల కోసం పనిచేస్తుందనే ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పాలనపై అంతర్గత సర్వే చేయగా ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టమైందనట్లు తేలిందట. దీంతో నేతలంతా పదవుల కోసం పంతాలుమాని ఉమ్మడిగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ భట్టీ, ఎంపీలు రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ వీహెచ్, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, విజయశాంతి లాంటి నేతలంతా ఇప్పుడు ఒక్క‌తాటిపైకి వస్తున్నారు. ఉమ్మడిగా ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం కన్పిస్తుందని టాక్ విన్పిస్తోంది. అయితే ఈ ఐక్య‌త రాగం అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా? అనేది వేచి చూడాల్సిందే..!

టీడీపీ విచిత్ర డిమాండ్!!

Kiran Kumar reddy

 

Kiran Kumar reddy

ఏపీలో వైసీపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం సర్వసాధారణం. అయితే తాజాగా టీడీపీ నేతలు ఒక విచిత్రమైన డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ సంక్షేమ పథకానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు పెట్టలంటూ ఇవాళ విపక్ష టీడీపీ ఓ విచిత్రమైన డిమాండ్ చేసింది. గతంలో టీడీపీ-కాంగ్రెస్ రహస్య మిత్రులంటూ వైసీపీ ఆరోపణలు చేసేది. ఆ ఆరోపణలు కాస్తా ఇప్పుడు నిజమయ్యాయా అనే వాదనకు బలం చేకూర్చేలా టీడీపీ డిమాండ్ ఉంది.

ఇంతకీ వైసీపీ అమలు చేస్తున్న ఆ పథకం పేరు వైఎస్సార్ సున్నావడ్డీ రుణ పథకం కాగా.. గతంలో ఈ పథకాన్ని తీసుకొచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి ఆయన పేరుతోనే అమలు చేయాలంటూ టీడీపీ నేత సోమిరెడ్డి కోరడం కలకలం రేపింది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్ ఆ తర్వాత ఆయన చెప్పుగుర్తుతో పెట్టిన పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో రాజకీయాలకు కొంతకాలం దూరమయ్యారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినా మౌనంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన పేరు పెట్టాలంటూ టీడీపీ కోరడం వెనుక రాజకీయం ఏమై ఉంటుందా అని అంతా చర్చించుకుంటున్నారు.

‘ఆచార్య’లో తమన్నా ఐటమ్‌ సాంగ్!


ఖైదీ నం.150తో వెండితెరపై అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చి.. సైరా నరసింహా రెడ్డితో స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలన్న కలను నెరవేర్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరుస హిట్లతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న సెన్సిబుల్‌ డైరెక్టర్ కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. తన నాలుగు చిత్రాలతో సూపర్ హిట్స్‌ అందుకున్న శివ.. ఐదో మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అసలే చిరంజీవి కాబట్టి.. ఆచార్యతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాలని చూస్తున్నాడు. రామ్‌ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. తన ప్రతి సినిమాలో సామాజిక కోణాన్ని టచ్‌ చేసే కొరటాల ఈ చిత్రంలో చిరంజీవిని రెండు విభిన్నపాత్రల్లో చూపించబోతున్నాడని సమాచారం. నక్సల్స్‌ ‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథలో ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటం ఇతివృత్తంగా సినిమా సాగుతుందని సమాచారం. దీనికి పొలిటికల్ యాంగిల్‌ కూడా యాడ్‌ చేసి పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ ముందు వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ చేశాడు.

చిరు ‘ఆచార్య’ ఆఫర్కు సాయి పల్లవి నో!

హీరోయిన్‌గా తొలుత త్రిషను తీసుకున్నారు. కానీ, క్రియేటివ్‌ డిఫరెన్సెన్స్‌తో ఆమె వైదొలిగింది. దాంతో, కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఖరారు చేశారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో చిరు- మణిశర్మ కాంబో రిపీట్‌ కానుంది. పుష్కర కాలం తర్వాత మెగాస్టార్ మూవీకి మ్యూజిక్‌ అందిస్తున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే ఐదు పాటలను సిద్ధం చేశాడట. ఇందులో ఒక ఐటమ్‌ సాంగ్‌ కూడా ఉందట. చిరు బాడీలాంగ్వేజ్‌, డ్యాన్స్‌ మూవెంట్స్‌కు తగ్గట్టు మంచి బాణీలు సమకూర్చాడట మణి. ఇక, ఈ సాంగ్‌లో చిరుతో కలిసి స్టెప్పులేసే అదృష్టం మిల్కీ బ్యూటీ తమన్నాను వరించిందని సమాచారం. సైరా చిత్రంలో చిరంజీవితో కలిసి నటించిన తమన్నా.. మరోసారి చిరుతో ఆడిపాడనుందని సమాచారం. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూనే స్పెషల్ సాంగ్స్‌లోనూ దూసుకెళ్తున్న తమన్నా.. రీసెంట్‌గా మహేశ్‌ బాబు సరిలేరు నీకెవ్వరూలో ‘డాంగ్‌ డాంగ్‌’ సాంగ్‌తో అదరగొట్టింది. ఇప్పుడు ఏకంగా చిరుతో స్టెప్పులేసే చాన్స్‌ కొట్టేసిందని టాక్.

బీజేపీపై కేసీఆర్ కాంగ్రెస్ అస్త్రం.. ఫలిస్తుందా?


తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటకు ఎదురులేదని చెప్పొచ్చు. ప్రతిపక్షాల్లోనూ సీఎంను గట్టిగా నిలదీసే నాయకులు మచ్చుకైనా కన్పించరు. దీంతో తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆడిందే ఆట. పాడిందే పాటగా పాలన కొనసాగుతూ వస్తోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ బలహీనం చేయడంలో సీఎం కేసీఆర్ ఏనాడో విజయం సాధించారు. అయితే కొంతకాలంగా టీఆర్ఎస్ సర్కార్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనూహ్యంగా బీజేపీ తెలంగాణలో బలపడుతుండటంతో సీఎం కేసీఆర్ ఆ పార్టీపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీపై కాంగ్రెస్ అస్త్రాన్ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అంతగా బలంలేని బీజేపీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాలు గెలిచి సత్తాచాటింది. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మించి బీజేపీ సీట్లు సాధించి తెలంగాణలో బలపడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణలో మరింత బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అధికారంలోని టీఆర్ఎస్ పార్టీపై దూకుడుగా వెళుతుంది. సీఎం కేసీఆర్, మంత్రులను టార్గెట్ చేస్తూ ప్రజల్లో బీజేపీ హైలెట్ అవుతోంది.

బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆపార్టీ నేతలు టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకం అయ్యాక బీజేపీ నేతల్లో మరింత జోష్ పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు పదేపదే ఆరోపణలు గుప్పిస్తున్నారు. సచివాలయ కూల్చివేత విషయంలోనూ బీజేపీ తీవ్ర రాద్దాంతం చేస్తోంది.

కేసీఆర్ చరిష్మాకు.. కరోనా చెక్ పెట్టిందా?

ఇటీవల బీజేపీ ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిచేసిన విషయంలోనూ ప్రభుత్వాన్ని బీజేపీ కార్నర్ చేసింది. రోజురోజుకు బీజేపీ తెలంగాణలో బలపడుతుందని గ్రహించిన దీనికి విరుగుడు రెడీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు తమకు ఇంతటి ఇబ్బందులు తలెత్తలేదని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకుంటున్నారు.

దీంతో బీజేపీ దూకుడు తగ్గించేలా కేసీఆర్ కాంగ్రెస్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతకొంత కాలంగా కాంగ్రెస్ విమర్శలను పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న విమర్శలకు వెంటనే స్పందిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను లైట్ తీసుకుంటున్నారు. అనవసరంగా బీజేపీ చేసే విమర్శలకు స్పందిస్తే ఆపార్టీ హైలెట్ అవుతుందనే భావిస్తున్నారట.

ఇందులో భాగంగా కాంగ్రెస్ చేపట్టే ధర్నాలు, ఆందోళనలకు సులువుగా అనుమతులు ఇచ్చేలా అధికారులకు అనధికారికంగా ఆదేశాలిచ్చిట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ ప్రాధాన్యం పెంచి బీజేపీ దూకుడుకు కళ్లెంవేసేలా కేసీఆర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

‘గాంధీ’ని ఎవరు పట్టించుకోవడం లేదా?


కరోనాకు చికిత్స అందించడంలో గాంధీ ఆస్పత్రి బాగా పని చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని విపక్షాలు చేస్తున్న అసత్యలను నమ్మవద్దని మంత్రులు చెబుతున్నారు. తెలంగాణలో కోవిడ్-19 గాంధీ కేరాఫ్ అడ్రస్ గా మారాక ప్రభుత్వం ఈ ఆస్పత్రి దృష్టిసారించింది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం కరోనాపై నిరంతరం సమీక్షలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో కావాల్సిన సదుపాయాలన్ని సమకూరుస్తున్నారు. అయినప్పటికీ గాంధీ ఆస్పత్రిపై తరుచూ వివాదాలు చోటుచేసుకుండటం చర్చనీయాంశంగా మారుతోంది.

గాంధీ ఆస్పత్రి నుంచి వందల సంఖ్యలో కరోనా రోగులు కోలుకొని వెళుతుండగా మరోవైపు తీవ్ర వివాదాలు కూడా నెలకొంటున్నారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు సరైన వైద్యం అందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా మృతదేహాలు మాయం అవడం.. ఒకరికి బదులుగా మరొకరు శవాలను బంధువులకు అప్పగించడం వంటివి వెలుగుచూశాయి. పలువురు కరోనా రోగులు తమకు కనీసం ఆక్సిజన్ కూడా పెట్టడంలేదని సోషల్ మీడియాలో పోస్టుపెట్టడం సంచలనంగా మారాయి. ఈ ప్రచారం మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు.

సామాన్యులు గాంధీకి.. ప్రజాప్రతినిధులు ప్రైవేటుకు..!

తాజాగా గాంధీలో చోటుచేసుకున్న సంఘటన అక్కడి పరిస్థితులు ఎంతలా దిగజారాయో తెలియజేస్తోంది. గాంధీలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెంది 8గంటలైనా పట్టించుకోకపోవడం శోచనీయంగా మారింది. మృతదేహాన్ని కనీసం వార్డు నుంచి మార్చురీకి తరలించక పోవడంపై తోటి రోగులను కలవరానికి గురిచేసింది. కొందరు ఈ దృశ్యాలను వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం బయటికి పొక్కింది. ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది ఆందోళన చేస్తుండటం వల్ల మృతదేహాన్ని తరలించడం ఆలస్యమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. అయితే మృతదేహం కుళ్లిపోయినా పట్టించుకోలేదనే వార్తల్లో నిజం లేదంటున్నారు.

మరోవైపు గాంధీలోని పోరుగు సేవల కింద పనిచేస్తున్న నర్సులు ఐదురోజులుగా సమ్మె చేస్తున్నారు. దీనికితోడు మంగళవారం నుంచి నాలుగో తరగతి ఉద్యోగులు కూడా సమ్మె దిగడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బందితో ప్రభుత్వం చర్చలు జరుపకుండా మీనమేషాలు లెక్కించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నివారణకు కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వైద్య సిబ్బంది సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాంధీలో పరిస్థితి చేయిదాటకముందే ప్రభుత్వం చొరవచూపి సమస్యను పరిష్కరించాలని సర్వత్రా కోరుతున్నారు.

టీటీడీ, కంటైన్మెంట్ జోన్ చేస్తా అంటే వద్దన్నారుగా!

TTD

TTD

తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో గతంలో కంటైన్‌మెంట్‌ జోన్‌ గా ప్రకటించిన కొన్ని గంటలకే ప్రకటనను విరమించుకున్న సంగతి తెలిసిందే.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు, మండలాల్లో పలు వార్డులు, గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 46కు పైగా కంటైన్మెంట్ జోన్లను నిర్ణయించారు. అయితే, తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే తప్ప ప్రజలు నివసించే ప్రదేశం కాదని, కరోనా పాజిటివ్ వచ్చిన వారంతా తిరుపతిలో నివాసం ఉండేవారే తప్ప తిరుమలలో ఉండేవారు కాదని.. అలాంటప్పుడు తిరుమలను కంటైన్మెంట్ జోన్‌ గా ఎలా ప్రకటిస్తారని టీటీడీ అధికారులు అర్థం లేని లాజిక్ వ్యాఖ్యలు చేశారు. దింతో కరోనా పై అక్కడ పెద్దగా దృష్టి సరించలేక పోయారు. అందువల్ల తిరుమలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తిరుమల దేవస్థానంలో మరో నలుగురు అర్చకులకు కరోనా సోకినట్లు సమాచారం. అలాగే తిరుమలలోని బాలాజీ నగర్‌ లో నివాసముంటున్న ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానానికి చెందిన మొత్తం 8మంది అర్చకులకు కరోన పాజిటివ్‌గా నిర్థారణైందని అన్నారు. కాగా, ప్రస్తుతం ఆలయంలో దర్శనాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ర్యాపిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే అవి లక్ష్యానికి తగ్గట్టుగా జరగడం లేదని, అందులో యాత్రికుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వేగవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాలు ఆదేశాలు జారీ చేశారు.

“టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు పెంచాలి. ముమ్మరంగా చేయాలి. అవసరం ఉన్న వారికి, అనుమానితులకు పరీక్షలు చేయాలి. దానికి తగ్గట్టుగా ట్రూనాట్ మిషన్లను కూడా కొనుగోలు చేయాలని ఆదేశించాం. ఇక ఉద్యోగుల భద్రత ముఖ్యం. వారికి సమస్యలు రాకుండా చూడడానికి ఉద్యోగుల క్యాంటీన్ లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం అందించాలని నిర్ణయించాం. ఉద్యోగుల భద్రతపై తగిన శ్రద్ధ పెడుతున్నాం. ఇళ్లకు వెళ్లిన సిబ్బంది వివరాలు కూడా సేకరిస్తున్నాం. వారి ఆరోగ్య పరస్థితిపై ఆరా తీస్తున్నాం” అంటూ ఈవో తెలిపారు.

కరోనావైర‌స్‌ లాక్‌ డౌన్‌ కారణంగా 82 రోజుల పాటు నిలిచిపోయిన దర్శనాలకు గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతిచ్చింది. నాటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం దర్శనాలకు వస్తున్నారు. భక్తులతో పాటుగా సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. అయినప్పటికీ తిరుమలలో పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి.

ఒక్క తిరుమలలోనే ఇప్పటికి 100 మందికిపైగా పాజిటివ్‌ గా తేలారు. దిగువన తిరుపతిలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండడం, వారిలో టీటీడీ సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో కలవరం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఉద్యోగుల భద్రతకు ఢోకా లేకుండా పరీక్షలు పెంచి, రోగనిరోధక శక్తికి అవసరమైన ఆహారం కూడా అందించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

ట్విట్టర్ లో చెలరేగిపోతున్న పవన్ పై హ్యాష్ టాగ్!

Pawan kalyan

పవర్ స్టార్.. ఈ సౌండ్‌కి కొంత మందిలో పూనకం వస్తుంది. “పవన్ కళ్యాణ్ “ఈ పేరు వింటే కొంత మంది రక్తం ఉరకలేస్తుంది. జనసేనాని.. ఈ పేరు చెబితే కొన్ని లక్షల పిడికిళ్లు పైకి లేస్తాయి. మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. సినిమా ఒక్కటే ప్రపంచం కాదు, ప్రజా సేవలేని జీవితం దండగ అని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలి ప్రయత్నంలో విజయాన్ని అందుకోలేకపోయినా.. సేవకు కొలమానం ప్రజలు వేసే ఓట్లు కాదు అని జనసైనికుల్లో స్ఫూర్తిని నింపుతూ ముందుకెళ్తున్నారు. ప్రజల్లో మమేకమవుతున్నారు.

అన్నయ్య చిరంజీవి లాగే రాజకీయాల్లో అడుగుపెట్టి జనసేన పార్టీ స్థాపించి పాలిటిక్స్‌ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొన్నటి వరకు ఎన్నికల హడావుడి దృష్ట్యా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఇపుడు మళ్లీ సినిమాల వైపు దృష్టి సారించారు. ఈ కోవలోనే హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. అంతేకాదు క్రిష్, హరీష్ శంకర్‌‌ తో పాటు పలువురు దర్శకులతో సినిమాలు చేయడానికి ఓకే చెప్పాడు. ఇక సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. దానికి నెలన్నరకు పైగా సమయం ఉంది. ఈ లోగా పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఇప్పటి నుంచే సందడి చేయడం మొదలు పెట్టారు. హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ ను క్రియేట్ చేసి ట్విట్టర్‌ లో ట్రెండ్ చేసారు. కేవలం 24 గంటల్లోనే 27.3 మిలియన్ ట్వీట్స్ వచ్చాయంటే పవన్ కళ్యాణ్ ఏ రేంజ్‌ లో చెలరేగిపోయారో సెపరేట్‌ గా చెప్పాల్సిన పనిలేదు. ఈ హడావుడి పవన్ బర్త్ డే వరకు కొనసాగుతుందని పవన్ అభిమానులు స్పష్టం చేశారు.

గొప్పల బాబు…మారేదెప్పుడు?

దేశంలోని ఏ రాజకీయనాయకుడిలో లేని స్వభావం బాబులో ఒకటుంది. అదే ఆత్మ స్తుతి..తనని తానే వీరలెవల్లో పొగుడుకోవడం బాబుకు బాగా నచ్చిన వ్యవహారం. ఏదైనా ఒక విజయం, ఫలితంలో క్రెడిట్ బాబు ఎవరికీ పంచరు.ఏదైనా నా వలనే అంటారు. మనం అనే పదం ఆయన నోటి నుండి రాదు. ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ప్రజలు తమకు ఇచ్చిన బాధ్యతగా ఆయన ఫీలవ్వరు. అధికారం దక్కిన వెంటనే ప్రజా సేవకుడని మరచిపోయి…తాను దేవుడు నియమించిన ఓ రాజుగా భావిస్తాడు. ప్రజాస్వామిక దేశంలో ఏ పాలకుడు మాత్రం ‘నేను ఇస్తున్న పెన్షన్స్ తీసుకుంటున్నారు, నేను వేసిన రోడ్లపై నడుస్తున్నారు.. నాకు ఓటు వేయరా’ అని అంటాడు చెప్పంది. ఆ మాటలతోనే అర్థం అవుతుంది బాబు పదవిలో ఉంటే ఆయనకొక అతీత శక్తిగా భావిస్తారని. ప్రజల సొమ్ముతో చేసే సంక్షేమ పథకాలను తన సొమ్ముతో చేస్తున్నట్లుగా చెప్పుకుంటూ, ఓటు వేయాలని బెదిరించిన ఏకైక ముఖ్యమంత్రి.

బాబుకు సైతం ఆ నేతలు దొరకడం లేదుగా?

సభావేదిక సాక్షిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజక వర్గాలకు నేను పనులు చేయనని చెప్పి, ప్రజా స్వామ్యంలో ప్రజల తీర్పుకు ఎంత గౌరవం ఇస్తాడో నిరూపించాడు. అధికారంలో ఉండగా అరచేతిలో వైకుంఠం చూపించిన బాబు, ప్రతిపక్షంలోకి వచ్చాక కొత్త రాగం అందుకున్నారు. రాష్ట్రానికి ఎలాంటి విపత్తు దాపురించినా జగన్ ఫెయిల్ అయ్యాడని..’అదే నేనుంటేనా’ అంటున్నాడు. మీరు ఉన్నప్పుడు ఏమి చేయలేదనే కదా ప్రజలు మిమ్ముల్ని ప్రతిపక్షానికి పరిమితం చేసింది. అధికారంలో ఉన్న ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమం చేసి ఉంటే…ప్రజలు మిమ్మల్ని 23సీట్లకు ఎందుకు పరిమితం చేస్తారు చెప్పండి.

టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

నేతలు చెప్పే గొప్పలు విని ఓట్లు వేసే రోజులు పోయాయి. ఏదైనా చేతల్లో చూపిస్తేనే నెక్స్ట్ అధికారం లేదంటే…పీఠం దిగాల్సిందే. బాబుకు మాత్రం ఇంకా ఆ హిపోక్రసి వీడడం లేదు. ఇంకా తానే ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే భ్రమలో ఉన్నారు. కరోనా కట్టడిలో దేశం మొత్తం జగన్ భేష్ అంటుంది. విపరీతంగా విజృంభిస్తున్న కరోనా కట్టడి విషయంలో జగన్ చాలా వరకు విజయం సాధించారు. ఆర్ధికంగా పరిపుష్టంగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు చేతులెత్తేశాయి. జగన్ వేలల్లో కరోనా టెస్ట్ లు నిర్వహిస్తూ నియంత్రిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కరోనా చికిత్స తీసుకొని బయట పడిన వారికి రూ. 2000 ఆర్థిక సాయం చేస్తున్నారు. నేటి నుండి వైరస్ కారణంగా మరణించిన వారి అంత్యక్రియల కోసం రూ. 15000 అందించనున్నారు. మొబైల్ కరోనా టెస్టుల కోసం 50కి పైగా బస్సులను సిద్ధం చేశారు. కరోనా కట్టడిలో బాబు ఇంతకు మించి ఏమి చేయగలడో సెలవిస్తే…బాగుంటుంది.

కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ బాగానే పడిందిగా?


కరోనా మహమ్మరిని ప్రభుత్వం అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. వీటిని తిప్పికొట్టేక్రమంలో కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రతిపక్షాలు కరోనాపై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, తెలంగాణలో టెస్టులు ఎక్కువగా చేయనప్పటకీ రికవరీ ఎక్కువగా ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇలాంటి సమయంలోనూ ప్రతిపక్షాలు విమర్శలుమాని సలహాలిస్తే స్వీకరిస్తామని చెప్పారు. ఇది రాజకీయాలకు తగిన సమయం కాదనే భావనను కేటీఆర్ వ్యక్తం చేశారు.

అయితే కేటీఆర్ వ్యాఖ్యలేమోగానీ సీఎం కేసీఆర్ భారీ పంచులు పడుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత వెంకటస్వామి కౌంటరిచ్చారు. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ రోజైనా విపక్షాలను పిలిచి మాట్లడారా? అని ప్రశ్నించారు. ముందుగా విపక్షాలను కేసీఆర్ గుర్తించాలన్నారు. తెలంగాణలో నిజాం పాలనను తలపించేలా టీఆర్ఎస్ సర్కారు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రధాని మోదీ విపక్షాలతో మాట్లాడి ప్రణాళికతో ముందుకెళుతున్నారని గుర్తుచేశారు.

కేసీఆర్ ను వెంటాడుతున్న ఆ ‘అర్థరాత్రి’ భయం

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేయడం అవసరమా? అంటూ నిలదీశారు. హైదరాబాద్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కేసీఆర్ ఫౌంహౌజ్ నుంచి పాలన సాగించడం ఏంటని ప్రశ్నించారు. కొద్దిరోజులుగా సీఎం కన్పించకుండా పోయారని ఎద్దేశా చేశారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే నాయకులను అరెస్టు చేస్తున్నారని, ఎంపీలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ పై వస్తున్న విమర్శలు తిప్పికొట్టేందుకు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీకే బూమరాంగ్ అవడం గమనార్హం.