Home Blog Page 8404

పూజా హెగ్డేతో అక్కినేని హీరో డేటింగ్ !


అక్కినేని అఖిల్ కి ‘మనం’ సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ వచ్చింది. జస్ట్ గెస్ట్ రోల్ కే స్టార్ డమ్ సంపాధించాడని అక్కినేని ఫ్యాన్స్ మహా సరదా పడ్డారు. పాపం వారి సరదా అఖిల్ సినిమా రిలీజ్ రోజే అడ్రెస్ లేకుండా పోయింది అనుకోండి. సూపర్ స్టార్ అవుతాడనుకున్న హీరో కాస్త.. చివరికి ఎవరేజ్ హీరో రేంజ్ కి ఎదగడానికి కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. దీనికి తోడు లవ్ మ్యాటర్ లో కూడా ఇప్పటికే ఒకసారి దెబ్బ తిన్నాడు ఈ యంగ్ హీరో. అప్పటి నుండి లవ్ కి దూరంగా ఉంటున్నాడనుకుంటే.. ఏకంగా ఓ స్టార్ హీరోయిన్ తోనే డేటింగ్ లో ఉన్నాడని తాజాగా సినీ సర్కిల్స్ లో ఘాటు రూమర్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదట. ప్రస్తుతం మనోడితో ఒక సినిమా కూడా చేస్తుందట.

అనుష్క అందుకే పెళ్లి చేసుకోవట్లేదట !

కాగా అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో మాత్రమే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన టాల్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అఖిల్ – పూజా హెగ్డేల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారని.. ఆ తరువాత నుండే ఇద్దరి మధ్య డేటింగ్ కూడా నడుస్తోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్స్ లో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. అఖిల్ లేదా పూజా స్పందించాల్సిందే.

ఓటీటీలో ‘నవరసాలు’ పండించనున్న సూర్య

అన్నట్టు వీరి కలయికలో రానున్న సినిమాలో కూడా లవ్ సీన్స్ చాలా బాగా వచ్చాయని.. అఖిల్ – పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ కూడా చాలా న్యాచురల్ గా వచ్చిందని.. ఓవరాల్ గా సినిమాలోనే రొమాన్స్ హైలెట్ గా నిలుస్తోందట. అయితే ఈ సినిమా హిట్ అవ్వకపోతే అఖిల్ మార్కెట్ మరింతగా పడిపోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా ఈ సినిమా కీలకం. రిజల్ట్ తేడాగా వస్తే.. మళ్ళీ మనోడికి ఇక డైరెక్టర్ గా అవకాశాలు రావడం కష్టమే. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోండంగా… దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నాడు. కనీసం భాస్కరైనా అఖిల్ కి భారీ విజయాన్ని అందిస్తాడేమో చూడాలి.

సినిమా వాళ్లకు ఒక పీడకల !


మొదటి బాల్ సిక్స్.. మిగిలిన బాల్స్ అన్ని వికెట్స్ అన్నట్లు ఉంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీల స్థితి. ముఖ్యంగా తెలుగు పరిశ్రమ విషయానికి వస్తే.. ఈ 2020 మొదట్లోనే ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు‘ లాంటి సూపర్ హిట్ చిత్రాల రూపంలో ఈ ఇయర్ ఓపెనింగ్ అదిరిపోయింది. ఈ రెండు సినిమాలు రూ. 200 కోట్లకు పైగా వసూలు చేయడంటతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి ఊపు తీసుకొచ్చాయి. నిజానికి ఈ విజయాలు చూసి ఈ ఏడాది అంతా ఈ శుభారంభమే కొనసాగుతుందని.. తరువాత వచ్చే సినిమాలు కూడా ఇలాగే విజయాల్ని సాధించాలని అంతా అనుకున్నారు. కానీ ఆ విజయోత్సాహానికి పై రెండు సినిమాల దగ్గరే కామా పడిపోవడంతో సినిమా జనానికి ఏమి చేయాలో తెలియడం లేదు.

అనుష్క అందుకే పెళ్లి చేసుకోవట్లేదట !

అసలు ఆ మాటకొస్తే.. పై రెండు చిత్రాల తర్వాత విడుదలైన చెప్పుకోదగిన సినిమాలు ఏవీ క్లీన్ హిట్ అనిపించుకోలేక బాక్సాపీస్ వద్ద ప్లాప్ లుగా నిలిచాయి. కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ జస్ట్ ఓకే రిపోర్ట్స్ తెచ్చుకోగా ఆ తర్వాత వచ్చిన ‘డిస్కో రాజా’ పరాజయం అవుతూనే రవితేజ మార్కెట్ స్థాయిని కూడా తగ్గించేసింది. ఇక నాగ శౌర్య ‘అశ్వధ్ధామ’ కూడా డబ్బులు చేసుకోలేక అలాగే ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేక.. సైలెంట్ గా సైడ్ అయిపోయింది. ఇక సమంత, శర్వాల ‘జాను’ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక వీటి మధ్యలో చిన్న సినిమాలుగా వచ్చిన ‘సవారి, చూసీ చూడంగానే’ లాంటి చిత్రాలు కనీసం చిన్న విజయాన్ని కూడా సాధించలేదు.

ఎక్స్ క్లూజివ్ : కవలలుగా మహేష్ బాబు..!

అలాగే విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పూర్తిగా చేతులు ఎత్తేయడం.. ఆ తరువాత కరోనా రాక.. ఇక సినిమాల రిలీజ్ కూడా ఏమి లేకుండా పోయాయి. కరోనా ఎప్పుడు పోతుందో.. తెలియదు. పోనీ ఓటీటీలోనైనా సినిమాలను రిలీజ్ చేద్దామంటే.. పెట్టిన పెట్టుబడులు కూడా రావేమో అని అనుమానం. మొత్తానికి ఈ ఏడాది ఎవ్వరికీ కలిసిరాలేదు.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి.. ఇండస్ట్రీలోని జనాలకు ఈ సంవత్సరం ఒక పీడకలగా మిగిలిపోనుంది. ఇప్పట్లో థియేటర్లు తెరవరు. మళ్ళీ షూటింగ్ లు మొదలుపెట్టాలంటే భయపడే పరిస్థితి. వీటన్నిటి మధ్యలో సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కచ్చితంగా సినిమా వాళ్లకు ఈ ఏడాది ఒక పీడకలే.

మాస్కులు పెట్టుకోలేదని కోటి ఫైన్..!


కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తే పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్న మహమ్మరి మాత్రం కంట్రోల్ కావడంలేదు. రోజురోజుకు కొత్త కేసులు వేలల్లో నమోదవుతుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా అవగాహన కల్పిస్తునే నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరఢా ఝుళిపిస్తున్నాయి. ఇందులో భాగంగా బెంగుళూరులో కరోనా నిబంధనలు పాటించని వారి నుంచి ఏకంగా 1.91కోట్ల రూపాయాలు వసూలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

వాక్సిన్ అందించే శక్తి భారత్ కే ఉందా?

దేశంలోని మహరాష్ట్ర, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, పూణేల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు ప్రజలంతా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కొందరు పెడచెవిన పెట్టడంతో వారిపై భారీ మొత్తంలో జరిమానా విధించింది. అయితే బెంగూళూరులో గడిచిన ఒక్కనెలలో మాస్కులు ధరించని వారు నుంచి ఎంత వసూలు చేసిందో తెలిస్తే అక్కడి ప్రజలు కరోనా పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది.

బెంగుళూరులో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో బెంగూళూరు మరోసారి సంపూర్ణ లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. అయితే మాస్కులు లేకుండా రోడ్లపై ఎవరైనా వస్తే వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు చేస్తూ బెంబేలెత్తిస్తోంది. జూన్‌ నెలలో బెంగళూరు వ్యాప్తంగా మాస్కులు లేని వారి నుంచి కోటి రూపాయాల జరిమానాలు వసూలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంసీ చెబుతున్నారు.

ఎట్టకేలకు కరోనాపై కేసీఆర్ సర్కార్ కు జ్ఞానోదయం?

బెంగుళూరులో మాస్కులు ధరించనివారు, భౌతిక దూరం పాటించని వారిని గత నెలలో 50,706మందిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరి నుంచి ఏకంగా రూ.1.91కోట్లు వసూలు చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో మాస్కులు ధరించని వారి నుంచే కోటి రూపాయాలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా నిబంధనలు పాటించకుంటే జేబులకు చిల్లుతప్పదనే సందేశాన్ని ప్రభుత్వం గట్టిగా పంపింది. అయితే ప్రభుత్వం ఫైన్లు విధించినప్పటికీ కొందరు కరోనా నిబంధనలు పాటించడం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. వీరిపట్ల ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!

అనుష్క అందుకే పెళ్లి చేసుకోవట్లేదట !


యోగా టీచర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ‘స్వీటీ అనుష్క‘ ఇప్పటికీ ఒక వెలుగు వెలిగిపోతుందంటే.. దానికి కారణం ఆమె క్యారెక్టరే. పెద్దగా యాక్టింగ్ రాకపోయినా.. తన మంచి మనసుతో దర్శకుల అభిమానాన్ని సంపాధించింది. దాంతో వరుస అవకాశాలు.. భారీ విజయాలు మధ్య అనుష్క కెరీర్ ఓ రేంజ్ కి వెళ్ళింది.. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది కూడా. ఇంతవరకు బాగానే ఉన్నా.. అనుష్క పర్సనల్ లైఫ్.. ముఖ్యంగా ఆమె పెళ్లి పై వచ్చే పుకార్లు.. దానికి తగ్గట్లే ఇప్పట్లో పెళ్లి గురించి కబురు చెప్పే ఉద్దేశ్యం లేనట్టు అనుష్క కనిపించడం.. మొత్తానికి అనుష్క వివాహం విషయంలో అనేక మార్లు రూమర్లు వస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.

నెట్‌ఫ్లిక్స్‌లో జాన్వీ కపూర్ కొత్త సినిమా.. రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

ఆమె వివాహం చేసుకోబోయే వరుడు అంటూ ప్రభాస్ సహా ఇంకో యువ హీరో పేరు అలాగే ఓ సీనియర్ దర్శకుడి కొడుకు పేరు కూడా బాగా చర్చకు వచ్చినా వాటి పై అనుష్క ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ మధ్య ఎక్కువగా టాలీవుడ్ సీనియర్ దర్శకుడి కుమారుడితో అనుష్క వివాహమనేది దాదాపు ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది రూమర్స్ కి ఆజ్యం పోస్తున్నారు. నిజానికి ఆ దర్శకుడి కుమారుడికి ఒకసారి వివాహం కాగా, అనుష్క కోసమే అతను తన భార్య నుండి డైవర్స్ తీసుకున్నాడని కూడా రాతల రాయుళ్లు సృష్టించిన మరో గాసిప్ కూడా బాగానే హల్ చల్ చేస్తోంది.

చిరు రేంజ్‌కు రెహమాన్‌ సరిపోతాడా?

అయితే తాజాగా అనుష్క పెళ్లి పై తమిళ్ మీడియాలో మరొక గాసిప్ వైరల్ అయింది. అనుష్క, ప్రభాస్ లవ్ లో ఉన్నారని.. అయితే వారి ప్రేమను ప్రభాస్ తల్లి అంగీకరించట్లేదని.. అందుకే వాళ్ళు పెళ్లికి దూరంగా ఉంటున్నారని.. ఇంట్లో వారిని ముఖ్యంగా ప్రభాస్ అమ్మగారిని ఒప్పించాకే పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారని.. అందుకే అనుష్క పెళ్లి చేసుకోకుండా ప్రభాస్ కోసం ఎదురుచూస్తుందని ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ వార్త బాగా వినిపిస్తోంది. గతంలో పుకార్ల కంటే బలంగా ఈ రూమర్ చక్కర్లు కొడుతుండటం విశేషం.

‘లక్ష్మణుడి’కి ‘సంజీవని’ దొరికేనా?


తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ భవితవ్యంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో ఆ పార్టీ బాగానే పుంజుకుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటాన్ని లక్ష్మణ్ సమర్థవంతంగా వినియోగించుకొని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని నేతలు చెబుతుంటారు. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవడంలో లక్ష్మణ్ కీలకంగా వ్యవహరించారు.

కూల్చివేతలపై కేంద్రం జోక్యం.. ఏం జరుగనుంది?

తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్ కు దీటుగా బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి లక్ష్మణే కొనసాగుతారని ప్రచారం సాగింది. అయితే బీజేపీ అనూహ్యంగా బీజేపీ అధిష్టానం కొత్త అధ్యక్షుడిని నియమించింది. కిందటి పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేసి గెలుపొందిన బండి సంజయ్ కుమార్ ను బీజేపీ కొత్త అధ్యక్షుడిగా అధిష్టానం ప్రకటించింది. నాటి నుంచి సంజయ్ కూడా టీఆర్ఎస్ సర్కార్ పై దూకుడుగా వెళుతున్నారు.

దీంతో లక్ష్మణ్ పరిస్థితి ఏంటనే టాక్ బీజేపీ శ్రేణుల్లో సర్వత్రా విన్పిస్తుంది. ఆ మధ్య లక్ష్మణ్ కు బీజేపీ రాజ్యసభ సీటు కేటాయిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పట్లో రాజ్యసభ సీటు వచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన లక్ష్మణ్ కి అధ్యక్ష పదవిగానీ, రాజ్యసభ సీటుగానీ దక్కకపోవడంపై ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రజనీకాంత్ పార్టీ ప్రకటన అప్పుడేనంటా?

అయితే లక్ష్మణ్ కు బీజేపీ అధిష్టానం జాతీయ స్థాయిలో కీలక పదవీ కట్టబెట్టే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో లక్ష్మణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆయనను జాతీయ ప్రధాన కార్యదర్శి ఇవ్వాలని నేతలు కోరుతున్నారట. ఈ పదవీ దక్కితే లక్ష్మణ్ జాతీయ, రాష్ట్రస్థాయిలోనూ చక్రం తిప్పే అవకాశం ఉంటుందని ఆయన అనుచరులు లెక్కలేసుకుంటున్నారు. మరీ బీజేపీ అధిష్టానం లక్ష్మణుడికి సంజీవని ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే..!

ఆ మహా దర్శకుడికి ఓ గాఢమైన కోరిక !


తెలుగు ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. వారిలో ఎందరో మహానుభావులు.. కేవలం కథతోనే సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టిన దిగ్ధర్శకులలో వైవిధ్యానికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన అచ్చతెలుగు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. సీనియర్ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావుగారిది ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానమే అని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి జనరేషన్ కూడా ఆయన తీసిన అప్పటి సినిమాలను చూసి షాక్ అవుతున్నారంటే దానికి కారణం.. కచ్చితంగా సింగీతం శ్రీనివాసరావు క్రియేటివిటీనే.

బాలయ్య ఫ్యాన్స్ కు ఇది ఇబ్బందే !

ఆ రోజుల్లో ఆయన తీసిన ‘పుష్పక విమానం, ఆదిత్య 369, అపూర్వ సోదరులు’ లాంటి భిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలు ఇప్పటికీ గొప్ప వైవిధ్యమైన చిత్రలుగా నిలుస్తున్నాయి. తన అభిరుచి ఇప్పటికీ కొత్తగానే అనిపించేలా ముద్ర వేసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ప్రస్తుతం ఆయన 90 ఏళ్లకి సమీపంలో ఉన్నా.. ఓ గొప్ప సినిమా తీద్దామనే ఆలోచిస్తున్నారంటే, సినిమా పై ఆ మహానుభావుడి ఫ్యాషన్ ను అర్ధం చేసుకోవచ్చు.

ఛాన్స్ లు కోసం హాట్ నెస్ కే యాంకర్ ఫిక్స్ !

సింగీతంగారు గత నాలుగు సంవత్సరాలుగా ఒక స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారు. ఈ జనరేషన్ సినిమాల గురించే ఆలోచిస్తూ ఇప్పటి ట్రెండ్ కి అనుగుణంగా స్క్రిప్ట్ ని రాసుకున్నారు. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్నా.. ఆయన తన పద్దతిలో ఒక సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ ఈ లెజెండరీ దర్శకుడిని నమ్మి నిర్మాతలు ముందుకు రావట్లేదని టాక్. మొదట ‘ఆదిత్య 369’ సీక్వెల్ తీయాలనుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ మరో స్క్రిప్ట్ రాసుకున్నా.. అదీ గత సంవత్సరం నుండి సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇప్పుడు కరోనా.. పాపం మరో సినిమా చేయాలనేది సింగీతం శ్రీనివాసరావుగారి గాఢమైన కోరిక. మరి ఆ మహా దర్శకుడి కోరిక నెరవేరుతుందా..!

ఎట్టకేలకు కరోనాపై కేసీఆర్ సర్కార్ కు జ్ఞానోదయం?


ఎవ్వరు ఏమన్నా… మారలేదు కేసీఆర్.. హైకోర్టు ఆగ్రహించినా.. సామాన్యుడు విమర్శించినా.. మీడియా వేలెత్తి చూపినా.. కరోనాపై పట్టించుకోలేదు.. టెస్టులు చేయమని హైకోర్టు చెప్పినా వినలేదు. హైదరాబాద్ లో పరిస్థితి చేయిదాటినా పెద్ద ఎత్తున టెస్టులు జరపలేదు. కానీ ఏమైందో ఏమో.. మొన్న ఓ ఫైన్ మార్నింగ్ కేసీఆర్ కు జ్ఞానోదయమైనట్టు ఉంది.

తెలంగాణలో ఇంతటి అధ్వాన వైద్యసేవలకు నిర్లక్ష్యం వహించిన వైద్యశాఖ స్పెషల్ సెక్రెటరీని అటవీశాఖ సెక్రటరీగా బదిలీచేశారు. వైద్యశాఖ కమిషనర్ అయిన ఐఏఎస్ ను మార్చేశారు. ఐత్త సీనియర్ ఐఏఎస్ బ్యాచ్ ను దించారు. అప్పటి నుంచి తెలంగాణ మారిపోయింది. నిన్నటి నుంచి వైద్య సేవల్లో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది.

దుర్మార్గం.. కరోనాతో వ్యాపారం..!

అన్నివైపుల నుంచి విమర్శలు రావడం.. ఉస్మానియా ఆస్పత్రిలో మురుగునీరు వరద నీరు పోయి పీపీఈ కిట్స్ కొట్టుకుపోయాక జాతీయ స్థాయిలో వార్త అయ్యింది. సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టి ఉస్మానియాలో పారిస్తున్నాడంటూ నెటిజన్లు ట్రోల్స్ చేశారు. ఇలా పెద్ద ఎత్తున విమర్శలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. వెంటనే తెలంగాణలో కరోనాపై పడింది. ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ ను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కేవలం రోజుకు 3వేలు మాత్రమే చేసే పరీక్షలను తాజాగా 14వేలకు పెంచింది. అంటే ఏకంగా 5 రెట్లు ఎక్కువ చేసింది. రోజుకు పదివేలకు పైగానే టెస్టులు చేస్తోంది.

కరోనా టెస్టులు చేయకపోవడం.. బులిటెన్ లోనూ సరైన వివరాలు చూపకపోవడం.. పెద్ద సంఖ్యలో జనాలు కరోనా టెస్టుల కోసం హైదరాబాద్ లో క్యూలు కడుతుండడంతో ఎట్టకేలకు కేసీఆర్ సర్కార్ గేర్ మార్చింది. తెలంగాణ వైద్యశాఖను ప్రక్షాళన చేసిన కేసీఆర్ సర్కార్.. ఇక కొత్త అధికారులను నియమించి వైద్యవ్యవస్థలోనూ వేగాన్ని పెంచారు. పెద్ద ఎత్తున టెస్టులను చేస్తున్నారు.

రాజధానిలో కుప్పలు తెప్పలుగా టు-లెట్లు!

ఇన్నాళ్లు కేవలం జిల్లాలను బట్టి కేసులు పేర్కొనే తెలంగాణ హెల్త్ బులిటెన్ రూపురేఖలు పూర్తిగా మార్చేసింది. వార్డులు.. గల్లీల్లో కూడా ఎక్కడ ఎన్ని ఉన్నాయనే దానిపై పారదర్శకంగా వివరాలు బులిటెన్ లో పేర్కొంటోంది. హైకోర్టు చెప్పినట్టు ఏ వార్డులో ఎంతమందికి కరోనా సోకింది? ఏ ఆస్పత్రిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి..? సమగ్ర వివరాలతో బులిటెన్ రిలీజ్ చేస్తోంది. నిన్నటి నుంచి ఈ మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో కరోనా కేంద్ర ఆస్పత్రి గాంధీలో అందుబాటులో ఉన్న బెడ్స్ తోపాటు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా టెస్ట్ సెంటర్స్ ఇలా అన్ని వివరాలను బులిటెన్ లో పొందుపరుస్తోంది.

ఇలా చుట్టుముడుతున్న కరోనా వైఫల్య విమర్శలతో కేసీఆర్ సర్కార్ పూర్తిగా ప్రక్షాళన చేసినట్టు అర్థమవుతోంది.. నిన్నటి తాజా బులిటెన్ చూసినట్టైతే.. ఏకంగా నిన్న ఒక్కరోజే 14వేల టెస్టులకు పైగా చేయడం గమనార్హం. నిన్న 1676 పాజిటివ్ కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 41వేలకు చేరింది. మొత్తానికి కరోనా విషయంలో కాస్తంత సీరియస్ గా కేసీఆర్ సర్కార్ ముందుకెళ్లడం ఊరటగా చెప్పవచ్చు.

పేదలు తగ్గిపోతారటగా..!

Poor people

Poor people

ఐక్యరాజ్య సమితి దేశ పేద ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో రికార్డు స్థాయిలో పేదరికం తగ్గిందని ఐరాస తన నివేదికలో తెలిపింది. 2005-06 నుంచి 2015-16 మధ్యన 27.3 కోట్ల మంది అనేకరకాలుగా పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. ఈ విభాగం నుంచి భారీసంఖ్యలో జనభా బయటపడిందని వెల్లడించింది.

ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్‌ పేదరికం, మానవ అభివృద్ధి కార్యక్రమం (ఓపీహెచ్‌ఐ) ఈ నివేదికను విడుదల చేశాయి. 75 దేశాలను అధ్యయనం చేయగా 65 దేశాల్లో 2000-2019 మధ్య పేదరికం తగ్గిందని వెల్లడించాయి. ఆరోగ్యం, విద్య, జీవనం, మెరుగైన ఉపాధి ప్రమాణాలు కొరవడటం, హింస, వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం వంటి అంశాలను పేదరికం కొలిచేందుకు ప్రమాణాలుగా తీసుకున్నారు.

పదేళ్ల కాలంలో భారత్‌లో ఏకంగా 27.3  కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించింది. ఆర్మేనియా, భారత్‌, నికరగ్వా, ఉత్తర మాసిడోనియా దేశాలు అంతర్జాతీయంగా  పేదరికం సూచీ విలువను ఐదు నుంచి పదేళ్ల కాలంలో తగ్గించుకున్నాయని  తెలిపింది. ప్రపంచ జనాభాలో ఐదోవంతు ఈ నాలుగు దేశాల్లోనే ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్‌, బొలీవియా, గాబన్‌, గాంబియా, గయానా, లైబీరియా, మాలి, మొజాంబిక్‌, నైగర్‌, నేపాల్‌, రువాండ దేశాల్లోనూ పేదరికం తగ్గిందని నివేదిక తెలిపింది.

అభివృద్ధి చెందుతున్న 107 దేశాల్లో 130 కోట్ల మంది అంటే 22% మంది ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారని వెల్లడించింది. పేదరికం ప్రభావం ఎక్కువగా చిన్నారుల పైనే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ 130 కోట్ల పేదల్లో సగం మందికి ఇంకా 18 ఏళ్లు నిండలేదు. 10.7 కోట్ల మంది వయసు 60 దాటింది. కొవిడ్‌ సమయంలో వీరంతా ప్రమాదంలో ఉన్నట్టే! ఇక పేదల్లో 84.3% సబ్‌ సహారన్‌ ఆఫ్రికా ప్రాంతంలోనే ఉన్నారు. పది దేశాల్లో 60% మంది చిన్నారులకు వ్యాక్సినేషన్‌ జరగలేదు. నైజీరియా, భారత్‌, పాకిస్థాన్‌, ఇండోనేసియాలో 40% మంది చిన్నారులకు డీటీపీ3 వ్యాక్సిన్‌ వేయలేదు.

2100 లో తగ్గిపోనున్న భారత్ జనాభా?

Indian population

Indian population

2100 కల్లా భారత్ జనాభా తగ్గిపోనుందని ఓ ప్రముఖ అధ్యయనం అంచనా వేసింది. కానీ అప్పటి కల్ల ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని లాన్సెట్ అధ్యయనం అంచనా వేసింది. 2017లో 130 కోట్లుగా ఉన్న భారత జనాభా, ఈ శతాబ్దం చివరి నాటికి 110 కోట్లకు చేరుకుంటుందని పరిశోధకులు అంటున్నారు.

1960లో దేశంలో సంతానోత్పత్తి రేటు 5.91గా ఉంది. ఇప్పుడు అది 2.24కు తగ్గిపోయింది. మిగతా దేశాలు సంతానోత్పత్తి రేట్లను పెంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నా, భారత ప్రధాని నరేంద్ర మోదీ చిన్న కుటుంబాలే మేలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

‘‘జనాభా విస్ఫోటనం వల్ల భావి తరాలకు చాలా సమస్యలు వస్తాయి. అయితే, ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారిని తీసుకువచ్చేముందు, వారి అవసరాలు తీర్చగలమా, బాగా చూసుకోగలమా అన్న ఆలోచన చేసే వర్గం ఉంది. వాళ్లు చిన్న కుటుంబాలుగా ఉండటం ద్వారా తమ దేశ భక్తిని చాటుకుంటారు. వాళ్ల నుంచి మిగతా వాళ్లు నేర్చుకోవాలి’’ అని గత ఏడాది మోడీ ఓ ప్రసంగంలో అన్నారు.

వాక్సిన్ అందించే శక్తి భారత్ కే ఉందా?


ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించే సత్తా భారత్ కే ఉందనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నాయి. తాజాగా మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా భారత్ పైనే ఆశలు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి కరోనా వాక్సిన్ అందించే సత్తా ఒక్క భారత్ కే ఉందని కితాబిచ్చారు. భారత్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉందని గుర్తుచేశారు. భారతదేశం కరోనా వ్యాక్సిన్ తయారుచేస్తే ప్రపంచమంతా బతుకుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత ఫార్మా కంపెనీలు ఇప్పటికే ఎంతో కృషి చేస్తున్నారు. రేయింబవళ్లు భారతీయ సైంటిస్టులు కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికే గ్లేన్ మార్క్ ఫార్మా కంపెనీ కరోనా డ్రగ్ ను తయారుచేసి కరోనా వ్యాక్సిన్ తయారీపై ఆశలు రేపింది. అదేవిధంగా హెటోరో సంస్థ కరోనాకు ఇంజెక్షన్ తయారుచేసి సైంటిస్టులో జోష్ నింపింది.

దుర్మార్గం.. కరోనాతో వ్యాపారం..!

ఇవన్నీ కూడా ప్రాథమిక కరోనా లక్షణాలున్న వారికి పనిచేస్తాయని ఆ సంస్థలు వెల్లడించాయి. అయితే పూర్తిస్థాయి కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ తయారే మార్గమని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు వ్యాక్సిన్ తయారీలో పోటీపడుతున్నాయి. భారత్ సైతం ఒకేసారి జంతువులు, మనుషులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చేపడుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నవేళ భారత ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ తయారీలో వేగాన్ని పెంచాయి.

భారత్ లో చాలా కంపెనీలు ఈ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో నిలిచాయి. ఆగస్ట్ 15 నాటికి వ్యాక్సిన్ తయారు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. భారత్ ఇప్పటికే అనేక రకాల వైరస్ లకు వ్యాక్సిన్ తయారు చేసి ఎగుమతి చేస్తోంది. వాక్సిన్ తయారు చేసే వ్యాక్సిన్ కంపెనీలు భారత్ లో ఎక్కువగా ఉండటంతో కరోనా వ్యాక్సిన్ కూడా భారత్ నుంచే వస్తుందనే ఆశతో ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.

రాజధానిలో కుప్పలు తెప్పలుగా టు-లెట్లు!

మైక్రో సాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. భారత్ వ్యాక్సిన్ తయారుచేస్తే మొత్తం ప్రపంచం బతుకుతుందన్నారు. గతంలోనూ అనేక వ్యాధులకు భారత్ వ్యాక్సిన్ తయారుచేసిందని ఆయన గుర్తుచేశారు. ఇపుడు కూడా కరోనాపై పోరులో భారత్ గెలుస్తుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచానికి అవసరమైన వ్యాక్సిన్ తయారుచేసి ఎగుమతి చేయగల సత్తా ఒక్క భారత్ కే ఉందన్నారు. అన్నిదేశాలు కోరుకుంటున్నట్లు కరోనా వ్యాక్సిన్ తయారీలో భారత్ త్వరగా విజయం సాధించి ప్రపంచానికి శుభవార్త చెప్పాలని ఆశిద్దాం.

ఆ టాప్ పత్రికను బీజేపీ ఎందుకు కొంటుంది?

APBJP


తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకు బలమైన మీడియా అండ ఉండాలని భావిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఉన్నట్టే బీజేపీ కూడా తెలుగు రాష్ట్రాల్లో బలమైన మీడియాను సంపాదించాలని ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో సీనియర్లను అంతా పక్కనపెట్టి ఫైర్ బ్రాండ్ అయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది బీజేపీ అధిష్టానం.. ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాలపై దూకుడుగా వెళుతున్నారు. బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో రోజురోజుకు దిగజారుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో బలపడేందుకు కావాల్సిన మీడియా సపోర్టు కోసం బీజేపీ చూస్తోంది.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లో టాప్ ఇంగ్లీష్ దినపత్రికను బీజేపీ కొనాలని ప్రయత్నాలు చేస్తోందట.. తెలంగాణలో అతిపెద్ద చలమణీలో ఉన్న దినపత్రికలలో ఒకటైన ఈ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దినపత్రికను సొంతం చేసుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ దెబ్బతో జగన్ బీజేపీతో కలుస్తాడా?

పలు మనీలాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్న ఆ మీడియా హౌస్ యజమానులు బీజేపీకి దగ్గరగా ఉండే కొంతమంది పెట్టుబడిదారులను సంప్రదించారని.. చర్చలు ప్రారంభించారని ఆ వర్గాలు చెబుతున్నాయి.

మీడియా హౌస్ ను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ సొంతం చేసుకున్నారు. ఇటీవలి వరకు అది అతిపెద్ద సర్య్కలేట్ ఇంగ్లీష్ దినపత్రికగా ఉంది. ఇది శక్తివంతమైన ఇంగ్లీష్ పత్రికగా ప్రసిద్ధి చెందింది. స్పోర్ట్స్ స్పాన్సర్ షిప్ లో యజమాని ఇరుక్కొని సంస్థ నష్టాలపాలైంది. దీంతో ఈ పేపర్ ను అమ్మాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అనేకమంది కొనడానికి చూసి వెళ్లారు. ఇప్పుడు బీజేపీకి దగ్గరగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఈ ఆస్తిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.

కానీ ఇక్కడే బీజేపీ లాజిక్ మిస్ అవుతోంది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీ ఇంగ్లీష్ పత్రికను కొనడం వల్ల ఉపయోగం ఏంటనేది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న. తెలుగుప్రజలపై ఒక ముద్రవేయాలంటే ప్రతీరోజు తెలుగు పత్రికే అవసరం. మరి తెలంగాణలో ఇంగ్లీష్ పత్రికను బీజేపీ కొని ఏం చేస్తుందనేది అంతుబట్టకుండా ఉంది.

-ఎన్నం

వన్‌ అండ్‌ ఓన్లీ విజయ్ దేవరకొండ


విజయ్‌ దేవరకొండ. టాలీవుడ్‌లోనే కాదు సౌత్‌ ఇండస్ట్రీలోనే ఓ సెన్సేషన్‌. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టాడు. కన్నుమూసి తెరిసేలోగా స్టార్ అయిపోయాడు. అతి తక్కువ కాలంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారిపోయాడు. మరోవైపు సోషల్ మీడియా వినియోగం పెరిగే కొద్దీ సెలబ్రిటీలకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో సౌత్ తారలకు భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. మన విజయ్ దేవరకొండ కూడా సోషల్‌ మీడియాలో దూసుకుపోతున్నాడు. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్‌‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇన్‌స్టాలో విజయ్‌ని ఫాలో అయ్యే వారి సంఖ్య అక్షరాలా 8 మిలియన్ల మార్క్ దాటింది. అంతేకాదు ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సౌత్ ఇండియన్ యాక్టర్‌గా రికార్డు సృష్టించాడు. విజయ్ తర్వాత అల్లు అర్జున్ 7.6 మిలియన్‌ ఫాలోవర్స్‌తో సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. మహేష్ బాబు (5.2 మిలియన్స్), ప్రభాస్ (4.8 మిలియన్స్), రానా (4 మిలియన్స్) తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఎక్స్ క్లూజివ్ : కవలలుగా మహేష్ బాబు..!

‘పెళ్లి చూపులు’తో హీరోగా పరిచయం అయిన విజయ్… ‘అర్జున్‌ రెడ్డి’తో ఓవర్నైట్‌ స్టార్ అయిపోయాడు. ఈ మూవీతో తెలుగు వారినే కాదు దేశ వ్యాప్తంగా సినీ ప్రియులందరి దృష్టిని ఆకర్షించాడు. అర్జున్‌ రెడ్డి హిందీలో రీమేక్‌ అయిన తర్వాత విజయ్‌ సినిమాలన్నీ హిందీలో డబ్ అయ్యాయి. దాంతో, విజయ్‌కు దేశ వ్యాప్తంగా ఫాలోవర్స్‌ పెరిగారు. అందదుకే, ఎప్పటి నుంచో తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్న మహేశ్‌, ప్రభాస్, బన్నీ కంటే కూడా విజయ్‌కే ఎక్కువమంది ఫాలోయర్స్ ఉండడం చూస్తుంటే యూత్‌లో అతని క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. దీనికి ‘ఫైటర్’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ మూవీ రిలీజైతే విజయ్‌ స్టార్డమ్‌ మరింత పెరిగే చాన్సుంది.

‘డర్టీ హరి’.. మాటల్లేవ్‌… ముద్దులే!

‘డర్టీ హరి’.. మాటల్లేవ్‌… ముద్దులే!


తెలుగు పరిశ్రమలో ఎంఎస్‌ రాజు పేరు తెలియని వారుండరు. ఆయన పేరు చెప్పగానే ఎన్నో హిట్‌ చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆయన నిర్మించిన సినిమాలు ‘శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. ‘పౌర్ణమి’ వంటి క్లాసిక్‌ మూవీస్‌ను కూడా నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారాయన. ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లను తెలుగు తెర‌కు పరిచయం చేసిన ఘనత ఆయనది. అయితే, 2008లో ‘వాన’ అనే మూవీతో డైరెక్టర్గా మారారు. అది హిట్‌ కాకపోయినా.. ఎంఎస్ రాజులో మంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం తెలిసింది. ఆపై, ‘తూనీగ తూనీగ’ అనే మరో చిన్న సినిమా తీశారు. ఆ మూవీ 2012లో వచ్చింది. ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా ఉన్న ఎం.ఎస్‌ ఇప్పుడు మరోసారి మెగాఫోన్‌ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెర‌కెక్కిన ట్రెండీ ఫిల్మ్ ‘డ‌ర్టీ హ‌రి’.

‘ఆచార్య’లో తమన్నా ఐటమ్‌ సాంగ్!

ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ నిర్మించారు. శ్రవణ్ రెడ్డి హీరో. సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ నాయిక‌లు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ త్వరలో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఇండస్ట్రీకి అందించిన రాజు ఇప్పుడు డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ‘డర్టీ హరి’ తీశారు. నేటి యూత్‌ను దృష్టిలో పెట్టుకుని మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొతున్నారు. పోస్టర్స్‌ చూస్తుంటే ఇది పూర్తిగా బోల్డ్‌ కంటెంట్‌ ఉన్న స్టోరీ అనిపిస్తోంది. ప్రతి పోస్టర్లో హీరో, హీరోయిన్ల గాఢమైన లిప్‌లాక్స్‌ ఉన్నాయి. మనం నిత్యం క‌లిసే మనుషుల్లో దాగి ఉండే ఆటవికత్వం, విచక్షణారాహిత్యం వంటి అంశాల చుట్టూ క‌థ న‌డుస్తుందని, క‌ఠోర‌మైన వాస్తవాలను ఎం.ఎస్‌. రాజు తెర‌కెక్కించారని చిత్ర యూనిట్‌ చెబుతోంది. క‌థ‌లో వినోదాన్ని కూడా అద్భుతంగా మేళ‌వించారట. మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తయ్యాయని, రిలీజ్‌కు సిద్ధంగా ఉందని నిర్మాతలు ప్రకటించారు. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్‌ చేస్తామని చెప్పారు.

దుర్మార్గం.. కరోనాతో వ్యాపారం..!


కరోనా పేరు చెబితే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొంతమంది ఈ భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా పేరుతో దోపిడీకి పాల్పడుతున్న సంఘటనలు అనేక వెలుగుచూస్తున్నాయి. కొందరు ముఠాగా ఏర్పడి కరోనాను వ్యాపారంగా మలుచుకోవడం ఆందోళనకు రేకెత్తిస్తుంది. కరోనా పేషంట్లకు అత్యవసర సమయాల్లో అందించే ప్లాస్మాను దొడ్డిదారిన సేకరిస్తూ సొమ్ము చేసుకుంటుండటంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా రోగులకు అత్యవసర సమయంలో ప్లాస్మా చికిత్స అందిస్తే అనేకమంది కోలుకుంటున్నారు. ప్రభుత్వం ఓవైపు కరోనాపై అవగాహన పెంచుతూ.. కరోనా నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని కోరుతోంది. దీంతో చాలామంది విద్యావంతులు, మానవత్వం ఉన్నవారంతా ప్లాస్మా దానానికి ముందుకొస్తూ కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. దీనినే కొంతమంది వ్యాపారంగా మలుచుకోవడం శోచనీయంగా మారింది. తాజాగా ప్లాస్మా దందాకు సంబంధించిన విషయాలు వెలుగుచూశాయి.

కరోనా ఎఫెక్ట్.. నగరం వెలవెల.. పల్లెలు కళకళ

కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్లాస్మా దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. కొన్నిసంస్థలు ప్లాస్మా దానాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నాయి. మధ్యవర్తుల ద్వారా ప్లాస్మాను సేకరించి ప్రైవేటు ఆసుపత్రుల్లో పొందుతున్న కోవిడ్‌ రోగులకు పెద్దమొత్తానికి విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కో వ్యక్తికి 200ఎంఎల్‌ ప్లాస్మాను అందించేందుకు లక్ష నుంచి 5లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ముంబైలో ఇదోక వ్యాపారంగా మారిపోయింది. అక్కడ అరడజనుకుపైగా సంస్థలు ఉన్నట్లు మహరాష్ట్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది.

ఈ వ్యాపారం పల్లెలు, నగరాలనే తేడా లేకుండా అంతగా జరుగుతుందని టాక్ విన్పిస్తుంది. హైదరాబాద్లోనూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్లాస్మా విక్రయాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. గొప్ప ఆశయంతో చేపడుతున్న ప్లాస్మా దానం చివరకు వ్యాపారంగా మారుతుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇలాంటి సంస్థలు గుర్తించి ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే రానున్న రోజుల్లో ఇదోక మాఫియా మారడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు.

రజనీకాంత్ పార్టీ ప్రకటన అప్పుడేనంటా?


సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దేవుడు ఆదేశిస్తే.. రాజకీయల్లోకి తప్పక ఎంట్రీ ఇస్తానని రజనీకాంత్ గతంలో చాలాసార్లు చెప్పారు. తమిళనాడులో ఆయన రాజకీయ ఎంట్రీ.. ఇప్పుడు.. అప్పుడు అంటూ ఎన్నోసార్లు కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగా నిలిచిపోయాయి. తాజాగా మరోసారి రజనీ పొలికల్ ఎంట్రీపై చర్చ నడుస్తోంది.

తమిళనాడులో మాజీ సీఎం జయలలిత మృతితో రాజకీయాల్లో ఖాళీ ఏర్పడింది. ఆమె స్థాయి నేతలేక రాజకీయాల్లో లోటు కన్పిస్తుంది. దీనిని భర్తీ చేసేందుకు రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు, తమిళనాడు ప్రజలు కోరుతున్నారు. పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నప్పటికీ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వస్తోంది.

తాజాగా రజనీకి అత్యంత సన్నితంగా ఉండే వ్యక్తి ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాదిలోనే రజనీకాంత్ పొలికల్ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీకి సన్నితంగా మెలిగే కరాటే తియగరాజన్ ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ పార్టీపై క్లారిటీ ఇచ్చారు. నవంబర్లో రజనీకాంత్ పార్టీ ప్రకటన ఉంటుందని తెలిపారు. తొలుత మార్చి 12న రజనీకాంత్ పార్టీ ప్రకటన చేయాలని భావించారని అయితే కరోనా కారణంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటంతో మరోసారి వాయిదా వేసినట్లు తెలిపారు.

నవంబర్లో మాత్రం పార్టీ ప్రకటన ఖచ్చితంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తియగరాజన్ గతంలో చెన్నై నగర డిప్యూటీ మేయర్ గా వ్యవహరించారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్టకేలకు రజనీ పార్టీ ప్రకటనపై క్లారిటీ రావడంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. రజనీకాంత్ ఈసారైనా అభిమానుల ఆశలు నిజం చేస్తారా? లేదో వేచి చూడాల్సిందే..!

జగన్ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడట..!


కొద్దిరోజులుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు. సొంత పార్టీ నేతలపై మరియు ప్రభుత్వంపై ఆయన విమర్శల దాడికి దిగడం హాట్ టాపిక్ గా మారింది. ఈయన వ్యతిరేక వ్యాఖ్యలు శృతి మించడంతో పార్టీ క్రమ శిక్షణా చర్యలకు సిద్ధమైంది. తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ…వైసీపీ పార్టీ తరపున ఎంపీ విజయ సాయి రెడ్డి ఆయనకు షోకాజ్ నోటీసులు పంపించారు. తనకు వచ్చిన షోకాజ్ నోటీస్ లెటర్ హెడ్ పై ఉన్న పార్టీ పేరుపై అభ్యంతరం తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పిర్యాదు చేశారు.

అప్పలరాజుకు మంత్రి యోగం?

ఐతే ఇంత గోల చేస్తున్న ఎంపీ రఘురామ కృష్ణం రాజు మాట తీరు, ఓ పక్క గిల్లుతూనే…మరో ప్రక్క చక్కిలిగిలి పెడుతున్నట్లు ఉంది. తాజాగా మీడియా ముందుకు వచ్చిన రఘురామ కృష్ణం రాజు, తానూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకిని కానీ, పార్టీకి కాదు అన్నారు. నేను పార్టీకి మరియు పార్టీ నిర్ణయాలకు నిబద్ధుడను, పార్టీ అధినేత జగన్ కి విధేయుడను అంటున్నారు. ఐతే ప్రభుత్వంలో లోపాలను మాత్రం ప్రశ్నిస్తాను అన్నారు. ఆయన దృష్టిలో పార్టీ వేరు, ప్రభుత్వం వేరట. నిజానికి ఇది నిజమే అయినా…పార్టీ నాయకుడే ప్రభుత్వాది నేత కాబట్టి పార్టీకి మించిన గౌరవం ప్రభుత్వానికి ఇవ్వాలి.

నాని మౌనం వెనుక కారణాలెంటీ?

కానీ రఘురామ కృష్ణం రాజు అలా ఆలోచించడట. ప్రభుత్వ లోపాల్ని లేవనెత్తుతాడట. దాని వెనుక కారణం వైసీపీ పార్టీ మంచి కోరడమేనట. మెరుగైన పాలన అందించి, వైసీపీ మరో 25ఏళ్ళు అధికారంలో ఉండాలట. అందుకే ఆయన అలాంటి విమర్శలు చేస్తున్నాను అన్నారు. ఇక పార్టీ అంతర్గత వ్యవహారాలు బహిరంగంగా ఎందుకు చెబుతున్నారని అడుగగా..మీడియాను ఉద్దేశిస్తూ… మీరే నాతో చెప్పిస్తున్నారు. మాట్లాడకపోతే ఒక తంటా.. మాట్లాడితే ఒక తంటా అని తనధైన శైలిలో మీడియాకు కూడా చురక వేశాడు రఘురామ కృష్ణం రాజు.

చిన్నచిన్న తప్పులకు అరెస్టులు చేయకూడదా ఉమా?


మీడియా ముందుకు నేతలు వచ్చే టప్పుడు సమగ్ర సమాచారంతో రావాలి. ఓ నేత మీడియా సాక్షిగా చేసే వివరణైనా, ఆరోపణ అయినా కనీస లాజిక్ ఫాలో కావాలి. లేదంటే…సామాన్యుడు కూడా నవ్విపోతాడు. గత రాత్రి తమిళ నాడు బోర్డర్ ఆరుంబాక సమీపంలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన కారులో రూ. 5కోట్లకు పైగా సొమ్ము పట్టుబడింది. అది వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనం అని, రాష్ట్రంలో దోచుకున్న సొమ్మును పక్క రాష్ట్రలకు తరలిస్తున్నారని, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై మాట్లాడడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రంగంలోకి దిగారు. గత ఏడాదిన్నరగా వైసీపీ నేతలు, రాష్ట్రాన్ని దోచుకున్నారని…ఆ దోచుకున్నది పక్క రాష్ట్రంలో దాచుకోవడానికి వెళుతూ వీరి అదృష్టం బాగోక పట్టుబట్టారని అన్నారు.

వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ ఆయుధం అదే?

కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ నుండి, తమ రాష్ట్రానికి నగదు అక్రమ రవాణా జరుగుతుందనే పక్కా సమాచారంతో వీరిని తమిళనాడు పోలీసులు పట్టుకున్నారని అన్నారు. ఇక్కడ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం తమిళనాడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు అన్నారు. మంత్రి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఓ రెండు మినీ వ్యానుల నిండా డబ్బు నింపుకొని ముందు వెళ్లారని, ఆ వాహనాలలో పట్టక మిగిలిన సొమ్ము రూ. 5.5 కోట్లు వెనుక కార్ లో తీసుకెళుతూ పట్టుబడ్డారు అన్నారు. మరి బోండా ఉమా చెప్పినట్లు పక్కా ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీసులు, వేల కోట్లు ఉన్న మినీ వ్యానులను ఎందుకు వదిలేశారు? కేవలం రూ. 5.5 కోట్ల వున్న వాహనం ఎందుకు పట్టుకున్నారనే దానికి ఆయనే సమాధానం చెప్పాలి. నాలుగు నెలలుగా కరోనా వలన కనీస ఆదాయం లేక అప్పులతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం వేల కోట్ల దోపిడీ చేయడం సాధ్యమేనా? అనేది ఆయనకే తెలియాలి.

ఆంధ్రలో ఎన్ని జిల్లాలు వుండాలి?

ఇక గౌరవనీయులు బోండా గారు తమ టీడీపీ నేతలు చిన్న చిన్న తప్పులు చేశారని, వాటికి అరెస్టులు చేస్తారా అని అడగం ఆయన అవివేకానికి నిదర్శనంగా ఉంది. తప్పు చిన్నదైనా పెద్దదైనా శిక్షలు ఉంటాయని మరి బోండా ఉమకు తెలియదనుకుంటా? తమ నేతలు తప్పు చేశారని ఉమా ఒప్పుకున్నారు. కాబట్టి అవి చిన్న తప్పులో పెద్ద తప్పులో విచారణలో తేలుతుంది. అప్పటి వరకు వేచి చూస్తే సరిపోతుంది కదా. మరి బోండా దృష్టిలో వందల కోట్ల కుంభకోణాలు, నేతల హత్యలు చాలా చిన్న చిన్న తప్పులేమో?. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు ఎన్నో చేశాం ఆమాత్రానికే అరెస్ట్ చేస్తారా అన్నట్లుంది ఉమా వ్యవహారం.