Home Blog Page 8403

‘విరూపాక్ష’ కాదట.. ‘గజదొంగ’ లేదంటే ‘బందిపోటు’!


రాజకీయాల్లోకి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇంత విరామం తర్వాత ఆయన ‘వకీల్ సాబ్’ తో వెండితెరపై రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బోనీ కపూర్, దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామస్, అంజలి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌ గా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నా.. చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయలేదు. కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. ఇప్పట్లో షూటింగ్‌ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. దాంతో, క్రిష్‌ జాగర్లమూడితో పవన్‌ ఇప్పటికే కమిటైన మూవీపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కథ, కథనంపై కసరత్తులు చేస్తున్నారట. అయితే, ఈ మూవీ గురించి తాజాగా ఓ విషయం బయటికొచ్చింది. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కబోయే ఈ మూవీకి ‘విరూపాక్ష’ అనే టైటిల్‌ను ఎంచుకున్నారని మొన్నటిదాకా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు మరో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి.

Also read :- RGV releases first look of ‘Power Star’

ఈ చిత్రానికి ‘గజదొంగ’, లేదంటే ‘బందిపోటు’ అనే టైటిల్‌లో దేన్నో ఒకదాన్ని ఖారారు చేయాలని చిత్రబృందం భావిస్తోందని సమాచారం. కథానుసారం ఈ రెండింటిలో ఒకటైతేనే బాగుంటుందని అనుకుంటున్నారని సమాచారం. కాగా, ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే కొంత షూటింగ్‌ కూడా జరిగిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన పవర్ కళ్యాణ్‌ బర్త్‌డేని పురస్కరించుకొని మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ టీజర్ను కూడా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్ క్రిష్‌, నిర్మాతలు భావిస్తున్నారట. దానికి సంబంధించే కొన్ని రోజులు షూటింగ్‌ నిర్వహంచారని టాలీవుడ్‌ టాక్‌. అయితే, గతంలో టైటిల్స్‌ నచ్చక పవన్‌ కొన్ని సినిమాలు వదులుకున్నాడు. అలాంటి వ్యక్తి ‘గజదొంగ’ లేదా ‘బందిపోటు’ అలాంటి నెగెటివ్‌ టైటిల్‌కు ఒప్పుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా… కంగనా సవాల్‌


బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత సినీ పరిశ్రమలో నెపోటిజంపై చర్చ నడుస్తోంది. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే పరిశ్రమలో నెపోటిజంపై అనేక విమర్శలు చెలరేగాయి.

ప్రధానంగా మహేష్‌ భట్‌, కరన్‌ జోహార్‌, సల్మాన్‌ ఖాన్‌ కుటుంబ సభ్యులపై పలువురు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు సైతం నెపోటిజంపై గళమెత్తారు. బాలీవుడ్‌ క్వీన్, ఫైర్బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్‌ అయితే మహేష్‌ భట్‌, కరన్‌పై నేరుగా తీవ్ర విమర్శలు చేసింది. తాను కూడా బంధుప్రీతి బాధితురాలినే అని చెప్పింది.

అలాగే సుశాంత్‌ మరణంపై మరికొందరితో పాటు ఆమె కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్‌ది ఆత్మహత్యా లేక పథకం ప్రకారం జరిగిన హత్యా? అని ప్రశ్నించింది. సుశాంత్‌ చనిపోయి నెల రోజులు పూర్తయినా.. ఈ వివాదం సర్దుమనగడం లేదు. ప్రతి రోజూ ఎవరో ఒకరు సుశాంత్‌ మరణాన్ని, నెపోటిజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Also read :- War of words between Kangana Ranaut and Pooja Bhatt

తాజాగా కంగనా రనౌత్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తన వాదనలను నిరూపించుకోలేకపోతే తన పద్మశ్రీని పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించింది. ఒక హిందీ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కంగనా ఈ సవాల్ విసిరింది.

సుశాంత్‌ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీలో ఉండగా ఫోన్‌ చేశారని చెప్పింది. అయితే తన స్టేట్‌మెంట్‌ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని వెల్లడించింది. ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడనని, తాను పారిపోయే మనషిని కాదని కంగనా స్పష్టం చేసింది.

సుశాంత్‌ మరణం విషయంలో తన విమర్శలను నిరూపించు కుంటునానని చెప్పింది. ఒకవేళ నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును ఉంచుకునే అర్హత తనకుండదని కంగనా పేర్కొంది.

Also read:- Kangana About Jayalalitha biopic

బాప్ రే.. సాక్షిలో బిత్తిరి సత్తికి అంత పెద్ద ప్యాకేజా?


బిత్తిరి సత్తి.. అలియాస్ చేవెళ్ల రవికుమార్.. తెలంగాణ భాష.. యాసతో పాపులర్ అయ్యాడు ఈ కమెడియన్. వీ6లో తీన్మార్ వార్తలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. దాన్నుంచే సినిమాలు, వివిధ కార్యక్రమాల్లోనూ ఫేమస్ అయ్యాడు. ఆ వీ6లో విభేదాలతో.. భారీ ఆఫర్ ఇవ్వడంతో టీవీ9లోకి జంప్ చేశాడు..

‘ఆర్ఆర్ఆర్’పై రైటర్ సాయి మాధవ్‌ కీలక అప్‌డేట్‌

ఇక అంతా బాగానే సాగుతుందనుకుంటున్న టైంలో టీవీ9 నుంచి సడన్ గా బయటకు వచ్చాడు. సత్తి ఎందుకు బయటకొచ్చాడన్నది ఇంతవరకు అధికారికంగా అటు టీవీ చానెల్.. ఇటు సత్తి కూడా బయటపెట్టలేదు. అయితే ఫాదర్స్ డే సందర్భంగా సత్తి చేసిన స్కిట్ లో తన సొంత నాన్నను పొగుడుతూ ప్రోగ్రాం చేయడం.. అది టెలికాస్ట్ కావడంతో టీవీ9 యాజమాన్యం ఆగ్రహించిందని.. విభేదాలు తలెత్తడంతో సత్తి బయటకొచ్చాడనే టాక్ బయటకు వచ్చింది. ఈ మధ్యే సత్తి సాక్షిలో చేరారు. రావడం రావడమే తనను తీసేసిన టీవీ9కు సెటైర్ గా ప్రోమో రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు.

అయితే వీ6లో నెలకు లక్ష నుంచి లక్షన్నర వరకు అందుకున్న బిత్తిరి సత్తిని టీవీ9 అంతకుమించిన ధరను ఇచ్చి లాక్కుందనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు తెలుగు టీవీ వార్తా పరిశ్రమలో కొత్త రికార్డును బిత్తిరి సత్తి సృష్టించారు. సాక్షిలో కొత్త సెటైరికల్ షోను లాంచ్ చేయబోతున్నారు. ఇందుకుగాను ఏకంగా బిత్తిరి సత్తికి సాక్షి ఛానల్ రూ.6.5 లక్షల ప్యాకేజీని పొందినట్టు సమాచారం. ప్యాకేజీలో ప్రధాన భాగం అతడి జీతానికి వెళుతుంది. ఇక ఇందులోనే స్కిట్ రచయితతోపాటు ఇతర యాంకర్లకు కూడా సత్తి చెల్లించాలని ఫుల్ ప్యాకేజీగా అతడికి జీతం ఫిక్స్ చేసినట్టు సమాచారం.

బన్నీ, కొరటాల కాంబో ఫిక్స్‌ అయినట్టేనా!

విశేషం ఏంటంటే.. బిత్తిరి సత్తి జీతం న్యూస్ ఛానల్ మేనేజింగ్ ఎడిటర్స్ కంటే ఎక్కువ అని తెలిసింది. సాక్షి సత్తి ప్రదర్శనపై ఎక్కువగా ఆశలు పెట్టుకొని ఎంతైనా చెల్లించడానికి రెడీ అయ్యింది. ఇటీవలి ప్రోమో వైరల్ కూడా అయ్యింది. ఇక నుంచి సత్తి తన అసలు పేరు చేవెల్ల రవికుమార్ గానే ఎంతో ప్రాచుర్యం పొందాలని నిశ్చయించుకున్నాడు.

బిత్తిరి సత్తికి ప్రజల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏదేమైనా టీవీ షో మొత్తం బృందం సమిష్టిగా పనిచేసినప్పుడు.. కొత్తగా.. సృజనాత్మక ఆలోచనలతో ముందుకెళితే ఖచ్చితంగా ప్రోగ్రాం క్లిక్ అవుతుంది.

ఈసారి సత్తి అతడి బృందం ఎలా నవ్విస్తుందో.. ఎలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తుందో మనం చూడాలి. అయితే ఇప్పటిదాకా సత్తి ప్రోగ్రాంలు విఫలం కాలేదు. అదే అతని ట్రాక్ రికార్డ్ కావడం గమనార్హం.

రోగనిరోధక శక్తి వర్సెస్ కోవిద్

Immunity

కోవిద్ మనిషిలోని అంతర్గత రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందా? తిరిగి తిరిగి కరోనా కాటుకు వీలుంటుందా? అనే అంశంపై విస్తృతస్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇమ్యూనిటీ లేకపోవడంతోనే కరోనా సంక్రమిస్తుంది. ఇక కరోనాతో మనిషిలోని ఈ రోగనిరోధక శక్తి మరింత ప్రభావితం అవుతుందా? లేదా అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేమని శాస్త్రజ్ఞులు తెలిపారు. దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో పలు పరిశోధనలు, రోగులపై అధ్యయనాలు జరిగాయి. కోవిడ్ వచ్చి కోలుకుంటున్న వారు లేదా కోలుకున్న వారిలో రోగనిరోధక కారక కణాలు అయిన యాంటీబాడీస్ కొంతకాలమే ఉంటున్నాయని, అవి క్రమేపీ క్షీణిస్తున్నాయనే ఆందోళనకర పరిణామాన్ని సైంటిస్టులు గుర్తించారు.

దీనితో ఒక్కసారి కరోనా వచ్చిన వారికి దీర్ఘకాలిక ఇమ్యూనిటీ ఏర్పడటం కష్టమని ఈ పరిశోధనలలో సంకేతాలు వెలువడ్డాయి. అయితే దీనితో కరోనా వచ్చి కోలుకున్న వారు ఏమవుతుందో అని భయపడాల్సిన పనిలేదని వారికి తిరిగి కరోనా అంటుకుంటుందనే వాదన ఇంకా నిర్థారణ కాలేదని వీరు తెలిపారు. కరోనాకు చికిత్స దశలోమనిషిలో కొన్ని రకాల ప్రత్యేక కణాలు ఏర్పడుతాయి. ఇవి వ్యాధిని ఎదుర్కొనే స్థాయిలో ఉంటాయి. ఇవి కొంతకాలమే పనిచేస్తాయని చెప్పడానికి వీల్లేదని, దీనికి సంబంధించి విస్తృత స్థాయి పరిశోధనలు అవసరం అని వారు తెలిపారు. కాలం గడుస్తున్న కొద్దీ మనిషిలోని యాంటీబాడీస్ త్వరితగతిన తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం ఏ మేరకు మనిషికి చేటు కల్గిస్తుందనేది ఇప్పటికైతే నిర్థారణ కాలేదు.

నాబ్స్‌తోనే కరోనా పదేపదే

యాంటీబాడీస్ స్థాయిని శాస్త్రీయంగా వైద్యపరిభాషలో నావెల్ కరోనావైరస్ బ్లాకింగ్ యాంటీబాడీ లెవల్స్ (నాబ్స్) అని పిలుస్తారు. ఈ స్థాయి తగ్గితే కరోనా తిరిగి రావచ్చునని ప్రచారం జరుగుతోంది. దీనితో కోలుకున్న వారిలో అత్యధికులు మునుపటి ఉత్సాహాన్ని పొందలేకపోతున్నారు. అయితే ఈ విధమైన నిరాశానిస్పృహలకు గురికావల్సిన అవసరం లేదని పుణేలోని ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్, రిసర్చ్‌కు చెందిన ఇమ్యూనాలజిస్టు వినీతా బాల్ తెలిపారు. ఈ కరోనా మహమ్మారి కేవలం ఆరునెలల నుంచి ఆటాడిస్తోంది. దీని పూర్తి లక్షణాలు, కోలుకున్న తరువాత పరిస్థితి ఏమిటనేది ఇంకా నిర్థారణ కాలేదని వెల్లడించారు. కరోనా వచ్చి కోలుకున్న వారు తిరిగి వెంటనే వైరస్ కాటుకు గురికావడం అరుదుగా జరుగుతుంది. జనవరిలో తొలిసారిగా వైరస్‌కు గురైన వారిలో ఎక్కువగా ఈ రెండోసారి దాడి పరిణామం ఉంటోందని వీడియో ఇంటర్వూలో తెలిపారు. ఇటీవలే మెడ్‌ఆర్‌క్సివ్‌లో ప్రచురితమైన వ్యాసం కొందరిలో పలు రకాల ఆందోళనకు దారితీసింది.

యాంటీబాడీస్ క్షీణత రెండునెలల్లోనే

ఇంకా పూర్తిస్థాయి అధ్యయనాలు కాకముందే కోవిడ్‌ రోగుల్లో యాంటీబాడీస్ 18 నుంచి 65 రోజుల వ్యవధిలో రెండు నుంచి 23 వంతులు తగ్గుతాయని తేల్చారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో 90 శాతం మందిపై ఈ పరిశోధనలు జరిగాయి. ఇక ఈ నాబ్స్ రోగులు కోలుకున్న తరువాతి క్రమంలో కేవలం రెండు నుంచి మూడు నెలల్లోపే తగ్గుతాయని గత నెలలో నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ఓ వ్యాసం ప్రచురితం అయింది. అయితే ఈ అధ్యయనాలు వీటి వెల్లడి గురించి ఎక్కువగా తెలియని వారికి, విద్యాధికులు కాని వారికి తాము కోలుకున్నమనే తెలిసింది కానీ తరువాతి క్రమంలో ఎటువంటి ప్రభావం ఉంటుందనేది తెలియడం లేదు. ఇటువంటి వారు ఎటువంటి ఆందోళనకు గురి కావడం లేదు. నాబ్స్ స్థాయి తగ్గిపోవడం వల్లనే తిరిగి వైరస్ సంక్రమిస్తుందని చెప్పడానికి వీల్లేదని బాల్ తెలిపారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలోని టాస్క్‌ఫోర్స్‌లో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఈ మహిళా టాస్క్‌ఫోర్స్‌ను ప్రధాని ఆదేశాలతో ఏర్పాటు చేశారు. రోగులలో యాంటీబాడీస్ తగ్గుతాయనేది నిర్థారించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, మరో ఏడాది పడుతుందని సైంటిస్టులు తెలిపారు. రెండు అధ్యయనాలలో అయితే కరోనా వచ్చి కోలుకున్న వారిలో యాంటీబాడీస్ తగ్గుతాయని తేలింది. అయితే ఇమ్యూనిటీ వ్యవస్థపై పరిశోధనలు చేసిన మరికొందరు ఈ ఇమ్యూనిటీకి ఢోకా ఉండదని ఇది చాలా కాలం నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. మనుష్యులలో ఏర్పడే టి సెల్స్ తిరిగి వైరస్ రాకుండా పనిచేస్తాయని, ఇవే రక్షకకవచాలు అవుతాయని పరిశోధకురాలు బాల్ తెలిపారు

కాజల్‌, బెల్లకొండ శ్రీను మధ్య ఏముందబ్బా!


లక్ష్మీ కళ్యాణంతో టాలీవుడ్‌కు పరిచయమై షార్ట్‌ టైమ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది కాజల్‌ అగర్వాల్‌. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలో కూడా ఆమె మంచి పేరు సంపాదించుకుంది. కుర్ర హీరోలతో పాటు పెద్ద హీరోల సరసన కూడా నటించింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో రెండో సినిమా కూడా చేస్తోందామె. వయసు మీదపడుతున్నా… వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న కాజల్‌ గురించి రోజుకో పుకారు వినిపిస్తోంది. ఇప్పటికే చెల్లి నిషా అగర్వాల్‌కు పెళ్లయింది. ఒక బిడ్డకు జన్మకూడా ఇచ్చింది. దాంతో కాజల్‌ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో చాన్నాళ్ల నుంచి ప్రేమలో ఉందని, అతడినే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం కాబోతోందంటూ ప్రచారం జరిగింది. కానీ, ‘ఆచార్య’ సహా పలు కొత్త సినిమాలకు సైన్‌ చేయడంతో అవన్నీ పుకార్లే అని ఆమె ఫ్యాన్స్‌ అంటున్నారు.

పూజా హెగ్డేతో అక్కినేని హీరో డేటింగ్ !

అయితే, పెళ్లి విషయం పక్కనబెడితే ప్రస్తుతం కాజల్‌ ప్రేమలో ఉందన్నది మాత్రం నిజమేనట. ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగింది టాలీవుడ్‌ కుర్ర హీరోతో అని ఈ మధ్య ప్రచారం జోరందుకుంది. ఆ కుర్ర హీరో మరెవరో కాదు బెల్లకొండ శ్రీనివాస్‌ అట. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ రద్దవడంతో ఖాళీగా ఉన్న టైమ్‌లో రీసెంట్‌గా సోషల్‌ మీడియా వేదికగా వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అందుకు బలం చేకూరుస్తోంది. కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరూ కలిసి ‘కవచం’, ‘సీత’ సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మంచి ప్రెండ్‌షిప్‌ కుదిరింది. అది కాస్త ముదిరి ప్రేమకు దారితీసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే షూటింగ్‌ సమయంలోని తమ ఇద్దరి కోజ్‌ ఫొటోని పోస్ట్‌ చేసిన కాజల్‌.. ‘నిన్ను పిచ్చిపిచ్చిగా మిస్‌ అవుతున్నా (మిస్‌ యూ నట్‌కేస్‌) . తొందర్లోనే కలుస్తా ’ అని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

వన్‌ అండ్‌ ఓన్లీ విజయ్ దేవరకొండ

ఇక కాజల్ అగర్వాల్ అంత ప్రేమగా మిస్ యూ అని చెప్పేసరికి బెల్లంకొండ కరిగిపోయాడు. ‘నైనేతే ఇంకా మిస్‌ అవుతున్నా. కానీ, కలవడానికి వీలు లేని పరిస్థితుల్లో ఇంకా మిస్‌ అవుతున్నానని చెప్పకు’ అని పోస్ట్‌ చేశాడు.ఈ పోస్టులు ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. ఇద్దరి ప్రెండ్‌షిప్‌ నెక్ట్స్‌ లెవెల్‌కు వెళ్లిందని, ప్రేమ కూడా చిగురించిందన్న రూమర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు… అంటూ నెట్‌లో కామెంట్లు వస్తున్నాయి. అయితే, త్వరలో కలుద్దాం అని కాజల్‌ అనడాన్ని బట్టి వీరిద్దరూ మరోసారి కలిసి నటించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాస్‌ ప్రస్తుతం ‘అల్లుడు అదుర్స్‌’ అనే మూవీ చేస్తున్నాడు.

కేసీఆర్ ను ఇరుకునపెడుతున్న మంత్రులు..!

CMKCR


తెలంగాణలో కరోనా పంజా విసురుతుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో నమోదవుతున్న కేసులతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా నగరమంతా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగరవాసులు ఇళ్ల నుంచి బయటికి రావాలంటే ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే విమర్శలు ప్రజలు నుంచి వెల్లువెత్తుతోన్నాయి. ఇలాంటి సమయంలోనే ఉస్మానియా ఆస్పత్రికి వరద నీరురావడం సర్కారును మరింత ఇరుకున పెట్టింది.

తెలంగాణలో ఇప్పటివరకు కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. అయితే కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితులన్నీ కేసీఆర్ కు వ్యతిరేకంగా మారుతోన్నాయి. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమవడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. దీంతో సర్కార్ పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికితోడు సీఎం అధికారిక నివాసంలో కరోనా సోకగా కేసీఆర్ కొద్దిరోజులు కన్పించకుండా పోవడంపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయి. కరోనా వేళ కేసీఆర్ హైదరాబాద్లో ఉండకుండా ఎర్రవెల్లిలోని తన ఫౌంహౌజ్ లో ఉండటం ఏంటని ప్రశ్నించాయి.

కరోనా వేళ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు?

మరోవైపు సచివాలయం కూల్చివేతలోనూ టీఆర్ఎస్ సర్కార్ అప్రతిష్ట పాలైంది. కోవిడ్-19 ఆస్పత్రిగా సచివాలయాన్ని మార్చాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేసిన డిమాండ్లు సీఎం కేసీఆర్ పెడచెవిన పెట్టి కూల్చివేతకే మొగ్గుచూపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నియంతగా వ్యవహరిస్తున్నారనే భావనను ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇలాంటి తరుణంలో ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలోకి వరదనీరు రావడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఇన్నాళ్లలో ఉస్మానియాలోకి రాని వరదనీరు ఇప్పుడేలా వచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి ఉస్మానియాలోకి వరదనీరు రావడమే ఇందుకు నిదర్శనమని ఆరోపణలు గుప్పించాయి.

అయితే పరిస్థితి చక్కదిద్దాల్సిన కొందరు మంత్రులు సీఎం కేసీఆర్ ను ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలు నేపథ్యంలో ఉస్మానియా సందర్శించిన పలువురు మంత్రులు ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడం విమర్శలకు తావిస్తోంది. వరదపై మున్సిపల్ మంత్రి స్పందించాల్సి ఉండగా దీంతో ఏమాత్రం సంబంధంలేని మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ అవగాహన రహిత్యంతో మాట్లాడటం ప్రతిపక్షాలకు వరంలా మారింది. ప్రభుత్వం చేతగానీతనంలో ఎదురుదాడికి దిగుతుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

మందుబాబులు బేజారు…అక్రమార్కులు హుషారు..!

ఇక వివాదస్పదాలకు దూరంగా మంత్రి ఈటల రాజేందర్ సైతం ఉస్మానియా ఆస్పత్రి విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా మారాయి. ఉస్మానియాను కూలగొట్టి కడతామంటే విపక్షాలు అడ్డుకున్నాయని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను హస్యాస్పదంగా ఉన్నాయంటూ విపక్షాలు ఎద్దేవా చేశాయి. ఉస్మానియాలో వరదనీరు వచ్చిన వెంటనే సహాయ చర్యలు చేపట్టకుండా మంత్రులు ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగడంతో సీఎం బాదనామ్ కావాల్సి వచ్చింది.

ఈ విషయంలో ప్రభుత్వాన్ని మంత్రులే అప్రతిష్టపాలు చేశారని సీఎం కేసీఆర్ సీరియస్ అవుతున్నారట. మరోవైపు గాంధీలోనూ ఉద్యోగులు సమ్మె చేస్తూ ప్రభుత్వాన్ని బాదనం చేస్తున్నారని దీనికంతటికి మంత్రుల వ్యవహరమే కారణమనే భావనలో సీఎం ఉన్నారట. దీంతో ఎవరి శాఖకు సంబంధించిన విషయంలో వారే స్పందించాలని సీఎం ఆదేశించినట్లు టాక్ విన్పిస్తుంది.

కమల్‌ హాసన్‌ మరో ప్రయోగం..


కమల్‌ హాసన్. లెజెండరీ యాక్టర్. నటన ఒక్కటే కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమా విషయంలో ఆయన ఆల్‌రౌండర్. మంచి రైటర్, డైరెక్టర్, డ్యాన్సర్ కూడా. అంతేకాదు గొప్ప సాంకేతిక నిపుణుడు కూడా. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలను భారత సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో ముందుంటారు. ప్రపంచ సినిమాలో జరిగే మార్పులను పరిశీలిస్తుంటారు. కొత్త టెక్నాలిజీ వచ్చిందంటే చాలు దాన్ని అధ్యయనం చేసి అందుకు తగ్గట్టు తనని మార్చుకుంటాడు. అందుకే కమల్‌ను నిత్య విద్యార్థి అంటుంటారు. మేకప్‌ నుంచి డిజిటల్‌ సౌండ్‌ వరకూ చాలా కొత్త టెక్నిక్స్‌ను భారత సినిమాకు పరిచయం చేశాడు. లాక్‌డౌన్‌ దెబ్బకు తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఇప్పుడంతా ఓటీటీల శరణుగోరుతున్నారు గానీ.. కొన్నేళ్ల క్రితమే కమల్‌ డిజిటల్‌ ప్లాట్ఫ్లామ్‌ భవిష్యత్తును అంచనా వేశారు. విశ్వరూపం సినిమాను డిటీహెచ్‌ రూపంలో పరిచయం చేశారు. అప్పుడు కమల్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించిన నిర్మాతలే ఇప్పుడు ఓటీటీలను కీర్తిస్తూ వాటి బాట పడుతున్నారు.

సినిమా వాళ్లకు ఒక పీడకల !

చిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసిన కమల్‌ హానన్‌ ఇప్పుడు మరో నూతన ఆవిష్కరణతో ముందుకు రాబోతున్నాడు. ఓ కొత్త రకం స్క్రీన్‌ ‌ప్లేను ఆయన తెరకు పరిచయం బోతున్నారట. లాక్‌డౌన్‌ సమయాన్ని దాని కోసమే వెచ్చిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఈ తరహా స్క్రీన్ ప్లేతో స్క్రిప్ట్‌ కూడా రెడీ చేశాడని సమాచారం. కరోనా పరిస్థితుల్లో సినిమాలకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితులకు అనువుగా ఓటీటీ రిలీజ్‌ను దృష్టిలో ఉంచుకొని తక్కువ మంది నటీనటులు, టెక్నీషియన్స్‌ సహాయంతో మూవీ తీసేలా కమల్‌ న్యూ స్క్రిప్ట్‌ డిజైన్‌ చేశారట. తమిళనాడులో లాక్‌డౌన్‌ ఎత్తేయగానే షూటింగ్‌ స్టార్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ కొత్త రకం స్క్రిప్టుతో తీసే ప్రయోగాత్మక మూవీలో కమల్‌ నటిస్తాడా? లేక డైరెక్షన్‌ చేస్తాడా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కమల్‌ ప్రస్తుతం శంకర్ తో కలిసి ప్రెస్టీజియస్‌ ‘ఇండియన్‌ 2’లో నటిస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత రజినీకాంత్‌తో ఓ మూవీ చేస్తాడని సమాచారం.

సోషల్ మీడియాలోనే తెలుగు తమ్ముళ్ల ఆరాటం..!


టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు బాటలోనే తెలుగు తమ్ముళ్లు నడుస్తున్నారు. కరోనా సమయంలో బాబు ఏపీలో కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడప్పుడు అమరావతికి వచ్చి పోతున్నారు. అయినప్పటికీ నేరుగా పార్టీ నేతలను కలుసుకుని సమీక్షలు, సమావేశాలు పెట్టిన దాఖలు ఇటీవలీ కాలంలో చాలా అరుదనే చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు ఇప్పుడంతా సోషల్ మీడియాలోనే రాజకీయం చేస్తున్నారు.

సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా?

తాజాగా ఏపీలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం కూడా జూమ్ యాప్ ద్వారానే నిర్వహించి హైటెక్ బాబు అనిపించుకున్నారు. సోషల్ మీడియా ద్వారానే తమ్ముళ్లకు టచ్లో ఉంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ఆయన బాటలోనే వెళుతున్నారు. ప్రజా క్షేత్రంలో పోరాటాలను మానేసి సోషల్ మీడియా బాటపడుతున్నారు. ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తే బాబు దృష్టిలో పడే అవకాశం తక్కువేనని.. అదే సోషల్ మీడియాలో జగన్ ను టార్గెట్ చేయడం ద్వారా బాబు దృష్టిలో పడే అవకాశం ఎక్కువగా ఉందని తెలుగు తమ్ముళ్లు గుర్తించినట్లు ఉన్నారు. దీంతో నేతలంతా ఇదేమార్గాన్ని అనుసరిస్తున్నారు.

కొద్దిరోజులుగా తెలుగు తమ్ముళ్లు మీడియా సమావేశాల కంటే.. సోషల్ మీడియాకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సోషల్ మీడియాలోనే రాజకీయాలను హిటెక్కిస్తున్నారు. సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు చేయడం ద్వారా బాబులో దృష్టిలో పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. పార్టీ ఇప్పుడు అధికారంలో లేకపోయినా భవిష్యత్తులో ఏదైనా పదవీ దక్కుతుందనే ఆశతో టీడీపీ నేతలు ఉన్నారు. దీంతో బాబు దృష్టిలో పడేందుకు తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియానే వారధిగా మలుచుకుంటున్నారు.

చినబాబుకు బ్యాడ్ లక్.. అవకాశం మిస్సయిందా?

ఇప్పటివరకు సోషల్ మీడియా అకౌంట్లు లేనివారు కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసి సోషల్ మీడియాపై అవగాహన పెంచుకున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు కూడా సోషల్ మీడియాలోనే యాక్టివ్ ఉంటున్నారు. చినబాబు కూడా ట్వీటర్లోనే జగన్ సర్కార్ పై సెటైర్లు వేస్తూ రాజకీయం చేస్తుండటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో తెలుగు తమ్ముళ్లంతా చంద్రబాబు, లోకేష్ బాబు రూట్లోనే వెళుతున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ప్రజాక్షేత్రంలో లేకుండా సోషల్ మీడియాను మాత్రమే నమ్ముకోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆ నేతలకు త్వరలో జగన్ ‘స్పెషల్ క్లాస్’..!


2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన ఇటీవలే పూర్తయింది. సంవత్సర కాలంలోనే వైసీపీ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి దూసుకెళుతూ వారి మన్నలను పొందుతోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలోనే జగన్ ప్రభుత్వంపై ప్రజలతోపాటు సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై సీఎం జగన్ నజర్ వేసినట్లు తెలుస్తోంది.

మందుబాబులు బేజారు…అక్రమార్కులు హుషారు..!

కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కొన్ని రాష్ట్రాలు ఎదుర్కొలేక చతికిలపడితే ఏపీలో మాత్రం జగన్ పకడ్బంధీ చర్యలు చేపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశంలో కరోనా టెస్టులు అత్యధికంగా ఏపీలో చేస్తుండటం జగన్ సర్కార్ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజారోగ్యంపై నిత్యం సమీక్షలు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకెళుతున్నారు. కరోనా సమయంలోనూ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవెర్చుతూ ముందుకెళుతున్నారు. వీటన్నింటికి ప్రజల ప్రశంసలు రావాల్సిపోయి వ్యతిరేకత వస్తుందని ప్రచారం జరుతుండటంపై జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం రావడానికి సొంతపార్టీ నేతలే కారణమని జగన్ గుర్తించారట. పార్టీలో పదవులు రాని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వైసీపీలో అసంతృప్తి ఉందనే సంకేతాన్ని బయటికి పంపుతున్నారని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతలే పార్టీ సమావేశాల్లో, మీడియా ముందు జగన్ సర్కార్ ను డ్యామేజ్ చేస్తున్నారని గ్రహించారు. దీంతో వారందరికి సీఎం జగన్ త్వరలో ఓ స్పెషల్ క్లాస్ తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది.

మళ్ళీ లాక్ డౌన్?

పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వారి వివరాలను ఇప్పటికే నిఘావర్గాల ద్వారా జగన్ తెప్పించుకున్నారు. వీరిలో ఎక్కువగా టీడీపీ నుంచి వైసీపీలోకి వలస వచ్చిన నేతలు ఉన్నారట. జగన్ అధికారంలోకి వచ్చాక తమకు కీలక పదవులు దక్కుతాయని ఆశించి రాకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి పూనుకుంటున్నారట. పార్టీకి సంబంధించిన లీకులను ప్రతిపక్షాలకు ఇస్తూ పార్టీని అబాసుపాలు చేస్తున్నారని జగన్ గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నేతలను సీఎం తన వద్దకు పిలుచుకొని క్లాస్ పీకేందుకు సిద్ధమవుతున్నారట. ఈ నేతలపై జగన్ తీసుకునే చర్యలు ఏమేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే..!

కరోనా వేళ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు?


తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ ఉన్న రాజకీయ పార్టీకి ఆయన చీఫ్. కోట్లాది మంది అభిమానగణం ఆయన సొంతం. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీట్లు గెలవకపోయినా.. ఒక వర్గం ఓట్లను రాబట్టుకోవడంలో పవన్ కాసింత విజయం సాధించారు. ఇప్పటికీ పార్టీపై.. దాని నాయకుడిపై యువతకు పిచ్చి బాగా ఉంది. కరోనా కష్టకాలంలో ఇతర అన్ని పార్టీల రాజకీయ నాయకులంతా చురుకుగా ఉన్నారు. కానీ ఈ నాయకుడు మాత్రం మౌనంగా ఉండడం.. రాజకీయ యవనికపై లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

మందుబాబులు బేజారు…అక్రమార్కులు హుషారు..!

ఆ నాయకుడు మరెవరో కాదు.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. కరోనా-లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి జనసేనాని నుంచి ఎటువంటి వార్తలు రాలేదు. ఒక ప్రకటన లేదా ప్రత్యక్ష కార్యాచరణ లేదు. కనీసం ఇతర రాజకీయ పార్టీల నేతలు చేస్తున్నట్టు పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా లేదు. టీడీపీ, బీజేపీ సహా ప్రతిపక్ష నాయకులందరూ వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా కార్యకర్తలతో మాట్లాడడం.. వారిని ఉత్సాహ పరచడం.. కార్యోన్ముఖులను చేయడం చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ లో అవేమీ కనిపించడం లేదు. వినిపించడం లేదు. అసలు పవన్ కళ్యాణ్ నోరే విప్పడం లేదు.

ప్రస్తుతం జనసేన పార్టీకి సంబంధించిన ప్రతీది పార్టీలో నంబర్ 2 అయిన నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. ఆయన నుంచే ప్రకటనలు వస్తున్నాయి. ప్రతీపార్టీ కార్యక్రమంలోనూ ఆయనే పాల్గొంటూ యాక్టివ్ గా ఉన్నారు. అధికారిక ప్రకటనలు ఆయనే ఇస్తున్నారు.

కాంగ్రెస్-టీడీపీ తెరచాటు బంధానికి ఇదే నిదర్శనం..!

నిజానికి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలతోనూ బీజీగా లేరు. ఆయన నటిస్తున్న సినిమాలన్నీ కరోనాతో షూటింగ్ బంద్ చేశారు.ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో యాక్టివ్ అయ్యి కార్యకర్తలు, నేతలతో సంప్రదింపులు జరుపుతూ ఉత్సాహ పరచవచ్చు. కరోనా క్లిష్ట సమయంలో పేదలకు సేవ చేసే కార్యక్రమాల్లో అభిమానులు, జనసైనికులు పాల్గొనమని కోరవచ్చు. కానీ పవన్ మాత్రం అవేమీ చేయడం లేదు. కోట్ల మంది ఫ్యాన్స్.. లక్షలమంది జనసైనికులున్నా కూడా పవన్ వారిని ఉపయోగించుకోకుండా మౌనంగా ఉండడం అంతుచిక్కని విషయంగా ఉంది.

సీఎం జగన్ కు బాలయ్య జై కొడతారా?


ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయింది. సంవత్సర కాలంలోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దూసుకెళుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ప్రత్యర్థులకు సీఎం జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ హయాంలో జరిగిన స్కాములను బయటికి తీస్తూ చంద్రబాబు హయాంలో మంత్రులుగా పని చేసిన వారిని ఒక్కొక్కరుగా జైళ్లకు పంపుతున్నారు.

చినబాబుకు బ్యాడ్ లక్.. అవకాశం మిస్సయిందా?

ఇదిలా ఉంటే సీఎం జగన్ ఏడాది పాలనపై సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ ఎప్పుడూ పెద్దగా మాట్లాడింది లేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక బాలకృష్ణ తన నియోజకవర్గ అభివృద్ధి, సినిమాలకే పరిమితమయ్యారు. అయితే ఇటీవల టీడీపీ మహానాడులో మాత్రం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కూడా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ సీఎం జగన్ సర్కార్ త్వరలో పడిపోతుందంటూ జోస్యం చెప్పారు. ఆయన వ్యాఖ్యల్లో అప్పట్లో ఏపీలో తీవ్రదుమారం రేపాయి. అలాగే జగన్ తనకు వీరాభిమాని చెప్పుకున్నాడు.

తాజాగా ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తుండగా బాలకృష్ణ సీఎం జగన్ కు లేఖ రాశారు. హిందూపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనీ, హిందూపురంకు మంజూరైన మెడికల్ కళాశాలను నియోజకవర్గం మాల్గురులో ఏర్పాటు చేయాలని కోరారు. బాలయ్య కోరికలను పరిశీలించిన సీఎం జగన్ ఆయన అడిగినవిధంగా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. బాలయ్య కోరికల చిట్టా నెరవేర్చడం ద్వారా ఆయనకు ప్రభుత్వంపై మంచి అభిప్రాయం వ్యక్తమవుతుందని జగన్ భావిస్తున్నారట.

నిమ్మగడ్డకు గవర్నర్ అప్పాయింట్మెంట్..సర్వత్రా ఉత్కంఠ

ఈ పనుల ద్వారా బాలయ్యను తనవైపు తిప్పికొనేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య కోరికలు నెరవేర్చడం ద్వారా ఆయనతో ప్రభుత్వానికి జై కొట్టిస్తే ప్రజల్లోకి మంచి సంకేతం వెళుతుందని జగన్ భావిస్తున్నారట. అందుకే బాలయ్య అడిగిందే తడవుగా ఆయన కోరికలను నెరవెర్చేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

గతంలో ఎప్పుడు విమర్శలు చేసే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఇటీవల జగన్ కార్యక్రమాలకు చూసి జై కొట్టారు. 108, కోవిడ్-19పై ప్రభుత్వం చర్యలు బేషుగా ఉన్నాయని జగన్ కు పవన్ కితాబిచ్చారు. దీంతో బాలయ్య కోరికను నెరవేర్చి క్రమంగా ఆయనను ముగ్గులోకి లాగాలని జగన్ భావిస్తున్నారు. అయితే బాలయ్య సీఎం జగన్ జై కొడుతారో లేదో వేచి చూడాల్సిందే..!

మెగాస్టార్ కోసం పురాతన దేవాలయం రెడీ !


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, ఆగష్టు నుండి మెగాస్టార్ లేకుండానే ఆచార్య సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడా అంటే.. అవుననే తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ కూడా పూర్తయిందని.. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఆ సెట్ లో షూటింగ్ ను జరపాలని.. ఆ తరువాత అనగా అక్టోబర్ లో మెగాస్టార్ షూట్ లో పాల్గొంటారని తాజాగా తెలిసిన లేటెస్ట్ అప్ డేట్. నిజానికి ఈ నెలలోనే షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా ప్రవాహం ముందు భారీ సినిమాల షూటింగ్స్ జరిగే పరిస్థితి లేకుండా పోయింది. మరి వచ్చే నెల కూడా కరోనా ఇంకా విజృంభించనుంది. ఆ లెక్కన కొరటాల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎలా షూట్ చేస్తాడో చూడాలి.

పూజా హెగ్డేతో అక్కినేని హీరో డేటింగ్ !

ఇక ఈ ‘ఆచార్య’ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడని.. ముఖ్యంగా దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకల పై పోరాటం చేసే ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది. మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కొరటాల ఈ సినిమాలో చూపించబోతున్నాడనగానే మెగా ఫ్యాన్స్ నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. కారణం మెగాస్టార్ అలాంటి క్యారెక్టర్ లో మొదటిసారి కనిపించబోతున్నాడు.

ఆ మహా దర్శకుడికి ఓ గాఢమైన కోరిక !

పైగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్ గా కనిపించడానికి చాలా మేక్ ఓవర్ కూడా అయ్యారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కెరీర్ ముగిసిందనుకున్న దశలో కాజల్ కు దొరికిన సువర్ణావకాశం ఇది. అన్నట్టు ఫిల్మ్ సిటీలో మొదలయ్యే షూట్ లో కాజల్ కూడా పాల్గొనబోతుంది. ఆమె ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటిస్తోందట. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని, పైగా ప్రేరణగా నిలుస్తోందట. ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

నిమ్మగడ్డకు గవర్నర్ అపాయింట్మెంట్.. సర్వత్రా ఉత్కంఠ


రాష్ట్ర మాజీ ఎన్నిక కమిషనర్ నిమ్మగడ్డ పంచాయితీ చివరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ దగ్గరికి చేరింది. రాష్ట్ర హై కోర్ట్ నిమ్మగడ్డను గవర్నర్ ని కలవాల్సిందిగా సూచించింది. దీనితో నిన్న 11:00 గంటలకు గవర్నర్ నిమ్మగడ్డకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం మరియు నిమ్మగడ్డ మధ్య నడుస్తున్న వివాదం గవర్నర్ వద్దకు వెళ్లగా..ఈ రోజు ఆయన ఈ విషయంపై ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తిగా మారింది.

కాంగ్రెస్-టీడీపీ తెరచాటు బంధానికి ఇదే నిదర్శనం..!

స్థానిక సంస్థల ఎన్నికల రద్దు విషయంలో నిమ్మగడ్డ కావాలనే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యాంగ బద్ద పదవిలో ఉండడం అంత మంచిది కాదని వైసీపీ ప్రభుత్వం భావించింది. అందుకే ఓ ప్రత్యేక జి ఓ ద్వారా నిమ్మగడ్డను ఎన్నికల కమీషనర్ గా తొలగించడం జరిగింది. తనను కమీషనర్ గా తొలగించడం చట్ట వ్యతిరేకం అని ఆరోపించిన నిమ్మగడ్డ, హై కోర్ట్ లో ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు . నిమ్మగడ్డ తొలగింపు రాజ్యాంగ విరుద్ధం అని, ఆయన్ని విధుల్లోకి తీసుకోవాలని హై కోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హై కోర్ట్ తీర్పుపై స్టే కొరకు ప్రభుత్వం సుప్రీం ని ఆశ్రయించగా, హై కోర్ట్ తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదు అని ఉన్నత న్యాయస్థానము చెప్పడం జరిగింది.

జగన్ మంచి కోసమే ఇదంతా చేస్తున్నాడట..!

ఉన్నత న్యాయస్థానం హై కోర్ట్ తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది కావున నిమ్మగడ్డను ఎలక్షన్ కమీషనర్ గా నియమించాలని హై కోర్ట్ మరోమారు ప్రభుత్వానికి సూచించింది. అలాగే గవర్నర్ ని కలవాల్సిందిగా నిమ్మగడ్డను ఆదేశించారు. మరి రేపు నిమ్మగడ్డ వ్యవహారంలో గవర్నర్ ఏవిధంగా స్పందిస్తాడో అని సర్వత్రా ఆసక్తినెలకొని ఉంది.

మందుబాబులు బేజారు…అక్రమార్కులు హుషారు..!


ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశిన మద్యం విధానంతో మందు బాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఆకాశాన్ని అంటే అంటే ధరలతో పాటు, కేవలం పరిమిత సమయంలో మాత్రమే మద్యం లభ్యత ఉండడం వారిని ఉక్కిరి బిక్కరి చేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తుంది. దుకాణాలలో కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగులను నియమించడం జరిగింది. మరి తెల్లారే సరికి చుక్కపడితే కానీ బండి నడవని ప్రాణాలు రాష్ట్రంలో చాలానే ఉంటాయి. అలాంటిది ఖచ్చితంగా ఉదయం 11:00 గంటల తరువాత మాత్రమే మద్యం అమ్మకాలు మొదలవుతున్నాయి. ఇక సాయంత్రం 7:00 గంటలకు గంట కొట్టినట్లుగా మూసేస్తున్నారు. మద్యం ప్రియులకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. 24 గంటలు ఏ సమయంలో మందు షాపు డోరుకొట్టినా… పదో పరకో ఎక్కువ తీసుకొని మద్యం అమ్మే రోజులు పోయి..రాత్రి ఏడు గంటకే మద్యం దొరకని రోజులు వచ్చాయి.

చినబాబుకు బ్యాడ్ లక్.. అవకాశం మిస్సయిందా?

సరే ముందుగా మేల్కొని సాయంత్రానికి కొని అట్టిపెట్టుకుందామా అంటే..రెగ్యులర్ బ్రాండ్ లు ఉండవు, ఒక్కోసారి అసలు స్టాక్ ఉండదు. మరో షాప్ కి వెళదామా అంటే అది ఎక్కడో మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నచ్చిన బ్రాండ్ కోసం అంత దూరం వెళ్లినా, ఆ బ్రాండ్ ఉంటుందనే నమ్మకం ఉండదు. లెక్కకు మించిన బ్రాండ్స్ తో కళకళలాడే మద్యం దుకాణాలు…రెండు మూడు బ్రాండ్స్ తో అది కూడా ఎప్పుడూ ఎరుగని పేర్లతో దర్శనం ఇస్తూ.. ఉసూరుమనిపిస్తున్నాయి. ఈ పరిణామం మందు బాబులకు జగన్ పై కోసం నషాళాన్ని తీసుకువెళుతుంది.

కాగా ఈ పరిస్థితి మద్యం అక్రమ రవాణాకు దారి తీస్తుంది. పక్క రాష్ట్రాలలో తక్కువ ధరలకు మద్యం విచ్చల విడిగా దొరుకుతుండటంతో కొందరు దళారులు అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. మన పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అధిక మొత్తంలో రాష్ట్రంలోకి చేరుతుంది. మద్యం షాప్ మూసివేసిన వెంటనే, అక్రమార్కులు దుకాణాలు తెరుస్తున్నారు. వారికి నచ్చిన బ్రాండ్స్ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటూ రోజుకు వేలల్లో ఆర్జిస్తునారు. దీని వలన ప్రభుత్వానికి మద్యం ద్వారా వస్తున్న అరా కోరా ఆదాయం కూడా తగ్గిపోతుంది. కాగా ఒక్క కృష్ణా జిల్లా పరిధిలో పోలీసుల దాడుల్లో వివిధ వ్యక్తుల నుండి పట్టుబడిన 3200 లీటర్ల మద్యం సీసాలను రోడ్డు రోలర్ సాయంతో ధ్వంసం చేశారు. దీని ధర దాదాపు రూ. 72 లక్షలు అని తెలుస్తుంది. ఒక కృష్ణా జిల్లా పరిధిలోనే ఈ స్థాయిలో మద్యం అక్రమ రవాణా జరుగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయవచ్చు.

మహేష్ మౌనంగా కనిపించే మానవతావాది


సూపర్ స్టార్ మహేష్ చాలా మృదు స్వభావి. ఆయనకంటే ఎక్కువగా ఆయన సినిమాలే మాట్లాడతాయి. వేదికలకు హాజరుకావడం, ఊక దంపుడు ఉపన్యస్యాలు ఇవ్వడం మహేష్ కి నచ్చదు. సోషల్ మీడియా విప్లవం వచ్చినప్పటి నుండి కొంచెం ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్న మహేష్, ఒకప్పుడు తన సినిమా విడుదల సమయంలో తప్పితే మరలా కనిపించేవారు కాదు. ఆయన స్వభావం లాగే ఆయన సహాయం కూడా ఉంటుంది. మహేష్ ఎప్పటి నుండో తన సంపాదనలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు వాడుతున్నాడు. ఎప్పటి నుండో మహేష్ గుండె జబ్బుతో బాధపడుతున్న పేదలైన తల్లిదండ్రుల పిల్లలకు సర్జరీలు చేయిస్తున్నాడు.

ప్రభాస్ ఒక్కడే దిక్కు.. మరి ఒప్పిస్తాడా?

ఈ విషయం చాలా కాలం తరువాత బయటపడింది. ఈ విషయాన్ని మహేష్ కానీ, ఆయన సన్నిహితులు కానీ బయటపెట్టలేదు. కాగా తాజాగా మహేష్ చిన్నపిల్లలకు చేయించిన గుండె ఆపరేషన్స్ సంఖ్య 1010 కి చేరిందట. మహేష్ ఆ విధంగా వేల పసి హృదయాలకు ఊపిరి పోశారు. కాగా మహేష్ శ్రీమంతుడు సినిమాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటాడు. ఆ మంచి పనిని రియల్ గా చేసి చూపించాడు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో రెండు గ్రామాలను మహేష్ దత్తత తీసుకొని, విద్య, వైద్యం మరియు మౌలిక వసతులు సమకూర్చారు. ఆ విధంగా మౌనంగా ఉండే మహేష్ లో ఓ పెద్ద మానవతావాది దాగున్నారు.

కరోనా టెస్ట్ చేసినట్లు సర్టిఫికెట్ ఉంటేనే 108 వచ్చేది?

Corona test
108 సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన చీర్లంచ లచ్చవ్వ అనే వృద్ధురాలు రెండు రోజుల క్రితం మృతి చెందింది. ఆమె అంత్యక్రియల తర్వాత కరోనా పాజిటివ్ అని తేలడం తో కుటుంబీకులు, బంధువులు మరియు అంత్యక్రియలకు హాజరైన వారందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శుక్ర‌వారం ఉద‌యం‌ ఆమె కొడుకు శ్రీనివాస్ (58) శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని కుటుంబీకులకు తెలిపాడు. వారు 108 కు ఫోన్ చేసి విషయం తెలపగా కోవిడ్ టెస్ట్ చేయించుకున్న‌ట్టు స‌ర్టిఫికెట్ ఉంటేనే అంబులెన్స్‌ తో పంపుతామ‌న్నారు. 108 సిబ్బం‌ది నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో శ్రీనివాస్ చనిపోయారు.

విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, వైద్య సిబ్బంది కలిసి బాధిత కుటుంబాన్ని క్వారంటైన్‌ కు తరలించి, అంబులెన్స్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉండగా శవాన్ని ఓ క‌వ‌ర్‌ తో ప్యాకింగ్ చేసి ఇంటిముందు పడేసి వెళ్లిపోయారు. మృతుని కుటుంబీకులంద‌రూ కూడా క్వారెంటన్ కు వెళ్లడంతో మృతదేహం వద్దకు వెళ్లడానికి ఏ ఒక్కరూ ముందుకు పోలేదు. ఉదయం పదకొండు గంటలకు చనిపోయిన మృతదేహాన్ని సాయంత్రం ఐదు గంటల వరకు అంత్యక్రియలు జరపకపోవడం ప‌ట్ట‌ణంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. చుట్టుపక్కల వారు కొంతమంది పై అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మళ్లీ మున్సిపల్ సిబ్బంది వచ్చి అంబులెన్స్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించారు.

డేటా పంచాయితీ?

Google fb twitter

Google fb twitter

భారత్‌ లో డేటాను ఏ సమస్యా లేకుండా సేకరించవచ్చు. గూగుల్’ ఫేస్‌బుక్, అమెజాన్, ట్విట్టర్ లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలు భారత్ వైపు చూడడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. అయితే ఇక్కడ డేటా కూడా దొరుకుతుంది కాబట్టి ఈ కంపెనీలు భారత్‌ లోకి రావాలనే అనుకుంటాయి. డేటా ప్రొఫైలింగ్ వల్ల కంపెనీల దగ్గర ఒక పెద్ద స్టోరేజ్ ఉంటుంది. దానిని బట్టి వాటికి వినియోగదారుల అలవాట్ల గురించి తెలిసిపోతుంది. మార్కెట్ రీసెర్చ్ కూడా చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కానీ, ప్రజల్లో ఈ డేటాను ఎవరైనా దుర్వినియోగం చేస్తారేమో అనే ఆందోళన కూడా ఉంది. ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఈ పనుల పురోగతికి తగినట్లు డేటాపై నిఘా పెట్టడం, దానిని సురక్షితంగా ఉంచడం, దానిపై గుత్తాధిపత్యాన్ని నిరోధించడం కోసం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు

“ఒక ప్రక్రియ అంటూ లేనపుడు, దానిని మనం అమోదించడం లేదా నిరాకరించడం ఎలా చేయగలం. దానిపై పని జరుగుతోంది. కానీ అది చాలా మెల్లగా జరుగుతోంది. ఈ క్రమంలో డేటా ఎక్కడ, ఎలా ఉంచాలి అనే దానిపై రాబోయే రోజుల్లో రిలయన్స్-జియో, గూగుల్-ఫేస్‌బుక్-అమెజాన్ లాంటి కంపెనీలతో వివాదాలు తలెత్తవచ్చని కొందరు చెబుతున్నారు.

గోప్యతను కాపాడే పేరుతో ముందు ముందు మార్కెట్‌ లో ఆంక్షలు ఉండకూడదు. దానిని దృష్టిలో పెట్టుకునే కంపెనీలు బహుశా.. మేం ఈ డేటాను ప్రకటనలకు మాత్రమే ఉపయోగిస్తామని, వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోమని చెబుతున్నయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.