Home Blog Page 8392

కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?


తెలంగాణ పీసీసీ చీఫ్ రేసు అనేది ఎండమావిలో నీటి కోసం వెతికే పెద్ద దప్పిక యాత్ర అయిపోయింది. ప్రతీసారి ఎవరిదో ఒకరి పేరు తెరపైకి రావడం.. మళ్లీ ఆ నియామకం వెనక్కి వెళ్లిపోవడం జరుగుతూనే ఉంది.

రేవంత్ రెడ్డికి పోటీ లేదని.. ఆయన నియామకం ఖాయం అనుకున్న తర్వాత సడన్ గా ఆ ప్రక్రియ ఆగిపోయింది. రేవంత్ ను సీనియర్లు అంతా కలిసి అడ్డుకున్నారనే చర్చ కాంగ్రెస్ లో సాగుతోంది. అయితే ఇప్పుడు సడన్ గా పీసీసీ చీఫ్ రేసులో పెద్ద జానారెడ్డి గారి పేరు వచ్చిందని ప్రచారం సాగుతోంది. ఆయన నియామకాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఖాయం చేశారని అంటున్నారు.

Also Read: తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవీ దక్కనుందా?

తెలంగాణలో సీనియర్లు సహా ఎవరి ప్రయత్నాల్లో వారు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నప్పటికీ తెలంగాణకు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించడంలో అధిష్టానం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సహా అనేకమంది తమకు అనుకూలంగా ఒక్క ప్రకటన పొందడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. అధిష్టానం మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇటీవలే బీజేపీ కూడా ఏపీ, తెలంగాణకు కొత్త అధ్యక్షులను మార్చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం కొత్త పీసీసీ ఛీప్ ల నియామకాన్ని ఎందుకు వాయిదా వేస్తోందన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న? ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలను కాపాడడం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే గోవా, మణిపూర్, కర్ణాటక, తాజాగా మధ్యప్రదేశ్ లోనూ చేజేతులారా అధికారంలో ఉండి మరీ బీజేపీ చేతిలో భంగపాటుకు గురై అధికారం కోల్పోయింది. ప్రస్తుతం రాజస్థాన్ లో పార్టీ అస్థిరమైన స్థితిలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం కూలే స్థితిలో ఉంది. డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్.. సొంత పార్టీ సీఎంపై తిరుగుబాటు చేశారు. దీంతో రాజస్థాన్ బీజేపీ పరం కాకుండా కాంగ్రెస్ అధిష్టానం తన శక్తియుక్తులన్నీ రాజస్థాన్ ప్రభుత్వాన్ని కాపాడడంపైనే దృష్టి కేంద్రీకరించింది.

Also Read: కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప

కాబట్టి తెలంగాణకు చెందిన కొందరు నాయకులు హైకమాండ్ కు పీసీసీ చీఫ్ మార్పు గురించి సంప్రదించినప్పటికీ.. ఈ టైంలో తమకు సమయం లేదని వారిని తిప్పి కొడుతున్నారు. రాజస్థాన్ లో సమస్యను పరిష్కరించాలని మాత్రమే కోరుకుంటున్నారు. అప్పటివరకు తెలంగాణలో కొత్త పీసీసీ చీఫ్ నియామకం జరిగేలా కనిపించడం లేదు.

-ఎన్నం

జగన్ పైకి రఘురామ రాజు మరో అస్త్రం..!


నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైకి మరో కొత్త అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. వారానికి ఓ అంశంపై లేఖ రాస్తున్న ఎంపీ ఈ వారం మాజీ ప్రధాని పివి నర్సింహారావు శతజయంతి ఉత్సవాల అంశాన్ని తేవనెత్తారు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన పీవీ శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. తెలంగాణా ప్రభుత్వం ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏందుకు నిర్వహించడం లేదన్నారు. పివి తెలంగాణా బిడ్డ అయినప్పటికీ రాష్ట్రంతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. కర్నూలు లోక్ సభ స్థానం నుంచి పీవీ ఎంపీగా గెలుపొందారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.

Also Read: కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప

వచ్చే కేబినెట్ సమావేశంలో పీవీకి భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయాలన్నారు. ప్రజలు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతిని అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయాలని, ఇతర మార్గాలలో ఈ విషయాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. పీవీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సార్లు ఎంపీగా గెలిచారని తెలిపారు. పీవీ తెలుగువారీ ఠీవీ అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని చెప్పారు.

Also Read: బీజేపీపై బాబు ఆశలు గల్లంతేనా?

తెలంగాణా ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే పీవీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడైనా ఆ పార్టీ నాయకులు ఎవరూ ఇంత వరకూ ఈ డిమాండ్ లేవనెత్తలేదు. దీంతో ఇప్పటి వరకూ ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సమస్య లేకుండా ఉంది. ఇప్పుడు సొంత పార్టీ ఎంపీనే పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేయడం, స్వయంగా ముఖ్యమంత్రి లేఖ రాయడంతోపాటు, ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించడంతో వైసీపీ ప్రభుత్వం సంకటంలో పడింది. ఈ అంశంపై బయట పడేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తుంది. ఉత్సవాలను నిర్వహిస్తే ఎంపీ రఘురామ కృష్ణంరాజుకే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఉత్సవాలు నిర్వహించకుండా ఈ సమస్య నుంచి ఎలా

బీజేపీ తారలు ఇప్పుడెందుకు కనిపించడం లేదు?


కేంద్రంలో అధికారంలోకి రాగానే ఎక్కడెక్కడి నుంచో తారలు వచ్చి కమల దళంలో చేరిపోయాయి. తమకూ అధికారం దక్కుతుందని ఆశపడ్డారు. బీజేపీ టికెట్ పొంది 2019 ఎన్నికల్లో పోటీచేశారు. పార్టీ తరుఫున పని చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీలో సినీ ప్రముఖులందరూ చేరి కళకళలాడేలా చేశారు. కానీ ఇప్పుడు సినీ ప్రముఖులందరూ ఎక్కడికి పోయారు. ఏమైపోయారు. ఎందుకు యాక్టివ్ గా లేరు. అసలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్న బీజేపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. దీనికి ఏ సినీ ప్రముఖులు కూడా సమాధానం ఇవ్వడం లేదు.

Also Read: తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవీ దక్కనుందా?

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, గత ఏడాది లోక్ సభ ఎన్నికలు జరిగిన సమయంలో చాలా మంది సినీ తారలు బీజేపీలో చేరారు. టాలీవుడ్ యువ హీరోయిన్ రేష్మా రాథోడ్ మహబూబాబాద్ ఎంపీగా బీజేపీ తరుఫున టికెట్ పొంది పోటీచేశారు. అదేవిధంగా ప్రముఖ నటుడు, నేత బాబు మోహన్ ఆంధోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

అదేవిధంగా గత సంవత్సరం నటీమణులు కవిత, మాధవి లత ఏపీలో బీజేపీలో చేరారు. కమలం పార్టీ తరుఫున పోటీ చేశారు. కానీ ఎన్నికలు ముగియగానే వీరంతా కనుమరుగయ్యారు.

Also Read: కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప

ఈ సినీ తారలంతా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి ఇప్పుడు అదృశ్యమయ్యారు. వారి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఇక సినీ ప్రముఖులు కూడా బీజేపీ లో క్రియాశీలకంగా ఒక్కరూ పనిచేయడం లేదు.

పార్టీలో చాలామంది నటులు.. నటీమణులకు విలువనిచ్చినా సరే వారంతా ఏమాత్రం పార్టీని పట్టించుకోకుండా తమ దారి తాము చూసుకోవడం బీజేపీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. వీరంతా ఒక్కరు కూడా సొంతంగా ఓట్లు గెలవలేరు. రేష్మా రాథోడ్, బాబూ మోహన్ లు తమ సెక్యూరిటీ డిపాజిట్లను కూడా కోల్పోయి చిత్తుగా ఓడిపోయారు. ఇక యూపీలోని రాంపూర్ లో కూడా గతంలో రెండు సార్లు గెలిచిన జయప్రద కూడా ఈసారి బీజేపీ హవాలోనూ గెలవడంలో విఫలమైంది.

రీమేక్‌ కాదు.. ప్రవీణ్‌ సత్తారు- నాగ్‌ కాంబో !


కెరీర్ ప్రారంభం నుంచి కొత్త దర్శకులు, ప్రతిభ ఉన్న యువకులను ప్రోత్సహిస్తూ వస్తున్నాడు కింగ్‌ నాగార్జున. వాళ్లపై నమ్మకం ఉంచి ధైర్యంగా సినిమాలు చేశాడు. అనేక విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. అయితే, కొంతకాలంగా నాగార్జునకు ఆశించిన సక్సెస్‌ రావడం లేదు. సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి తర్వాత నాగ్‌ నటించిన చిత్రాలు అంతమాత్రంగానే ఆడాయి. రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆఫీసర్ అయితే భారీ డిజాస్టర్గా మిగిలింది. నానితో కలిసి నటించిన దేవదాస్‌ కూడా హిట్‌ కాలేదు. చివరగా రాహుల్‌ రవీంద్రన్‌ డైరెక్షన్‌ చేసిన బోల్డ్‌ మూవీ మన్మధుడు 2తో కూడా ఆడియన్స్‌ మెప్పు పొందలేకపోయింది. ప్రస్తుతం కరణ్‌ జోహార్ ప్రొడ్యూస్‌ చేస్తున్న హిందీ యాక్షన్‌ ఫాంటసీ ఫిల్మ్‌ ‘బ్రహ్మాస్త్ర’లో అమితాబ్‌ బబ్చన్‌, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి నాగ్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే, తెలుగులో ‘వైల్డ్‌ డాగ్‌’ అనే మూవీ చేస్తున్నాడు. సాల్మోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎన్‌ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు నాగ్‌. ఇప్పుడు మరో యంగ్‌ డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారుతో ఓ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ సినిమాను ఏషియన్‌ గ్రూప్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

Also Read: సోనూ సూద్ సాయం నుంచి గుణపాఠాలివీ

‘పీఎస్‌వీ గరుడ వేగ 126.18 ఎమ్‌’తో రాజశేఖర్ కు సెకండ్‌ లైఫ్‌ ఇచ్చాడు ప్రవీణ్‌. తన ఫస్ట్‌ మూవీ ‘చందమామ కథలు’తో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడతను. 2014లో వచ్చిన ఈ మూవీతో నేషనల్‌ అవార్డు దక్కించుకున్నాడు. ఆపై, ‘గుంటూరు టాకీస్‌’ అనే అడల్ట్‌ మూవీతో కమర్షియల్‌ బాట పట్టినప్పటికీ ‘గరుడవేగ’తో అందరి మెప్పు పొందాడతను. దాంతో, నాగ్‌ అతనికి చాన్స్‌ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్‌ ఆసక్తి కలిగిస్తోంది. అయితే, నాగ్‌-సత్తారు కాంబోలో వచ్చేది రీమేక్‌ మూవీనా? స్ట్రెయిట్‌ మూవీనీ అన్నది తేలాల్సి ఉంది.

Also Read: భల్లాలదేవతో బాలీవుడ్‌ క్వీన్‌ జోడీ

ఈ ఇద్దరూ బాలీవుడ్‌ హిట్‌ మూవీ ‘రైడ్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. హిందీలో అజయ్‌ దేవగణ్‌ చేసిన ఐటీ డిపార్ట్‌మెంట్‌ ఐఆర్ ఎస్‌ ఆఫీసర్ పాత్రలో నాగ్‌ నటిస్తాడని అన్నారు. కానీ, నాగార్జున సన్నిహితులు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. నాగ్‌ కోసం ప్రవీణ్‌ ఓ కొత్త కథ రాశాడని చెబుతున్నారు. ఈ మూవీ కూడా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందట. పన్నులు చెల్లించాల్సిన అవసరం, ప్రజాధనాన్ని సరిగ్గా వినియోగించాలన్న కాన్సెప్ట్‌తో ప్రవీణ్‌ పక్కా స్క్రిప్టు సిద్ధం చేశాడని చెబుతున్నారు. ‘గరుడవేగ’ తర్వాత అతను రెండేళ్ల పాటు ఈ స్క్రిప్టు పై వర్క్‌ చేశాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాతలు నారాయణ్ దాస్‌ నారంగ్‌, రామ్‌ మోహన్‌ రావు, శరత్‌ మరార్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఇతర తారాగణం, సాంకేతిక సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

ఒక్క డైలాగ్‌ లేకుండా ఆర్జీవీ.. ‘మర్డర్’ ట్రైలర్


వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ వరుస సినిమాలు తీస్తూ, డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా ‘పవర్ స్టార్’ అనే మూవీతో తెలుగు రాష్ట్రాల్లో అగ్గిరాజేసే ప్రయత్నం చేశాడు ఆర్జీవీ. దాదాపు రెండు వారాల పాటు పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతూ తన మూవీకి ప్రచారం తెచ్చుకున్నాడు. తీరా 40 నిమిషాల నిడివి కూడా లేని పేరడి సినిమాను రిలీజ్‌ చేసిన వర్మ చివరి ఎనిమిది నిమిషాల్లో తానే కనిపించాడు. రియల్ ‌లైఫ్‌లో పవన్‌కు తాను ఇవ్వాలనుకున్న మెసేజ్‌ను సినిమా ద్వారా ఇచ్చాడు. ఈ వివాదం ముగిసిందని అనుకుంటున్న తరుణంలో ఆర్జీవీ మరో బాంబ్‌ పేల్చాడు. వాస్తవ ఘటనలు, రియల్‌ లైఫ్ క్యారెక్టర్లతో సినిమాలు తీయడంలో ఆరి తేరిన రాము.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్లొండ ప్రణయ్‌ హత్యోదంతం ఆధారంగా తీస్తున్న ‘మర్డర్’ కుటుంబ కథా చిత్రం మూవీ ట్రైలర్ను ఈ రోజు రిలీజ్‌ చేశాడు.

Also Read: భల్లాలదేవతో బాలీవుడ్‌ క్వీన్‌ జోడీ

అయితే ఈ మూవీకి ఆర్జీవీ దర్శకత్వం వహించడం లేదు. ఆనంద్‌ చంద్ర ఈ మూవీతో డైరెక్టర్గా ఇంట్రడ్యూస్‌ అవుతున్నాడు. నట్టి కరుణ, నట్టి క్రాంతి ప్రొడ్యూసర్లు. అమృత పాత్రలో సాహితి అవాంచ నటిస్తోంది. ఆమె తండ్రిగా శ్రీకాంత్‌ అయ్యంగార్, తల్లిగా గాయత్రి భార్గవి నటిస్తున్నారు. ప్రణయ్‌-అమృత ప్రేమ, పెళ్లి.. కులాంతర వివాహం నచ్చక… అమృత తండ్రి… ప్రణయ్‌ను హత్య చేయించడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అమృత తండ్రి మారుతీ రావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైలర్ ప్రకారం ఈ ఎపిసోడ్‌ వరకూ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

Also Read: డబ్బులు కోసం హీరోయిన్లందరూ.. !

ఆర్జీవీ రీసెంట్‌గా తీసిన చిత్రాలతో పోలిస్తే ‘మర్డర్’ మేకింగ్ ఆసక్తి కలిగిస్తోంది. 2 నిమిషాల 13 సెకండ్ల నిడివితో ఉన్న ట్రైలర్లో ఒక్క డైలాగ్‌ కూడా లేదు. కానీ, తాను చెప్పాలనుకున్న విషయాన్ని బ్యాక్‌గ్రౌండ్‌ క్యాప్షన్‌తో… చూపించాలనుకున్నది పర్ఫెక్ట్‌ పిక్చరైజేషన్‌తో ట్రైలర్తోనే క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. యావత్‌ భారతదేశానికి షాక్‌ ఇచ్చిన ఒక ఘటన ఆధారంగా క్యాప్షన్‌తో మొదలైన ట్రైలర్లో పాత్రలను పరిచయం చేసిన తర్వాత అసలు కథను చెప్పే ప్రయత్నం చేశాడు. పిల్లలని ప్రేమించడం తప్పా? తప్పు చేస్తే దండించడం తప్పా? వేరే గతి లేనప్పుడు చంపించడం తప్పా? పిల్లలని కనగలం గాని వాళ్ల మనస్తత్వాలను కనగలమా? సమాధానం మీరే చెప్పండి… అనే క్యాప్షన్స్‌తో కథను ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, మూవీ రిలీజ్‌ డేట్‌ను ఆర్జీవీ ఇంకా అనౌన్స్‌ చేయలేదు.

 

 

తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవీ దక్కనుందా?


కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది. మోడీ సర్కార్ బంపర్ మెజార్టీతో రెండోసారి అధికారంలోకి రావడంతో బీజేపీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. అయితే బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర తొలి నుంచి ఉంది. దీంతో ఈ ముద్రను చేరిపేసేందుకు బీజేపీ అధిష్టానం దక్షిణాది రాష్ట్రాలపై దృష్టిసారించింది. దక్షిణాదిలో బీజేపీ బలపడేందుకు అవకాశం ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అవకాశాలు ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది. దీంతో అధిష్టానం ఆదేశాలతో కేంద్రమంత్రులు సైతం తరుచూ తెలంగాణలో పర్యటిస్తూ స్థానిక నేతల్లో జోష్ నింపుతున్నారు.

Also Read: కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకంగా వ్యవహరించింది. అయితే నాటి నుంచి కూడా తెలంగాణలో బీజేపీ బలపడేందుకు శతవిధలా ప్రయత్నిస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో తెలంగాణలో బలపడేందుకు సన్నహాలు చేస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో గెలిచి సత్తాచాటడంతో అధిష్టానం తెలంగాణపై దృష్టిసారించింది. పక్కా ప్రణాళికతో వెళితే తెలంగాణలో బీజేపీ మరింత బలపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని అధిష్టానం గుర్తించింది. ఈమేరకు 2024 ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళుతోంది.

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో స్థానిక నేతలు సైతం అధికార టీఆర్ఎస్ పై దూకుడుగా వెళుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంటే బీజేపీ నేతలే సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలను ప్రజల్లోకి తీసుకెళుతూ బీజేపీ నేతలు అందరి అటెన్షన్ తమవైపు తిప్పుకుంటున్నారు. మరోవైపు అధిష్టానం సైతం తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ ను నియమించింది. ఆయన కూడా తొలి నుంచి సీఎం కేసీఆర్, అధికార టీఆర్ఎస్ పై దూకుడుగా వెళుతున్నారు. టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా బండి సంజయ్, స్థానిక నేతలు పోరాటాలు చేస్తున్నారు.

Also Read: బీజేపీపై బాబు ఆశలు గల్లంతేనా?

దీంతో బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు కేంద్రంలో ప్రాధాన్యం కల్పించేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే తెలంగాణ వ్యక్తిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనుందని సమాచారం. అంతేకాకుండా బీజేపీ జాతీయ కార్యవర్గంలోనూ తెలంగాణ నేతలకు సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ప్రస్తుతం మురళీధర్ రావు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల శేఖర్ రావు జాతీయ కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు.

దీంతో రాష్ట్రానికి రెండు పదాధికారుల పదవులు(ఆఫీస్ బేరర్లు) మరో రెండు కార్యవర్గ పదవులతోపాటు మోర్చాకు సంబంధించి కీలక పదవి తెలంగాణ కేటాయించునున్నట్లు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు పదవుల పంపకం చేపట్టనుండటంతో ఆశావహులు ఇప్పటికే లాబీయింగ్ మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పదవీ ఎవరికీ దక్కుతుందనే ఆసక్తి బీజేపీ శ్రేణుల్లో నెలకొంది.

వరుసగా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ల రాజీనామాలు..!


ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్ల వరస రాజీనామాలు తెలంగాణలో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వరరావు రాజీనామా చేయగా తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న వేళ ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు రాజీనామా చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Also Read: సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?

నిజామాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వరరావు ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులను చూసి మనస్థాపంతో ఇటీవల రాజీనామా చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని ప్రభుత్వం అంత సీరియస్ గా తెలుసుకోలేదనే ఆరోపణలున్నాయి. అయితే మరోసారి ఇలాంటి సంఘటనలో వరంగల్ ఎంజీఎంలో వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వరంగల్ ఎంజీఎం సూపరిండెంటెంట్ బత్తుల శ్రీనివాసరావు తన ఆరోగ్యం సహకరించడం లేదని కారణంతో తన పదవీకి రాజీనామా చేస్తున్నట్లు డీఎంఈకి లేఖ రాశారు. తన రాజీనామా ఆమోదించాలని లేఖలో పేర్కొన్నాడు. అయితే ఆయన రాజీనామా వెనుక వేరే కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఆయన రాజీనామా వెనుక చాలా కారణాలున్నట్లు ఆస్పత్రివర్గాలు చెబుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి ఆరోపణలు, కిందిస్థాయి ఉద్యోగులు సహకరించడం పోవడంతో మనస్థాపంతో శ్రీనివాసరావు రాజీనామా చేశారని ప్రచారం జరుగుతోంది. ఆయన రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వం కొత్త సూపరింటెండెంట్ ను నియమించేందుకు సన్నహాలు చేస్తోంది. ఈమేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వరంగల్ కు వెళుతున్నట్లు తెలుస్తోంది. కొత్త సూపరిండెంటెండ్ పరిశీలనలో డాక్టర్ చంద్రశేఖర్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

ఇక సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాలో 152 కరోనా కేసులు, రూరల్ జిల్లాలో 25, జనగామలో 18, భూపాలపల్లిలో 20, మహబూబాబాద్ జిల్లాలో 14కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాలోనే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ ఎంజీఎం సూపరింటెండెంట్ శ్రీనివాసరావు రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కేంద్రం సవతి ప్రేమ.. తెలుగు రాష్ట్రాల చేతికి చిప్ప


బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఉత్తరాధి కీలక రాష్ట్రాలకు కేంద్రం వేల కోట్ల నిధులు పంచుతోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు మాత్రం బిచ్చం వేసినట్టు నిధులు విదిలిస్తోంది. కేంద్రం చిప్ప చేతికి ఇచ్చి అడుక్కునేలా చేస్తోందన్న ఆవేదన తెలుగు ప్రభుత్వాల్లో నెలకొంది. తెలుగు రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో కోట్ల రూపాయలను కేంద్రం ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంటోంది. అయితే తీసుకుంటున్న నిధులన్నీ కూడా కేటాయించకుండా కీలకమైన ఓటు బ్యాంకు ఉన్న రాష్ట్రాలకే దోచిపెడుతోందన్న ఆవేదన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 100శాతం వసూలు చేస్తున్న కేంద్రం.. అందులో 10శాతం కూడా కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం సమానంగా పంచాల్సిన అవసరం ఉందని ఇక్కడి నేతలు ప్రశ్నిస్తున్నారు.

Also Read: సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?

కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గుర్రుగా ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాలంటే ఏమాత్రం లెక్కలేకుండా వ్యవహరిస్తోందన్న ఆవేదన సీఎం కేసీఆర్, జగన్ లలో ఉంది. నిజానికి తెలుగు రాష్ట్రాలు రెండు కలిపితే ఉమ్మడి ఏపీతో పోల్చితే కర్ణాటక చిన్న రాష్ట్రం.. జనాభా పరంగా.. నిధుల వెచ్చింపు పరంగా చాలా తక్కువే. అయితే అక్కడున్నది బీజేపీ పాలిత రాష్ట్రం.. అందుకే జీఎస్టీ చెల్లింపులో పక్కనున్న బీజేపీ పాలిత కర్ణాటకకు నిధుల వరదను కేంద్రం పారించింది. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు ఏలుతున్న తెలంగాణ, ఏపీకి ముష్టి విదిల్చిందని ఇక్కడి ప్రభుత్వ వర్గాలు ఆడిపోసుకుంటున్నాయి

తాజాగా దేశంలోని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిధులు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.3054 కోట్లు, ఏపీకి రూ.3028 కోట్లు విడుదల చేసింది. రెండూ రాష్ట్రాలకు కలిపినా 6వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది.

అదే సమయంలో దేశంలో ఆర్థిక రాజధాని ముంబై ఉన్న అతిపెద్ద మహారాష్ట్రకు ఆ రాష్ట్ర జనాభాకు సరిపడా 19628 కోట్లు విడుదల చేసింది. ఇక మహారాష్ట్ర అంత లేని బీజేపీ పాలిత కర్ణాటకకు ఏకంగా రూ.18628 కోట్లు విడుదల చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటకలో బీజేపీ పాలిస్తుండడమే ఆ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయింపునకు కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. తమిళనాడుకు రూ.12305 కోట్లు పరిహారం కింద అందించింది. ఇక పంజాబ్ కు సైతం రూ.12187 కోట్లు విడుదల చేసింది.

Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

తెలుగు రాష్ట్రాల కంటే జనాభాలో.. విస్తీర్ణంలో కూడా చిన్నదైన కర్ణాటకకు దేశంలోనే మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా 18వేల కోట్లు కేటాయించడంపై తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు రగిలిపోతున్నారు. ఇక పంజాబ్ కు సైతం 12వేల కోట్లు ఇచ్చారు. అదే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపినా 6వేల కోట్లు దాటకపోవడం గమనార్హం. దీన్ని బట్టి పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తున్న కేంద్రం.. తెలుగు రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని రెండు రాష్ట్రాలు ఆడిపోసుకుంటున్నాయి..

దళిత యువకుడు చావుకు అసలు కారణం ఏమిటీ?


ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఓ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. దళిత యువకుడు కిరణ్ కుమార్ పొలీసు కస్టడీలో మరణించడం విమర్శలకు దారితీసింది. పోలీసులు కిరణ్ కుమార్ మాస్క్ ధరించలేదన్న కారణంతో దారుణంగా తలపై కొట్టారని, దానితో కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు, అనేది కిరణ్ కుటుంబ సభ్యుల వాదన. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడ్డాయి. బాధ్యులైన పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని ఆందోనలు చేశాయి. మరో ప్రక్క ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని, వారిపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక టీడీపీ నేత వర్ల రామయ్య జాతీయ ఎస్పీ, ఎస్టీ కమీషన్ కి లేఖ రాయడం జరిగింది.

Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

ఐతే ఈ ఘటనలో పోలీసుల వర్షన్ వేరుగా ఉంది. మృతుడు కిరణ్ కుమార్ మరియు అతని స్నేహితుడు బైక్ పై మాస్క్ లేకుండా వెళుతుండగా పోలీసులు ఆపడం జరిగింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న కిరణ్ కుమార్ మరియు అతని స్నేహితుడు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారట. దీనితో చీరాల టూ టౌన్ ఎస్ ఐ విజయ్ కుమార్ వీరిద్దరిని పోలీసు జీపులో స్టేషన్ కి తరలిస్తుండగా, కిరణ్ కుమార్ జీపులో నుండి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడట. ఈ క్రమంలో కిరణ్ కుమార్ తలకి తీవ్ర గాయం కావడంతో ఆయన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట. అక్కడ చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ తదుపరి రోజు మరణించాడనేది పోలీసుల కథనం.

Also Read: తుమ్మలకు మరోసారి అదృష్టం వరించనుందా?

ఈ వ్యవహారంలో అసలు నిజం ఏమిటనేది ఎవరికీ తెలియదు. ఐతే కిరణ్ కుమార్ ని ఎస్సై విజయ్ కుమార్ తీవ్రంగా కొట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు కుటుంబ సభ్యులు. మృతుడితో పాటు సంఘటనలో ఉన్న స్నేహితుడు కిరణ్ ని పోలీసులు తీవ్రంగా గాయపరిచినట్లు చెప్పారని, మావద్ద ఆడియో సంభాషణలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఘటనపై కిరణ్ కుటుంబ సభ్యులు సమగ్ర దర్యాప్తు కోరుకుంటున్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ మృతుడు కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు.

బీజేపీపై బాబు ఆశలు గల్లంతేనా?


ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తుంటే బీజేపీ పొత్తుపై బాబు పెట్టుకున్న ఆశలు గల్లంతైనట్లేనని అనిపిస్తోంది. ఏపీలో 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం చవిచూసింది. ఇప్పటికే ఆ ఓటమి నుంచి టీడీపీ కోలుకోవడం లేదు. ఇక 2019లో టీడీపీ ఓటమిగల కారణాలు బాబు ఇప్పటికీ అర్థం కావడం లేదు. దీంతో ఆయన 2014 ఎన్నికల్లో ఆయనకు కలిసొచ్చేన పార్టీలతోనే 2024ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. దీంతో కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టిన బాబు ఆ పార్టీకి హ్యండిచ్చారు. బీజేపీ పార్టీతో పొత్తు కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read: తొందరపడిన బాబు బకరా అయ్యారే..!

అయితే బాబు ఆశలు మాత్రం ఫలించేలా కన్పించడం లేదు. బీజేపీ అధిష్టానం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు కట్టబెట్టింది. బాబు పేరుచెబితేనే ఇంతెత్తున లేచే వీర్రాజును అధ్యక్ష పదవీ అప్పగించడం ద్వారా బాబుకు ఆశలకు చెక్ పెట్టేసింది. ప్రస్తుతం బాబుకు బీజేపీ అవసరంగానీ.. బీజేపీకి బాబు అవసరం లేదని ఆ పార్టీ అధిష్టానం అభిప్రాయపడుతోంది. వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి పలు డిమాండ్లను విన్పిస్తూనే మాజీ సీఎం చంద్రబాబు అవినీతిని సైతం బయటికి తీయాలని కోరుతున్నాడు. బీజేపీ ఫైర్ బ్రాండ్ వీర్రాజుతో బాబు మరింత ఇరకాటంలో పడటం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు హయాంలో టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి గెలిచిన దాఖలు లేవు. దీంతో ఎలాగోలా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకొని మోదీ చర్మిష్మాతో గట్టెక్కాలని బాబు ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ చంద్రబాబుకు డోర్లు మూసివేయం.. మరోవైపు బాబు ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక కాంగ్రెస్ కు హ్యండివ్వడంతో ప్రస్తుతం బాబు జాతీయ స్థాయిలో, ఏపీలోనూ రెండింటికి చెడ్డ రేవడిలా మారిపోయారు. బాబు ఏ ఎండకు ఆ గొడుగు పడుతారనే విషయం మరోసారి రుజువుకావడంతో ఆపార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.

Also Read: జిల్లాల విభజన.. సందిగ్ధంలో వైసీపీ నేత?

అయితే బాబు మాత్రం బీజేపీ పొత్తుకోసం వెంపర్లాడుతున్నాడు. టీడీపీ చెందిన సీనియర్ నేతలు ఇప్పటికే బీజేపీలో కీలక స్థానాల్లో ఉండటంతో వారిసాయంతో వచ్చే ఎన్నికల నాటికి ఆపార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం బాబు పేరుచెబితేనే మండిపడుతున్నారు. బీజేపీ సైతం ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ఆలోచిస్తుండటంతో బాబుకు ఆశలు గల్లంతేననే టాక్ విన్పిస్తుంది. ఏపీలో తాజా పరిణమాలన్నీ బాబుకు వ్యతిరేకంగా మారుతున్నారు. దీంతో చంద్రబాబు టీడీపీని ఏవిధంగా గాడిలో పెడుతారనే ఆసక్తి నెలకొంది.

కన్నాపై వేటుకు కారణాలు ఏంటీ?

Kanna-Lakshmi-Narayana-was-replaced


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ తొలగింపు విషయంలో ఆ పార్టీ అధిష్టానం దూకుడు ఎందుకు ప్రదర్శించిందనేది ఇప్పుడు అందరినీ వేదిస్తున్న ప్రశ్న. ఉన్న పళంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజును బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షులు జె.పి నడ్డా ఉత్తర్వలు ఇచ్చారు. కన్నాపై కొద్ది రోజులుగా బిజెపి అదిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. అదే ఆయనను తొలగించడానికి ముఖ్యకారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. వైసీపీ నేతలు కొద్ది రోజుల కిందట ఒక ఆరోపణ చేశారు. చంద్రబాబు నుంచి రూ.20 కోట్లు కన్నాకు అందాయని, అందుకే కన్నా చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుస్తున్నారని ఎంపి విజయసాయిరెడ్డి ఆరోపించారు. అందుకే కరోనా టెస్ట్ కిట్ లపై లేనిపోని రాద్ధంతం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఇదే అంశాన్ని జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

అంతే కాకుండా బీజేపీ జనసేన పొత్తు ఉన్నప్పటికీ రెండు పార్టీలను సమన్వయం చేయడంలో కన్నా వైఫల్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకూ ఏ కార్యక్రమాన్ని రెండు పార్టీలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించలేకపోయాయి. పవన్, కన్నా సమావేశం అవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి సందర్భాలు అసలు లేవు. దీంతో రెండు పార్టీల మధ్య పొత్తు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యింది. రాజధాని విషయంలో ముందు నుంచి మద్దతుగా కన్నా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గవర్నర్ వద్దకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులు చేరినప్పడు వాటిని ఆమోదించవద్దని కన్నా లేఖ రాశారు. ఈ వ్యవహారంపై అదిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా నిమ్మగడ్డ ను ఎస్ఇసిగా తొలగించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదించినప్పడు కన్నా ఆ విషయంలో గవర్నర్ తీరును తప్పుబడుతూ లేఖ రాశారు.

Also Read: తుమ్మలకు మరోసారి అదృష్టం వరించనుందా?

మరోవైపు కన్నా లక్ష్మీ నారాయణ నేతృత్వంలో 2019 లో ఎన్నికల్లో బిజెపీ అధిక సంఖ్యలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసింది, కాని ఒక్క సీటు సాధించలేకపోయింది. కనీసం గట్టి పోటీ ఇచ్చిన పరిస్థతి ఎక్కడా కనిపించలేదు. నర్సరావుపేట పార్లమెంట్ స్థానానికి బరిలో నిలిచిన కన్నా డిపాజిట్ కోల్పోయారు. దీంతో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ పూర్తగా చతికలబడినట్లయ్యింది.

వాస్తవానికి కన్నాను పార్టీ అధ్యక్షుడిగా నియమించిన సమయంలో ముందు సోము వీర్రాజు పేరే వినిపించింది. పార్టీలో చేసేందుకు అధ్యక్ష పదవిని డిమాండ్ చేసిన కన్నా బీజేపీ అధిష్టానం అందుకు సిద్ధంగా లేకపోవడంతో వైసీపీతో సంప్రదింపులు జరిపి పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. చివరి నిముషంలో బీజేపీ నుంచి సానుకూల సమాచారం అందడంతో వైసీపీలో చేరకుండా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని నాటకం ఆడి చివరికి బీజేపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఎన్టీఆర్ వస్తే బాలయ్య అల్లుడికి ఇబ్బందేంటి..!


టీడీపీ పార్టీని పదవిని అల్లుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నుండి లాగేసుకున్నాక ఆయనకు ఎదురులేకుండా పోయింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రాజకీయ పదవులకు దూరంగా, కొన్ని ప్రయోజనాలకు దగ్గరగా బ్రతికేశారు. తండ్రి ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో పునాది నుండి ఉన్న హరికృష్ణ మాత్రం ఓసారి రాజ్య సభ సభ్యడు పదవితో పాటు ఎమ్మెల్యే గా ఎన్నిక కావడం జరిగింది. అంతకు మించి టీడీపీ చైతన్య రథసారధికి దక్కిందేమి లేదు. ఎప్పటికైనా హరికృష్ణతోనే తనకు ముప్పనుకున్న బాబు,ఆయన్ని పార్టీకి దూరం పెడుతూ వచ్చారు. ఆయనకు పార్టీలో కనీస ప్రాధాన్యత కూడా లేకుండా చేశారు. ఇక అవసరానికి 2009 ఎన్నికల కోసం జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి తెచ్చుకున్న చంద్రబాబు, తరువాత పార్టీకి మరియు నందమూరి కుటుంబానికి దూరం చేశారు.

Also Read: సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?

చంద్రబాబు ఏది చేసినా తన కొడుకు కోసమే చేశారు. లోకేష్ కి ప్రత్యామ్నాయంగా టీడీపీలో మరో బలమైన నాయకుడు ఉండకూడదు అనేది బాబు ఆచరిస్తున్న సూత్రం. అందుకే తెలివి తేటలు, వాక్చాతుర్యం ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీకి చేరువ కానివ్వలేదు. విజయపథంలో ఉన్నప్పుడు నాయకుడు చేసే పొరపాట్లు, తప్పిదాలు అనేవి లెక్కలోకి రావు. ఎప్పుడైతే పరాజయం ఎదురవుతుందో ప్రతి ఒక్కరు తప్పులను ఎత్తి చూపుతారు. టీడీపీ పార్టీ ఘోరపరాభవానికి, నేటి దుస్థితికి చంద్రబాబు పుత్ర వాత్సల్యమే కారణమని తెలుగు తమ్ముళ్లు కూడా చెప్పే మాట. కొడుకుపై ప్రేమను మరచి ఎన్టీఆర్ లాంటి సమర్దుడిని దించితేనే టీడీపీకి భవిష్యత్తు అనేది టీడీపీ నేతల వాదన.

Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

లోకేష్ భవిష్యత్ గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ ని టీడీపీ ని కాపాడేవాడు అనే హోదాలో ఆహ్వానించడు. కారణం ఒకవేళ 2024 లో టీడీపీ అధికారంలోకి వస్తే సీఎం చంద్రబాబు నాయుడే అయినా, తరువాత భవిష్యత్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వస్తుంది కానీ, లోకేష్ పేరు కాదు. కాబట్టి టీడీపీ ఏమై పోయినా ఎన్టీఆర్ కి మాత్రం ఆహ్వానం ఉండదు. ఎన్టీఆర్ ని పార్టీకి దూరం చేయడం వెనుక బాబు ఎజెండా స్పష్టంగా అర్థం అవుతుండగా, బాలయ్య అల్లుడు భరత్ కూడా వ్యతిరేకించడం ఆసక్తికరం. చంద్రబాబు వలే ఎన్టీఆర్ రాకను బాలయ్య చిన్నల్లుడు భరత్ అసలు ఇష్టపడడం లేదట. ఎన్టీఆర్ ని పార్టీలోకి తేవద్దనేది ఆయన వాదన అని సమాచారం. చంద్రబాబుకు ఈ విషయంలో సూచనలు ఇస్తున్నాడట భరత్ . గతంలో కూడా భరత్ ఎన్టీఆర్ పై నెగెటివ్ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అవసరం టీడీపీకి లేదన్న భరత్, వస్తే ఎవరూ కాదనరు అన్నారు. ఎన్టీఆర్ రాకపోయినా టీడీపీని సమర్ధవంతంగా నడిపే నాయకులు ఉన్నారు అన్నారు. ఎన్టీఆర్ రాకపై భరత్ ఎందుకు అభద్రతా భావం ఫీలవుతున్నాడు అనేది ఆలోచించాల్సిన అంశం.

డబ్బులు కోసం హీరోయిన్లందరూ.. !


కరోనా వల్ల ఎవరికైనా మేలు జరిగింది అంటే.. అది కచ్చితంగా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వారికే. కరోనా మహమ్మారి రాకతో సినిమాలను థియేటర్స్ లో చూసే అవకాశం లేకపోవడంతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి కొత్త ఎనర్జీ వచ్చినట్టు అయింది. పైగా నేటి పిల్లలు కూడా డిజిటల్ డిఎన్ఏతోనే పుడుతున్నట్టు.. కిడ్స్ అందరికి ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్లలోని గేమ్స్ అలవాటు అయిపోయాయి. కార్టూన్ల సిరీస్ లు సరదా అయిపోయాయి. పైగా గతంలో పోల్చుకుంటే నేటి యువత కూడా స్మార్ట్‌ ఫోన్స్ లోనే సర్వస్వం కానించేస్తున్నారు. ఇలాంటి పరిస్తుతుల్లో డేటా వాడకం అత్యంత వేగంగా పెరిగిపోయింది.

Also Read: భల్లాలదేవతో బాలీవుడ్‌ క్వీన్‌ జోడీ

పైగా నేటి యువతరం అభిరుచి కూడా అంతకన్నా వేగంగా మారుతుంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ మాయలో పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ క్రమంలోనే పెద్ద నిర్మాణ సంస్థలు, స్టార్ డైరెక్టర్స్ సైతం వెబ్ లో అడుగు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు వెబ్ సిరీస్ లను నిర్మించడానికి రెడీ అవుతుంటే.. మరికొందరు ఏకంగా డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ లో తమ అందచందాల ప్రదర్శనకు సై అంటున్నారు. మళ్ళీ సినిమాలతో ఎప్పుడు బిజీ అవుతామో తెలియదు. డబ్బులు రుచి మరిగిన ప్రాణాలు అయ్యే.. మరీ ఖాళీగా కూర్చోవాలంటే హీరోయిన్లకు తెగ ఇబ్బంది అయిపోతుంది. అందుకే వెబ్ సిరీస్ కథలు బోల్డ్ గా ఉన్నా… డబ్బు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.

Also Read: కరోనాను జయించిన ఐశ్యర్యా రాయ్‌..

ఇప్పటికే అలా సిద్ధం అయి స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించి.. వెబ్ వరల్డ్ లో తానూ ఒక పేజీని క్రియేట్ చేసుకుంది. అలాగే డబ్బు సంపాదన పోతుందేమోనని పెళ్లి కూడా చేసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయబోతోంది. ఇప్పుడు వీరి బాటలోనే త్రిష, బబ్లీ బ్యూటీ హన్సిక, మిల్క్ బ్యూటీ తమన్నా కూడా అడుగులు వేస్తున్నారు. త్రిష, తమన్నా తమిళంలో చేరో వెబ్ సిరీస్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. హన్సిక కూడా హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఆ సిరీస్ కోసం బాగా ఇంట్రస్టింగ్ గా కూడా ఉందట. అమలా పాల్ కూడా ఓ హిందీ వెబ్ సిరీస్ లో తన గ్లామర్ ను సర్వస్వం ఒడ్డి నటిస్తోంది. అలాగే అనుష్క కూడా తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి డబ్బులు కోసం హీరోయిన్లందరూ వెబ్ లోకి వచ్చేస్తున్నారు.

 

సోము వీర్రాజు సారధ్యంలో బిజెపి దిశ మారనుందా?

Somu Veerraju

Somu Veerraju
ఎట్టకేలకు ఆంధ్ర బిజెపి కి కొత్త సారధి నియామకం జరిగింది. ఒక వారంలోపల కొత్త అధ్యక్షుడు వస్తాడని మేము ఈ కాలమ్స్ లో ముందుగానే చెప్పాము. మేము చెప్పినట్లుగానే కొత్త అధ్యక్షుడి నియామకం ఈవారంలో జరిగింది. వాస్తవానికి ఈపని ఎప్పుడో జరగాల్సింది. ‘బెటర్ లేట్ దేన్ నెవ్వర్’అని సరిపెట్టుకుందాం. ఇదేపని కంభంపాటి హరిబాబు స్థానం లో అప్పుడే చేసివుంటే ఇప్పటికి బిజెపి ఒక స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో వుండి వుండేది. కన్నా లక్ష్మీనారాయణ నియామకం పెద్ద అపశ్రుతి. ఆంధ్ర ప్రజలు దాన్ని హర్షించలేదు. సామాజిక కోణంలో అతిపెద్ద కాపు వర్గానికి సంబంధించిన వ్యక్తిని నియమించటం సరైన వ్యూహమయినా సోము వీర్రాజు ని పక్కన పెట్టటానికే కన్నా పేరును కావాలని కొంతమంది పైకి తీసుకొచ్చారని అప్పుడే ఆనోటా ఈ నోటా వినబడింది. ఇన్నాళ్ళకు లేటయినా బిజెపి నాయకత్వం తన తప్పు ని సరిదిద్దుకుని తిరిగి బిజెపి ని పట్టాల మీద పెట్టిందని పరిశీలకుల భావన.

Also Read: కన్నాపై వేటుకు కారణాలు ఏంటీ?

సోము వీర్రాజు మొదట్నుంచీ బిజెపి సిద్దాంతాల కోసం కట్టుబడి పనిచేసిన వ్యక్తి. బిజెపి యువ మోర్చా అధ్యక్షుడి గా, ప్రధాన కార్యదర్శిగా పనిచేయటం, ఆర్ఎస్ ఎస్ శాఖల్లో పనిచేయటం, వ్యవసాయ కుటుంబం నుంచి రావటం, కాపు సామాజిక వర్గం అధికంగా వున్న తూర్పు గోదావరి జిల్లా కు చెందటం, గత ప్రభుత్వం లో చంద్రబాబు ప్రభుత్వం లో భాగస్వామిగా వున్నా బిజెపి వాణి ని మండలి లో గట్టిగా వినిపించటం లాంటి అంశాలు తన వైపు అధిష్టానం మొగ్గు చూపటానికి కలిసొచ్చిన అంశాలని అర్ధమవుతుంది. ఒక సందర్భంలో సోము వీర్రాజు పేరు ఈసారి కూడా వెనక్కుపోయిందని  కొంత ప్రచారం జరిగింది. దానికి కూడా కొత్త కారణాలతో లాబీ జరిగిందని వినికిడి. పవన్ కళ్యాణ్ తో బిజెపి పొత్తు పెట్టుకోవటం తో కాపు సామాజిక వర్గానికి ఇచ్చేదానికన్నా వెనకబడిన కులాలకి చెందిన వ్యక్తి కి ఇస్తే బాగుంటుందని కాపు సామాజిక వర్గం ఎటూ కలిసివస్తుందని ప్రచారం జరిగింది. చివరకు బిసి వ్యక్తి పేరు ని కూడా మీడియా లో ప్రచారం చేసారు. ఇదంతా ఓ పద్దతి ప్రకారం సోము వీర్రాజు రాకుండా చేయటానికే జరిగిందని తెలుస్తుంది. అయినా బిజెపి కేంద్ర నాయకత్వం ఈసారి ఆ ట్రాప్ లో పడకుండా సోము వీర్రాజు వైపే మొగ్గు చూపటం ఆంధ్ర బిజెపి కి శుభ ఘడియలు వచ్చాయనిపిస్తుంది.

బిజెపి నూతన అధ్యక్షుడిగా జెపి నడ్డా ఎన్నికైన తర్వాత అన్ని రాష్ట్రాలకు నూతన అధ్యక్షుల్ని నియమించటం జరుగుతుంది. అందులో భాగంగా తెలంగాణా కి డాక్టర్ లక్ష్మణ్ స్థానం లో బండి సంజయ్ కుమార్ ని నియమించారు. బండి సంజయ్ కూడా సోము వీర్రాజు లాగా ఎప్పట్నుంచో నిబద్దతతో ఆర్ఎస్ ఎస్ , బిజెపి లో పని చేస్తూ వచ్చాడు. ఇటీవలికాలంలో ఎంతోమంది అతిరధ మహారధులు ఇతర పార్టీల నుంచి వచ్చినా మొదట్నుంచీ పార్టీనే నమ్ముకున్న బండి సంజయ్ కే అధ్యక్ష పీఠం దక్కింది. తనుకూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాడే. అంటే అటు తెలంగాణా లో , ఇటు ఆంధ్ర లో బిజెపి కాపు సామాజిక వర్గానికి పెద్ద పీట వేసిందని చెప్పొచ్చు. అలాగే బిజెపి కేంద్ర నాయకత్వం ఇంకో సంకేతం కూడా ఇచ్చింది. కొత్త వాళ్ళు ఎంతమంది చేరినా ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకొని వున్నవాళ్ళను వదిలిపెట్టేది లేదని స్పష్టంగా ఇటీవల నియామకాల్లో స్పష్టం చేసింది. ఆంధ్ర, తెలంగాణా లో కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా అదే సంకేతాలు ఇస్తుంది. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ తర్వాత రెండో స్థానం లో వున్న ముకుల్ రాయ్ పార్టీలో చేరినా అక్కడా పాత వాళ్ళను వదిలిపెట్టలేదు. అందుకే ముకుల్ రాయ్ అసంతృప్తిగా వున్నట్లు తెలుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో అనూహ్యంగా దళితుడ్ని అధ్యక్షుడిగా చేసింది. గుజరాత్ లో గుజరాతీని కాకుండా ఓ మరాఠీ ని అధ్యక్షుడని నియమించింది. అలా సంచలనాత్మక నిర్ణయాలతో నిర్మాణాన్ని పటిష్టం చేస్తుంది. ఇక మిగిలిందల్లా అత్యున్నత పార్లమెంటరీ బోర్డు నియమకమే. అది కూడా అతి త్వరలోనే జరగబోతుందని తెలుస్తుంది.

Also Read: సోనూ సూద్ సాయం నుంచి గుణపాఠాలివీ

ఆంధ్ర ప్రదేశ్ కొచ్చేసరికి 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశంలోని ముఖ్యనేతలు, చంద్రబాబు నాయుడు కుడి, ఎడమ భుజాల్లాంటి వాళ్ళు బిజెపి లో చేరటం తెలిసిందే. అయినా వాళ్ళు ఇక్కడకూడా చంద్రబాబు నాయుడు బి టీం లాగానే పనిచేస్తున్నరనేది బహిరంగ రహస్యమే. అధికారం కోల్పోయిన తర్వాత వై ఎస్ ఆర్ పి ని తట్టుకొని నిలబడాలంటే బిజెపి అండకావాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడే వీళ్ళను పంపించాడని అందరూ అనుకుంటున్నారు. అదేసమయంలో ఆంధ్ర బిజెపి లోనూ వీళ్ళు చక్రం తిప్పుదామని పధకం వేసారు. వీళ్ళే సోము వీర్రాజు కాకుండా వుండాలని శతవిధాల ప్రయత్నం చేసారని తెలుస్తుంది. పోయినసారి కాపు కార్డుని కాపు కార్డు తోనే దెబ్బతీయాలని కన్నా ని తీసుకోచ్చినట్లే ఈసారి పవన్ కళ్యాణ్ జత కూడటాన్ని అడ్డంపెట్టుకొని బిసి కార్డుని ముందుకు తీసుకొచ్చి తనకనుకూల వ్యక్తి ని అధ్యక్షుడ్ని చేయాలని ప్రయత్నం చేసారని తెలుస్తుంది. బిజెపి అగ్రనాయకత్వాన్ని బుట్టలో వేసుకోవటం కాంగ్రెస్ ని వేసుకున్నంత తేలిక కాదని ఇప్పటికే అర్ధమై వుంటుంది. మరి వీరి తదుపరి కార్యక్రమమేమిటో కొద్ది రోజులు పోతేగానీ తెలియదు.

సోము వీర్రాజు 1978 లోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. తన దగ్గర కోట్ల రూపాయలు లేకపోయినా కోట్ల రూపాయలతో సమానమైన క్యాడర్ విశ్వాసం పుష్కలంగా వుంది. ఇప్పుడు తనముందు పెద్ద భాద్యతే వుంది. రాష్ట్ర కమిటీ ని పునర్వ్యవస్తరీకరించటం లో తగు జాగ్రత్తలు తీసుకొని నిబద్ధులైన కార్యకర్తలను ప్రోత్సహించాల్సిన అవసరం వుంది. ఎటూ ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు కాబట్టి నిర్మాణం పై పూర్తి దృష్టి సారించి బిజెపి ని వీలైనన్ని ప్రాంతాలకు విస్తరించటం పై కేంద్రీకరిస్తే బెటర్. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన తో కలిసి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుంటే మంచి భవిష్యత్తు వుంటుంది. పోయిన ఎన్నికల్లో చతికిల పడిన తెలుగుదేశం తిరిగి లేచే అవకాశాలు దాదాపు లేనట్లే. ఇది మూడో ప్రత్యామ్నాయానికి మంచి అవకాశం. సరైన కార్యాచరణ తో ముందుకెళ్తే బిజెపి-జనసేన ఆంధ్రలో జగన్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం వుంది. ఆ అవకాశాన్ని సోము వీర్రాజు జారవిడుచుకోడని ఆశిద్దాం.

సోనూ సూద్ సాయం నుంచి గుణపాఠాలివీ


సోనూ సూద్.. ఈ బాలీవుడ్ నటుడి గురించి తెలుగులోనూ పరిచయం అక్కర్లేదు. ‘ వదలా బొమ్మాళీ’ అంటూ అరుంధతి సినిమాలో భీకర విలనిజాన్ని పండించారు. అయితే సినిమాల్లో విలన్ అయిన ఈ నటుడు .. నిజజీవితంలో మాత్రం అసలు సిసలు హీరో అనిపించుకుంటున్నాడు.

Also Read: రాజమౌళి- మహేష్ సినిమా పై స్పష్టత !

బాలీవుడ్, టాలీవుడ్ తారలు కూడా చేయలేని ఎన్నో పనులను సోనూ సూద్ చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. కరోనా సంక్షోభ సమయంలో నటుడు సోను సూద్ నిస్వార్థంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు. వేలాది మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరుకోవడానికి సహాయం చేశాడు. లాక్డౌన్ కాలంలో ముంబై నగరంలో చాలా మంది పేదలకు ఆహారం అందించాడు. ఆరోగ్య సిబ్బంది కోసం హోటల్, భోజనం సమకూర్చాడు.విదేశాల్లోని వారిని ప్రత్యేక విమానాలు వేయించి రప్పించాడు. లాక్డౌన్ పరిమితులు సడలించిన తర్వాత కూడా అతను మంచి పనిని కొనసాగిస్తున్నాడు.

చిత్తూరు జిల్లాలో ఓ రైతు నాగేశ్వరరావు దుస్థితిని ఎవరో వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు. కూతుళ్లను కాడెద్దులుగా మార్చి నాగలి దున్నుతున్న నాగేశ్వరరావు వీడియోను ట్విట్టర్ లో పెట్టారు. అది వైరల్ అయ్యింది. సోనూసూద్ చలించి గంటల్లోనే నాగేశ్వరరావు కుటుంబానికి ట్రాక్టర్ ను అందించాడు. ఎక్కడో ముంబైలో ఉన్నా కూడా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉన్న ఓ రైతుకు ట్రాక్టర్ ను అందించాడు. ఈ ట్రాక్టర్ పొందడానికి ఈ రైతు కుటుంబం అర్హులే’ అంటూ పేర్కొన్నాడు. రూ.6 లక్షల విలువైన ట్రాక్టర్ ను అందజేశారు..

*ఏపీలో చాలా సబ్సిడీ కార్యక్రమాలు..
ఇక్కడే మన ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం చాలా సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టింది. చేతికి ఎముకే లేకుండా జగన్ ప్రభుత్వం వేలకు వేలు అకౌంట్లలో వేస్తోంది. అలాంటి జగన్ రైతు రాజ్యంలో ఓ రైతు ఇలా కాడెద్దులు కూడా లేకుండా ట్రాక్టర్ తో కూడా దున్నించుకోలేని దుస్థితిలో ఉన్నాడని తేలడం నిజంగా ఏపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో చాలా మంది రైతుల పరిస్థితి ఇలానే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లక పథకాలు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. అంతేకానీ నిజమైన రైతులకు అందడం లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ.

*అర్హులకు పథకాలు అందుతున్నాయా?
ఇక మరో విషయం ఏంటంటే ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. లబ్ధిదారులకు అందిస్తోంది. మరి ఏపీలో ఇంత మంది కనీస సదుపాయాలు లేని రైతులు ఉంటే ఆ సాయం అంతా ఎటు పోతోంది. ప్రభుత్వం అసలైన నిరుపేద లబ్ధిదారులకే పథకాలు అందిస్తుందా లేదా అన్నది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఎంతో సాయం చేస్తున్నా.. ఇప్పటికీ సంక్షేమ పథకాల కోసం కలెక్టరేట్లకు లబ్ధిదారులు వస్తున్న పరిస్థితి నెలకొంది.

*ఇక ప్రజలూ మారాలి.
ఇక ప్రభుత్వాలు ఉచితాలు ఇస్తున్నాయి కదా అని తీసుకుంటూ పోతే ప్రజలు కూడా సోమరులుగా మారుతారు. అందుకే ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఉచిత పథకాల కంటే స్వావలంభన సాధించే దిశగా సాగితే వాళ్లు బాగుపడుతారు. ఇక ప్రభుత్వాలు కూడా ప్రజలకు స్వయం ఉపాధి చూపించే పథకాలనే అమలు చేస్తే వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడేలా మారుతారు.

*సోషల్ మీడియాను మిస్ యూజ్ చేయవద్దు
ఇక సోషల్ మీడియా వచ్చాక ఏది వాస్తవం ఏదీ కాదనేది తెలియకుండా ఉంది. చిత్తూరు జిల్లాలో తన కూతుళ్లను కాడెద్దులుగా మార్చి దున్నిన రైతుకు నటుడు సోనూ సూద్ ఓ ట్రాక్టర్ ను కొనిచ్చాడు. అందరూ అతడిని ప్రశంసించారు. కానీ ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో ప్రభుత్వం ఆదేశానుసారం.. ఎంపీడీఓ ఆ ఊరుకి వెళ్ళి విచారించగా అది వాళ్ళు సరదాగా చేసిన వ్యవహారమని వెలుగు చూసింది. ఈలోపు సోనూ సూద్ సాయంత్రానికి ట్రాక్టర్ పంపించాడు. ఈ మొత్తం వ్యవహారం జాతీయ మీడియాలో వచ్చింది. మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే.. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కానక్కర్లేదు. మనం నిర్ధారించుకోవాల్సిందేనని చాటి చెబుతోంది.

Also Read: బాలయ్య పైత్యం.. కొత్త హీరోయిన్ ఇక పాతదే !

*ఇక రాజకీయ నాయకులు ప్రతి పరిస్థితిని క్యాష్ చేసుకోవద్దు..
సోనూసూద్ దయాగుణం చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ అందివచ్చిన అవకాశాన్ని ఏపీ ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు కూడా తనకు అనుకూలంగా మలుచుకోవడం విశేషం. ట్రాక్టర్ అందించిన సోనూ సూద్ కు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు.. ఈ ఇద్దరు ఆడబిడ్డలను తాను చదివిస్తానని అభయమిచ్చాడు. సోను సూద్‌ను ఫోన్ చేసి మరీ ప్రశంసించారు. ఇద్దరూ ఇదే విషయాన్ని ట్వీట్ లో వెల్లడించారు. సోనూ సూద్ సాయాన్ని చంద్రబాబు బాగా క్యాష్ చేసుకున్నట్టు అర్థమవుతోంది. ఏపి ప్రభుత్వం పేదలకు, అర్హులకు మంచి చేయదని దేశానికి చూపించాలన్నది బాబు ఆలోచనగా ఈ వ్యవహారంలో కనిపిస్తున్నది. ఆ ఇద్దరు అమ్మాయిలకు విద్యను అందిస్తానని ప్రకటించడం కూడా జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు వేసిన బాంబ్ గా అభివర్ణిస్తున్నారు. సాయం మాటున చంద్రబాబు చేసిన రాజకీయం.. అలాగే దేశవ్యాప్తంగా వారి పట్ల సానుభూతి కూడా అవగాహన లోపంతో లభించేదేనని అర్థమవుతోంది. ఈ క్రమంలో రైతుకు సహాయం చేయడం లేదని ఏపీ ప్రభుత్వంపై మాత్రం మచ్చ పడింది.

కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని సెలెబ్రెటీలు ముందు వెనుకా ఆలోచించకుండా ఉదారంగా సాయం చేయవద్దు.. సాయం చేయడం మంచిదే అయినా నిర్ధారించుకోవడం మంచిది. లేదంటే ఇలా వృథాగా మారిపోతుంది. చాలా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అర్హులకు అందిస్తే ఇలాంటి అసమానతలు తొలుగుతాయి. అర్హత లేని వ్యక్తులకు కూడా ప్రయోజనం కలిగించకుండా అర్హులకు లభిస్తే వారి జీవితాలను బాగు చేసిన వారు అవుతారు. రాజకీయ నేతల దోపిడీకి గురికాకుండా ఉంటారు..

-నరేశ్ ఎన్నం

చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?

Chandrababu Naidu


ఉమ్మడి ఆంధ్రపదేశ్ విభజన అనంతరం ఆంధ్రపదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలో అధికారం చేపట్టిన టిడిపి ప్రభుత్వం తుళ్ళూరు కేంద్రంగా 29 గ్రామాలను ఎంపిక చేసి రాజధానిగా ప్రకటించింది. ఇక్కడి రైతులు కొందరు స్వచ్ఛందంగా తమ భూములు ఇవ్వగా మారి కొందరు బెదిరింపులకు జడిసి భూములు ఇవ్వగా… మొత్తం 32 వేల ఎకరాలను భూసమీకరణ పథకంలో ప్రభుత్వం సమీకరించింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు అవలంభించిన తీరే ఇప్పడు అమరావతికి శాంపంగా మారిందని రాజకీయ విశ్లేషకులు వాధన. చంద్రబాబు రాజధాని విషయంలో అనుసరించిన వ్యూహాలు, చేపట్టిన పనులు, కల్పించిన ప్రచారం… ఇలా అన్ని విషయాలు అమరావతి మనుగడను ప్రశ్నార్ధకం చేశాయి. ఫలితంగా ఇప్పడు అక్కడి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.

Also Read: వాళ్లకు జగన్ వద్దు, బాబే ముద్దు ..!

రాజధాని పేరుతో రాజకీయంగా లబ్ధిపొందాలని చంద్రబాబు వ్యూహం పన్నారు. అమరావతి నిర్మాణానికి 2016లో ప్రారంభమయై 2050 నాటికి పూర్తయ్యేటట్లు అతి భారీ ప్రణాళిక వేశారు, రూ.5 లక్షల కోట్లు వ్యయంతో నవ నగరాలను నిర్మించాలని భావించారు. అప్పట్లోనే ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. 2050 వరకూ చంద్రబాబే సిఎంగా కొనసాగుతాడా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించారు. రాజధానిని అడ్డుపెట్టుకుని 2050 వరకూ పాలన హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు వ్యూహం, అయినప్పటికీ ప్రజలు దీనికి మద్దతు ఇవ్వలేదు. కనీసం రాజధాని వాసులు కూడా ఇందుకు అంగీకరించలేదు. 2019 ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాల్లో టిడిపి పరాజయం పాలయ్యింది.

ఇంత భారీ స్థాయిలో ప్రణాళికలు చేపట్టిన చంద్రబాబు గడచిన ఐదేళ్ల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణానికి కేటాయించింది కేవలం రూ.9,600 కోట్లు మాత్రమే, ఇందులో రూ.1,500 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో మౌలిక సదుపాయాల కల్పనకే అధిక మొత్తం ఖర్చు చేయడం వల్ల రాజధానిలో భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ కోసం రూ.1,500 కోట్ల వరకూ ఖర్చు చేశారు. భారీ ప్రణాళికతో ముందుకెళ్లడంతో ఇప్పటికీ రాజధానికి ఒక రూపు రేఖ లేకుండా పోయింది. కేవలం పాలనా పరమైన రాజధాని నిర్మణం గత ఐదేళ్లలో అమరావతిలో పూర్తి చేసి దశల వారీగా రాజధానిని విస్తరించే ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసి ఉంటే అమరావతి నుంచి రాజధానిని మార్చడానికి అవకాశం ఉండేది కాదనే వాధనలు వినిపిస్తున్నాయి.

స్వతహాగా పబ్లిసిటీ అతిగా కోరుకునే చంద్రబాబు రాజధాని విషయంలోను అతిగా పబ్లిసిటీ చేశారు. జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించారు. ఇతర దేశాలతోనే రాజధానికి సంబంధించిన అన్ని వ్యవహారాలలో ఒప్పందాలు కుదర్చుకోవడం, మాస్టర్ ప్లాన్ రూపలక్పన, రాజధాని అభివృద్ధి, ఇతర అంశాలకు సంబంధించి సింగపూర్, జపాన్ సంస్థలకు ఆయన పనులు అప్పగించారు. ప్రతి ఏటా దేశ విదేశాల ప్రతినిధులను ఆహ్వానించి సీఆర్డీఏ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు. చివరికి అమరావతి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అమరావతి… అనే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇది ప్రభుత్వ వ్యవహారంగా సాగకుండా సొంత ఇమేజ్ కోసం ప్రయత్నం చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమయ్యిందనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతుంది. టిడిపి వ్యతిరేక ప్రభుత్వాలు ఇటువంటి అంశాన్ని ఎలా కొనసాగిస్తాయని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హైదరాబాదును తానే నిర్మించానని ప్రతి వేదికపైనా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. నిజాం నవాబు నుంచి రాజశేఖర్ రెడ్డి వరకూ పాలకులెవరూ హైదరాబాదును అభివృద్ది చేయాలేదా?

రాజధాని అమరావతి విషయంలో సామాజిక వర్గం ముద్ర పడుతుంటే ముందు నుంచి చంద్రబాబు ఆ ముద్రను తొలగించ లేకపోయారు. భూ సమీకరణ విషయంలో ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్ద రైతులు ముందుండి వ్యవహారాన్ని నడిపించారు. పలు మార్లు హైదరాబాదులో ఉన్న చంద్రబాబు వద్దకు ప్రత్యేక బస్సుల్లో రైతులను తీసుకువెళ్లి సమావేశ పర్చడంలో ఆ వర్గం వారే ఉన్నారు. భూ సమీకరణకు భూములు ఇచ్చిన వారిలో అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నా… రాజధాని ప్రకటించక ముందు, అనంతరం అక్కడ భూములను ఆ సామాజికవర్గానికి చెందిన వారే అధికంగా కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్నే ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా వాడుకుంటుంది.

Also Read: కేసీఆర్ కూతురును వెంటాడుతున్న దురదృష్టం?

ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఏ రోజు ఇతర పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లలేదు. అఖిల పక్షం సమావేశం నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు నెత్తి నోరు మొత్తుకున్నా వినలేదు. రాజధాని విషయంలో ఇతర పార్టీలను జోక్యం చేసుకోనివ్వలేదు. మాస్టర్ ప్లాన్, నిర్మాణం, ఇతర విషయాలలో ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలతో సంప్రదించలేదు. అందరి భాగస్వామ్యం తీసుకుని అమరావతి అందరిదీ అనే భావన కలిగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదనే విషయాన్ని విపక్ష పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అధికారం పోయిన అనంతరం అమరావతి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు వచ్చి పోరాటం చేయాలని ఇప్పడు చంద్రబాబు కోరుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే రాజధానిని మార్చడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అనే అంశాలను గుర్తించి అటువంటి అవకాశాలు లేకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం, అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవడం వంటి విషయాలలో చంద్రబాబు ముందు చూపు లేకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో రాజధాని గ్రామాల్లో పర్యటించిన సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టిడిపి ప్రభుత్వం భలవంతంగా తీసుకున్న భూములను వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజకీయ కారణాలతో అమరావతిని రాజధానిగా అంగీకరించడానికి వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో పాలనా వికేంద్రీకరణ పేరుతో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధాని గా నిర్ణయించింది. చంద్రబాబు చేసిన చట్టాలు వైసీపీ ప్రభుత్వం రాజధాని తరలించకుండా అడ్డుకోలేకపోయాయి. దీంతో జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా ముందుకు వెళుతుంది.

తుమ్మలకు మరోసారి అదృష్టం వరించనుందా?


టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ రేసు మొదలైంది. గవర్నర్ కోటాలో రెండింటితోపాటు మరొక స్థానం ఖాళీ అయింది. దీంతో ఆశావహులు ఎమ్మెల్సీ సీటును దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. సీఎం కేసీఆర్ దృష్టిలో పడేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. నేతల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో సీఎం కేసీఆర్ ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీనే నమ్ముకొని ఉన్నవారితోపాటు గత ఎన్నికల్లో అనుహ్యంగా ఓటమిపాలైన వారి వివరాలను ఇప్పటికే  సీఎం కేసీఆర్ సేకరించి పదవులను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.

Also Read: మాస్కు పెట్టుకోలేదని మేకను అరెస్టు చేసిన పోలీసులు..!

ఎమ్మెల్సీ రేసులో ఇప్పటికే చాలామంది టీఆర్ఎస్ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే గతకొద్దిరోజులుగా తుమ్మల నాగేశ్వరరావు పేరు ఈ లిస్టులో వెనుకంజలో ఉంది. అయితే అనుహ్యంగా మరోసారి తుమ్మల నాగేశ్వర్ రావు ఎమ్మెల్సీ రేసులోకి ముందుకు దూసుకురావడం గమనార్హం. తాజాగా ఆయనకు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో ఆయన హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో తుమ్మల అనుచరులు ఆయన ఎమ్మెల్సీని ఖరారు చేసేందుకే సీఎం కేసీఆర్ పిలిచారని చెబుతున్నారు.

సీఎం కేసీఆర్ గత క్యాబినెట్లో తుమ్మల నాగేశ్వరరావు రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పని చేశారు. 2018 ముందస్తు ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు అనుహ్యంగా ఓటమి పాలైయ్యారు. దీంతో నాటి నుంచి తుమ్మల ఆయన నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లోనూ, సీఎం పక్కన కూడా ఎక్కడా కన్పించలేదు. మరోవైపు అదే జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కు మంత్రి పదవీ దక్కడంతో తుమ్మలకు రాజకీయం చెక్ పడినట్లేనని అంతా భావించారు.

Also Read: తొందరపడిన బాబు బకరా అయ్యారే..!

అయితే సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవుల పంపకం చేపట్టే సమయంలో తుమ్మలకు పిలుపురావడంతో ఆయన పదవీ దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే ఖమ్మం జిల్లాకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి సైతం ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. నిన్నటి వరకు తుమ్మలను కేసీఆర్ పక్కకు పెట్టారని ప్రచారం జరుగగా అనుహ్యంగా ఆయనకు పిలుపురావడం చర్చనీయాంశంగా మారింది. తుమ్మలకు ఎమెల్సీ పదవీ కట్టబెడితే పొంగిలేటి పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తుంది. గతంలోనే పొంగిలేటి రాజ్యసభ సీటు విషయంలో నిరాశ ఎదురైంది. తాజాగా ఎమ్మెల్సీ కూడా చేజారే అవకాశం కన్పిస్తుంది.

అయితే తుమ్మలకు గతంలోనే మాదిరిగానే అదృష్టం కలిసివస్తే ఎమ్మెల్సీతోపాటు మంత్రి పదవీ దక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో తుమ్మల విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.