Home Blog Page 8391

అరివీర భయంకర.. అధీరా!


బహుబలి తర్వాత భారత సినీ పరిశ్రమలో అంతటి గొప్ప విజయం సాధించిన ప్రాంతీయ చిత్రం ‘కేజీఎఫ్’. ప్రశాంత్‌ నీల్ దర్శకత్వం వహించిన ఈ కన్నడ పీరియాడికల్‌ మూవీ రెండేళ్ల కిందట సన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. యశ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. కన్నడనాట రూ. 200 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో డబ్‌ అయింది. అక్కడ అనేక రికార్డ్స్‌ క్రియేట్‌ చేసింది. ఓవరాల్‌గా రూ.85 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 318 కోట్లు వసూల్‌ చేసి పాన్‌ ఇండియా మూవీగా నిలిచింది. హీరో యశ్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే, ఈ మూవీలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు అనేక అవార్డులు కూడా సొంతమయ్యాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌, స్టంట్స్‌ విభాగాల్లో నేషనల్‌ అవార్డులు వచ్చాయి.

Also Read: తగ్గాల్సిన టైమ్‌లో పెంచేసిన పూజా హెగ్డే!

ఈ సినిమాకి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ ప్రకటించాడు. అప్పటి నుంచి సెకండ్‌ పార్ట్‌ కోసం కన్నడ వర్గాలే కాకుండా భారత సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇండియా మోస్ట్‌ అవైటింగ్‌గా మూవీగా మారింది. పైగా విలన్‌ ‘అధీరా’ పాత్రను బాలీవుడ్‌ స్టార్ సంజయ్‌ దత్‌ పోషిస్తుండడంతో మరింత హైప్‌ క్రియేట్‌ అయింది. అలాగే, అధీరా ఎవరు? ఎలా ఉంటాడు? అంటూ చాన్నాళ్ల నుంచే సోషల్‌ మీడియా ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది చిత్ర బృందం. తాజాగా అధీరా ఫస్ట్ లుక్‌ విడుదల చేసింది. బుధవారం సంజయ్ దత్ 61వ పుట్టిన రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్‌ అధీరా ఫస్ట్ లుక్ విడుదల రిలీజ్‌ చేసింది.

Also Read: సోనూసుద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

అధీరా పాత్ర ఎంత భయంకరంగా ఉండబోతుందో ఫస్ట్‌లుక్‌తోనే హింట్‌ ఇచ్చింది. అత్యంత పాశవికంగా, జాలి, దయ లేని మనిషిగా అధీరా ఉంటాడు అని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇదివరకే ప్రకటించాడు. అన్నట్టుగానే అరివీర భయంకరమైన లుక్‌లో సంజయ్‌ను ప్రజెంట్‌ చేశాడు. వైవిధ్యమైన హెయిర్ స్టైల్.. తల, ముఖంపై టాటూస్‌, చేతిలో పెద్ద కత్తిలో సంజయ్‌ దత్‌ లుక్‌ చూస్తేనే భయం పుట్టేలా ఉంది. తెల్లటి గడ్డం, మెలితిప్పిన మీసంతో సంజయ్‌ కత్తికి తలపెట్టి దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఈ పోస్టర్ను తన ట్విట్టర్ఖాతాలో పోస్ట్‌ చేసిన డైరెక్టర్ నీల్ ‘హ్యాపీ బర్త్ డే సంజూ బాబా. కేజీఎఫ్‌2లో భాగమైనందుకు థ్యాంక్స్‌. నెక్ట్స్‌ షెడ్యూల్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం’ అని ట్వీట్‌ చేశాడు. యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ సీనియర్ హీరోయిన్‌ రవీనా టండన్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. రవీ బస్రూర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్. హొంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగులో వారాహి సంస్థ విడుదల చేయనుంది. సెకండ్‌ చాప్టర్ కూడా కన్నడ, తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 23 రిలీజ్‌ చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించింది. కానీ, కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోవడంతో వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.

https://twitter.com/prashanth_neel/status/1288330843073605634

పూజా హెగ్డే రెచ్చగొడుతున్నా పట్టించుకోని అఖిల్‌


పూజా హెగ్డే నటన అద్భుతం. ఆమె అందం ఇంకా అద్భుతం. పూజ అభినయానికి వంక పెట్టలేం. ఆమె అందం చూస్తే కళ్లు తిప్పుకోలేం. మోడలింగ్‌ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ పర్ఫెక్ట్‌ ఫిగర్ మెయింటేన్‌ చేస్తుంటుంది. బికినీ బాడీతో కుర్రకారు మతిపోగుతుంది. కాళ్లతోనూ మాయ చేయగలదు. అందుకే ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నాకళ్లు’ అంటూ అల వైకుంఠపురములో మూవీలో పూజా కాళ్లను పొగుడుతూ ఓ పాటనే పెట్టేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌. అలాంటి సెక్సీ లెగ్స్‌తో ఇప్పుడు అఖిల్‌ను రెచ్చగొడుతోంది పూజ. అయినా సరే అఖిల్‌ ఆ కాళ్లను.. ఆమె ఒగరు చూపులను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంతకు అఖిల్‌ను ఆమెను ఎందుకు రెచ్చగొడుతోంది అనుకుంటున్నారా? ఈ ఇద్దరూ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్ మూవీలో కలిసి నటిస్తున్నారు.ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఈ రోజు రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

Also Read: పవన్‌ సరనన రకుల్‌.. నిజమేనా క్రిష్!

ఈ రొమాంటిక్‌ పోస్టర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది. టైటిల్‌కు త‌గట్టుగానే అఖిల్ ప‌క్కా బ్యాచిల‌ర్ అని నిరూపించుకున్నాడు. చేతిలో కప్పుతో సోఫాలో కూర్చున్న అఖిల్‌ ల్యాప్ ట్యాప్‌లో మొహం పెట్టాడు. అతని వెనకాలే కుర్చీలో కూర్చున్న పూజను అతను కన్నెత్తి చూడడం లేదు. దాంతో, తన సెక్సీ కాళ్లతో అతని చెవిని మెలిపెట్టేసింది పూజా. అయినా కూడా అఖిల్‌ కిమ్మనకుండా ల్యాప్‌టాప్‌నే చూసుకుంటూ కూర్చున్న ఈ పోస్టర్ రొమాంటిక్‌ ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో బ‌న్నీ వాస్‌, వాసు వ‌ర్మ నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీత‌ం అందిస్తున్నారు.

Also Read: సోనూసుద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే కంప్లీట్‌ అయింది. వేసవిలోనే రిలీజ్‌ చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా దసరాకు వాయిదాకు వేసుకున్నారు. అయితే, వైరస్‌ వ్యాప్తి తగ్గకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇప్పటికే రంగ్‌దే, వకీల్ సాబ్‌, నారప్ప సంక్రాంతి బరిలో నిలిచాయి. ఇప్పుడు అఖిల్‌ కూడా వాటితో పోటీ కి సిద్ధమయ్యాడు. తన ఫస్ట్‌ మూవీ అఖిల్‌తో భారీ డిజాస్టర్ను ఖాతాలో వేసుకున్నఅక్కినేని నటవారసుడు తర్వాత హలోతో ఫర్వాలేదనిపించాడు. కానీ, మిస్టర్ మజ్ను ఫెయిలవడంతో బ్యాచిలర్ పై భారీ అంచనాలే పెట్టుకున్నాడు.

పార్లమెంట్ భవనాన్ని కూల్చేందుకు కేంద్రం రెడీ?


ప్రస్తుతం నడుస్తున్నది కరోనా కాలం.. ఈ కాలంలోనూ ఒక పని మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా జరిగిపోతుండటం విశేషం. అది ఏంటంటే.. చరిత్ర సాక్ష్యాలుగా ఉన్న భవనాల కూల్చివేతలు. ఇది ఒకింత బాధ కలిగించే విషయమే అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం తాము చేయాలకున్న పనులను మాత్రం పకడ్బంధీగా చేసుకుంటూ పోతున్నాయి. దీంతో ఒకప్పుడు గొప్ప కట్టడాలుగా కీర్తించబడిన భవనాలు నేడు కూల్చివేతలకు గురవుతున్నాయి. పురాతన కట్టడాలని కాపాడాల్సిన ప్రభుత్వాలే శిథిలావస్థకు చేరుకున్నాయనే సాకుతో కూల్చివేసేందుకు సిద్ధమవుతుండటం శోచనీయంగా మారింది.

Also Read: కన్నా లక్ష్మీనారాయణ అడుగులు ఎటువైపు?

తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తలంచారు. ఈమేరకు ఆయన కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.500కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించేందుకు సిద్ధపడటంతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. సచివాలయం కూల్చివేత అంశం సస్పెన్స్ థిల్లర్ ను తలపించేలా నడిచింది. చివరకు హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో ఇటీవలే సచివాలయం కూల్చివేత పనులను చేపట్టింది.

మరోవైపు సచివాలయం కూల్చివేతను కవర్ చేసేందుకు మీడియాకు అనుమతించకపోవడంతో అనేక అనుమానాలు రేకెత్తాయి. దీనిపై కూడా హైకోర్టు విచారణ చేపట్టి మీడియా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే ప్రతిపక్షాలు మాత్రం నిజాం రహస్య నిధిని కొల్లగొట్టేందుకే కేసీఆర్ సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని ఆరోపణలు గుప్పించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో కరోనా విజృంభిస్తున్న వేళ సీఎం కేసీఆర్ సచివాలయ కూల్చివేత పనులు చేపట్టడంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కేసీఆర్ సచివాలయం నిర్మాణ విషయంలో పట్టుదలతో ముందుకెళుతున్నారు.

Also Read: బండి సంజయ్ కి లైన్ క్లియర్ చేస్తున్న బీజేపీ

తాజాగా కేంద్రం ప్రభుత్వం కూడా పార్లమెంట్ భవనాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని భావిస్తోంది. ఈమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పుడున్న పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమని.. భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని, ఇప్పుడున్న సాంకేతికతకు అనుగుణంగా సదుపాయాల్లేవని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. దీనిని కూల్చేసి ఈ ప్రాంతంలోనే నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుత పార్లమెంట్ భవన నిర్మాణం 1921లో ప్రారంభంకాగా 1937లో ముగిసింది. వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ భవనాన్ని భవితరాలకు అందించాల్సిన నేతలే కూల్చివేసేందుకు సిద్ధమవుతుండటం శోచనీయమనే చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయాన్ని కూల్చేందుకు ఎలాంటి ప్రణాళికలు అనుసరించారో మోడీ సర్కార్ కూడా అలాగే ముందుకు వెళుతుండటం గమనార్హం. ఈ విషయంలో కేసీఆర్ ను మోడీ ఆదర్శంగా తీసుకున్నట్లు కన్పిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం మాత్రం పార్లమెంట్ భవనాన్ని కూల్చివేసేందుకు రెడీ అవుతుంది. దీంతో ఒక అద్భుత కట్టడం కాలగర్భంలో కలిసిపోనుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ అడుగులు ఎటువైపు?


ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ దిగిపోయారు. ఇన్నాళ్లు చేసిన రాజకీయం చాలని ఆయనను బీజేపీ దించేసి ఫైర్ బ్రాండ్ సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించింది. మరి ఈ హఠాత్ పరిణామానికి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏం చేస్తారు? పార్టీ మారుతారా? లేక ఇదే పార్టీలో ఉంటారా? బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ భవిష్యత్ ఏంటి? ప్రస్తుతం ఏపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

Also Read: ముక్కోణ పోరులో బాబు అవుట్..!

ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణను దించేసి సోము వీర్రాజుకు పగ్గాలు అప్పజెప్పడాన్ని అటు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఆయన అనుచరులు.. ఇటు టీడీపీ కూడా జీర్ణించుకోలేకపోతోంది. కన్నాకు అన్ని దారులు మూసుకుపోయాకే బీజేపీ జాతీయ నాయకత్వం తెలివిగా కన్నాను ఈ ఉన్నత పదవి నుంచి తొలగించడం సంచలనమైంది.

2019 ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణ నిజానికి వైసీపీలో చేరాలని అనుకున్నారు.కానీ కన్నాకు పిలిచి మరీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చి బీజేపీ లాగేసుకుంది. ఇక ఎన్నికల తరువాత అన్ని రాజకీయ పార్టీలు తలుపులు మూసేశాయి. వైసీపీపై విమర్శలతో కన్నా టార్గెట్ అయ్యారు. ఇటు నెత్తిన పెట్టుకున్న టీడీపీ చిత్తుగా ఓడి ఆ పార్టీ లేచే పరిస్థితిల్లో లేదు.

Also Read: జూనియర్లకు మంత్రి పదవులు.. సీనియర్లకు మొండిచేయి?

ఇలాంటి క్లిష్ట సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా సేఫ్ సైడ్ లో ఉన్న కన్నాను అధిష్టానం నిర్ధాక్షిణ్యంగా తొలగించి షాక్ ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ, టీడీపీతోపాటు కాంగ్రెస్ సహా ఏ ఇతర రాజకీయ పార్టీలో కూడా కన్నాకు ప్రవేశం లేకుండా పోయింది.

ప్రస్తుతం కన్నా పదవి పోయింది. పార్టీ అధ్యక్షుడు కాదు.. దీంతో ఆయనను ఎవరూ తీసుకునే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. బీజేపీ నాయకత్వం కన్నాను జాతీయ రాజకీయాలకు తీసుకెళ్లి అక్కడ పార్టీలో కీలక పదవిని ఇవ్వవచ్చని పార్టీలోని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని కీలక రాష్ట్రానికి కన్నాను ఇన్ చార్జిగా నియమించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే అప్పటివరకు బీజేపీ దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడడం తప్పితే కన్నా లక్ష్మీనారాయణ కు వేరే ఆప్షన్ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జూనియర్లకు మంత్రి పదవులు.. సీనియర్లకు మొండిచేయి?


2019 ఎన్నికల్లో ఏపీలో ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ చేపట్టి ఇటీవలే ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళుతున్నారు. ఓవైపు కరోనాను కట్టడి చేస్తూనే మరోవైపు ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను బయటికి తీస్తూ చంద్రబాబు హయాంలో మంత్రులుగా పనిచేసిన నేతలను కటకటల వెనక్కి పంపుతున్నారు. రాజధాని మార్పు, జిల్లాల విభజన అంశాల్లోకి ప్రత్యర్థి పార్టీలను ముగ్గులోకి లాగి అభివృద్ధికి ఈ పార్టీలు ఆటంకాలు సృష్టిస్తున్నాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు.

Also Read: కన్నా తొలగింపును జీర్ణించుకోని టీడీపీ మీడియా

ఇదంతా రాజకీయ వ్యూహాంలో భాగమే అయినప్పటికీ వైసీపీలో మాత్రం అంతకంతకు అసంతృప్తి పెరిగిపోతుందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి రావడంతో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడిన వారిని పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, పార్టీ కోసం ఏమాత్రం కష్టపడని వారికి కీలక పదవులు అప్పగిస్తుండటంపై సీనియర్లంతా లోలోపల మథన పడుతున్నారు. ఇటీవల వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్సేగా గెలిచిన ఇద్దరికి జగన్ మంత్రి పదవీ ఇవ్వడంతో పార్టీలో విస్కృతంగా చర్చ జరుగుతోంది.

వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడిన నేతలను పక్కకు పెట్టి జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై సీనియర్ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని టాక్ విన్పిస్తోంది. కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన అప్పలరాజు, వేణులు పార్టీ కోసం కష్టపడింది ఏమిలేదని అంటున్నారు. ఈ ఇద్దరి వల్ల పార్టీకీ పెద్దగా ఒరిగేందేమీ లేదంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతల్లో బీసీలు ఎంతమంది ఉన్నప్పటికీ తొలిసారి ఎమ్మెల్సేలుగా ఎన్నికైన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై సీనియర్లంతా జగన్మోహన్ రెడ్డిపై గుస్సా అవుతున్నారట. ఇప్పుడన్న క్యాబినెట్లోనూ బోత్స, పెద్దిరెడ్డి మినహా ఎవరూ సీనియర్లు లేరంటున్నారు.

Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

గతంలో మంత్రలుగా పని చేసినవారు, జిల్లాలను శాసించిన నేతలు ఎంతోమంది వైసీపీలో ఉన్నారు. వీరంతా కూడా వైసీపీ అధికారంలోకి వస్తే మళ్లీ చక్రం తిప్పవచ్చని పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేశారు. అయితే వీరి ఆశలపై జగన్ ప్రతీసారి నీళ్లు చల్లుతున్నారు. తొలి క్యాబినెట్లో జూనియర్లకే జగన్ పెద్దపీఠ వేశారని అంటున్నారు. జగన్ తన సొంత ఏజెండాలో భాగంగానే ఇలా చేస్తున్నారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా ఖాళీ అయిన రెండు మంత్రి పదవులను కూడా జగన్ జూనియర్లకు కేటాయించడంపై సీనియర్లు అసంతృప్తిలో రగిలిపోతున్నారట.

అయితే సీఎం జగన్ ను పార్టీలో గట్టిగా అడిగే పరిస్థితి లేకపోవడంతో సీనియర్లంతా మిన్నకుండిపోతున్నారని టాక్ విన్పిస్తుంది. ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సీనియర్ల ఆవేదనలో న్యాయం ఉందనే అనిపిస్తుంది. వైసీపీ నేతల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతుండటంతో ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందోననే చర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది.

ఏది కరోనా.. ఏది సీజనల్.. తెలుసుకోండి?


కరోనా.. కరోనా.. కరోనా.. ఈ పేరుచెబితే ప్రపంచ దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో మొదలైన కరోనా ప్రస్థానం అన్నిదేశాలకు పాకింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికిపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా రోజుకు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసుల్లో అమెరికా, బ్రెజిల్, భారత్ తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న రికవరీ రేటు గణనీయంగా పెరుగుతుండటం భారతీయులకు కొంత ఉపశమనాన్ని ఇస్తుంది.

Also Read: కరోనా అంతానికి సరికొత్త డివైస్.. త్వరలో మార్కెట్లోకి

కరోనా మహమ్మరి 2020సంవత్సరం ప్రారంభంలోనే వెలుగులోకి వచ్చింది. ప్రపంచ దేశాలకు మార్చిలో కరోనా గురించి తెల్సియడంతో ఆయా దేశాలకు కరోనాను ఎదుర్కొనేందుకు శతవిధలా ప్రయత్నాలు చేపట్టాయి. చాలాదేశాలు లాక్డౌన్ విధించుకున్నాయి. దీనివల్ల కరోనా వైరస్ కొంతమేర కట్టడి అయినా ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. దీంతో లాక్డౌన్ విధించిన దేశాలు క్రమంగా ఆన్ లాక్ చేస్తుండటంతో కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూపోతుంది. కొన్నిదేశాలు కరోనాను పూర్తిస్థాయిలో కట్టడిచేయగా మరికొన్ని దేశాలు కట్టడి చేయలేక చేత్తులేత్తేస్తుండటం చూస్తూనే ఉన్నాం.

ప్రస్తుతం వర్షకాల సీజన్ మొదలైంది. ఈకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధులు బారినపడే అవకాశం ఉంది. కరోనా లక్షణాలు, సీజనల్ వ్యాధి లక్షణాలు ఒకేరకంగా ఉండటంతో ఏది కరోనా? ఏది సీజనల్ వ్యాదో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రులకు వెళుతుండటంతో వైద్య సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. దీంతో వారిపై మరింత ఒత్తిడి పెరిగి సమస్య మొదటికీ వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో ప్రజలు తమకు తాముగా ఏది కరోనా లక్షణాలు, ఏది సీజనల్ లక్షణాలు అని తెలుసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనాకు సీజనల్ వ్యాధికి తేడా గుర్తించండి..

కరోనా వైరస్ లక్షణాల్లో అంటే జ్వరం, దగ్గు, జలుబు లాంటివి ప్రధానంగా కన్పిస్తాయి. ఈ లక్షణాలే సీజనల్ వ్యాధుల్లోనూ కన్పిస్తుంటాయి. అయితే ఈ లక్షణాలను గుర్తిస్తే ఏది కరోనా? ఏది సీజనల్ వ్యాదో గుర్తించడం సులభమని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా కరోనా విషయానికొస్తే.. తీవ్ర జ్వరం ఉంటుంది. మూడురోజులైన తగ్గదు. జలుబు ఉన్నా ముక్కు కారదు. పొడి దగ్గు వస్తుంది. రుచి, వాసన తెలియదు. ఒంటి నొప్పులు, తలనొప్పి తీవ్రంగా ఉంటాయి. గొంతు నొప్పి, ఛాతిలో నొప్పి వస్తుంది. కళ్లు ఎర్రబడుతాయి. వాంతులు వీరేచనాలు అవుతాయి.

Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

ఇక సీజనల్ వ్యాధి లక్షణాలకు వస్తే.. సాధారణ జ్వరం ఉంటుంది. మూడురోజుల్లో తగ్గిపోతుంది. జలుబు ఉంటే ముక్కు కారుతుంది. కఫంతో కూడిన దగ్గు వస్తుంది. రుచి, వాసన తెలుస్తుంది. ఒంటినొప్పులు, తలనొప్పి సాధారణంగా ఉంటాయి. గొంతునొప్పి ఉంటుంది. ఛాతిలో నొప్పి ఉండదు. కళ్లు ఎర్రబడవు. వాంతులు, వీరేచనాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించి కరోనా అపోహలను, ఆందోళనను దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ముక్కోణ పోరులో బాబు అవుట్..!


చంద్రబాబు కల చెదిరింది. 2024 ఎన్నికలనాటికి బ్రతిమిలాడో, బహుమతులు ఇచ్చో బీజేపీతో దోస్తీ చేసి 2014 మాదిరి లబ్ది పొందాలన్న ఆశకు శాశ్వతంగా తెరపడింది. ఇక టీడీపీతో బీజేపీ దోస్తీ అనేది జరగని పని అని తెలిసిపోయింది. ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ తొలగింపు, సోము వీర్రాజు ఎన్నికతో ఈ విషయం స్పష్టం అయ్యింది. సొంతగా ఎదిగితే తప్ప, టీడీపీతో కలవడం వలన వారికి ఒనగూరుతున్న ప్రయోజనం లేదని తెలుసుకున్న బీజేపీ అధిష్టానం, కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని తాజా పరిణామంతో తెలుస్తుంది. కనీసం పవన్ కళ్యాణ్ అన్నా కాపాడతాడు అనుకుంటే ఆయన తెలివిగా ఆదిలోనే బీజేపీతో దోస్తీ కట్టారు. జనసేన బలం తెలిసిన పవన్ కనీసం జాతీయ స్థాయిలో బలంగా ఉన్న అధికార పార్టీ బీజేపీలో చేరడం ఆయనకు కలిసొస్తుందని భావిస్తున్నారు. నిజం కూడా అదే.

Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

ఇప్పటి నుండి టీడీపీకి మరిన్ని కష్టాలు ఎదురయ్యే సూచనలు కలవు. ఆంద్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా ఎన్నికైన సోము వీర్రాజు టీడీపీ ప్రలోభాలకు లొంగే రకం కాదు. గతంలో కూడా ఆయన బాబును తీవ్రంగా విమర్శించారు. పొత్తు పేరుతో బీజేపీకి కేటాయించిన సీట్లలో బాబు తనకు అనుకూలురైన బలమైన ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెట్టి, మోసం చేయాలని చూశారు అన్నారు. ఎప్పటి నుండో బాబుతో పొత్తుకు సోము వీర్రాజు వ్యతిరేకం. ఇకపై ఆయన టార్గెట్ అధికార వైసీపీతో పాటు, ప్రతిపక్ష టీడీపీ కూడా. కాబట్టి గత ఐదేళ్లలో బాబు చేసిన అవినీతిని కూడా ఆయన గట్టిగా ప్రశ్నించే అవకాశం కలదు.

Also Read: కొత్త జిల్లాలతో జగన్ కు తలనొప్పులు తప్పవా?

జగన్ ని ఎదుర్కోవడానికి బాబు ఆయుధాలైన బీజేపీ మరియు జనసేనలు ఒకటి కావడంతో పాటు ఆయనకు దూరమయ్యారు . దీనితో బాబుకు ఏమీ పాలుపోవడం లేదు. బాబుకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడం ఆయన్ని కలవరపెడుతుంది. ఇప్పటికే బలహీన పడిన టీడీపీ 2024 ఎన్నికల సమయానికి కోలుకోవడం కష్టమే. దానికి తోడు బాబు పార్టీ బలహీనంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నుండి బలమైన నాయకులు వలస బాటపట్టే ఆస్కారం ఉంది. దీనితో ముందు ముందు బాబుకు గడ్డుకాలమే కనిపిస్తుంది. ఎప్పటి నుండో సంస్థాగతంగా పాతుకు పోయిన టీడీపీ ఊపిరి పోసుకోవాలంటే, జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత రావాలి. జగన్ సంక్షేమాల జోరులో అది అసాధ్యమే. కాబట్టి ట్రై సిరీస్ లో బాబు అవుట్ అయ్యేలా ఉన్నాడు.

సీఎస్ పదవీకాలం పొడగింపుకు మొగ్గుచూపుతున్న జగన్?


సీఎం జగన్ ప్రస్తుత సీఎస్ పదవీకాలం పొడగింపుకే మొగ్గుచూపుతున్నారు. ఏపీ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నీలం సాహ్ని పదవీకాలం మరో ఆరునెలలు పెంచాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరుతున్నారు. ప్రస్తుత సీఎస్ గా కొనసాగుతున్న నీలం సాహ్ని పదవీకాలంలో జూన్ 30నాటికే ముగిసింది. దీంతో ఆమె పదవీ కాలం ఏడాది చివరి వరకు పొడగించాలని సీఎం జగన్ గతంలోనే కేంద్రాన్ని కోరగా కేవలం మూడునెలలు పొడగించింది.

Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

సీఎం జగన్ కు నీలం సాహ్ని ప్రభుత్వానికి అన్ని విషయాల్లో కీలకంగా మారారు. రాష్ట్రంలో కోవిడ్-19 విజృంభిస్తున్న వేళ సీఎంవో బృందంతో సీఎస్, డీజీపీలు చక్కగా కమ్యూనికేట్ చేస్తూ వైరస్ నివారణకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నారు. రోగుల అందించాల్సిన వైద్యం, డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి కావాల్సిన సదుపాయాలపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కరోనా నియంత్రణకు పాటుపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ సీఎస్ మార్పు వల్ల ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు.

కొత్త సీఎస్ వచ్చిన వెంటనే ఏపీలో పనులు చక్కపెట్టేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పుడు కరోనా టీంతో కమ్యూనికేషన్లో గ్యాప్ ఎదురైతే ఏపీలో పాజిటివ్ కేసులు మరింత ప్రబలే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారట. అంతేకాకుండా ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఇటీవల ఇళ్ళ పట్టాల పంపిణీలో ఎదురైన సమస్యలను చాకచాక్యంగా పరిష్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె సేవలను ప్రభుత్వం ఇంకొన్నాళ్లు వాడుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని సీఎం జగన్ అనుకుంటున్నారట.

Also Read: కరోనా అంతానికి సరికొత్త డివైస్.. త్వరలో మార్కెట్లోకి

కరోనా పరిస్థితులు, ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఆమె పదవీ కాలం పొడగించేందుకే సీఎం జగన్ మొగ్గుచూపుతున్నారని సమాచారం. సీఎం జగన్ గతంలోనే ఆమె పదవీకాలంలో ఏడాది చివరి వరకు పొడగించాలని కోరగా మూడునెలలను పెంచింది. దీంతో ఆమె పదవీ కాలం సెప్టెంబర్ 30నాటికి ముగియనుంది. అంటే మరో రెండు నెలలు మాత్రమే ఆమె సీఎస్ పదవీలో కొనసాగుతారు. దీంతో ఆమె పదవీని మరో ఆరునెలలు పొడగించాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరోసారి సీఎస్ పదవీకాలం పొడిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే..!

సోనూసుద్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?


బాలీవుడ్ నటుడు సోనూసుద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్రసీమలో టాప్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్ తోపాటు సౌత్ ఇండస్ట్రీలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. టాప్ హీరోల పక్కన విలన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి మెప్పించాడు. అయితే అతనిలో కన్పించని మరో కోణం లాక్డౌన్లో బయటపడింది.

Also Read: ఆర్ఆర్ఆర్ 2021లో అయినా సాధ్యమేనా?

దేశంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఎక్కడి చూసినా సోనూసుద్ పేరే విన్పిస్తుంది. ఆయన దాతృత్వాన్ని చూసి హీరోలు సైతం నోరుళ్లబెట్టాల్సిందే. సినిమాల్లో విలన్ గా నటించినంత మాత్రనా నిజజీవితంలోనూ అలాగే ఉంటారనుకోవడం పప్పులో కాలేసినట్లేనని సోనూసుద్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. లాక్డౌన్ కారణంగా ముంబైలో చిక్కుకుపోయిన ఎంతోమందిని సొంత డబ్బులిచ్చి సొంతూళ్లకు పంపడంతో మొదలైన ఆయన దాతృత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

లాక్డౌన్లో వలస కార్మికుల కష్టాలను చూసి చలించిన సోనూసోద్ ఎంతోమంది వలస కార్మికులను సొంతూళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బస్సుల్లో, రైళ్లలో వారందరినీ సొంతూళ్లకు పంపించి వారిని ఆదుకున్నాడు. కష్టాల్లో ఉండి తన దృష్టికి వచ్చినవారికి సాయం అందిస్తూ సోనూసుద్ పెద్ద మనస్సును చాటుకున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లాలోని ఓ రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.

దీంతో సోనూసుద్ ఆస్తి విలువ ఎంత ఉంటుందని ఒక బాలీవుడ్ మీడియా అధ్యయనం చేసింది. సోనూసుద్ ఆస్తుల విలువ దాదాపు రూ.130కోట్లు ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. దీంతో విలన్ పాత్రలు వేసే నటుడికి ఇంత డబ్బు ఎలా వచ్చిందనే ఆసక్తి నెలకొంది. అయితే సోనూసుద్ గత 20ఏళ్లుగా బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలో విలన్ గా నటిస్తూ బాగానే డబ్బు సంపాదించినట్లు సమాచారం. ఈ డబ్బును సోనూసుద్ రెస్టారెంట్లు, హోటళ్లలో పెట్టి లాభాలు గడించడంతో ఆ డబ్బు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

Also Read: పవన్‌ సరనన రకుల్‌.. నిజమేనా క్రిష్!

లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూసుద్ ఏకంగా 10కోట్ల రూపాయల వరకు సాయం చేసినట్లు ఆ మీడియా సంస్థ వెల్లడించింది. దీంతో సోనూసుద్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఫేసు బుక్కుల్లో, సోషల్ మీడియాలో సోనూసుద్ దాతృత్వంపై పోస్టులు వైరల్ అవుతున్నాయి. సోనూసుద్ విలన్ కాదని.. రియల్ హీరో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సోనూసుద్ దాతృత్వానికి ప్రతీఒక్కరూ హ్యాట్సప్ చేస్తున్నారు.

బండి సంజయ్ కి లైన్ క్లియర్ చేస్తున్న బీజేపీ


తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఖచ్చితంగా బలపడాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ అందుకు అనుగుణంగానే ఫైర్ బ్రాండ్ అయిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. అయితే కథ అక్కడితో అయిపోలేదు. బండి సంజయ్ ముందర ఎన్ని చిక్కుముడులున్నాయి.

Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన బండి సంజయ్ ఇప్పుడు రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నారు. కారణం బీజేపీలోని సీనియర్లేనట.. ఇతర పార్టీల నుంచి వచ్చిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి సహా గడ్డం వివేక్ లాంటి సీనియర్లు.. బీజేపీలో ఉన్న లక్ష్మణ్, ఎంవీఎస్ ప్రసాద్, చింతల రాంచంద్రారెడ్డి లాంటి వారు ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కార్యవర్గంలో ఉన్నారు.వీరందరినీ తొలగించి యువరక్తాన్ని నింపాలని చూస్తున్న బండి సంజయ్ ఆ సాహసం చేయలేకపోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ క్లిష్ట పరిస్థితిపై అధిష్టానం సలహా అడిగారట బండి సంజయ్. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం తెలంగాణలోని సీనియర్ నేతలందరినీ బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకొని పదవులు ఇస్తామని.. తెలంగాణలో బీజేపీ కార్యవర్గాన్ని యువరక్తంతో నింపాలని బండి సంజయ్ కి సూచించినట్టు తెలిసింది.

Also Read: సోము వీర్రాజు ఎంపికలో సామాజిక కోణం

ఈ క్రమంలోనే కరోనా పరిస్థితులు చక్కబడ్డ తర్వాత తెలంగాణలోని బీజేపీ సీనియర్లు కేంద్ర బీజేపీ కార్యవర్గంలోకి వెళ్లిపోతారు. అప్పుడు బండి సంజయ్ యువరక్తాన్ని బీజేపీలో నింపి దూకుడుగా ముందుకెళ్లడానికి రంగం సిద్ధం చేశాడట.. 2023లో రాజకీయ అధికారమే లక్ష్యంగా కేసీఆర్ ను ఢీకొట్టేలా యువ కార్యవర్గాన్ని.. కార్యకలాపాలను డిజైన్ చేసినట్టు తెలిసింది.

ఇలా అధికారం సాధించడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని.. సీనియర్ నేతల ఒత్తిడికి తలొగ్గకూడదని బండి సంజయ్ కి దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది.

-ఎన్నం

కన్నా తొలగింపును జీర్ణించుకోని టీడీపీ మీడియా


ఊహించని షాక్ తగిలింది. కేంద్రంలోని బీజేపీ ఇంత ఖచ్చితంగా.. నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకొని ఎలాంటి అలిగేషన్స్ లేని నిక్కచ్చిగా పోరాడే సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేసింది. తెలంగాణలో బండి సంజయ్ వలే. ఏపీలో సోమూ వీర్రాజు కూడా ఫైర్ బ్రాండ్. ఉన్నది ఉన్నట్టు అనే నేత. టీడీపీ కుట్రలు.. కుతంత్రాలపై నిగ్గదీసి అడిగిన మనిషి.

Also Read: బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

ఇన్నాళ్లు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఫక్తు టీడీపీ నాయకుడిలానే వ్యవహరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. అటు సొంత బీజేపీలోనూ.. ఇటు వైసీపీలోనూ కన్నా వైఖరిపై తీవ్ర అనుమానాలున్నాయి. కన్నా బీజేపీలో ఉన్నా మనసు మాత్రం టీడీపీ.. చంద్రబాబు చుట్టూ తిరుగుతుందని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీకి ఎంతో ఫేవర్ గా ఉంటున్న కన్నాను తొలగించి ఫైర్ బ్రాండ్ అయిన సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేయడంతో టీడీపీలో.. దాని అనుకూల మీడియాలో ఒకటే ఏడుపు కనిపిస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణను ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా తొలగించినందుకు టీడీపీ మీడియా గగ్గోలు పెడుతోంది. కన్నాను తీసేయడం ఊహించని షాకింగ్ ఘటనగా భావిస్తోంది. కన్నానే పదవిలో కొనసాగిస్తారని.. లేకపోతే టీడీపీకి కాస్త అనుకూలమైన ఎమ్మెల్సీ మాధవ్ కు బీజేపీ చీఫ్ పదవి ఇస్తారని భావించారు. మాధవ్ వచ్చినా టీడీపీకి అనుకూలంగా మేనేజ్ చేయొచ్చని టీడీపీ ఆశపడింది. కానీ అందరికీ షాకిస్తూ ‘సోము వీర్రాజు’ను బీజేపీ అధిష్టానం అందలమెక్కించింది.

Also Read: కొత్త జిల్లాలతో జగన్ కు తలనొప్పులు తప్పవా?

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీ చీఫ్ ఇవ్వడం వెనుక బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ స్కెచ్ ఉందని టీడీపీ మీడియా హౌస్ లు అంచనా వేస్తున్నాయి. ఇక దీంతోపాటు గత కొన్ని వారాలుగా వైసీపీ కీలక నాయకుడు విజయ సాయిరెడ్డి.. తరుచుగా కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విషయం తెలిసే బీజేపీ అధిష్టానం కన్నాను తొలగించిందని టీడీపీ మీడియా నమ్ముతోంది.

విజయసాయిరెడ్డికి కేంద్రంలోని బీజేపీ సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలోనే కన్నా తొలగింపు వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉందని టీడీపీ మీడియా భావిస్తోంది. మొత్తానికి టీడీపీకి కొరుకుడు పడని సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు కావడంతో టీడీపీ మీడియా జీర్ణించుకోలేకపోతోందని తెలిసింది.

సోము వీర్రాజు ఎంపికలో సామాజిక కోణం

సోము వీర్రాజుని బిజెపి కొత్త అధ్యక్షుడిగా నియమించటం స్తబ్దుగా వున్న రాష్ట్ర రాజకీయాల్లో కదలిక వచ్చింది. రాజకీయ పార్టీల కతీతంగా ఈ నియామకాన్ని స్వాగతించటం జరిగింది. సాంఘిక మాధ్యమాల్లో కూడా దీనిపై పాజిటివ్ స్పందన రావటం విశేషం. కన్నా లక్ష్మీనారాయణ పై సాంఘిక మాధ్యమాల్లో వచ్చే సెటైర్లు బిజెపి పై కూడా ప్రభావం చూపాయి. అదే సోము వీర్రాజు విషయంలో అందుకు విరుద్ధంగా పాజిటివ్ వైబ్రేషన్లు వచ్చాయి. దీనికి తోడు బిజెపి క్యాడర్ లో పునరుత్తేజం కనబడింది. వై ఎస్ ఆర్ పి జెండాలు కట్టిన వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడ్ని చేయటంతో అవాక్కైన క్యాడర్ కక్కలేక మింగలేక ఇన్నాళ్ళు మిన్నకుండిపోయారు. ఇప్పుడు తిరిగి తమ మధ్య పెరిగిన వ్యక్తి అధ్యక్షుడు కావటంతో హుషారు గా  వున్నారు.

నూతన అధ్యక్షుని ఎన్నికకు భూమిక

బిజెపి ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జాతీయ పార్టీ. 2014 లో మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత పార్టీ కూడా కొత్త కొత్త ప్రాంతాలకు విస్తరించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడివేసిన గొంగళి అక్కడే వుంది. తెలంగాణాలో మాత్రం కొంత మెరుగ్గా వుంది. 2014 లో ఒక్క సీటే వస్తే 2019 వచ్చే సరికి నాలుగు సీట్లు గెలుచుకొని తన ఉనికిని కాపాడుకోగల్గింది. అదే ఆంధ్రలో నయితే దారుణమైన ఫలితాలు వచ్చాయి. సీట్లు రాకపోతే పోనీ గౌరవప్రదమైన ఓట్లు కూడా రాకపోయేటప్పటికి బిజెపి కేంద్ర నాయకత్వానికి తప్పెక్కడ జరిగిందో అర్ధమయ్యింది. అందుకే ఈసారి లేటయినా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది.

కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కి అధ్యక్షస్థానం కట్టబెట్టటం వరకూ వాళ్ళ వ్యూహం సరయినదైనా కన్నా లక్ష్మీనారాయణ ని ఎన్నిక చేయటం వ్యూహం బెడిసి కొట్టటానికి కారణమనే నిర్ధారణకు వచ్చారు. దీనితోపాటు చంద్రబాబు నాయుడు మోడీపై తీవ్రంగా విరుచుకు పడటం, దానికి అనుగుణంగానే మీడియా మొత్తం మోడీ వ్యతిరేక ప్రచారం చేయటం కూడా వాళ్ళ దృష్టి లో వుంది. అదేసమయం లో కొత్త అధ్యక్షుడు ఎన్నిక విషయం లో కూడా లోతుగా చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్రం లో రెండు ప్రధాన పార్టీలు రెండు అగ్రకులాల ఆధిపత్యం లో ఉండటంతో రాష్ట్రంలోని అతిపెద్ద సామాజిక వర్గం కాపులను ఎటువంటి పరిస్థితుల్లో దూరం చేసుకోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ సామాజిక వర్గం లో కూడా కొత్తగా వచ్చినవాళ్ళతో ప్రయోగం విఫలం కావటం తో మొదట్నుంచీ ప్రాధాన్యత వున్న వాళ్ళకే ఇవ్వాలని అనుకోవటంతో సోము వీర్రాజు కి లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఎంపిక తో కాపు సామాజిక వర్గంలో కదలిక వచ్చింది. దానికి కారణం లేకపోలేదు.

కాపు సామాజిక వర్గం లో నూతనోత్సాహం 

కాపులు రాష్ట్రంలో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ఇంకొకరి మోచేతికింద నీళ్ళు తాగాల్సి వస్తుందని ఆ వర్గపు జనంలో అసంతృప్తి  నెలకొంది.  దాని పర్యవసానమే ప్రజా రాజ్యం అవతరణ. కానీ ఆ ఉత్సాహం మొదట్లోనే ఆవిరై పోయింది. ఒక్క ఎన్నికకే ఆ ప్రయోగం చతికిల పడటం ఆ సామాజిక వర్గం లో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ఆ షాక్ నుంచి కోలుకోవటానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత ముద్రగడ ఉద్యమం లో కాపులు ర్యాలి అయ్యారు. అయితే అది కేవలం ఒక సమస్యపై నే  కేంద్రీకరికరించ బడటం , చంద్రబాబు నాయుడు నిర్దాక్షిణ్యంగా అణచటం తో అది అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది. కానీ కాపు సామాజిక వర్గం లో మాత్రం అసంతృప్తి అలాగే ఉండిపోయింది. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పోటీ చేయటం తో తిరిగి కొంత కదలిక వచ్చింది. అయితే ఇది మొదట్లో కొంత వూపు వచ్చినా ఎన్నిక తేదీ దగ్గర పడే కొద్దీ తేలిపోయింది. మొదట్లో అధికారం లో వున్న చంద్రబాబు నాయుడు, ఆయన పుత్ర రత్నం  లోకేష్ పై ఎక్కుపెట్టిన విమర్శ సడెన్ గా అధికారం లో లేని జగన్ పైకి మల్లటం, అప్పటికే జనసేన తెలుగుదేశం బి టీం అని వై ఎస్ ఆర్ సి పి ప్రచారం చేయటం తో కాపు సామాజిక వర్గం అయోమయానికి లోనయ్యింది. ఆ వర్గపు ఓట్లు చీలి వై ఎస్ ఆర్ సి పి కి లాభం చేకూరటం జరిగింది. మొత్తం మీద ప్రజారాజ్యం తో మొదలయిన కాపు సామాజిక సమీకరణ అనేక ఆటుపోట్లతో పడి లేస్తూ సాగుతూవుంది. ఇంతవరకు విజయవంతం కాకపోయినా సామాజిక సమీకరణ మాత్రం ఎక్కువ తక్కువలతో సాగుతూనే వుంది. ఈ నేపధ్యం లో బిజెపి కి రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నిక కావటంతో ఈ వర్గం లో కొత్త ఉత్సాహం వచ్చింది. దీనికి కారణం లేకపోలేదు. కాపు సామాజిక సమీకరణ మొదలైన దగ్గర్నుంచీ ఇంతవరకు పాజిటివ్ ఫలితం రాకపోయినా ఏ కొంచెం వూతం దొరికినా ర్యాలీ కావటం జరుగుతుంది. ఈ కోణంలో సోము వీర్రాజు ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించటం తో ఈ సామాజిక వర్గం ఉత్సాహంగా వుంది. అయితే ఇంతకుముందు అనుభవాలు చూసినప్పుడు ఈ ఉత్సాహం కూడా నీరుకారకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంది. లేకపోతే ఎప్పటిలాగే నిరాశలోకి జారిపోవాల్సి వస్తుంది. అలాజరగాకుండా ఉండాలంటే ఏమి చేయాలో తరువాయి భాగం లో చర్చించుకుందాం.

(సశేషం)

తగ్గాల్సిన టైమ్‌లో పెంచేసిన పూజా హెగ్డే!


పూజా హెగ్డే. టాలీవుడ్‌లో ఇప్పుడు విపరీతమైన డిమాండ్‌ ఉన్న నటి. తెలుగు ఇండస్ట్రీలో ఆమెనే నంబర్ వన్‌ హీరోయిన్‌ అనొచ్చు. ఆమె పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మధ్య. భారీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటూ అంతకుమించిన భారీ విజయాలు సాధిస్తోందామె. ఈ స్టార్డమ్‌ కోసం ఆమె చాలానే కష్టపడింది. మోడలింగ్‌ తర్వాత నటనలోకి వచ్చిన పూజ.. 2012లో వచ్చిన తమిళ మూవీ ముగమూడి (తెలుగులో మాస్క్‌)తో తెరంగేట్రం చేసింది. ఆ మూవీలో నల్లగా కనిపించిందని.. హీరోయిన్‌ మెటీరియల్‌ కాదని పూజపై విమర్శలు వచ్చాయి. కానీ, వరుణ్‌ తేజ్‌ హీరోగా పరిచయమైన ముకుందలో చాన్స్‌ రావడం ఆమె కెరీర్కు ప్లస్‌ అయింది. ఆ సినిమాతో పూజకు మంచి పేరొచ్చింది. ఆ వెంటనే నాగ చైతన్యతో ఒక లైలా కోసం సినిమా చేసింది. కానీ, అది ఫ్లాప్‌ కావడం… హిందీలో హృతిక్‌ రోషన్‌ సరసన చాన్స్‌ రావడంతో వెంటనే బాలీవుడ్‌కు చెక్కేసింది.

Also Read: పవన్‌ సరనన రకుల్‌.. నిజమేనా క్రిష్!

హృతిక్‌తో కలిసి మొహెంజొదారో మూవీలో నటించింది పూజ. అదే టైమ్‌లో అతనితో ప్రేమలో పడిందని, చాన్నాళ్లు డేటింగ్‌ చేసిందన్న వార్తలు వచ్చాయి. కానీ, ఆ మూవీ బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. హృతిక్‌తో రిలేషన్‌షిప్‌ కూడా బెడిసికొట్టడంతో బాలీవుడ్‌లో ఆఫర్లు కరువయ్యాయి. అలాంటి టైమ్‌లో అల్లు అర్జున సరసన ‘దువ్వడ జగన్నాథం (డీజే)’ ఆఫర్ రావడం ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. డీజేలో మంచి నటనతో పాటు బికినీ అందాలు ప్రదర్శించిన పూజ యువకుల గుండెలు కొల్లగొట్టింది. అక్కడి నుంచి ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. రంగస్థలంలో జిగేల్‌ రాణి పాటకు స్టెప్పులేసి కిక్కిచ్చిన ఆమె… అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేశ్‌తో పాటు రీసెంట్‌గా అలవైకుంఠపురములోతో వరుసగా నాలుగు విజయాలు ఖాతాలో వేసుకుంది. మధ్యలో హిందీలో హౌస్‌ఫుల్‌ 4తో సక్సెస్‌ సాధించింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు చార్టర్డ్‌ ఫ్లయిట్‌లో వచ్చి షూటింగ్స్‌లో పాల్గొనేంత బిజీగా మారిపోయిందామె.

Also Read: ఒక్క డైలాగ్‌ లేకుండా ఆర్జీవీ.. ‘మర్డర్’ ట్రైలర్

ఇంత సక్సెస్‌ ఉండడంతో తెలుగు దర్శక నిర్మాతలకు ఆమె అదృష్ట దేవతగా మారింది. అయితే, ఇప్పుడు ఆ దేవత దర్శన భాగ్యం… అదే డేట్స్‌ కోసం హుండీలో నిర్మాతలు భారీగానే వేయాల్సి వస్తోందట. కరోనా టైమ్‌లో మిగతా నటీనటులు రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటుంటే పూజ మాత్రం తన పారితోషికం మరోసారి పెంచిందని తెలుస్తోంది. బెల్లకొండ శ్రీనివాస్‌ హీరోగా నటించిన ‘సాక్ష్యం’కు ఆమె రూ. కోటిన్నర తీసుకుందట. అంతకుముందు వరకూ కోటితోనే సరిపెట్టిన ఆమె ఒక్కసారిగా యాభై లక్షలు పెంచింది. చిన్న హీరోతో సినిమా కాబట్టి ఆమె ఎక్కువగా చార్జ్‌ చేసిందట. అయితే, అలవైకుంఠపురములో తన డేట్స్‌ ఆధారంగా రూ. 1.40 కోట్లు తీసుకుందట. ఇది మూవీ భారీ సాధించినప్పటికీ ప్రభాస్‌ సరసన ‘రాధేశ్యామ్‌’ కోసం కోటి మాత్రమే అందుకుంటోందామె. ఎందుకంటే అల వైకుంఠపురములో కంటే ముందే దానికి సైన్‌ చేసింది పూజ. అయితే, ఇప్పుడు తన పారితోషికాన్ని పూజ రెండు కోట్లకు పెంచిందని టాలీవుడ్‌ టాక్‌. ‘అల’ హిట్‌తో పాటు బాలీవుడ్‌ నుంచి కూడా ఆఫర్లు వస్తుండడంతో రేటు అమాంతం పెంచిందని తెలుస్తోంది. అక్కినేని అఖిల్‌తో ‘బ్యాచిలర్’ కోసం కాస్త అటు ఇటుగా ఆమె రెండు కోట్ల దాకా తీసుకుందట. అయితే, ఇకపై వచ్చే ప్రాజెక్టులకు ఓకే చెప్పాలంటే మినిమమ్‌ రెండు కోట్ల గ్యారంటీ ఇస్తేనే కథ వింటానని తన మేనేజర్ల ద్వారా స్పష్టం చేసిందని తెలుస్తోంది. పూజ ట్రాక్ రికార్డు, సక్సెస్, తెరపై అమె అందం, అభినయాన్ని వెలకట్టలేం. అయితే, కరోనా టైమ్‌లో పలువురు హీరోలు, హీరోయిన్లు పారితోషికం తగ్గించుకోవాలని చూస్తుంటే తాను మాత్రం పెంచాలని నిర్ణయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెమ్యునరేషన్‌ విషయంలో పట్టుబడితే కొన్ని కీలక అవకాశాలు చేజారి.. కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు. మరి, పూజ పరిస్థితి ఎలా ఉంటుందో..!

ఆర్ఆర్ఆర్ 2021లో అయినా సాధ్యమేనా?


ఓటమి ఎరుగుని స్టార్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి సత్తా ఏంటో తెలుగు ప్రేక్షకులకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పటిదాకా 11 సినిమాలు తీస్తే అన్నీ విజయం సాధించాయి. కొన్ని ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచి రికార్డులు బద్దలు కొట్టాయి. 2015లో వచ్చిన బహుబలి భారత సినీ రంగంలోనే మలుపు. వందల కోట్ల వసూళ్లు సాధించిన ఆ చిత్రం తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటింది. బాహుబలి 2 తర్వాత రాజమౌళి రేంజ్‌ మారిపోయింది. ఈ రెండు చిత్రాలు కలిపి 2 వేల కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించడడంతో ఇండియాలో మరే దర్శకుడు సాధించని ఘనతను రాజమౌళి అందుకున్నాడు. బాహుబలి తర్వాత చాలా విరామం తీసుకున్న ఈ దర్శక దిగ్గజం.. ‘ఆర్ఆర్ ఆర్’ మూవీని ప్రకటించాడు. అప్పటి నుంచి ఇండియా ఫిల్మ్‌ ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీగా మారిందీ ప్రాజెక్ట్‌. పలువురు ఫారిన్‌ యాక్టర్లు కూడా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో యంగ్‌ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్లు అజయ్‌ దేవగణ్‌, ఆలియా భట్‌తో పాటు సముద్రకని, శ్రియా శరణ్‌ కీలక పాత్రలు పోషిస్తునారు. హాలీవుడ్‌ యాక్టర్లు రే స్టీవెన్సన్‌, ఒలీవియా మోరిస్‌, అలీసన్‌ డూడీ కూడా మేజర్ రోల్స్‌ ప్లే చేస్తున్నారు. వర్కింగ్‌ టైటిల్‌నే రౌధ్రం రణం రుధిరం అనే ఫుల్‌ఫామ్‌ ఇచ్చి టైటిల్ ఖరారు చేసిన చిత్ర బృందం.. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయాలన్ని ప్లాన్‌ చేసింది.

Also Read: పవన్‌ సరనన రకుల్‌.. నిజమేనా క్రిష్!

ఇప్పటికే రిలీజైన మోషన్‌ పోస్టర్కు, రామ్‌ చరణ్‌ అల్లూరి పాత్రను రివీల్‌ చేస్తూ వచ్చిన టీజర్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచాయి. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో దాదాపు యాభై శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. జోరుగా షూటింగ్ జరుగుతున్న టైమ్‌లో కరోనా మహమ్మారి ఈ మూవీ ప్లాన్స్‌ను దెబ్బకొట్టింది. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి షూటింగ్‌ ఆగిపోయింది. మూడు నెలల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్‌కు అనుమతించాయి. దాంతో, టెస్టు షూట్‌ చేసి తిరిగి చిత్రీకరణ మొదలు పెట్టాలని చిత్ర బృందం భావించింది. కానీ, హైదరాబాద్‌లో కరోనా ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు రాజమౌళి. కనీసం టెస్టు షూట్‌ కూడా చేయలేకపోయారు. అయితే, పరిస్థితులు మెరుగైతే ఆగస్టు నుంచి అయినా తిరిగి సెట్స్‌పైకి వెళ్లాలని అనుకున్నారు. అది కూడా జరగడం లేదు.

Also Read: డబ్బులు కోసం హీరోయిన్లందరూ.. !

ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో వ్యాక్సిన్‌ వచ్చేదాకా షూటింగ్‌ పేరెత్తకూడదని చిత్రబృందం ఓ అంచనాకు వచ్చిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన కనీసం నవంబర్ వరకూ చిత్రీకరణ వద్దని నిర్ణయించుకున్నారట. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్‌తో తీస్తున్న మూవీ. నిర్మాత డీవీవీ దానయ్య దాదాపు 300 నుంచి 400 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నప్పుడు తొందరపడి పని చేసి.. నటీనటులను కానీ, సాంకేతిక సిబ్బందిని కానీ రిస్క్‌లోకి నెట్టకూడదని దానయ్య, రామమౌళి ఏకాభ్రియానికి వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో, నవంబర్ వరకూ వేచి చూడడమే మంచిదని, ఈ విషయాన్ని యూనిట్‌ మొత్తానికి తెలియజేశారని సమాచారం. దాంతో, ఇప్పటికే 2020 నుంచి 2021కి వాయిదా పడిన ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో కూడా రిలీజయ్యే అవకాశం కనిపించడం లేదు. డిసెంబర్ లోపు వ్యాక్సిన్‌ రాకపోతే ఈ మూవీ 2022కు వాయిదా పడ్డా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే విషయం. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను ఎప్పుడెప్పుడు తెరపై చూడాలా అని ఆశిస్తున్న అభిమానులు మరికొంతకాలం నిరీక్షించక తప్పదు.

బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

Adilabad BJP


2024 ఎన్నికల నాటికి ఏపీలో నిర్ణయాత్మక పార్టీగా ఎదగాలనేది బీజేపీ వ్యూహం. అందుకే వారు నిర్మాణాత్మకంగా పావులు కదుపుతున్నారనిపిస్తుంది. కనుకే చంద్రబాబు ఎంతగా దోస్తీకి ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదు. కారణం బీజేపీతో దోస్తీ వలన బాబుకు ప్రయోజనమే కానీ, వారికి చేకూరుతున్న ప్రయోజనం ఏమీ లేదు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో కూటమి కట్టి బాబు తెలివిగా గెలుపు అందుకున్నారు. ఐతే ఆ ఐదేళ్లలో సంస్థాగతంగా బీజేపీ అభివృద్ధి చెందింది ఏమీ లేదు. దీనితో సొంతగా ఎదగడమే దీనికి మార్గం అనుకుంటున్నారు. ఐతే వచ్చే నాలుగేళ్లలో బీజేపీ అధికారం చేపట్టే స్థాయికి ఎదగడం అనేది అసంభవం. దానికి కారణం బీజేపీకి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు లేరు. ఆ పార్టీ జెండా తెలుగు పల్లెలో ఎక్కడా కనిపించిన దాఖలాలు ఉండవు.

Also Read: కన్నాపై వేటుకు కారణాలు ఏంటీ?

ఐతే ఓ బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకొని ఆంద్రప్రదేశ్ లో స్థిరపడాలి అనేది బీజేపీ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన కాపు వర్గానికి దగ్గరైతే నిర్ణయాత్మక పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుంది అనేది వారి ఆలోచన. ఎన్నికలకు ముందు ఎన్ని విమర్శలు చేసినా, పవన్ పార్టీతో దోస్తీ కట్టడానికి కూడా అదే కారణంగా కనబడుతుంది. దానికి తోడు పవన్ చేరిక వారికి బలం చేకూర్చే విషయమే కానీ, నష్టపరిచేది కాదు. ఎందుకంటే ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీకి 5 శాతం ఓట్లు తెచ్చుకున్న పవన్ కలవడాన్ని ఎందుకు కాదంటారు చెప్పండి.

Also Read: బీజేపీపై బాబు ఆశలు గల్లంతేనా?

ఇక నూతన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు కాపు వర్గానికి చెందినవాడు కావడంతో పాటు, అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఉన్న తూర్పు గోదావరిలో పుట్టిన నాయకుడు. రాష్ట్రంలోనే అత్యధికంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాలు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 15 సీట్లు ఉన్నాయి. అనగా కాపు ఓటు బ్యాంకింగ్ అధికంగా కలిగిన ఈ రెండు జిల్లాలలోనే 34 సీట్లు ఉన్నాయన్న మాట. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ కాపు వర్గాన్ని బీజేపీకి ఓన్ చేసుకొని అక్కడ అత్యధిక సీట్లు సాధించగలిగితే 2024 ఎన్నికలలో బీజేపీ మరియు జనసేనల కూటమి వైసీపీ, టీడీపీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఆ రెండు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న పక్షంలో కొన్ని సీట్లు గెలుచుకున్న బీజేపీ-జనసేన కూటమి కింగ్ మేకర్ కావచ్చు. అలాగే టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఈ కూటమి ఎదిగి వైసీపీకి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి బీజేపీ కాపులకు గాలం వేసిన పక్షంలో 2024 యుద్ధం ఆసక్తికరంగా మారనుంది.

కరోనా అంతానికి సరికొత్త డివైస్.. త్వరలో మార్కెట్లోకి


కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు ఓ ప్రత్యేక డివైస్ తయారైంది. బెంగూళూరు చెందిన డి స్కెలీన్ అనే కంపెనీ కరోనా కానన్(షైకో క్యాన్)ను ఆవిష్కరించింది. ఈ పరికరం ద్వారా కరోనా వైరస్ 99.9శాతం గాలిల్లోనే పూర్తిగా నాశనం అవుతుందట. ఈ పరికరం తయారు చేసేందుకు పారిశ్రామికంగా అనుమతి లభించింది. దీంతో త్వరలోనే ఈ డివైజ్ మార్కెట్లోకి రానుంది. కాగా ఇప్పటికే డివైస్ ను వాడుకునేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (ఎఫ్‌డీఏ), యురోపియ‌న్ యూనియ‌న్ (ఈయూ)లు అనుమ‌తి ఇవ్వడం గమనార్హం.

బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

ఈ డివైస్ ను అన్ని ప్రదేశాల్లో వాడేలా రూపొందించడం దీని ప్రత్యేకత. షైకోక్యాన్ డివైస్ చిన్న డ్ర‌మ్‌ను పోలినట్లు ఉంటుంది. ఈ పరికరాన్ని ఆఫీసులు, పాఠశాలలు, అన్ని విద్యాసంస్థలు, మాల్స్‌, హోట‌ళ్లు, ఎయిర్‌పోర్టులు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లు త‌దిత‌ర ప్రాంతాల్లో ఎక్క‌డైనా ఉపయోగించుకునేలా రూపొందించారు. ఈ డివైస్ ఆ ప్రదేశాన్ని మొత్తం శానిటైజ్ చేస్తుంది. ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క‌రోనా వైర‌స్ ను 99.9 శాతం వ‌ర‌కు ఇది నశింపజేస్తుంది.

ఈ డివైస్ లోని ఎలక్ట్రాన్లు క‌రోనా వైర‌స్‌లోని స్పైక్ ప్రొటీన్‌ను నాశ‌నం చేస్తుంది. ఇది ఆ ప్రాంతమంతటిని శానిటైజర్ చేస్తుంది. దీంతో ఆయా ప్ర‌దేశాల్లో ఎవ‌రు తిరిగినా వారికి క‌రోనా వ్యాపించ‌దని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. క‌రోనా ఉన్న‌వారు ద‌గ్గినా, తుమ్మినా వారి నుంచి వెలువ‌డే వైర‌స్ క‌ణాల‌ను ఈ డివైస్ నాశ‌నం చేస్తుందని చెబుతున్నారు. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న వేళ ఈ పరికరం ఎంతోగానే ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.

Also Read: కేసీఆర్ కూతురును వెంటాడుతున్న దురదృష్టం?

సాధారణ పరిస్థితుల్లో ఇలాంటి పరికరాలు మార్కెట్లోకి రావడానికి 26రకాల టెస్టులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ డివైస్ వల్ల మనిషి ఆరోగ్యానికి హాని ఏమైనా క‌లుగుతుందా? ఇతర పరికరాలకు ఏమైనా? ఇబ్బందులు ఉన్నాయా? అని టెస్టులు చేసి ఆయా సంస్థ‌లు అనుమ‌తులు ఇస్తాయి. కానీ కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ పరికరానికి అత్య‌వ‌స‌ర సేవ‌ల కింద ఎఫ్‌డీఏ, ఈయూలు ఇప్పటికే అనుమ‌తుల ఇచ్చాయి. దీంతో త్వ‌ర‌లోనే ఈ డివైస్ ను పారిశ్రామికంగా ఉత్ప‌త్తిచేసి స‌ర‌ఫ‌రా చేయ‌నున్నారు. అయితే ప‌రిక‌రం ధ‌ర ఎంతనేది మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు.

కొత్త జిల్లాలతో జగన్ కు తలనొప్పులు తప్పవా?


ఏపీలో కొత్త జిల్లాల తేనెతుట్టును సీఎం జగన్మోహన్ రెడ్డి కదిలిపారు. గత ఎన్నికల్లో జగన్ ఎన్నికల మెనిఫెస్టోలో భాగంగా పార్లమెంట్ నియోజవర్గాలను జిల్లాలుగా చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈమేరకు సీఎస్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. అన్ని జిల్లాల రెవిన్యూ అధికారులతో ఇప్పటికే అన్ని మండలాలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదకన జిల్లాలను ఏర్పాటు చేయాలనుకున్నప్పటికి తెరపైకి మరికొన్ని జిల్లాలు వస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో వైసీపీ ఆయా జిల్లాల్లో మరింత బలపడేందుకు అవకాశాలున్నప్పటికీ సీఎం జగన్ కు కొత్త తలనొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొత్త జిల్లాల కోసం ఉద్యమాలు మొదలయ్యాయి. కొందరు తమను పక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కలుపొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొత్త జిల్లాల సెగ జగన్ ను గట్టిగానే తాకే అవకాశం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి.

ఏపీలో ప్రస్తుతం 13జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే 25జిల్లాలుగా మారనున్నాయి. అరకును రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన నేపథ్యంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరనుంది. అయితే తెరపైకి మరికొన్ని జిల్లాల డిమాండ్ విన్పిస్తుంది. కొత్త జిల్లాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘ఆదోని’ తెరపైకి వస్తుంది. కర్నూలు జిల్లాను కర్నూలు, నంద్యాల, ఆదోనిగా విభజించాలని ఈ జిల్లావాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. లోక్‌సభ స్థానాలే ప్రాతిపదిక అయితే కొత్తగా నంద్యాల జిల్లా మాత్రమే ఏర్పడుతుంది. అయితే ఆదోనిని కూడా ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. లేనట్లయితే తమను కర్ణాటకలో కలపాలని తద్వారా తమకు సాగునీటి వివాదాలు పరిష్కారమవుతాయని చెబుతున్నారు. ఈ విషయం జ‌గ‌న్ కు కొత్త సమస్యల తేవడం ఖాయంగా కన్పిస్తుంది.

Also Read: జగన్ పైకి రఘురామ రాజు మరో అస్త్రం..!

అదేవిధంగా గుంటూరు జిల్లాలో పల్నాడుకు ప్రత్యేక చరిత్ర ఉంది. దీనికి ప్రధాన కేంద్రం గురజాల. చారిత్రక నేపథ్యం, రాజకీయ చైతన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని గురజాలను జిల్లాగా ప్రకటించాలని స్థానికులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో మరోసారి గురజాల డిమాండ్ తెరపైకి వచ్చింది. అలాగే చిత్తూరు జిల్లాలో మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది. దేశంలోనే మదనపల్లె దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌. వీటితోపాటు చాలాచోట్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో సంబంధం లేకుండా ప్ర‌త్యేక జిల్లాల ఏర్పాటు చేయాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ జిల్లాల డిమాండ్లు సీఎం జ‌గ‌న్‌కు కొత్త సమస్యలు తెచ్చే అవకాశం ఉన్నాయని వాదనలు విన్పిస్తున్నాయి.