రాజకీయ పార్టీకి వేగంగా రజనీకాంత్ కసరత్తు!

గత రెండేళ్లుగా తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతూ వస్తున్న ప్రముఖ నటుడు రజనికాంత్ పార్టీ ఏర్పాటుకు వేగం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మరో రెండు నెలల్లో పార్టీని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కమిషన్‌లో రజనీకాంత్ తరఫున కొత్త పార్టీకోసం దాఖలు చేయవలసిన దరఖాస్తు ఫారం తీసుకోవడంతో ఈ ప్రయత్నాలు వేగం అందుకున్నట్లు నిర్ధారణ అయింది. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు చెబుతూ వస్తున్న […]

  • Written By: Neelambaram
  • Published On:
రాజకీయ పార్టీకి వేగంగా రజనీకాంత్ కసరత్తు!

గత రెండేళ్లుగా తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతూ వస్తున్న ప్రముఖ నటుడు రజనికాంత్ పార్టీ ఏర్పాటుకు వేగం కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మరో రెండు నెలల్లో పార్టీని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ ప్రధాన ఎన్నికల కమిషన్‌లో రజనీకాంత్ తరఫున కొత్త పార్టీకోసం దాఖలు చేయవలసిన దరఖాస్తు ఫారం తీసుకోవడంతో ఈ ప్రయత్నాలు వేగం అందుకున్నట్లు నిర్ధారణ అయింది.

2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు చెబుతూ వస్తున్న రజనీకాంత్ గురువారం మండ్రం కార్యదర్శులతో సమావేశమై జిల్లాల వారి పరిస్థితులను సమీక్షించారు. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తే రాగాల పరిష్టితుల గురించి క్షేత్రస్థాయిలో అంచనా వేసి నివేదికలు ఇవ్వమని వారిని కోరారు.

నియోజకవర్గంలో ఇతర పార్టీల బలాలు? గెలిచే అభ్యర్థులు? కమల్‌ పార్టీతో జత కడితే లాభమా, నష్టమా? ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయా?..తదితర వివరాలతో నివేదిక సమర్పించాలని రజనీకాంత్‌ ఆదేశించినట్లు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నిలకు సమాయత్తంకండి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఢీకొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీలతో కూటమి జోలికి పోకుండా ఒంటరిపోరే మంచిదని కార్యదర్శులు రజనీకి సూచించినట్లు తెలుస్తున్నది.

ఒకరు కొత్త పార్టీ ప్రారంభించడానికి మునుపు దాన్ని రాజకీయ పార్టీగా రిజిస్టర్‌ చేయాలనుకుంటే ఎన్నికల కమిషన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ దరఖాస్తు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ పేరు ప్రకటించగానే, ఈ ఫారాన్ని పూర్తి చేసి అందజేయవలసి ఉంది. అందుకోసం పార్టీ విధి విధానాలను కూడా ప్రకటించవలసి ఉంది.

రాజకీయ అరంగేట్రం చేసి క్రియాశీలక పాత్ర పోషిస్తానని 2017 డిసెంబర్‌లో అభిమానుల నడుమ రజనీకాంత్‌ బహిరంగంగా ప్రకటించారు. అయితే రెండేళ్లుగా పార్టీని స్థాపించకున్నా రాజకీయ విమర్శలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

సంబంధిత వార్తలు