Home Blog Page 8393

భల్లాలదేవతో బాలీవుడ్‌ క్వీన్‌ జోడీ


కంగనా రనౌత్‌. బాలీవుడ్‌ క్వీన్‌. ఎవ్వరి అండ లేకుండా హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందామె. నటనే కాదు నిజ జీవితంలోనూ దూకుడుగా ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నిస్తుంది.. ఎంత పెద్దవారినైనా సరే నిలదిస్తుంది. అందుకే ఆమె పేరు ఎప్పుడూ వార్తల్లో నానుతుంది.ఈ బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌.. ఈ మధ్య పలువురు దర్శక, నిర్మాతలను ఓ రేంజ్‌లో ఆడుకుంటోంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత బంధుప్రీతిపై, కొందరు సెలెబ్రిటీలపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. వివాదాలకే కాదు సినిమాల విషయంలో కూడా ఆమె చాలా స్పీడ్‌. ఓవైపు సుశాంత్‌ సూసైడ్‌ పై తరచూ మీడియాలో మాట్లాడుతూ బిజీగా ఉన్న కంగనా అంతలోనే ఓ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేసింది. అందులో ప్రత్యేకత ఏముందంటరా? ఉంది.

Also Read: కరోనాను జయించిన ఐశ్యర్యా రాయ్‌..

కంగనా ఫస్ట్‌టైమ్‌ మన భల్లాలదేవ దగ్గుబాటి రానాతో కలిసి నటించనుంది. రానాతో కలిసి ఓ మూవీ చేయబోతున్నట్టు ఆమెనే వెల్లడించింది. సోషల్‌ మీడియా ద్వారా ఈ ముచ్చటను అభిమానులతో పరోక్షంగా పంచుకుంది. ఎగ్జయిటింగ్‌ అప్‌కమింగ్‌ ప్రాజెక్ట్‌ గురించి రానా దగ్గుబాటితో వర్చువల్‌ మీటింగ్‌కు రెడీ అయ్యాను అంటూ రెడ్‌ డ్రెస్‌లో తీసుకున్న ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది ఈ అమ్మడు. దాంతో, రానా, కంగనా పెయిర్ కన్ఫర్మ్‌ అయింది. అయితే, ఇది హిందీ సినిమానా? తెలుగు సినిమానా? లేదంటే వెబ్‌ సిరీసా? అన్నది తేలాల్సి ఉంది. అలాగే, ఆ ప్రాజెక్ట్‌ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్‌ ఎవరన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.

Also Read: సిక్స్‌ ప్యాక్‌తో సక్సెస్‌కు ‘గురి’ పెట్టిన నాగశౌర్య

తెలుగులో కంగనా ఇది వరకే ఓ మూవీ చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్‌ సరసన ‘ఏక్‌ నిరంజన్‌’మూవీలో నటించింది. అప్పటికి హిందీలో ఆమెకు పెద్దగా స్టార్డమ్‌ రాలేదు. అయితే, ఆ మూవీ అంతగా హిట్‌ కాకపోవడంతో టాలీవుడ్‌లో మరో సినిమా చేయలేదు. కానీ, కొంతకాలానికి హిందీలో ఆమె టాప్‌ హీరోయిన్‌గా మారింది. ‘క్వీన్‌’ మూవీ ఆమె కెరీర్ను మలుపుతిప్పింది. ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఆమె రీసెంట్‌గా సౌత్‌పై కన్నేసింది. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న తమిళ చిత్రం ‘తలైవి’లో నటిస్తోందామె.

కరోనాను జయించిన ఐశ్యర్యా రాయ్‌..


బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆయన కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముందు అమితాబ్‌ ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు వైరస్‌ నిర్ధారణ అయింది. ఆ వెంటనే కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు నిర్వహించగా.. ఐశ్వర్యా రాయ్‌, ఆమె కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్‌ అని తేలగా… మిగతా వాళ్లకు నెగెటివ్‌ రిజల్ట్స్‌ వచ్చాయి. అమితాబ్‌, అభిషేక్‌ వెంటనే ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరగా.. తొలుత ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న ఐశ్వర్య, ఆరాధ్య కూడా రెండు రోజుల తర్వాత ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. వీరి ఆరోగ్యం గురించి రోజుకో వార్త వస్తోంది. అయితే, అభిషేక్‌ బచ్చన్‌ ఈ రోజు గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తన భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ‍్య కరోనాను జయించారని తెలిపాడు. కరోనా నుంచి కోలుకున్నారన్నాడు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్‌ అని రావడంతో ఇద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటికి చేరుకున్నారని ట్వీట్‌ చేశాడు. అయితే. తన తండ్రి అమితాబ్, తాను ఇంకా ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నామని చెప్పాడు. తమ క్షేమం కోరుకుంటున్న వారందరికీ అభిషేక్‌ థ్యాంక్స్‌ చెప్పాడు.

Also Read: విద్యా బాలన్ మళ్ళీ అందాల అరబోతకు సై !

ఐశ్వర్యతో పాటు చిన్నారి ఆరాధ్య కరోనా జయించడం పట్ల బచ్చన్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బిగ్‌బీ అమితాబ్‌ ఆరోగ్యంపై మాత్రం వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కరోనా మరణాల్లో వృద్ధులే అధికంగా ఉన్నారు. దాంతో, 77 ఏళ్ల అమితాబ్‌ గురించి బెంగ పెట్టుకున్నారు. బిగ్‌బీకి కొన్ని ఇతర అనారోగ్య సమస్యలు ఉండడం కూడా వారి ఆందోళనను పెంచుతోంది. అయితే, తాను బాగానే ఉన్నానని, కోలుకుంటున్నానని అమితాబ్‌ చెబుతున్నాడు. హాస్పిటల్‌లో ఉన్నప్పటికీ ట్విట్టర్ ద్వారా తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులు ఒంటరి తనం అనుభవిస్తున్నారని, తనకు కూడా తొలుత అదే ఫీలింగ్‌ కలిగిందని చెప్పాడు. దాంతో, తాను పాటలు పాడుకుంటూ ఒంటరితనాన్ని దూరం చేస్తుకుంటున్నానని పేర్కొన్నాడు. అమితాబ్‌, అభిషేక్‌ త్వరగా కోలుకొని ఇంటికి చేరుకోవాలని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు.

https://twitter.com/juniorbachchan/status/1287697590000132103

సిక్స్‌ ప్యాక్‌తో సక్సెస్‌కు ‘గురి’ పెట్టిన నాగశౌర్య


యువ కథానాయకుడు నాగశౌర్య మారిపోయాడు. బాడీని, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశాడు. ఇన్నాళ్లూ లవర్ బాయ్‌గా, పక్కింటి కుర్రాడిగా కనిపించిన అతను తనపేరులోని శౌర్యాన్ని తెరపై చూపించేందుకు సిద్దమవుతున్నాడు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ రోజు (సోమవారం) సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్ చేశాడు. చొక్క లేకుండా సిక్స్‌ బ్యాక్‌ బాడీ.. లాంగ్‌ హెయిర్ స్టయిల్‌తో శౌర్య లుక్‌ అదిరిపోయింది. ఎడమ చేతిపై బాణం పచ్చబొట్టు.. నడుంపై భాగంలో గాయం నుంచి రక్తం కారుతుండగా.. చేతికి బ్యాండేజీ వేసుకొని మరీ బాణాన్ని ఎక్కుపెడుతూ కనిపించాడు శౌర్య. ఈ మూవీలో అతను విలువిద్య క్రీడాకారుడిగా (ఆర్చర్)గా కనిపించబోతున్నాడు. ఆ స్పోర్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. ‘ది గేమ్‌ విల్‌ నెవర్‌ బీ ది సేమ్‌’ (ఆట ఎప్పుడూ ఒకేలా ఉండదు) అనే క్యాప్షన్‌తో లుక్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్టర్ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన శౌర్య.. ‘ఇప్పుడు అతని మనస్సు, ఆత్మ కలిసిపోయాయి. లక్ష్యం అనేది ఇక చిన్న విషయం’ మాత్రమే అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

Also Read: బిగ్‌బాస్‌4 నుంచి ఆఫర్ వచ్చింది: స్టార్ కొరియోగ్రాఫర్

నాగశౌర్యకు ఇది 20వ మూవీ కావడం విశేషం. అతని సరసన ‘రొమాంటిక్‌’ మూవీ ఫేమ్‌ కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు నారాయణ్‌ దాస్‌, రామ్‌మోహన్‌ రావు, శరత్‌ మరార్ సంయుక్త నిర్మిస్తున్న ఈ మూవీకి కీరవాణి కొడుకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా సిక్స్‌ ప్యాక్‌ తో సర్ప్రైజ్‌ ఇవ్వడం చూసి శౌర్య ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. లవర్‌ బాయ్‌లా, సాఫ్ట్‌గా కనిపించే కనిపించే నాగ శౌర్య పూర్తిగా మారిపోయాడంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఫ్యాన్సే కాదు.. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా నాగశౌర్య లుక్‌పై ప్రశంసలు కురిపిస్తూ అతనికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. ‘జ్యో అచ్యుతానంద’లో శౌర్యతో కలిసి నటించిన నారా రోహిత్..‌ ‘చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నావు. ఇంకా నువ్వు మెరుగవ్వాల్సింది ఏమీ లేదు. నీతో ఎవరు మ్యాచ్‌ అవలేరు. టీమ్‌ అందరికి ఆల్‌ ద బెస్ట్’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేసిన శేఖర్ కుమ్ముల ప్రత్యేక వీడియో సందేశం పంపించారు. నిర్మాత నారాయణదాస్‌ పుట్టిన రోజు నాడు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. కాగా, ఈ మూవీతో పాటు మరో రెండు ప్రాజెక్టులపై కూడా నాగశౌర్య దృష్టి పెట్టాడు. శ్రీనివాస్‌ అవసరాల, కొత్త డైరెక్టర్ లక్ష్మి సౌజన్య తో ఈ మూవీస్‌ చేయనున్నాడు.

 

జిల్లాల విభజన.. సందిగ్ధంలో వైసీపీ నేత?


తెలంగాణలోని పది జిల్లాలు కాస్తా 33 జిల్లాలు అయ్యాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే జిల్లాల ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. ఎటువంటి అడ్డంకులు లేకుండానే తెలంగాణలో జిల్లాల ప్రక్రియను సీఎం కేసీఆర్ పూర్తి చేశారు. నాటి నుంచే ఏపీలో కొత్త జిల్లాలపై చర్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటికీ కొత్త జిల్లాల తేనే తట్టును కదిపేందుకు సాహసించ లేకపోయాయి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్లు ప్రతీ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లాగా చేసేందుకు వైసీపీ సర్కార్ ముందుకెళుతోంది.

Also Read: వాళ్లకు జగన్ వద్దు, బాబే ముద్దు ..!

ఇటీవలే జగన్ సీఎంగా ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. తొలి ఏడాదంతా సంక్షేమ కార్యక్రమాలతో గడిచిపోయింది. ఇక రెండో ఏడాది ప్రారంభంలోనే సీఎం జగన్ కొత్తజిల్లాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో ఓవైపు కరోనా కట్టడికి చర్యలు చేపడుతూనే మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం యంత్రాంగం వేగంగా పని చేస్తోంది. ఇప్పటికే సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే అన్ని జిల్లాల రెవిన్యూ అధికారులతో చర్చించి అన్ని మండలాల వారీగా నివేదికలను ప్రభుత్వం తెప్పించుకుంది. అయితే జిల్లాల విభజనతో ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో లబ్దిచేకూరడంతోపాటు టీడీపీ పెద్దఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

అయితే వైసీపీకి చెందిన ఓ నేత మాత్రం జిల్లాల విభజనపై కలవరం చెందుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన కీల‌క నాయ‌కుడు, న‌ర‌స‌రావుపేట మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల‌రెడ్డికి కొత్త జిల్లాల ఏర్పాటు ఇబ్బందిగా మారనుందట. వేణుగోపాలరెడ్డి తొలి నుంచి గుంటూరులో రాజ‌కీయాలు చేయాల‌ని అనుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇందుకోసం గ‌తేడాది పార్టీ మారడంతోపాటు.. ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టికెట్ తీసుకున్నారట. అయితే ఇప్పడు జిల్లాల విభజన ఆయనకు ఇరకాటంలో పడేయనుందని టాక్ విన్పిస్తుంది.

Also Read: కేసీఆర్ కూతురును వెంటాడుతున్న దురదృష్టం?

కొత్త జిల్లాల ఏర్పాటుతో గుంటూరు జిల్లాను పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా విభ‌జిస్తే మూడుగా మారనుంది. దీంతో గుంటూరు, బాప‌ట్ల‌, న‌ర‌స‌రావుపేటలు జిల్లాలుగా ఏర్ప‌డ‌నున్నాయి. అయితే మోదుగుల ఓటుహ‌క్కు మాత్రం ప్రస్తుతం న‌ర‌స‌రావుపేట‌లో ఉంది. దీంతో ఆయ‌న ఆ జిల్లా ప‌రిధిలోకి వెళ్లిపోతారు. దీంతో ఆయన గుంటూరులో రాజ‌కీయంగా చ‌క్రం తిప్పాలంటే ఇబ్బందులు ఏర్పడనున్నాయట. అలాగే అక్కడ క‌మ్మవ‌ర్గానికి చెందిన నాయ‌కులు ఎక్కువ‌ ఉండటంతో గుంటూరులో ఉండలా? లేక త‌న‌ను గతంలో గెలిపించిన న‌ర‌స‌రావుపేటకు వెళ్లాలా? అనేది తేల్చుకోలేక పోతున్నారట. దీంతో మోదుగుల రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నేతల్లో నెలకొంది.

తొందరపడిన బాబు బకరా అయ్యారే..!


మనది ఎంత మంచి మనసైనా చేసే సాయం వెనుకా ముందు తెలుసుకొని చేయడం చాలా అవసరం. లేకపోతే సోనూ సూద్ లా సాయం చేసి కూడా నాలుక కరుచుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. దానికి తాజా ఉందంతమే నిదర్శనం. చిత్తూరు జిల్లా మదనపల్లి మండంలోని ఓగ్రామంలో రైతు తన ఇద్దరు కూతుళ్ళ సాయంతో పొలం దున్నిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోకి కొందరు పేదరైతుకు ఎద్దులు కొనుక్కునే స్థోమత లేక, ఇద్దరు కూతుళ్లతో నాగలి పట్టించి వ్యవసాయం చేస్తున్నారని ఓ ఎమోషనల్ స్టోరీ అల్లారు. ఆ వీడియో గంటల వ్యవధిలో నటుడు సోనూ సూద్ దృష్టికి వెళ్ళింది. దానితో ఆ పేద రైతుకు కావలసింది ఎద్దులు కాదని, ట్రాక్టర్ అని ఆయన వెంటనే ఓ కొత్త ట్రాక్టర్ సదరు రైతు ఇంటికి పంపారు.

Also Read: ఆ జిల్లాలో టీడీపీ కనుమరుగు కానుందా?

ఐతే ఈ సంఘటనలో ప్రచారం అయినట్లు ఎమోషనల్ పార్ట్ లేదని వాస్తవంలోకి వెళ్ళాక వెలుగు చూసింది. నిజానికి ప్రచారం జరుగుతున్నట్లుగా ఆ రైతు ఎద్దులు కొనుక్కోలేని స్థితిలో ఉన్న పేదవాడు కాదట. ఆ అమ్మాయిలు కుడా ఆ పనిని కేవలం సరదా కోసం చేశారట. కరోనా వైరస్ కారణంగా సొంత ఊరికి వచ్చిన ఆ ఇద్దరు అమ్మాయిలు సరదాగా ఆ వీడియో చిత్రీకరించారట. మండల ఎంపీడీవో స్వయంగా ఈ సంఘటనపై విచారణ చేయగా వాస్తవాలు బయటికి వచ్చాయి. తమకు సోనూ సూద్ పంపిన ట్రాక్టర్ ని కూడా ఆ కుటుంబం గ్రామ పంచాయితీకి అప్పగించనున్నట్లు తెలుస్తుంది.

Also Read: ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించను.. అవంతి

ఐతే ఈ సంఘటనలో మరో ట్విస్ట్ ఉంది. సోనూ సూద్ సాయం గురించి తెలుసుకున్న బాబు సంఘటను క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగిపోయారు. ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ ని పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి సోనూ సూద్ సైతం మీరే నాకు స్ఫూర్తి అని చెప్పడంతో లోకేష్ బాబు ఉబ్బితబ్బిబై ఆయన ట్వీట్ రీట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ సోనూ సూద్ సాయాన్ని పొగడడంతో పాటు, వైసీపీ పాలనలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని నిరూపించే ప్రయత్నం బాబు చేశారు. ఐతే జరిగిన సంఘటనలో వాస్తవం తెలుసుకొని తొందరపడ్డాం అని నాలుక కరుచుకోవడం బాబు వంతు అయ్యింది. మొత్తంగా ఆ అమ్మాయిలు సరదాగా చేసిన పనితో సోనూ సూద్ కంటే కూడా బాబునే బకరా అయ్యారనేది రాజకీయ వర్గాల్లో టాక్.

మాస్కు పెట్టుకోలేదని మేకను అరెస్టు చేసిన పోలీసులు..!


ప్రస్తుతం మనమంతా కరోనా కాలంలో జీవిస్తున్నామని చెప్పుకోక తప్పదు. కరోనా ఎంట్రీతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులన్నీ మారిపోయాయి. మానవ నాగరికతకు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం ఎలాగో.. ఇప్పుడు సేమ్ టూ సేమ్ కరోనాకు ముందు(Before Carona).. కరోనా తర్వాత(After Carona) అనే పరిస్థితులు వచ్చాయి.

Also Read: మళ్లీ లాక్ డౌన్ దిశగా మోడీ.. రేపు కీలక నిర్ణయం?

2020 సంవత్సరం ప్రారంభం నుంచి కరోనా మహమ్మరి మానవళిపై తన ప్రభావాన్ని చూపుతోంది. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. చైనాలో కరోనా కట్టడి అయినప్పటికీ చైనాయేతర దేశాల్లో మాత్రం కోవిడ్-19 విజృంభిస్తుందటం ఆందోళన కలిగింది. అగ్రరాజ్యాలు సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతున్నాయి. పాజిటివ్ కేసులు, కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వాలు సైతం ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా మరణాలు పెరిగిపోతుండటంతో ప్రతీఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. మాస్కులు ధరించడం.. శానిటైజర్లతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం.. భౌతికదూరం పాటిస్తున్నారు. మరోవైపు మాస్కులు ధరించని వారిపై ప్రభుత్వం, పోలీసులు కోరఢా ఝుళిపిస్తున్నారు. జరిమానాలు.. జైలు శిక్ష పేరుతో అలాంటి వారిలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మాస్కు ధరించలేదని ఒక మేకను పోలీసులు అరెస్టు చేయడం ఆసక్తికరంగానూ.. చర్చనీయంగానూ మారింది.

Also Read: గ్రౌండ్ లెవల్లో జీరో.. సోషల్ మీడియాలో హీరో..

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాన్పూర్ లోని స్థానిక బెంకోగంజ్ ఏరియాలో ఒక మేక రోడ్డుపై అరుస్తూ అటూఇటూ తిరుగుతోంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసుల కంటికి ఈ మేక కన్పించింది. కరోనా నిబంధనల ప్రకారం మేక మాస్కు ధరించకపోవడంతో పోలీసుల దాన్ని అరెస్టుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయం సదరు మేక యజమానికి తెలియడంతో పరుగుపరుగనా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. తన మేక ఇప్పించాలని వేడుకోగా మేకకు మాస్క్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇకపై మేకను మాస్కు లేకుండా బయటికి వదిలితే తిరిగిచ్చేది లేదని వార్నింగ్ ఇచ్చి మేకను వదిలేశారట.

ఈ వార్త బయటికి తెలియడంతో  ప్రజలు చర్చించుకుంటున్నారు. కొందరు మాత్రం జంతువులకు కూడా కరోనా వస్తుండటంతో పోలీసులు చేసిన పని కరెక్టేనని మద్దతు తెలుపున్నారు. కరోనాపై పోలీసులు చేస్తున్న పోరాటానికి ఈ ఒక్క సంఘటన నిదర్శనంగా నిలుస్తుందని అంటున్నారు. మరికొందరేమో మేకకు మాస్కు తొడిగి బయటికి వదిలితే అది మేత ఎలా తింటుందని ప్రశ్నిస్తున్నారు. మాస్కు పెట్టుకోకుండా బయట తిరిగే పోకిరిరాయుళ్లను వదిలేసి.. మూగజీవి మాస్కులేదని పట్టుకెళ్లడం ఏంటని జంతుప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎలావున్నా.. పోలీసులు మేకను అరెస్టు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.

కేసీఆర్ కూతురును వెంటాడుతున్న దురదృష్టం?


తెలంగాణను పాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఆమె. తెలంగాణ ఏర్పడకముందు నుంచి జాగృతి పేరుతో గజ్జెకట్టి.. బతుకమ్మను చేతబట్టి.. తెలంగాణ ప్రజలకు చేరువైంది. కానీ ఒక్క ఓటమి ఆమెను కృంగదీసింది.అప్పటి నుంచి కవితకు అదృష్టం కలిసిరావడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔననే అంటున్నారు.

Also Read: టీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియా..!

ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెకు ఇప్పుడు ఏదీ కలిసిరావడం లేదని టీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆమెకు అన్ని అవకాశాలను టీఆర్ఎస్ కల్పించినా అధికారం మాత్రం దక్కడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కవితను నిజామాబాద్ ఎమ్మెల్యేలంతా కలిసి బలపరిచి మరీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నారు. ఆ ఓట్ల ప్రక్రియ పూర్తయ్యింది. కవితకు ఏకంగా 500 ఓట్లు రాగా.. ప్రత్యర్థి నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి కేవలం 100 ఓట్లు మాత్రమే వచ్చాయి.

అయితే మెజార్టీ కవితకు ఎంతో ఊరటనిచ్చినప్పటికీ ఆమె మాత్రం శాసనమండలిలో అధ్యక్ష అనలేని పరిస్థితి దాపురించింది. కవతి అధికారికంగా శాసనమండలిలో సభ్యత్వం ఇప్పటిదాకా పొందలేకపోతున్నారు. అధికారం దక్కక నిరీక్షిస్తున్నారు. కవిత ఎమ్మెల్సీగా నెగ్గగానే కరోనా ప్రబలింది. దీంతో అసెంబ్లీని సమావేశ పరిచే అవకాశం లేకుండాపోయింది.

ఈ కారణంగానే కవిత ఇంకా ఎమ్మెల్సీగా ప్రమాణం చేయలేదు. దీంతో ఆ అధికార హోదా పరపతిని అనుభవించలేకపోతున్నారు. ఇది కవితకు ఓ వింత పరిస్థితిని సృష్టిస్తోంది. ఇప్పటికే ఎంపీగా ఓడిపోయి.. అధికారానికి సంవత్సరన్నరగా దూరం ఉంటోంది కవిత. కేసీఆర్ కూతురు అయ్యి ఉండి పార్టీలో ప్రభుత్వంలో కనీసం ప్రాధాన్యత లేకుండా పోతోంది.

Also Read: కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?

కేసీఆర్ కుటుంబానికి చెందిన అనేక మంది బంధువులు ఇప్పుడు ప్రగతి భవన్ కారిడార్లలో దర్జాగా పేరు పరపతి.. హోదా, అధికారాన్ని అనుభవిస్తున్నారు. కేసీఆర్ సొంత కూతురు కవిత మాత్రం నిజామాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్తి అరవింద్ చేతిలో ఓడినప్పటి నుంచి శని పట్టినట్టు ఏదీ చేసినా ఆమెకు కలిసిరావడం లేదని ఆమె అభిమానులు వాపోతున్నారు. ఎమ్మెల్సీగా గెలిచినా ప్రమాణం చేయకుండా అధికారానికి కవిత దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే చురుకుగా మారుతున్న కవితకు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదని తెలిసింది.

బాలయ్య పైత్యం.. కొత్త హీరోయిన్ ఇక పాతదే !


ప్రపంచంలో ఇప్పుడున్న పెద్ద సమస్య కరోనానే. అయితే మిగతా రంగాలు ఎలా ఉన్నా ఈ కరోనా మహమ్మారి దెబ్బకు సినీ లోకాలు స్తంభించిపోయాయి. సినిమా పక్షులు అల్లాడిపోతున్నాయి. మళ్ళీ షూటింగ్ లు ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. అసలు సీరియల్ షూట్ కే నానాకష్టాలు పడాల్సి వస్తోంది. ఒకటి రెండు రోజులు షూట్ చేసినందుకే.. కొన్ని సీరియల్ యాక్టర్స్ కరోనా సోకి ఇంటికే పరిమితం అయిపోయారు. ఇప్పటికే డబ్బులు పోసిన చిత్రనిర్మాతల కన్నీళ్ళు తుడవటానికి ఎవ్వరి వల్ల సాధ్యం కాని సంఘటనలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినబడుతున్నాయి.

Also Read: ‘పుష్ప’లో బిగ్గెస్ట్‌ ట్విస్ట్‌ అదే!

అయితే ఇంత జరుగుతున్నా మన బాలయ్య మాత్రం కరోనా నన్ను ఏమి చెయ్యలేదు, నా పార్ట్ కి సంబందించి షూట్ పెట్టమని అంటున్నాడట. కనీసం తన పై సోలోగా వచ్చే సాంగ్ నైనా షూట్ చేద్దామని బాలయ్య తెగ తాపత్రయ పడిపోతున్నాడట. పాపం ఎవ్వరికీ ఎదురుచెప్పే దైర్యం లేదాయే. పైగా బోయపాటి ప్లాప్ లో ఉన్నాడు. తేడా కొడితే బోయపాటికి ఉన్న గౌరవం కూడా పోతుంది. అయినా చాలా మంది స్టార్ హీరోలు నిర్మాతలే ఈ సంవత్సరం చివరి వరకు అవుట్ డోర్ షెడ్యూల్స్ ను రద్దు చేసుకుంటే బాలయ్యకి అవేమిపట్టనట్టు కనబడటం లేదు. దీన్నే బాలయ్య పైత్యం అంటారేమో.

Also Read: బిగ్‌బాస్‌4 కోసం పూనమ్‌ బజ్వా అంత తీసుకుంటోందా?

కాగా స్టూడియోలో సెట్ వేసి బాలయ్య మీద సోలో సాంగ్ ను షూట్ చేస్తారేమో చూడాలి. కానీ బాలయ్య ఒక్కరి మీదే సాంగ్ ఏమి చేస్తారు. హీరోయిన్ కావాలి. కనీసం డూప్ నైనా పెట్టాలి. మరి ఇప్పుడు బాలయ్య కోసం బోయపాటి బృందం ఏమి చేస్తోందో చూడాలి. మొత్తానికి కరోనా కూడా బాలయ్యను ఎఫెక్ట్ చెయ్యలేకపోయింది. ఇక ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. బాలయ్య సరసన హీరోయిన్ అంటే.. ఆ కొత్త హీరోయిన్ ఇక పాతది అయిపోయినట్టే.. పాపం. సక్సెస్ కొట్టకముందే ఫేడ్ అవుట్ అయ్యే ప్రమాదం ఉండటం నిజంగా దురదృష్టమే.

గుడ్ న్యూస్.. తుది దశకు చేరుకున్న వ్యాక్సిన్ ట్రయల్స్


ఒక్క వైరస్.. ప్రపంచాన్ని బెంబేలేత్తిస్తోంది. కంటికి కన్పించకుండా.. ఉసరవెల్లిగా రంగులు మారస్తూ మానవాళికి సవాల్ విసురుతోంది. నింగి.. నేలను ఆక్రమించుకొని భూమిపై పెత్తనం చేస్తున్న మానవుడా.. నన్ను ఎదుర్కొనే దమ్ముందా? అంటూ పరిహసిస్తోంది. కరోనా కాలంలో మనుషులంతా ఇళ్లకు పరిమితంకాగా అడవుల్లోని జంతువులన్నీ నగరాలు, పట్టణాల్లో తిరుగుతున్నాయి. కరోనా వైరస్ జంతువులపై కాకుండా మానవులపై తన ప్రతాపాన్ని చూపిస్తూ ఇప్పటికైనా మనుషులు మారాలనే సందేశాన్ని ఇచ్చింది. అయినప్పటికీ ఇంకా కొంతమందిలో మార్పురాకపోవడం శోచనీయంగా మారింది.

Also Read: చైనాకు దెబ్బ.. భారతీయుల ప్రతాపం

ఇక కరోనా వైరస్ కారణంగా మనుషులంతా పిట్టల్లా రాలుతుండటంతో ప్రతీఒక్కరిలో భయాందోళన మొదలైంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దాటికి విలవిలలాడిపోతున్నాయి. చిన్న, పెద్ద, పేద, ధనిక అనే తేడాలేకుండా కరోనా మహమ్మరి ప్రతీఒక్కరిపై తన ప్రభావం చూపుతోంది. దీంతో ప్రపంచంలోని చాలాదేశాలు లాక్డౌన్ విధించి కరోనాను కొంతమేర కట్టడి చేయగలిగాయి. అయితే కరోనాను పూర్తిస్థాయిలో నివారించాలంటే మాత్రం వాక్సిన్ తయారీ తప్పనిసరైంది. దీంతో సైంటిస్టులు రేయింబవళ్లు కష్టించి వ్యాక్సిన్ తయారీ కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే పలుదేశాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్ జోరుగా కొనసాగుతోన్నాయి.

కరోనా కారణంగా అమెరికా దేశం ఎక్కువగా నష్టపోతుంది. కరోనా కేసులు ప్రపంచంలోనే అమెరికాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశ వ్యాక్సిన్ కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా ఫార్మా కంపెనీ వ్యాక్సిన్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్నాయని అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. సోమ‌వారం నుంచి చివరి దశ ట్రయల్స్ లో భాగంగా 30వేల మందిపై ప్ర‌యోగాలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. వీరిలో స‌గం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చి.. మిగిలిన స‌గం మందికి ప్లేసిబో (డ‌మ్మీ వ్యాక్సిన్‌) ఇస్తారు. దీని ద్వారా వ్యాక్సిన్ ప‌నిత‌నాన్ని ప‌రీక్షించి రోగులకు అందుబాటులోకి తీసుకొస్తారు.

Also Read: ఆ రాష్ట్రానికి కరోనా తలవంచనుందా?

అమెరికా ప్రభుత్వం ఇప్పటికే మోడెర్నా సంస్థకు ఒక బిలియన్ డాలర్ల ఆర్థికసాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ఓవైపు కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చేపడుతూనే మరోవైపు అమెరికా కోసం 500మిలియ‌న్ల డోసుల‌ వ్యాక్సిన్ సిద్ధం చేసేందుకు సన్నహాలు చేస్తోంది. 2021ఆరంభం వ‌ర‌కు 1బిలియ‌న్ డోసుల‌ను ఉత్ప‌త్తి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మోడెర్నా ఫార్మాతోపాటు ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనికాలు త‌యారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు కూడా చివ‌రి ద‌శ ట్ర‌య‌ల్స్‌కు చేరుకున్నాయి. దీంతో వ్యాక్సిన్ పై ఆశలు రోజురోజుకు పెరుుతున్నాయి.

ఆగ‌స్టు నాటికి ఏదోఒక కంపెనీ వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. దీంతో కరోనాపై తొలి వ్యాక్సిన్ ఏ కంపెనీ, ఏదేశం తీసుకొస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.

బిగ్‌బాస్‌4 నుంచి ఆఫర్ వచ్చింది: స్టార్ కొరియోగ్రాఫర్


టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్లలో మంచి పేరున్న వ్యక్తి రఘు మాస్టర్. ‘ఢీ’ షోలో తన టాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకొని సినిమాల్లోకి వచ్చాడు. ‘ఆర్య’ మూవీలో ‘ఉప్పెనంత ఈ ప్రేమకి’ అనే సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన రఘు అందరి దృష్టిని ఆకర్షించాడు. అక్కడి నుంచి పలు హిట్‌ సాంగ్స్‌కు నృత్యరీతులు సమకూర్చిన అతను.. పలువురు స్టార్ హీరోలతో పని చేశాడు. కొన్ని టీవీ షోస్‌లో జడ్జ్‌గా వ్యవహరించడంతో పాటు మూవీస్‌లో కూడా యాక్ట్‌ చేసిన రఘు ఇప్పుడు ఓ రియాలిటీ షోలో ఎంటర్ కాబోతున్నాడు. తెలుగు బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో కంటెస్టంట్‌గా అడుగు పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని రఘునే వెల్లడించాడు. బిగ్‌బాస్‌ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని షోలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు.

Also Read: బిగ్‌బాస్‌4 కోసం పూనమ్‌ బజ్వా అంత తీసుకుంటోందా?

‘అవును, బిగ్‌బాస్‌4 వాళ్లు నన్ను సంప్రదించారు. ఇంతకుముందు సీజన్లప్పుడు కూడా నాకు ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ టైమ్‌లో ఇతర షూటింగ్స్‌తో బిజీగా ఉండడంతో చేయలేకపోయా. అయితే, ఆ సారి మాత్రం ఈ అవకాశాన్ని మిస్‌ చేసుకోవాలని అనుకోవడం లేదు. బిగ్‌ బాస్‌లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నా. కరోనా టైమ్‌లో స్టార్ట్‌ అవుతున్న ఈ షోలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తరచూ టెస్టులు చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. కంటెస్టంట్స్‌ ఆరోగ్యం విషయంలో మేనేజ్‌మెంట్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. లాక్‌డౌన్‌ తర్వాత నేను కొన్ని షూటింగ్స్‌లో పాల్గొన్నా. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్స్‌ పూర్తి చేశాం. మరింత కాలం మనం ఇంట్లోనే బంధీగా ఉండలేం. తగిన జాగ్రత్తలు పాటిస్తూ కొత్త లైఫ్‌ను స్టార్ట్‌ చేయాల్సిన సమయం వచ్చింది. ఈ పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షోలో కొన్ని మార్పులు ఉంటాయి. అలాగే, సవాళ్లూ ఎదురవుతాయని నాకు తెలుసు. వాటిని ఎదుర్కొనేందుకు ఆత్రుతగా ఉన్నా’ అని ఓ ఇంటర్వ్యూలో రఘు పేర్కొన్నాడు.

Also Read: నా కొత్త మూవీ టైటిల్ ని‌ గెస్‌ చేయండి: ఆదా శర్మ

బిగ్‌బాస్‌ షో ఫార్మాట్‌ గురించి తనకు అవగాహన ఉందని, కచ్చితంగా ఫైనల్‌కు వెళ్లగలనన్న నమ్మకం ఉందన్నాడు రఘు. షోలో పాల్గొనే అందరి లక్ష్యం అదే అయినా.. తాను మాత్రం ఎలాంటి సిచ్యువేషన్‌లో అయినా కూల్‌గా, పాజిటివ్‌గా ముందుకెళ్తానని చెప్పాడు. ఈ షో ద్వారా మన గురించి మనం తెలుసుకునే అవకాశం లభిస్తుందని, అవసరమైన టైమ్‌లో తన వాదనను బలంగా వినిపిస్తానని రఘు అంటున్నాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండేది కొత్త స్నేహితులను ఏర్పరుచుకోవడానికో, వారితో అనుబంధం పెంచుకోవడానికో కాదన్నాడు. ఆ రోజు ఇచ్చిన గేమ్‌పైనే ఫోకస్‌ పెడుతానని.. ఈ విషయంలో సెకండ్ సీజన్‌ విన్నర్ కౌశల్‌ గేమ్‌ ప్లాన్‌కు తాను సపోర్ట్‌ ఇస్తానని స్పష్టం చేసిన రఘు బిగ్‌బాస్‌ కోసం పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యాడని తెలుస్తోంది. లాస్ట్‌ సీజన్‌లో పార్టిసిపేట్‌ చేసిన తమిళ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ తన కామెడీ టైమింగ్‌తో అందరినీ ఎంటర్టైన్‌ చేశాడు. మరి, ఈసారి రఘు ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం.

రాజమౌళి- మహేష్ సినిమా పై స్పష్టత !


నేషనల్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కరోనా అడ్డంకితో ప్రస్తుతం తన ‘ఆర్ఆర్ఆర్‘ షూటింగ్ పనులను వాయిదా వేసుకున్నారు. కానీ రాజమౌళి తర్వాతి చిత్రం ఏమిటని ఇప్పటి నుండే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేనంటూ గత కొన్ని రోజులుగా రూమార్లు మొదలయ్యాయి. ఆ సినిమాలో హీరో రామ్ అని, లేదూ రానా అని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎప్పటిలాగే రాజమౌళి తరువాత సినిమా మహేష్ బాబుతోనే అని, కాకపోతే అది కూడా మల్టీస్టారరే అని.. మహేష్ తో పాటు మరో స్టార్ హీరో కూడా సినిమాలో ఉంటాడని మళ్ళీ రూమర్స్ స్టార్ అయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

Also Read: 10 ఏళ్లు.. 11 మిలియన్ల ఫాలోవర్లు

రాజమౌళి – మహేష్ సినిమాకి సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంకా కథనే పూర్తిగా రెడీ చేయలేదట. ఎలాగూ ఆర్ఆర్ఆర్ పోస్ట్ ఫోన్ అయింది కాబట్టి, మహేష్ సినిమా కోసం ఇప్పుడే తొందరపడట్లేదట. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ కోసం.. ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రీ లుక్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.

రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో సినిమాని రూపొందిస్తుండటంతో.. అవుట్ ఫుట్ పట్ల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటు మహేష్ బాబు, పరుశురామ్ సినిమా తరువాత రాజమౌళి సినిమా చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట.

వాళ్లకు జగన్ వద్దు, బాబే ముద్దు ..!


ఏపీ ప్రభుత్వంపై దాడి చేయడానికి చంద్రబాబుకు దొరికిన కొత్త అస్త్రం మద్యం షాపుల వేళలు పొడిగించడం. సీఎం జగన్ తీసుకు వచ్చిన నూతన మద్యం పాలసీలో దుకాణాలు ఉదయం 11:00 నుండి సాయంత్రం 7:00 గంటలకు వరకు మాత్రమే తెరిచి ఉండేవి. మద్యం షాపులలో పనిచేసే ఉద్యోగులు నిర్ణీత సమయం తరువాత ఎంత బ్రతిమాలినా మద్యం అమ్మడం లేదు. దీనిపై మద్యం వినియోగదారుల్లో తీవ్ర అసహనం ఉంది. చాలా మంది రోజూవారి కూలీలు, ఉద్యోగులు, వ్యాపారాలు తమ పనులు ముగించుకొని వచ్చే సమయానికి మద్యం దుకాణాలు మూసివేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి జగన్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు రాత్రి 9:00 గంటల వరకు కొనసాగేలా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Also Read: గ్రౌండ్ లెవల్లో జీరో.. సోషల్ మీడియాలో హీరో..

ఈ అంశాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు. ఐతే జగన్ మద్యం పాలసీని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబు బ్యాచ్ కి ఉందా అని. టీడీపీ గవర్నమెంట్ లో మద్యం ఏస్థాయిలో ఏరులై పారిందో అందరికి తెలిసిందే. 24 గంటలు అందుబాటులో ఉండే మద్యం దుకాణాలలో ఎల్లవేళలా మద్యం దొరికేది. ప్రతి మద్యం షాపుకి అనధికార పర్మిట్ రూమ్ లు ఉండేవి. రోజంతా కూర్చొని మద్యం తాగి, జేబులో చిల్లర మొత్తం ఖర్చు చేసుకొనే సౌలభ్యం చంద్రబాబు ప్రభుత్వంలో చూశాము. ప్రతి 500 మీటర్లకు ఓ వైన్ షాప్, ప్రతి గ్రామంలో లెక్కకు మించిన బెల్టు షాపులు దర్శనం ఇచ్చేవి. మద్యం అమ్మకాలు లేకపోతే ప్రభుత్వం నడవడమే కష్టం అన్నట్లుగా బాబు పరిపాలనలో మద్యం విధానం సాగింది.

Also Read: విజయసాయిరెడ్డికి గంటా షాక్ ఇవ్వనున్నాడా?

నాటి బాబు ప్రభుత్వం కొనసాగించిన మద్యం విధానానికి, జగన్ మద్యం పాలసీకి అసలు ఎక్కడగా పొంతనలేదు. నిర్ణీత సమయం తరువాత ఎంత వెతికినా మద్యం దొరకని పరిస్థితి ఉంది. వైన్ షాప్ దగ్గర మద్యం సేవించడం నిషిద్ధం, ఆరు బయట కూడా మద్యం తాగే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సగానికిపైగా మద్యం షాపులు ఎత్తివేయడంతో పాటు, అమ్మకాలు బాగా తగ్గించారు. ఇక బాబు ప్రభుత్వంలో వలె కావలసినంత మద్యం కొనుగోలు చేయలేము. ఒక వ్యక్తికి కేవలం మూడు బాటిల్స్ మాత్రమే ఇస్తున్నారు. మద్యం విధానంలో ఉన్న లోపాలను సవరిస్తూ జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేయడం జరిగింది. విచ్చల విడిగా మందుకు ప్రజలను బానిసలను చేసిన బాబు బ్యాచ్, కేవలం మద్యం దుకాణాల సమయం పెంచిన నందుకు ఇంత రాద్దాంతం చేస్తుంటే ఆశర్యం వేస్తుంది. కానీ ఒకటి మాత్రం నిజం…మద్యం ప్రియులు నాటి బాబు పాలన తలచుకొని ఈ సారి ఆయన్నే గెలిపించుకోవాలనుకుంటున్నారు. బాబు కొనసాగించిన మందుబాబుల స్వర్ణయుగాన్ని తలచుకుంటూ…వి మిస్ యూ బాబు అంటున్నారు.

ఆ జిల్లాలో టీడీపీ కనుమరుగు కానుందా?


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ జిల్లాలో పదవుల పందేరం కొనసాగింది. అయితే ఆ జిల్లా నేతలంతా ప్రస్తుతం సైలంటవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్నూల్ జిల్లాలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బకొట్టేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్న కర్నూలులో టీడీపీకి 2014 ఎన్నికల్లో కేవలం మూడు అసెంబ్లీ సీట్లురాగా ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో ఏ జిల్లాకు దక్కని పదవులు ఈ జిల్లా నేతలే దక్కాయి.

Also Read: చిక్కుల్లో మాజీ ఎంపీ రాయపాటి..!

చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వైసీపీ చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు టీడీపీలోకి చేరిపోయారు. దీంతో ఈ జిల్లా నేతలకు మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు, మండలి చైర్మన్, కార్పేరేషన్ చైర్మన్ వంటి ఎన్నో పదవులు దక్కాయి. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం కర్నూలులో టీడీపీ ఒకటంటే ఒక్కసీటు కూడా దక్కించుకోకపోవడం గమనార్హం. వైసీపీ అధికారంలోకి రావడంతో నాడు అధికారం అనుభవించిన నేతలంతా సైలంటవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రజా సమస్యలపై పోరాడాల్సిన టీడీపీ నేతలంతా గప్ చుప్ అవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడప్పుడు టీడీపీ నేతల అరెస్టులపై హంగామా చేస్తున్న నేతలు ప్రజా సమస్యలపై మాత్రం స్పందించడం లేదనే టాక్ విన్పిస్తోంది. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్లకు పరిమితం అవుతున్నారు. నాడు అధికారం చేయించిన నేతలు నేడు కనీసం టీడీపీ క్యాంప్ ఆఫీస్ వైపే చూడటం లేదనే విమర్శలున్నాయి. ఇక పార్టీ పిలుపిస్తున్న నిరసన్లలో కార్యక్రమాలను సైతం ఈ నేతలు పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది.

Also Read: ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించను.. అవంతి

అడుపదడుప కొన్ని సమస్యలపై మాజీ మంత్రి అఖిలప్రియ మీడియా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవల కర్నూలు స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ నిల్వలందక ఒకేరోజు 19మంది కరోనా రోగులు మృతిచెందారు. దీనిపై కూడా టీడీపీ నేతలు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. టీడీపీ నేతల వ్యవహరంపై బాబు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారట. ప్రజాక్షేత్రంలో ముందుండి పోరాడాల్సిన నేతలు సైలంటవడంతో టీడీపీ నేతలు వైసీపీతో లోపాయికారిగా మారిపోయారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఎప్పుడెప్పుడు అధికార పార్టీలోకి జంప్ అవుదామా? అన్నట్లు టీడీపీ నేతల తీరు ఉందని స్థానిక నేతలు అంటున్నారు. నేతలు ఇలానే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో టీడీపీ కర్నూలు జిల్లాలో కనుమరుగు అవడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి. అధికారం ఉన్నప్పుడు హల్చల్ చేసి.. అధికారం పోయాక అడ్రస్ లేకుండాపోయే నేతలతో టీడీపీ 2024 ఎన్నికల్లో ఏమేరకు నెగ్గుకు రాగలుగుతుందనేది వేచి చూడాల్సిందే..!

టీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియా..!


అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియా అన్నచందంగా పరిస్థితులు మారిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా ఎంట్రీ తర్వాత సీఎం కేసీఆర్ హవా క్రమంగా తగ్గుతున్నట్లు కన్పిస్తోంది. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీలు దూకూడుగా వెళుతుండగా అంతేస్థాయిలో సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది.

Also Read: కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?

గడిచిన ఆరేళ్లలో తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగింది. సీఎం కేసీఆర్ కు ధీటైన నాయకుడు ప్రతిపక్షంలో ఎవరూ లేకపోవడంతో ఆయన మాటే నెగ్గింది. అయితే కరోనా తర్వాత పరిస్థితులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మారుతూ వస్తున్నాయి. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం అవడంతో ప్రతిపక్షాలకు ఛాన్స్ దొరికింది. దీంతో కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. మరోవైపు కరోనా రోగులు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెడుతుండటంతో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇరుకున పడుతోంది.

హైదరాబాద్ నగరంలో కరోనా విజృంభిస్తున్న వేళలో సీఎం కేసీఆర్ కొన్నిరోజులు కన్పించకుండా పోయారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. వేర్ ఈజ్ కేసీఆర్ అంటూ హ్యాష్ ట్యాగులతో ట్రెండింగులోకి తీసుకొచ్చారు. దీంతో ఈ విషయంలో జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత సీఎం కేసీఆర్ మళ్లీ హైదరాబాద్ కు వచ్చి కరోనాపై సమీక్షలు చేయాల్సి వచ్చింది. అయితే కేసీఆర్ ఎక్కడి వెళ్లారనే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు. మరోవైపు కరోనా విజృంభిస్తున్న వేళ సచివాలయం కూల్చివేత పనులు, కరోనా టెస్టులు చేయకపోవడంతో హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేయడంపై క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

Also Read: మీడియాపై మోడీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నారా?

టీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాయకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను కొంతమేర కట్టడి చేయగలిగినా సోషల్ మీడియాను మాత్రం మేనేజ్ చేయలేకపోతుంది. టీఆర్ఎస్ సోషల్ మీడియా సెల్ ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టిన దాఖలు కన్పించడం లేదు. దీంతో నెటిజన్లు సైతం టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే కేటీఆర్ సైతం నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ముళ్లు బలంగానే గుచ్చుకుంటుందని టాక్ విన్పిస్తుంది. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారాన్ని సీఎం కేసీఆర్ ఎలా కట్టడి చేస్తారో వేచిచూడాల్సిందే..!

గ్రౌండ్ లెవల్లో జీరో.. సోషల్ మీడియాలో హీరో..


ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇంకా పాలిటిక్స్ ను ఒంటబట్టించుకున్నట్లు కన్పించడం లేదు. బాబు సీఎం ఉన్నప్పుడే ఎమ్మెల్సీ కోటాలో పదవీ దక్కించుకొని మంత్రి అయ్యారు. బాబు హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినా చినబాబు ఇంకా గ్రౌండ్ లెవల్ పాలిటిక్స్ అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారనే వాదనలు విన్పిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత చినబాబు కేవలం సోషల్ మీడియానే నమ్ముకోవడంపై టీడీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించను.. అవంతి

2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఫ్యాన్ గాలి జోరుగా వీయడంతో టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. కేవలం 23సీట్లను దక్కించుకోగా వీరిలో ఇప్పటికే పలువురు సీఎం జగన్మోహన్ రెడ్డికి జై కొడుతున్నారు. అయితే తొలిసారి మంగళగిరి నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన నారాలోకేష్ ఓడిపోవడం ఆపార్టీని మరింత కుంగదీసింది. సీఎం కుమారుడిగా, మంత్రిగా పనిచేసిన లోకేష్ బాబు గత ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలవడంతో చిన్నబాబు స్టామినా పై ప్రశ్నలు తలేత్తాయి. కేవలం చంద్రబాబును చూసే లోకేష్ బాబును టీడీపీ శ్రేణులు భరిస్తున్నాయి తప్పా ఆయనకు పార్టీని నడిపే శక్తిలేదని సొంతపార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు.

పార్టీకి ఓటమికి కారణాలను విశ్లేషించుకొని క్షేత్రస్థాయిలోకి క్యాడర్ మళ్లీ పుంజుకోవాల్సిన చేయాల్సిన చంద్రబాబు, లోకేష్ బాబు ప్రస్తుతం సైలంటయ్యారు. చంద్రబాబు ఒకవైపు వయోభారం మోస్తూనే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇక లోకేష్ బాబు కేవలం సోషల్ మీడియానే నముకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ట్వీటర్లో కొన్ని పంచ్ డైలాగులతో ఆకట్టుకుంటున్నా అవన్నీ పార్టీ బలోపేతానికి ఏవిధంగా ఉపయోగపడుతాయనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రజల్లో ఉండి ప్రజా వ్యతిరేక పోరాటాలు చేయకుండా ఎంతకాలం సోషల్ మీడియాలో పోస్టులతో కాలం వెళ్లదీస్తారని టీడీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.

Also Read: ‘మద్యం’పై ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదం..!

ఈ నేపథ్యంలోనే టీడీపీ పగ్గాలను త్వరలోనే లోకేష్ బాబు చేపడుతారని ప్రచారం జరుగుతోంది. ప్రజాక్షేత్రంలో కాకుండా సోషల్ మీడియానే నమ్ముకున్న చినబాబు పార్టీని ఏవిధంగా గాడిన పడుతారనే ప్రశ్న తలెత్తుతోంది. ఎవరో రాసిచ్చిన స్క్రీప్టులతో చినబాబు ఎంతకాలం రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతారని అంటున్నారు. టీడీపీ నాయకుల అరెస్టులతో అప్పుడప్పుడు లోకేష్ బాబు హడావుడి కన్పిస్తుంది తప్ప ప్రజా పోరాటాల్లో లోకేష్ బాబు ఎక్కడా కన్పించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో టీడీపీ శ్రేణులు చినబాబు నాయకత్వాన్ని ఎంతవరకు అంగీకరిస్తారనేది తెలియాల్సి ఉంది. అయితే చినబాబు త్వరలోనే సైకిల్ యాత్ర చేపట్టి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే లోకేష్ బాబు రాజకీయాలు సోషల్ మీడియాకే పరిమితం అవుతాయా? లేదా ప్రజాక్షేత్రంలోనూ ఆయన సత్తా చాటుతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే..!

సోనూ సుద్.. మన స్టార్లకు ఆ హృదయం లేదా?


ఎక్కడో ముంబైలో ఉంటాడు.. పలు టాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. ఫేమస్ విలన్ గా తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో ఫేమస్.. హిందీలోనూ పలు సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో చేతికి ఎముకే లేకుండా కోట్లు ఖర్చు పెట్టి వలస కార్మికులను, విదేశాల్లో ఉన్న వారిని రప్పించి ఆదుకున్నాడు. ఈయన చేసిన సేవలకు దేశమంతా ‘సోనూ సూద్ రియల్ హీరో’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నిర్వహిస్తోంది.

Also Read: ‘పుష్ప’లో బిగ్గెస్ట్‌ ట్విస్ట్‌ అదే!

ఆపదలో ఉన్నా అని ట్వీట్ చేసిన ప్రతి వారినీ సోనూసూద్ ఆదుకున్నారు. ఇక ట్విట్టర్ లో తన కంట పడిన ప్రతీ అంశంపై కూడా ఆయన స్పందించారు.

తాజాగా చిత్తూరు జిల్లా టామోటా రైతు నాగేశ్వరరావు దుస్థితిని ఎవరో వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు. కరోనా లాక్ డౌన్ తో పంట నష్టపోయి పెట్టుబడికి డబ్బులు లేక ఎద్దులు లేదా ట్రాక్టర్ దున్నించే తాహతు లేక కూతుళ్లతో సాగు నడిపిస్తున్న నాగేశ్వరరావు వీడియోను ఎవరో తీసి ట్విట్టర్ లో పెట్టారు. అది వైరల్ అయ్యింది.

దీన్ని చూసిన సోనూసూద్ చలించి గంటల్లోనే నాగేశ్వరరావు కుటుంబానికి ట్రాక్టర్ ను అందించాడు. ఎక్కడో ముంబైలో ఉన్నా కూడా చిత్తూరు జిల్లాలో మారుమూల ఉన్న ఓ రైతు కష్టం గుర్తించి వెంటనే స్పందించి ట్రాక్టర్ ను గంటల్లోనే అందించాడు.

Also Read: బిగ్‌బాస్‌4 కోసం పూనమ్‌ బజ్వా అంత తీసుకుంటోందా?

అయితే అంత దూరాన ఉన్న విలన్ నటుడు సోనూసూద్ కు ఆంధ్రా రైతు కష్టం అర్థమైంది.కానీ మన స్టార్లూ ఉన్నారు. పోయిన సంక్రాంతికే 200 కోట్ల బ్లాక్ బస్టర్ లు అందుకున్నారు. తమదే అత్యధిక కలెక్షన్ అని ఊదరగొట్టే ప్రకటనలు ఇచ్చారు. కానీ తెలుగు రైతు కష్టాన్ని గుర్తించలేకపోయారు.. ఆదుకోలేకపోయారు. కలెక్షన్లు, వసూళ్లకు మాత్రమే తెలుగు జనాలు కావాలి.. కానీ వారి కష్టాలు మన స్టార్లకు పట్టవా అని ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాసుల కక్కుర్తిలో పడి మన సమాజాన్ని పట్టించుకోని స్టార్లను మనం ఎందుకు పట్టించుకోవాలని నినదిస్తున్నారు. టాలీవుడ్ స్టార్లూ ఇప్పటికైనా మారండని కోరుతున్నారు.

ఉత్తరాంధ్ర జోలికొస్తే ఉపేక్షించను.. అవంతి


సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన నర్సాపురం ఏంపీ రఘురామ కృష్ణంరాజుకు ఇప్పడు నర్సాపురం నియోజవర్గం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నాయకుల నుంచి వార్నింగ్ లు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా మంత్రులు, వైసీపీ నాయకుల విమర్శలే ఎదుర్కొన్నారు. ఇప్పడు విశాఖపట్నం వైసీపీ నాయకులు రాఘురామ రాజుపై విరుచుకుపడ్డారు. ఇందుకు కారణం లేకపోలేదు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అమరావతి రాజధానిగా అంగీకరిస్తూ జగన్ అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని ఇటీవల ఎంపీ రఘురామ రాజు రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. మీడియా ముందు రాజధాని విషయంలో సిఎం జగన్ వైఖరిని తప్పుబట్టారు. అదేవిధంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్నేహితుడు నలంద కిషోర్ మృతి పోలీసుల హత్యగా భావించాలని చెప్పారు.

Also Read: చిక్కుల్లో మాజీ ఎంపీ రాయపాటి..!

ఈ వ్యవహారంపై విశాఖ వైసీపీ నాయకులు, మంత్రి అవంతి శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ఉత్తరాంధ్ర జోలికోస్తే ఉపేక్షించేది లేదని ఏంపీకి వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. రాజు ఎంపీగా లోక్ సభలో అడుగుపెట్టాడంటే అది వై.ఎస్ జగన్ పెట్టిన బిక్ష అనే విషయాన్నిగుర్తు పెట్టుకోవాలన్నారు. వైసీపీ జెండాపై గెలిచి టీడీపీ నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపురం విషయాల వరకే పరిమితం కావాలని సూచించారు. పార్టీ విధానాలు నచ్చకపోతే రాజీనామా చేయాలని కోరారు. నలంద కిషోర్ మృతికి తాను బాధపడుతున్నాని, కరోనా ఎవరికైనా వస్తుందన్నారు.

Also Read: బాబు పండిపోయాడు…లోకేష్ పచ్చిగానే ఉన్నాడు!

తనపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే స్పందించే ఎంపీ రఘురామ కృష్ణంరాజు మంత్రి అవంతి శ్రీనివాస్ విషయంలోను ఇదే విధంగా స్పందించారు. కరోనా ఎవరికైనా వస్తుందనే జ్ఞానామృతాన్ని తెలియజేసినందుకు మంత్రి అవంతిని అభినందించకుండా ఉండలేకపోతున్నానని తెలిపారు. కర్నూలులో కరోనా వైరస్ ఉధృతంగా ఉన్నప్పుడు తీసుకువెళ్లడంతో కిషోర్ కరోనా బారిన పడ్డారు.. కాబట్టి ఇది ముమ్మాటికి పోలీసు హత్యేనని మరో సారి చెప్పారు. జగన్ ఇమేజ్ తోపాటు తన ఇమేజ్ తో కూడా గెలిచానని ఇప్పటికే పలుమార్లు చెప్పానని ఈ విషయాన్ని గమనిస్తే మంచిదన్నారు. మంత్రి అవంతిలా తాను కేవలం జగన్ ఇమేజ్ తోనే గెలవలేదని ఎద్దేవ చేశారు. మేజరిటీ ప్రజలు అమరావతి రాజధానినే కోరుకుంటున్నారనే విషయాన్ని అవంతి గుర్తించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సమాధానం ఇచ్చారు. ఎంపీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న వైసీపీకి అవంతి శ్రీనివాస్ చర్య తలనొప్పిగా మారనుందా అనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతుంది.