
సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దేవుడు ఆదేశిస్తే.. రాజకీయల్లోకి తప్పక ఎంట్రీ ఇస్తానని రజనీకాంత్ గతంలో చాలాసార్లు చెప్పారు. తమిళనాడులో ఆయన రాజకీయ ఎంట్రీ.. ఇప్పుడు.. అప్పుడు అంటూ ఎన్నోసార్లు కథనాలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లుగా నిలిచిపోయాయి. తాజాగా మరోసారి రజనీ పొలికల్ ఎంట్రీపై చర్చ నడుస్తోంది.
తమిళనాడులో మాజీ సీఎం జయలలిత మృతితో రాజకీయాల్లో ఖాళీ ఏర్పడింది. ఆమె స్థాయి నేతలేక రాజకీయాల్లో లోటు కన్పిస్తుంది. దీనిని భర్తీ చేసేందుకు రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులు, తమిళనాడు ప్రజలు కోరుతున్నారు. పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నప్పటికీ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వస్తోంది.
తాజాగా రజనీకి అత్యంత సన్నితంగా ఉండే వ్యక్తి ఆయన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాదిలోనే రజనీకాంత్ పొలికల్ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రజనీకి సన్నితంగా మెలిగే కరాటే తియగరాజన్ ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీ పార్టీపై క్లారిటీ ఇచ్చారు. నవంబర్లో రజనీకాంత్ పార్టీ ప్రకటన ఉంటుందని తెలిపారు. తొలుత మార్చి 12న రజనీకాంత్ పార్టీ ప్రకటన చేయాలని భావించారని అయితే కరోనా కారణంగా వాయిదా వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటంతో మరోసారి వాయిదా వేసినట్లు తెలిపారు.
నవంబర్లో మాత్రం పార్టీ ప్రకటన ఖచ్చితంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తియగరాజన్ గతంలో చెన్నై నగర డిప్యూటీ మేయర్ గా వ్యవహరించారు. దీంతో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎట్టకేలకు రజనీ పార్టీ ప్రకటనపై క్లారిటీ రావడంతో సూపర్ స్టార్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. రజనీకాంత్ ఈసారైనా అభిమానుల ఆశలు నిజం చేస్తారా? లేదో వేచి చూడాల్సిందే..!